7 -  సప్తమోఽధ్యాయః

శౌనక ఉవాచ

నిర్గతే నారదే సూత భగవాన్ బాదరాయణః

శ్రుతవాంస్తదభిప్రేతం తతః కిమకరోద్విభుః

శౌనకుడు ఇట్లు పలికెను: ఓ సూతా! నారదుడు నిష్క్రమించిన తరువాత, సర్వసమర్థుడు మరియు పూజ్యుడు అగు వ్యాసమహర్షి ఆయన అభీష్టమును విన్నవాడై ఏమి చేసెను?

సూత ఉవాచ

బ్రహ్మనద్యాం సరస్వత్యామాశ్రమః పశ్చిమే తటే

శమ్యాప్రాస ఇతి ప్రోక్త ఋషీణాం సత్రవర్ధనః

సూతుడిట్లు పలికెను: బ్రహ్మ అధిష్టానదేవతగా గల సరస్వతీనది యొక్క పడమటి తీరమునందు శమ్యాప్రాస అనబడే ఆశ్రమము గలదు. అచట ఋషులు వేదోక్తకర్మలను నిరంతరముగా చేయుచుందురు.

తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బదరీషండమండితే

ఆసీనోఽప ఉపస్పృశ్య ప్రణిదధ్యౌ మనస్స్వయమ్

వ్యాసమహర్షి అచట బదరీవృక్షముల గుంపులతో శోభిల్లే తన ఆశ్ర మమునందు కూర్చుండి ఆచమనము చేసి, మనస్సును ఏకాగ్రము చేసేను.

భక్తియోగేన మనసి సమ్యక్ ప్రణిహిత్వేఽమలే

అపశ్యత్పురుషం పూర్వం మాయాం చ తదుపాశ్రయామ్

భక్తియోగముచే నిర్మలము మరియు ఏకాగ్రము అగు మనస్సు నందు వ్యాసమహర్షి ఆదిపురుషుడగు పరమేశ్వరుని మరియు ఆయనను ఆశ్రయించుకొని యున్న మాయాశక్తిని చూచెను.

యయా సంమోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకమ్

పరోఽపి మనుతేఽనర్థం తత్కృతం చాభిపద్యతే

జీవుడు స్వయముగా పరబ్రహ్మస్వరూపుడే అయిననూ, ఆ మాయచే పూర్తిగా మోహమును పొందినవాడై, తనను సత్త్వరజస్తమోగుణ స్వరూపునిగా భావించి, ఆ విధమగు అభిమానము వలన సంప్రాప్తమైన సంసారమనే అనర్థమును అనుభవించు చున్నాడు.

అనర్థోపశమం సాక్షాద్భక్తియోగమధోక్షజే

లోకస్యాజానతో విద్వాంశ్చక్రే సాత్వతసంహితామ్

సంసారమనే ఈ అనర్థమును తొలగించే సాక్షాత్సాధనము శ్రీహరి యందు ప్రయోగించబడిన భక్తియోగమని జ్ఞానియగు వ్యాసమహర్షి తెలు సుకొని, అజ్ఞానులగు మానవుల కొరకై శ్రీమద్భాగవతసంహితను రచించేను.

యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపూరుషే

భక్తిరుత్పద్యతే పుంసశ్శోకమోహభయాపహా

భాగవతమును వింటూ ఉండగానే మానవునకు పురుషోత్తముడగు శ్రీకృష్ణునియందు, భూతకాలసంబంధియగు శోకము, వర్తమానకాలీనమగు మోహము మరియు భవిష్యత్తును గురించిన భయములను పటాపం చలు చేసే భక్తి ఉదయించును.

స సంహితాం భాగవతీం కృత్వాఽనుక్రమ్య చాత్మజమ్

శుకమధ్యాపయామాస నివృత్తినిరతం మునిః

ఆ వ్యాసమహర్షి శ్రీమద్భాగవతసంహితను రచించి, మరల ఒక సారి దానిని పరిశీలించి, తరువాత తన పుత్రుడు, ఆత్మజ్ఞాననిష్ఠుడు అగు శుకమహర్షిచేత దానిని పఠింప జేసెను.

శౌనక ఉవాచ

స వై నివత్తినిరతస్సర్వత్రో పేక్షకో మునిః

కస్య వా బృహతీమేతామాత్మారామస్సమభ్యసత్

శౌనకమహర్షి ఇట్లు పలికేను: ఖచ్చితముగా నివృత్తిధర్మమునందు పరాయణుడు, సర్వమునందు అపేక్ష లేనివాడు, ఆత్మస్వరూపనిరతుడు నగు ఆ శుకమహర్షి ఏ ప్రయోజనమున పేక్షించి ఇంతటి పెద్ద గ్రంథమును అభ్యసించినాడు?

సూత ఉవాచ

ఆత్మారామాశ్చ మునయో నిర్గృoథా అప్యురుక్రమే

కుర్వంత్య హైతుకీం భక్తిమిత్థంభూతగుణో హరిః

సూతుడు ఇట్లు పలికెను: ఆత్మస్వరూపనిరతులగు మహర్షులు కూడా గ్రంథపఠనమునకు అతీతులే అయిననూ (అవిద్యారూపమగు హృదయగ్రంథులు నశించినవారే అయిననూ, లేదా అహంకారగ్రంథి లేనివారే అయిననూ) వామనరూపమును దాల్చి పెద్ద పెద్ద అడుగులతో బ్రహ్మాండమును కొలిచిన శ్రీహరియందు కారణరహితమగు భక్తిని చేసెదరు. శ్రీహరి గుణములయందు ఇట్టి సర్వాకర్షకమగు మాధుర్యము గలదు.

హరేర్గుణాక్షిప్తమతిర్బగవాన్ బాదరాయణిః

అధ్యగాన్మహదాఖ్యానం నిత్యం విష్ణుజనప్రియః

విష్ణుభక్తులయందు ప్రీతిగలవాడు, పూజ్యుడు, వ్యాసుని పుత్రుడు అగు శుకమహర్షి శ్రీహరియొక్క గుణములచే ఆకర్షించబడిన హృదయము గలవాడై ప్రతిదినము ఈ గొప్ప విశాలమగు భాగవతమును అధ్యయనము చేసెను.

పరీక్షితోఽథ రాజర్షేర్జన్మకర్మవిలాయనమ్

సంస్థాం చ పాండుపుత్రాణాం వక్ష్యే కృష్ణకథోదయమ్

ఈ పైన రాజర్షియగు పరీక్షిత్తుయొక్క పుట్టుక, ఆయనచేసిన ఘన కార్యములు, మరియు ఆయన ముక్తి లేక మృత్యువు అను విషయముల ను, పాండవుల స్వర్గారోహణమును గురించి శ్రీకృష్ణగాథ కలిసి వచ్చే విధ ముగా చెప్పెదను.

యదా మృధే కౌరవసృంజయానాం వీరేష్వథో వీరగతిం గతేషు వృకోదరావిద్ధగదాభిమర్శభగ్నోరుదండే ధృతరాష్ట్రపుత్రే

భర్తుః ప్రియం ద్రౌణితి స్మ పశ్యన్

కృష్ణాసుతానాం స్వపతాం శిరాంసి

ఉపాహారద్విప్రియమేవ తస్య తత్

జుగుప్సితం కర్మ విగర్హయంతి

కౌరవుల మరియు ధృష్టద్యుమ్నుడు సేనానాయకుడుగా గల పాండవుల సేనల వీరులు వీరస్వర్గమును పొందిరి. భీముని గదాఘాత ముచే తొడలు విరిగి దుర్యోధనుడు పడియుండెను. ఆ సమయములో ఇట్లు చేసినచో నా ప్రభువగు దుర్యోధనునకు ప్రియమగునని ఊహించిన అశ్వత్థామ నిద్రించుచున్న ద్రౌపదీపుత్రుల తలలను నరికి ఆతనికి బహూక రించెను. కాని, ఆ పని వలన దుర్యోధనుడు సంతోషపడనే లేదు. అట్టి నీచ మగు పనిని సర్వులు నిందించెదరు గదా!

మాతా శిశూనాం నిధనం సుతానాం

నిశమ్య ఘోరం పరితప్యమానా

తదారుదద్బాష్పకలాకులాక్షీ

తాం సాంత్వయన్నాహ కిరీటమాలీ

తన పుత్రుల ఘోరమగు మృతిని గురించి విని ద్రౌపది కన్నుల వెంబడి నీటిని గారుస్తూ పరితపించుచుండగా, ఆమెను ఓదారుస్తూ అర్జున డిట్లు పలికెను.

తదా శుచస్తే ప్రమృజామి భద్రే

యద్బృహ్మబంధోశ్శిర ఆతయినః

గాండీవముక్తైఃర్విశిఖైరుపాహరే

త్వాఽఽక్రమ్య యత్ స్నాస్యసి దగ్ధపుత్రా

ఓ కల్యాణీ! హంతకుడు, బ్రాహ్మణాధముడు అగు అశ్వత్థామ యొక్క తలను నా గాండీవమునుండి విడువబడిన వాడి బాణములతో నరికి నీకు బహూకరించి, కన్నీటిని తుడిచెదను. ఈ నీ పుత్రుల శవములను దహించిన తరువాత నీవు దానిని కాలితో తొక్కి స్నానమును చేయగలవు.

ఇతి ప్రియాం వల్గువిచిత్రజల్పైః

స సాంత్వయిత్వాఽచ్యుతమిత్రసూతః

అన్వాద్రవద్దంశిత ఉగ్రధన్వా

కపిధ్వజో గురుపుత్రం రథేన

ఈ విధముగా, శ్రీకృష్ణుడే మిత్రుడు మరియు సూతుడు అయిన వాడు, భయంకరమగు ధనస్సు గలవాడు, ధ్వజమునందు హనుమంతుడు చిహ్నముగా గలవాడు అగు ఆ అర్జునుడు రమ్యములగు విచిత్రవచనములతో ప్రియురాలగు ద్రౌపదిని ఓదార్చి, కవచమును ధరించి రథము పై ద్రోణపుత్రుడగు అశ్వత్థామను తరుముకుంటూ వెళ్లాను.

తమాపతంతం స విలక్ష్య దూరాత్

కుమారహోద్విగ్నమనా రథేన

పరాద్రవత్పృణపరీప్సురురాజ్యం

యావధ్గమం రుద్రభయాద్యథా కః

ద్రౌపదీపుత్రులను హతమార్చిన ఆ అశ్వత్థామ రథముపై వేగ ముగా తరుముకొని వచ్చుచున్న ఆ అర్జునుని దూరమునుండియే చూచి భయముతో వణకుచున్న హృదయము గలవాడై, ప్రాణములను కాపాడుకో నగోరి భూమిపై ఎంతవరకు పరుగెత్తగలడో అంతవరకు, రుద్రునకు భయ పడిన బ్రహ్మ (సూర్యుని) వలె పారిపోజొచ్చెను.

యదాఽశరణమాత్మానమైక్షత శ్రాంతవాజినమ్

అస్త్రం బ్రహ్మశిరో మేన ఆత్మత్రాణం ద్విజాత్మజః

ద్రోణపుత్రుడగు అశ్వత్థామయొక్క గుర్రములు అలసిపోయేను. ఆతనికి తనను రక్షించువారు ఎవ్వరూ కానరాలేదు. అపుడు ఆతడు బ్రహ్మా స్త్రము తనను రక్షించగలదని భావించెను.

అథోపస్పృశ్య సలిలం సందధే తత్సమాహితః

అజానన్నుపసంహారం ప్రాణకృచ్చృ ఉపస్థితే

తరువాత ఆ అశ్వత్థామ బ్రహ్మాస్త్రముయొక్క ఉపసంహారము తెలియక పోయిననూ, ప్రాణసంకటము వచ్చి పడినదని భావించి, ఆచమ నము చేసి ధ్యానమునందు ఆ అస్త్రమును సంధానము చేసెను.

తతః ప్రాదుష్కృతం తేజః ప్రచండం సర్వతోదిశమ్

ప్రాణాపదమభిప్రేక్ష్య విష్ణుం జిష్ణురువాచ హ

తరువాత ప్రాణాంతకమైన ఆ భయంకరమగు అస్తతేజస్సు దిక్కులన్నింటినీ వ్యాపిస్తూ ప్రకటము కాగా, అర్జునుడు శ్రీకృష్ణునితో నిట్లనెను.

అర్జున ఉవాచ

కృష్ణ కృష్ణ మహాభాగ భక్తానామభయంకర

త్వమేకో దహ్యమానానామపవర్గోఽసి సంసృతేః

అర్జునుడు ఇట్లు పలికెను: ఓ శ్రీకృష్ణా! మహాత్మా! సంసారములో బడి తపించు జనులకు ఆ సంసారమును నశింపజేయువాడవు నీవు ఒక్క డివే గలవు.

త్వమాద్యః పురుషస్సాక్షాదీశ్వరః ప్రకృతేః పరః

మాయాం వ్యుదస్య చిచ్ఛక్త్యా కైవల్యే స్థిత ఆత్మని

నీవు సర్వజగత్కారణమగు చేతనపరబ్రహ్మవు. ప్రకృతికి అతీతుడగు ఈశ్వరుడవు నీవే. నీవు చైతన్యశక్తిచే మాయను తిరస్కరించి అద్వితీయమగు స్వరూపమునందు స్థిరముగ నుండెదవు.

స ఏవ జీవలోకస్య మాయామోహితచేతసః

విధత్సే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాదిలక్షణమ్

అట్టి మాయాతీతుడవగు నీవు మాయచే మోహింప చేయబడిన జీవసమూహమునకు నీ ప్రభావముచే ధర్మము మొదలైన శ్రేయస్సాధనములను విధించుచున్నావు (ధర్మము, సంపద, విముక్తి మొదలగు కల్యాణ ములను అనుగ్రహించు చున్నావు).

తథాయం చావతారస్తే భువో భారజాహీర్షయా

స్వానాం చానన్యభావానామనుధ్యానాయ చాసకృత్

ఈ నీ అవతారము భూభారమును పోగొట్టుట కొరకు మరియు అన్యమునెరుంగని నీ ఏకాంతభక్తుల ధ్యానము కొరకు ఉద్దేశించ బడినది.

కిమిదం స్విత్కుతో వేతి దేవదేవ న వేద్మ్యహమ్

సర్వతోముఖమాయాతి తేజః పరమదారుణమ్

ఓ దేవదేవా! ఇది ఏమై ఉండును? ఎక్కడనుండి వచ్చుచున్నది? నాకేమియు తెలియకున్నది. మిక్కిలి భయంకరమగు తేజస్సు అన్ని వైపు లనుండియు చుట్టు ముట్టు చున్నది.

శ్రీభగవానువాచ

వేత్థేదం ద్రోణపుత్రస్య బ్రాహ్మమస్త్రం ప్రదర్శితమ్

నైవాసౌ వేద సంహారం ప్రాణబాధ ఉపస్థితే

శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: ఇది ప్రాణసంకటము రాగా ద్రోణపుత్రుడగు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము. ఆతనికి దీని ఉప సంహారము తెలియనే తెలియదు.

న హ్యస్యాన్యతమం కించిదస్తృo ప్రత్యవకర్శనమ్

జహ్యతేజ ఉన్నద్ధమస్త్రజ్ఞో హ్యస్తృతేజసా

దీనిని నివర్తింపజేసే మరియొక అస్త్రమేదియు లేదు. నీవు అస్త్రవేత్త వు. ఉత్కటమగు ఈ అస్త్రముయొక్క తేజస్సును బ్రహ్మాస్త్రతేజస్సుతో మాత్రమే శాంతింప జేయుము.

సూత ఉవాచ

శ్రుత్వా భగవతా ప్రోక్తం ఫాల్గునః పరవీరహా

స్పృష్ట్వాపస్తం పరిక్రమ్య బ్రాహ్మం బ్రాహ్మాయ సందధే

సూతుడు ఇట్లు పలికేను: శ్రీకృష్ణభగవానుని ఈ మాటను విని, శత్రువీరసంహారకుడగు అర్జునుడు ఆచమనము చేసి, ఆయనకు ప్రదక్షి ఇము చేసి, బ్రహ్మాస్త్రమును నివర్తింప జేయుటకై బ్రహ్మాస్త్రమును సంధానము చేసెను.

సంహత్యోన్యోన్యముభయోస్తేజసీ శరసంవృతే

ఆవృత్య రోదసీ ఖం చ వవృధాతేఽర్కవహ్నిపత

బాణములచే చుట్టువారబడియున్న ఆ రెండు అస్తముల తేజ స్సులు ఒకదానితో మరియొకటి ఢీకొట్టి, సూర్యుడు మరియు అగ్నివలె భూమిని, అంతరిక్షమును మరియు ద్యులోకమును వ్యాపించి వర్ధిల్లినవి.

దృష్ట్వాస్త్రతేజస్తు తయోస్త్రీంల్లోకాన్ ప్రదహన్మహత్

దహ్యమానాః ప్రజాస్సర్వాస్సాంవర్తకమమంత

ఆ అశ్వత్థామార్జునుల రెండు అస్త్రముల మహాతేజస్సు మూడు లోకములను తపింపజేయుచుండెను. వాటిచే తపింపజేయబడుచున్న జసులు ఆ తేజస్సులను చూచి ప్రలయకాలాగ్ని యని తలపోసిరి.

ప్రజోపప్లవమాలక్ష్య లోకవ్యతికరం చ తమ్

మతం చ వాసుదేవస్య సంజహారార్జునో ద్వయమ్

ఆ ప్రజావినోశమును, లోకోపద్రవమును చూచి, శ్రీకృష్ణభగవో సుని అభిమతమును గమనించి, అర్జునుడు ఆ రెండు అస్త్రములను ఉప సంహరించెను.

తత ఆసాద్య తరసా దారుణం గౌతమీసుతమ్

బబంధామర్షతామ్రాక్షః పశుం రశనయా యథా

తరువాత కోపముతో ఎరుపెక్కిన కన్నులు గల అర్జునుడు క్రూరు డగు కృపింయొక్క పుత్రుడైన అశ్వత్థామను వేగముగా పట్టుకొని, త్రాటితో పశువును నలె కట్టివేసెను.

శిబిరాయ నినీషంతం రజ్జ్వ బద్ధ్వా రిపుం బలాత్

ప్రాహార్జునం ప్రకుపితో భగవానంబుజేక్షణః

శత్రువగు అశ్వత్థామను త్రాటితో గట్టిగా కట్టి శిబిరము వద్దకు తీసు కొని వెళ్ల గోరుచున్న అర్జునుని ఉద్దేశించి పద్మములపంటి కన్నులు గల శ్రీకృష్ణ భగవానుడు మిక్కిలి కోపించినవాడై ఇట్లు పలికెను.

మైసం పార్దార్హసి త్రాతుం బ్రహ్మబంధుమిమం జహి

యోకపావనాగసస్సుప్తానవధీన్నిశి బాలకాన్

ఓ అర్జునా! వీనిని ప్రాణములతో విడువ దగదు. ఈ బ్రాహ్మణాధముని సంహరించుము. ఈతడు రాత్రియందు నిద్రించుచున్న నిరపరాధులగు పిల్లలను సంహరించినాడు.

మత్తం ప్రమత్తమున్మత్తం సుప్తం బాలం స్త్రీయం జడమ్

ప్రపన్నం విరథం భీతం న రిపుం హంతి ధర్మవిత్

నిషాలోనున్నవాడు, అజాగ్రత్తగా నున్నవాడు, పిచ్చి పట్టినవాడు, నించుచున్నవాడు, పిల్లవాడు, స్త్రీ, తనను రక్షించుకునే ఉద్యమమును చేపట్టని వాడు, శరణు జొచ్చినవాడు, రథము లేనివాడు, భయపడుతున్న వాడు 25గు శత్రువును ధర్మమునెరింగిన వీరుడు చంపడు.

తద్వధస్తస్య హి శ్రేయో యద్ధోషాద్యాత్యధః పుమాన్  

దయావిహీనుడగు ఏ దుష్టపురుషుడు తన ప్రాణములను ఇత రుల ప్రాణములతో పోషించుకొనునో, అట్టి వానిని సంహరించుట వానికే హితకరమగును. ఏలయనగా, వాడు జీవించినచో ఆ దోషము కొనసాగుట వలన మరింత అధోగతిని పొందును.

ప్రతిశ్రుతం చ భవతా పాంచాల్యై శృణ్వతో మమ

ఆహరిష్యే శిరస్తస్య యస్తే మానిని పుత్రహా

ఓ అభిమానవతీ! నీ పుత్రులను చంపిన వాని తలను తెచ్చెదనని నీవు నేను వినుచుండగా ద్రౌపదితో ప్రతిజ్ఞను కూడ చేసితివి.

తదసౌ వధ్యతాం పాప ఆతతాయ్యాత్మబంధుహా

భర్తుశ్చ విప్రియం వీర కృతవాన్ కులపాంసనః

ఓ వీరా! పాపాత్ముడు, నీ పుత్రులను చంపిన హంతకుడు, వంశ మునకు చేటు అగు ఈ అశ్వత్థామను సంహరించుము. వీడు తన ప్రభు వగు దుర్యోధనునకు కూడ విశేషమగు అప్రియమునాచరించినాడు.

సూత ఉవాచ

ఏవం పరీక్షతా ధర్మం పార్థః కృష్ణేన చోదితః

నైచ్ఛద్ధంతుం గురుసుతం యద్యప్యాత్మహనం మహాన్

సూతుడు ఇట్లు పలికెను: శ్రీకృష్ణుడు అర్జునుని ధర్మబుద్ధిని పరీక్షించగోరి ఈ విధముగా ప్రేరేపించిననూ మహానుభావుడగు అర్జునుడు, తన పుత్రులను సంహరించినవాడే అయిననూ గురుపుత్రుడగు అశ్వత్థామను సంహరించుటకు ఇష్టపడలేదు.

అథో పేత్య స్వశిబిరం గోవిందప్రియసారథిః

న్యవేదయత్తం ప్రియాయై శోచంత్యా అత్మజాన్ హతాన్

తరువాత గోవిందుడే ప్రియమిత్రుడు మరియు సారథిగా గల అర్జు నుడు తన శిబిరమును చేరుకొని, అచట చంపబడిన తన పుత్రులనుగురించి శోకించుచున్న ప్రియురాలగు ద్రౌపదికి ఆ అశ్వత్థామను అప్పజెప్పెను.

తథాఽఽహృతం పశువత్పాశబద్ధ-

మవాజ్ముఖం కర్మజుగుప్సితేన

నిరీక్ష్య కృష్ణాఽపకృతం గురోస్సుతం .

వామస్వభావా కృపయా ననామ చ

సుందరమగు స్వభావము గల ద్రౌపది ఆ విధముగా పశువు వలె త్రాటితో కట్టివేసి తీసుకు రాబడినవాడై, తాను చేసిన పనియందలి ఏహ్యభా వముచే తలను దించుకొని ఉన్న అపకారియైన గురుపుత్రుడగు అశ్వత్థా మను దయాదృష్టితో చూచి నమస్కరించెను.

ఉవాచ చాసహంత్యస్య బంధనానయనం సతీ

ముచ్యతాం ముచ్యతామేష బ్రాహ్మణో నితరాం గురుః

అశ్వత్థామను కట్టివేసి తీసుకొని వచ్చుటను పతివ్రతయగు ద్రౌపది ! చూచి సహించలేక పోయెను. బ్రాహ్మణుడు, మిక్కిలి పూజనీయుడు అగు ) నీతనిని విడువుడు, విడువుడు అని ఆమె పలికెను.

సరహస్యో ధనుర్వేదస్సవిసర్గోపసంయమః

అస్త్రగ్రామశ్చ భవతా శిక్షితో యదనుగ్రహాత్

స ఏష భగవాన్ ద్రోణః ప్రజారూపేణ వర్తతే

తస్యాత్మనోఽర్ధం పత్న్యాస్తే నాన్వగాద్వీరసూః కృపీ

రహస్యములను మంత్రములతో కూడిన ధనుర్వేదమును మరియు ప్రయోగ- ఉపసంహారములతో సహా అస్త్రముల సమూహమును నీవు ఏ ద్రోణాచార్యుని అనుగ్రహముచే నేర్చుకుంటివో, ఆ ద్రోణుడే తన సంతానమగు అశ్వత్థామ రూపములో మన ముందు ఉన్నాడు. ఆ ద్రోణుని అర్దాంగియగు కృపి వీరుడగు పుత్రుని కన్నదై ఇంకనూ జీవించి యున్నదే గాని, ద్రోణునితో బాటు మరణించ లేదు గదా!

తద్ధర్మజ్ఞ మహాభాగ భవద్భిరౌరవం కులమ్

వృజినం నార్షతి ప్రాపుం పూజ్యం వంద్యమభీక్ ష్ణశః

గొప్ప భాగ్యము గలవాడా! నీవు ధర్మము తెలిసిన వాడవు. కావు న, గురువు యొక్క వంశమును మీరు నిత్యము నమస్కరించి పూజించవ లేనే గాని, దుఃఖమును కలిగించుట తగదు.

మా రోదీదస్య జననీ గౌతమీ పతిదేవతా

యథాహం మృతవత్సార్తా రోదిమ్యశ్రుముఖీ ముహుః

నా పుత్రులు మరణించుటచే ఆ దుఃఖమును సహించలేక నేను కన్నులవెంబడి నీరు ప్రవహించుచుండగా నిరంతరముగా దుఃఖించుచు న్నొను. అదే విధముగా ఈతని తల్లి, పతివ్రతయగు కృపి కూడ దుఃఖించ కుండు గాక!

యైః కోపితం బ్రహ్మకులం రాజన్యైరకృతాత్మభిః

తత్కులం ప్రదహత్యాశు సానుబంధం శుచార్పితమ్

మనోనిగ్రహము లేని రాజులు ఒక బ్రాహ్మణకులమునకు కోపమును తెప్పించినచో, దాని వలన వారి కులము దుఃఖముచే ఆవరింపబడి సపరివారముగా శీఘ్రమే వినాశమును పొందును.

సూత ఉవాచ

ధర్మ్యం న్యాయ్యం సకరుణం నిర్వ్యలీకం సమం మహత్

రాజా ధర్మసుతో రాజ్ఞ్యాః ప్రత్యనందద్వచో ద్విజోః

సూతుడు ఇట్లు పలికెను: ఓ మహర్షులారా! మహారాణియగు ద్రౌపది ధర్మమును న్యాయమును అతిక్రమించనిది, దయతో కూడినది, కపటము లేనిది, సమబుద్ధి గలది అగు గొప్ప మాటను పలుకగా, యమధ ర్మరాజుయొక్క అంశతో జన్మించిన ధర్మరాజు కూడ దానిని అనుమోదించి అభినందించెను.

నకులసహదేవశ్చ యుయుధానో ధనంజయః

భగవాన్ దేవకీపుత్రో యే చాన్యే యాశ్చ యోషితః

నకులసహదేవులు, సాత్యకి, అర్జునుడు, దేవకీనందనుడగు శ్రీకృ ష్ణభగవానుడు మాత్రమే గాక అక్కడనున్న ఇతరజనులు స్త్రీలతో సహా అందరు ఆమె వచనమును అభినందించిరి.

తత్రాహామర్షితో భీమస్తస్య శ్రేయాన్వధస్స్మృతః

న భర్తుర్నాత్మనశ్చార్దే యోఽహన్ సుప్తాన్శిశూన్వృథా

అప్పుడు కోపమును పొందియున్న భీముడు ఇట్లు పలికెను: ఈ అశ్వత్థామ వ్యర్థముగా నిద్రిస్తున్న పిల్లలను చంపినాడు. ఈతడు చేసిన పని వలన ఈతనికి గాని, ఈతని ప్రభువగు దుర్యోధనునకు గాని ప్రయోజనము లేశమైననూ లేదు. ఇట్టివానికి వధించుటయే శ్రేయస్కరమగునని పెద్దలు చెప్పుచున్నారు.

నిశమ్య భీమగదితం ద్రౌపద్యాశ్చ చతుర్భుజః

ఆలోక్య వదనం సఖ్యురిదమాహ హసన్నివ

శ్రీకృష్ణుడు ద్రౌపదీభీముల వచనములను విని, మిత్రుడగు అర్జు నుని ముఖము కేసి చూచి, చిరునవ్వు నవ్వుతున్నాడా యన్నట్లు ఈ విధ ముగా పలికెను.

శ్రీభగవానువాచ

బ్రహ్మబంధుర్న హంతవ్య ఆతతాయీ వధార్హణః

మనవోభయమస్నూతం పరిపాహ్యనుశాసనమ్

శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలికెను: బ్రాహ్మణుడు అధముడే అయి ననూ వానిని వధించరాదనియు, ఆతతాయి (ఇంటికి నిప్పు పెట్టినవాడు, విషమునిచ్చిన వాడు, హంతకుడు మొదలగువారు) వధకు అర్హుడనియు, ఈ రెండు వచనములను శాస్త్రకర్తనగు నేనే చెప్పితిని. నీవు నా ఉపదేశ ములను పాటించుము.

కురు ప్రతిశ్రుతం సత్యం యత్తత్సాంత్వయతా ప్రియామ్

ప్రియం చ భీమసేనస్య పాంచాల్యా మహ్యమేవ చ

ప్రియురాలగు ద్రౌపదిని ఓదారుస్తూ నీవు చేసిన ప్రతిజ్ఞను సత్యము చేయుము. అదే సమయములో భీమసేనునకు, ద్రౌపదికి మరియు నాకు కూడ ప్రీతిని కలిగించుము.

సూత ఉవాచ

అర్జునస్సహసాజ్ఞాయ హరేర్హార్ధమథోసినా

సూతుడిట్లు పలికేను: అర్జునుడు వెంటనే శ్రీకృష్ణభగవానుని హృదయములోని భావమునెరింగి, ఆ బ్రాహ్మణుని శిరస్సు పైనుండే మణిని కేశములతో సహా కత్తితో ఊడబెరి కెను.

విముచ్య రశనాబద్దం బాలహత్యాహతప్రభమ్

తేజసా మణినా హీనం శిబిరాన్నిరయాపయత్

అశ్వత్థామయొక్క బ్రహ్మవర్చస్సు పిల్లలను హత్య చేయుటచే ముందే నశించినది. ఇప్పుడు మణియొక్క తేజస్సు కూడ లేకుండా పోయినది. త్రాటితో కట్టివేయబడియున్న అట్టి అశ్వత్థామను అర్జునుడు కట్లు విడిపించి శిబిరము బయటకు గెంటి వేసేను.

వపనం ద్రవిణాదానం స్థానాన్నిర్యాపణం తథా

ఏష హి బ్రహ్మబంధూనాం వధో నాన్యోఽస్తి దైహికః

బ్రాహ్మణాధముని ఉరి తీయరాదు. ముండనము, సంపదను లాగుకొనుట, ఉన్న స్థానమునుండి గెంటి వేయుట అనునవి మాత్రమేబ్రాహ్మణాధమునకు మరణశిక్షతో సమానము.

పుత్రశోకాతురాస్సర్వే పాండవాస్సహ కృష్ణయా

స్వానాం మృతానాం యత్కృత్యం చక్రుర్నిర్హరణాదికమ్

ఇతి శ్రీమద్బాగవతే మహాపురాణే ప్రథమస్కంధే సప్తమోఽధ్యాయః.

పాండవులందరు ద్రౌపదితో సహా పుత్రశోకముతో పీడింపబడు చున్నవారై, మరణించిన తమ పుత్రులకు దహనసంస్కారము మొదలగు కర్మలను చేసిరి.

శ్రీమద్భాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో ఏడవ అధ్యాయము ముగిసినది.