భాగవత మహా పురాణము
10 - దశమోఽధ్యాయః
శౌనక ఉవాచ ।
హత్వా స్వరిక్థస్పృధ ఆతతాయినో
యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః ।
సహానుజైః ప్రత్యవరుద్ధభోజనః
కథం ప్రవృత్తః కిమకారషీత్తతః ॥
శౌనకమహర్షి ఇట్లు పలికెను: తన రాజ్యమును అపహరింప బూనిన ఆతతాయులగు దుర్యోధనాదులను సంహరించిన పిదప ధార్మిక స్థుడగు ధర్మరాజు బంధువధచే సంకోచము చేయబడిన భోగము గలవా డై, సోదరులతో గూడి రాజ్యమునందు ఎట్లు ప్రవర్తిల్లినాడు? ఏమి చేసి సొడు?
సూత ఉవాచ ।
వంశం కురోర్వంశదవాగ్నినిర్హృతం
సంరోహయిత్వా భవభావనో హరిః ।
నివేశయిత్వా నిజరాజ్య ఈశ్వరో
యుధిష్ఠిరం ప్రీతమనా బభూవ హ ॥
జగత్తును సృష్టించి పాలించే శ్రీహరి వంశమనే అడవిలో (వెదుళ్ల గుంపు) పుట్టిన నిప్పుచే కాలి బూడిదయైన కురువంశములో మరల పరీ క్షిత్తు అనే మొలక వచ్చునట్లు చేసి, ధర్మరాజును తన సింహాసనముపై కూర్చుండబెట్టి, ప్రసన్నుడాయెను.
నిశమ్య భీష్మోక్తమథాచ్యుతోక్తం
ప్రవృత్తవిజ్ఞానవిధూతవిభ్రమః ।
శశాస గామింద్ర ఇవాజితాశ్రయః
పరిధ్యుపాంతామనుజానువర్తితః ॥
భీష్మశ్రీకృష్ణుల వచనములను వినుటచే ధర్మరాజునకు జ్ఞానము కలిగి మోహము దూరమయ్యెను. ఆయన శ్రీకృష్ణుడే శరణుగా గలవాడై, సోదరులు సేవించుచుండగా, సముద్రపర్యంతము గల సామ్రాజ్యమును ఇంద్రుని వలే ఏలేను.
కామం వవర్ష పర్జన్యస్సర్వకామదుఘా మహీ ।
సిషిచుస్స్మ ప్రజాన్ గావః పయసోధస్వతీర్ముదా ॥
మేఘదేవత చక్కగా వర్షించెను. భూమియందు అభీష్టములగు వస్తువులు సమృద్ధిగా లభించెను. పెద్ద పొదుగులు గల ఆవులు ప్రసన్న ములై గొల్లపల్లెలను పాలతో ముంచెత్తెను.
నద్యస్సముద్రా గిరయస్సవనస్పతివీరుధః ।
ఫలంత్యోషధయస్సర్వాః కామమన్వృతు తస్య వై ॥
నదులు, సముద్రములు, పర్వతములు, చెట్టుచేమలు, అన్ని రక ముల పంటలు ప్రతి ఋతువునందు ఆ రాజునకు నిశ్చయముగా ఫలించిన వీ; అనగా, తమ విలువైన వస్తువుల నందజేసినవి.
నాధయో వ్యాధయః క్లేశా దైవభూతాత్మ హేతవః ।
అజాతశత్రావభవన్ జంతూనాం రాజ్ఞి కర్హిచిత్ ॥
అజాతశత్రువగు ధర్మరాజుగారి రాజ్యములో ప్రాణులకు ఏ కాలమునందైననూ శరీరవ్యాధులు గాని, మనోవ్యాధులు గాని, ఆధ్యాత్మిక-ఆధి భౌతిక-ఆధిదైవికములగు తాపములు గాని లేవు.
ఉషిత్వా హాస్తినపురే మాసాన్ కతిషయాన్ హారిః ।
సుహృదాం చ విశోక్య స్వసుశ్చ ప్రియకామ్యయా ॥
ఆమంత్యృ చాభ్యనుజ్ఞాతః పరిష్వజ్యాభివాద్య తమ్ ।
ఆరురోహ రథం కైశ్చిత్పరిష్వక్తోఽభివాదితః ॥
శ్రీకృష్ణుడు పాండవుల శోకమును పోగొట్టుటకు, సుభద్రకు ప్రీతిని కలిగించుటకు కొన్ని నెలలు హస్తినాపురములో నుండి, తరువాత ధర్మ రాజువద్ద సెలవు తీసుకొని, ఆయనను కౌగిలించుకొని నమస్కరించి రథ మునెక్కెను. కొందరు అయనను కౌగిలించుకొని నమస్కరించిరి.
సుభద్రా ద్రౌపధీ కుంతీ విరాటతనయా తథా ।
గాంధారీ ధృతరాష్ట్రశ్చ యుయుత్సుర్గౌతమో యమౌ ॥
వృకోదరశ్చ ధౌమ్యశ్చ స్త్రియో మత్స్యసుతాదయః ।
న సేహిరే విముహ్యంతో విరహం శార్ జ్గధన్వనః ॥
సుభద్ర, ద్రౌపది, కుంతి, విరాటపుత్రియగు ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు, యుయుత్సువు, కృపాచార్యుడు, నకులసహదేవులు, భీముడు, ధౌమ్యుడు, సత్యవతి మొదలగు స్త్రీలు శార్ జ్ఞమనే ధనస్సుగల శ్రీహరి యొక్క వియోగమును సహించలేక స్పృహను గోల్పోయిరి.
సత్సంగాన్ముక్తదుస్సంగో హాతుం నొత్సహతే బుధః ।
కీర్త్యమానం యశో యస్య సకృదాకర్ణ్య రోచనమ్ ॥
మహాత్ముల తోడి సంగము వలన దుష్టసంగమును విడిచి పెట్టిన వివేకి ఆ మహాత్ములచే కీర్తించబడే రుచికరమగు శ్రీకృష్ణుని యశస్సును ఒక్కసారి వినిన తరువాత మరల దానిని విడుచుటకు ఇష్టపడడు.
తస్మిన్న్యస్తధియః పార్థాస్స హేరన్విరహం కథమ్ ।
దర్శనస్పర్శసంలాపశయనాసనభోజనైః ॥
పాండవులు ఆయననే చూస్తూ స్పృశిస్తూ, ఆయనతో మాటలోడుతూ కలిసి నిద్రిస్తూ కూర్చుని భుజిస్తూ గడిపిరి. ఇప్పుడు ఆయన విరహమును వారు ఎట్లు సహించగలరు?
సర్వే తేఽనిమిషైరక్షైస్తమునుద్రుతచేతసః ।
వీక్షంత స్స్నేహసంబద్ధా విచేలుస్తత్ర తత్ర హ ॥
ప్రేమకు పూర్తిగా వశమైన హృదయము గల వారందరి మన స్సులు శ్రీకృష్ణునిపై నుండుటచే వారాయనను రెప్పపాటు లేని కన్నులతో చూస్తూ ఇటునటు తిరుగాడుచుండిరి.
న్యరుంధన్నుద్గలద్బాష్పమౌత్కంఠ్యాద్దేవకీసుతే ।
నిర్యాత్యగారాన్నోఽభద్రమితి స్యాద్బాంధవస్త్రియః ॥
దేవకీనందనుడగు శ్రీకృష్ణుడు గృహమునుండి బయటకు వచ్చు చుండగా బంధుస్త్రీలు ఆయనయందలి ప్రేమాతిశయముచే కళ్లనుండి బయటకు ఉబుకుతున్న కన్నీటిని, అమంగళము కలుగకూడదనే కారణముచే బలముగా ఆపుకొనుచుండిరి.
మృదంగశంఖభేర్యశ్చ వీణాపణపగోముఖాః ।
ధుంధుర్యానకఘంటాద్యా నేదుర్దుందుభయస్తథా ॥
ఆ సమయములో మధేళ్లు, శంఖములు, భేరీలు, వీణలు, డోళ్లు, బోకాలు, ధుంధురీ అనే వాద్యవిశేషములు, నగారాలు, గంటలు, దుందు భులు మొదలగునవి మ్రోగినవి.
ప్రాసాదశిఖరారూఢాః కురునార్యో దిదృక్షయా ।
వవృషుః కుసుమైః కృష్ణే ప్రేమవ్రీడాస్మితేక్షణాః ॥
కురుస్త్రీలు శ్రీకృష్ణుని చూడాలనే కోరికతో మేడల పైకి ఎక్కి, ఆయనను ప్రేమతో సిగ్గుతో చూస్తూ చిరునవ్వులు నవ్వుతూ పూలవానలను కురిపించిరి.
సీతాతపత్రమ్ జగ్రాహ ముక్తాధామవిభూషితమ్ ।
రత్నదండం గుడా కేశః ప్రియః ప్రియతమస్య హ ॥
శ్రీకృష్ణునకు ప్రియమిత్రుడగు అర్జునుడు ముత్యాల దండలతో అలంకరింపబడి రత్నములు పొదిగిన దండము గల తెల్ల గొడుగును అత్యంతప్రీతిపాత్రుడగు ఆయనకు పట్టెను.
ఉద్ధవస్సాత్యకిశ్చైవ వ్యజనే పరమాద్భుతే ।
వికీర్యమాణః కుసుమై రేజే మధుపతిః పథి ॥
ఉద్ధవుడు సాత్యకి మిక్కిలి అచ్చెరువును గొలిపే వింజామరలను వీచిరి. దారిలో జనులు పూలను చల్లుచుండగా ఆయన ప్రకాశించెను.
అశ్రూయంతాశిషస్సత్యాస్తత్ర తత్ర ద్విజేరితాః ।
నానారూపానురూపాశ్చ నిర్గుణస్య గుణాత్మనః ॥
నిర్గుణపరబ్రహ్మ, మాయామానుషవిగ్రహమును దాల్చినవాడు ఆశీర్వచనములు వినవచ్చెను. సత్యములగు ఆ ఆశీస్సులు ఆయన స్వరూపమునకు తగ్గట్లు ఉండెను.
అన్యోన్యమాసీత్సంజల్ప ఉత్తమశ్లోకచేతసామ్ ।
కౌరవేంద్రపురస్త్రీణాం సర్వశ్రుతీమనోహరః ॥
కురువంశరాజధానియగు హస్తినాపురములోని యువతుల మన స్సులు ఉత్తమమగు కీర్తిగల శ్రీకృష్ణునియందు లగ్నమై యుండెను. వారు తమతో తాము చేసిన సంభాషణములు అందరి చెవులకు ఇంపుగా మన స్సును దోచునవిగా ఉండెను.
స వై కిలాయం పురుషః పురాతనో య ఏక ఆసీదవిశేష ఆత్మని ।
అగ్రే'గుణేభ్యో జగదాత్మనీశ్వరే నిమీలితాత్మన్నిశి సుప్తశక్తిషు ॥
పరబ్రహ్మ ఆద్యంతములు లేని చైతన్యస్వరూపుడు మరియు అద్వితీయుడు. సత్త్వరజస్తమోగుణములకు అతీతుడగు ఆ పరబ్రహ్మయే జగద్రూపముగా ప్రకటమగును. మాయాశక్తియొక్క విలాసలు ఉపసంహ రింపబడిన ప్రళయములో సర్వప్రాణులు ఆయనయందు విలీనమగును. అప్పుడు ఆ పరబ్రహ్మ నిర్విశేషమగు స్వస్వరూపములో నుండును (నిద్రలో అవిద్యావిలాసములన్నియు అవ్యక్తమునందు విలీనమగుటచే, జీ వుడు స్వస్వరూపమగు అద్వితీయపరబ్రహ్మమునందు సంపన్నుడై యుండును). ఆ నిర్గుణపరబ్రహ్మ ఈ శ్రీకృష్ణుడే.
స ఏవ భూయో నిజవీర్యచోదితాం
స్వజీవమాయాం ప్రకృతిం సిసృక్షతీమ్ ।
అనామరూపాత్మని రూపనామనీ
విధిత్సమాన్యోఽనుససార శాస్త్రకృత్ ॥
ఆ పరమాత్మయే ప్రళయాంతమునందు నామరూపములు లేని నిర్విశేషసత్తయగు తన స్వరూపమునందు నామరూపములను ప్రకటింపజేయగోరెను (నామరూపములు లేని జీవునకు నామరూపములను కల్పించగోరెను). అపుడు వేదములను లోకమునందు ప్రవర్తిల్ల జేసే ఆ పరమాత్మ తన శక్తిచే ప్రేరితమైనది, తన అంశలు అగు జీవులను మోహింప జేయునది, సృష్టిని చేయగోరునది అగు త్రిగుణాత్మకప్రకృతికి అధి సాద్యమాయను.
స వా అయం యత్పదమత్ర సూరయో
జితేంద్రియా నిర్జితమాతరిశ్వనః ।
పశ్యంతి భక్త్యుత్కలితామలాత్మనా
నన్వేష సత్త్వం పరిమార్ ష్టు మర్హతి ॥
ఈ లోకములో విద్వాంసులు ప్రాణాయామపరాయణులై ఇంద్రియ ములను జయించి భక్త్యావేశముచే పవిత్రమైన బుద్ధితో ఏ పరమాత్మయొ క్క స్వరూపమును (పాదములను) కనుగొనెదరో, అట్టి పరమాత్మ మన ముందే ఉన్నాడు. మనస్సును శుద్ధము చేయదగిన వాడు ఈయనయే గాని, ఆ యోగసాధనలు కాదు గదా!
స వా అయం సఖ్యనుగీతసత్కథో
వేదేషు గుహ్యేషు చ గుహ్యవాదిభిః ।
య ఏక ఈశో జగదాత్మలీలయా
సృజత్యవత్యత్తి న తత్ర సజ్జతే ॥
ఓ సఖురాలా! రహస్యమగు తత్త్వమును బోధించే మహర్షులు వేదములలో మరియు వేదాంతములలో ఆ పరమాత్మయొక్క పవిత్రమగు గాథలను గానము చేయుచున్నారు. అద్వితీయుడగు ఆ పరమాత్మ తన మాయాశక్తిచే ఈ జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరించిననూ, ఆ కార్యములయందు ఆయనకు కర్తృత్వము గాని, ఆ జగత్తునందు రాగద్వేష ములు గాని లేవు. అట్టి పరమాత్మ ఈతడే.
యదా హ్యధర్మేణ తమోధియో నృపా
జీవంతి తత్రృఏష హి సత్త్వతః కిల ।
ధత్తే భగం సత్యమృతం దయాం యశో
భవాయ రూపాణి దధద్యుగే యుగే ॥
ప్రతియుగమునందు తమోగుణప్రధానమగు బుద్ధి గల రోజులు అధార్మికులై జీవించే సమయములలో ఈ పరమాత్మ లోకకల్యాణము. కొరకై సత్త్వగుణమును స్వీకరించి అవతారములను దాల్చి, ఈశ్వరభావ మును సత్యమును ధర్మమును భూతదయను కీర్తిని నిలబెట్టును.
అహో అలం శ్లాఘ్యతముం యధోః కులం
అహో అలం పుణ్యతమం మథోర్వనమ్ ।
యదేష పుంసామృషభః శ్రియః ప్రియః
స్వజన్మనా చంక్రమణేన చాంచతి ॥
ఆశ్చర్యము! పురుషశ్రేష్ఠుడు, లక్ష్మీ ప్రియుడు అగు ఈ శ్రీకృష్ణుడు జన్మించుటచే యదువంశము మిక్కిలి కొనియాడదగినదిగను, సంచ రించుటచే వ్రజభూమి మిక్కిలి పవిత్రమైనదిగను ప్రకాశించు చున్నవి.
అహో బత స్వర్యశసస్తిరస్కరీ
కుశస్థలీ పుణ్యయశస్కరీ భువః ।
పశ్యంతి నిత్యం యదనుగ్రహేషిత-
స్మితావలోకం స్వపతిం స్మ యత్పృజాః ॥
ఆశ్చర్యము! భూలోకమునకు పవిత్రతను సంపాదించి పెట్టే ద్వారకయొక్క కీర్తి స్వర్గముయొక్క కీర్తిని తల దన్నుచున్నది. ఏలయనగా,నిత్యము తమ ప్రభువగు శ్రీకృష్ణుని దర్శించే అచటి ప్రజలు ఆయన యొక్క చిరునవ్వుతో కూడిన కృపాదృష్టికి పాత్రులగుచున్నారు.
నూనం ప్రతస్నానహుతాదినేశ్వరః
సమర్చితో హ్యస్య గృహీతపాణిభిః ।
పిబంతి యాస్సఖ్యధరామృతం ముహుః
వ్రజస్త్రీయస్సంముముహుర్యదాశయాః ॥
ఓ సఖురాలా! ఈయనను చెట్టబట్టిన పత్నులు నిశ్చయముగా వ్రతములు, తీర్థస్నానములు, హోమములు మొదలగు వాటిచే ఈశ్వరుని చక్కగా పూజించి యుందురు. ఏలయనగా, వారు ఈయన అధరామృత మును అనేకపర్యాయములు పానము చేయుదురు. ప్రజమునందలి స్త్రీలు దానిని కోరి, సమ్మోహమును పొందుచుందురు గదా!
యా వీర్యశుల్కేన హృతాస్స్వయంవరే
ప్రమథ్య చైద్యప్రముఖాన్ హి శుష్మిణః ।
ప్రద్యుమ్నసాంబాంబసుతాదయ్యోఽపరా
యాశ్చాహృతా భౌమవధే సహస్రశః ॥
ఏతాః పరం స్త్రీత్వమపాస్త పేశలం
నిరస్తనౌచం బత సాధు కుర్వతే ।
న జాత్వ పైత్యాహృతిభిర్హృది స్పృశన్ ॥
శ్రీకృష్ణుడు స్వయంవరములో శిశుపాలుడు మొదలగు బలవంతు లను చిదకదన్ని పరాక్రమమే శుల్కము కాగా, రుక్మిణి జాంబవతి నాగ్నజితి మొదలగు ఎనమండుగురు భార్యలను పొందినాడు. వారికి క్రమముగా ప్రద్యుమ్నుడు, సాంబుడు, అంబుడు మొదలగు పుత్రులు కలిగిరి. ఇంతే గాక, ఆయన నరకాసురుని వధించిన సందర్భములో వేల సంఖ్యలో స్త్రీలకు రక్షణను కల్పించినాడు. పూర్ణమగు శౌచస్వాతంత్యములు లేని స్త్రీజీవనమునకు వీరు శోభను చేగూర్చినారు. ఆశ్చర్యము! ఏలయనగా, పద్మములవంటి కన్నులు గల ఈ శ్రీకృష్ణుడు వారికి భర్తయై తన పలుకు లతో బహుమానములతో హృదయములకు ఆనందమును కలుగజే ఇముచూ ఇంటినుండి ఒక్కనాడైననూ దూరము కాడు.
ఏవం విధా గధంతీనాం గిర పురయోషితామ్ ।
నిరీక్షణేనాభినందన్ సస్మితేన యణో హరిః ॥
ఈ విధముగా మాటలాడుచున్న పురస్త్రీలను చిరునవ్వుతో కూడిన చూపుతో అభినందిస్తూ ఆ శ్రీకృష్ణుడు వెళ్లాను.
అజాతశత్రుః పృతనాం గోపీథాయ మధుద్విషః।
పరేభ్యశ్శంకిత స్నేహాత్పృయుంక్త చతురంగిణీమ్ ॥
ధర్మరాజునకు శ్రీకృష్ణునిపై గల ప్రేమచే శత్రువులు ఆయనకు హానిని తల పెట్టెదరేమో యను శంక కలిగి, ఆయన రక్షణ కొరకై చతురంగ బలమును పంపించెను.
అథ దూరాగతాన్ శౌరిః కౌరవాన్ విరహాతురాన్ ।
సంనివర్త్య దృఢం స్నిగ్దాన్ ప్రాయాత్స్వనగరీం ప్రియైః ॥
తరువాత దృఢమగు ప్రేమ ఉండుటచే విరహము వలన పీడింపబ ... డినవారై దూరము వరకు సాగనంప వచ్చిన పాండవులను వెనుకకు పంపి శ్రీకృష్ణుడు మిత్రులతో గూడి తన నగరమునకు వెళ్లాను.
కురుజాంగలపాంచాలాన్ శూరసేనాన్ స యామునాన్ ।
బ్రహ్మావర్తం కురుక్షేత్రం మత్స్యాన్ సారస్వతానథ ॥
మరుధన్వమతిక్రమ్య సౌవీరాభీరయోః పరాన్ ।
ఆనర్తాన్ భార్గవోపాగాచ్ఛృంతవాహో మనాగ్విభుః ॥
ఓ శౌనకమహర్షీ! ఆ శ్రీకృష్ణుడు కురుజాంగల పాంచాల శూర సేన దేశములను, యమునానదీతీరమునందలి బ్రహ్మావర్త కురుక్షేత్రములను, మత్స్య సారస్వత మరుధన్వ దేశములను దాటి, సౌవీర-ఆభీర దేశములకు పశ్చిమమునందున్న ఆనర్తదేశమును చేరు సరికి గుర్రములు కొద్దిగా అలసి నవి.
తత్ర తత్ర హ తత్రత్యైర్హరిః ప్రత్యుద్యతార్షణః ।
సాయం భేజే దిశం పశ్చాద్గవిష్ఠో గాం గతస్తదా ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధేదశమోఽధ్యాయః. ॥
దారి పొడుగునా జనులు శ్రీకృష్ణునకు ఎదురేగి సత్కరించి బహు మానములనిచ్చిరి. ఆయన ఈ విధముగా సాయంకాలమగు సరికి పశ్చిమ దిక్కును చేరెను. ఇంతలో సూర్యుడు అస్తమించెను.
శ్రీమద్భాగవతమహాపురాణములోని ప్రథమస్కంధములో పదవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 10 of the Bhāgavata Mahā Purana is as follows:
After the glorious departure of Bhīshmadeva, King Yudhishtira is formally enthroned and governs the kingdom with righteousness, bringing unprecedented peace and abundance to the entire earth. Lord Kṛshṇa then prepares to return to His capital city of Dvārakā, prompting deep emotional farewells from the inhabitants of Hastināpura, particularly the Pāṇḍavas and the royal ladies whose eyes overflow with tears of intense affection as they watch the Lord journey across the lands.