భాగవత మహా పురాణము
5 - పంచమోఽధ్యాయః
సూత ఉవాచ ।
అథ తం సుఖమాసీన ఉపాసీనం బృహచ్ఛ్రవాః ।
దేవర్షిః ప్రాహ విప్రర్షిం వీణాపాణిస్స్మయన్నివ ॥
సూతుడు ఇట్లు పలికెను: తరువాత వీణను చేతిలో ధరించియున్న గొప్ప కీర్తిగల దేవర్షియగు నారదుడు సుఖముగా కూర్చున్నవాడై, తనకు దగ్గరగా కూర్చునియున్న వ్యాసమహర్షిని ఉద్దేశించి చిరునవ్వుతో నిట్లనెను.
నారద ఉవాచ ।
పారాశర్య మహాభాగ భవతః కచ్చిదాత్మనా ।
పరితుష్యతి శారీర ఆత్మా మానస ఏవ వా ॥
నారదమహర్షి ఇట్లు పలికెను: ఓ పరాశరపుత్రా! వ్యాసా! మహాత్మా! నీవు శరీరముతో తాదాత్మ్యమును పొందినప్పుడు అది, మన స్సుతో అటులే అయినప్పుడు అది, అన్ని విధములుగా సంతోషమును కలిగించుచున్నవా?
జిజ్ఞాసితం సుసంపన్నమపి తే మహదద్బుతమ్ ।
కృతవాన్ భారతం యస్త్వం సర్వార్థపరిబృంహితమ్ ॥
నీవు తెలియగోరిన ధర్మము మొదలగు విషయములను చక్కగా తెలియుట మాత్రమే గాక అనుష్ఠించితివి. నీవు ధర్మము మొదలగు సమస్త విషయములతో పరిపూర్ణమైన ఆశ్చర్యజనకమగు మహాభారతమును రచించితివి.
జిజ్ఞాసితమధీతం చ బ్రహ్మ యత్తత్సనాతనమ్ ।
అథాపి శోచస్యాత్మానమకృతార్థ ఇవ ప్రభో ॥
నీవు సనాతనమగు బ్రహ్మతత్త్వమును విచారించి, దానిని పొందితి వి. అయిననూ కృతార్థుడు కానివాడు వలె నీ గురించి నీవు శోకించుచున్నావు. (కారణమేమి?)
వ్యాస ఉవాచ ।
అస్త్యేవ మే సర్వమిదం త్యయోక్తం
తథాపి నాత్మా పరితుష్యతే మే ।
తన్మూలమవ్యక్తమగాధబోధం
పృచ్ఛామ హే త్వాత్మభవాత్మభూతమ్ ॥
వ్యాసుడు ఇట్లు పలికెను: ఓ బ్రహ్మపుత్రుడవగు నారదా! నీవు చెప్పినది అంతా నాకు నిశ్చయముగా గలదు. కాని, నా హృదయములో సంతోషము ఉదయించుట లేదు. దీనికి గల కారణము నాకు తెలియకున్న ది. అతిగంభీరమగు జ్ఞానము గల నిన్ను అట్టి కారణమును గురించి నేను ప్రశ్నించుచున్నాను.
స వైభవాన్ వేద సమస్తగుహ్యముపాసితో యత్పురుషః పురాణః ।
పరావరేశో మన సైవ విశ్వం సృజత్యవత్యత్తి గుణైరసంగః ॥
సత్త్వరజస్తమోగుణముల ద్వారా జగత్తును సృష్టించి పాలించి సంహరించిననూ అసంగుడుగా నుండువాడు, కార్యమగు జగత్తును కారణ మగు ప్రకృతిని నియంత్రించువాడు, పురాణపురుషుడు అగు పరమేశ్వరుని నీవు ఉపాసించినావు. కావున, నీకు రహస్యములన్నియు తెలియును.
త్వం పర్యటన్నర ఇవ త్రిలోకీ-
మంతశ్చరో వాయురిపొత్మసాక్షీ ।
పరావరే బ్రహ్మణి ధర్మతో ప్రతైః
స్నాతస్య మే న్యూనమలం విచక్ష్వ ॥
నీవు సూర్యుని వలె ముల్లోకములను సంచరించు వాడవు. నీవు యోగబలముచే వాయువువలె సర్వప్రాణుల లోపల సంచరించి, వారి మనోవృత్తులకు సాక్షివి అగుదువు. నేను పరబ్రహ్మవిషయములో జ్ఞాననిష్ట యందు, అపర (సగుణ) బ్రహ్మవిషయములో వ్రతానుష్ఠానము చేత నిష్ణా తుడనైనాను (లేదా, పరంబ్రహ్మవిషయములో కర్మయోగజ్ఞానయోగాను. ష్టానముల వలన, శబ్దబ్రహ్మ అనగా వేదము విషయములో స్వాధ్యాయాదీ వ్రతములచేత నిష్ణాతుడనైనాను). అయిననూ, నాయందు అతిశయించిన లోటు తోచుచున్నది. నీవు దీని గురించి చెప్పుము.
నారద ఉవాచ ।
భవత్వానుదితప్రాయం యశో భగవతోమలమ్ ।
యేనైజాసౌ న తుష్యేత మన్యే తద్దర్శనం ఖిలమ్ ॥
నారదుడిట్లు పలికేను: భగవంతుని పవిత్రకీర్తిని నీవు ఇంచుమించు వర్ణించ లేదనియే చెప్పవచ్చును. ఏ జ్ఞానముచే భగవంతుడు సంతోషించ డో, అట్టి జ్ఞానము లోటు గలదియేనని నేను తలచుచున్నాను.
యథా ధర్మాదాయశ్చార్థా మునివర్యానుకీర్తితాః ।
న తథా వాసుదేవస్య మహిమా హ్యనువర్జితః ॥
ఓ మహర్షీ! నీవు ధర్మము మొదలగు పురుషార్థములను ఏ విధ ముగా వర్ణించితివో, అదే విధముగా వాసుదేవుని మహిమను వర్ణించలేదు.
న యద్వచశ్చిత్రపదం హరేర్యశో
జగత్పవిత్రం ప్రగృణీత కర్హిచిత్ ।
తద్వాయసం తీర్థముశంతి మానసా
న యత్ర హంసా నిరమంత్యుశిక్క్షయాః ॥
ఏ వాక్కు రస-అలంకారాదులతో కూడినదే అయిననూ జగత్తును పవిత్రము చేయు శ్రీహరియొక్క కీర్తిని నుడువదో, అది కాకులవంటి భోగ లాలసులకు భోగస్థానము వంటిదిగనే (లేదా, కాకులకు ఉచ్చిష్టమును వేసే అపవిత్రస్థానము వంటిదిగనే) పరిగణించ బడును. సత్త్వగుణప్రధానమగు మనస్సును కలిగి బ్రహ్మయందు నిష్ఠగల యతులు దానియందు సుత రాము రమించరు (మానససరోవరములో రమించే హంసలు విచిత్రము లగు ఉచ్ఛిష్టభోజ్యములున్ననూ కాకుల గుంటలో రమించవు).
తద్వాగ్విసర్గో జనతాఘవిప్లవో
యస్మిన్ ప్రతి శ్లోకమబద్ధవత్యపి ।
నామాన్యనంతస్య యశోంకితాని యత్
శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః ॥
కవితారూపమగు వొక్కుల ప్రయోగమునందు అపశబ్దములు ఉన్ననూ ప్రతిశ్లోకమునందు అనంతుడగు శ్రీహరియొక్క కీర్తిని గుర్తు చేసే నామములు ఉన్నచో, అట్టి కవిత జనుల పాపములను పోగొట్టును. ఆ నామములను సాధుపురుషులు ఇతరులు చెప్పినచో, వినెదరు; వినే వారున్నచో, చెప్పెదరు; లేదా, స్వయముగా గానము చేయుదురు.
నైష్కర్మ్యమప్యచ్యుతభావవర్జితం
న శోభతే జ్ఞానమలం నిరంజనమ్ ।
కుతః పునశ్శశ్వదభద్రమీశ్వరే
న చార్పితం కర్మ యదప్యకారణమ్ ॥
కర్మసంబంధము లేని బ్రహ్మయందు నిష్ఠను కలిగియుండుట అనే జీవన్ముక్తికి సాధనమగు నిర్మలమైన జ్ఞానము కూడా అచ్యుతుని యందు భక్తి లేనిచో అంతగా శోభిల్లదు. నిరంతరమగు సంసారమునకు హేతువు అగు కామ్యకర్మను గురించి గాని, ఈశ్వరునకు అర్పించబడని నిత్యకర్మను గురించి గాని ఇక చెప్పునదేమున్నది?
అథో మహాభాగ భవానమోఘదృక్
శుచిశ్రవాస్సత్యరతో ధృతవ్రతః ।
ఉరుక్రమస్యాభిబంధముక్తయే
సమాధినానుస్మర తద్విచేష్టితమ్ ॥
ఓ మహాత్మా! ఈ కారణము వలన, యథార్థమగు బుద్ధి, శుద్ధమగు కీర్తి, సత్యమునందు ప్రీతి మరియు దృఢమగు వ్రతము గల నీవు సమస్తం ధములనుండి విముక్తి కొరకై అనంతశక్తిసంపన్నుడగు శ్రీహరియొక్క ప్రసి ద్దమైన వివిధములగు లీలలను స్మరించుము.
తత్వోన్యథా కించన యద్వివక్షతః
పృథగ్దృశస్తత్కృతరూపనామభిః ।
న కుత్రచిత్క్వాపి చ దుఃస్థితా మతిః
లభేత వాతాహతనౌరివాస్పదమ్ ॥
దానికంటే భిన్నముగా ఏదో ఒకదానిని చెప్పగోరే భేదదృష్టి గల వ్యక్తికి ఆ పరమేశ్వరునిచే సృష్టించబడిన (లేదా, శ్రీహరి లీలలకంటే భిన్న మగు విషయమును చెప్పవలెననే కోరికచే ముందుకు వచ్చిన) నామరూప ములచే స్థిరత్వమును కోల్పోయిన బుద్ది, పెద్ద గాలిచే విసిరి కొట్టబడిన నౌక వలె, ఏ కాలమునందైననూ ఏ విషయమునందైననూ స్థిరముగా నిల బడదు.
జుగుప్సితం ధర్మకృతేనుశాసతః
స్వభావరక్తస్య మహాన్వ్యతిక్రమః ।
యద్వాక్యతో ధర్మ ఇతీతరః స్థితో
న మన్యతే తస్య నివారణం జనః ॥
మానవులు స్వభావము చేతనే విషయభోగములయందు అనురాగమును కలిగియుందురు. నీవు వారికి ధర్మము పేరిట కామ్యకర్మలను బోధించుట చాల అన్యాయము. అజ్ఞానియగు జనుడు నీ వాక్యము వలన కామ్య కర్మను ఇదియే ధర్మమని గట్టిగా పట్టుకొని, కామ్యకర్మలను వారించే వాక్యములను యథార్థబుద్ధితో స్వీకరించుట లేదు.
విచక్షస్యార్హతి వేదితుం విభో-
రనంతపారస్య నివృత్తితస్సుఖమ్ ।
ప్రవర్తమానస్య గుణైరనాత్మనః
తతో భవాన్ దర్శయ చేష్టితం విభో ॥
విద్వాంసుడు సర్వకర్మసన్న్యాసపూర్వకమగు జ్ఞాననిష్ఠ వలన దేశ కాలపరిచ్చేదరహితుడు, సర్వవ్యాపకుడు అగు పరమేశ్వరుని ఆనందఘన స్వరూపమును తెలియగల్గును. ఓ ప్రభూ! కావున, నీవు దేహాదులయందు అభిమానము గలవాడై సత్త్వరజస్తమోగుణములచే ఆడించబడుచున్న మానవునకు ఆ పరమేశ్వరుని లీలలను నిరూపించుము.
త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేః
భజన్నపక్వోథ పతేత్తతో యది ।
యత్ర క్వ వ్వాభద్రమభూదముష్య కిం
కో వార్థ ఆస్తోభజతాం స్వధర్మతః ॥
తన ధర్మమును విడిచి పెట్టి శ్రీహరియొక్క పాదపద్మములను సేవించువాడు భక్తిలో పరిపక్వతను పొందక మునుపే ఆ భజనమునుండి జారిపోయినా, లేదా మరణించినా, వానికి తరువాతి జన్మ ఏదైనా దాని యందు అమంగళము కలుగునా యేమి? (కలుగదు). హరిని భజించని వారు స్వధర్మము వలన పొందే ప్రయోజనమేమి గలదు? (ఏమియు లేదు).
తస్యైవ హేతోః ప్రయతేత కోవిదో
న లభ్యతే యదమతాముపర్యధః ।
తల్లభ్యతే దుఃఖవదన్యతస్సుఖం
కాలేన సర్వత్ర గభీరరంహసా ॥
బుద్ధిమంతుడగు మానవుడు శ్రీహరిపాద సేవ కొరకు మాత్రమే ప్రయత్నించవలేను. పుణ్యప్రభావముచే పుణ్యలోకములను పొంది ఆ - పుణ్యము ఖర్చు కాగానే క్రిందకు జారి, ఈ విధముగా పైకి క్రిందకు తీరు గాడు జీవులకు ఆ భాగ్యము లభించదు. బుద్ధికి అందని వేగముగల కాల ముయొక్క ప్రభావముచే జీవుడు ఎక్కడ ఉన్ననూ ప్రారబ్ధకర్మ వలన దుఃఖము వచ్చినట్లుగనే విషయసుఖము కూడ లభించుచునే యుండును.
న వై జనో జాతు కథంచనావ్రజేత్
ముకుంద సేవ్యన్యవదంగ సంసృతిమ్ ।
స్మరన్ముకుందాంఘ్యుపగూహనం పునః
విహాతుమిచ్ఛేన్న రసగ్రహో యతః ॥
ఓయీ వ్యాసా!, శ్రీహరిని సేవించు జనుడు భక్తివిహీనుని వలె ఏ నిశ్చయము. ఏలయనగా, ఆతడు రసగ్రాహి. ఆతడు ముకుందుని పాద ముల ఆలింగనమును స్మరిస్తూ, మరల హరిభజనమును విడిచి పెట్టుటకు అభిలషించడు.
ఇదం హి విశ్వం భగవానివేతరో
యతో జగతస్థాననిరోధసంభవాః ।
తద్ది స్వయం వేద భవాంస్తథాపి వై
ప్రాదేశమాత్రం భవతః ప్రదర్శితమ్ ॥
ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములు భగవానుని వలన కలుగు చున్నవి. కావున, ఈ జగత్తు గాని, జీవుడు గాని, భగవానుడు కంటే భిన్న ముగా లేరు. కాని, భగవానుడు వాటికంటే విలక్షణముగా నున్నాడు. ఈ విషయమును నీవు స్వయముగా యెరుగుదువు. అయిననూ, నేను ఒక అంశమును మాత్రమే నీకు నిరూపించితిని.
త్వమాత్మనాత్మానమవేహ్యమోఘదృక్
పరస్య పుంసః పరమాత్మనః కలామ్ ।
అజం ప్రజాతం జగతశ్శివాయ తత్
మహానుభావాభ్యుదయ్యోధిగణ్యతామ్ ॥
అమోఘమగు జ్ఞానము గల నీవు పుట్టుక లేనివాడవే అయిననూ, పురుషోత్తమభగవానునియొక్క అంశావతారమవై జగత్తుయొక్క కల్యా ణము కొరకు జన్మించినవాడవని స్వయముగా తెలుసుకొనుము. అందువ లన, మహామహిమాన్వితుడగు శ్రీహరియొక్క పరాక్రమమును అధిక ముగా నిరూపించుము.
ఇదం హి పుంసక్తపసః శ్రుతస్య వా
స్వీష్టస్య సూక్తస్య చ బుద్ధిదత్తయోః ।
అచ్యుత్వోర్థః కవిభిర్నిరూపితో
యదుత్తమశ్లోకగుణానువర్ణనమ్ ॥
మానవుని తపస్సునకు, అధ్యయనమునకు, చక్కగా అనుష్ఠించబ డిన యజ్ఞమునకు, మంచి మాటకు, జ్ఞానమునకు మరియు దానమునకు నిత్యమగు ఫలము (సార్థకత) పుణ్యకీర్తియగు పరమేశ్వరుని గుణముల వర్ణ నయేనని విద్వాంసులు చెప్పుచున్నారు.
అహం పురాతీతభవేభవం మునే
దాస్యాస్తు కన్యాశ్చన వేదవాదినామ్ ।
నిరూపితో బాలక ఏవ యోగినాం
శుశ్రూషణే ప్రావృషి నిర్వివిక్షతామ్ ॥
ఓ మహర్షీ! పూర్వకల్పమునందు గడచిన జన్మలో నేను ఒకానొక దాసియొక్క పుత్రుడను. నేను బాలుడుగ నుండగనే వర్షాకాలములో ఒక చోట మకాము చేయగోరిన వేదవేత్తలగు యోగుల పరిచర్యయందు నియో గించ బడితిని.
తే మయ్యపేతాఖిలచాపలేర్బకే
దాంతేకధృతక్రీడన కేనువర్తిని ।
చక్రుః కృపాం యద్యపీ తుల్యదర్శనాః
శుశ్రూషమాణే మునయోల్పభాషిణి ॥
నేను ఏ విధముగ నైననూ అల్లరి చేయకుండగా, ఆటబొమ్మల గురించి పట్టించుకోకుండగా, తక్కువగా మాటలాడుతూ, అనుశాసనముతో వారికి అనుకూలుడనై సేవను చేసితిని. వారు అందరియందు సమదృష్టి గలవారే అయిననూ, నాయందు దయను చూపిరి.
ఉచ్చిష్టలేపాననుమోదితో ద్విజైః
సకృత్ స్మ భుంజే తదపాస్తకిల్బిషః ।
ఏవం ప్రవృత్తస్య విశుద్ధచేతసః
తద్ధర్మ ఏవాత్మరుచిః ప్రజాయతే ॥
అ మహర్షుల అనుమతిని పొంది పాత్రలో మిగిలిన ఆహారమును నేను ఒకేసారి భుజించగా, నా పాపములన్నియు తొలగిపోయినవి. ఈ విధ ముగా వారికి సేవను చేయుటచే నా అంతఃకరణము శుద్దమై, నా మనస్సు నకు వారు చేసే ధర్మాచరణమునందు ప్రీతి కలిగేను.
తత్రాన్వహం కృష్ణకథాః ప్రగాయతాం
అనుగ్రహేణాశృణవం మనోహరాః ।
తాః శ్రద్దయా మేకనుపదం విశృణ్వతః
ప్రియశ్రవస్యంగ మమాభవద్రుచిః ॥
ఓ వ్యాసమహర్షీ! అచట వారు ప్రతిదినము మనోహరములగు శ్రీకృష్ణగాథలను గానము చేయుచుండగా, నేను వారి అనుగ్రహముచే వాటిని సహజశ్రద్దతో ప్రతి పదము విశేషముగా వింటిని. దాని వలన, నాకు ప్రీతికరమగు కీర్తిగల శ్రీకృష్ణునియందు ప్రీతి కలిగెను.
తస్మింస్తదా లబ్ధరుచేర్మహామునే
ప్రియశ్రవస్యస్థలితా మతిర్మమ ।
యయాహమేతత్సదసత్స్వమాయయా
పశ్యే మయి బ్రహ్మణి కల్పితం పరే ॥
ఓ మహర్షీ! అప్పుడు ప్రీతికరమగు కీర్తి గల భగవానునియందు నాకు భక్తి కలిగి మనస్సు నిశ్చలమయ్యెను. అట్టి మనస్సుతో నేను ఈ స్థూలసూక్ష్మశరీరములను మరియు కార్యకారణరూపమగు జగత్తును పర బ్రహ్మస్వరూపుడనగు నాయందు అవిద్యచే కల్పితమైనదనే సత్యమును కనుగొంటిని.
ఇత్థం శరతావృషికావృతూ హరేః
విశృణ్వతో మ్యేనుసవం యశోమలమ్ ।
సంకీర్త్యమానం మునిభిర్మహాత్మభిః
భక్తిః ప్రవృత్తాత్మరజస్తమోపహా ॥
ఈ విధముగా శరత్ మరియు వర్షా అనే రెండు ఋతువుల (గదు మహాత్ములగు ఆ మునులచే చక్కగా గానము చేయబడుచున్న శ్రీనారియొక్క నిర్మలమైన కీర్తిని మూడు పూటలయందు వినుచున్న నాకు మనస్సునందలి రజస్తమోగుణములను పోగొట్టే భక్తి ఉదయించెను.
తస్యైవం మేకనురక్తస్య ప్రశ్రితస్య హతైనసః ।
శ్రద్దధానస్య బాలస్య దాంతస్యానుచరస్య చ ॥
జ్ఞానం గుహ్యతమం యత్తత్సాక్షాద్భగవతోదితమ్ ।
అన్వవోచన్ గమిష్యంతః కృపయా దీనవత్సలాః ॥
ఈ విధముగా అనురాగము, వినయము, శ్రద్ద మరియు ఇంద్రియ నిగ్రహము కలిగి, నశించిన పాపములు గలవాడనై, అనుకూలముగా సేవను చేసిన బాలుడనగు నాకు, దీనులయందు ప్రేమగల ఆ మహర్షులు వెళ్లబోయే ముందు, సాక్షాత్తుగా భగవంతునిచే ఉపదేశించబడిన అత్యంత రహస్యమగు జ్ఞానము (భాగవత శాస్త్రము) ను ఉపదేశించిరి.
యేనైవాహం భగవతే వాసుదేవస్య వేధసః ।
మాయానుభావమవిదం యేన గచ్ఛంతి తత్పదమ్ ॥
సృష్టికర్తయగు వాసుదేవ భగవానుని మాయయొక్క ప్రభావ మును నేను ఆ ఉపదేశముచేత మాత్రమే తెలుసుకొంటిని. దానిని తెలిసిన వారు ఆ భగవానుని ధామమును పొందెదరు.
ఏతత్సంసూచితం బ్రహ్మంస్తాపత్రయచికిత్సతమ్ ।
యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితమ్ ॥
ఓ మహర్షీ! ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములనే మూడు విధముల తాపములకు సర్వేశ్వరుడు, పూర్ణస్వరూపుడు అగు భగవంతుని యందు కర్మను సమర్పించుటయే చికిత్స యనే ఈ విషయమును నేను నీకు చక్కగా సూచించితిని.
ఆమయో యశ్చ భూతానాం జాయతే యేన సువ్రత ।
తదేవ హ్యామయం ద్రవ్యం న పునాతి చికిత్సతమ్ ॥
ఓ గొప్ప ప్రతనిష్ట గలవాడా! ఒక పదార్థము వలన ఒక రోగము వచ్చిననూ, అదే పదార్థమును చికిత్సాపద్దతిలో ఇతరద్రవ్యములతో కలిపి ఇచ్చినచో, ఆ రోగము తగ్గకుండునా? తప్పక తగ్గును.
ఏవం నృణాం క్రియాయోగాస్సర్వే సంసృతి హేతవః ।
త ఏవాత్మవినాశాయ కల్పంతే కల్పితాః పరే ॥
అదే విధముగా, మానవునకు క్రియాసంబంధములన్నియు సంసా రకారణములే అయిననూ, పరమేశ్వరునియందు సమర్పించినచో, అవే కర్మలు తమ నాశము (అనగా కర్మబంధ విముక్తి) కొరకు సమర్థములగుచున్నవి.
యదత్ర క్రియతే కర్మ భగవత్పరితోషణమ్ ।
జ్ఞానం యత్తదధీనం హి భక్తియోగసమన్వితమ్ ॥
ఈ లోకములో భగవంతుని సంతోషము కొరకు చేయబడే కర్మ భక్తియోగముతో కూడిన జ్ఞానము ఉదయించుటకు హేతువు అగుచున్నది.
కుర్వాణా యత్ర కర్మాణి భగవచ్చిక్షయాసకృత్ ।
గృణాంతి గుణనామాని కృష్ణస్యానుస్మరంతి చ ॥
భగవంతుని ఆజ్ఞానుసారముగా కర్మలను చేయు జనులు శ్రీకృష్ణుని గుణములను, నామములను పదే పదే కీర్తించి స్మరించుచుందురు.
నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ।
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమస్సంకర్షణాయ చ ॥
భగవంతుడగు వాసుదేవుని కొరకు, ప్రద్యుమ్న (శ్రీకృష్ణుని పుత్రు డు), అనిరుద్ధ (మనుమడు), సంకర్షణుల (సోదరుడు) కొరకు మనస్సులో నమస్కారమును భావన చేయుచున్నాము. లేదా, ఆ నామములు గల నాలుగు వ్యూహములకు నమస్కారము. లేదా, సర్వజగన్నివాసుడు, ప్రకాశస్వరూపుడు, తేజస్స్వరూపుడు, స్వతంత్రుడు, ప్రేమస్వరూపుడై భక్తు లను తన వద్దకు ఆకర్షించువాడు అగు భగవానునకు మనస్సులో నమస్కా రమును భాపన చేయుచున్నాము.
ఇతి మూర్త్యభిధానేన మంత్రమూర్తిమమూర్తీకమ్ ।
యజతే యజ్ఞపురుషం స సమ్యగ్దర్శనః పుమాన్ ॥
ఈ విధముగా మంత్రమే స్వరూపముగా గలవాడు, వాస్తవముగా ఒక విశిష్టమగు రూపము లేనివాడు, యజ్ఞస్వరూపుడు అగు భగవానుని మూర్తివాచకమగు మంత్రముతో ఆరాధించు వ్యక్తి పూర్ణమగు (బ్రహ్మ) జ్ఞా సమును పొందును.
ఇమం స్వనిగమం బ్రహ్మన్నవేత్య మదనుష్ఠితమ్ ।
అదాన్మే జ్ఞానమైశ్వర్యం స్వస్మిన్ భావం చ కేశవః ॥
ఓ మహర్షీ! ఈ విధముగా నేను భగవానుని ఉపదేశమును అను ష్ఠించుటను గాంచి, ఆ శ్రీహరి నాకు జ్ఞానమును, ఐశ్వర్యమును మరియు తనయందలి భక్తిని ఇచ్చెను.
త్వమప్యదభ్రశ్రుత విశ్రుతం విభోః
సమాప్యతే యేన విదాం బుభుత్సితమ్ ।
ప్రఖ్యాహి దుఃఖైర్ముహురర్దితానాం
యత్ క్లేశనిర్వాణముశంతి నాన్యథా ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధే పంచమోఽధ్యాయః ॥
పూర్ణజ్ఞానము గల ఓ వ్యాసమహర్షీ! నీవు కూడ సర్వవ్యాపకుడగు పరమేశ్వరుని కీర్తిని వర్ణించుము. దాని వలన విద్వాంసుల జ్ఞానపిపాసన పూర్ణమగును. దుఃఖములచే పీడించబడే మనస్సు గల జనులకు దాని వలన ఆ దుఃఖములు ఉపశమించును. దుఃఖములు శాంతించుటకు మరి యొక ఉపాయము లేదు, నీవు వర్ణించనిచో, వారికి భగవత్కీర్తిని వినాలనే కోరిక కలిగే అవకాశము ఉండదు. వారు దానినుండి వంచితులగుదురు.
శ్రీమద్భాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో అయిదవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 5 of the Bhāgavata Mahā Purana is as follows:
The celestial sage Nārada gently instructs Vyāsadeva that his feelings of incompleteness stem from not having exclusively glorified the transcendental name, fame, forms, and pastimes of the Supreme Lord Kṛshṇa. Nārada explains that literature devoid of divine praise is like a place of pilgrimage for crows, whereas works describing the glories of the Supreme Person bring about a revolution in the impious lives of world civilization, and he shares his own previous life as the son of a maidservant who attained divine grace through association with self-realized devotees.