9 -  నవమోఽధ్యాయః

సూత ఉవాచ

ఇతి భీతః ప్రజాద్రోహాత్సర్వధర్మవివిత్సయా

తతో వినశనం ప్రాగాద్యత్ర దేవవ్రతోఽపతత్

సూతుడు ఇట్లు పలికెను: తరువాత ఈ విధముగా ప్రజలకు జరి గిన ద్రోహము వలన భయపడుతున్న ధర్మరాజు ధర్మములను తెలియవలె ననే కోరికతో కురుక్షేత్రములో భీష్ముడు పడియున్న స్థలమునకు వెళ్లాను.

తదా తే భ్రాతరస్సర్వే సదశ్వైస్స్వర్ణభూషితైః

అన్వగచ్ఛన్ రథైర్విపా వ్యాసధౌమ్యాదయస్తథా

ఓ మహర్షులారా! అప్పుడు నలుగురు సోదరులు మాత్రమే గాక, వ్యాసుడు ధౌమ్యుడు మొదలగు వారందరు, బంగరు వస్తువులచే అలంక రింపబడి జాతి గుర్రములను పూన్చిన రథములపై, ధర్మరాజును అనుస రించి వెళ్లిరి.

భగవానపి విప్రర్షే రథేన సధనంజయః !

స తైర్వ్యరోచత నృపః కుబేర ఇవ గుహ్యకైః II

ఓ శౌనకమహర్షీ! శ్రీకృష్ణుడు కూడ అర్జునునితో బాటు రథముపై వెళ్లాను. వారందరితో కూడియున్న ధర్మరాజు యక్షులతో కూడియున్న కుబేరుని వలే విశేషముగా ప్రకాశించెను.

దృష్ట్వా నిపతితం భూమౌ దివశ్చ్యుతమివామరమ్

ప్రణేముః పాండవా భీష్మం సానుగాస్సహ చక్రిణా

నేలపై పడియున్న భీష్ముడు స్వర్గమునుండి జారిపడిన దేవతా మూర్తివలె నుండెను. పాండవులు శ్రీకృష్ణునితో సహా సపరివారముగా ఆయనకు నమస్కరించిరి.

తత్ర బ్రహ్మర్షయస్సర్వే దేవర్షయశ్చ సత్తమ

రాజర్షయశ్చ తత్రాసన్ ద్రష్టుం భరతపుంగవమ్

మహాపుణ్యాత్ముడవగు ఓ శౌనకమహర్షీ! ఆ సమయములో అచట బ్రహ్మర్షులు, దేవర్షులు మరియు రాజర్షులు అందరు 'భరతవంశశిఖామణి యగు భీష్ముని చూచుటకై సమగూడిరి.

పర్వతో నారదో ధౌమ్యో భగవాన్ బాదరాయణః

బృహదశ్వో భరద్వాజస్సశిష్యో రేణుకాసుతః

వసిష్ఠ ఇంద్రప్రమదస్త్రీతో గృత్సమధోఽసితః

కక్షివాన్ గౌతమోఽత్రిశ్చ కౌశికోఽథ సుదర్శనః

అన్యే చ మునయో బ్రహ్మన్ బ్రహ్మరాతాదయోఽమలాః

శిష్యైరు పేతా ఆజగ్ముః కశ్యపాంగీరసాదయః

ఓ శౌనకమహర్షీ! పర్వతుడు, నారదుడు, ధౌమ్యుడు, పూజనీయు డగు వ్యాసుడు, బృహదశ్వుడు, భరద్వాజుడు, శిష్యులతో కూడియున్న పరశురాముడు, వసిష్ఠుడు, ఇంద్రప్రమదుడు, త్రితుడు, గృత్సమదుడు, అసితుడు, కక్షివంతుడు, గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, సుదర్శనుడు, శుకుడు, కశ్యపుడు, అంగీరసుడు మొదలగు పవిత్రులగు మహార్డులు శిష్యులతో గూడ  విచ్పేసిరి:

తాన్ సమేతాన్ మహాభాగానుపలభ్య వసూత్తమః

పూజయామాస ధర్మజ్ఞో దేశకాలవిభాగవిత్

దేశకాలముల విభాగమును, ధర్మములను తెలిసిన వసుశ్రేష్ఠుడగు భీష్ముడు అచటకు విచ్చేసిన ఆ మహాత్ములను చూచి వారిని (వాక్కులతో) పూజించెను.

కృష్ణం చ తత్పృభావజ్ఞ ఆసీనం జగదీశ్వరమ్

హృదిస్థం పూజయామాస మాయయోపాత్తవిగ్రహమ్

జగన్నాథుడు, మాయాశక్తిచే మానవదేహమును దాల్చినవాడు అగు శ్రీకృష్ణుడు అక్కడ కూర్చుని యుండెను. ఆయన ప్రభావము భీష్మునకు బాగుగా తెలియును. భీష్ముడు ఆయనను హృదయములో ధ్యానించుచునే యుండెను. ఆయనను కూడ భీష్ముడు పూజించెను.

పాండుపుత్రానుపాసినాన్ ప్రశ్రయప్రేమసంగతాన్

అభ్యాచష్టానురాగా స్రైరంధీభూతేన చక్షుషా

పాండవులు వినయముతో ప్రేమతో ఆయనకు దగ్గరగా కూర్చుం డిరి. ఆయనకు వారిని చూచుట తోడనే ప్రేమాశ్రువులతో కన్నులు నిండి చూపు కానరాలేదు. ఆయన వారితో నిట్లనెను.

అహో కష్టమహ్యోఽన్యాయ్యం యద్యూయం ధర్మనందనాః

జీవితుం నార్హథ క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయాః

అయ్యో! కష్టము! అన్యాయము! ఓ ధర్మానుయాయులారా! బ్రహ్మవేత్తలను ధర్మమును శ్రీకృష్ణుని ఆశ్రయించుకొని జీవించే మీరు కూడా కష్టములతో జీవించ వలసి వచ్చినది. ఇది అయోగ్యము!

సంస్థిత్యేఽతిరథే పాండౌ పృథా బాలప్రజా వధూః

యుష్మత్కృతే బహూన్ క్లేశాన్ ప్రాప్తి తోకవతీ ముహుః

పాండు మహారాజు మరణించు నాటికి కోడలు అగు కుంతి చిన్న పిల్లల తల్లి. ఆమె తన పిల్లలతో బాటు వారి కొరకై పలుమార్లు అనేకము లగు కష్టములను పడినది.

సర్వం కాలకృతం మన్యే భవతాం చ యదప్రియమ్

సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావలిః

మీకు కూడ చాల కష్టములు కలిగినవి. అది అంతా కాలము యొక్క ప్రభావమేనని నేను తలచుచున్నాను. ఏలయనగా, మేఘసమూ హము వాయువుయొక్క అధీనములో నుండే విధముగా లోకపాలకులతో సహా జగత్తు కాలపురుషుని అధీనములో నున్నది.

యత్ర ధర్మసుతో రాజా గదాపాణిర్వృకోదరః

కృష్ణోఽస్త్రీ గాండీవం చాపం సుహృత్కృష్ణస్తతో విపత్

సాక్షాత్తుగా ధర్మరాజు రాజై యుండగా, భీముడు గదను అస్త్రవేత్త యగు అర్జునుడు గాండీవమును పట్టుకొని రక్షించుచుండగా, శ్రీకృష్ణుడు మిత్రుడు మరియు రక్షకుడై యుండగా ఆపదలు వచ్చినవి.

న హ్యస్య కర్హిచిద్రోజన్ పుమాన్ వేద విధిత్సితమ్

యద్విజిజ్ఞాసయా యుక్తా ముహ్యంతి కవయ్వోఽపి హి

ఓ ధర్మరాజా! ఈ శ్రీకృష్ణుడు ఎప్పుడు ఏమి చేయదలచుకుంటు న్నాడో ఎవరైననూ తెలియలేరు. ఈశ్వరుని అభీష్టమును తెలియాలని యత్నించి పండితులు కూడ మోహమును పొందుచున్నారు.

తస్మాదిదం దైవతంత్రం వ్యవస్య భరతర్షభ

తస్యానువిహితోఽనాథా నాథ పాహి ప్రజాః ప్రభో

భరతవంశములో శ్రేష్టుడవగు ఓ రాజా! ప్రజానాథా! కావున, ఇది అంతా దైవమునకు అధీనమై యున్నదని నిశ్చయించుకొని, ఆ ఈశ్వరు నకు అనుయాయివై నాథుడు లేని ప్రజలను పాలించుము.

ఏష వై భగవాన్ సాక్షాదాద్యో నారాయణః పుమాన్

మోహయన్మాయయా లోకం గూఢశ్చరతి వృష్టిషు

ఈ శ్రీకృష్ణుడే సాక్షాత్తుగా భగవానుడు, ఆదిపురుషుడు అగు నారాయణుడు. ఈయన యదువంశములో గూఢముగా నున్నవాడై లోక మును తన మాయాశక్తిచే మోహింప జేయుచూ సంచరించు చున్నాడు.

అస్యానుభావం భగవాన్ వేద గుహ్యతమం శివః

దేవర్షిర్నారదస్సాక్షాద్భగవాన్ కపిలో నృప

ఓ ధర్మరాజా! ఈ శ్రీకృష్ణుని రహస్యపూర్ణమగు మహిమను శివభ గవానుడు, దేవర్షియగు నారదుడు మరియు సాక్షాత్తు కపిల భగవానుడు యెరుగుదురు.

యం మన్యసే మాతులేయం ప్రియం మిత్రం సుహృత్తమమ్

అకరోస్సచివం దూతం సౌహృదాదథ సారథిమ్

ఆ భగవానుని నీవు పినతల్లి కొడుకు, ప్రియమిత్రుడు, మహోప కారి అని భావించి, ఆయనను స్నేహము వలన నీకు మంత్రిగా, రాయబా రిగా మరియు సారథిగా మలచుకొంటివి.

సర్వాత్మనస్సమదృశో హ్యద్వయస్యానహంకృతేః

తత్కృతం మతివైషమ్యం నిరవద్యస్య న క్వచిత్

సర్వమునకు ఆత్మ, సమదర్శి, అద్వితీయుడు, అనహంకారి, రాగాది దోషములు లేనివాడు అగు శ్రీకృష్ణునకు చిన్న పెద్ద పనులను చేయుట వలన కలిగే వ్యతిరేక భావము ఏ కాలమునందైననూ లేదు.

తథాప్యేకాంతభక్తేషు పశ్య భూపానుకంపితమ్

యన్మేఽసంస్త్యజతస్సాక్షాత్కృష్ణో దర్శనమాగతః

ఓ రాజా! ఆయన సర్వత్రా సమదర్శియే యైననూ, ఆయనకు ఏకాంతభక్తులయందు గల దయను చూడుము. ఏలయనగా, ప్రాణము లను విడువబోయే నాకు సాక్షాత్తుగా ఈ శ్రీకృష్ణుని దర్శనమైనది.

భక్త్యావేశ్య మనో యస్మిన్వాచా యన్నాము కీర్తయన్

త్యజన్ కలేవరం యోగీ ముచ్యతే కామకర్మభిః

శ్రీకృష్ణునియందు మనస్సును లగ్నము చేసి, ఆయన నామ మును కీర్తిస్తూ ప్రాణములను విడిచి పెట్టే యోగి కామనలనుండి మరియు వాటిచే ప్రేరితమై చేయబడే కర్మలనుండి విముక్తుడగును.

స దేవదేవో భగవాన్ ప్రతీక్షతాం

కలేవరం యావదిదం హీనోమ్యహమ్

ప్రసన్నహాసారుణలోచనోల్లసన్-

ముఖాంబుజో ధ్యానపథశ్చతుర్భుజః

దేవదేవుడైన ఆ శ్రీమన్నారాయణ భగవానుడు నాకు ధ్యానమార్గ ములో దర్శనమిచ్చుచున్నాడు. ప్రసన్నమగు చిరునవ్వుతో ఎర్రని కన్ను లతో ప్రకాశించే పద్మమువంటి ముఖము గల ఆయన శ్రీకృష్ణరూపములో నుండి చూచుచుండగా నేను ఈ దేహమును విడుచుచున్నాను.

సూత ఉవాచ

యుధిష్ఠిరస్తదాకర్ణ్య శయానం శరపంజరే

అపృచ్ఛద్వివిధాన్ ధర్మానృషీణామనుశృణ్వతామ్

ధర్మరాజు ఆ మాటను విని, ఋషులు అనుసరించి వినుచుండ గా, అంపశయ్య పై పరుండియున్న భీష్ముని వివిధ ధర్మములను గురించి ప్రశ్నించెను.

వైరాగ్యరాగోపాధిభ్యామామ్నా తోభయలక్షణాన్

దానధర్మాన్ రాజధర్మాన్మోక్షధర్మాన్ విభాగశః

స్త్రీధర్మాన్ భగవద్ధర్మాన్ సమాసవ్యాసయోగతః

ధర్మార్థకామమోక్షాంశ్చ సహోపాయాన్ యథా మునే

నానాఖ్యానేతిహా సేషు వర్ణయామాస తత్త్వవిత్

ఓ శౌనక మహర్షీ! తత్త్వవేత్తయగు భీష్ముడు మానవుని స్వభావమును బట్టి వర్ణాశ్రమములకు అనురూపముగా విధింపబడిన, మరియు రాగము వైరాగ్యము అనే మానసికస్థితులకు అనురూపమైన, ప్రవృత్తి-నివృతిరూపములగు ద్వివిధ ధర్మములను, దానధర్మములను, రాజులు పాటిoచదగిన ధర్మములను, మోక్ష హేతువులగు శమదమాది ధర్మములను స్త్రీల ధర్మములను, ఏకాదశీవ్రతము మొదలగు భగవతీతికనగు ధర్మములను కూడ విడివిడిగా సందర్భమును బట్టి సంక్షేపముగా మాత్రమే కాక విస్తారముగా కూడ వర్ణించెను. ఇంతేగాక, ఆయన వివిధములగు గాథలలో ముగియు ఇతిహాసములలో ఉన్న విధముగా మోక్షములనే గొలుగు విధముల పురుషార్థములను వాటి ఉపాయములతో సహ వర్ణించేను.

ధర్మం ప్రవదతస్తస్య స కొలః ప్రత్యుపస్థితః

యో యోగినశ్ఛందమృత్యోర్వాంఛితస్తూత్తరాయణః

తాను కోరినప్పుడు మరణించే వరము గల జ్ఞానియగు భీష్ముడు 'ధర్మములను చెప్పుచుండగానే, అభీష్టమగు ఉత్తరాయణ పుణ్యకాలము సంప్రాప్తమయ్యెను.

తదోపసంహృత్య గీరస్సహస్రణీః

విముక్తసంగం మన ఆదిపూరుషే

కృష్ణే లసత్పీతపటే చతుర్భుజే

పురఃస్థితేఽమీలితదృగ్వ్యధారయతి

యుద్దములో వేయి రథికులను నడిపించే భీష్ముడు ఆ సమయ ములో మాటలను ఆపివేసి, సాంసారికములగు ఆసక్తులనుండి విముక్తమై యున్న మనస్సును నాలుగు భుజముల ఆదినారాయణుడు, ప్రకాశించే పచ్చని జంట వస్త్రములను ధరించినవాడు, ఎదురుగా నిలుచున్నవాడు అగు శ్రీకృష్ణునిపై కన్నులను మూయకుండగనే లగ్నము చేసెను.

విశుద్ధయా ధారణయా హతాశుభః

తదీక్షయైవాశు గతాయుధవ్యథః

నివృత్తసర్వేంద్రియవృత్తివిభ్రమ:

తుష్టావ జన్యం విసృజన్ జనార్ధనమ్

పరమపవిత్రమగు భగవద్రూపధ్యానముచే భీష్ముని దోష శేషము నశించెను. ఆయుధముల వలన కలిగిన శారీరకపీడ శ్రీకృష్ణుని దర్శనమా త్రముచే తొలగిపోయేను. భీష్ముడు సమస్తములగు ఇంద్రియముల వ్యాపా రములను, విలాసలను ఉపసంహరించి, దేహమును విడిచి పెడుతూ, నారాయణుని స్తుతించెను.

భీష్మ ఉవాచ

ఇతి మతిరుపకల్పితా వితృష్ణా

భగవతి సాత్వతపుంగవే విభూమ్ని

స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం

ప్రకృతిముపేయుషి యద్భవప్రవాహః

భీష్ముడిట్లు పలికెను: పరమాత్మ స్వరూపభూతమగు ఆనంద మును పొందియున్నవాడే అయిననూ ఒకానొకప్పుడు క్రీడించుటకై మాయాశక్తిని ఉపాధిగా స్వీకరించుచుండును. ఆ మాయాశక్తి వలననే ఈ జగత్తు అనే ప్రవాహము ఉదయించుచున్నది. అట్టి అనంతుడగు పరమేశ్వ రుడు యదువంశశిరోమణియగు శ్రీకృష్ణభగవానుని రూపములో నా యే దుట నున్నాడు. ధర్మము మొదలగు వాటి అనుష్టానముచే కామనలు లేకుండగా పవిత్రమైన నా మనస్సును ఆ అనంతునియందు సమర్పించు చున్నాను.

త్రిభువనకమనం తమాలవర్ణం

రవికరగౌరవరాంబరం దధానే

వపురలకకులావృతాననాబ్జమ్

విజయసఖే రతిరస్తు మేఽనవద్యా

అనవద్యా = ఫలమందలి తృష్ణను యెరుగని, రతిః = ప్రీతి, అస్తు = కలుగు గాక!

నీలమేఘశ్యాముడు, ఉదయించే సూర్యుని వలె ప్రకాశించే పచ్చని శ్రేష్టవస్త్రములను ధరించువాడు, ముంగురులతో కూడిన పద్మము వంటి ముఖము గలవాడు అగు శ్రీకృష్ణుని రూపము ముల్లోకములలో సుందరమైనది. ఆ అర్జునసఖుడగు భగవానునిపై నాకు ఫలతృష్ణ లేని ప్రీతి కలుగుగాక!

యుధి తురగరజోవిధూమ్రవిష్వక్-

కచలులితశ్రమవార్యలంకృతాస్యే

మమ నిశితశరైర్విభిద్యమాన-

త్వచి విలసత్కవచేఽస్తు కృష్ణ ఆత్మా

యుద్ధములో గుర్రములచే రేగగొట్టబడిన ధూళిచే ఆయన ముంగురులు ధూసరవర్ణమును కలిగియుండెను. ఆయన ముఖమంతయు చెమటతో నిండి ప్రకాశించు చుండెను. నా వాడి బాణములు ఆయన కవచ మును పగులగొట్టి చర్మమును చీల్చుచుండెను. అట్టి శ్రీకృష్ణునియందు నా మనస్సు స్థిరమగు గాక!

సపది సఖివచో నిశమ్య మధ్యే

నిజపరయోర్బలయో రథం నివేశ్య

స్థితవతి పరసైనికాయురక్ష్ణా

హృతవతి పార్థసఖే రతిర్మమాస్తు

మిత్రుడగు అర్జునుని మాటను విని వెంటనే రథమును తమ సైన్య మునకు శత్రు సైన్యమునకు మధ్యలో నిలిపి, చూపులతోనే శత్రు సైనికుల ఆయుర్దాయములను అపహరిస్తూ ఉండే పార్థసారథియగు శ్రీకృష్ణునియందు నాకు ప్రీతి కలుగుగాక!

వ్యవహితపృతనాముఖం నిరీక్ష్య

స్వజనవధాద్విముఖస్య దోషబుద్ధ్యా !

కుమతిమహరదాత్మవిద్యయా యః

చరణరతిః పరమస్య తస్య మేఽస్తు

అర్జునుడు దూరమునుండి కౌరవ సైన్యముయొక్క ముందుభాగ ములోనున్న భీష్ముడు మొదలగు బంధువర్గమును చూచి, తనకు బంధువధ ధర్మము కాదని తలచి, యుద్ధవిముఖుడై యుండగా, శ్రీకృ ష్ణుడు ఆతనికి ఆత్మవిద్యను బోధించి, అజ్ఞానమును పోనాడి, ధర్మాచరణమునందు ప్రవర్తిల్ల జేసెను. అట్టి శ్రీకృష్ణపరమాత్మయొక్క పాదముల -

యందు నాకు ప్రీతి కలుగుగాక!

స్వనిగమమపహాయమత్పృతిజ్ఞా-

మృతమధికర్తుమవప్లుతో రథస్థః

ధృతరథచరణోఽభ్యయాచ్చలద్గుః

హరిరివ హంతుమిభం గతోత్తరీయః

రథమునందు కూర్చునియున్న శ్రీకృష్ణుడు యుద్ధములో ఆయు ధమును పట్టననే తన ప్రతిజ్ఞను ప్రక్కన పెట్టి, ఆయనచే ఆయుధమును పట్టించెదననే నా ప్రతిజ్ఞను సత్యము చేసి తద్ద్వారా నన్ను అధికుని చేయు టకై, ఏనుగును చంపబోయే సింహము వలె క్రిందకు దుమికి చేతిలో చక్ర మును పట్టుకొని, క్రింద నేల కంపించుచుండగా, పై కండువా జారిపోతూ ఉండగా, నా మీదకు వచ్చినాడు.

శితవిశిఖహతో విశీర్ణదంశ:

క్షతజపరిప్లుత ఆతతాయినో మే

ప్రసభమభిససార మద్వధార్థం

స భవతు మే భగవాన్ గతీర్ముకుందః

ధనస్సును చేతబట్టి యుద్దమును చేయుచున్న నాయొక్క వాడి బాణములచే కొట్టబడి కవచము చిల్లులు పడి శరీరమంతటా రక్తము కారు చుండగా, తనకు అడ్డువచ్చిన అర్జునుని ప్రక్కకు నెట్టి, నన్ను సంహరించు టకు వేగముగా వచ్చిన ఆ శ్రీకృష్ణభగవానుడు నాకు శరణు.

విజయరథకుటుంబ ఆత్తతోత్రే

ధృతహయరశ్మిని తచ్చృయేక్షణీయే

భగవతి రతిరస్తు మే ముమూర్షోః

యమిహ నిరీక్ష్య హతా గతాస్సరూపమ్

చేతిలో కోరడాను గుర్రముల కళ్లెములను పట్టుకొని అర్జునుని రథ మును జాగ్రత్తగా రక్షిస్తూ ఆ స్థితిలోని సౌందర్యముతో కన్నులకు పండుగ చేసే శ్రీకృష్ణభగవానునియందు మరణించ గోరే నాకు ప్రీతి కలుగుగాక! యుద్దములో ఆయననూ చూస్తూ మరణించినవారు సారూప్యమోక్షమును పొందినారు.

లలితగతివిలాసవల్గుహాస

ప్రణయనిరీక్షణకల్పితోరుమానాః

కృతమనుకృతవత్య ఉన్మదాంధాః

ప్రకృతిమగన్ కిల యస్య గోపవధ్వః  

వయ్యారమగు నడక, ఒళ్లంతా హోయలు, తియ్యని చిరునవ్వు, ప్రేమను ఒలకబోసే చూపులు అనువాటి గోపికలు ఆయనకు గొప్ప పూజను చేసిరి. ఇంతలో ఆయన అదృశ్యము కాగా, వారు ఉత్కటమగు ప్రేమచే సర్వమును మరచి, గోవర్ధనోద్దారము మొదలైన ఆయన చేష్టలను అనుకరించిరి. అట్టి గోపికలు ఆయనలో ఐక్యమైనారు గదా!

మునిగణనృపవర్యసంకులేంఽతః

సదసి యుధిష్ఠిరరాజసూయ ఏషామ్

అర్హణముప పేద ఈక్షణీయో

మమ దృశిగోచర ఏష ఆవిరాత్మా

ధర్మరాజుయొక్క రాజసూయములో మహర్షుల. గణములతో మరియు రాజులతో క్రిక్కిరిసియున్న సభామధ్యములో వారందరు కన్నుల పండువగా చూచుచుండగా, నా కన్నుల యెదుటనే ఈ శ్రీకృష్ణుడు పూజను అందుకొనినాడు. అట్టి శ్రీకృష్ణుడు ఇప్పుడు నాకు ఆత్మరూపునిగా దర్శనమునిచ్చుచున్నాడు.

తమిమమహమజం శరీరభాజాం

 హృది హృది ధిష్ఠితమాత్మకల్పితానామ్

ప్రతిదృశమీవ నైకధార్కమేకం

సమధిగతోఽస్మి విభూతభేదమోహః

పుట్టుక లేని పరమేశ్వరుడు తనచే నిర్మించబడిన (తనయందు కల్పించబడిన) ప్రాణుల ప్రతి హృదయమును ఆత్మరూపముగా అది ష్ఠించి, చూచే వాని ప్రతి కన్నులో వేర్వేరుగా భాసించే ఒకే ఒక సూర్యుని వలె, అనేకప్రకారములుగా ప్రకాశించుచున్నాడు. పటాపంచలు చేయబడిన భేదముయొక్క మోహము గల నేను అట్టి అద్వితీయపరబ్రహ్మస్వరూపు డగు ఈ శ్రీకృష్ణుని ఆత్మరూపునిగా కనుగొంటిని.

సూత ఉవాచ

కృష్ణ ఏవం భగవతి మనోవాగ్దృష్టివృత్తిభిః

ఆత్మన్యాత్మానమావేశ్య సోఽoతశ్శ్వాస ఉపాగమత్

ఈ విధముగా ఆ భీష్ముడు ఆత్మరూపుడగు శ్రీకృష్ణభగవానుని యందు మనస్సు, వాక్కు, చూపు అనే మూడు వ్యాపారముల ద్వారా బుద్ధిని చక్కగా లగ్నము చేసి, లోపలనే విలీనమైన శ్వాస గలవాడై విర మించెను.

సంపద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే

సర్వే బభూవుస్తే తూష్ణీం వయాంసీవ దినాత్యయే

నిర్గుణపరబ్రహ్మయందు విలీనమగుచున్న భీష్మపితామహుని చూచి వారందరు, అస్తమించే సూర్యుని చూచు పక్షులు వలె, మిన్నకుండిరి.

తత్ర దుందుభయో నేదుర్దేవమానవవాదితాః

శశంసుస్సాధవో రాజ్ఞాం ఖాత్పేతుః పుష్పవృష్టయః

అక్కడ ఆ సమయములో దేవతలు మరియు మానవులు భేరీలను మ్రోగించిరి. సాధుస్వభావము గల రాజులు కొనియాడిరి. ఆకాశమునుండి పూలవానలు కురిసినవి.

తస్య నిర్హరణాదీని సంపరేతస్య భార్గవ

యుధిష్ఠిరః కారయిత్వా ముహూర్తం దుఃఖితోఽభవత్

ఓ శౌనకా! ధర్మరాజు జీవన్ముక్తుడై మరణించిన భీష్మునకు దహన - సంస్కారము మొదలగు వాటిని చేయించి, కొంత సేపు దుఃఖించెను.

తుష్టువుర్మునయో హృష్టాః కృష్ణం తధ్గుహ్యనామభిః

తత స్తే కృష్ణహృదయాస్వాశ్రమాన్ ప్రయయుః పునః

మునులు సంతోషించి శ్రీకృష్ణుని వేదోక్తములగు రహస్యనామము లతో స్తుతించి, తరువాత ఆయనయందే లగ్న మైన హృదయములు గల వారై, తమ తమ ఆశ్రమములకు మరలి వెళ్లిరి.

తతో యుధిష్ఠిరో గత్వా సహకృష్ణో గజాహ్వయమ్

పితరం సాంత్వయామాస గాంధారీం చ తపస్వినీమ్

తరువాత ధర్మరాజు శ్రీకృష్ణునితో కలిసి హస్తినాపురమునకు వెళ్లి దుఃఖితులై యున్న గాంధారీధృతరాష్ట్రులను ఓదార్చేను.

పిత్రా చానుమతో రాజా వాసుదేవానుదితః

చకార రాజ్యం ధర్మేణ పితృప్రేతామహం విభుః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధే నవమోఽధ్యాయః.

సర్వసమర్థుడగు ధర్మరాజు ధృతరాష్ట్రుని అనుమతిని, శ్రీకృష్ణుని ఆశీర్వాదమును పొంది, తాత ముత్తాతలనుండి వచ్చుచున్న రాజ్యమును ధర్మబద్ధముగా పాలించేను.

శ్రీమద్బాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.