3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

56 - గంగానయనము

జైమినిరువాచ :-

 జైమినీ ఇట్లు చెప్పెను.

ఓరాజా ! మహాత్ముఁడయిన సగరునీ చరిత్రమును, సంక్షేపముగా, విస్తరముగా నీకు చెప్పితిని. ఇది పాపనాశనమయినది. ఇది భరతఖండము. దక్షిణము నుండి యుత్తరము వఱకు నవయోజన సాహస విస్తారముగా పరీవ్యాప్తమైనది. సగరుని పుత్రులు తురంగము కొఱకు వెదకుచు నొక సహస్రయోజనములు త్రవ్విరి, మిగిలిన సహస్ర యోజనములు వినిపాతితములు. మకరాలయమయిన సముద్రము సగరుని పుత్రులచే త్రవ్వఁబడి వృద్ధిపొందింపఁబడినకారణమున సాగరమనీ లోకమున అప్పటినుండి పేరు గాంచినది. ఆ సముద్రము తీర్థ క్షేత్ర కొననయుతమయిన భూమీనీ తననీటిచే సంక్రమింపజేసి ముంచెత్తినది.  అంత, అట్టినిలయులయిన దేవతలు అసురులు, మానవులు అందందు చెదరిపోయిరి. బహుదఃఖసమన్వితులైరి. సర్వదేవతలచే నర్చింపఁబడు 'గోకర్ణ'మను విఖ్యాత తీర్థము. పశ్చిమ సముద్రతీరమున ఒకటిన్నర యోజనముల విస్తారము కలది కలదు. అందు అసంఖ్యాకములయిన తీర్థములు కలవు. అయ్యవి మునులకు దేవతలకు నివాసములు. పూర్వము ఆ క్షేత్రమున సిద్ద సంఘములు నివసించెను. ఆ పవిత్ర క్షేత్రము ప్రపంచమందంతట విఖ్యాతమయినది. అది శుభంకరము, సర్వపాపహరమును. ఆ తీర్ధము సముద్రము యొక్క దక్షిణ పశ్చిమభాగమున నున్నది.  అందు సంశ్రీతప్రతులయిన మునులెల్లరు తపస్సాచరించిరి. పరమ నీర్వాణము నొందిరి. పునరావృత్తి రహితులయిరి. ఆ క్షేత్రము యొక్క ప్రభావమున, భృత్యగణములతో, దేవితో సహితము, సకల దేవతలతో సాకము తత్ర్పీతిచే నందు శంకరుఁడు నీత్యము వసించును. ఎవరు మనస్సు నందు నిర్ణయించుకొని ఆ తీర్థయాత్ర యాచరించెదరో వారి పాపములు పెద్దగాలికి ఎండుటాకులు రాలిపడిపోవునట్లు నశించును. తత్సమీప ప్రదేశమున నివసించు చున్నను, దురాత్ములయినవారికీ తత్ క్షేత్రమును సేవింపవలెనను కోరిక యొకప్పుడును కలుగదు. ఏదీయే మహా సుకృతి యాచరించి యుండిననే కానీ, మానవులకు తత్ క్షేత్ర సేవారతి కలుగదు. ఒకవేళ చరాచర ప్రాణి. సంఘము నిర్బంధముచే నందు. మరణమును పొందినచో వారికి వెంటనే శాశ్వతమయిన స్వర్గ ప్రాప్తి కలుగును.

రాజోవాచ:-

 జైమీని రువాచ :

 అయ్యది సర్వక్షేత్రములలో నుత్తమమయినది. అంతియేకాక యది సర్వతీర్థ నికేతనము దీనిని గూర్చి తలపోసినంత మానవుఁడు. సర్వపాప విముక్తుఁడగును. సిద్దిని కాంక్షించు మునులు కొందరు ఆ తీర్థమునందు స్నానమాచరించుచు, శివుని ధ్యానించుచు నందే యుండిపోవుదురు. కామక్రోధ వినిర్ముక్తులు, మాత్సర్య దోషము లేనివారు, నయిన వారెవరందు నివసింతురో, అచిరకాలమున వీరు తత్సర్టీని పొందెదరు. జపహోమాదుల యందు ఆసక్తులు, శాంతస్వభావులు, నియమశీలురు, బ్రహ్మచారులు నయిన వారందు నీవసించీ అభీప్సిత సిద్ధిని పొందుదురు. దానములు, హోమములు, జపాదికములు, పితృదేవద్విజార్చనములు అచ్చట చేసినచో ఇతరప్రదేశముల చేసిన ఫలము కంటే కోటీగుణితములగును. తత్సవిత్రగోకర్ణక్షేత్రము అంబోధిసలీలముల నిమగ్నముకాగా, అందుండెడు మహాతపశ్శాలురయిన మునులు, నిపాసార్లము శ్రేష్ఠమయిన సహ్యపర్వతశిఖరము నౌరోహించిరి. అందు నివసించుచు, వారందరు పరస్పరము సంప్రదించుకొనిరి. మహేంద్ర పర్వతమున తపస్సాచరించుచున్న రాముని చేరుటకు పోవనారంభించిరి.

రాజిట్లనెను.

ఓ బ్రహ్మర్షీ ! సముద్రోదకములను అగస్త్యుఁడు త్రాగిన తరువాత, రాజనందన సాగరులు భూమిని త్రవ్విరీ. క్షేత్రములు, తీర్ధములు, ఆశ్రమములు, కాననములు నాశనములయినవి. భూభాగమున పురములు, గ్రామములు గనులు మొదలయినవి సముద్ర ప్రాంతమందలి దేశములు వినాశమొందినవి. తత్సముద్ర ప్రాంత నివాసులు తరువాత ఏమీ చేసిరి? అచ్చటనే బహు కష్టముతో నివసించి, ఇతర ప్రదేశముల కరిగిరా? ఎంతకాలమునకు సముద్రము సంపూర్ణ మయ్యెను? ఏ విధముగా సముద్రము పరిపూర్తి నొందినది? నాకు చెప్పుండు. అని యడిగెను.

జైమిని ఇట్లనెను :-

దురాత్ములచే అనుకూలములయిన ప్రదేశములు నాశితము చేయబడగా, అందుండేడు జనులందరు ఇందందు పాసమున కరిగిరీ. కొంతమంది క్షేత్రనివాసులు కష్టములను భవించుచు నందేవసించిరి. ఆ కాలములో, అంశుమంతుని కుమారుఁడు ధర్మాత్ముఁడు, విశ్రుతుం డయిన దిలీపుఁడు రాజయ్యెను. చక్కగా ననుభవించి భోగములంది, రాజయిన అంశుమంతుఁడు తపస్సు ఆచరింప దృఢ సంకల్పుఁడయి ఆరణ్యముల కరిగెను.

 అంత దిలీపుడు అశేషమయిన యీ భూమినంతటిని సర్వశత్రువులను జయించి, ధర్మముగా పాలించెను. ఆతనికీ లోకవిశ్రుతుఁడు భగీరథుఁడమ కుమారుఁడు కలడు. ఆతఁడు సర్వ ధర్మార్థకుశలుఁడు, శోభాయుతుఁడు, అమిత విక్రముఁడు. దిలీపుండును. ఆతనిని రాజ్యము నందు పట్టాభిషిక్తుని చేసి. వనమున. కరిగెను. భగీరథుఁడును దుర్మార్గులను హతమార్చీ చక్కగా పృథ్విని పాలించెను. అమరావతి యందు ఇంద్రునివలె సర్వభోగములతో వాతఁడు ఆనందించెను. తనకు. పూర్వులైన పితరులు విప్రకోపసముద్భవమయిన బ్రహ్మదండమున హతులై హోర నరకమును పొందిరని వినెను. సర్వ పితరుల గూర్చి విని అతి దుఃఖితుఁడయ్యెను. రాజ్యము నందు, బంధువుల యందు, 'భోగముల యందు భగీరథ రాజు పరమ వీరాగమొందెను. తన పితరులను నరకము నుండి తరింపఁజేయగోరి, మంత్రి ప్రవరుని యందు రాజ్యము నిక్షేపించి, తపస్సాచరింప నతడు వనమున కరిగెను. ముందుగా నతఁడు - ఆయుర్దాయము కొఱకు గొప్ప తపస్సుచే కమలోద్భవుఁడయిన బ్రహ్మను ఆరాధించెను. తనకు వలసినంత ఆయుర్భాగ్యము నాతని వలన పొందెను. తరువాత గంగానదినీ సమారాధించెను. ఆమెను ప్రసన్నురాలిని చేసికోనేను. ఆమె వలన దీవము నుండీ భూమికి దిగివచ్చు నట్టి వరము నందెను. ఆ గంగను శిరస్సున ధరించుటకు శివుని నతఁడు తపస్సుచే నారాంధీంచెను. భక్తవత్సలుఁడయిన శివుఁడు కూడ నా వరమతని కొసంగెను. జగత్పతియైన శివుఁడు, మేరువు నుండి క్రిందికి పడునట్టి గంగను, నక్రమకరములతో కూడియున్న దానిని తన శిరస్సున గ్రహించెను. మహావేగ ప్రవాహినియైన గంగ శివుని శిరస్సున పడి, ఆతని అతిగభీరమయిన పవిత్ర జటామండలమున విలీనమయ్యెను. శంభుని శీర్షజటామండలమున గంగ అరచేతిలోని నీటివలె విలీనమగుటను చూచి భగీరథుఁడు తద్విమోక్షము కొఱకు మరల శివుని ఆరాధించేను, శర్వుని అనుగ్రహమున ఆ గంగను పొంది భగీరథుఁడు భూమికి వచ్చిన గంగను సాగరులు భూమియందు గద్ధులైన దిశను గూర్చి తీసికొని వెళ్లెను. గంగ రాజర్షి ననుసరించి ప్రవహించుచు, యజ్ఞమాచరించు రాజర్షి జహ్నుని యజ్ఞవాటము జేరెను.

ఆతని యజ్ఞవాటికనంతటీని సర్వత్ర ముంచెత్తి విడిచెను. ఆ రాజర్షి క్రుద్ధుఁడయ్యెను. ఆతఁడు ఆ నది నంతయు పుక్కిటి నీరు వలె పూర్తిగా త్రాగివైచెను. మరల ఆ జహ్నురాజర్షిని అధిక శ్రద్ధతో అతంద్రితుఁడై వంద యేండ్లు భగీరథుఁడు సేవించెను. ప్రసన్నుడయిన ఆ నృపతి వలన భగీరథుఁడు గంగను పొందెను. గంగానది జుహ్నువి ఉదరమున చాలకాలము నుండి తరువాత అతని జఠరము నుండి వెడలి ప్రవహించివచ్చుటచే, గంగానదికి జాహ్నవి అను నామము భువిలో గలిగెను. భాగీరథి భగీరథునీ అనుసరించి ప్రవహించుచు ఆతని పితరుల యొక్క ఎమ్ముకలను, భస్మమును, సురనిమ్నగయైన గంగ తనయుదకముచే వైవిత మొనర్చెను. తరువాత గంగా జలములచే తడిసిన ఎముకలతో భస్మముతో, తత్క్షణమునందే సాగరులందరు నష్టపాపులైరి. నీరయము నుండి స్వర్గము చేరిరి. ఈ విధముగా అగంగా మహానది సాగరుల నందరను స్వర్గమును చేర్చి, ఆ మార్గము నంటియే వేగముగా పూర్వసాగరమును చేరెను. మేరు పర్వత శిఖరము నుండి, నాలుగు భాగములై గంగ చతుర్దశల కరిగెను. ఆ చతుర్విధభేదములచే, సీత, అలకనంద, సుచక్షువు, భద్రవతి అను నామ చతుష్టయమును పొందెను, అగస్త్యునిచే త్రాగబడిన ఉదకముచే చిరకాలము సముద్రము శుష్కోదకమైనను, గంగాంభములచే మరల పూరింపఁబడి (సముద్రము) నాలుగు సముద్రములయ్యెను. సాగరులచే పరీవర్థితమై సముద్రము పూర్ణమయ్యెను. అప్పుడు తత్సమీపమందున్న బహు దేశములు, సముద్రోపాంత వర్తి క్షేత్రములు సమంతతః అంతర్షితములయ్యెను. తమ నివాసము లందున్నవారు ఇక్కడకు నక్కడకు పోయిరి. ఇంతకుం బూర్వము చెప్పిన గోకర్ణక్షేత్రము అర్ణవ సమీపమున నున్నందున సముద్రమున నంతర్షితమయ్యెను. తన్నిలయులు దాని నుద్ధరింప కాంక్షించిరి. వారందరు సహ్యపర్వతమందు భృగువంశ శార్దూలుడయిన రాముని దర్శింపనేగిరి.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహాండ మహాపురాణమున, మధ్యమభాగమున, తృతీయ ఉపోద్ఘాతపాదమందు, గంగానయనమను ఏబదియారవ అధ్యాయము.