భాగవత మహా పురాణము
19 - ఏకోనవింశోఽధ్యాయః
సూత ఉవాచ ।
మహీపతిస్త్వథ తత్కర్మ గర్హ్యం
విచింతయన్నాత్మకృతం సుదుర్మనాః ।
అహో మయా నీచమనార్యవత్కృతం
నిరాగసి బ్రహ్మణి గూఢతేజసి ॥
తరువాత పరీక్షిన్మహారాజు తాను చేసిన నిందనీయమైన పనిని గురించి ఆలోచించుచుండెను. ఆయన మనస్సు ఆ పనిచే చాల వికలమా యెను. అయ్యో! నిరపరాధి, నిగూఢమగు బ్రహ్మతేజస్సు గలవాడు అగు మహర్షి విషయములో నేను దుష్టుని వలె నీచమగు పనిని చేసితిని.
ధ్రువం తతో మే కృతదేవ హేలనాత్
దురత్యయం వ్యసనం నాతిదీర్ఘాత్ ।
తదస్తు కామం త్వఘనిష్కృతాయ మే
యథా న కుర్యాం పునరేవమద్ధా ॥
నేను దేవుని వంటి మహర్షిని అవమానించితిని. దాని వలన నాకు నిశ్చయముగా శీఘకాలములోననే దాట శక్యము కాని ఆపద కలుగును. నా పుత్రాదులకు కాక సాక్షాత్తుగా నాకు అట్టి ఆపద యథేచ్ఛగా వచ్చుగాక! దాని వలన నాకు పాపనిష్కృతి కలిగి, మరల నేను అట్టి పాపమును చేయ కుందును.
అద్యైవ రాజ్యం బలమృద్ధకోశం ప్రకోపితబ్రహ్మకులానలో మే ।
దహత్వభద్రస్య పునర్న మేఽభూత్పాపీయసీ ధీర్ద్విజదేవగోభ్యః॥
బ్రహ్మర్షుల క్రోధము అనే అగ్నిలో దుష్టుడనగు నా రాజ్యము, సేన మరియు సమృద్ధమగు కోశము దహింపబడు గాక! నాకు మరల బ్రాహ్మణులు దేవతలు మరియు గోవుల యెడల పాపబుద్ధి కలుగకుండు గాక!
స చింతయన్నిత్థమథాశృణోద్యథా
మునేస్సుతోక్తో నిరృతిస్తక్షకాఖ్యః ।
స సాధు మేనే న చిరేణ తక్షకా-
నలం ప్రసక్తస్య విరక్తికారణమ్ ॥
ఆయన ఈ విధముగా చింతిల్లుచుండగనే, తనకు మునికుమారుని శాపము వలన తక్షకుడనే సర్పముయొక్క విషముచే ఏడవ రోజున మృత్యువు రానున్నదని ముని పంపిన శిష్యుని వలన వినెను. సంసార ములో మునిగియున్న తనకు వైరాగ్యము కలుగుటకు హేతువు అగు తక్ష కుని విషాగ్ని శీఘ్రముగా సంప్రాప్తమగుట మంచిదియేనని ఆయన తలపో సెను.
అథో విహాయేమమముం చ లోకం
విమర్శితో హేయతయా పురస్తాత్ ।
కృష్ణాంఘ్రి సేవామధిమన్యమాన
ఉపావిశత్ప్రాయమమర్త్యనద్యామ్ ॥
ఆయన రాజ్యమును చేయుచుండగనే వేదాంతవిచారమును చేసి ఇహలోకపరలోకములు రెండు విడువదగినవియేనని నిర్ధారించుకొని యుండుటచే, వాటిని గురించి పట్టించుకొనకుండగా, శ్రీకృష్ణుని పాదముల సేవయే పరమపురుషార్థమని తలచినవాడై, గంగానదీతీరమునందు ప్రాయోపవేశమును మొదలిడెను.
యా వైలసచ్ఛ్రీతులసీవిమిశ్రకృష్ణాంఘ్రిణ్వభ్యధికాంబునేత్రీ ।
పునాతి లోకానుభయత్ర సేషాంకస్తాం న సేవేత మరిష్యమాణ:॥
గంగానది ప్రకాశించే శ్రీతులసి గంధముతో మిశ్రితమైన శ్రీకృష్ణపా దరేణువులను తనలో కలుపుకొని, తద్ద్వారా సర్వోత్కృష్టమైన నీటిని గొనివ చ్చి, లోకపాలకులతో సహా లోకములను లోపల (అంతఃకరణమును) మరియు బయట (శరీరమును) కూడ పవిత్రము చేయుచున్నది. అట్టి గంగను మరణించ బోయే ఏ వ్యక్తి సేవించకుండును?
ఇతి వ్యవచ్ఛిద్య స పాండవేయః
ప్రాయోపవేశం ప్రతి విష్ణుపద్యామ్ ।
దద్యౌ ముకుందాంఘిమనన్యభావో
మునివ్రతో ముక్తసమస్తసంగః ॥
పాండువంశసంజాతుడగు ఆ పరీక్షిన్మహారాజు ఈ విధముగా విష్ణుపాదోద్బవయగు గంగానదియొక్క తీరమునందు ప్రాయోపవేశమును చేయవలెనని నిశ్చయించుకొని, సాంసారికములగు ఆసక్తులనన్నింటినీ విడిచి పెట్టి, మునుల వ్రతమును చేబట్టి, మరియొక ఆలోచన లేని మన స్సుతో పరమేశ్వరుని పాదములను ధ్యానించెను.
తత్రోపజగ్ముర్బువనం పునానా
మహానుభావా మునయస్సశిష్యాః ।
ప్రాయేణ తీర్థాభిమాపదేశైః
స్వయం హి తీర్థాని పునంతి సంతః ॥
భూమిని పవిత్రము చేసే మహానుభావులగు మహర్షులు తమ శిష్యులతో గూడి అచటకు విచ్చేసిరి. సాధారణముగా సత్పురుషులు తీర్థ యాత్ర అనే వ్యాజముతో తామే తీర్థములకు పవిత్రతను కలిగించు చుందురు గదా!
అత్రిర్వసిష్ఠశ్చ్యవనశ్శరద్వానరిష్టనేమిర్భృగురంగిరాశ్చ ।
పరాశరో గాధిసుతో ఽథ రామ ఉతథ్య ఇంద్రప్రమదేధ్మవాహౌ ॥
మేధాతిథిర్డీవల ఆర్ష్టిషేణో
భారద్వాజో గౌతమః పిప్పలాదః ।
మైత్రేయ ఔర్వః కవషః కుంభయోనిః
ద్వైపాయనో భగవాన్నారదశ్చ॥
అత్రి, వసిష్ఠుడు, చ్యవనుడు, శరద్వంతుడు, అరిష్టనేమి, భృగు డు, అంగిరసుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు, ఉతథ్యు డు, ఇంద్రప్రమదుడు, ఇద్మవాహుడు, మేధాతిథి, దేవలుడు, ఆర్షి షేణు డు, భారద్వాజుడు, గౌతముడు, పిప్పలాదుడు, మైత్రేయుడు, ఔర్వుడు, కవషుడు, అగస్త్యుడు. వ్యాసుడు మరియు నారదభగవానుడు విచ్చేసిరి.
అన్యే చ దేవర్షి బ్రహ్మర్షివర్యా రాజర్షివర్యా అరుణాదయశ్చ ।
నానా ర్షేయప్రవరాన్సమేతానభ్యర్చ్య రాజా శిరసా వవందే॥
ఇంతేగాక, ఇంకనూ కొందరు దేవర్షి బ్రహ్మర్షి రాజర్షివర్యులు మరియు అరుణుడు మొదలగు కాండర్హులు కూడ విచ్చేసిరి. రాజు ఋషి గోత్రములలో ప్రముఖులగు ఆ ఋషుల నందరిని పూజించి తలను వంచి నమస్కరించెను.
సుఖోపవిష్టేష్వథ తేషు భూయః
కృతప్రణామస్స్వచికీర్షితం యత్ ।
విజ్ఞాపయామాస వివిక్తచేతా
ఉపస్థితో ఽగ్రే ఽభిగృహీతపాణిః ॥
తరువాత వారందరు సుఖముగా కూర్చుని యుండగా, శుద్ధమగు అంతఃకరణము గల పరీక్షిన్మహారాజు మరల వారికి నమస్కరించి, వారి యెదురుగా చేతులను జోడించి నిలబడి, తాను చేయదలచుకున్న ప్రాయో పవేశమును గురించి విన్నవించెను.
రాజోవాచ ।
అహో వయం ధన్యతమా నృపాణాం
మహత్తమానుగ్రహణీయశీలాః ।
రాజ్ఞాం కులం బ్రాహ్మణపాదశౌచాత్
దూరాద్విసృష్టం బత గర్హ్యకర్మ ॥
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికేను: ఆశ్చర్యము! మహాత్ములగు మీరు అనుగ్రహించుటకు అర మైన శీలము గలవానినిగా నన్ను భావించి, రాజులలో నేను ధన్యతముడగునట్లు చేసిరి. అయ్యో! నిందనీయమగు కర్మను చేయు రాజుల వంశములు బ్రహ్మర్షుల పాదములను కడిగిన జల మునకు దూరమగును. అనగా, అట్టి భాగ్యము వారికి లభించదు. అట్టి వారి జోలికి బ్రహ్మర్షులు పోరు.
తస్యైవ మే ఽఘస్య పరావరేశో
వ్యాసక్తచిత్తస్య గృహేష్వభీక్ ష్నమ్ ।
నిర్వేదమూలో ద్విజశాపరూపో
యత్ర ప్రసక్తో భయమాశు ధత్తే ॥
అట్టి నిందార్తమగు కర్మను నేను చేసితిని. నిరంతరముగా సంసా రాసక్తి గల నేను పాపిని. కారణకార్యరూపమగు ఈ జగత్తునకు ప్రభువగు పరమేశ్వరుడు బ్రాహ్మణశాపరూపములో నాకు యెదురై వైరాగ్యమును కలిగించినాడు. అట్టి శాపము నెత్తి పై నుండగా మానవుడు సంసారములో నికి మరల చొరబడుటకు చాల భయపడును గదా!
తం మోపయాతం ప్రతియంతు విప్రా
గంగా చ దేవీ ధృతచిత్తమీశే ।
ద్విజోపసృష్టః కుహకస్తక్షకోవా
దశత్వలం గాయత విష్ణుగాథాః ॥
ఓ మహర్షులారా! అట్టి నేను మిమ్ములను శరణు జొచ్చినానని తెలుసుకొనుడు. నేను ఈశ్వరునియందు లగ్నమైన మనస్సు గలవాడనని గంగాదేవి కూడ తెలియుగాక! బ్రాహ్మణబాలకుని శాపప్రభావముచే కపటి యగు తక్షకుడు తనకు తృప్తి కలుగునంత వరకు నన్ను కాటు వేయుగాక! మీరు శ్రీమహావిష్ణువుయొక్క గాథలను గానము చేయుడు.
పునశ్చ భూయాద్భగవత్యనంతే
రతిః ప్రసంగశ్చ తదాశ్రయేషు ।
మహత్సు యాం యాముపయామి సృష్టిం
మైత్ర్యస్తు సర్వత్ర నమో ద్విజేభ్యః ॥
నేను ఏయే జన్మలను పొందిననూ, ఆ జన్మలలో మరల నాకు అనంతభగవానునియందు ప్రీతి, ఆయన. భక్తులగు మహాత్ములతోడి నిరం తరసంగము, సర్వప్రాణులయందు ప్రేమ కలుగు గాక! మహర్షులకు నమ స్కరించుచున్నాను.
ఇతి స్మ రాజాధ్యవసాయయుక్తః
ప్రాచీనమూలేషు కుశేషు ధీరః ।
ఉదజ్ముఖో దక్షిణకూల ఆస్తే
సముద్రపత్న్యాస్వసుతన్యస్తభారః ॥
వివేకియగు పరీక్షిన్మహారాజు తన కుమారుడగు జనమేజయునకు రాజ్యభారమునప్పగించి, ఈ విధమగు దృఢనిర్ణయమును తీసుకొని, గంగానదియొక్క దక్షిణతటమునందు దర్బలను కొనలు తూర్పువైపునకు ఉండునట్లుగా వేసుకొని, వాటిపై ఉత్తరముఖముగా కూర్చుండెను.
ఏవం చ తస్మిన్నరదేవదేవే
ప్రాయోపవిష్టే దివి దేవసంఘాః ।
ప్రశస్య భూమౌ వ్యకిరంప్రసూనైః
ముదా ముహుర్దుందుభయశ్చ నేదుః ॥
ఈ విధముగా పరీక్షిన్మహారాజు ప్రాయోపవేశమునకు కూర్చుం డగా, ఆకాశమునందు దేవతలు ఆయనను కొనియాడి ఆనందముతో భూమిపై పూలవానను కురిపించిరి. దేవదుందుభులు కూడ మ్రోగెను.
మహర్షయో వై సముపాగతా యే
ప్రశస్య సాధ్విత్యనుమోదమానాః ।
ఊచుః ప్రజానుగ్రహశీలసారా
యదుత్తమశ్లోకగుణాభిరూపమ్ ॥
అచటకు విచ్చేసిన మహర్షులకు ప్రజలను అనుగ్రహించుట స్వభా వమై యున్నది. వారి తపోబలము కూడ ప్రజానుగ్రహము కొరకు మాత్ర మే. వారు పరీక్షిత్తును కొనియాడి, బాగున్నది అని తమ ఆమోదమును. తెలిపి, ఉత్తమమగు కీర్తిగల శ్రీహరియొక్క గుణముల వర్ణనచే సుందర మగు వచనములను కూడ పలికిరి.
స వా ఇదం రాజర్షవర్య చిత్రం
భవత్సు కృష్ణం సమనువ్రతేషు ।
యే ఽధ్యాసనం రాజకిరీటజుష్టం
సద్యో జహుర్భగవత్పార్శ్వకామాః ॥
ఓ రాజర్షి శ్రేష్ఠా! శ్రీకృష్ణుని అనుయాయులై సేవించే మీ పాండు వంశీయుల విషయములో ఇది ఆశ్చర్యము కాదు. ఏలయనగా, ధర్మ రాజాదులు భగవంతుని సన్నిధిని ఆకాంక్షించువారై, సాష్టాంగప్రణామము నాచరించే సామంతరాజుల కిరీటములచే సేవించబడే చక్రవర్తి సింహాసన మును క్షణములో విడిచి పెట్టిరి.
సర్వే వయం తావదిహాస్మహే ఽద్య
కలేవరం యావదసౌ విహాయ ।
లోకం పరం విరజస్కం విశోకం
యాస్యత్యయం భాగవతప్రధానః ॥
భగవద్భక్తులలో ప్రముఖుడగు ఈ పరీక్షిన్మహారాజు దేహమును విడిచి పెట్టి, త్రిగుణాతీతము శోకరహితము సర్వశ్రేష్టము అగు లోకము (మోక్షము) ను పొందునంత వరకు, ఇప్పటినుండియు మనము అంద రము ఇచటనే ఉండెదము.
ఆత్రుత్య తదృషిగణవచః పరీక్షిత్
సమం మధుచ్యుద్గురు చావ్యలీకమ్ ।
ఆభాషతైతానభినంద్య యుక్తాన్
శుశ్రూషమాణశ్చరితాని విష్ణోః ।
పక్షపాతము లేనిది, తేనెలొలుకునది, గంభీరమగు అర్ధము గలది మరియు నిష్కపటమైనది అగు ఆ ఋషిసంఘముయొక్క వచనమును విని, పరీక్షిన్మహారాజు జ్ఞానులగు ఆ ఋషులను అభినందించి, శ్రీహరి యొక్క లీలలను వినగోరువాడై, ఇట్లు పలికెను.
సమాగతాస్సర్వత ఏవ సర్వే వేదా యథా మూర్తిధరాస్త్రిపృష్ఠ ।
నేహాథవాముత్ర చ కశ్చనార్థ ఋతే పరానుగ్రహమాత్మశీలమ్॥
ముల్లోకములకు ఆవలనుండే సత్యలోకములో వేదములన్నియు రూపు దాల్చి యుండును. అదే విధముగా మీరందరు అన్ని దిక్కులనుం డియు ఇక్కడకు విచ్చేసి యున్నారు. ఇతరులను అనుగ్రహించుట మీకు సహజస్వభావమై యున్నది. అది తప్ప మీకు ఇహపరలోకములలో సాధిం చదగిన గురిక ప్రయోజనమేమియు లేదు.
తతశ్చ వః పృచ్ఛ్యమిమం విపృచ్ఛే
విశ్రభ్య విప్రొ ఇతికృత్యతాయామ్ ।
సర్వాత్మనా మ్రియమాణైశ్చ కృత్యం
శుద్ధం చ తత్రామృశతాభియుక్తాః ॥
ఓ మహర్షులారా! అందువలన, నేను మిమ్ములను విశ్వసించి నా కర్తవ్యము విషయములో వేయదగిన ఒక ప్రశ్నను వేయుచున్నాను. మాన వుడు అన్ని అవస్థలలో, విశేషించి మరణించబోయే సమయములో చేయ దగిన పవిత్రమగు కార్యము ఏది? ఆ విషయమును మీరు సమాహితచి తులై విచారణను చేసి చెప్పడు.
తత్రాభవద్భగవాన్ వ్యాసపుత్రో
యదృచ్ఛయా గామటమానో ఽన పేక్షః ॥
అలక్ష్యలింగో నిజలాభతుష్టో
వృతః స్త్రీబాలైరవధూతవేషః ॥
దేనినీ ఆశించనివాడు, కంటికి కానరాని ఆశ్రమచిహ్నములు గలవాడు, ఆత్మలోభముచే సంతృప్తిని చెందియున్నవాడు, అవధూతవేషములో నున్నపోడు, వ్యాసపుత్రుడు అగు భగవాన్ శుకమహర్షి గొలీపోటముగా (ఈ శ్వరుని సంకల్పముచే) భూమిని సంచరిస్తూ అచట ప్రకటమయ్యెను. స్త్రీలు, పిల్లలు కుతూహలము వలన ఆయన చుట్టూ చేరి యుండిరి.
తం ద్వ్యష్ణవర్షం సుకుమారపాద
కరోరుబాహ్వంసకపోలగాత్రమ్ ।
చార్వాయతాక్షోన్నసతుల్యకర్ణ
సుభృననం కంబుసుజాతకంఠమ్ ॥
నిగూఢజత్రుం పృథుతుంగవక్షసం
ఆవర్తనాభిం వలివల్గూదరం చ ।
దిగంబరం వక్తృవికీర్ణకోశం
ప్రలంబబాహుం స్వమరోత్తమాభమ్ ॥
శ్యామం సదా ఽపీచ్యవయోంగలక్ష్మ్యా
స్త్రీణాం మనోజ్ఞం రుచిరస్మితేన ।
ప్రత్యుత్థితాస్తే మునయస్స్వాసనేభ్యః
తల్లక్షణజ్ఞా అషి గూఢవర్చసమ్ ॥
పదునారు సంవత్సరముల వయస్సు గలవాడు, సుకుమారమగు పాదములు చేతులు తొడలు బాహువులు స్కంధములు చెక్కిళ్లు మరియు శరీరము గలవాడు, సుందరమగు నిడివి కన్నులు ఎత్తైన ముక్కు సరిసమా నమగు చెవులు అందమగు కనుబొమలు గల ముఖము గలవాడు, శంఖ మువలె అందమగు కంఠము గలవాడు, మాంసముచే కప్పబడియున్న కంఠము క్రింది యెముకలు గలవాడు, విశాలమగు ఎత్తైన వక్షఃస్థలము గల వాడు, సుడిగుండము వంటి నాభి గలవాడు, మూడు ముడతలతో సుందర మగు ఉదరము గలవాడు, దిగంబరుడు, ముఖముపై చెల్లాచెదరుగా పడు చున్న జుట్టు గలవాడు, పొడవుగా వ్రేలాడే బాహువులు గలవాడు, దేవశ్రే షుడగు విష్ణువు వలె ప్రకాశించువాడు, నల్లని వాడు, ఎల్లవేళలా అత్యుత్త మమగు వయస్సుచే అనగా యౌవనముచే కలిగిన దేహకాంతితో మరియు ప్రీతికరమగు చిరునవ్వుతో స్త్రీలకు కూడ మనస్సునకు ఆహ్లాదమును కలిగించువాడు అగు శుకమహర్షిని చూచి, ఆయన దాగియున్న బ్రహ్మవర్చస్సు గలవాడే అయిననూ, ఆయనయొక్క చిహ్నములనెరింగిన ఆ మునులు తమ ఆసనములనుండి లేచి ఆయనకు ఎదురేగిరి.
స విష్ణురాతో ఽతిథయ ఆగతాయ
తస్మై సపర్యాం శిరసా ఽఽజహార ।
తతో నివృత్తా హ్యబుధాః స్త్రియో ఽర్భకా
మహాసనే సోపవివేశ పూజితః ॥
పరీక్షిన్మహారాజు విచ్చేసిన అతిథికి శిరస్సును వంచి నమస్కరించి
పూజించెను. శుకుని వెనుకనే వచ్చిన స్త్రీలు, పిల్లలు అప్పుడు వెనుకకు - మరలిరి. ఆ విధముగా ఆదరించబడిన శుకమహర్షి పెద్ద ఆసనముపై కూర్చుండెను.
స సంవృతస్తత్ర మహాన్మహీయసాం బ్రహ్మర్షిరాజర్షిదేవర్షిసంఘైః ।
వ్యరోచతాలం భగవాన్యథేందుర్గ్రహర్క్షత్తారానికరైః పరీతః॥
మహాత్ములలో మహాత్ముడగు ఆ శుకమహర్షి అచట బ్రహ్మర్షులు రాజర్షులు మరియు దేవర్షుల సముదాయములచే చుట్టువారబడి యున్న వాడై, గ్రహములు నక్షత్రములు మరియు ఇతరజ్యోతిర్మండలములచే చుట్టుపారబడియున్న చంద్రభగవానుని వలే అధికముగా ప్రకాశించెను.
ప్రశాంతమాసీనమకుంఠమేధసం
మునిం నృపో భాగవతో ఽభ్యు పేత్య ।
ప్రణమ్య మూర్ధ్నా ఽవహితః కృతాంజలిః
నత్వా గిరా సూనృతయా ఽన్వపృచ్ఛత్ ॥
భగవద్భక్తుడు, ఏకాగ్రమగు చిత్తము గలవాడునగు పరీక్షిన్మహా రాజు ప్రశాంతముగా కూర్చునియున్న, మొక్కవోని ధారణాశక్తి గల శుకము హర్షి వద్దకు వచ్చి, తల వంచి నమస్కరించి, నిలబడి చేతులను జోడించి మరల నమస్కరించి, తరువాత మధురమగు వాక్కుతో నిట్లు ప్రశ్నించెను.
అహో అద్య వయం బ్రహ్మన్ సతేవ్యాః క్షత్రబంధవః ।
కృపయా ఽతథిరూపేణ భవద్బిస్తీర్థకాః కృతాః ॥
ఓ మహర్షీ! ఇది అద్భుతము! అయోగ్య క్షత్రియులమగు మేము ఈ నాడు సత్పురుషులకు సేవించ దగినవారము అయితిమి. మీరు దయతో అతిథిరూపములో వచ్చి మాకు అట్టి యోగ్యతను కలిగించినారు.
యేషాం సంస్మరణాత్పుంసాం సద్యశ్శుద్యంతి వై గృహాః ।
కిం పునర్దర్శనస్పర్శపాదశౌచాసనాదిభిః ॥
మీవంటి మహాత్ములను స్మరించినంత మాత్రాన మానవుల గృహములు వెనువెంటనే నిశ్చయముగా పవిత్రములగును. అట్టిచో మిమ్ములను దర్శించి, స్పృశించి, పాదములను కడిగి, ఆసనమునిచ్చి సత్కరించినచో మరింత పవిత్రములగునని వేరే చెప్పవలయునా?
సాన్నిధ్యాత్తే మహాయోగిన్ పాతకాని మహాంత్యపి ।
సద్యో నశ్యంతి వై పుంసాం విష్ణోరివ సురేతరాః ॥
ఓ మహాయోగీ! నీ సన్నిధి వలన మానవుల మహాపాపములు కూడ విష్ణువు సన్నిధిలో రాక్షసుల వలే వెనువెంటనే నిశ్చయముగా నశిం చును.
అపి మే భగవాన్ ప్రీతః కృష్ణః పాండుసుతప్రియః ।
పైతృష్వ సేయప్రీత్యర్థం తద్గోత్రస్యాత్తబాంధవః ॥
శ్రీకృష్ణభగవానుడు పాండవులకు ప్రియతముడు. కావున, ఆయన తన మేనత్త కొడుకులగు పాండవుల ప్రీతి కొరకై వారి వంశములో జన్మిం చిన నాయందు కూడ బంధుభావము గలవాడై, నాపై ప్రీతిని కలిగియుండ వచ్చును.
అన్యథా తే ఽవ్యక్తగతేర్దర్శనం నః కథం నృణామ్ ।
నితరాం ప్రియమాణానాం సంసిద్ధస్య వనీయసః ॥
మహాసిద్దులగు మీరు వనములో నుండెదరు. మీ రాకపోకలు ఎవ్వరికీ తెలియవు. శ్రీకృష్ణభగవానుని అనుగ్రహము లేనిచో, శీఘ్రముగా మరణించబోయే నావంటి వారికి అట్టి మీ దర్శనము ఎట్లు సంభవమ గును?
పురుష స్యేహ యత్కార్యం ప్రియమాణస్య సర్వథా ॥
మీరు యోగులకు కూడ పరమగురువులు. కావుననే, నేను మిమ్ములను ప్రశ్నించుచున్నాను. ఈ లోకములో శీఘ్రమే నిశ్చయముగా మరణించుచున్న మానవుడు మోక్షమును గోరి చేయ యోగ్యమగు కర్మ ఏది?
యచ్ఛ్రోతవ్యమథో జాప్యం యత్కర్తవ్యం నృభిః ప్రభో ।
స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయమ్॥
ఓ ప్రభూ! మానవులు దేనిని వినవలెను? జపించవలెను? చేయ వలేను? స్మరించవలెను? సేవించవలెను? మరియు, వేటిని విడనాడ వలెను? ఈ విషయమును చేప్పుడు.
నూనం భగవతో బ్రహ్మన్ గృహేషు గృహమేధినామ్ ।
న లక్ష్యతే హ్యవస్థానమపి గోదోహనం క్వచిత్ ॥
పరబ్రహ్మస్వరూపుడవగు ఓ మహర్షీ! పూజ్యులగు మీరు ఎక్క డై ననూ గృహస్థుల ఇంటిలో ఆవు పాలను పితికినంత సేపైననూ ఉండరు. మీరు మా వద్దకు వచ్చుట మా భాగ్యము.
సూత ఉవాచ ।
ఏవమాభాషితః పృష్టస్స రాజ్ఞా శ్లక్ ష్ణయా గిరా ।
ప్రత్యభాషత ధర్మజ్ఞో భగవాన్ బాదరాయణిః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధే
ఏకోనవింశో ఽధ్యాయః ॥
॥ సమాప్తో ఽయం ప్రథమస్కంధః ॥
సూతుడు ఇట్లు పలికెను: పరీక్షిన్మహారాజు ఈ విధముగా వ్యాసపు త్రుడగు శుకమహర్షిని అభిముఖముగా చేసుకొని మధురమగు వాక్కుతో ప్రశ్నించెను. అపుడు ధర్మజ్ఞుడు, పూజ్యుడు అగు ఆ మహర్షి ఆయనకు సమాధానమును చేప్పెను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది.
ప్రథమస్కంధము సమాప్తము.
హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.
ఓం శ్రీగణేశాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ ।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ॥
వంశీవిభూషితకరాన్నవనీరదాభాత్
పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ ।
పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్
కృష్ణాత్పరం కిమపి తత్త్వమహం న జానే ॥
సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే ।
తాపత్రయవినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః ॥
Summary of chapter 19 of the Bhāgavata Mahā Purana is as follows:
Recognizing the impending arrival of his death as a divine grace to detach him from earthly affairs, King Parīkshit fasts unto death on the sacred banks of the Gaṅgā at Śukratāl, surrounded by great sages, saints, and demigods from across the cosmos. In that august assembly, the radiant sixteen-year-old sage Śukadeva Gosvāmī appears like a shining sun, and King Parīkshit humbly inquires about the supreme duty of a human being, especially one on the verge of death, setting the stage for the recitations of the immortal Śrīmad-Bhāgavatam.