శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము

Table of Contents

5 - ఋషభదేవుడు రాజ్యమును విడిచి సన్న్యసించుట

ఋషభదేవుడు ఇట్లు పలికెను --- ఓ పుత్రులారా! ఈ మానవలో కములో ఇంద్రియభోగములు మానవుని పశువులతో సమానముగా చేసి, కష్టముల పాలు చేయును. కావున, దేహధారుల మధ్యలో మానవదే హమును దాల్చిన జీవుడు అట్టి కామనలకు వశుడు కారాదు. ఈ మానవదే హము వాటికి తగదు. ఇది దివ్యమగు తపస్సునకు తగియున్నది. తపస్సు వలన అంతఃకరణము శుద్ధమై, ఆత్మజ్ఞానము ద్వారా, అనంతమగు బ్రహ్మా నందము లభించును.

మహాత్ముల సేవ మోక్షమునకు, చెడు యువతులతో సంగము గలవారితోడి సావాసము సంసారమునకు, ద్వారమనీ పెద్దలు చెప్పెదరు. ఎవరైతే సుఖదుఃఖముల యెడల సమానమగు. చిత్తము కలిగి, శాంతమగు స్వభావము గలవారై, కోపము నెరుంగక, స్నేహశీలురై పరోపకార స్వభావ మును కలిగియుందురో, వారే మహాత్ములు.

ఎవరైతే ఈశ్వరుడనగు. నాయందలి ప్రేమనే పురుషార్థముగా స్వీకరించియున్నారో, వారు మహాత్ములు. ఇంతేగాక, ఎవరైతే దేహము నకు చెందిన భోగములను గురించి మాత్రమే చర్చించే జనులయందు ప్రీతిని చేయరో, భార్య సంతానము ధనము ఇల్లు అనేవి ఉన్నా వాటి యందు ఆసక్తిని చేయరో, శరీరయాత్ర కొరకు లోకముతో ఎంతవరకు ప్రయోజనమో అంత మాత్రమే వ్యవహరించేదో, వారు మహాత్ములు.

మానవుడు ఏ కాలమునందైతే ఇంద్రియముల ప్రీతి కొరకు ప్రవర్తి ల్లునో, ఆ సమయములో కార్యాకార్యవివేకమును కోల్పోయి నిశ్చయ ముగా తప్ప పనిని చేయును. ఇది సరికాదని నా అభిప్రాయము. ఏలయ నగా, మిథ్యయే అయిననూ వ్యక్తికి క్లేశమును కలిగించే ఈ దేహము కర్మల వలననే సంప్రాప్తమైనది.

మానవుడు తన యథార్థస్వరూపము (ఆత్మ) ను తెలియగోరనం తవరకు (ఆత్మవిచారము చేయనంతవరకు), అజ్ఞానముచే ఆతని స్వరూ పము తిరస్కరించబడి (కప్పివేయబడి) యుండును. అజ్ఞానము ఉన్నంత వరకు మానవునకు క్రీయాసంబంధము తప్పదు. క్రియలు ఉన్నంతవరకు మనస్సులో కర్మవాసనలు నిలిచియే యుండును. దానిచే, వ్యక్తి మరల దేహమును పొంది, దానిచే బంధించబడి యుండును.

ఈ విధముగా ఆత్మస్వరూపము అజ్ఞానముచే కప్పివేయబడి యున్నంతవరకు, కర్మవాసనలకు వశమైపోయిన మనస్సు (కర్మలకు బాని సయైన) మానవునిచే కర్మలను చేయించుచునే యుండును. ఎంతవరకైతే, వాసుదేవుడ - (సర్వజగన్నివాసుడు, శుద్ధచైతన్యస్వరూపుడు) నగు నాయందు భక్తి కలుగదో, అంతవరకు వ్యక్తికి దేహముతోడి సంబంధము (జన్మ) నుండి విముక్తి లేదు.

మానవుడు వివేకియై సత్త్వరజస్తమోగుణముల కార్యములైన ఇంద్రియముల చేష్టలను మిథ్యాభూతములుగా గుర్తించవలెను. అట్టి యథార్థదర్శనము లేనంతవరకు, వ్యక్తి శీఘ్రముగా తన స్వరూపము యొక్క స్మరణమును గోల్పోయి, పరమపురుషార్థము విషయములో అసా వధానుడుగా నుండును. ఇట్టి అజ్ఞాని శరీరసుఖములే ప్రధానమైన గృహ (గృహాశ్రమ) మును పొంది, దానిలో తాపములననుభవించును.

స్త్రీపురుషులు ఒకరితో మరియొకరు జత గట్టెదరు. ఇదియే వారికి హృదయములయందు ముడి (కంతి) గా తయారగునని మహాత్ములు చేప్పెదరు. దాని వలననే, వారు దేహమునందు ఆత్మాభిమానము (ఇది నేను అనే ధారణ) కలిగియుందురు, ఈ వ్యామోహముచే వారు ఇల్లు, పొలము, సంతానము, బంధువులు, ధనములయందు మమకారము (ఇది నాది అనే ఆగ్రహము) ను కలిగియుందురు.

మానవుని హృదయములో వాసనల రూపములోనుండే గట్టి ముడి కర్మలవెంట బిగుసుకొనును. ఇది శిథిలమైననాడు మానవుడు దేహా దులయందలి వ్యామోహమునుండి బయటపడును. అట్టివాడు సంసారహేతువగు అజ్ఞానమును పోగొట్టుకొని, జీవన్ముక్తుడై పరబ్రహ్మను ఆత్మరూప ముగా పొందును.

ఓ పుత్రులారా! నిపుణుడగు సాధకుడు ధైర్యముతో మరియు వివే కముతో సాధన చేయవలెను. జ్ఞానియగు గురువునందు, నాయందు భక్తిని, తత్పరతను కలిగియుండవలెను. భోగములయందలి తృష్ణను విడనాడి, సుఖదుఃఖాదిద్వంద్వములను సహించవలెను. జీవునకు ఇహపరములు రెండింటిలో మిగిలేది దుఃఖమేనని గుర్తించవలెను. ఆత్మస్వరూపమునర యవలెననే కోరికను కలిగి ఆత్మవిచారమును చేయవలెను. కోరికలను విడిచి తపస్సును చేయవలెను. కర్మలను పరమేశ్వరార్పణబుద్ధితో ఆచరిం చవలెను. నిత్యము నన్ను ఆరాధించే మహాత్ములతోడి సంగమును చేస్తూ, నా గాథలను విని, నా గుణములను కీర్తించవలెను. ఎవ్వరియందైననూ వైరభావము లేకుండా, అందరియందు సమచిత్తము గలవాడై, శాంతముగా నుండవలెను. దేహమునందలి నేను అనే బుద్ధిని, ఇంటియందలి నాది అనే ధారణను అధిగమించవలెననే ఆకాంక్షను కలిగియుండవలెను. మోక్షశాస్త్ర మును అధ్యయనము చేస్తూ, ఏకాంతములోనున్నవాడై ఆత్మనిష్ఠను అభ్య సించవలెను. చక్కగా ప్రాణాయామముచే ప్రాణమును, ప్రత్యాహారముచే ఇంద్రియములను, ధారణాధ్యానములచే మనస్సును వశము చేసుకొనవలెను. శాస్త్రమునందు, మహాత్ముల బోధలయందు శ్రద్దను కలిగి, వాక్కును నియంత్రిస్తూ, తన లక్ష్యము విషయములో సావధానుడై యుండవలెను. వివేకముచే అంతటా నన్నే దర్శించవలెను. ఆత్మస్వరూపమును తెలుసు కొని, ఆ జ్ఞానము అనుభవపర్యంతము విరాజిల్లునట్లు అభ్యసించవలెను. సాధకుడీ తీరున అహంకారమనే సూక్ష్మశరీరమును అధిగమించవలెను.

కర్మవాసనలకు ఆశ్రయమైన హృదయగ్రంథి అనే బంధము మాన వునకు అజ్ఞానముచే సంప్రాప్తమైనది. సాధకుడు సావధానుడై పైన ఉపదే శించిన విధముగా అభ్యాసముచే ఆ గ్రంథిని పూర్తిగా తొలగించుకొని, ఆ తరువాత అభ్యాసమును కూడ విడిచి పెట్టవలెను.

నా అనుగ్రహమును పొంది, నా లోకము (మోక్షము) ను పొందు టయే ప్రధానలక్ష్యముగా గల రాజు గాని, తండ్రి గాని, గురువు గాని, కోపము లేకుండా క్రమముగా తన ప్రజలకు, పుత్రులకు మరియు శిష్యులకు ఈ యోగమునందు శిక్షణనీయవలేను. అంతేగాని, ఆ ఆత్మతత్త్వము నెరుంగక కర్మలయందు గ్రుడ్డిగా మునిగియున్నవారిని మరల అవే కామ్యకర్మలయందు ప్రేరేపించరాదు. అట్లు ప్రేరేపించిన వ్యక్తి అజ్ఞాన ముచే గ్రుడ్డివారగు ఆ జనులను సంసారమనే గోతిలోనికి పడద్రోసి ఏమి ప్రయోజనమును పొందును?

వ్యక్తికి తనంత తానుగా పరమపురుషార్థము విషయములో అవగా హన లేదు. కావుననే, వ్యక్తి వ్యామోహితుడై, అతిశయించిన కామనలు గలవాడై భోగ్యములగు విషయములను కోరుతూ, అల్పమగు సుఖము కొరకై ఇతరులతో విరోధము పెట్టుకొనును. అట్టి వ్యక్తి తనకు వచ్చిపడే అంతము లేని దుఃఖమును గురించి తెలుసుకొనుట లేదు.

గ్రుడ్డివాడు గోతిలో పడే మార్గములో వెళ్లుచుండగా, ఆ విషయము తెలిసిన దయామయుడు చూచినచో, అటులనే వెళ్లుమని ప్రేరేపించునా? అదే విధముగా, అజ్ఞానము (సంసారము) లో పూర్తిగా చిక్కుకొని తప్పుగా ఆలోచిస్తూ తప్పు మార్గము (కామ్యకర్మల మార్గము) లో ముందుకు సాగుచున్న వ్యక్తిని చూచి కూడ, తాను స్వయముగా పరమపు రుషార్ధమును గురించి తెలుసుకున్న వివేకియగు ధయాళువు, వానిని అదే దారిలో ముందుకు సాగుమని ప్రోత్సహించునా? ప్రోత్సహించడు.

ఎవడైతే మృత్యురూపమగు సంసారములో చిక్కుకొనియున్న వానికి జ్ఞానమునుపదేశించి మోక్షమార్గమును సుగమము చేయడో, అట్టి గురువు గురువు కాదు; బంధువు బంధువు కాదు; తండ్రి తండ్రి కాడు; తల్లి తల్లి కాదు; దైవము దైవము కాదు; భర్త (ప్రభువు) భర్త (ప్రభువు) కాడు.

ఈ నా శరీరముయొక్క రహస్యము ఊహకు అందనిది (దివ్య ము). ధర్మముతో నిండియున్న నా హృదయము శుద్ధసత్వగుణమే. నేను అధర్మమును దూరముగా నెట్టివేసినాను. కావుననే, మహాత్ములు నన్ను ఋషభుడు (శ్రేష్ఠుడు) అని నిర్దేశించుచున్నారు.

మీరందరు నా హృదయమునుండి పుట్టినారు. కావున, మీరు మత్సరము మొదలగు దోషములు లేని బుద్ధితో మీ సోదరుడగు ఈ భర తుని సేవించుడు. ఈతడు చాల గొప్పవాడు. ఈతనిని సేవించినచో, నన్ను సేవించినట్లే; ప్రజలను పాలించినట్లే యగును.

ప్రాణులలో చెట్టుచేమలకంటే కదిలే ప్రాణులు చాల గొప్పవి. వాటిలో కొంత తెలివి గల పశువులు మిగిలిన వాటికంటే చాల గొప్పవి. వాటికంటే మానవులు చాల గొప్ప వారు. మానవులకంటే ప్రమథగణములు, వారికంటే దేవతలకు అనుచరులగు గంధర్వులు మరియు సిద్దులు చాల గొప్పవారు.

అసురులకంటే దేవతలు, వారికంటే వారి నాయకుడగు ఇంద్రుడు, ఇంద్రుని కంటే దక్షుడు మొదలగు బ్రహ్మపుత్రులు, వారికంటే వారిలోనివాడగు రుద్రుడు గొప్పవారు. శివుని శక్తి (కారణము) బ్రహ్మ కాగా, ఆ బ్రహ్మ నన్ను పూజించును. నేను బ్రహ్మవేత్తలనే భూసురులను పూజించెదను.

ఓ వేదవేత్తలారా! బ్రహ్మవేత్తలతో సమానమైనది, లేక గొప్పది అగు మరియొక ప్రాణి ఏదీ లేదని నా అభిప్రాయము. మానవులచే బ్రహ్మ వేత్తలయందు శ్రద్దగా సమర్పించబడిన అన్నాదికమును నేను ఎంత ఆనం దముగా స్వీకరించెదనో, అంత ఆనందముగా అగ్నిహోత్రాది కర్మలయందు హోమము చేయబడిన ద్రవ్యమును నేను స్వీకరించుట లేదు.

ఈ లోకములో బ్రహ్మవేత్త నాయొక్క సనాతనము మరియు కమ నీయము అగు వేదము (జ్ఞానము) అనే శరీరమును ధరించియున్నాడు. ఆయనయందు మిక్కిలి పావనమగు సత్త్వగుణము, మనోనిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, సత్యము, ఇతరులయందు అనుగ్రహము, తప స్సు, సహనము మరియు ఆత్మసాక్షాత్కారము అనే లక్షణములుండును.

అనంతశక్తిసంపన్నుడనగు నేను సర్వకారణమగు ప్రకృతికంటే కూడ అతీతుడను. ప్రాణులకు స్వర్గమోక్షములనే ఫలములనిచ్చే ఈశ్వరు డను నేనే. నాయందు నిండా భక్తి తప్ప మరేమీ లేని ఈ బ్రహ్మవేత్తలు అట్టి నానుండి కూడ దేనినీ అపేక్షించరు. వారికి ఇతరమగు రాజ్యాధికా రము మొదలగువాటితో పని యేమున్నది?

ఓ పుత్రులారా! కదిలేవి మరియు కదలనివి అగు ప్రాణులు అన్నిం టియందు నేనే ఉన్నాను. కావున, మీరు బ్రహ్మసర్గవివేకముతో కూడిన దర్శనము గలవారై, ప్రతిక్షణము సకలప్రాణులను నా అధిష్టానముగనే దర్శించుడు. అదియే మీరు నాకు చేసే పూజ.

మనస్సు, వాక్కు, చూపులు మరియు ఇతరములగు ఇంద్రియ ముల వ్యాపారమునకు సాక్షాత్తుగా ఫలము నన్ను ఆరాధించుటయే. అది లేకున్నచో, మానవుడు సర్వమును కబళించి వేసే కాలముయొక్క పాశమై యున్న పెద్ద వ్యామోహము (అజ్ఞానము) నుండి తప్పించుకొనజాలడు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఋషభుని పుత్రులు స్వయ ముగా ధర్మముయొక్క శిక్షణ గలవారే. అయిననూ, సమాజమునకు శిక్షణ నిచ్చుటకై ఋషభదేవుడు వారికీ విధముగా ధర్మమునుపదేశించేను. గొప్ప హీతచింతకుడు, మహామహిముడు అగు ఋషభుడు, సర్వకర్మ లను పరిత్యజించి ఆత్మారాములైయున్న శాంతస్వభావులగు మహాత్ము లకు భక్తి, జ్ఞానము, వైరాగ్యములే లక్షణములుగా గల పరమహంసల (ఆ త్మజ్ఞానుల) ధర్మమునందు శిక్షణనిచ్చుటకై స్వయముగా సన్న్యసించేను. ఆయన వందమంది కొడుకులలో పెద్దవాడగు భరతుడు గొప్ప భగవద్బ కుడే గాక, భగవద్భక్తులయందు పెద్ద ప్రీతి గలవాడు. ఆతనినీ ఆయన సామ్రాజ్యమును పాలించుటకై పట్టాభిషిక్తుని చేసెను. అపుడాయన భావ నతో ఆహవనీయాగ్నిని తనయందు స్థాపించుకొని, సర్వమును రాజప్రాసా దమునందే విడిచిపెట్టి, కేవలము శరీరముతో మాత్రమే నగ్నముగా బ్రహ్మా వర్తమునుండి నిర్గమించెను. జుట్టు విరబోసుకొనియున్న ఆయన పిచ్చివాని వలే కానవచ్చేను.

ఆయన జనుల మధ్యలో జడుడు వలె, గ్రుడ్డివాడు వలె, మూగవా డువలే, చెవిటివాడు వలె, పిశాచము వలె, పిచ్చివాడు వలె, మట్టి కొట్టుకు పోయిన వేషముతో (అవధూతయై) ఉండేను. ఆయన మౌనవ్రతమును పట్టి, ఇతరులు పలకరించిననూ మిన్నకుండెడివాడు.

ఆయన భూమండలమునందు నగరములు, గ్రామములు, గను లు, వ్యవసాయదారుల పల్లెలు, ఉద్యానవనములు, కొండపల్లెలు, సేనల శిబిరములు, పశు కాపరుల పల్లెలు, గొల్లపల్లెలు, యాత్రీకుల గుడారము లు, కొండలు, అడవులు, ఆశ్రమములు మొదలగు చోట్ల ఏకాకియై తిరుగా డెను. అక్కడక్కడ మార్గములో కొందరు మానవాధములు ఆయనను బెదిరించి, కొట్టి, మూత్రించి, ఉమ్మి, రాళ్లను పేడను దుమ్మును మీద వేసి, చెడుగాలిని మీదకు పంపి, తిట్టి పలువిధములుగా పీడించెడివారు. అడవి లోని ఏనుగు దోమలను వలె, ఆయన వీటిని లెక్కబెట్టెడివాడు కాడు. ప్రకృ తిపురుషుల వివేకముయొక్క అనుభవముతో గూడియున్న ఆయన ఆత్మ స్వరూపముయొక్క మహిమయందే నిష్ఠను కలిగియుండెడివాడు. కావున నే, పంచభూతముల సమ్మేళనమై లౌకికులచే సత్యమని స్వీకరించబడే మీథ్యాభూతమగు ఈ దేహాకృతియందు ఆయన నేను-నాది అనే అభిమా నమును ఆరోపించెడివాడు కాదు. కావుననే, వారి చేష్టలచే ఆయన మన స్సునకు క్షోభ కలిగెడిది కాదు.

ఋషభదేవుని చేతులు, కాళ్లు, వక్షఃస్థలము, పొడవాటి బాహువులు, విశాలమైన భుజస్కంధములు, కంఠము, ముఖము మొదలగు అవయవములు చాల సుకుమారముగా చక్కని రచన కలిగియుండె ను. సహజముగా అందమైన ఆయన ముఖము సహజసిద్ధమైన చిరున వ్వుతో శోభిల్లెను. ఆయనయొక్క ఎర్రని నిడివి కన్నులు కొత్తగా వికసించిన పద్మపు రేకలను అనుకరిస్తూ అందముగా నుండెను. ఆయన కనుగ్రుడ్లు తమ చూపులతో తాపమును పోగొట్టుచుండెను. ఆయన చెక్కిళ్లు, చెవులు, కంఠము, ముక్కు సరిసమానముగా అందముగా నుండెను. సుస్పష్టము కాని చిరునవ్వుతో కూడిన ఆయన ముఖము చూపరులకు గొప్ప ఉత్సవ మును చేయజాలియుండెను. ఆ ముఖముయొక్క విలాసలు పౌరస్త్రీల మనస్సునందు పుష్పబాణుని ఉద్దీపింప జేయుచుండెను. ముఖము పైకి వ్రేలాడుచున్న దట్టని బరువైన గిరజాల జుట్టు జడలు కట్టి బూడిదరంగును కలిగియుండెను. శ్రద్ధను చూపకపోవుటచే మలినమైన శరీరముతో ఆయన దెయ్యము పట్టినవాడు వలె కన్పట్టెను.

తన ఆత్మజ్ఞాననిష్ఠకు జనము ఆటంకము వలె నున్నదనియు, వారినుండి తప్పించుకొనుటకు చేసే ప్రయత్నము బీభత్సమునకు దారి తీయుననియు ఋషభదేవుడు భావించెను. కావుననే, ఆయన వెంటనే ఆజగరవృత్తి (కొండచిలువ వలె ఒకే చోట ఉంటూ జీవించుట) ని స్వీకరిం చి, పరుండీయే పళ్లను తినుట, నీటిని త్రాగుట, భోజనము చేయుట, విసర్జ నాదికమును మొదలు పెట్టెను. ఆయన దొర్లినప్పుడు శరీరభాగముల న్నియు మలినములగుచుండెను.

 యోగీశ్వరుడగు ఆయన దేహముయొక్క మాలిన్యము దివ్యపరి మళమును కలిగియుండెను. ఆయన దేహముపైనుండీ వీచిన వాయువు ఆ పరిమళముతో నిండి, పది యోజనముల వరకు ఆ ప్రదేశమంతా సుగం ధముతో నిండిపోయెను.

ఈ విధముగా ఆ ఋషభదేవుడు ఆవు, కాకి, లేడి అను ప్రాణుల వ్రతమును కూడ ఆచరించుచూ, వాటివలెనే  ఒకప్పుడు నడుస్తూ, మరియొకప్పుడు నిలబడి, ఇంకోసారి పరుండి, ఒకప్పుడు పళ్లను తింటూ, భోజనమును చేస్తూ, విసర్జిస్తూ గడిపెను.

ఓ పరీక్షిన్మహారాజా! మోక్షప్రదాతయగు ఋషభదేవుడు ఈ విధ ముగా (జనులకు ఆదర్శము కొరకై పలువిధముల యోగాభ్యాసములను చేయుచుండెను. ఆయన నిరంతరముగా సర్వోత్కృష్టమగు బ్రహ్మానంద మునందు ప్రతిష్టితుడై యుండెను. ఆయన సకలప్రాణులను తన స్వరూపమునందు, వాసుదేవ భగవానుని ఆత్మరూపముగా దర్శించేను. ఆయన దర్శనములో తనకు, వాసుదేవునకు తేడా లేశమైననూ లేకుండెను. అట్టి జ్ఞానముచే పురుషార్థములన్నియు సిద్ధించి, ఆయన పరిపూర్ణుడయ్యెను. ఆయనకు అనుకోకుండా (ఈశ్వరేచ్చచే) ఆకాశములో ఎగురుట, మనోవేగ ముతో వెళ్లుట, అంతర్ధానమగుట, పరకాయ ప్రవేశము, దూరమునందలి శబ్దములను వినగల్గుట మరియు రూపములను చూడగల్గుట మొదలగు యోగసిద్ధులు ప్రత్యక్షముగా సంప్రాప్తమయ్యెను. కాని, ఆయన హృదయ ములో వాటిపై ఆదరము లేకుండెను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో ఋషభదేవుడు రాజ్యాధికారమును విడిచి పెట్టీ పరివ్రాజకుడగుట అనే ఐదవ అధ్యాయము ముగిసినది (5).