భాగవత మహా పురాణము
13 - త్రయోదశోఽధ్యాయః
సూత ఉవాచ ।
విదురస్తీర్థయాత్రాయాం మైత్రేయాదాత్మనో గతిమ్ ।
జ్ఞాత్వాఽగాద్ధస్తినపురీం తయావాప్తవివిత్సితః ॥
సూతుడు ఇట్లు చెప్పెను: విదురుడు తీర్థయాత్రలో మైత్రేయుని నుండి ఆత్మజ్ఞానమును పొంది, దానిచే పూర్ణ మైన జ్ఞానతృష్ణ గలవాడై, హస్తినాపురమునకు తిరిగి వచ్చెను.
యావతః కృతవాన్ ప్రశ్నాన్ క్షత్తా కౌషారవాగ్రతః ।
జాతైకభక్తిర్గోవిందే తేభ్యశ్చోపరరామ హ ॥
విదురుని ముందులో మైత్రేయుని అనేకప్రశ్నలను వేసెను. కానీ, ఒకటి రెండు ప్రశ్నలకు సమాధానమును వినుసరికి ఆయనకు గోవిందుని యందు ఏకాంతమగు భక్తి కుదిరెను. తరువాత ఆయన ఆ ప్రశ్నలను ఉప సంహరించు కొనెను.
తర బంధుమాగతం దృష్ట్వా ధర్మపుత్రస్సహానుజః ।
ధృతరాష్ట్రో యుయుత్సుశ్చ సూతశ్శారద్వతః పృథా ॥
గాంధారీ ద్రౌపదీ బ్రహ్మన్ సుభద్రా చోత్తరా కృపీ ।
అన్యాశ్చ జామయః పొండోర్ జ్ఞాతయస్సనుతాః స్త్రియః ॥
ప్రత్యుజ్జగ్ముస్సహర్షేణ ప్రాణం తన్వ ఇవాగతమ్ ।
అభిసంగమ్య విధివత్పరిష్వంగాభివాదనైః ॥
ముముచుః ప్రేమబాఫ్పౌఘం విరహౌత్కంఠ్యకాతరాః ।
రాజా తమర్హయాంచక్రే కృతాసనపరిగ్రహమ్ ॥
ఓ శౌనకమహర్షీ! విచ్చేసిన బంధువగు విదురుని చూచి, ధర్మరా జు, ఆం:సన సోదరులు, ధృతరాష్ట్రుడు, యుయుత్సువు, సంజయుడు, ఈసారుడు. కుంతీ గోంగారి గౌరి సుభగ ఉత కకి ఇతరంధువులు, వారి భార్యలు, సంతానము అందరు ప్రాణమే లేచి వచ్చినట్లు మహానందముతో యెదురేగిరి. వియోగము వలన కలిగిన ఆదుర్దాకు అధీ నులై యున్న వారందరు ఆయనను యథావిధిగా కౌగిలించుకొని, నమస్క రించి, పలుకరించి, కన్నుల వెంబడి ఆనందాశ్రుప్రవాహములను విడిచిరి. ధర్మరాజు ఆయనను ఆసనముపై కూర్చుండబెట్టి సత్కరించెను.
తం భుక్తవంతమాసీనం విశ్రాంతం సుఖమాసనే ।
ప్రశ్రయావనతో రాజా ప్రాహ తేషాం చ శృణ్వతామ్ ॥
విదురుడు భోజనమును చేసి విశ్రమించి కులాసాగా ఆసనముపై కూర్చుని యుండగా, ధర్మరాజు వినయముతో వంగి నమస్కరించి, వారందరు వినుచుండగా, ఇట్లు పలికెను.
యుధిష్ఠిర ఉవాచ ।
అపి స్మరథ నో యుష్మత్పక్షచ్ఛాయాసమేధితాన్ ।
విపద్గణాద్విషాగ్న్యాదేర్మోచితా యత్సమాతృకాః ॥
ధర్మరాజు ఇట్లు పలికెను: మేము మీ నీడలో పెరిగి పెద్దవారమైతి మి. మా తల్లిని మమ్ములను మీరు విషము, అగ్ని మొదలగు ఆపదలసమూహమునుండి రక్షించితిరి. మమ్ములను మీరు ఇప్పుడు స్మరించు చున్నారా?.
కయా వృత్త్యా వర్తితం వశ్చరద్భిః క్షితిమండలమ్ ।
తీర్థాని క్షేత్రముఖ్యాని సేవితానీహ భూతలే ॥
మీరు భూమండలమును సంచరించే సమయములో జీవననిర్వా హమునెట్లు సాగించితిరి? ఏయే తీర్థములను, ముఖ్యమగు క్షేత్రములనుసేవించితిరి?
భవద్విధా భాగవతాస్తీర్థభూతాస్స్వయం విభో ।
తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతః స్థేన గదాభృతా ॥
ఓ ప్రభూ! మీవంటి భగవద్భక్తులు తామే స్వయముగా తీర్థముల వంటివారు. మీ హృదయములో గదాధారియగు శ్రీకృష్ణుడు సర్వదా నివా సముండుటచే, మీ వలన తీర్థములు కూడ పవిత్రమగును.
ఆపి నస్సుహృదస్తాత బాంధవాః కృష్ణదేవతాః ।
దృష్టాః శ్రుతా వా యదవస్స్వపుర్యాం సుఖమాసతే ॥
ఓ తండ్రీ! శ్రీకృష్ణుడే దైవముగా గల యాదవులు మాకు మిత్రులు మాత్రమే గాక బంధువులు కూడా. వారెవరైనా మీకు కనబడినారా? వారిని గురించి మీరు విన్నారా? వారు తమ నగరములో సుఖముగా నున్నారా?
ఇత్యుక్త ధర్మరాజేన సర్వం తత్సమవర్ణయత్ ।
యథానుభూతం క్రమశో వినా యదుకులక్షయమ్ ॥
ధర్మరాజు ఈ విధముగా ప్రశ్నించగా, విదురుడు తాను చూచిన సర్వమును ఉన్నది ఉన్నట్లుగా వరుసగా వర్ణించి చెప్పెను. కాని, యదువం శవినాశమును గురించి మాత్రము చెప్పలేదు.
నన్వప్రియం దుర్విషహం నృణాం స్వయముపస్థితమ్ ।
నావేదయేత్సకరుణో దుఃఖితాన్ ద్రష్టుమక్షమః ॥
దయామయుడు, దుఃఖించుచున్న వారిని చూచి సహించ లేని వాడు అగు విదురుడు ఎంతయు విషాదకరమైనది, మానవులకు సహింపశక్యము కానిది, తనంత తానుగా దాపురించినది అగు ఆ యదుకులవంశవి నాశమును గూర్చి చెప్పలేదు.
కంచిత్కాలమథావాత్సీత్సత్కృతో దేవవత్సుఖమ్ ।
భ్రాతుర్జ్యేష్ఠస్య శ్రేయస్కృత్సర్వేషాం ప్రీతిమావహన్ ॥
తరువాత ధర్మరాజు విదురుని దేవత వలె సత్కరించెను. ఆయన పెద్ద అన్నగారగు ధృతరాష్ట్రునకు తత్త్వమునుపదేశించుట ద్వారా శ్రేయ స్సును కలిగిస్తూ, అందరికీ ప్రీతిని కలిగిస్తూ, కొంతకాలము సుఖముగా అచటనే నివసించెను.
అబిభ్రదర్యమా దండం యథావదధికారిషు ।
యావద్దధార శూద్రత్వం శాపొద్వర్షశతం యమః ॥
యముడు మాండవ్యమహర్షియొక్క శాపముచే వంద సంవత్సర ములు విదురుడుగా అవతరించి ఉండెను. ఆ కాలములో అర్యముడు పాపులను దండించే కార్యమును ధర్మబద్ధముగా నిర్వహించెను.
యుధిష్ఠిరో లబ్ధరాజ్యో దృష్ట్వా పౌత్రం కులంధరమ్ ।
భ్రాతృభిర్లోకపాలాభైర్ముముదే పరయా శ్రియా ॥
ధర్మరాజు రాజ్యమును తిరిగి పొంది వంశోద్ధారకుడగు మనుమని చూస్తూ, లోకపాలకుల వంటి సోదరులతో గూడినవాడై, సర్వోత్కృష్టమగు సంపదను అనుభవిస్తూ ఆనందించేను.
ఏవం గృహేషు సక్తానాం ప్రమత్తానాం తదీహయా ।
అత్యక్రామదవిజ్ఞాతః కాలః పరమదుస్తరః ॥
ఈ విధముగా ఆ పాండవులు ఇల్లు వాకిలి అను వాటియందు ఆసక్తి గలవారై గృహవ్యాపారములలో మునిగియుండగా, తెలియకుండు గనే ఆయుర్దాయము గడచి, ఎవ్వరికైననూ దాట శక్యము కాని మృత్యువు - సంప్రాప్తమయ్యెను.
విదురస్తదభిప్రేత్య ధృతరాష్ట్రమభాషత ।
రాజన్నిర్గమ్యతాం శీఘ్రం పశ్యేదం భయమాగతమ్ ॥
ఆ విషయమును తెలుసుకొని విదురుడు ధృతరాష్ట్రునితో, ఓ రాజా! ముంచుకు వచ్చుచున్న ఈ భయమును గమనించి, నీవు తొంద రగా నిషమించుము అని పలికెను.
ప్రతిక్రియా న య స్యేహ కుతశ్చిత్కర్షిచిత్ప్రభో ।
స ఏవ భగవాన్ కాలస్సర్వేషాం నస్సమాగతః ॥
ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఈ లోకములో ఎక్కడనైననూ దేనివల నైననూ మృత్యువునకు ప్రతీకారము లేదు. అట్టి మృత్యుదేవత మనందరికీ సమీపించినది.
యేన చైవాభిపన్నోఽయం ప్రాణైః ప్రియతమైరపి ।
జనస్సద్యో వియుజ్యేత కిముతాన్యైర్ధనాదిభిః ॥
మృత్యుగ్రస్తుడగు మానవుడు తనకు అత్యంతప్రీతిపాత్రములగు ప్రాణములకు కూడ నిశ్చయముగా దూరమగును. ఇక ధనము మొదలగు వాటిని గురించి చెప్పునదేమున్నది?
పితృభ్రాతృసుహృత్పుత్ర హతాస్తే విగతం వయః ।
ఆత్మా చ జరయా గ్రస్తః పరగేహముపాససే ॥
ఆ నీ తండ్రులు సోదరులు మిత్రులు మరియు పుత్రులు యుద్ద ములో మరణించినారు. నీ వయస్సు దాటి పోయినది. దేహము ముదుసలి అయినది. అయిననూ, నీవు ఇంకనూ ఇతరుల ఇంటి పంచన వ్రేలాడుచున్నావు.
అహో మహీయసీ జంతోర్జీవితాశా యయా భవాన్ ।
భీమేనావర్జితం పిండమాదత్తే గృహపాలవత్ ॥
ఆశ్చర్యము! ప్రాణులకు గల జీవితాశ చాల పెద్దది. అది నిన్ను పూర్తిగా తన వశము చేసుకున్నది. ఏలయనగా, నీవు ఇంటి కాపలా కుక్క వలె భీముడు తెచ్చి పెట్టే ఆహారమును తినుచున్నావు.
అగ్నిర్నిసృష్ణో దత్తశ్చ గరో దారాశ్చ దూషితాః ।
హృతం క్షేత్రం ధనం యేషాం తద్దత్తైరసుభిః కియత్ ॥
పాండవులను అగ్నిప్రమాదములో చంపే ప్రయత్నము జరిగినది. వారీకి విషము ఈయబడినది. వారి భార్య అవమానించ బడినది. వారి రాజ్యము . మరియు ధనము అపహరించ బడినవి. అట్టి పాండవులు ఈ దుష్కృత్యములన్నింటికీ ఏదో విధముగా కారణమైన నీకు దయతో ఇచ్చిన ప్రాణములకు గల విలువ ఎంత?
తస్యాపి తవ దేహోఽయం కృపణస్య జిజీవిషోః ।
పరైత్యనిచ్ఛతో జీర్ణో జరయా వాససీ ఇవ ॥
దీనుడవు (అజ్ఞానివి) అగు నీవు ఇంకనూ జీవించ గోరుచున్నావు. నీకు ఇష్టము కాకున్ననూ, పెద్ద వయసుచే శిథిలము చేయబడిన నీ ఈ శరీ రము నీవు కట్టే వస్త్రముల జంట వలె క్షీణించు చున్నది.
గతస్వార్థమిమం దేహం విరక్తో ముక్తబంధనః ।
అవిజ్ఞాతగతిర్జహ్యాత్స వై ధీర ఉదాహృతః ॥
ఎవడైతే వైరాగ్యమును పొంది మమకారమును వీడి తన చిరునా మాయైననూ ఇతరులకు తెలియని స్థితిలో ధర్మము మొదలగు ప్రయోజన ములను సాధించే సామర్థ్యము లేని ఈ దేహమును విడిచి పెట్టునో, వాడే ధీరపురుషుడని పెద్దలు చెప్పెదరు.
యస్స్వకాత్పరతో వేద జాతనిర్వేద ఆత్మవాన్ ।
హృది కృత్వా హరిం గేహాత్ప్రప్రజేత్స నరోత్తమః ॥
ఎవడైతే తనంత తానుగా గాని, ఇతరుని ఉపదేశము వలన గాని వైరాగ్యమును పొంది, మనోనిగ్రహము గలవాడై, హృదయములో హరవి నిలిపి, గృహమునుండి నిర్గమించి సన్న్యసించునో, వాడు మానవులలో శ్రేష్ఠుడు.
అథోదీచిం దిశం యాతు స్వైరజ్ఞాతగతిర్బవాన్ ।
ఇతోఽర్వాక్ప్రయశః కాలః పుంసాం గుణవికర్షణః ॥
ఈ పైన రాబోయే కాలము ప్రధానముగా మానవుల సద్గుణము లను క్షీణింప జేయును. కావున, నీవు నీ బంధువర్గమునకు తెలియని విధ ముగా ఉత్తరదిక్కు వైపుగా పొమ్ము.
ఏవం రాజా విదురేణానుజేన
ప్రజ్ఞాచక్షుర్బోధితో హ్యాజమీడః ।
ఛిత్త్వా స్వేషు స్నేహపాశాన్ ద్రఢిమ్నో
నిశ్చక్రామ భ్రాతృసందర్శితాధ్వా ॥
ఈ విధముగా సోదరుడగు విదురుడు ఉపదేశించగా, అంధుడు అజమీడవంశజుడు అగు ధృతరాష్ట్రమహారాజు ఆ ఉపదేశముచే కలిగిన వివేకదృష్టిచే తనవారియందు గల దృఢమగు మమకారపాశములను తెంపుకొని, సోదరుడగు విదురుడు దారిని చూపుచుండగా, ఇంటినుండి బయట పడెను.
పతిం ప్రయాంతం సుబలస్య పుత్రీ
పతివ్రతా చానుజగామ సాధ్వీ ।
హిమాలయం న్యస్తదండప్రహర్షం
మనస్వినామివ సత్సంప్రహారః ॥
అభిమానవంతులగు వీరులకు యుద్ధములో శత్రువుచే న్యాయబ ద్దముగా కొట్టబడిన గట్టి దెబ్బ యైననూ ఆనందకరమే. అదే విధముగా, సన్న్యాసముచే సకలప్రాణులకు అభయప్రదానమును చేసే యతులకు హిమాలయములు ఆనందమును కలిగించుచుండును. సుబలుని కుమార్తె, సచ్చీలవతి మరియు పతివ్రత అగు గాంధారి అట్టి హిమాలయములకు భర్త వెనుకనే వెళ్లాను.
అజాతశత్రుః కృతమైత్రో హుతాగ్నిః
విప్రాన్నత్వా తిలగోభూమిరుక్మైః ॥
గృహం ప్రవిష్టో గురువందనాయ
న చాపశ్యత్పితరౌ సౌబలీం చ ॥
ధర్మరాజు మిత్రదేవతాకమగు ప్రాతస్సంధ్యను ముగించి, అగ్ని హోత్రమును చేసి, బ్రాహ్మణులకు నువ్వులు ఆవులు భూమి మరియు బంగారము అను వాటిని దానము చేసి, వారికి నమస్కరించి, పెద్దలకు నమస్కరించుటకై ఇంటికి వెళ్లగా, అచట విదురుడు, ధృతరాష్ట్రుడు మరియు గాంధారి కానరాలేదు.
తత్ర సంజయమాసీనం పప్రచ్ఛోద్విగ్నమానసః ।
గావల్గణే క్వ నస్తాతో వృద్ధో హీనశ్చ నేత్రయోః ॥
ఉద్వేగముతో నిండిన మనస్సు గల ధర్మరాజు అక్కడ కూర్చుని యున్న సంజయునితో, ఓ సంజయా (గవల్గణుని పుత్రుడు) ! పెద్దవాడు, కళ్లు లేనివాడు నగు మా తండ్రి ఏడి? అని ప్రశ్నించెను.
అంబా చ హతపుత్రార్తా పితృవ్యః క్వ గతస్సుహృత్ ।
ఆపి ముయ్యకృతప్రజ్ఞే హతబంధుస్స భార్యయా ।
అశంసమానశ్శమలం గంగాయాం దుఃఖితోఽపతత్ ॥
పుత్రులు సంహరించ బడిన కారణముగా దుఃఖితురాలై యున్న తల్లి గాంధారి ఎక్కడ? మహోపకారియగు పినతండ్రి విదురుడు ఎక్కడ? బంధువులు సంహరించ బడుటచే దుఃఖితుడై యున్న ధృతరాష్ట్రుడు నన్ను తప్పు పట్టుచున్నవాడై గంగలో దుమికినాడా యేమి?
పితర్యుపరతే పాండౌ సర్వాన్నస్సుహృదశ్శిశూన్ ।
అరక్షతాం వ్యసనతః పితృవ్యౌ క్వ గతావితః ॥
మా తండ్రిగారు మరణించినప్పుడు మేము చాల చిన్న పిల్లలము. మమ్ములను మా తండ్రిగారి సోదరులిద్దరు (విదురుడు, ధృతరాష్ట్రుడు) ఆపదనుండి రక్షించిరి. వారిద్దరు ఇక్కడనుండి ఎక్కడకు వెళ్లిరి?
సూత ఉవాచ ।
కృపయా స్నేహవైక్లబ్యాత్సూతో విరహకర్శితః ।
ఆత్మేశ్వరమచక్షాణో న ప్రత్యాహతిపీడితః ॥
సూతుడిట్లు పలికెను: సంజయుడు తనకు ప్రభువగు ధృతరాష్ట్ర మహారాజును కానరాక, దయచే మరియు ప్రేమచే కల్లోలితమైన మనస్సు గలవాడై, అధికమగు మానసిక పీడను పొంది, వియోగముచే కృశించినవా డై, ధర్మరాజునకు బదులు చెప్పలేదు.
విమృజ్యాశ్రూణి పాణిభ్యాం విష్టభ్యాత్మానమాత్మనా ।
అజాతశత్రుం ప్రత్యూచే ప్రభోః పాదావనుస్మరన్ ॥
సంజయుడు కొంత సేపటికి కన్నీటిని తుడుచుకొని తనకు తాను ధైర్యము చెప్పుకొని, తన ప్రభువగు ధృతరాష్ట్రుని పాదములను స్మరిస్తూ బదులు చెప్పెను.
సంజయ ఉవాచ ।
నాహం వేద వ్యవసితం పిత్రోర్వః కులనందన।
గాంధార్యా వా మహాబాహో ముషితోస్మి మహాత్మభిః ॥
సంజయుడిట్లు పలికెను: వంశమునకు ఆనందమును కలిగించే గొప్ప బాహువులు గల ఓ ధర్మరాజా! నీ తండ్రులగు విదురధృతరాష్ట్రుల మనోగతము గాని, గాంధారి తలపు గాని నాకు తెలియదు. ఆ మహాత్ములు నన్ను వంచించినారు.
అథాజగామ భగవాన్నారదస్సహతుంబురుః ।
ప్రత్యుత్థాయాభివాద్యాహ సానుజోభ్యర్చయన్నివ ॥
ఇంతలో పూజ్యుడగు నారదమహర్షి తుంబురునితో కలిసి అచటకు వచ్చెను. ధర్మరాజు సోదరులతో గూడి లేచి యెదురేగి వారికి నమస్క రించి, దుఃఖితుడై యుండుటచే పూజయొక్క చేష్టను చేసెను.
యుధిష్ఠిర ఉవాచ ।
నాహం వేద గతిం పిత్రోర్బగవన్ క్వ గతావితః ।
అంబా వా హతపుత్రార్తా క్వ గతా చ తపస్వినీ ।
కర్ణధార ఇవాపారే భగవాన్ పారదర్శకః ॥
ధర్మరాజు ఇట్లు పలికెను: ఓ పూజ్యా! నా తండ్రులగు విదురధృత రాష్ట్రులు, యుద్దములో పుత్రులు సంహరించ బడుటచే పీడితురాలై దుఃఖి స్తున్న నా తల్లి గాంధారి ఇక్కడనుండి ఎక్కడకు వెళ్లినారు? వారి పోకడ నాకు తెలియకున్నది. ఈ శోకసముద్రమును తరింప జేయగల నావికుడవు పూజ్యుడవగు నీవు మాత్రమే.
అథాబభాషే భగవాన్నారదో మునిసత్తమః ।
మా కంచన శుచో రాజన్ యదీశ్వరవశం జగత్ ॥
తరువాత పూజ్యుడగు నారదమహర్షి ఇట్లు పలికెను: ఓ రాజా! నీవు ఎవ్వరి గురించి యైననూ శోకించ వలదు. ఏలయనగా, ఈ జగత్తు ఈశ్వరునకు వశమై యున్నది.
లోకాస్సపాలా య స్యేమే మహంతి బలిమీశితుః ।
స సంయునక్తి భూతాని స ఏవ వియునక్తి చ ॥
ఈ లోకపాలకులు ఏ ఈశ్వరుని పూజించెదరో, ఆయనయే ప్రాణులను కలిపి విడదీయుచుండును.
యథా గావో నసి ప్రోతాస్తంత్యాం బద్దాస్స్వదామభిః ।
వాక్తంత్యాం నామభిర్బద్ధా వహంతి బలిమీశితుః ॥
ముక్కునందు కుట్టబడి తమ తమ ళ్లతో పెద్ద త్రాటికీ కట్టబడిన ఎద్దులు యజమాని వస్తువులను మోయు విధముగా, మానవులు వీధినీ షే ధరూపమగు వేదము అనే త్రాటికి తమ తమ వర్ణాశ్రమాదనామములచే కట్టబడినవారై ఈశ్వరుని ఆజ్ఞను పాలించుచున్నారు (పూజించుచున్నారు).
యథా క్రీడోపస్కరాణాం సంయోగవిగమావిహ ।
ఇచ్ఛయా క్రీడితుస్స్యాతాం తథైవేశేచ్ఛయా నృణామ్ ॥
ఈ లోకములో ఆటబొమ్మలకు ఆటగాని ఇచ్చననుసరించి కలయిక గాని, విడిపోవుట గాని కలుగుచుండునో, అదే విధముగా మానవు లకు ఈశ్వరుని ఇచ్చనే సంయోగవియోగములు కలుగుచుండును.
యన్మన్యసే ధ్రువం లోకమధ్రువం వాన చోభయమ్ ।
సర్వథా న హి శోచ్యాస్తే స్నేహాదన్యత్ర మోహజాత్ ॥
జీవుడు నిత్యుడు (చైతన్యరూపములో) అని గాని, అనిత్యుడు. (దేహరూపములో) అని గాని, రెండు (ప్రకృతీపురుషుల, అనగా అనృతసత్య ముల కలయిక) అని గాని, ఏదీ కాదు (శుద్ధపరబ్రహ్మస్వరూపుడు) అని గాని నీవు ఏ పక్షమును స్వీకరించిననూ, మోహము వలన కలిగే ఆసక్తిని మినహాయిస్తే, వారిని గురించి నీవు శోకించుట తగదు.
తస్మాజ్జహ్యంగ వైక్లబ్యమజ్ఞానకృతమాత్మనః ।
కథం త్వనాథాః కృపణా వర్త్రం స్తే చ మాం వినా ॥
ఓయీ! కావున, రక్షకుడు లేని దీనులగు ఆ ధృతరాష్ట్రాదులు, నేను లేకుండగా ఎట్లు జీవించెదరు? అనే అజ్ఞానకృతమగు మానసిక-ఆందోళనను నీవు విడిచి పెట్టుము.
కాలకర్మగుణాధీనో దేహోయం పాంచభౌతికః ।
కథపున్యాంస్తు గోపాయేత్సర్సగ్రస్తో యధో పరమ్ ॥
ఈ దేహము అయిదు భూతములతో నిర్మాణమై, కాలమునకు ప్రారబ్ధకర్మకు సత్త్వరజస్తమోగుణములకు వశమై యున్నది. కొండచిలువ నోటికి చిక్కిన పురుషుడు మరియొకనిని ఎట్లు రక్షించగలడు? అదే విధము గా, అట్టి ఈ దేహము ఇతరులను ఎట్లు రక్షించ గల్గును?
అహస్తాని సహస్తానామపాదాని చతుష్పదామ్ ।
ఫల్గూని తత్ర మహతాం జీవో జీవస్య జీవనమ్ ॥
ప్రాణులలో చేతులు గలవి చేతులు లేని ప్రాణులను, నాలుగు కాళ్ల జంతువులు కాళ్లు లేని ప్రాణులను, పెద్దవి చిన్నవాటిని తిని బ్రతుకుచున్నవి.
తదిదం భగహౌస్ రాజన్నేక ఆత్మాత్మగౌం స్వదృక్ ।
అంతరో వసంతలో భాతి పశ్య తు మాయయోరుధా ॥
ఓ రాజా! అట్టి ఈ జగత్తు ఆ భగవానుడే. అద్వితీయుడు, భోక్తలగు జీవుల స్వరూపమైనవాడు, చైతన్యస్వరూపుడు అగు పరమేశ్వరుడు మాయాశక్తిచే సర్వమునకు లోపల మరియు బయట అనేకవిధములుగా కన్పట్టుచున్నాడు. సర్వమునందు ఆ ఈశ్వరుని మాత్రమే చూడుము.
సోయమద్య మహారాజ భగవాన్ భూతభావనః ।
కాలరూపోవతీర్ణో స్యామభవాయ సురద్విషామ్ ॥
ఓ మహారాజా! జగదుత్పత్తికి హేతువు అగు అట్టి ఈ పరమేశ్వ రుడు ఈ సమయములో రాక్షసవినాశము కొరకై ఈ భూలోకములో మృత్యురూపుడై అవతరించినాడు.
నిష్పాదితం దేవకృత్యమవశేషం ప్రతీక్షతే ।
తావద్యూయమవేక్షధ్వం భవేద్యావదిహేశ్వరః ॥
దేవకార్యము ఇంచుమించు పూర్తి అయినది. కొద్దిగా మిగిలి యున్నది. శ్రీకృష్ణభగవానుడు దాని కొరకు వేచియున్నాడు. ఆయన ఈ లోకములో నున్నంత వరకు, మీరు కూడ వేచి యుండుడు.
ధృతరాష్ట్రస్సహ భ్రాత్రా గాంధార్యా చ స్వభార్యయా ।
దక్షిణేన హిమవత ఋషీణామాశ్రమం గతః ॥
ధృతరాష్ట్రుడు విదురునితో మరియు. తన భార్యయగు గాంధా రితో కలిసి హిమవత్పర్వతమునకు దక్షిణదిక్కునందు గల ఋషుల ఆశ్ర మమునకు వెళ్లినాడు.
స్రోతోభిస్సప్తభిర్యా వై స్వర్ధునీ సప్తధా వ్యధాత్ ।
సప్తానాం ప్రీతయే నానా సప్తస్రాతః ప్రచక్షతే ॥
మందాకిని అచట తాను సప్త మహర్షుల ప్రీతి కొరకై ఏడు పాయ లుగా విడిపోయి ప్రవహించెను. అందు వలననే, ఆ తీర్థమునకు సప్తస్రో తస్సు అను పేరు వచ్చెను.
స్నాత్వానుసవనం తస్మిన్ హుత్వో చాగ్నీన్ యథావిధి ।
అజ్చక్ష ఉపశాంతాత్మా స ఆస్తే విగజైషణః॥
ధృతరాష్ట్రుడు ఆ తీర్థమునందు మూడు పూటలా స్నాన సెసు చేసి, అగ్నిహోత్రమును యథావిధిగా చేసుకుంటూ, నీటిని మాత్రమే కాక తూ, పుత్రాదులయందు ఆసక్తిని వీడి, ప్రసన్నమగు మనస్సు గలవాడై ఉన్నాడు.
జితాసనో జితశ్వాసః ప్రత్యాహృతషడింద్రియః ।
హరీభావనయా ధ్వస్తరజస్సత్త్వతమోమలః ॥
ఆయన ఆసనసిద్ధిని పొంది ప్రాణాయామమును చేసి ఇంద్రియములను మనస్సును ఉపసంహరించి శ్రీహరిని ధ్యానము చేసి సతరజస్త మోగుణముల దోషములను నశింప జేసుకొని గుణాతీతుడైనాడు.
విజ్ఞానాత్మని సంయోజ్య క్షేత్రజ్ఞే ప్రవిలాప్య తమ్ ।
బ్రహ్మణ్యాత్మానమాధారే ఘటాంబరమివాంబరే ॥
ధ్వస్తమాయాగుణోదరో నిరుద్దకరణాశయః ।
నివర్తితాఖిలాహార ఆస్తే స్థాణురివాచలః ॥
ధృతరాష్ట్రుడు మనస్సును విజ్ఞానాత్మయందు, దానిని క్షేత్రజ్ఞుని యందు, ఆ ద్రష్ణను ఘటాకాశమును మహాకాశమునందు వలె, సర్వము నకు ఆశ్రయమగు బ్రహ్మయందు విలీనము చేసి యున్నాడు. మాయాశక్తి యొక్క సత్త్వరజస్తమోగుణముల ఫలరూపములైన వాసనలు ఆయనలో నశించినవి. ఆయన ఇంద్రియములను, మనస్సును నిరోధించి, ఆహార మును పూర్తిగా విడిచి పెట్టి, విగ్రహము వలె కదలకుండగా నున్నాడు.
తస్యాంతరాయో మైవాభూస్సన్న్యస్తాఖిలకర్మణః ।
స వా అద్యతనాద్రిజన్ పరతః పంచమేహని ।
కలేవరం హాస్యతి స్వం తచ్చ భస్మీభవిష్యతి ॥
ఓ రాజా! సర్వకర్మసన్న్యాసమును చేసియున్న ఆయనకు నీవు విఘ్నమును కలిగించ వద్దు సుమా! ఈ నాటినుండి అయిదవ రోజున ఆయన తన దేహమును విడువగలడు. ఆ దేహము బూడిద యగును.
దహ్యమానే గ్నిభిర్దేహే పత్యుః పత్నీ సహోటజే ।
బహిఃస్థితా పతిం సాధ్వీ తమగ్నిమనువేక్ష్యతి ॥
గార్హపత్యము, ఆహవనీయము, అస్వాహార్యపచనము అనే అగ్ను లు మరియు పర్ణశాలతో కలిపి ఆయన దేహము భస్మమగుచుండగా, బయటనున్న గాంధారి కూడ దానియందు ప్రవేశించును.
విదురస్తు తదాశ్చర్యం నిశామ్య కురునందన ।
హర్షశోకయుతస్తస్మాద్గంతా తీర్థనిషేవకః ॥
ఓ ధర్మరాజా! విదురుడు ఆ అద్బుతమును చూచి, ధృతరాష్ణుడు ముక్తిని పొందినందులకు ఆనందమును, గాంధారీధృతరాష్ట్రులు మరణించినందులకు దుఃఖమును అనుభవించి, తీర్థాటన కొరకై అచ్చోటీ నుండి వెళ్లగలడు.
ఇత్య్వుక్త్వాథారుహాత్స్వర్గం నారదస్సహాతుంబురుః ।
యుధిష్టరో వచస్తస్య హృది తృత్వా జహాచ్చుచః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధేత్రయోదశోఽధ్యాయః ॥
నారదుడు ఈ విధముగా పలికి, తరువాత తుంబురునితో కలిసి స్వర్గమునకు వెళ్లాను. ధర్మరాజు నారదుని మాటలను తలచుకొని దుఃఖమును విడిచి పెట్టెను.
శ్రీమద్భాగవతములోని ప్రథమస్కంధములో పదమూడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 13 of the Bhāgavata Mahā Purana is as follows:
Vidura returns from his long pilgrimage, transformed with divine wisdom after receiving knowledge from Maitreya Rishi, and re-enters Hastināpura to enlighten his elder brother Dhṛtarāshtra about the impermanence of material life. Moved by Vidura's piercing instructions on detachment and the inevitability of time, Dhṛtarāshtra silently leaves the palace in the dead of night accompanied by his devoted wife Gāndhārī to pursue severe austerities in the Himālayas, ultimately attaining liberation and merging into the spiritual realm.