నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి నారదమునితో ఇట్లనెను-
శంకరుడు పుణ్యకవ్రతమును చేయుమని చెప్పగా పార్వతీదేవి విని సంతోషముతో ఆవ్రతవిధానమును చెప్పుమని ఆడిగెను.
పార్వత్యువాచ- పార్వతీ ఇట్లు ఆనెను-
ఓమహాదేవా ఈపుణ్యకవ్రతమును ఎట్లు చేయవలెనో దయాసముద్రుడవు దీనబంధువు పరాత్పరుడవైన నీవు నాకు తెలుపుము, ఈవ్రతమున ఏద్రవ్యములు కావలెను, ఏఫలములు కావలెను, ఎట్టి భక్ష్యములు కావలెను. ఈవ్రతమును ఎట్లు చేయవలెను, దీని ఫలితమెట్లుండును, అను విషయములను నాకు చెప్పుము ఇంకను దీనికి ఫలితమెట్లుండును. అను విషయములను గురించి. బ్రాహ్మణుల గురించీ ఈవ్రతమున ఉపయోగించు వస్తువులు అన్నీటిని నాకు వివరించి తెలుపుము.
స్త్రీలకు భర్త అన్ని కోరికలను తీర్చును. ఆమెను చిన్నతనమున తండ్రి, పెళ్ళి అయిన తర్వాత భర్త, ఆతరువాత పుత్రుడు ఆమెను రక్షింతురు. మంచి స్త్రీలకు ఇట్టి రక్షణ ఉండును. తండ్రి తన ప్రాణముతో సమానమైన తన కూతురిని దుఃఖపడక మంచిభర్తకు ఇచ్చి సంతోషపడును. అట్లే ఆమెభర్త తన భార్యను తనపుత్రునకు అప్పగించి నిర్వృతి పొందుచున్నాడు. ఇట్లు తండ్రి, భర్త, పుత్రుడు అను ముగ్గురు బంధువులు గల స్త్రీ పరమభాగ్యవతీ. ఈముగ్గురిలో ఒకరు, ఇద్దరు లేకపోయినచో ఆమె మధ్యస్థురాలు. ముగ్గురూ లేనిచో, ఆస్త్రీ ఆధమగా చెప్పబడుచున్నది.
పైన పేర్కొన్న ముగ్గురు బంధువుల సమీపమునున్న స్త్రీని ముల్లోకములలో ప్రశంసింతురు. ఆవిధముగా. కాక ఇతరుల దగ్గరఉన్న స్త్రీని ఆందరు నిందింతురని వేదమున చెప్పబడినది.
నీవు సర్వాత్ముడవు, సర్వసాక్షివి, సమస్తము తెలిసినవాడవు. నాకు సంతోషము కలుగునట్లు మంచిపుత్రుని ప్రసాదింపుము. పెద్దవారికి నా మనసు తెలుసునని ఈవిషయము చెప్పితిని, అయినను వీవు సమస్త ప్రాణులయొక్క మనోభావములమ తెలిసినవాడవు. చెప్పనేర్చినవాడవు. అట్టి నీకు నేనేమి చెప్పుదును. ఇట్లు పార్వతి పరమేశ్వరునితో అని అతని కాళ్ళపై పడినది. ఆప్పుడు దయాసముద్రుడైన ఆ శంకరుడు పార్వతికి ఇట్లు చెప్పసాగెను.
శ్రీమహాదేవ ఉవాచ - మహాదేవుడు ఇట్లు పలికెను.
ఓపార్వతీ ఈ పుణ్యకవ్రతం ఎట్లు చేయువలెనో ఆ వ్రత నియమములెట్లుండునో, దాని ఫలమెట్లుండునో ఆవ్రతమునకు కావలసిన వస్తువులేమిటో చెప్పెదను.
ఈ వ్రతమునకు వందమంది బ్రాహ్మణులు కావలెను. పరిశుద్ధమైన ఫలములు, పుప్పుములు కావలెను. పూజాద్రవ్యములు తెచ్చుటకై వందమంది సేవకులు, కోటిమంది దాసీజనము కావలెను. ఈవ్రతము చేయు పురోహితుడు సమస్త వ్రతములు చేయించువాడై ఉండవలెను. వేద, వేదాంతములు చక్కగా తెలిసినవాడు కావలెను. అందువలన శ్రీహరి భక్తులలో శ్రేష్టుడును, సర్వజ్ఞడు, జ్ఞానవంతులలో శ్రేష్టుడు, నాతో సమానమైనవాడగు సనత్ కుమారుని ఈవ్రతము చేయించుటకు పురోహితునిగా, ఎన్నుకొనుము.
ఓ పార్వతీ పరిశుద్ధమైన సమయమున నియమముతో ఈ వ్రతమును పూర్తిచేయవలయును. మాఘశుద్ధ త్రయోదశినాడు ఈ వ్రతము చేయుట మంచిది. దానికి ముందునాడు ఉపవాసముండి వస్త్రములను చక్కగా ఉతుకుకొనవలెను. అరుణోదయ సమయమున శయ్య నుండి లేచి ముఖప్రక్షాళన చేసికొని తలంటుకొని నిర్మలమైన నీటియందు స్నానము చేయవలెను. తర్వాత శ్రీహరిని స్మరించుచు ఆచమనము చేసి శ్రీహరికి ఆర్ఘ్యమును ఇచ్చి ఇంటికి రావలెను. ఇంటికి వచ్చిన తర్వాత ఉలికిన బట్టలు కట్టుకుని పరిశుద్ధమైన ఆసనమున కూర్చుని తిలకమును పెట్టుకుని ఆచమనము చేసి ఆహ్నిక కార్యక్రమములన్ని పూర్తిచేయవలెను.
స్వస్తివాచనములతో నియమపూర్వకముగా కలశస్థాపన చేసి వేదవిహితమైన రీతిలో సంకల్పము చేసి ఈవ్రతమువారంభింపవలెను. పురోహితవరణమును ఆంతకుపూర్వము చేయవలెను.
ఈవ్రతమునకు ప్రతిదీనము ఉపయోగించు వస్తువులే చాలును. కాని శ్రీకృష్ణునకు షోడశోపచారములను మాత్రము చేయవలెను. అవి ఆర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, ఆసనము, స్వాగతము, స్నానీయము, మధుపర్కము, వస్త్రములు, ఆభరణములు, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, చందనము, యజ్ఞోపవీతము, తాంబూలము అనునవి. ఇవన్నియు పూజకు అంగములుగా ఉన్నవి. ఈ షోడశోపచారములలో ఏఒక్క ఉపచారము తక్కువైనను ఆంగహాని జరుగును. ఆంగహీనమైన పూజ అంగహీనుడగు నరునివలె ఫలితము నీయజాలదు.
ఓపార్వతి! తనకు అందమైన రూపము కలుగుటకు ప్రతిదినము శ్రీకృష్ణునకు నూట ఎనిమిది పారిజాత పుష్పములతో ఈవ్రతదీక్ష తీసికొన్న సమయమున పూజ చేయవలెను. అట్లే మంచివర్ణము కలుగుటకు తెల్లని చంపక పుష్పములతో, శ్రీకృష్ణుని పూజింపవలెను. అట్లే ముఖసౌందర్యమునకై సహస్రదళములు కల లక్షపద్మములతో, కండ్లకు మంచి శోభ కలుగుటకై వేలకొలది అద్దములలో, కండ్లు అందముగా ఉండుటకు లక్షనీలోత్పలములతో, అందమైన వెండ్రుకలకొరకు లక్ష తెల్లనీ చామరములతో, అందమైన ముక్కు కొరకు ఆమూల్యరత్నములచే నిర్మించిన లక్ష పద్మములతో, అందమైన పెదవులకొరకు లక్ష దీరీసెనపువ్వులతో, అందమైన పలువరుసకై లక్షముత్యాలతో, అందమైన చెక్కిళకొరకు రత్నగండూషములతో, పెదపులకింది భాగము అందముగానుండుటకై రత్నపాశమొలతో, అందమైన చెవులకై రత్నములచే చేయబడిన కర్ణభూషణములతో, చక్కని గొంతుకొరకు (స్వరమునకై) రత్నపాత్రలలో పోసిన పనిలో, చక్కని మాటలకొరకు అమృతముకల రత్నపాత్రలతో, దృష్టి సౌందర్యమునకై రత్నదీపములతో, బలమునకై ఉమ్మెత్త పూవులవంటి రత్నపాత్రలతో శ్రీకృష్ణుని ప్రతిదినము పూజింపవలెను.
ఓపార్వతి! అట్లే బాహుసౌందర్యముకొరకు మంచీరత్నములచే నిర్మితమైన పద్మనాళములను శ్రీహరికి సమర్పింపవలెను. చేతులు ఆందముగానుండుటకై ఎఱ్ఱని పద్మముల విగోపికాపతికి సమర్పింపవలెను. చేతివేళ్ళు ఆందముగానుండుటకై మంచిరత్నములచే నిర్మింపబడిన ఉంగరములను సమర్పింపవలెను. చేతివేళ్ళగోర్లు ఆందముగానుండుటకై తెల్లని మంచిరత్నములను, వక్షసౌందర్యమునకి మంచిరత్నములుగల హారములను, స్తన సౌందర్యమునకై చక్కగా పండిన బిల్వఫలములను, శరీరసౌందర్యమునకై, గుండ్రముగానుండు మంచీ రత్నపత్రములను, బొడ్డు అందముగానుండుటకై మంచిరత్నములచే నిర్మింపబడిన వాభులను, పిరుదుల ఆందమునకై మంచీరత్నములచే నిర్మితమైన వేలకొలదీ రథచక్రములను, మధ్యభాగమందముగానుండుటకై బంగారు చేయబడిన అరటిస్తంభములను, పాదములయొక్క సౌందర్యమునకై నూరురేకులుగల వాడని మెట్టతామరలను పద్మనేత్రుడగు శ్రీకృష్ణునకు సమర్పింపవలెను.
ఓపార్వతీదేవి గమనము అందముగనుండుటకై బంగారముచే చేయబడిన కాటుక పెట్టెలను రాజహంసలను, ఏనుగులను శ్రీకృష్ణునకు పూజాసమయమున సమర్పింపవలెను, శిరసౌందర్యమునకై బంగారము, రత్నములచే చేయబడిన ఛత్రములను, చక్కని హాస్యమునకై దళములు విరిగిపోనీ మాలతీపువ్వులను, శీలసౌందర్యమునకై, వ్రతము సంపూర్ణమగుటకు అమూల్యమైన రత్నములను, మనసౌందర్యమునకై స్వచ్ఛస్ఫటికమువంటి మణులను, భార్యయొక్క అనురాగమునకై మంచివగడములను, మంచిమణులను శ్రీకృష్ణునకు భక్తితో సమర్పించుకొనవలెను.
అనేక జన్మలవరకు తనభర్తకు సౌభాగ్యము కలుగుటకై మంచిమాణిక్యములను శ్రీకృష్ణునకు భక్తితో సమర్పింపవలెను. ఆట్లే పుత్రులు కలుగుటకై గుమ్మడిపండును కొబ్బరికాయను, నీమ్మపండును. బిల్వఫలమును సమర్పింపవలెను. తనభర్తకు ధనసమృద్ధి కలుగుటకై ఆనేక రత్నములన ఇవ్వవలెను. తనభర్తకు సద్భోగములు కలుగుటకై పాయసమును, నేయి, చక్కర కలిపిన పిండిని భక్తితో నొసగవలెను. తాళములు మొదలగు నానావీధవాద్యములను తనసంపదయొక్క ఆభివృద్ధికై మ్రోగించవలెను. శ్రీహరిపై భక్తి పెరుగుటకు ఆశ్రీహరికి అనేక పుష్పమాలలను సమర్పించుకొనవలెను.
ఈ వ్రతమునాచరించునపుడు ప్రతిదినము శ్రీకృష్ణునకు నానావిధములైన నైవేద్యములను పెట్టవలెను. శ్రీకృష్ణుని సంతోషమునకై ఈపుణ్యకవ్రతమున ఆ భగవంతునకు తులసీదళములతోనున్న అనేకవిధములగు పుష్పములను సమర్పింపవలెను.
అట్లే ప్రతిదినము వేయిమంది బ్రాహ్మణులకు వ్రత సమయమున భోజనమిడవలెను. భక్తి పెరుగవలెనని పూజాసమయమున ప్రతిదినము శ్రీకృష్ణునకు పుష్పాంజలి శతమును, నమస్కారశతముమ సమర్పించవలెను.
ఈవ్రతము నాచరించువారు ఆరుమాసములు హవిష్యానమును ఐదునెలలు పండ్లను మాత్రము భుజింపవలెను. చివరినెలలో పదిహేను దినములు హవిష్యాన్నమును మిగిలిన పదిహేను దినములు నీటిని మాత్రము నీయమముతో స్వీకరింపవలెను. ఈవ్రతము చేయునప్పుడు ప్రతిదినము నూరు దీపములను వెలిగించవలెను. రాత్రిసమయమున దర్భాసనముపై కూర్చుండి జాగరణ చేయవలెను.
ఇతరవిషయముల స్మరించుట, కీర్తించుట, కేళి, చూచుట, రహస్యముగా సంభాషించుట, ఇతర క్రియాసంకల్పము చేయుట, వ్రత క్రియలను అనుష్ఠింపకపోవుట, నిదురించుట, మైథునము అనువాటిని వ్రత శుద్దినిగోరి వ్రతముననుష్ఠించువాడు చేయరాదు.
వ్రతము ముగియుసందర్భమున మూడువందల అరవై కంబళ్ళతో, యజ్ఞోపవీతములతో, మూడుకోట్ల ఆరువైలక్షల బ్రాహ్మణులకు భోజనమును పెట్టవలెను. వారికందరకు బంగారునాణెములను దక్షిణగా దానమీయవలెను. తిలహోమము మూడుకోట్లఆరవైలక్షల పర్యాయము చేయవలెను.
ఇంకను వ్రతము సమాప్తమగు దినమున చేయవలసిన దక్షిణ గురించి తరువాత నీకు చెప్పుదునని శంకరు డనెను.
ఓపార్వతీదేవికి ఈ వ్రతమునాచరించినందువలన శ్రీహరిపై భక్తి అధికమగును. వారికి పుట్టు పుత్రుడు శ్రీహరితో సమానుడగును. ముల్లోకములలో ప్రఖ్యాతిపొందును. అట్లే సౌందర్యము, భర్తసౌభాగ్యము, ఐశ్వర్యము, ఆంతులేని ధనము, కలుగును. ఆదేవిధముగా ఆవ్రతమునాచరించిన స్త్రీకి ప్రతిజన్మలో ఆమె కోరిన కోరికలన్నీయు సిద్ధించును.
పార్వతీ! నీకు ఇట్లు పుణ్యకత్రమును గురించి చెప్పితిని. అందువలన నీవు ఈ వ్రతమునావరించినచో నీకు తప్పక పుత్రుడు కలుగునని మహాదేవుడు పార్వతితో చెప్పి ఊరకుండెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణులసంవాదమున తెలుపబడిన పుణ్యకవ్రతవిధానమను నాలుగవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 4 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
At the conclusion of the Puṇyaka Vrata, the Supreme Lord Śrī Kṛshṇa assumed the form of an old Brāhmaṇa boy and appeared before Goddess Pārvatī to test her charity, begging for a divine boon which she graciously granted. Reassuring her of the immediate fruition of her vow, the old Brāhmaṇa vanished into thin air, and at that very moment, a transcendent dark-blue infant possessing infinite beauty and divine effulgence appeared lying upon the silk couch in Pārvatī's inner chambers. Overcome with boundless maternal bliss, Goddess Pārvatī rushed to cradle the radiant child to her breast, while celestial flowers showered from the sky and divine kettledrums resounded across all worlds to celebrate the advent of Lord Śrī Kṛshṇa as the child of Pārvatī and Śiva.