శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము
21 - సూర్యరథముయొక్క గమనము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భూమండలముయొక్క సంర చన ఈ విధముగా నున్నది. ఈ భూమండలముయొక్క పరిమాణమును, - దాని లక్షణములను నేను వివరించి చెప్పితిని.
ఈ భూగోళముయొక్క పరిమాణముతో స్వర్గముయొక్క పరిమా ణము సమానముగా నుండుననియు, ఈ రెండు లోకములు అనుము మొదలగు గింజల రెండు దళములవంటివి అనియు ఆ వివరములు తెలి సిన పెద్దలు చెప్పుచున్నారు. ఈ రెండు లోకములతో కలిసి వాటి . మధ్యలో అంతరిక్షము ఉన్నది.
జ్యోతిర్మండలములలో శ్రేష్ఠుడగు సూర్య భగవానుడు అంతరిక్ష లోకమునకు మధ్యలో నున్నవాడై, ముల్లోకములను గట్టిగా తపింప జేయుట మాత్రమే గాక, తన కాంతిచే చక్కగా ప్రకాశింప జేయుచున్నాడు. అట్టి సూర్యుడు కాలము నతిక్రమించకుండగా మకరము మొదలగు రాశు లలోని పైన, క్రింద మరియు సమానము అగు స్థానములలో ప్రవేశించును. ఆయన మెల్లగా సంచరించే ఉత్తరాయణములో పగలు పెద్దదిగను, రాత్రి చిన్నదిగను ఉండును. ఆయన వేగముగా సంచరించే దక్షిణాయనములో పగలు పొట్టిదిగను, రాత్రి పెద్దదిగను ఉండును. ఆయన సమానవేగముతో సంచరించే విషువత్తునందు రాత్రింబగళ్లు సమానముగా నుండును.
సూర్యుడు మేష తులా రాశులయందున్నప్పుడు రాత్రింబగళ్లు సమానమగు నిడివిని కలిగియుండును. సూర్యుడు వృషభము మొదలు కొని ఉండే అయిదు రాశులలో సంచరించునప్పుడు, నెలకు ఒక్కొక్క ఘడియ (24 నిముషములు) చొప్పున పగలు సమయము పెరిగి, రాత్రి సమయము తగ్గుచుండును.
సూర్యుడు వృశ్చికముతో మొదలిడి అయిదు రాశులయందున్న ప్పుడు రాత్రింబగళ్ల సమయములలో పైన చెప్పిన దానికి విరుద్ధమగు మార్పులు వచ్చును.
దక్షిణాయనము వచ్చువరకు (ఉత్తరాయణమునందు) పగళ్లు, ఉత్తరాయణము వచ్చువరకు (దక్షిణాయనమునందు) రాత్రులు పెరుగు చుండును.
సూర్యుడు మానసోత్తర పర్వతముయొక్క చుట్టూ తిరిగే దూరము తొమ్మిది కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనములనియు, ఆ పర్వత మునందు మేరు పర్వతమునకు తూర్పుగా దేవధాని అని ప్రసిద్ధి గాంచిన ఇంద్రుని నగరము గలదనియు, దక్షిణముగా సంయమని అని ప్రసిద్ధి గాంచిన యముని నగరము గలదనియు, పశ్చిమముగా నిప్లొచని అని ప్రసిద్ధి గాంచిన వరుణుని నగరము గలదనియు, ఉత్తరముగా విభావరి అని ప్రసిద్ధి గాంచిన చంద్రుని నగరము గలదనియు పెద్దలు చెప్పుచున్నారు. మేరు పర్వతమునకు నాలుగు దిక్కులలోనుండే ఆ నగరములలో ఆయా సమయములలో ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి కలు గుతూ, ప్రాణులు తమ పనులను చేసుకొనుటకు, విరమించి విశ్రమించు టకు వెసులుబాటు కలుగుచుండును.
మేరు పర్వతమునందున్న ప్రాణులకు అన్ని కాలములలో మధ్యా హ్నమునందలి సూర్యుడు మాత్రమే తపించుచుండును. సూర్యుడు ఆ పర్వతము తనకు ఎడమ వైపు ఉండునట్లుగా తిరుగుచున్ననూ, కుడివైపు ఉన్నట్లుగా కానవచ్చును.
ఏ నగరములోనైతే సూర్యుడు ఉదయించుచున్నాడో, ఆ నగరము నకు తిన్నగా రేఖకు ఆవలి వైపున ఉన్న నగరములో సూర్యుడు అస్తమిం చుచున్నట్లు కానవచ్చును. ఏ నగరములో సూర్యుడు బాగా ఎండ కాస్తూ చెమట్లు పట్టునట్లు చేయుచున్నాడో, సరిగ్గా దాని రేఖకు ఆవలి వైపున ఉన్న నగరములో జనులు అర్ధరాత్రమునందు నిద్రించుచుందురు. ఒక కాలము నందు సూర్యుడు ఒక నగరములో ఉదయమునుండి సాయంకాలము వరకు చక్కగా కనబడుచుండును. కాని, అదే సూర్యుడు ఆ నగరమునకు తిన్నగా రేఖకు ఆవలి వైపునకు చేరగానే, చీకటి వచ్చి సూర్యుడు కనబడ కుండా పోవును.
సూర్యుడు ఇంద్రుని నగరమునుండి యముని నగరమునకు పయ నించే సందర్భములో పది హేను ఘడియలలో రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్భై అయిదు వేల యోజనముల దూరమును పయనించును.
ఇదే విధముగా, సూర్యుడు యముని నగరమునుండి వరుణుని నగరమునకు, అక్కడనుండి చంద్రుని నగరమునకు పయనించి, మరల అదే విధముగా ఇంద్రుని నగరమును చేరును. ఈ విధముగా చంద్రుడు మొదలగు ఇతరగ్రహములు కూడ నక్షత్రమండలములోని నక్షత్రములతో బాటుగా కలిసి ఉదయించి, కలిసి అస్తమించుచుండును.
ఈ విధముగా సూర్యుని ఈ వేదాత్మకమగు రథము ఈ నాలుగు నగరములలో, సుమారు ఒక గంట సమయములో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనముల దూరము చొప్పున తిరుగుచుండును.
ఆ రథమునకు సంవత్సరమే చక్రమనియు, పన్నెండు నెలలే దాని ఆకులు అనియు, ఆరు ఋతువులే కడకమ్మీలు అనియు, మూడు నాలుగు-నెలల కాలములే నడిమి తూములనియు చెప్పుచున్నారు. దాని ఇరుసుయొక్క ఒక కొన మేరు పర్వత శిఖరము పై నుండగా, రెండవ కొన మానసోత్తర పర్వతముపై నుండును. ఆ ఇరుసునకు అమర్చబడిన సూర్య రథచక్రము నూనె గానుగ చక్రము వలె తిరుగుచుండగా, రథము మానసో త్తర పర్వతముపై చుట్టూ తిరుగుచుండును.
ఆ ఇరుసునకు అమర్చబడి రెండవ ఇరుసు గలదు. నూనె గానుగ ఇరుసువంటి దాని పొడవు దీని పొడవులో నాల్గవ వంతు ఉండును. దాని పై కొన ఈశ్వరునిచే ధ్రువమండలముపై నుంచబడినది.
ఆ రథమయొక్క గూడు ముప్పై ఆరు లక్షల యోజనముల పొడ వు, తొమ్మిది లక్షల యోజనముల వెడల్పు కలిగియుండును. దాని కాడి పొడవు తొమ్మిది లక్షల యోజనములు. దానియందు గాయత్రి మొదలగు ఛందస్సుల పేర్లు గల గుర్రములు పూన్చబడియుండును. అరుణుడు సార థిగా గల ఆ రథమును సూర్యదేవుడు అధిష్టించి పయనించును.
రథమును తోలే పని అరుణునకు ఈశ్వరునిచే అప్పగించబడినది. కావుననే, అరుణుని ప్రకాశము సూర్యుడు ఉదయించుటకు ముందు, అస్త మించిన తరువాత కూడ ఉండును. ( లేదా; సూర్యునకు. ముందు కూర్చుండే అరుణుడు వెనుకకు, అనగా సూర్యుని వైపు చూచుచుండును ).
ఇంతేగాక, ఈశ్వరునిచే స్వస్తివాచనము కోడకు నియోగించబడిన అరవై వేలమంది. వాలఖిల్య మహర్షులు, సూర్యుని ఎదుట చక్కగా స్తోత్రములను పఠించుచుందురు. వారు కేవలము బొటనవ్రేలి కణుపు పరిమాణ ములో నుందురు.
అదే విధముగా, ఇతర మహర్షులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు అనువారలు తమ తమ భార్య లతో గూడి, ప్రతి నెలయందు వేర్వేరు పేర్లతో, వేర్వేరు కర్మలతో, అనేక నామములు గల ఆత్మస్వరూపుడైన సూర్యదేవుని ఉపాసించుచుందురు. వారు ఒక్కొక్కరుగా పదునాల్గు గణములుగా ఉన్నారు. కాని, ఇద్దరు చొప్పున లెక్కిస్తే, ఏడు గణములు అగుదురు.
సూర్యుడు భూమండలముయొక్క తొమ్మిది కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనముల వృత్తము చుట్టూ, క్షణమునకు రెండు వేల రెండు యోజనముల వేగముతో, తిరుగుచుండును.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో సూర్యరథముయొక్క గమనమును వర్ణించే ఇరువదిఒకటవ అధ్యాయము ముగిసినది.
