3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

74 - వంశానువర్ణనము

సూత ఉవాచ:-

సూతుఁడిట్లనెను. వహ్ని తుర్వసుని సుతుఁడు, గోభానుఁడువహ్నికొడుకు. అపరాజితవీరుఁడయినత్రిసానుఁడు గోభానుని పుత్రుఁడు. త్రిసానుకుమారుఁడు కరంధముఁడు. కరంధమునికొడుకు మరుత్తుండు. ఆవిక్షిత్తుయొక్క కుమారుఁడు మరుత్తుండు. ఇతఁడు వేరోకరాజు, ఇంతకుం బూర్వము చెప్పఁబడెను. రాజయిన మరుత్తుఁడు అపుత్తకుండని వినికిడి. ఆతఁడు పూరుని కుమారుఁడయిన దుష్యంతునీ(దుష్యంతుని)దత్తునిగా జేసికోనేను. జరాసంక్రమణవిషయమున పూర్వము యయాతి శాపముచే, పూరువంశమున తుర్వసుఁడు కలిసిపోయెను. దుష్కంతకుని దుష్యంతుని యొక్క దాయాది సరూప్యుఁడను. రాజు. సరూపునకు ఆండీరుఁడు కలిగెను. ఆండీరునకు నల్లురుపుత్రులు.  వారు పాంద్యుం డు, కేరలుఁడు, చోలుఁడు, కుల్యుఁడును, వారిరాజ్యములు జనపదములు-పాండ్యులు, కేరళురు, చోళురు, కుల్యులును. ద్రహ్యుని యొక్క కుమారులిర్వురు. వారు బభ్రువు, సేతువులుగా విశ్రుతులు. వారు వీరులు. అరుదుఁడు సేతువుపుత్రుఁడు. బభ్రునికుమారుఁడు రీపువు. ఈ వీరుడైనరాజు యౌవనాశ్వునితో పదునాలుగుమాసములు గొప్ప యుద్ధము చేసెను. అమితమయిన శ్రమ చేయువనాశ్వునిచే యుద్ధముననిహతుఁ డయ్యెను. అరుద్దుని యొక్క దాయాది గాంధరుఁడనురాజు, గాంధారునియొక్క నామముతో తద్వంశము ఖ్యాతము. గాంధారదేశమున పుట్టిన గుఱ్ఱములు శ్రేష్ఠములు. గాంధారునీకొడుకు ధర్ముఁడు. ఆతనికుమారుఁడు. ధృతుఁడు, ధృతుని యొక్క కుమారుఁడు దుర్ధముఁడు. ప్రచేతసుఁడు దుర్దమునికుమారుఁడు, ప్రచేతసునకు నూర్గురు కొడుకులు పుట్టిరి. వారందరు రాజులు. ఉత్తర భాగమున వారందరు మేచ్ఛరాష్ట్రాధిపతులు. 'అను' వునకుముగ్గురు కొడుకులు. వారు వీరులు,పరమధార్మికులు.

వారుసభానరుఁడు,కాలచక్షువు,పరాక్షుఁడనునామములతోప్రఖ్యాతులు. సభానరునిపుత్రుఁడు. విద్వాంసుఁడు. కాతానలుఁడనురాజు. కాలా నలుని కొమరుఁడు సృంజయుఁడు.. అతడుధర్మాత్ముఁడు విశ్రుతుఁడును. సృంజయునకు పురంజయుఁడు. ఆతఁడువీరుఁడు. ఈరాజుఇంద్ర సముఁడు. ఈతనీయశస్సుస్వర్గమునకూడప్రతిష్ఠితము, మహాశాలునకుమహామనుఁడుకుమారుఁడు, ఆతఁడుధార్మికుఁడు. మహామనుఁడుసప్త ద్వీపేశ్వరుఁడు,చక్రవర్తి,మహాయశస్వి. ఆతనికిద్దరు కొమరులు.వారుప్రఖ్యాతులు. ఉశీ నరుఁడొకఁడు. అతఁడుధర్మజుండు. రెండవవాడు తితిక్షువు ఇతఁడుధార్మికుఁడు. ఉశీనరునకు ఉత్తమరాజర్షి వంశజాతలయిన యెదుగురుభార్యలు. వారు నృగ,కృమి,నవ,దర్చ,ఇఁకపంచమపత్నిదృషద్వతి. వారి వలనఉశీనరునకు ఐదుగురు పుత్రికలు, వారుకులోద్వహలు. కులమునకుప్రఖ్యాతిసంపాదించినవారు. గొప్పతపస్సుచేసిన ఉశీనరునకువార్ధక్యమున ధార్మికులు ఉత్తములయిన కుమారులుపుట్టిరి. నృగకుమారుఁడు నృగుండు. నవకునవుడుకుమారుఁడు.కృమికి క్రుమి, దర్వకు సువ్రతుఁడు. ఈతడు ధార్మికుఁడు.దృషద్వతికుమారుఁడుశిబి. అతసీనరుఁడను ప్రఖ్యాతిపొందెను. శిబియొక్కపురముశివపురమనుఖ్యాతిపొందినది. నంగునియొక్క పట్టణముయౌధేయము, నపునీనగరమునవరాష్ట్రము. కృమియొక్కనగరము కృమిలాపురి. సువ్రతునియొక్క నగరముఅంబష్టము. ఇంకశిబీపుత్రులగూర్చి యెఱుంగుఁడుశిబికి నలుగురుపుత్రులు. వారులోకసమ్మతులు. వారువృషదర్బుఁడు, సువీరుఁడు, కేకయుఁడు, మద్రకుడుసు. వారిరాష్ట్రములు(జన పదములు సీతములు. వృద్ధిసంపన్నములు. కేకయులు,మద్రకులు,వృషదరులు,సువీరులు. వారుఇఁకతితిక్షుబిడ్డలగూర్చి వీనుఁడు. పూర్వదశయందు తితిక్షువువిశ్రుతప్రభువయ్యెను.

ఋషయః ఊచుః :-

సూత ఉవాచ :-

మహాబాహుఁడగుఉశద్రథుఁడు తితిక్షుని కుమారుడు ఉశద్రథుని యొక్కసుతుండు హేముడు. హేమునకుసుతపసుఁడుపుట్టెను. సుతపసునకు బలికుమారుడు. వామనునిచే బద్ధుఁడయినబలి మహాయోగి. సంతానాభిలాషియైయామహామనీషిబలి మానవగర్భమున జన్మము నొందెను. వంశము పిల్లలులేక నష్టమగుచున్న కారణమున ఆతఁడు చాతుర్వర్ణ్యకరులయిన పుత్రులనుకనెను. వారు-అంగ, వంగ,సుహ్మయుద్ద,కళింగులు. ఈ వర్గమునుబాలేయులు,క్షత్రులందురు. (బలియొక్కక్షత్రియవంశ్యులు) బ్రాహ్మణులు కూడబాలేయులు; ఆబలివంశమునునిల్పినవారు. ధీమంతుఁడయిన బలీకీబ్రహ్మ ప్రీతితోబహువరములొసంగేను. ఆవరములుమహాయోగిత్వము,ఒకకల్పతుల్యఆయువు. యుద్దములయందుఅజేయత్వము,మూఁడు లోకములను చూడగలశక్తి, ధర్మమునందు ప్రభావముచేపుత్రసంతతియందుప్రాముఖ్యము,అప్రతీమానత్వస్థితి, ధర్మతత్త్వార్థదర్శనము, “నీవునాలు వర్గములనుస్థాపించెదవు"అని కూడ చెప్పఁబడెను. ఈ విధముగా బ్రహ్మచేచెప్పఁబడి, రాజయినబలి ఉత్కృష్టమైనశాంతిని పొందెను, పెద్దకాలమునకు విద్వాంసుఁడైనరాజు స్థానమును పొందెను. వారియొక్కరాష్ట్రములు-అంగ, వంగ, సుహ్మకము, పుండ్రకము, కళింగము, వృద్ధిమంతములయ్యెను. వారివంశమును గ్రహింపుడు. ఆతనీ కుమారులెల్లరు క్షేత్రజులు(తనభార్యయందుఇతరులకుపుట్టినవారు) వారుమునిసంభవులు.మహాతేజస్వు లయినవారు (ఆబిడ్డలు) దీర్ఘతమసునకు సుధేష్ణ వలన కలిగినవారు. ఋషుల్లిడిగిరి. ఓప్రభో!బలియొక్కయైదుగురుసుతులుఎట్లుక్షేత్రజులు, ఋషివలన దీర్ఘతమసువలనకలిగిరి. దయచేసిమాకుచెప్పుము. సూతుఁడిట్లనెను. పూర్వమునఉశీజుఁడనునొకప్రసిద్దఋషికలఁడు. ఆమహాత్మునకు మమతభార్య.

ఉరీజునీ కనిష్ఠ సోదరుఁడు స్వర్గ నీవాసులకు పురోహితుఁడు, అతని పేరు బృహస్పతి. అతఁడు మహా తేజస్పి, అతడు 'మమత'ను కలిసికొనెను, మమతకు బృహస్పతి యనిన ఇష్టములేదు. అతనితో ఆమె ఇట్లనెను. “నేను నీ జ్యేష్ట భాత యొక్క భార్యను. అదియునుగాక నేనిపుడు గర్భిణిని. “ఓ బృహస్పతీ! నా గర్భములో నున్న బిడ్డ, అజసము వేదాంగములతోడి వేదమును అభ్యాసము చేయుచున్నాడు. నీవు కూడా అమోఘమైన రేతస్సుకలవాడవు. అందుచే, నీవను కొనినట్లు నన్ను భజించుట కరుఁడవుకాదు. ఇంత స్పష్టముగా నామెచే చెప్పబడినను, మహాతేజుడయిన బృహస్పతి, మహాత్ముఁడయినను, కామాత్ముఁడగుట తన్నుతాను నిగ్రహించు కొన లేక పోయెను. ధర్మాత్ముఁడయినను బృహస్పతి ఆమెతో సంగమించేను." బృహస్పతి రేతస్సును వీడుచుచుండగ గర్భస్థుఁడయిన ఆ బిడ్డ అతనితో నిట్లనెను. - “ఓ బృహస్పతీ! శుక్రమును వీడువకుము. ఈ గర్భమున ఇద్దరకు (జీవ దయమునకు) చోటులేదు. నీవో యమోఘరేతస్కుఁడవు నీ శుక్రము వ్యర్థము కారాదు. కానీ ఇచ్చటకు ముందే నేను వచ్చియుంటిని, ఈ విధముగా చెప్పఁబడి, బృహస్పతి క్రుద్దుడయి, ఆతని సోదర కుమారుని గర్భస్థుఁడైన ఉశీజుని, శపించెను. సర్వభూతములకు నీ సీతమైన కాలమున నాతో మోహమున నిట్లంటివికాన, నీవు తీవ్రమైన సుదీర్ఘమైన చీకటిలో ప్రవేశింతువు"అని. అంత, ఆతని శాపమువలన, ఉజుని కుమారుం డు దీర్ఘతముఁడను పేరుగల ఋషియయ్యెను. ఔశిజుఁడు (ఉశీజునికుమారుడయిన దీర్ఘతముఁడు) బృహస్పతితో సమానుఁడు స్వతేజస్సుచే, బృహత్కీర్తిచే నయ్యెను. ఇతఁడు ఊర్ద్వ రేతస్క్యుడు. అతఁడు తన తండ్రి సోదరుని ఆశ్రమమున వసీంచెను. అతఁడు గోధర్మమును (గోవుల యొక్క ధర్మమును) సురభి యొక్క కొమరుడైన వృషభమువలన వినెను. అతని తండ్రి సోదరుఁడాతనికి (దీర్ఘతమునకు) ఒక భవనమును నిర్మించెను అతఁడచ్చట వసించుచుండ, ఆ వృషభమచ్చటకు యదృచ్ఛముగా వచ్చెను. సురభికుమారుడైన వృషభము, ఆశ్రమములో దర్శ పూర్ణమాసమున (అమావాస్య పున్నమిని చేయు కర్మ) అందున్న గరికను మేసెను. కొమ్ములతో నిటు నటు కొట్టుకొని విజృంభించుచున్నను దీర్ఘతముఁడు దానిని కొమ్ములతో పట్టుకొనెను. అతనిచే నిగృహీతమయి యా గోవు ఒక్క పదమయినను కదలేకపోయినది. అంత, ఆ వృషభము, “బలవంతులలో శ్రేష్ఠుండా! నన్ను విడువుము. తత్పతిఫలముగా నా స్నేహమును సంపాదింపుము. వరమును కోరుకొనుము". అని పలుకగా, ఆ దీర్ఘతముఁడు వృషభముతో ఇట్లనెను. “జీవించి నన్ను విడిచి నీ వెక్కడికి పోయెదవు?”

సూత ఉవాచ:-

అందుచే నిన్ను నేను వదలి పెట్టను. నీవు చతుష్పాదజంతువ వైనను, నీవు (పరస్వాదము) ఇతరుని ఆస్తినీ తింటివి. "అంత - ఆవృషభము ఋషికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను”. ఓ ప్రియతమా! మేమెన్నడును స్తేయము (దొంగతనము) వలన పాపమును పొందము. " భక్ష్యా భక్ష్య వివేకము మేమెరుగము. అట్లే త్రాగదగినది త్రాగదగనిది మేమెఱుగము. ఓ. ఏప్రుఁడా కార్యాకార్యమెఱుగము, అట్లే గమ్యాగమ్యము(పొందదగినది, పొందదగనీది) యెఱుంగము. ఓ విప్ర మేము పాపులముకాము. ఇది గోవుల యొక్క ధర్మము. సర్వవిదితము ". గోవుల యొక్క పేరు వినీ, ఋషి, సంక్రాంత మనస్కుండయ్యెను. ఆ గోరాజమును విడిచెను. అతఁడు భక్తితో, ఆ వృషభము యొక్క పలుకులను వినవలయునను కోరికతో ఆ గోసుతుని ప్రసన్నునిగా చేసెను.  వృషేంద్రుని యొక్క ప్రసాదమువలన, ఆ (ఋషి) గోధర్మమును గ్రహించెను. దానిని మనస్సులో జ్ఞాపకముంచుకొనెను. తత్పరాయణుఁడయి అతఁడు వృషభము వంటి వ్యా, డాయెను. అంత దురదృష్టవశమున, అతఁడు మనస్సులో సమ్మూడుఁడయ్యెను. తత్కారణమున తన తమ్ముఁడైన ఉతథ్యుని పత్నిని కామపరవశుడై విచేష్ట మానమై గింజుకొన్నను, ఏడ్చుచున్నను, ఆమెను కోరెను. అతడు అవమానమును (అవలేపమును) తలపోయక, . గోధర్మ పరాయణుఁడై తన కోడలినీ అభిలషించెను. శరద్వంతుడు దానిని భరింపలేదు. అతఁడు దానిని అవమానముగా దలంచెను. ఈ - విపరీత క్రియాకలాపమును చూచి శరద్వంతుడు దానిని గూర్చి లోతుగా సోలోచించెను. అతఁడు రానున్న ఫలాఫలితముల నెంగెను. క్రోధముచే సంరక్తలోచనుఁడై ఆతనిని అవమతీంచీ దీర్ఘతమునితో నిట్లనెను, ఏది పొందదగినదో, ఏది పొందదగనిదే యెఱుంగక "గోధర్మమూని న్నుషను అర్థించితివి. నీవు దుర్వృత్తుఁడవగుట నిన్ను త్యజించుచున్నాను. నీ దుష్టమైన కర్మతో నీవు పొమ్ము. నీవు గ్రుడ్డివి, వృద్ధుఁడవగుట, నీవు భర్తవ్యుఁడవు. పోషింపఁదగిన వాఁడవు. కానీ దుష్టముగా ప్రవర్తించితివి. అందుచే నీవు పరిత్యక్తుఁడవు నీవు దురాచారుడవని సో భావము.

 సూతుఁడిట్లనెను.

అందుచే శరద్వంతుఁడు ఈ విపరీత కర్మయందు క్రూరముగా దలపోసెను. ఆతని బహు విధముల నీందించెను. రెండు చేతులతో నతనిని పట్టుకొని, అతనిని ఒక కోష్టమునందు మూఁత బిగించిన పేట్టిలో పెట్టి గంగోదములయందు విడిచిపెట్టేను.-64. ఆ.. కోష్టము (ఆమూత బిగించిన పెట్టి) ప్రవవాహముచే కొట్టుకొనుచు ఏడు దినములు పోయెను. “ఐటియను పేరుగల ఒక రోజు ఆ కోష్టమును చూచెను. అతఁడు ధర్మాత్ముఁడు, తత్వ వీదుఁడు ఆతనితో ఆతని భార్య కూడనుండెను. మునుగుచు తేలుచుకోట్టుకొని వచ్చు పెట్టి నాతండు చూచెను. ఆ పెట్టె ప్రవాహముచే గట్టుకు చేరగా, ధర్మాత్ముఁడు, వైరోచనుఁడయిన బలి దానిని తీసికొనెను. అంతః, పురమునకు తీసికొనిపోయి, వివిధ భక్ష్య భోజ్యములచే దీర్ఘతముని తృప్తిపరచెను. సంతుష్ఠుఁడయి బలిని ఆ దీర్ఘతముఁడు వరము కోరుకొనుమనెను. కోరుకొనుమనెను.

 బిలిరువాచ:-

        పుత్రార్థి, దానవర్షభుఁడైన, బలి, ఆతనినీ వరము కోరెను. బలి ఇట్లు వరము కోరెను.

మానవంతులలో శ్రేష్ఠుఁడవైన ఓ మునీ! ఓ మహాభాగ, నేను సంతానార్థిని. నా భార్యయందు, ధర్మార్ధసంయుక్తులయిన పుత్రులుకలుగునట్లు (పుట్టునట్లు) చేయ నీవు అరుండవు. ఇట్లు అడుగబడి ఆ ఋషి “తథాస్తు” అనీ హితమును పలికెను. అంత సుధేష్ణయను పేరుగల తన భార్యను బలి ఆతని కడకు పంపెను. అంధుఁడు, వృద్ధుఁడునయిన యతనిని చూచి ఆ దేవి యతని కడకు పోలేదు. ఆమె తన పరిచారికను భూషణములచే నలంకరించి ఆముని కడకంపెను. అత్యంతేంద్రియవశియు ధర్మాత్ముండునయిన ఋషి, కక్షివంతుడు, చక్షువు అను మహా తేజస్వులయిన కుమారులను ఆ దాసీ యొక్క శూద్ర యోనియందు పుట్టించెను, ఆ కుమారు లిరువురు మహా తేజస్వంతులు. విధి పూర్వకముగా వేదాధ్యయనము చేసినవారు, ఈశ్వరతుల్యులు, బ్రాహ్మణోత్తములు. నీ దాసి యొక్క శూద్ర యోనియందుత్పన్నులు”, సుధేష్ణ నీ పట్ట మహిషి నను అంధునిగా, వృద్దునిగా తలపోసి తన దాసిని నాకడకు పంపి తన్మూలమున నన్నవమానించెను. అంత బలీ ఆ ముని సత్తముని ప్రసాదవంతుని చేసెను. భార్యయైన సుధేష్ణను దూషించెను. కసరుకొనెను. మరల ఆమెను (తన భార్యను) అలంకరించి, బలి ఋషి కడకు పంపెను. ఆ దీర్ఘతముఁడు దేవితో నిట్లనెను. 'ఓ శుభురాలా! నేను ఉప్పు కలిపిన పెరుగతో నా శరీరము నంతటిని పూసికొని నగ్నముగా నుండును. ఎట్టి అసహ్యము జుగుప్స లేక, ఆపాదమస్తకము నా శరీరమును నీవు నాకవలయును. అప్పుడు నీవు కోరిన పుత్రులను దేవి! పొందగలవు. దేవి అతని నియమ వాక్యమును సర్వము యథాతథముగా నాచరించెను. కానీ, అతని అపాన స్థానమును చేరి, అసహ్యపడుచు దానిని నాకుట విడిచిపెట్టెను, 80, అంత ఋషి ఆమెతో నిట్లనెను. “ఓ శుభుల! నీవు అపానము పరిహరించితివి. అందుచే అపానములేని పెద్ద కుమారుని నీవు కందువు. అంత ఆది దీర్ఘతమునితో నిట్లు ప్రత్యుత్తరమిచ్చెను' ఓ మహాభాగః ఈ దృశమైన కుమారుని నాకు ప్రసాదించుట నీకు తగదు.

ఋషి రువాచ:-

ఋషి యిట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

 ఓ దేవి! ఇది నీయపరాధము. వేరు విధముగా జరుగదు. ఓ సువ్రతురాలా! నీ కిట్టీ మనుమని నేనొసంగెదను. అపానము లేకపోయినను, ఆతఁడు యోగ్య భావుండు కొంగలఁడు.

అంత దీర్ఘతముఁడామే కడుపున (కుక్షిని) స్పృశించి యిట్లనెను-84. ఓ శుచిస్మితురాలా! నీవు నా శరీరము నుండి దధిని . నాకితివీకాన ఆ కోరణమున పున్నమినాఁడు సముద్రము వలె నీ గర్భము పరిపూరితమైనది. నీకు దేవసుతోషములయిన యైదుగురు కుమారులు కలిగెదరు. వారు తేజస్వులు, పరాక్రమ వంతులు, యజ్ఞముల నాచరించుయజ్వలు, అంతియేకాక ధర్మాత్ములు.

అంత, అంగుఁడు సుధేష్ణకు జ్యేష్ఠ కుమారునిగా పుట్టెను తరువాత వంగుఁడు, కళింగుఁడు, పుండ్రకుఁడు, సుహుఁడును పుట్టిరి. ఈ యైదుగురు బలికి క్షేత్రమున పుట్టిరి. వారు వంశవర్ధనులు ఈ విధముగా పూర్వము దీర్ఘతముని వలన ఐలి కుమారులను - పొందెను.

కొన్ని కారణముల చేత బలికి తన భార్యయందు సంతానమును బ్రహ్మ అడ్డగించెను. ఉపహత మొనర్చెను.. బ్రహ్మ యిట్లు చెప్పెను. ఈ మహారాజునకు స్వభార్యలవలన సంతానము కలుగ కుండుగాక అందువలననే యతఁడు (బలి) మనుష్యయోనియందు పిల్లలను పొందెను. సంతోషించిన సురభి ఈ వాక్యములు దీర్ఘతమునితో పలికెను.

ఓ ఋషీ! నీవు గో ధర్మమును గూర్చి ఆలోచించితివి. ఇట్లు ఆచరించితివి. అనన్యమయినయందలి నీ భక్తికి నేను సంప్రీతురాలినైతిని. అందుచే, ఇంక, నేను పురాణమైన నీ చీకటిని పోగొట్టెదను. నీవు చూడగలవు. (చూడుము). నీ శరీరము నందింకను బృహస్పతి యొక్క శాపము వలని పాపమున్నది. నిన్ను ఆఘ్రాణముచేసి, ఆ పాపమును తొలగించెదను. నీ "జరామృత్యుభయమును గూడ తొలగించెదను” ఆతఁడు ఆఘ్రాణించిన మాత్రమున, చీకటి (తమస్సు) అస్తమించుటవలన అతఁడు (ఆ ఋషి) చూడగలిగెను. ఆ ఋషి యువకుఁడయ్యెను. చక్షుష్మంతుడయ్యెను, ఆయుష్మంతుడయ్యెను. ఆతని తమస్సు గోవుచే హృతమయిన దగుటవలన అతఁడు గౌతముఁడయ్యెను.

కక్షివంతుఁడు తండ్రితో సహా గిరివ్రజమేగెను. యథోద్దిష్టముగ పితరునితో విపుల మయిన తపస్సు చేసెను. చాలా కాలము గతించిన పిమ్మట తపస్సుచే నతఁడపవిత్రుఁడయ్యెను. తరువాత సానుజుఁడై దోషములను నిర్దూతముచేసి యతఁడు బ్రాహ్మణ్యమును పొందెను. అంత నీతని తండ్రి యతనితో నిట్లనెను.

కుమారా! యశస్వి యై కుమారుఁడవైన నీ చే నేకృతార్థుఁడ నయితిని. అంత. నతఁడు యోగస్థితుఁడై బ్రహ్మ స్థానమునందెను. బ్రాహ్మణ్యమును పొంది కక్షివంతుఁడు ఒక వెయ్యి మంది సుతులను కనెను.  వారందరు కూష్మాండులుగా, గౌతములుగా ప్రసిద్ధులు.

ఈ విధముగా దీర్ఘతముని యొక్క వైరోచనుఁడయిన బలియొక్క సమాగమము, వారిరువురి యొక్క సంతానము చెప్పఁబడినది. పాప రహితులయిన తన యొదుగురు కుమారులను పట్టాభిషిక్తుల చేసి బలి కృతార్థుఁడయ్యెను. ఆతఁడు యోగాత్ముఁడు. యోగము నాశ్రయించి సర్వభూతములకు నదృశ్యుఁడై కాలకాంక్షియై (మరుణ కాలముకోరి) బలి సంచరించును.

 దధి వాహనుఁడు రాజర్షియైన అంగుని కుమారుఁడు. సుధేష్ణయొక్క అపరాధమున ఆ ప్రభువు 'అనపాను'డని పిలువబడెను. అనపానునీ పుత్రుఁడు దీవిరథుఁడు. ధర్మరథుఁడు దీవిరథుని పుత్రుఁడు. అతడు విద్వాంసుడు.

వీరందరు ఇక్ష్వాకుల సంతానము. ఇక్ష్వాకులు వారందరు కలియుగమున బృహద్బలునీ, వంశమున పుట్టెదరు. వారు మహావీర్య పరాక్రములు శూరులు సమస్త విద్యలు నేర్చినవారు. సత్య సంధులు జితేంద్రియులు.

ఈ విషయమున ఈ వంశము భవిష్యజ్ఞులచే ఉదహరింపఁబడినది.

“ఇక్ష్వాకుల యొక్క ఈ వంశము 'సుమిత్ర' వరకు వ్యాపించును. ఈ వంశము సుమిత్ర వరకు వ్యాపించి కలియుగమున తరువాత ఆంతరించును.

ఇంతవరకు, మనువునకు సంబంధించిన, ఐలునకు సంబంధించిన క్షత్ర వంశముదాహృతమైనది.

ఇక మగధ దేశ ప్రభువైన బృహద్రథుని వంశము వర్ణించెదను. వారి వారి ప్రాధాన్యమును బట్టి జరా సంధుని వంశమున పుట్టిన సహదేవాన్వయ నృపాలుని గూర్చి చెప్పెదను. చెప్పినది గ్రహించుడు, భారత సంగ్రామమున సహదేవుడు మరణించెను. రాజర్షి తుల్యుం డైన సోమాపీ సహదేవుని కుమారుడు. ఆతఁడు గిరివ్రజమును 58 సంవత్సరములు రాజ్యము ఏలెను. సోమాపీ కుమారుఁడు శ్రుతశ్రవుండు ఆతఁడు 77 సంవత్సరము లేలేను. ఆతని కుమారుడు 'అయుతాయువు'. ఇతఁడు 26 సంవత్సరములు రాజ్యము చేసెను. 'నిరామిత్రుండు భూమిని నూరేండ్లనుభవించి దీవంగతుఁడయ్యెను. సుక్షత్రుఁడు భూమిని 56 సంవత్సరము లేలెను.

 బృహ త్కర్మ 23 సంవత్సరములు రాజ్యము చేసెను. ఇప్పుడు సేనాజిత్తు రాజ్యము చేయుచుండెను.

శ్రుతంజయుడు 40 సంవత్సరములు రాజ్యము చేయును. మహాబలుడు, మహాబుద్దీ పరాక్రముఁడునయిన శత్రుంజయుఁడు భూమిని 35 సంవత్సరములు పాలించును. 46 సంవత్సరములు శుచి రాజ్యము చేయును. క్షేముఁడు 24 సంవత్సరములు పూర్తిగా రాజు కాగలడు. వీర్యవంతుఁడయిన సువ్రతుఁడు 64 సంవత్సరములు రాజ్యము చేయును. ధర్మ నేత్రుఁడు రాజయినప్పుడు ఐదేండ్ల వాఁడయి యుండును. ఆతఁడు 58 సంవత్సరములు రాజ్యముననుభవించెను. సుశ్రముండు 38 సంవత్సరములు రాజ్యము చేయును. దృఢసేనుఁడు 58 సంవత్సరములు రాజ్యము చేయును. తరువాత సుమతి రాజ్యము పొందీ 33 సంవత్సరములు . పాలించును. తరువాత సునేత్రుఁడు 40 సంవత్సరములు ఏలును. సత్యజిత్తు 83 సంవత్సరములేలును. రాజ్యమును పొందిన తరువాత వీశ్వజిత్తు 24 సంవత్సరములేలును.  అరింజయుడు50 సంవత్సరములు రాజ్యము పాలించును.

ఈ విధముగా 22 రు రాజు లగుదురు. వారు బృహద్రథులు, బృహద్రథులు ఒక వెయ్యి సంవత్సరములు పాలింతురు. 121 బృహద్రథులు గతించిన తరువాత, దేశమున వీరహంతలు లేకపోవుటచే శునకుఁడు తన ప్రభువును చంపి తనకుమారుని పట్టాభిషిక్తుని చేయును. క్షత్రియులందరు కండ్లప్ప గించి చూచుచుండగ, ఆతఁడు తన ప్రభువును బలాత్కారముగ. చంపీ బలముతో ప్రద్యోతనుని రాజుచేయును. భవిష్యత్తులో నాతడిట్లుం అనివార్యముగ జేయును. సామంతులందరాతనికి నమస్కరింతురు. ఆ. నరోత్తముడు 23 సంవత్సరములు రాజుగా పాలించును. తరువాత పాలకుఁడు 24 సంవత్సరములు రాజుగా పాలించును. తరువాత విశాఖ యూపుఁడు 50 సంవత్సరములు రాజగును అజకుఁడు రాజ్యమును 21 సంవత్సరములు చేయును. అతని కుమారుఁడు నంది వర్ధనుఁడు 20 సంవత్సరము పాలించును. ప్రద్యోతులు (ప్రద్యోతి సంతతులు 5 గురు. వారు 138 సంవత్సరములు పాలింతురు. వారి యశస్సు నంతటినీ నాశముచేసి పోరణాసియందు శిశునాగుఁడు రాజగును. అతని కుమారుఁడు గిరి. ప్రజమునకరుగును. శిశు నాగుండు 40 సంవత్సరములు రాజగును.

 అతని కుమారుఁడు కాకవర్లుఁడు వీ6 సంవత్సరములు రాజగును. తరుపోత క్షేమధర్మఁడు ఇరువది సంవత్సరములు రాజగును. తరువాత క్షతౌజుడు, రాజ్యమును పొంది 40 సంవత్సరములు రాజ్యము చేయును. విధిస్తారుఁడు 38 సంవత్సరములు రాజగును. తరువాత అజాత శత్రుడు 25 సంవత్సరములు రాజగును. 35 సంవత్సరములు దర్భకుఁడు రాజగును. తరువోత ఉదయి 33 సంవత్సరములు రాజగును. రాజ్యమును స్వీకరించిన నాలుగవ దినమున ఆ రాజు గంగా నదీ దక్షిణ కూలముల కుసుమ మను పేరుగల పురవరమును నిర్మించును. నంది వర్ధనుడు 40 ఏండ్లు రాజుగా పాలించును. మహానంది 43 సంవత్సరములు రాజగును. శిశునాగ వంశరాజులు పదిమంది మాత్రమే. వారందరు క్షత్రియులు. మరల తత్సమాన కాలము ఇతర రాజులు రాజ్యము చేయుదురు.

ఇక్ష్వాకు వంశమున 24 గురు రాజులు. పాంచాలురు 25 గురు 24 గురు కాలకులు, హైహయ వంశమున 24 గురు రాజులు, ఏక లింగ వంశమున 32, శక వంశీయులు 25, కురువంశమున 32 రాజులు మిథిల వంశమువారు 28 గురు రాజులు. శూరసేన రాజులు 23, వీతిహోత్ర వంశ రాజులు 20, వీరందరు రాజులు సమకాలికులు అగుదరు. శూద్ర స్త్రీ వలన గలిగిన మహానంది సుతుం డు కాల ప్రభావమున రాజగును. సర్వక్షత్రియులకు అంతమును గలిగించు మహా పద్ముడు జన్మింపగలఁడు. తరువాత రాజులందరును శూద్ర సంభవులు మహా పద్ముండు ఏకైకరోజు ఏకచ్ఛత్రాధిపతియగును. అతఁడు 88 సంవత్సరములు పాలించును.

తరువాత మహా పద్ముని యొక్క ఎనమండ్రు కుమారులు క్రమముగా 12 సంవత్సరములు తద్వంశమున రోజులు. బ్రాహ్మణ శ్రేషుఁడయిన కౌటిల్యుఁడు, వారందరినీ ఉద్దరించును. ఆతఁడు వంద సంవత్సరములు భూమీననుభవించును. చంద్రగుప్తనిరాజ్యము నందు కౌటిల్యుఁడు స్థాపింపఁగలడు. చంద్రగుప్తుఁడు 24 సంవత్సరములు రాజుగా పాలించును.

            భద్ర సారుఁడు 25 సంవత్సరములు రాజు కాగలడు. ఆతఁడు అశోకుని 36 సంవత్సరములు రాజుగా తృప్తి పరచును. అతని కుమారుఁడు కులాలుడు (కుశాలకూనాల?) 8 సంవత్సరములు రాజగును. కుశాలునీ కుమారుడయిన బంధు పాలితుడు 8 సంవత్సరములు - రాజ్యముననుభవించును.

 బంధుపాలితుని వారసుఁడు, దాయాది ఇంద్ర పాలితుఁడు. నరాధిపుఁడయిన దేవవర్మ 7 సంవత్సరములు రాజగును. ఆతని కుమారుఁడు శతధనుఁడు రాజగును. బృహద్రథుఁడు 7 సంవత్సరములు రాజగును. ఈ విధముగా మౌర్య రాజులు తొమ్మండుగురు. భూమిని 137 సంవత్సరములు పాలింతురు, తరువాత వారి ఎండి ర్యాము “శుంగులను సంక్రమించును. సేనానియయిన పుష్పమిత్రుఁడు బృహద్రథుని తొలగించి రాజ్యమును 60 ఏండ్లు పాలించును. అన్నీ మిత్రుఁడు ఎనిమిదేండ్లు రాజుగా నుండును. తరువాత సుజ్యేషుఁడు 7 సంవత్సరములు రాజగును. తరువాత వసు మిత్రుఁడు రాజై పది యేండ్లు పాలించును. తరువాత భద్రుఁడు రెండేండ్ల రాజు. తరువాత పులిందకుఁడు 3 సంవత్సరములు రాజగును. తరువాత ఘోషుఁడు మూడేండ్ల పాటు రాజు, తరువాత వజ్ర మిత్రుఁడు 7 సంవత్సరములు రోజు. భాగవత రాజు తరువాత 2 సంవత్సరములు రాజు. తరువాత వాని కుమారుఁడు దేవభూమి 10 సంవత్సరములు పాలించును. ఈ విధముగా 'శుంగ వంశపు రాజులు పది మంది భూమినంతటిని 112 సంవత్సరములు పాలింతురు. వారి నుండి రాజ్యము కణ్వ వంశీయులకు సంక్రమించును అమాత్యుడయిన వసుదేవుడు బాల్యాత్పభృతి వ్యసనియయిన దేవ భూమిని చంపి, శుంగ వంశమునందు నృపుఁడగును. ఆతఁడు కణ్వాయనుఁడు (తద్వంశీయుడై 5 సంవత్సరములు పాలించును. ఆతని కుమారుం డు భూమీ పుత్రుఁడు. అతఁడు 24 సంవత్సరములు రాజగును. ఆతనీ తరువాత నారాయణుడు 12 సంవత్సరములు ఆతని కుమారుం డు సుశర్మ 4 సంవత్సరములు రాజ్యము చేయును. కణ్వాయన రాజులు నలుగురు. వారు 25 సంవత్సరములు రాజ్యముననుభవింతురు. తరువాత రాజ్యము ఆంధ్రులకు సంక్రమించును. కణ్వాయను డయిన సుశర్మను నూడబెరికి !

ఆంధ్ర జాతీయుడయిన సింధుకుఁడు వసుంధరును పొందును. సింధుకుఁడు 23 సంవత్సరములు రాజు. అతని సోదరుఁడు కృష్ణుఁడు, ఆతని తరువాత 10 సంవత్సరములు రాజగును. అతని కుమారుఁడు శ్రీ శాంతకర్ణి (శాతకర్ణి) మహారాజు అగును. శాంతకర్ణి 56 సంవత్సరములు రోజుకాగలఁడు. ఆతని కుమారుడు ఆపోలవుఁడు 12 సంవత్సరములు రాజగును. 'పటుమంతుం డు' 24 సంవత్సరములు రాజగును. అనిష్టకర్మ 25 సంవత్సరములు రాజు. ఒక సంపూర్ణ సంవత్సర కాలము 'హాలుఁడు' రాజు కాగలడు. తరువాత మహా బలుడయిన పత్తల్లక నాముఁడయిన రాజు 5 సంవత్సరములు రాజగును, పురీష భీరువు 21 సంవత్సరములు రాజు. శాతకర్ణి ఒక సంవత్సరము రాజగును. శివస్వాతి 28 సంవత్సరములు రాజుకాగలఁడు. గౌతమీ పుత్రుఁడు 21 సంవత్సరములు. రాజు కాగలఁడు. తరువాత యజ్ఞశ్రీ శాతకర్ణి రాజుగా 19 సంవత్సరములు పాలించును, ఆతని తరువాత విజయుఁడు ఆరు సంవత్సరములే రాజగును. అతని కుమారుఁడు దండశ్రీ శాతకర్ణి మూఁడేండ్ల రాజగును. పులోమారి 7 సంవత్సరములు రాజగును, ఈ విధముగా నీ 30 ఆంధ్ర రాజులు భూమిని 450 సంవత్సరములు భూపాలనమ నుభవింతురు. ఆంధ్ర వంశములు ఐదు గతించినవి, వారి వంశమునకు చెందిన వారు భవిష్యత్తులో 7 గురు. తరువాత ఆంధ్ర రాజులు పదిమందియుందురు.

 గర్దభిరాజులు 7 గురు. తరువాత శకులు 10 మంది. యవన వంశములు 8. తరువాత తుషారులు పదునలుగురు. గురుండులు పది ముగ్గురు, యవన వంశీయలు 11 గురు. ఈ భూమీనీ ఆంధ్రులు మూడు వందల సంవత్సరములనుభవింతురు పది మంది అభీరులు 67 సంవత్సరములు రాజులగుదురు. గర్దభుజలయిన ఏడుగురు భూమిని 72 సంవత్సరములనుభవింతురు. శకులు భూమిని 380 సంవత్సరములనుభవింతురు, యవనులు ఈ భూమిని 160 సంవత్సరములనుభవింతురు. తుషారులు తమ రాజ్యమును 500 సంవత్సరములు నిలుపుకొని పాలింతురు. మ్లేచ్చులకు సంబంధించిన పదముగ్గురు గురుండులు భూమిని 300 సంవత్సరము వృషలులతో కలిసి యేలుదురు. .

పదకొండ్రు మౌనులు 300 సంవత్సరములేలుదరు, కాలబలముచే వారు నిర్మూలింపబడగా ‘కిలకిల’వంశము పాలించును. ‘కిలకిల'ల. తరువాత వింధ్యశక్తి రాజగును. ఆతఁడు 96 సంవత్సరములు పృథ్విని పాలించును. అందుచే భవిష్యద్రాజులు విదిశకు చెందిన వారని యెఱుంగుఁడు. సర్పరాజయిన సదాచంద్రుఁడు సర్పరాజయిన శేషుని కుమారుఁడు ఆతఁడు సురపురంజయుఁ డు ఆతఁడు భోగి (సరము) అతఁడు రాజగును. సాగకులమునుద్ధరించును. ఇక రెండవ రాజు చంద్రశువు. తరువాత ‘నవంతుడు’ రాజగును. ఈ వంశములో పుట్టిన సోల్గవ వాఁడు ధనధర్ముఁడు. తరువాత భూతినందుఁడు వీదీశారాజుగా వంశపారంపర్యమునవచ్చును ఆతని తమ్ముడు నందీయశుండు, ఆ వంశములో మువ్వురే రాజులుందురు దౌహిత్రుఁడు (కూతుని కొడుకు) శ్రీశీకుడు షూరికయందు రాజు అయ్యెను. ప్రవీరుఁడు, వీర్యవంతుడు నయిన వింధ్యశక్తి కుమారుడు ప్రవీరుడనువాడు కాంచనక పట్టణమును 60 యేండ్లు అనుభవించును: అతఁడు పరిసమాప్తిని వరదక్షిణలతో వాజపేయ యజ్ఞములను ఆచరింపగలఁడు అతని కుమారులు నలుగురు నరాధిపతులగుదురు. వారిలో ముగ్గురు వింధ్యకుల కులములతో వివాహ సంబంధము కలిగియుందురు వివాహ సంబంధము వలన రాజులగుదురు. సుప్రతీకుఁడు గభీరుడు రాజ్యమును ఇరువది వత్సరములనుభవింతురు. శంకమానుఁడు మహిషీ రాజ్యమునకు పాలకుడగును. వారిలో పుష్యమిత్రులారుగురు స్త్రీ మిత్రులు పదిముగ్గురు మేఖలయందు సృపులు 7 గురగుపరు. వారు 70 సంవత్సరములు పాలింతురు, కోమలయందలి రాజులు మహా బలవంతులగుదురు. మీరు 'మేఘులనీ' సమాఖ్యాతులు వారందరు బుద్ధిమంతులు ఆ వంశములో ఆ మంది ఉందురు. నైషధులందరు గొప్ప రాజులు. వారి వంశము మన్వంతరము వఱకు సాగును. వారందరు నల వంశములో పుట్టుదురు. వారందరు వీర్యవంతులు మహాబలులు. మగధులకు విశ్వస్పాణి మహా వీర్యుడగును. ఆతఁడు రాజులనందరను పదచ్యుతులను చేసి ఇతర వర్ణములను సృశించును  వారు క్రైవర్తులు, మద్రకులు, పులిందులు, మరియు బ్రాహ్మణులు. ఆ రాజు వారందరిని సోనా దేశములలో స్థాపించెను. విశ్వస్ఫాణి మహా సత్వుఁడు.యుద్ధము నందు విష్ణునితో సమఁడు

విశ్వస్ఫాణిని నరపతిగా చెప్పుదురు. క్షత్రియులనున్మూలించి ఇతర క్షత్రియుల నతఁడు. సృజించును. నవ నాగరాజులు, చంపావతీ నగరమును పరిపాలింతురు. సప్త సంఖ్యగల నాగులు, రమ్యమైన మధురా నగరముననుభవింతురు, తద్వంశీయులు గంగకు పరిసరములందున్న ప్రదేశములను, ప్రయాగను, మధురను తత్సప్తవంశీయులు తర్రాష్ట్రములను ననుభవింతురు. మణి ధాన్య జములయిన నైషధ, యదుక శైశీత దేశములను కాలతోయక దేశములను కోసలములను ఆంధ్ర రాష్ట్రములను పౌండ్రకములను తాత్రలిప్తలను సాగరములను, అంతియేకాక రమ్యమయిన నగరమయిన చంపను దేవ రక్షితులు పాలింతురు. గుహ వంశీయులు, కలింగమును, మహిషమును, మహేంద్ర నిలయములయిన జనపదముల నన్నింటిని పాలించెదరు. కనకాహ్వయుఁడు (కనాభిరామం డా) స్త్రీ రాష్ట్రములను, భోజక రాష్ట్రములను, పాలించును. ఈ రాజులందరు సమకాలికులగుదురు.

యవన రాజులు, సంతోష పెట్టబడుటకు వీలుకానివారు, అనృతవాదులు, మహాక్రోధులు అధార్మికులు, ధర్మతః అర్ధతః కామతః, . ఆ నరాధి పతులు మూర్థాభిషిక్తులు (పట్టాభిక్తులు) కారు. వారందరు యుగదోషదురాచారులగుదురు. వారు పర్యాయమున (క్రమమున) - కాలమును బట్టి పృథివీక్షితులగుదురు. ఆ రాజులందరు ధర్మతః అర్థతః కామతః విహీనులగుదురు. వారి మూలమున రాష్ట్రములన్నియు - నన్యోన్య మిశ్రములై, మ్లేచ్ఛా చారముల ననుసరింతురు. వారందరు సుప్రతిష్ఠితాచారములకు విపర్యయముగా నాచరించి ప్రజలను నాశనము చేయుదురు. ఆ రోజులందరు పర్యాయమున సంక్రమించిన బహుస్తీ కమయిన యుగమున లుబ్ధులు, అనృతవాదులు, సంక్రమించిన వారు అగుదురు, ఆయువు, రూపము, బలము, వేదము మొదలగు వానిచే లవ లవము ప్రరిభ్రశ్య మానులై రాజులందరు కాలముచేనుపహతులై ప్రజలు అధోస్థితిని చెందగా నా జగతీపతులు నశింతురు. వారు కల్కిచే ఆహతులగుదురు. అందరూ మ్లేచ్ఛులతో సంక్షయమును పొందుదురు.

 తద్విధముగా అత్యంతము అధర్ములు ఫాఖండులు వినాశమునొందుదురు. రాజ' శబ్దము కూడ ప్రనష్టమొందును. రెండు యుగముల మధ్య కాలమయిన కలియుగ సంధి మిగిలియుండును. తత్కాలము వరకు మిగిలియున్న కొద్దిమంది ప్రజలు ధర్మము నశింపగా ఆస్తులు అవలంబములు లేక వారనాథలగుదురు. వారికి సాధనములు లేనందువలన ఆహతులు. స్వకీయ వ్యాధి శోక పీడితులు. వర్షా భావము చేతను, పరస్పర వధ చేతను. వారు అనాధారులు. భయకంపితులై స్వవృత్తులను, కార్యస్థావరములను విడిచి పోవుదురు అత్యంత దుః ఖితులై పురములను గ్రామములను విడిచి వారందరు అరణ్యవాసులగుదురు. ఇట్టి వివిధములయిన నష్టములందు ప్రజలు తమ తమ గృహముల పరిత్యజించుదురు. స్నేహభావము నశించగా, భ్రష్ట స్నేహులై నుహృజ్ఞనములతో దుఃఖాపన్నులగుదురు. వర్ణాశ్రమములు పరిభ్రష్టములు పరస్పర సంకరాచారములు ఘోరముగ సంప్రాప్తములు, ప్రజలు నదులను పర్వత భూములను సేవించుదురు. నదులను, సొగరానూప ప్రాంతములను పర్వతముల నాశ్రయింతురు. అంగ కలింగ వంగ కాశ్మీర కాళీ ప్రదేశములను, ఋషికాంతాగీరిద్రోణులను (సన్నిహిత ప్రాంతముల) సరస్సుల మానవులాశ్రయింతురు. హిమవత్పర్వత పృష్ట భాగములకు లవణ సముద్రముల కూలములకు అరణ్యములకు మ్లేచ్చులతో సహా వెళ్లెదరు. మానవులు మృగముల మీనముల విహంగముల శ్వాపదముల (హోర మృగముల) శ్వాపదముల యొక్క మాంసములచే తనువులు నిలుపుకొందరు. కొందరు మానవులు తేనె, శాకములు ఫలములు, మూలములు, మొదలగువానిచే నివసింతురు. పూర్వపు ఋషుల వలె చెట్టు బెరడులు, పర్ణములు, వల్కలములు, మృగ చర్మలతో స్వయముగా చేసి, తమ శరీరములను కప్పుకొందురు. వారు శంకులతో, కళలతో బీజముల నాటుటకు ప్రయత్నింతురు. అధిక శ్రమతో వారు మేకలను, గొఱ్ఱులను, గాడిదలను, ఒంటెలను రక్షించు కొందురు. మానవులు నీటి కొరకు బ్రతుకు కొరకు నదుల నాశ్రయింతురు. దుష్ట వ్యవహారములచే పార్థివులు పరస్పరము బాధించుకొందురు. ప్రజలు తమ్ము గూర్చి గొప్పగా తలంచుకొందరు వారు సంతాన హీనులగుదురు. వారందరు దేశా చారాదులను విసర్జించుదురు. ఈ విధంగా ప్రజలు అధర్మ వ్యవస్థితులై యుందురు. సామాన్యులందరు, హీనానందులను, నీచులను, అధర్మ పరుల ననుసరించుదురు. ఆయుఎవరీకి 23 సంవత్సరముల ప్రాయము మీంచి యుండదు. దుర్బలులు, విషయ గ్లానులు, వారక్యముచే నిండిన వారు పత్రమూల ఫలముల ఆహారముగా గలవారు తోళ్ల చర్మములను ధరించెడివారు వృత్తికొఱకు జీవికం కొఱకు సర్వత్ర భూమిని సంచరింతురు.

 ప్రజలీపరిస్థితులకు వచ్చు సరికి కలియుగము సమాప్తమునకు వచ్చును. దైవమానముననుసరించి ఒక సహస్ర దివ్య వర్షములకు కలియుగము క్షీణింపగా, ఆ యుగముతో సహితముగా మానవులు మృతి నొందుదురు. కలియుగమున ప్రజలు నిశ్శేషులగుదురు. సంధి కాలముతో. కలియుగము సమాప్తము కాగా, కృతయుగము ఆరంభమగును. చంద్రుఁడు, సూర్యఁడు, తిష్య (పుష్యమీ) నక్షత్రము- బృహస్పతి - వీరందరేకరాశిలో నుండ. అప్పుడు కృతయుగ మారంభమగును. ఈ వంశ క్రమము సర్వస్వము యథాక్రమముగా మీకు "వివరించితిని. పరీక్షిత్తు యొక్క జననముతో నారంభమయి మహానందుని యొక్క పట్టాభి షేకముతో ముగియు వరకు భూత-భవిష్యత్-వర్తమాన కాలములలోని రాజుల వంశక్రమము చెప్పబడినది. ఇది మొత్తము ఒక వెయ్యి ఏబది సంవత్సరములగును, (గ్రంథము సరిగాలేదు) దానికి నిదర్శనము చెప్పుటకు వీలున్నది. మహాపద్ముని తరువాత ను, అంధ్రరాజుల రాజ్య సమాప్త - కాలముతో సహా 836 సంవత్సరములు. ఇది యింతకుఁబూర్వము చెప్పబడినది. ఈ కాల ప్రమాణము పురాణముల చక్కగా, నెరింగిన .. ఋషులచే గణింపబడినదీ-229, అభ్రవీధి 27 నక్షత్రములు కలిగియున్నది. సప్తర్వులు (ఏడుగురు ఋషులు) పరీక్షిత్తు కాలములో సప్తర్షులు (పిత్య) నక్షత్రముననుండిరి. (మఘ-నక్షత్రస్థితి). అందువారు ఒక వంద సంవత్సరములుండిరి. పొరు ప్రతి నక్షత్ర కూటములలో  మరలనొక వంద సంవత్సరములుందురు. అందుచే ఆంధ్రుల వంశములు 2700 (రెండువేల ఏడు వందలు) సప్తర్వులయుగము దివ్య సంఖ్యచే (దేవతా గణనముచే) గణింపఁబడినదని యెఱుంగవలెను. దివ్య గణమున లెక్కించిన మాసముల సంఖ్య ఆరు, సంవత్సరములు. దానిని బట్టి ఆ దివ్య కాల గుణనము పనిచేయ ప్రారంభించును. (360x71/2=2700) సప్తర్షి మండలములోని రెండు నక్షత్రములు,  . ఆకాశమున ఉత్తరముననగుపించును. ఆ రెండింటి మధ్యను ఒక నక్షత్ర కూటము కనిపించును. సప్తరులు ఈ నక్షత్రముతో కలిగియుండిరని తెలిసికొనవలెను.  ఈ నక్షత్రముల సమావేశము . 100 సంవత్సరములుండును. ఇదీ ఋషులకు నక్షత్రముల సంబంధమునకు మూలము (ఆధార విషయము) 'మఘా' నక్షత్ర మండలముతో సమావేశముగల సప్తర్సులు పరీక్షిత్తు కాలములో వారందు 100 సంవత్సరములుండిరి. ఆంధ్ర. రాజు పంక్తిలోని24వ రాజుతో 100 సంవత్సరములుండును. ప్రజలు ప్రకృతులను తీవ్రముగా నెదురుకొందురు, -236. భౌత స్మార్త క్రియలు ప్రశిధిలముకాగా, ధర్మతః అర్ధతః కామతః ఎల్లరు అనృతోపహతులు కాగా, వర్ణాశ్రమాచారములు ప్రశిధిలముకాగా, దుర్బలాత్ములు మోహితులై సంకరత్వమునొందుదురు. బ్రాహ్మణులతో శూద్రులు సంసక్తులగుదురు.

 బ్రాహ్మణులు శూద్రులకు యజ్ఞములు చేయువారగుదురు. శూద్రులు మంత్రయోనులగుదురు. విప్రులు శూద్రులను చేరి, వారిని, ఏదియో జీవనాధారము కొఱకు, వృత్తిని అభిలషించి, చేరుదురు. ప్రజలు ధర్మము నుండి కొద్ది కొద్దిగా క్రమేణ భ్రష్టులగుదురు.  యుగాంతమున ప్రజలు పూర్తిగా క్షయమునొందుదురు. ఏ రోజున కృష్ణుడు స్వర్గమునకరిగెనో ఆ దినముననే కలియుగము ఆరంభమయ్యెను. ఆ "కాలమెట్లు గణింపబడినదో యెఱుంగుఁడు. కలియుగము, మానవ గణనమును బట్టి 3,60,000 సంవత్సరముల ప్రమాణముకలది. ఈ కాలము దేవమానములోనొక సహస్ర వర్షములు. కలి యొక్క సంధి కాలములు రెండును ఇంతకు పూర్వమే చెప్పబడినవి. కలియుగమంతయును సమాప్తము అయిన వెంటనే కృతయుగము ఆరంభించును, ఐల వంశము ఇక్ష్వాకు వంశము వాని వాని భేదములు కీర్తింపఁబడినవి సూర్యవశమయిన ఇక్ష్వాకు వంశము సుమిత్రా ద్వీపముతో అంతమగుచున్న దని యెఱుంగవలెను. చంద్ర వంశమును గూర్చి తెలిసినవారు, ఐల సంబంధమయిన క్షత్రియ వంశము క్షేమకుని తో అంతమగుననీ యెతుంగుదురు. ఈ వివస్వద్వంశ పుత్రులు భూత భవిష్యద్వర్తమాన కాలములో కీర్తింపఁబడిరి. వారు కీర్తి వర్థనులు. వారు, ". బ్రాహ్మణులుగా క్షత్రియులుగా వైశ్యులుగా, శూద్రులుగా, పుట్టియుండిరని యనుకొందురు . యుగ యుగము నందు మహాత్ములైనవారు " వేలకొలది మరణించిరి.వారి సంఖ్య సంఖ్యామానమున అనంతము. పునరుక్తి బహుత్వమువలన నేను కీర్తింపలేదు. ఈ వైవస్వత మన్వంతరమున నిమివంశము సమాప్తము నొందును. ఎవరి నుండి క్షత్ర జాతి ఈ యుగమున ఆరంభమగునో వారిని గూర్చి చెప్పెదను. నేను వివరించుచుండగా దానిని గ్రహింపుఁడు. పౌరవుల రాజయిన దేవాపి, ఇక్ష్వాకు వంశమునకు చెందిన 'మరుఁడు, వీరిరువురును మహాయోగబలములు కలవారు వారు 'కలాప' గ్రామ మందుండిరి. ఇరువది నాలుగవ చతుర్యుగము నందు వీరే క్షత్రీయ జాతి వర్ధిల్లుటకు కారణపురుషులు సువర్చసుడు అను పుత్రుఁడు ఇక్ష్వాకునకు పుట్టును. ఇది 29వ యుగము నందు. ఆతఁడే యీ వంశమున కారంభకుఁ డు, సంస్థాపకుఁడు కాగలడు. దేవాషికి సపౌలుడై ఐలాదియైనవాడు రాజగును. చతుర్యుగము 24వ నందును వారిరువురును క్షత్రియ ప్రవర్తకులగుదురు. ఈ విధముగా సంతానార్థము లక్షణము వంశము నీలుపుటయే సిద్ధాంతము సర్వత్ర తెలిసికొనవలయును. కలియుగము క్షీణమయి కృతయుగము రాబోవును. వారు (కృతయుగమున పుట్టుదురు) ఆద్యమైన త్రేతాయుగమునందు సప్తర్షులతో సహా, వారే.

 క్షత్రియుల యొక్క బ్రాహ్మణుల యొక్క గోత్ర ప్రవర్తకులు కాగలరు. ద్వాపరాంశములో క్షత్రియులు ఋషులతో కూడ నుందురు. ఇది భవిష్యద్యుగమున కృతయుగమునందు బ్రాహ్మణ క్షత్రియ బీజార్ధము కొఱకు. ఈ విధముగనే ప్రతీయుగమునందు సప్తర్పులు అసురుల యొక్క రాజులతో వారి వంశమును నిల్పుటకు నుందురు. బ్రాహ్మణులతోడి క్షత్రీయుల సంబంధము సముచ్చేద సంబంధముగా సంస్కృతము. ఏడు మన్వంతరముల యొక్క సప్తసంతానముల గూర్చి మీరు వినీయుంటిరీ సాధారణముగా యుగముల యొక్క బ్రాహ్మణులయొక్క ఉద్బవములు (ఆరంభములు) పరస్పరాశ్రయములు. యుగముల ఆరంభము, అట్లే బ్రాహ్మణ క్షత్రీ యోద్భవములు, వాని వినాశనము, ఇది యెట్లు ప్రవర్తించునో ప్రవర్తింప నారంభించిన తరువాత ఎటుల వినాశనము చెందునో (క్షయము, ప్రవృత్తి),సప్తర్వులు దీర్ఘాయుష్మంతులగుటి వారెరుగుదురు, (ఓ బ్రాహ్మణులారా) ఈ విధముగా (ఈక్రమయోగమున) ఐల ఇక్ష్వాకు వంశములు, త్రేతాయుగమున ఉద్భవమయిన కలియుగము నందు సౌశనములయినవి. మన్వంతరము యొక్క సమాప్తము వరకు వారాయుగమును అనుసరింతురు. జమదగ్ని కుమారుడైన జమదగ్ని క్షత్రియులను నిశ్శేషము చేయగా, యావద్భూమీరు వసుధాధిపులయిన క్షత్రియనిశ్శేషము చేయ యావదూమియు వసుధాధిపులయిన క్షత్రియులచే సంకులము సంక్షుఱ్ఱము చేయబడినది. ఈరెండు వంశముల యొక్క కారణమును చెప్పెదను తెలిసికొనుఁడు. ఇక్ష్వాకుల ఐలుల సంతతి భిన్నము. (సూర్యుడు - చంద్రుడు) ఇతరక్షత్రియులు (రాజులు) వీరి శ్రేణులలోనికి వత్తురు. ఐలవంశ మునందేవ్వరు ప్రఖ్యాతులోవారికి అట్లే ఇక్ష్వాకులలోని ప్రఖ్యాతులకు ఒక వంద కులములకు అభిషేకములు జరిగినవి.  భోజ వంశీయుల యొక్క విస్తారము దానికి రెండంతలు అని చెప్పుదురు. గ్రంథస్టాలిత్యములున్నట్టున్నవి?) మూడు వంతులు, క్షత్రియులు  సంస్థాపితులు, ఒక వంతు . ఇందు. అందు. చెదరీ వసించిరి. (వీరును వీరి పూర్వులతో సమానులని యెంగుడు) , వారలలో  ప్రతి వింధ్యుని యొక్క వారసులు సూరుమంది, నాగులు హిమాలయాల వారితో కలిసి వారసులు 100, 101 మంది ధృత రాష్టులు,జనమే జయవంశీయులు 80. బ్రహ్మదత్తులు 100, శారిణులు వీరిణులు నూర్గురు. పౌలులు 100, శ్వేతులు, కాశ్యులు, కుశాదయులు, మరి ఇతరులు, వెళ్లినవారు, శత బిందువులు  అందరు ఒక వెయ్యి. లక్షలాది నాణెములను నియమ దక్షిణాలుగా పంచబెట్టి వారశ్వ .మేధములను చేసిరి. ఈ విధముగా వందలకొలది, వేల కొలది, రాజర్షులు. గతించిరి. ఇప్పటి వైవస్థతమన్వంతరముననున్న పోరి సంతతుల  వినుడు.

అయినను, వారి సంతతులను, పరస్పరము పేర్కొనుట విస్తరించుట అశక్యము. పూర్వాపరయోగముతో వారిని గూర్చి చెప్పవలయునన్న నూరేండైన పట్టును, ఈ రాజర్షులతో, 2,8 యుగముల యొక్క వర్గములు (నాలుయుగములొక వర్గము) వైవస్వత మన్వంతరమున జరిగినవి, ఇంకను మిగిలిన వారిని తెలిసికొనుము. నాలుగు యుగములలోకి 43 (రాజుల) సముచ్చయములు, ఇంకను భవిష్యద్రాజులతో రావలయును. దాని తరువాత వైవస్వయన్వంతరము సమాప్తమగును.

 అందుచే సంక్షిప్తముగా వివరముగా మీ కంతయును వివరించితిని. ఆనేకమయిన పునరుక్తులుండుటవలన, యుగములతో కూడ : సర్వము పరిపూర్ణముగా చెప్పుటకు సాధ్యముకాదు. యయాతి కుమారులైదుగురి యొక్క సంతతులు ప్రజలకు మంచివి. వానిని కీర్తించితిని. వారు గతించిరి. వారీలోకములను ధరించుచున్నారు. (ఉద్దరించుచున్నారు). ఆ యైదు సంతతులను జ్ఞప్తిలోనుంచుకొని, వానిని గూర్చి వినినందువలన - ఆయువు, (2) కీర్తి (3) ధనము (4) పుత్రులు, (5) స్వర్గమును పొందుదురు.

ఈ విధముగా తృతీయపాదము విస్తరముగాను ఆనుపూర్వీకముగాను చెప్పబడినది. ఇంక నేనేమి వర్ణింతును

ఇది శ్రీ వాయుప్రోక్త బ్రహ్మాండ మహాపురాణమున మధ్యమ భాగమున, తృతీయ ఉపోద్ఘాత పాదమునందు “వంశాను వర్ణనమను” 74వ అధ్యాయము.