భాగవత మహా పురాణము
18 - అష్టాదశోఽధ్యాయః
సూత ఉవాచ ।
యో వై బ్రౌణ్యస్త్రవిప్లుష్ఠో న మాతురుదరే మృతః ।
అనుగ్రహాద్భగవతః కృష్ణస్యాద్భుతకర్మణః ॥
బ్రహ్మకోపోత్థితాద్యస్తు తక్షకాత్ప్రాణవిప్లవాత్ ।
న సంముమోహోరుభయోద్భగవత్యర్పితాశయః ॥
ఉత్సృజ్య సర్వతస్సంగం విజ్ఞాతాజితసంస్థితిః ।
వైయాస కేర్జహౌ శిష్యో గంగాయాం స్వం కలేవరమ్ ॥
సూతుడు ఇట్లు పలికెను: పరీక్షిత్తు తల్లి గర్భములో నుండగా అశ్వ త్థామయొక్క అస్త్రముచే దహింపబడియు, అద్భుతమగు లీలలు గల శ్రీకృష్ణభగవానునియొక్క అనుగ్రహము వలన జీవించెను. ఆయనకు బ్రాహ్మణశాపము వలన తక్షకుని రూపములో ప్రాణగండము కలిగెను. కాని, భగవానునియందు అర్పితమైన హృదయము గల ఆయనను ఆ మహాభయము కూడ సమ్మోహితుని చేయలేక పోయేను. ఆయన వ్యాసుని కుమారుడగు శుకమహర్షికి శిష్యుడై సర్వమునందు ఆసక్తిని విడనాడి, శ్రీహరియొక్క తత్త్వమును తెలుసుకొని, గంగానదీతీరమునందు తన దేహమును విడిచి పెట్టెను.
నోత్తమశ్లోకవార్తానాం జుషతాం తత్కథామృతమ్ ।
స్యాత్సంభ్రమోకంతకాలే కపి స్మరతాం తత్పదాంబుజమ్ ॥
పరమేశ్వరుని పవిత్రమగు కీర్తిని మాత్రమే వర్ణిస్తూ, ఆయన - గాథలు అనే అమృతమునాస్వాదిస్తూ, ఆయన పాదపద్మములను స్మరిస్తూ జీవించే సాధకులకు మరణసమయములో నైననూ అజ్ఞానవ్యామోహము కలుగదు.
తావత్కలిర్న ప్రభవేత్ప్రవిష్టో కాపీహ సర్వతః ।
యావదీశో మహానుర్యామాభిమన్యవ ఏకరాట్ ॥
అభిమన్యుపుత్రుడగు పరీక్షిత్తు ఏకచ్ఛత్రాధిపతియై భూమిని పాలించుచున్నంత వరకు, కలి ఈ లోకములో అంతటా వ్యాపించి యున్ననూ, ఆతని ప్రభావము ఉండదు.
యస్మిన్నహని యర్హ్యేవ భగవానుత్ససర్జ రామ్ ।
తదైవేహానువృత్తో సావధర్మప్రభవః కలిః ॥
ఏ రోజున ఏ క్షణములో భగవానుడు భూమిని విడిచినాడో, అదే క్షణములో అధర్మమునకు మూలకారణమగు కలి ఈ లోకములో ప్రవేశించి నాడు.
నానుద్వేష్టి కలిం సమ్రాట్ సారంగ ఇవ సారభుక్ ।
కుశలాన్యాశు సిధ్యంతి నేతరాణి కృతాని యత్ ॥
కలియుగములో పుణ్యమును తలబెట్టినంత మాత్రాన ఫలము సిద్ధించును. కాని పాపమును తల పెట్టి ఆచరించినప్పుడు మాత్రమే దాని ఫలము మానవునకు తగులుకోనును. ఈ సారము తుమ్మెద వలె సారగ్రా హియగు పరీక్షిత్తునకు తెలియును. కావుననే, ఆయన కలిని ద్వేషించలే
కీం ను బాలేషు శూరేణ కలినా ధీరధీరుణా ।
అప్రమత్తః ప్రమత్తేషు యో వృకో నృషు వర్తతే ॥
తోడేలు గొర్రెల మందలో ప్రవేశించి వాటిని కబళించును. అదే విధముగా కలీ అసోవధానమగు చిత్తము గల మానవులలో ప్రవేశించి వారిని ప్రభావితులను చేయును. ఈ విధముగా అవివేకులపై తన ప్రతిభను చూపే కలి వివేకవంతుల యెడల భయపడును. అట్టి భీరువు వలన ఏమగును?
ఉపవర్జితమేతద్వః పుణ్యం పారీక్షితం మయా ।
వాసుదేవకథ పేతమాఖ్యానం యదపృచ్చత ॥
మీరు కోరిన విధముగా నేను ఇంతవరకు శ్రీకృష్ణభగవానుని వృత్తాంతముతో కలిసి ఉన్న పవిత్రమైన పరీక్షిత్తుయొక్క గాథను మీకు చెప్పియుంటిని.
యా యాః కథా భగవతః కథనీయోరుకర్మణః ।
గుణకర్మాశ్రయాః పుంభిస్సం సేవ్యాస్తా బుభూషుభిః ॥
భగవానుని గుణములు మరియు. లీలలు విషయవస్తువులుగా గల కథలు చక్కగా వర్ణించుటకు తగియుండును. శ్రేయస్సును కోరు మన వుడు వాటిని అన్నింటినీ సేవించ దగును.
ఋషయ ఊచుః ।
సూత జీవ సమాసౌమ్య శాశ్వతీర్విశదం యశః ।
యస్త్వం శంససి కృష్ణస్య మర్త్యానామమృతం హి నః ॥
ఓ సూతా! నీవు మర్త్యులమగు మాకు శ్రీకృష్ణభగవానుని అమృత తుల్యమగు విశుద్ధకీర్తిని గురించి వర్ణించినావు. అట్టి నీవు చిరకాలము జీవించము.
కర్మణ్యస్మిన్ననాశ్వాసే ధూమధూమ్రాత్మనాం భవాన్ ।
ఆపాయయతి గోవిందపాదపద్మాసవం మధు ॥
ఈ సత్రయాగము మమ్ములను గట్టెక్కించుననే నమ్మకము లేదు. ఈ యజ్ఞములో మా శరీరములు పొగరినవి. నీవు మాకు మధురమగు
తులయామ లవేనాపి న స్వర్గం నాపునర్భవమ్ ।
భగవత్సంగి పంగస్య మర్త్యానాం కిముతాశిషః ॥
విష్ణుభక్తులతోడి సంగముయొక్క లేశమునకైననూ స్వర్గము గాని, పునర్జన్మ లేని మోక్షము గాని తులదూగవు. ఇక మరణధర్ములగు మాస వుల భోగములను గురించి చెప్పునదేమున్నది?
కో నామ తృప్యేద్రసవిత్కథాయాం
మహత్తమైకాంతపరాయణస్య ।
నాంతం గుణానామగుణస్య జగ్ముః ।
యోగేశ్వరా యే భవపాద్మముఖ్యాః ॥
శ్రీకృష్ణభగవానుడు మహాత్ములకు ఏకైకము మరియు పర్వో త్కృష్టము అగు ఆశ్రయమై యున్నాడు. ఆయన కథలయందు రసజ్ఞుడగు వానికి ఎవనికైననూ తృప్తి కలుగదు. శివుడు, బ్రహ్మ మొదలగు యోగేశ్వరులు నిర్గుణుడగు పరమేశ్వరుని గుణముల అంతమును కనుగొనలేక పోయిరి.
తన్నో భవాన్వై భగవత్ప్రధానో
మహాత్తమైకాంతపరాయనస్యస్య ।
హరేరుదారం చరితం విశుద్ధం
శుశ్రూషతాం నో వితనోతు విద్వన్॥
ఓ విద్వాంసుడా! నీ జీవితములో భగవత్సేవ ప్రముఖమైన అంశ ముగా నున్నది. అట్టి నీవు మహాత్ములకు ఏకమాత్రజీవనసర్వస్వమగు శ్రీహరియొక్క పవిత్రచరితమును వినగోరే మాకు దానిని విస్తారముగా చెప్పుము.
స వై మహాభాగవతః పరీక్షిద్యేనాపవర్గాఖ్యమదభ్రబుద్ధిః ।
జ్ఞానేన వైయాసికశబ్దితేన భేజే ఖగేంద్రధ్వజపాదమూలమ్ ॥
తన్నః పరం పుణ్యమసంవృతార్థ-
మాఖ్యానమత్యద్భుతయోగనిష్ఠమ్ ।
ఆఖ్యాహ్యనంతాచరితోపపన్నం
పొరీక్షితం భాగవతాభిరామమ్ ॥
మహాబుద్ధిశాలి మాత్రమే గాక, గొప్ప భగవద్భక్తుడు కూడా అయిన ఆ పరీక్షిన్మహారాజు వ్యాసపుత్రుడగు శుకమహర్షిచే ఉపదేశించబ డిన జ్ఞానముయొక్క ప్రభావముచే మోక్షము అని పిలువబడే గరుడధ్వ జుని పాదమూలమును పొందెను. అట్టి పరమపవిత్రమగు భాగవతపురాణ ము ఆ అనంతుని లీలలతో మాత్రమే గాక, అత్యాశ్చర్యకరమగు జ్ఞానని ష్ఠతో గూడియున్నది. శుకుడు పరీక్షిత్తునకు ఉపదేశించిన ఆ భాగవతము భగవద్భక్తులకు అత్యంతప్రీతిపాత్రమైనది. దాని అర్థము మాకు సుస్పష్ట ముగా బోధపడే విధముగా నీవు దానిని మాకు చెప్పుము.
సూత ఉవాచ ।
అహో వయం జన్మభృతో ఽద్య హాస్మ
వృద్దానువృత్త్యాపి విలోమజాతాః ।
దౌష్కుల్యమాధిం విధునోతి శీఘ్రం
మహత్తమానామభిధానయోగః ॥
ఆశ్చర్యము! బాగు బాగు! నేను విలోమకులమునకు చెందినవా డనే అయిననూ ఈ నాడు మహాత్ముల సేవాభాగ్యము లభించుటచే నా జన్మ సఫలమైనది. మహాత్ములతో సంభాషించే యోగము పట్టినచో, అది విలోమకులమునకు చెందియుండుట వలన కలిగిన మానసిక పీడను శీఘ్ర ముగా పోగొట్టును.
కుతః పునర్గృణతో నామ తస్య
మహత్త మైకాంతపరాయణస్య ।
యో ఽనంతశక్తిర్బగవాననంతో
మహద్గుణత్వాద్యమనంతమాహుః ॥
మహాత్ములకు ఏకమాత్ర శరణస్థానమగు పరమేశ్వరుని నామ మును కీర్తించు వాని దోషములన్నియు తొలగి పోవునని వేరే చెప్పవల యునా? ఆ శ్రీవిష్ణుభగవానుడు అనంతమగు శక్తి గలవాడు, మరియు అంతము లేని గొప్ప గుణములు గలవాడు అగుట చేతనే ఆయనకు అనం తుడను పేరు వచ్చినది.
ఏతావతా ఽలం నను సూచితేన
గుణైరసామ్యానతిశాయనస్య ।
హిత్వేతరాన్ ప్రార్థయతో విభూతిః
యస్యాంఘ్రిరేణుం జుషతే ఽనభీప్సోః ॥
గుణములచే పరమేశ్వరునితో సమానమైనవాడు గాని, అధికుడు గాని లేడను విషయమును తెలియుటకు ఇంతమాత్రము సూచించిన చాలు ను. అది యేదనగా, లక్ష్మి తనను ప్రార్థించే బ్రహ్మాదులను విడిచి పెట్టి, తనను కోరని శ్రీహరియొక్క పాదధూళిని సేవించుచున్నది.
అథాపి యత్పాదనఖావసృష్టం
జగద్విరించోపహృతార్హణాంభః ।
సేశం పునాత్యన్యతమో ముకుందాత్
కో నామ లోకే భగవత్పదార్థః ॥
ఇంతేగాక, బ్రహ్మగారు శ్రీహరియొక్క పాదములపై అర్ఘ్యజల మును సమర్పించగా, అదియే ఆ పాదములనుండి జారి గంగయై, శివు నితో సహా జగత్తును పవిత్రము చేయుచున్నది. ముకుందుని మినహా యించి భగవాన్ (ఐశ్వర్య-వీర్య-యశః- శ్రీ-జ్ఞాన-వైరాగ్యములనే ఆరు గుణములు గలవాడు) అనే పదము మరి యెవరిని నిర్దేశించును?
యత్రానురక్తాస్సహసైవ ధీరా
వంసొహః దేహాదిసు సంగమూడం।
వ్రజంతి తత్పారమహంస్యమంత్యం
యస్మిన్నహింసోపశమస్స్వధర్మః ॥
ఆ పరమేశ్వరునియందు భక్తిగల వివేకులు శీఘ్రముగా దేహము మొదలగు వాటియందు గల బలమైన ఆసక్తిని విడిచి పెట్టి, ఆశ్రమములలో ఆఖరుది మరియు సర్వశ్రేష్థమైనది అగు పరమహంసాశ్రమము (సన్న్యాస ము) ను స్వీకరించి, అహింస మరియు సర్వకర్మసన్న్యాసము అనునవి సహజధర్మములుగా గలవారు అగుదురు.
అహం హి పృష్టో కార్యమణో భవద్భిః
ఆచక్ష ఆత్మావగమో 5త్ర యావాన్ ।
నభః పతంత్యాత్మసమం పతత్రిణః
తథా సమం విష్ణుగతిం విపశ్చితః ॥
సూర్యుని వలె ప్రకాశించే ఓ మహాత్ములారా! మీరు నన్ను శ్రీహరి యొక్క లీలలను గురించి ప్రశ్నించిరి. ఈ విషయములో నేను నాకు గల జ్ఞానమునకు అనురూపముగా మాత్రమే చెప్పగలను. పక్షులు ఆకాశములో పైకి తమ శక్తి మేరకు మాత్రమే ఎగురును గదా! అటులనే, విద్వాంసులు విష్ణువుయొక్క లీలలను తమ శక్తిమేరకు మాత్రమే వర్ణించ గల్గుదురు. కాని, ఆకాశము వలె ఆ లీలలు అనంతములే.
ఏకదా ధనురుద్యమ్య విచరన్మృగయాం వనే ।
మృగాననుగతః శ్రాంతః క్షుధితస్తృషితో భృశమ్ ॥
ఒకనాడు పరీక్షిన్మహారాజు అడవిలో వేటాడుచూ ధనస్సును ఎక్కు పెట్టి మృగముల వెనుక వెళ్లి వెళ్లి అలసి సొలసి అధికమగు ఆకలి దప్పికలకు వశుడయ్యెను.
జలాశయమచక్షాణః ప్రవివేశ తమాశ్రమమ్ ।
దదర్శ మునిమాసీనం శాంతం మీలితలోచనమ్ ॥ ప్రతిరుద్దేంద్రియప్రాణమనోబుద్దిముపారతమ్ ।
స్థానత్రయాత్పరం ప్రాప్తం బ్రహ్మభూతమవిక్రియమ్ ॥
విప్రకీర్ణజటాఛ్ఛన్నం రౌరవేణాజినేన చ ।
విశుష్యత్తాలురుదకం తథూభూతమయాచత ॥
ఆ పరీక్షిన్మహారాజునకు ఎక్కడా జలాశయము కానరాలేదు. ఆయన అచట ఒక ఆశ్రమములోనికి ప్రవేశించెను. అచట కన్నులు మూసు కొని శాంతభావముతో నున్నవాడు, ఇంద్రియవ్యాపారములను (ప్రత్యాహార ము) ఉచ్చ్వాసనిశ్శ్వాసలను (ప్రాణాయామము) కట్టి పెట్టి మనస్సును బుద్ధిని నిరోధించి (సమాధి) సంసారమునకు అతీతముగా నున్నవాడు, జాగ్రత్-స్వప్న-సుషుప్తులు అనే మూడు అవస్థలకు అతీతమైన ప్రత్యగభి న్నమగు నిర్వికారపరబ్రహ్మస్వరూపమునందు ప్రతిష్ఠితుడై యున్నవాడు, రేగిన జటలచే మరియు కృష్ణమృగచర్మముచే కప్పబడియున్న దేహము గలవాడు అగు మునిని చూచి, ఎండిపోవుచున్న అంగుడి గల ఆ మహా రాజు ఆయనను నీటిని ఇమ్మని కోరెను.
అలబ్ధతృణభూమ్యాదిరసంప్రాప్తిర్ఘసూనృతః ।
అవజ్ఞాతమినాత్మానం మన్యమానశ్చుకోప హ ॥
ఆ ముని రాజునకు కూర్చునే చాపను ఈయలేదు. ఆసనమనసు చూపించలేదు. త్రాగే నీటిని ఈయలేదు. తియ్యని పలకరింపు లేదు. ఆయన తనను అవమానించినాడనియే రాజు భావించి కోపించేను.
అభూతపూర్వస్సహసో క్షుత్తృడ్భ్యామర్దితాత్మనః।
బ్రాహ్మణం ప్రత్యభూద్బృహ్మన్మత్సరో మన్యురేవ చ ॥
ఓ శౌనకమహర్షీ! ఆకలి దప్పీకలతో బాధపడుచున్న రాజునకు వెనువెంటనే ఇదివరలో ఎన్నడూ లేని విధముగా ఆ మునిపై అసహనము మరియు కోపము కలిగెను.
స తు బ్రహ్మఋ షేరం సే గతాసుమురగం రుషా ।
వినిర్గచ్ఛన్ ధనుష్కోట్యా నిధాయ పురమాగమత్ ॥
ఆ మహారాజు అక్కడనుండి బయటకు వస్తూ, చచ్చిపడియున్న ఒక పామును ధనస్సుయొక్క కొనతో కోపముచే ఆ బ్రహ్మర్షి మెడలో వేసి, నగరమునకు తిరిగి వచ్చెను.
ఏష కిం నిభృతాశేషకరణే మీలితేక్షణః ।
మృషాసమాధిరాహోస్విత్కిం ను స్యాత్ క్షత్రబంధుభిః ॥
ఈతడు వాస్తవముగా సకలేంద్రియములను ఉపసంహరించి కన్ను లను మూసుకొనియున్నాడా? లేక, ఈ అయోగ్యులగు రాజులతో మనకు పని యేమి అని తలచి, సమాధిని నటించుచున్నాడా? (అని ఆ రోజు ఆ సమయములో తలపోసెను).
తస్య పుత్రోఽకతితేజస్వీ విహరన్ బాలకో ఽర్భకైః ।
రాజ్ఞాఽమం ప్రాపితం తాతం శ్రుత్వా తత్తేదమబ్రవీత్ ॥
ఆ మునికి మహాతేజశ్శాలియగు బాలకుడైన పుత్రుడు గలడు. ఆతడు పిల్లలతో ఆడుకుంటూ, రాజు తన తండ్రి విషయములో తప్పుగా ప్రవర్తించినాడని విని, అప్పుడు ఇట్లు పలికెను.
అహో అధర్మః పాలానాం పీవ్నాం బలిభుజామివ ।
స్వామిన్యఘం యద్దాసానాం ద్వారపానాం శునామివ ॥
జనులు విసిరిన అన్నమును తిని బలిసియున్న కాకులవంటి పాల కులు ఎంతటి అధర్మమును చేయుచున్నారు! పాలకులు తమ ప్రభువులగు ప్రజలకు ద్రోహమును చేయుట, గుమ్మము వద్ద కాపలా కాసే కుక్క ప్రభువు ఇంటిలోనికి చొరబడిన చందముగా నున్నది.
బ్రాహ్మణైః క్షత్రబంధుర్హి ద్వారపాలో నిరూపితః ।
స కథం తద్గృహే ద్వాస్థస్సభాండం భోక్తుమర్హతి ॥
ఈ అయోగ్యుడగు క్షత్రియుడు బ్రాహ్మణులచే తమ ద్వారపాలకు నిగా నియోగించ బడినాడు. అట్టి ద్వారపాలకుడు ఇంటిలో ప్రవేశించి గిన్నె లోని ఆహారమును భుజించుట ఎట్లు సమంజసమగును?
కృష్ణే గతే భగవతి శాస్తర్యుత్పథగామినామ్ ।
తద్భిన్న సేతూనద్యాహం శాస్మి పశ్యత మే బలమ్ ॥
తప్పు దారిన నడిచే వారిని దండించే శ్రీకృష్ణభగవానుడు అవతా రమును చాలించినాడు. కాని, ఈ నాడు నేను మర్యాదను ఉల్లంఘించు వారిని దండించుచున్నాను. నా బలమును చూడుడు.
ఇత్యుక్త్వా రోషతామ్రాక్షో వయస్యానృషిబాలకాన్ ।
కౌశిక్యాప ఉపస్పృశ్య వాగ్వజ్రం విససర్జ హ ॥
కోపముతో ఎరుపెక్కిన కన్నులు గల ఆ ఋషిబాలకుడు తన మిత్రులగు ఋషిబాలకులతో నిట్లు పలికి, కౌశికీనదియొక్క నీటిని ఆచమ నము చేసి, వాక్కు రూపములోనున్న వజ్రము (శాపము) ను విడిచి పెట్టెను.
ఇతి లంఘితమర్యాదం తక్షకస్సప్తమేఽహని ।
దంక్ష్యతి స్మ కులాంగారం చోదితో మే తతద్రుహమ్ ॥
ఈ తీరున నా తండ్రికి ద్రోహమును చేయుట ద్వారా మర్యాదను ఉల్లంఘించి తన వంశమునకు చేటు తెచ్చి పెట్టిన ఆ వ్యక్తిని నాచే ప్రేరితుడైన తక్షకుడు ఈనాటినుండి ఏడవ రోజున వినాశము చేయగలడు.
తతో భ్యోత్యోశ్రమం దాతో గతేసర్బకలేవరమ్।
పితరం వీక్ష్య దుఃఖార్తో ముక్తకంఠో రురోద హ ॥
తరువాత ఆ మునిబాలకుడు. ఆశ్రమమునకు వచ్చి తన తండ్రి మెడలో పాముయొక్క మృతదేహమును గాంచి, దుఃఖపీడితుడై బిగ్గరగా రోదించెను.
స వా ఆంగిరసో బ్రహ్మన్ శ్రుత్వా సుతవిలాపనమ్ ।
ఉన్మీల్య శనకైర్నేత్రే దృష్ట్వా స్వాంసే మృతోరగమ్ ॥
విసృజ్య పుత్రం పప్రచ్ఛ వత్స కస్మాద్ధి రోదిషి ।
కేన వా తే ప్రతికృతమిత్యుక్తస్స న్యవేదయత్ ॥
ఓ శౌనకమహర్షీ! అంగిరసుని వంశములో జన్మించిన ఆ శమీకమహర్షి పుత్రుని రోదనమును విని, మెల్లగా కన్నులను తెరచి, తన మెడలోని చచ్చిన పామును చూచి, దానిని ఆవల పారవైచి, పుత్రుని ఇట్లు ప్రశ్నించెను: కుమారా! ఎందులకు ఏడ్చుచుంటివి? నీకు ఎవరు అపకారమును చేసినారు? అపుడా బాలకుడు జరిగిన వృత్తాంతమును చెప్పెను.
నిశమ్య శప్తమతదర్హం నరేంద్రం
స బ్రాహ్మణో నాత్మజమభ్యనందత్ ।
అహో బతాంహో మహదజ్ఞ తే కృతం
అల్పీయసి ద్రోహ ఉరుర్దమో ధృతః ॥
శాపమునకు అర్హుడు గాని పరీక్షిన్మహారాజును తన పుత్రుడు శపిం చినాడని విని, ఆ శమీకమహర్షి తన పుత్రుని అభినందించ లేదు. ఆయన వానితో నిట్లనెను: అయ్యో! ఓరీ మూర్ఖా! నీవు పెద్ద పాపమును చేసితివి. చిన్న తప్పుకు పెద్ద దండనను విధించితివి.
న వై నృభిర్నరదేవం పరాఖ్యం
సంమాతుమర్హస్యవిపక్వబుద్ధే ।
యత్తేజసా దుర్విష హేణ గుప్తా
విందంతి భద్రాణ్యకుతోభయాః ప్రజాః ॥
పరిపక్వము కాని బుద్ది గల ఓ అజ్ఞానీ! రాజు అనగా విష్ణువే అని శాస్త్రములు చెప్పుచున్నవి. అట్టి రాజును నీవు సామాన్యమానవులతో సమానముగా జమ కట్టుట తగదు. మహారాజుయొక్క తేజస్సును ఇత రులు సహించలేరు. ఆ తేజస్సుచే రక్షింపబడే జనులు భయవిముక్తులై మంగళములను పొందుచున్నారు.
అలక్ష్యమాణే నరదేవనామ్ని
రథాంగపాణావయమంగ లోకః ।
తదా హీ చోరప్రచురో వినంక్ష్య-
త్యరక్ష్యమాణోఽవివరూథవత్ క్షణాత్ ॥
ఓయీ! చక్రధారియగు విష్ణువు రాజు అనే పేరుతో లోకమును రక్షించుచుండును. అట్టి రోజు లేని కాలములో రక్షణ కరువైన ఈ లోకము చోరులతో నిండి, గొర్రెల మందవలే క్షణకాలములో నశించును.
తదద్య నః పాపము పైత్యనన్వయం
యన్నష్టనాథస్య వసోర్విలుంపకాత్ ।
పరస్పరం ఘ్నంతి శపంతి వృంజతే
పశూన్ స్త్రియోఽర్థాన్ పురుదస్యవో జనాః ॥
లోకమునకు రాజు లేనప్పుడు చోరులు ఇతరుల ధనమునపహ రించెదరు. ఆ పాపము సంబంధము లేకున్ననూ మనకు చుట్టుకొనును. జనులలో చోరుల శాతము పెరుగును. జనులు ఒకరినొకరు చంపుకోనె దరు; తిట్టుకొనెదరు; పశువులను, స్త్రీలను, సంపదలను అపహరించెదరు.
తదా ఽఽర్యధర్మశ్చ విలీయతే నృణాం
వర్ణాశ్రమాచారయుతస్తృయీమయః ।
తతో ఽర్థకామాభినివేశితాత్మనాం
శునాం కవీనామివ వర్ణసంకరః ॥
ఇంతే గాక, రాజు లేని సమాజములోని మానవులలో వైదికమగు ఆర్యధర్మము నశించి, వర్ణాశ్రమాచారములు లోపించి, జనులలో అర్థకామ ములయందలి తృష్ణ పెరిగి, వర్ణసంకరమేర్పడును. జనులు శునకముల వలె భోగమాత్రపరాయణులై, కోతుల వలే చంచలచిత్తు లగుదురు.
ధర్మపాలో నరపతిస్స తు సమ్రాడ్ బృహచ్ఛృవాః ।
సాక్షాన్మహాభాగవతో రాజర్షి ర్హయమేధయాట్ ।
క్షుత్తృట్ శ్రమయుతో దీనో నైవాస్మచ్ఛాపమర్హతి ॥
ధర్మరక్షకుడు, గొప్ప కీర్తి గలవాడు, స్వయముగా గొప్ప భక్తుడు, రాజర్షి, అశ్వమేధయాగములను చేసినవాడు అగు పరీక్షిన్మహారాజు ఆకలి దప్పికలతో అలసి సొలసి మన ఆశ్రమమునకు వచ్చినాడు. ఆ చక్రవర్తి మన శాపమునకు అర్హుడు కానే కాడు.
అపొపేషు స్వభృత్యేషు బాలేనాపక్వబుద్ధినా।
పాపం కృతం తద్భగవాన్ సర్వాత్మా క్షంతుమర్హతి ॥
పరిపక్వము కాని బుద్ధి గల ఈ అవివేకి పాపమునేరుంగని పోడు, మనకు సేవను చేయువాడు అగు మహారాజు విషయములో పాపమును చేసినాడు. సర్వప్రాణులకు ఆత్మరూపుడగు పరమేశ్వరుడు ఆ పాపమును క్షమించును గాక!
తిరస్కృతా విప్రలబ్ధాశ్శప్తాః క్షిప్తా హతాపి వా ।
నాస్య తత్ప్రతికుర్వంతి తద్భక్తాః ప్రభవో ఽపి హి ॥
శ్రీహరి భక్తులను తిరస్కరించిననూ, మోసగించిననూ, తిట్టిననూ, అవమానించిననూ, ఆఖరికి కొట్టిననూ, వారు సమర్థులే అయి ఉండి కూడా, దానికి ప్రతీకారమును చేయరు.
ఇతి పుత్రకృతాఘేన సో ఽనుతప్తో మహామునిః ।
స్వయం విప్రకృతో రాజ్ఞా నైవాఘం తదచింతయత్ ॥
ఈ విధముగా ఆ శమీకమహర్షి తన కుమారునిచే రాజు విషయములో చేయబడిన పాపమునకు పశ్చాత్తాపపడుచుండెనే గాని, తన విషయములో రాజు చేసిన దోషమును గురించి తలపోయనే లేదు.
ప్రాయశస్సాధవో లోకే పరైర్ద్వంద్వేషు యోజితాః ।
న వ్యథంతి న హృష్యంతి యత ఆత్మా ఽగుణాశ్రయః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధే
అష్టాదశోఽధ్యాయః ॥
లోకములో జనులు తమను సుఖదుఃఖాది ద్వంద్వములకు గురి చేసిననూ, సాధుపురుషులయందు దుఃఖము గాని, హర్షము గాని ఉండ దు. ఏలయనగా, ఆత్మస్వరూపము సుఖదుఃఖాదులకు అతీతమైనది.
శ్రీమద్భాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో
పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 18 of the Bhāgavata Mahā Purana is as follows:
While hunting in the deep forest, King Parīkshit becomes fatigued, thirsty, and hungry, and enters the hermitage of the sage Shamīka Rishi, who was immersed in deep trance and failed to offer royal hospitality. Momentarily overcome by anger and fatigue, the king places a dead snake around the sage's neck and departs, prompting the sage's arrogant young son Śṛṅgī to curse the king to die from the bite of the flying snake-bird Takshaka within seven days, a curse which King Parīkshit accepts with serene humility as the divine will of the Lord.