3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

65 - సోమసౌమ్యుల జనన వృత్తాంతము

సూత ఉవాచ :-

సోముఁడు = చంద్రుఁడు; సౌమ్యుఁడు = చంద్రుని కుమారుఁడు బుధుఁడు. సూతుఁడిట్లు చెప్పెను. ఓ విప్రులారా ! భగవానుఁడగు అత్రి మహర్షి చంద్రునికి తండ్రి యయ్యెను. స్వతేజఃపరీవృతుఁడై అత్రి సర్వలోకములకు కాంతిమంతుఁడై యుండెను. ఆతఁడు కర్మచే మనస్సుచే వాక్కుచే శుభకార్యములనే చేసెను. ఆతఁడూర్ధ్వబాహుడై కాష్ఠము వలె కుడ్యమువలె మహాశీలవలె స్థిరముగ నుండెను, (2) ఆతఁడు మూఁడు వేల సంవత్సరములు దుశ్చరమైన మహాతపస్సును చేసెననీ దేవతల వలన మేము వింటిమి. ఆ బ్రాహ్మణుడు మహాబుద్దిమంతుఁడు. ఊర్ట రేతస్కుడై కంటిరెప్పలు వేయకయే తపస్సాచరించెను. ఆతని శరీరము సోముని స్థితిని (సోమత్వమును) పొందినది. [4) పవిత్రీకృతాత్ముడైన ఆ ఋషి సోముని స్థితిలో ఆకాశ స్థితి నొందెను. (5) పది విధముల దిక్కులను ప్రకాశింపఁజేయుచు సోముఁడు తన నేత్ర ద్వయము నుండి స్రవించెను. దశదిక్కులను స్త్రీలు వీధిచే సంతుష్టులై ఆతని గర్భ ఏండమును ధరించిరీ వారందరు కూడి ఆ గర్భమును ధరింప సమర్ధురాండ్రు కాలేకపోయిరి. ఆ సోముని గర్భమును ధరించిన దశదిగ్వనితలు భరింపలేక దిక్కులను ప్రకాశింపఁజేయుచు పడిపోయిరి. సర్వభావనుఁడయిన శీతాంశుండు లోకములను ప్రకాశింపఁజేసెను. ఆ దిగ్వనీతలు. పదిమంది సోమ గర్భమును భరింపజాలనప్పుడు సోముఁడు వారందరితో భూమియందు పడెను. (8) లోకపితామహుఁడయిన బ్రహ్మ పడుచున్న సోముని చూచీ, లోకములకు హితమాచరించుకోరికతో, ఆ సోముని, రథము నందారోహించెను. (9) ఓ బ్రాహ్మణులారా ! ఆతఁడు ధర్మాత్ముఁడనీ సత్యసంగరుఁడని వాజిసహస్రయుత రథముపై నధివసించేనని మేము వింటిమి. పరమాత్ముఁడైన అత్రీకుమారుఁడు పృథ్విపై పడగా, బ్రహ్మ మానసపుత్రులయిన ఏడుగురు విఖ్యాతులు, ఆంగీరసులు, భృగుని ఆత్మజులు, ఆతనినీ అనేకములయిన ఋక్కులతో, యజుస్సులతో, ఆధర్వణ సూక్తములతో ఆంగీరస మంత్రములతో స్తోత్రము చేసిరి.

సంస్తూయమానమయిన సోముని యొక్క భాస్వంతము ఆప్యాయమునైన తేజము లోకమున సర్వత్ర సంభావింపఁబడెను. తన్ముఖ్య రథముతో నతడు (సోముఁడు) సాగరాంతమయిన భూమీ నంతటినీ ఇరువదియొక్క మారు అతిశయముగా ప్రదక్షిణ మొనర్చెను. (14) వర్ణితమయిన యాతనీ తేజస్సు. భూమీనంతటినీ చేరెను. అదియే ఓషధి మూలికలను సృజించెను. ఆతని తేజస్సుతో ఆకాశమండల మంతయు కాంతిమంతమయ్యెను. అతడీ పుణ్యము యొక్క యతీశయముతో లోకము లన్నింటిని, చతుర్విధప్రజలను పోషించెను. ఓ బ్రాహ్మణులారా! సోముఁడే నిజముగా ఈ సర్వజగత్తునకు పోషకుండు. (16) ఆతఁడు శ్లాఘ్యములయిన స్వ కర్మలచేతను, నూరు సంవత్సరములు తపస్సు చేసెను. అందుచే నధికమయిన ద్యుతి నితఁడు పొందెను. (17) సోముఁడు స్వకర్మచే భూమిని (జగతిని) భరించు హిరణ్య వర్ణము గల యాదేవతా స్త్రీల ఆనందముచే ప్రఖ్యాతుఁడయ్యెను. (18) అంత బ్రహ్మవిదాంవరుఁడైన బ్రహ్మ ఆతనికి బీజముల యొక్క ఓషధులయొక్క జలములయొక్క సామ్రాజ్యమునాతని కొసంగేను. మహాతేజస్వియైన సోముఁడు మహారాజ్యమున రాజరాట్టుగా నభిషిక్తుఁడై, తేజస్వియు తపతాం వరుఁడు నైన సోముఁడు లోకములనన్నింటిని తన రాజ్యముచే స్వతేజస్సుచే పవిత్రీకరించెను. (20) ప్రాచేతసునీ కుమారుఁడయిన దక్షుండు చంద్రునకు (సోమునికి) దాక్షాయణులనీ పిలువఁబడు తన ఇరువదియేడుగురు కన్యలను వివాహములో నొసంగేను. (వారే నక్షత్రములు). మహారాజ్యము, సోమము కలిగిన వారిలో ప్రభుడయిన సోముఁడు సహస్రశత దక్షిణలతోడి రాజసూయమును సలుప నారంభించెను. హిరణ్య గర్భుఁడు ఆ యజ్ఞమునకు ఉద్దాత (మంత్రముల గానము చేయువాఁడు). ఇంక భగవంతుఁడయిన బ్రహ్మ యజ్ఞమునకు బ్రహ్మ స్థానమును వహించెను. ఇంక సదస్యుడు భగవాన్ హరీ నారాయణుఁడు, ఆతడు సనత్కుమార ప్రముఖ బ్రహ్మరులచే పరివృతుఁడు. సనత్కుమారుఁడు మొదటివాఁడు. సోముఁడు లోకత్రయ ధనమును దక్షిణగా నొసంగెననీ మేము ఏంటిమి. ఆ సదస్సులలో బ్రహ్మరులు కూడనుండిరి.

సినీ, కుహు, వపువు, పుష్టి, ప్రభా, వసు, కీర్తి, ధృతి, లక్ష్మీ యను తొమ్మండుగురు దేవులతనిని సేవించిరి. (26) అవ్యగుఁడై, సర్వ దేవర్షిపూజితుఁడై, యజ్ఞాంతమున నాచరించు అవభృదము నతఁడు చేసి, పది దీక్కులను భాసింపఁజేయుచు. సోముఁడు మిక్కిలిగా ప్రకాశించెను. (27) ఋషులచే సంస్తుతి పొందుటకు కష్టతమమైన టైశ్వర్యమును సోముఁడు పొందెను. ఆతని మనస్సు అవినయము, అనయముతో గూడినదై భ్రమించెను. అందుచే నతని మనస్సు నీతి పథమునుండి ధర్మమునుండి తొలగెను. (28) ఆంగిరసుని యొక్క కుమారులనందరను నిర్లక్ష్యము చేసి (తిరస్కరించి) సోముఁడు తార యను యశస్వినియైన బృహస్పతియొక్క భార్యనెత్తుకొని పోయెను. ఆతఁడు దేవతలు దేవర్పులు బ్రతిమాలుకొన్నను ఆంగీరసునకై, తారసు వీడువలేదు. ఉశనసుఁడు (శుక్రుఁడు? సోముని పక్షమును, భవుఁడు (శివుఁడు) (బృహస్పతి) పక్షమును వహించిరి. ఏలయన మహాద్యుతిమంతుఁడైన సోముఁడు పూర్వము బృహస్పతి యొక్క శిష్యుఁడు. ఈ సంబంధముచే రుద్రుడు బృహస్పతి పక్షపు మిత్రమై . ‘అజగవ’ మను ధనువును (కోపము)చే పట్టేను. (32) ఆ మహాత్ముఁడు బ్రహ్మ శిరో నామక పరమాస్త్రమును దేవతలపై నుద్దేశించి విడిచెను. దీనితో వారి యశస్సుంతయు నడుగంటినది. (33) దేవతలకు దానవులకు మధ్య ప్రఖ్యాతమైన యుద్ధమైనది. ఇది తారకామయము (తారకు సంబంధించినది) అది అధికముగా లోక క్షయ కరమయ్యెను. (34) ఈ యుద్ధములో చావక మిగిలిన దేవతలు ‘తుషితులు’గా సంస్కృతులు. వారు పితామహుఁడు ఆది దేవుఁడునయిన బ్రహ్మను శరణు వేడిరి. అంత బ్రహ్మ తాను స్వయముగా వచ్చి రుద్రుని ఉపశనసుని యుద్ధము చేయుటనుండి విరమింపచేసెను. స్వయముగా వచ్చి బ్రహ్మ తారను ఆంగీరసుని కప్పగించెను.(86) చంద్రనిభాననయైన తార గర్భవతియై యుండుట యెటింగి (బృహస్పతి) చూచి ఆమెతో వెంటనే గర్భమును విసర్జించుము” నీయోని నాది. అందుచే వేడొకని బిడ్డయందు పుట్టరాదు” అనెను. అగ్నివలె జ్వలించుచున్న గర్భమును తార విడిచి పుచ్చెను.

పుట్టినంతనే యా సోముఁడు దేవతల శరీరమును విసర్జించెను. అందుచే సురలు సంశయముగొని తారతో నిట్లనిరి. “సత్యము చెప్పుము. ఈ సుతుఁడెవ్వనివాఁడు? సోముని కొడుకా లేక బృహస్పతి కోడుకా?” అనీ, తార సిగ్గుపడి 'అవు'నని గాని 'కాద'ని గానీ దేవతల కామె సమాధానమీయలేదు. దస్యుపాంత (రాక్షసహంతకుఁడయిన కుమారుఁడామెను శపించుటకారంభించెను. వానిని ఆపి, బ్రహ్మ తార సొసంశయము నడిగెను. “ఓ తారా ! ఇక్కడ సత్యము చెప్పు. ఈతఁడెవ్వని పుత్రుఁడు?”అని. వరదుఁడు ప్రభువునయిన బ్రహ్మకు నమస్కరించి, చేతులు జోడించి దస్యుహంతకుని గూర్చీ “సోముని యొక్క పుత్రుఁడని చెప్పెను. అంత, ప్రజాపతి సోముఁడు ఆ కుమారుని శీరము నాఝంచి ధీమంతుఁడయిన కుమారునకు ‘బుధుఁడు’ అని నామకరణ మొనరించేను. ప్రతిదినము బుధుఁడు ఆకాశమున ఉదయించును, రాజదుహిత (ఇలా) కుమారుని గనెను. అందుచే ఇలా కుమారుడయిన పురూరవసు మహాతేజుఁడయ్యెను. ఆతనికి ఊర్వశి వలన మహాతేజస్వులు ఆరుగురు పుత్రులు పుట్టిరి. ఆతఁడు (సోముడు) తీవ్రమయిన రాజ యక్ష్మకు పాల్పడెను. పరవశుఁడయ్యెను. నిస్సహాయుఁడయ్యెను. రాజ యక్ష్మచే వివశమై చంద్రుని మండలము క్షీణమయ్యెను. వెలవెల్లపోయ్యెను. ఆతఁడు తండ్రియైన అత్రిశరణుజొచ్చెను. మహాయశిస్వయైన అత్రి ఆతని రాజయక్ష్మమును నుపశమింపఁజేసెను. ఆ రాజయిన చంద్రుఁడు రాజయక్ష్మము వలన ముక్తుఁడై శోభస్కరముగా నెల్లెడలను ప్రకాశించెను. ఓ బ్రాహ్మణులారా ! ఇది సోమునియొక్క జననము చెప్పితిని. ఆతని వంశమును చేప్పెదను వీనుఁడు. సౌమ్యుని యొక్క జన్మ (బుధ) ధన్యము, ఆరోగ్యదము, ఆయుఃప్రదము. పుణ్యము కల్మషశోధనము. సౌమ్యుని (బుధ)యొక్క జన్మ శ్రవణము సర్వపాప విమోచనము.

ఇది వాయుప్రోక్తమయిన బ్రాహ్మండపురాణమున మధ్యమభాగమున తృతీయోపోద్ఘాతపాదమున సోమసౌమ్యులయొక్క జన్మకథనమను పంచషష్టితమాధ్యాయము.