భాగవత మహా పురాణము
14 - చతుర్దశోఽధ్యాయః
సూత ఉవాచ ।
సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణో బంధుదిదృక్షయా ।
జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితమ్ ॥
వ్యతీతాః కతిచిన్మాసాస్తదా నాయాత్తతోర్జునః ।
దదర్శ ఘోరరూపాణి నిమిత్తానీ కురూద్వహః ॥
సూతుడు ఇట్లు పలికేను: బంధువులను చూచుటకు మరియు శ్రీకృష్ణుని కార్యకలాపములను గురించి తెలుసుకొనుటకు అర్జునుడు ద్వార కకు వెళ్లి కొన్ని నెలలు గడచినవి. కాని, ఆతడు ఇంకనూ తిరిగి రాలేదు. ఇంతలో కురువంశశ్రేష్ఠుడగు ధర్మరాజునకు భయంకరమగు ఆకారము గల ఉత్పాతములు కానవచ్చినవి.
కాలస్య చ గతిం రౌద్రాం విపర్యస్తర్తుధర్మిణః ।
పాపీయసీం నృణాం వార్తాం క్రోధలోభానృతాత్మనామ్ ॥
జిహ్మప్రాయం వ్యవహృతం శాఠ్యమిశ్రం చ సౌహృదమ్ ।
పితృమాతృసుహృదాతృదంపతీనాం చ కల్కనమ్ ॥
నిమిత్త్యాన్యత్యరిష్టాని కాలే త్వనుగతే నృణామ్ ।
లోభాద్యధర్మప్రకృతిం దృష్ట్వావోచానుజం నృపః ॥
ఋతుధర్మములు తల్లక్రిందులు అగుటచే కొలము భయమును గొల్పుచుండెను. కోపము, పిసినారితనము మరియు అసత్యము అను వాటితో నిండిన హృదయములు గల జనులు బ్రతుకు తెరువు కొరకై పాప ములను చేయుచుండిరి. వ్యవహారమంతయు మోసపూరితముగా నుండే ను. మిత్రులు కూడ పరస్పరము వంచించు కొనుచుండిరి. తల్లి, తండ్రి, మిత్రుడు, సోదరుడు, భార్య మరియు భర్త అను వారలు ఒకరితో నొకరు కలహించు కొనుచుండిరి. కలికాలము రోగానే మానవుల స్వభావములో లోభము మొదలగు దుర్గుణములు ప్రవేశించేను. అనేకములగు ఉత్పాతములు కనబడుచుండెను. దీనినంతనూ గమనించిన ధర్మరాజు సోదరడగు భీషునితో నీట్లనెను.
యుధిష్ఠిర ఉవాచ ।
సంప్రేషితో ద్వారకాయాం జిష్ణుర్బంధుదిదృక్షయా ।
జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితమ్ ॥
గతాస్సప్తాధునా మాసా భీమ సేన తవానుజః ।
నాయాతి కస్య వా హేతోర్నాహం వేదేదమంజసా ॥
ధర్మరాజు ఇట్లు పలికెను: అర్జునుడు బంధువులను చూచుటకు, పవిత్రమగు కీర్తి గల శ్రీకృష్ణుని కార్యకలాపములను తెలుసుకొనుటకు ద్వారకకు పంపబడినాడు. ఆతడు వెళ్లి ఇప్పటికి ఏడు నెలలు అయినది. ఓ భీమసేనా! అయిననూ, ఆతడు ఇంకనూ రాకున్నాడు. కారణమేమియో నాకు స్పష్టముగా తెలియుట లేదు.
అపి దేవర్షిణా దిష్టస్స కాలోయముపస్థితః ।
యదాత్మనోంగమాక్రీడం భగవానుత్సిసృక్షతి ॥
శ్రీకృష్ణుడు తన లీలలను ప్రకటించుటకై స్వీకరించిన దేహమును దేవకార్యము పూర్తి అయిన పిదప విడిచి పెట్టునని నారదమహర్షి చెప్పి యున్నాడు. అట్టి సమయము వచ్చినదా యేమి?
యస్మాన్నసంపదో రాజ్యం దారాః ప్రాణాః కులం ప్రజాః ।
ఆసన్ సపత్నవిజయో లోకాశ్చ యదనుగ్రహాత్ ॥
మనకు సంపదలు, రాజ్యము, భార్య, ప్రాణములు, వంశము, పిల్ల లు మరియు శత్రువులపై విజయము శ్రీకృష్ణుని వలన మాత్రమే కలిగినవి. మనకు పుణ్యలోకములు కూడ ఆయన వలన మాత్రమే సిద్ధించును.
పశ్యోత్పాతాన్నరవ్యాఘ దివ్యాన్ భౌమాన్ సదైహికాన్ ।
దారుణాన్ శంసత్వోదూరాద్భయం నో బుద్ధిమోహనమ్ ॥
ఓ మనుష్యశ్రేష్ఠా! శరీరమునందు, భూమియందు, ద్యులోకము నందు కూడ అనేకములగు భయమును గొల్పే ఉత్పాతములు కానవచ్చు చున్నవి. ఇవి మనకు తొందరలో రాబోయే భయమును సూచించుచున్నవి. ఆ భయము మన బుద్ధిని మోహ పెట్టును, వాటిని గమనించుము.
వేపథుశ్చాపి హృదయ ఆరాద్దాస్యంతి విప్రియమ్ ॥
ఓయీ! నాకు మాటిమాటికీ తొడలు. కన్నులు చేతులు అదురుచున్నవి. హృదయమునందు వణుకు పుట్టుచున్నది. ఈ లక్షణములు తొందరలో విపత్తును కలిగించును.
శివైషోద్యంతమాదిత్యమభిరౌత్యనలాననా ।
మామంగ సారమేయో యమభిరౌతి హ్యభీరువత్ ॥
ఓ భీమా! ఆడునక్క నోటినుండి నిప్పులను గ్రక్కుతూ ఉదయించే సూర్యుని వైపు తిరిగి కూయుచున్నది. ఈ కుక్క భయము లేనిదాని వలె నావైపు తిరిగి మొరుగుచున్నది.
శస్తాః కుర్వంతి మాం సవ్యం దక్షిణం పశవో పరే ।
వాహాంశ్చ పురుషవ్యాఘ్ర లక్షయే రుదతో మమ ॥
ఓ పురుషశ్రేష్టా! గోవులు మొదలగు ప్రశస్తములగు పశువులు నేను ఎడమ వైపు ఉండునట్లు, ఇతరములగు పశువులు నేను కుడివైపు ఉండునట్లు నడుచుచున్నవి. నా గుర్రములు ఏడ్చుచుండగా నేను చూచితిని.
మృత్యుదూతః కపోతో యములూకః కంపయన్మనః ।
ప్రత్యులూకశ్చ కుహ్వానైరనిద్రౌ శూన్యమిచ్ఛతః ॥
ఈ పావురము మరణదేవతయొక్క దూత (మరణమును సూచించుచున్నది). ఒక గుడ్లగూబ, దానికి ఎదురుగా మరియొక గుడ్లగూబ నిద్రను వీడి కర్ణకఠోరముగా కూయుచూ జగత్తు వినాశమగుటను కాంక్షించు చున్నవి.
ధూమ్రా దిశః పరిధయః కంపతే భూస్సహాద్రిభిః ।
నిర్ఘాతశ్చ మహానాసీత్సాకం చ స్తనయిత్నుభిః ॥
ధూళితో నిండిన దిక్కులు ఈ లోకమును కప్పివేయుచున్నవి. సూర్యచంద్రుల చుట్టూ మండలములు ఏర్పడుచున్నవి. పర్వతములతో సహా భూమి కంపించుచున్నది. మేఘములు లేకుండగనే గర్జనలతో కూడిన పెద్ద పిడుగు పడినది.
వాయుర్వాతీ ఖరస్పర్శే రజసా విసృజంస్తమః ।
అసృగ్వర్షంతి జలదా బీభత్సమీవ సర్వతః ॥
కఠినమగు స్పర్శ గల వాయువు ధూళిని రేగగొట్టి దట్టని చీకటిని కలిగించుచున్నది. మేఘములు రక్తమును వర్ణిస్తూ అంతటా బీభత్సమును సృష్టించుచున్నవి.
సూర్యం హతప్రభం పశ్య గ్రహమర్ధం మిథో దివి ।
ససంకులైర్భూతగణైర్జ్వలితే ఇవ రోదసీ ॥
సూర్యుడు కాంతిని కోల్పోయినోడు. ఆకాశములో గ్రహములు ఒకదానితో నొకటి ఢీకొనుచున్నవి. చూడుము. ద్యులోకభూలోకములు భూతగణములతో క్రిక్కిరిసి మండుచున్నవా యన్నట్లు ఉన్నవి.
నద్యో నదాశ్చ క్షుభితాస్సరాంసి చ మనాంసి చ ।
న జ్వలత్యగ్నిరాజ్యేన కాలో యం కిం విధాస్యతి ॥
అన్ని రకముల చిన్న పెద్ద నదులు సరస్సులు మరియు జనుల మనస్సులు అల్లకల్లోలముగా నున్నవి. నేయిని వేసిననూ అగ్ని ప్రజ్వరి ల్లుట లేదు. ఈ కాలము ఏమి ముప్పును తేనున్నదో?
న పిబంతి స్తనం వత్సా న దుహ్యంతి చ మాతరః ।
రుదంత్యశ్రుముఖా గావో న హృష్యంత్యృషభా ప్రజే ॥
దూడలు పాలను త్రాగుట లేదు. ఆవులు పాలను ఇచ్చుట లేదు. ఆవులు కన్నుల వెంబడి నీటిని స్రవిస్తూ ఏడ్చుచున్నవి. గొల్లపల్లెలో ఎద్దులు ఉల్లాసముగా లేవు.
దైవతాని రుదంతీవ స్విద్యంతి హ్యుచ్ఛలంతి చ ।
ఇమే జనపదా గ్రామాః పురోద్యానాకరాశ్రమాః ।
భ్రష్టియో నిరానందోః కిమఘం దర్శయంతి నః ॥
దేవతాప్రతిమలు ఏడ్చుచున్నట్లున్నవి. అవి చెమరుస్తూ ఎగిరి పడుచున్నవి. ఈ రాజ్యములు, గ్రామములు, నగరములు, ఉద్యానవనములు, గనులు, ఆశ్రమములు నశించిన శోభ గలవై ఆనందవిహీనముగా నున్నవి. ఇవి మనకు ఏమి దుఃఖమును సూచించుచున్నవి?
మన్య ఏతైర్మహోత్పాతైర్నూనం భగవతః పదైః ।
అనన్యపురుషశ్రీభిర్హీనా భూర్హతసౌభగా ॥
ఈ పెద్ద ఉత్పాతములను బట్టి, ఈ భూమి నశించిన సౌభాగ్యము గలదియై, ఇతరపురుషులలో లేని శోభ గల శ్రీకృష్ణభగవానుని పాద . చిహ్నము లకు నిశ్చయముగా దూరము కానున్నదని తలంచెదను.
ఇతి చింతయతస్తస్య దృష్టారిష్టేన చేతసా ।
రాజ్ఞః ప్రత్యాగమదహ్మన్ యదుపుర్యాః కపిధ్వజః ॥
ఉత్పాతములను చూచుటచే కల్లోలితమైన మనస్సుతో ధర్మరాజు ఈ విధముగా చింతిల్లుచుండగా, ద్వారకానగరమునుండి అర్జునుడు తిరిగి వచ్చెను.
తం పాదయోర్నిపతితమయథాపూర్వమాతురమ్ ।
అధోవదనమబిందూన్ముంచంతం నయనాబ్జయోః ॥
విలోక్యోద్విగ్నహృదయో విచ్ఛాయమనుజం నృపః ।
పృచ్ఛతి స్మ సుహృన్మధ్యే సంస్మరన్నారదేరితమ్ ॥
అర్జునుడు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధముగా దుఃఖిస్తూ వచ్చి అన్నగారి పాదములపై పడేను. ఆతడు ముఖమును క్రిందకు దించు కోని, పద్మములవంటి కన్నులనుండి నీటి బిందువులను విడుచుచుండెను. ఈ విధముగా కాంతివిహీనుడై యున్న తమ్ముని చూచి, ధర్మరాజు ఉద్వేగ ముతో నిండిన హృదయము గలవాడై, నారదుని వచనములను స్మరిస్తూ, మిత్రుల యెదుటనే అర్జునుని ఈ విధముగా ప్రశ్నించెను.
యుధిష్ఠిర ఉవాచ ।
కచ్చిదానర్తపుర్యాం నస్స్వజనాస్సుఖమాసతే ।
మధుభోజదశార్హర్హసాత్వతాంధకవృష్ణయః ॥
ధర్మరాజు ఇట్లు పలికెను: ద్వారకానగరములో మన బంధువులగు మధు, భోజ, దశార్హ, ఆర, సాత్వత, అంధక, వృష్టి వంశములకు చెందిన యాదవులు సుఖముగా నున్నారా?
శూరో మాతామహః కచ్చిత్స్వస్త్యా స్తే వాథ మారిషః ।
మాతులస్సోనుజః కచ్చిత్కుశల్యానకదుందుభిః ॥
మన అమ్మగారీ తండ్రి, పూజనీయుడు అగు శూరసేనుడు కులా సాయేనా? వసుదేవుడు మామయ్య, ఆయన సోదరుడు కుశలముగా నున్నారా?
సప్త స్వసారస్తత్పత్న్యో మాతులాన్యస్సహాత్మజాః ।
ఆసతే సస్నుషాః క్షేమం దేవకీప్రముఖాస్స్వయమ్ ॥
ఆయన భార్యలగు దేవకీదేవి మొదలైన ఏడురు అప్పచెల్లెళ్లు, వారి కొడుకులు, కోడళ్లు అందరు కుశలముగా నున్నారా?
కచ్చిద్రాజా హుకో జీవత్యసత్పుతో స్య చానుజః ।
హృదీకస్ససుతో క్రూరో జయంతగదసారణాః ॥
ఉగ్రసేన మహారాజు కుశలమేనా? దుష్టుడగు కంసుడు మరణిం చుటచే ఆయన పుత్రుడు లేనివాడైనాడు. ఆయన సోదరుడగు దేవకుడు జీవించియే యున్నాడా? హృదీకుడు, ఆయన పుత్రుడగు కృతవర్మ, అక్రూ రుడు, శ్రీకృష్ణుని సోదరులగు జయంతుడు, గదుడు, సారణుడు కుశల మేనా?
ఆసతే కుశలం కచ్చిద్యే చ శత్రుజిద్ధయః ।
కచ్చిదాస్తే సుఖం రామో భగవాన్ సాత్వతాం ప్రభుః ॥
శత్రుజిత్తు మొదలగు యాదవవీరులు కుశలమేనా? యాదవప్రభువు, పూజనీయుడు అగు బలరాముడు క్షేమమేనా?
ప్రద్యుమ్నస్సర్వవృష్ణీనాం సుఖమాస్తే మహారథః ।
గంభీరరయో నిరుద్దో వర్ధతే భగవానుత ॥
వృష్టివంశస్థులందరిలో గొప్ప రథికుడగు ప్రద్యుమ్నుడు కులాసా యేనా? యుద్ధములో గొప్ప వేగమును ప్రదర్శించే పూజనీయుడగు అని రుద్ధుడు ఆనందముగా నున్నాడా?
సుషేణశ్చారుదేష్ణశ్చ సొంబో జాంబవతీసుతః ।
అన్యే చ కార్ష్ణీప్రవరాస్సపుత్రా ఋషభాదయః ॥
తథైవానుచరాశ్శారేశుతదేవోద్ధవాదయః ।
సునందనందశీర్షణ్యా యే చాన్యే సాత్వతర్షభాః ॥
అపీ స్వస్త్యాసతే సర్వే రామకృష్ణభుజాశ్రయాః ।
అపి స్మరంతి కుశలమస్మాకం బద్దసౌహృదాః ॥
సుషేణుడు, చారుదేష్ణుడు, జాంబవతియొక్క పుత్రుడగు సాంబుడు, ఋషభుడు మొదలగు శ్రీకృష్ణపుత్రులలో ప్రముఖమైనవారు, వారి సంతానము, శ్రీకృష్ణుని అనుచరులగు శ్రుతదేవుడు ఉద్దవుడు మొదలగు వారు, సునందుడు నందుడు మొదలగు యాదవప్రముఖులు, బలరామశ్రీ కృష్ణుల భుజబలమును ఆశ్రయించుకొని ఉండే అందరు కులాసాగా నున్నారా? వారికి మనయందు ప్రేమ మెండు. మన క్షేమమును వారు అర యుచున్నారా?
భగవానపి గోవిందో బ్రహ్మణ్యో భక్తవత్సలః ।
కచ్చిత్పురే సుధర్మాయాం సుఖమాస్తే సుహృద్వృతః ॥
బ్రహ్మవేత్తలయందు, భక్తులయందు ప్రీతిగల శ్రీకృష్ణభగవానుడు కూడా ద్వారకానగరమునందు సుధర్మ అనే రాజసభలో మిత్రులతో గూడి సుఖముగా నున్నాడా?
మంగలాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ ।
ఆస్తే యదుకులాంభోధావాద్యో నంతసఖః పుమాన్॥
అనంతుడు (బలరాముడు) తోడుగా గల శ్రీమన్నారాయణుడు లోకముల మంగళమును, క్షేమమును మరియు సమృద్ధిని సంపాదించు టకై క్షీరసముద్రమునుండి యదువంశమనే సముద్రములోనికి శ్రీకృష్ణరూపములో అవతరించి యున్నాడు.
యద్భాహుదండగుపాయాం స్వపుర్యాం యదవో ర్చితాః ।
క్రీడంతి పరమానందం మహాపౌరుషికా ఇవ ॥
శ్రీకృష్ణుని దృఢమగు బాహువులచే రక్షించబడే ద్వారకానగరము నందు నివసించే యాదవులు సర్వలోకసమ్మాన్యులై శ్రీమహావిష్ణువు యొక్క పార్షదుల వలె మహానందముతో విహరించుచున్నారు.
యత్పాదశుశ్రూషణముఖ్యకర్మణా ।
సత్యాదయో ద్వ్యష్టసహస్రయోషితః ।
నిర్జిత్య సంఖ్యే త్రిదశాంసదాశిషో
హరంతి వజ్రాయుధవల్లభోచితాః ॥
సత్యభామ మొదలగు పదునార వేల యువతులు కేవలము ఆయన పాదపద్మముల సేవ మాత్రమే ప్రముఖకర్తవ్యముగా గలవారై, ఆ బలముచే యుద్దమునందు దేవతలను జయించి, ఇంద్రుని ప్రియురాలగు శచీదేవి అనుభవించ దగిన పారిజాతము మొదలైన దేవభోగములను తమ స్వంతము చేసుకొనుచున్నారు.
యద్భాహుదండాభ్యుదయానుజీవినో
యదుప్రవీరా హ్యకుతోభయా ముహుః ।
అధిక్రమంత్యంఘిభిరాహృతాం బలాత్
సభాం సుధర్మాం సురసత్తమోచితామ్ ॥
శ్రీకృష్ణుని దృఢమగు బాహువుల ప్రభావమును ఆశ్రయించుకొని జీవించే యాదవవీరులు దేనికీ భయపడని వారై, ఇంద్రుడు మొదలగు లోక పాలకులు కూర్చుండ దగినది, బలాత్కారముగా తీసుకు రాబడినది అగు సుధర్మ అనే సభలో మామూలుగా ఇటునటు నడచు చుందురు.
కచ్చితే నామయం తాత భ్రష్టతేజా విభాసి మే ।
అలబ్దమానో వజ్ఞాతః కిం వా తాత చిరోషితః ॥
వత్సా! నీవు కుశలమేనా? నాకు నీవు తేజస్సు తగ్గినవాని వలె కానవచ్చుచున్నావు. తమ్ముడూ! అచట నీవు చిరకాలము ఉండుటచే, వారు నిన్ను ఆదరించక పోగా, పైగా అవమానించినారా యేమి?
కచ్చిన్నాభిహతో భావైశ్శబ్దాదిభిరమంగలైః ।
న దత్తముక్తమర్థిభ్య ఆశయా యత్ప్రతిశ్రుతమ్ ॥
ఎవరైనా నిన్ను ప్రేమ కరువైన అమంగళకరమగు పదజాలముతో దుఃఖ పెట్టినారా యేమి? లేక, నీవు యాచకులకు ఇచ్చెదనని మాట ఇచ్చి, తరువాత ఈయకుంటివా?
కచ్చిత్త్వం బ్రాహ్మణం బాలం గాం వృద్ధం రోగిణం స్త్రీయమ్ ।
శరణోపసృతం సత్త్వం నాత్యాక్షీః శరణప్రదః ॥
శరణునిచ్చే నీవు శరణు జొచ్చిన బ్రాహ్మణుని, బాలకుని, గోవు ను, వృద్ధుని, రోగగ్రస్తుని, స్త్రీని, లేక ఏదేని ప్రాణిని విడిచి పెట్టలేదు గదా?
కచ్చిత్త్వం నాగమోకగమ్యాం గమ్యాం వాకసత్కృతాం స్త్రీయమ్ ।
పరాజితో వాథ భవాన్నోత్తమైర్నాసమైః పథి ॥
నీవు పొందకూడని స్త్రీని పొందితివా యేమి? లేక, పొందదగినదే అయిననూ అమర్యాదతో ప్రవర్తించితివా యేమి? లేక, దారిలో నీతో సమా నమైనవారు గాని, నీకంటే తక్కువ వారు గాని, నిన్ను పరాభవించినారా?
అపి స్విత్పర్యభుంక్లౌస్త్వం సంభోజ్యాన్ వృద్ధబాలకాన్ ।
జుగుప్సితం కర్మ కించిత్కృతవాన్న యదక్షమమ్ ॥
భోజనమునీయదగిన వృద్ధులను గాని, బాలకులను గాని విడిచిపెట్టి నీవు భుజించితివా యేమి? లేక, చేయదగని నిందాయోగ్యమగు ఏదేని కర్మను చేసినావా?
కచ్చిత్ప్రేష్ఠతమేనాథ హృదయేనాత్మబంధునా ।
శూన్యో స్మీ రహితో నిత్యం మన్యసే తేన్యథా న రుక్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధేచతుర్దశోఽధ్యాయః ॥
మిక్కిలి ప్రియతముడు, అత్మబంధువు, హృదయము వంటిపోడు అగు శ్రీకృష్ణుడు సర్వకాలములలో నీ వద్ద లేడు గనుక, ఆ కారణముగా మానసికవ్యథను అనుభవించుచున్నావా యేమి? అట్లు గానిచో, నీ మనో వ్యథకు కారణమేమియు లేదు.
శ్రీమద్భాగవతములోని ప్రథమస్కంధములో పదునాల్గవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 14 of the Bhāgavata Mahā Purana is as follows:
As time passes, King Yudhishtira observes frightening omens in the sky, on the earth, and in the bodies of living beings, signaling the arrival of the dark age of Kali and portending the departure of Lord Kṛshṇa from the mortal realm. Anxious for news of the Lord and his brother Arjuna who had gone to Dvārakā, Yudhishtira expresses his deep forebodings to Bhīma just as Arjuna returns, pale, tearful, and heartbroken, devoid of his usual radiance.