3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)
62 - గాంధర్వలక్షణము
సూత ఉవాచ :-
పూర్వాచార్యుల మతము నెఱింగి ప్రఖ్యాతములైన సంగీతాలంకారములను క్రమముగా చెప్పెదను వినుము. వానీ వానీకీ కారణములయిన ఉదాత్త అనుదాత్త స్వరితములతో కూడి వానీ వాని వర్ణములతో అలంకారములు చెప్పబడవలయును. వాని నైనను నాట్యాదికముల దృష్టితో నుంచుకొని, సంస్థాన యోగము లెట్లున్న అట్లే ఎల్లప్పుడును చెప్పవలయును. వాక్యార్థ పదయోగార్థములచే అలంకారములచే పూరింపబడవలెను. గీతము యొక్క పదములు అలంకారములకు ముందుగాని వెనుకగాని వచ్చును. మనస్సు కంఠము శిరస్సు మూఁడును శబ్లోత్పత్తి స్థానములని తెలిసికొనవలెను. (4(?) ఈ మూడింటిలో శబ్దోత్పత్తి ఉత్తమము (4బి) ప్రారంభదశలో (ప్రకృతిలో) నాలుగు నాలుగు విధముల చలనము గలిగిన నాలుగు వర్ణములు కలవు. ఒకటి విడిచి యొకటి చలించునవి ఎనిమిది విధములు. దేవతలు పోనిని 16గా చెప్పుదురు. వర్ణముల పేర్లు. మొదటీ వర్ణము స్పష్టము. రెండవది ప్రసంచారము. మూఁడవది అవరోహణము. వర్ణవిదులు నాలుగవది ఆరోహణముగా నెఱుంగుదురు. (6) సంచార స్థాయి గలిగినది యొక వర్ణము కలదు. సంచారము చరము (?) అవరోహణ వర్ణములకు అవరోహణము చెప్పవలెను. ఆరోహణమున ఆరోహణములుగా వర్ణముల వర్ణ విదు లెఱుంగుదురు. వానిని ఆయా వర్ణముల అలంకారములుగా నెఱుంగుము. (8) స్థాపనీ, క్రమరేజని, ప్రమాదము - అప్రమాదము అనీ అలంకారములు నాలుగు. వీని లక్షణములను చెప్పెదను. (9) అలంకారముల పేర్లు - విస్వరము, అష్టకళ (వీనికి మధ్య ఒక స్థానము కలదు. ఆవర్త, క్రమోత్పత్తి వాని వాని ప్రమాణముల బట్టి యుండును. కుమారము విస్తరముగా నెఱుంగవలెను. సంపరము వామనము. ఇవియే అపాంగము కుతరేకము (?) ఇవీ ఇంకొక కళ వహించును. (11)
సూచన :- ఈ గాంధర్వ మూర్ఛనా లక్షణమను 61, 62 అధ్యాయములు అతిగహనములు తలపగులగొట్టుకొన్నను, సంగీతపండితుల నడిగినను స్పష్టముగా అర్థము కాలేదు. పెద్దల నడిగి తెలిసినట్లు వ్రాసితిని. కాని 62 అధ్యాయమగమ్యగోచరము. విజ్ఞులు సంగీతజ్ఞులు మూలమును చదివి సరియైన విధముగా సంస్కరించీ చదువరులకు తెలియజేయగోరెద. ఇట్లు అనువక్త.
