3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

49 - సగర దిగ్విజయము

జైమిని రువాచ :-

జైమిని ఇట్లు చెప్పెను :  

మునిసత్తముఁడయిన వసిష్ఠుని ఆజ్ఞనుగొని సగరుఁడు మహా సైన్యబలముతో గూడికొని విదర్భదేశముపై దండెత్తెను. అంత, విదర్భరాజు, కేశినీ నామము కలిగినదియు, సౌందర్యమున అనన్యమయినదియు, సగరునకన్ని విధముల ననుకూలమయినదియు నగు తనకుమార్తెను ప్రీతిపూర్వకముగా ఆతనికి సమర్పించెను. ఆమెనుశుభముహూర్తమున రాజశార్దూలుఁడయినరాజు వీధిమంతముగా నగ్ని సాక్షికముగా వివాహ మాడేను. (3) విదర్భరాజుచే అత్యంత సత్పతి నొంది కొన్ని దినములాతని భవనమునందుండి విదర్భరాజువలన అనుమతింపఁబడి సగరుఁడు బయలుదేరెను. పారిబర్హులచే సత్కరింపబడి, అందుండిబయలువెడలి రాజు శూరసేనదేశమును సమీపించెను. తనమాతృసోదరులైన యాదవులచే గౌరవింపఁబడెను. ధనౌఘములచే నర్చింపఁబడెను. అందుండి(మధురనుండీ) సగరుఁడు బయలుదేరెను. ఈ విధముగా సగరుఁడు భూమినంతటిని జయించెను. వారందరాతనీ సూచనలనంది సామంతులయిరి. రాజునకు కప్పములు చెల్లించిరి. అంతసగరుండుతనసామంతులను,తన్ననుసరించి వచ్చునట్టివారిని వారివారి రాజ్యములకేగ ననుమతించెను.(10)తరువాత గొప్పదియయినసంధావారముతో కూడికొనీ గొప్ప సైన్యముతోదేశములను పీడింపకయే సగరుఁడు స్వరాజ్యమును చేరెను.త్రోవలో గ్రామజనులచే మాటిమాటికి గౌరవింపఁబడుచు, సగరుఁడు వెంటనే అయోధ్యానగరమును చేరేను. సగరుని యొక్క రాకనెటింగి పురజనులధికోత్సాహపరవశులయిరీ: మహోత్సవములు నగరమునప్రవర్తిల్లేను.నగరమలంకరింపబడెను. భూభాగమంతయును నీటిచే తడుపబడినది.పరిశుభ్రముగా తుడువబడినది. పూర్ణకుంభశతములచే నిండియుండెను. విజయ ధ్వజ శత పతాకలచే నలంకరింపఁబడినది. నగరమంతటను అగరు గంధ వాసీతము. విచిత్రములయిన కుసుమముల యలంకరణముచే నుజ్వలముగానుండెను, గోపురములు అట్టాలకములు సద్రత్నతోరణములచే భూషింపఁబడినవి. పూవులతో పేలాలతో మహాపథము రాజవీధులు అలంకరింపఁబడినవి.

పట్టణమంతట ప్రతిగృహము మహోత్సవ సమాయుక్తమైనది. వాస్తుదేవతల పూజించు నట్టి గృహ పరంపరగలదైనది. దిక్చక్రమును జయించి వచ్చిన రాజును దర్శింప వలెననెడి కుతూహలముతో పౌరజానపదులు నగరముసర్వత్ర నలంకరించిరి. అంత మంత్రులు, అంతఃపుర నివాసులు, వారకాంతాకదంబములు నగరవాసులు - అందరు వచ్చి సర్వతః సంవృతులైయుండిరి. రాజు వారందరిని కలిసికొని, ఆశీర్వాద సత్క్రియలనంది  గొప్పగొప్పజయనినాదములతో దీక్చక్రముబధిరీకృతముకోగా, నానావిధములయిన వాద్యవిశేషముల సంఘాషతో మధురమయ శబ్దములతో, నిండిన నగర ప్రజానీకమును యథాయోగము సత్కరించి సంతోషముతో నిండిన ప్రజలతోపురోత్తమమును ప్రవేశించెను. సమధుర ములయినవేదసూక్తములతో బ్రాహ్మణులభినందించిరి. సూతులచే మాగధులచే వందులచే అధికముగా రాజు సంస్తూయమానుఁడయ్యెను. నానాజన పదులు చేయు జయ శబ్దములతో కూడికొని, కరూలరవోన్మిశ్రమయిన వీణావేణుతల ధ్వనులతో కూడికొని,సంగీతమాలపించు గాయకులతో నృత్యమాచరించుగడికాజనములతో, కూడికొని, ప్రకాశించుతెల్లనిఛత్రములచే ప్రకాశించుచు, సర్వత్ర సల్లాజకుసుమోత్కరములచే కూడి కొని,, ఇంద్రుఁడు అమరావతిని ప్రవేశించు నట్లు రాజు అయోధ్యా నగరమును ప్రవేశించెను. దోషద్భక్షమాదమునుండి పవిత్రీ కరింపఁబడిన వీథులలో పవిత్రవాసనాగంధములతో, బ్రాహ్మణులుముందునడువగా రాజు నగరమధ్యమున సమలంకృతమయిన గృహముగూర్చి వెడలెను. భార్యాద్వయముతో, సంతోషముగ ఆరాజుతన యానమునుండి దిగెను. అంత హృష్ట పుష్ట జనులతో గూడియున్న తల్లి యొక్క భవనమును రాజు ప్రవేశించేను. వినయాన్వితుఁడై తల్లియొక్కపర్యంకమును సమీపించి, శిరస్సుతో తల్లిపాదములను సంస్కృశించి, రోజు ప్రణామమొనర్చెను. ఆమె ఆశీస్సులతో - హర్ష గద్దదమయిన వాక్కులతో అభినందించి, వెంటనే సంభ్రమముతోలేచి, కుమారుని కౌగిలించుకొనెను. హరానందపూర్ణమై కోడండ్ర నిద్దరపు అనేకాశీస్సులచే నభినందించెను. రాజు బహువీధకథనములతో తల్లిని గౌరవించి, చిరకాలమందుండెను. ఆమెచే అనుజ్ఞనీయబడి ఆయాలయము నుండి బయలుదేరెను. సానుచరుఁడై తెల్లని వింజామరలచే వీచబడుచు,

 వసిష్ఠ ఉవాచ :-

సురరాజయిన యింద్రునివలె శనైశ్శనైః సభకు చేరెను. అది దివ్యమయినసభ అనేకులు నృపులు సేవించుచుండిరి. ఆ సభలో ప్రవేశించి, గురుజనులకు నమస్కరించెను, వారాశీస్సులచే నభినందించిరి. అంత శుభంకరమయినది దీవ్యమయినదియునగు సింహాసనమునందు నరేశ్వరుఁ డయిన రాజు ఆసీనుఁడయ్యెను. నానా జనపదేశ్వరులచే సేవింపఁబడుచు, నానావిధములయిన కథాప్రసంగములఁజేయుచు, సంప్రియమాణుండై, బంధువులతో గూడి, నృపవర్యుఁడందుండెను. జితదిజృండలుఁడయినరాజు, తన ప్రతిజ్ఞను పరిపాలించెను. అంత ఉదారధీమంతుఁ డయినరాజు ఆచారముననుసరించి ధర్మ అర్థ కామములను అర్థత్రయముననుసరించెను. (35)తన పరాక్రమముచే శత్రుమండలిని జయించేను. షృథివీనీ ఏకాతపత్రముగా పాలించెను. విష్ణువువలె భూమినేలెను. పూర్వము తండ్రికి కలిగిన పరిభవముచే క్రుద్ధుఁడయి తనప్రతిజ్ఞను నిర్వహించెను. సప్తద్వీపాబ్దినగర గ్రామాయతన మాలిని యైన భూమిని సర్వశత్రువుల జయించి, మహీపతి పాలించెను. ఇట్లు కొంతకాలము గడచెను. “జనేశ్వరుం డయిన రాజును చూడగోరి, ఋషి సత్తముఁడు, మహర్షియునైన వసిష్ఠుడు వచ్చెను, వచ్చునట్టి ఆ మహర్షిని చూచీ, ససంభ్రముఁడై అర్ఘ్యపాద్యముల గ్రహించి, సామంతులతో కూడి నృపుండు ఎదురుగా నేతెంచి పూజించెను. గురుభక్తి సమన్వితుఁడై ఆతనికి నమస్కరించెను. సగరుని ఆశీస్సులచే వృద్ధిపొందించి, నిలుచుండియున్న ఆ రాజును సామంతులను కూర్చుండుడు - ఆసీనులగుఁడని వసిష్ణుఁడు పలికెను. అంత మునిచే ఆజ్ఞాపింపఁ బడి కాంచనమయిన పరమాసనమున భార్యాయుతుఁడై రాజు ఆసీనుఁడయ్యెను. రాజులును ఉపవిష్టులయిరి. అంత ‘ఆపవుఁడు’ వసిష్ఠుఁడు  మెల్లగా రాజులందరు వినుచుండ నిట్లనెను.

వసిష్ఠుఁడనెను :

ఓ రాజా ! బాహ్యాభ్యంతరములలో నీకు కుశలమే కదా ! మంత్రులందు, అమాత్యవర్గమునందు, రాజ్యమునందంతటనుసుఖమేకదా! అదృష్టవశమున సమగ్రబలవాహనములతో నీశత్రువులందరు నీచే జయింపఁబడిరి.

జైమిని రువాచ :-

సగర ఉవాచ :-

 జైమిని రువాచ :-

అప్రయత్నముగా సులభముగా నీ శత్రువులు జయింపఁబడిరి. శపథము వహించి, నీశత్రువులచే నీ పలుకులను గౌరవించి, వారీపూర్వ ధర్మములను (అధికారములను)పరిత్యజింపచేసితివి. వారలను సజీవులనుగా విడిచితివి. వారినీ జయించీన తరువాత ఇతరులను జయించు కోరికలతో, మరల దిగ్విజయేచ్ఛవహించి నీ బలముతో వాహనములతో భూమండలమును జయింప బయలుదేరితివనీ వింటిని. ఓ రాజసత్తమ!  ఇప్పుడు నిన్ను ప్రీత్యా చూచి పోవుదమని వచ్చితిని.

 జైమిని ఇట్లు చెప్పెను.

 ఈ విధముగా వసిష్టులు చెప్పుగా, తాలజంఘుని జయించిన సగరుఁడు చేతులు జోడించి, మహామునికిట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

సగరుఁడనెను :

నీజముగా నేను సర్వత్ర కుశములగా నుంటిని. సందేహము లేదు. దేవతలందరును మాకు అనుకూలురు. ఓ మహామునీ ! మహర్షు లయిన తమరు ఎల్లప్పుడు మా కళ్యాణమునకై యభిలషింప కష్టములు ప్రమాదములు మాకెట్లు కలుగును? మీచే ననుగ్రహీతుఁడను. కృతార్థుఁడనయితిని. మీరే స్వయముగా నన్ను చూడగోరి వచ్చుటచే ధన్యుఁడను విపక్షవిజయాధికమును గూర్చి యేది మమ్ము గూర్చి మీరు వచించితిరో, ఆది యట్లు అనుష్టింపఁబడినది. సర్వము మీ యనుగ్రహ ప్రభావము. మీ ప్రసాదమువలననే సర్వము మహీక్షితులకు నగును.  లేకున్నచో అట్టి గొప్ప శత్రువులను జయించుటకు నాకు శక్తి యెక్కడిది? ఫలము అల్పమయినను మొక్క వేసిన వానికి అధికమయిన ప్రీతిని చేకూర్చును కదా !

జైమిని ఇట్లనెను :

సగరునిచే నీవిధముగా గౌరవింపఁబడి, మహర్షి వసిష్ఠుఁడు రాజునుండి సెలవుగొని, తనయాశ్రమమున కరిగెను. వసిష్ఠులు వెడలిన తరువాత ప్రీతమానసుఁడై సగరుఁడు రూపశీలగుణాన్వితభార్యాద్వితయముచే కూడికొని సమస్త ప్రపంచమును అనుశాసించెను.

యధాకామముగా యథాసుఖమముగా రమ్యములయిన విషయముల రాజు అనుభవించెను. అతని భార్యలు, సుమతి కేశినులు వికసద్వద నాంబుజలు. రూప ఔదార్యాది గుణములు గలవారు. పీనవృత్తపయోధరలు. నీలకుంచితకేశాన్యలు, సర్వాభరణభూషితలు. సర్వలక్షణ సంపన్నలు, నవయౌవన గోచరలు. ఆతని కాప్రియద్వయము సన్నిహితమై యుండ నీత్యము ప్రియము నందే సంగతి. వారు తమ ఆచారములచే భావములచే చేష్టాదికములచే ఎల్లప్పుడారాజుయొక్క మనస్సును గ్రహించిరి. మనస్సునందానందించి, పాలనము ఆనందదాయకము కాగా, వారితో (ఆభార్యలతో) యథా కామము ఆతఁడు రమించెను. అయోధ్యయందే వసించెను. ‘రాజు’ అను పదము ఇతర రాజులయెడ అన్వర్ధము కాదు గుణముచే సగరుని యందన్వర్థమయ్యెను. (రంజయతీతిరాజా) అల్పమైనను ధర్మము ఆతడి మనస్సు నందెట్లుండెనో, రాజునకు అర్థకామములట్లు లేవు. ఆతఁడు మనస్సు నందు అలుబ్ధుఁడు. ఆతఁడు, ధర్మమునకబాధకముగ ఐశ్వర్యము ననుభవించెను. అందుచేతనే రాజు ధర్మార్థములకు వ్యతిరిక్తముగనే కామము ననుభవించెను.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున, తృతీయ ఉపోద్ఘాతపాదమున సగరదిగ్విజయమును నలుబది తొమ్మిదవ అధ్యాయము