3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

61 - గాంధర్వమూర్చనాలక్షణము

సూత ఉవాచ :-

సూతుఁడిట్లనెను. మనుపుత్రుల యొక్క సంతతిని విస్తరముగా నవగాహన చేసికొనుము. పృషధ్రుఁడు తన గురువు యొక్క గోవును ఆతనియింట (ఆశ్రమమున) నిశియందు గోయపరచెను. తత్క్షణమున మహాత్ముఁడయిన చ్యవనుని శాపము వలన నతఁడు శూద్రుఁడయ్యెను. కరూషుని సంతతులు. (వారసులు) క్షత్రియులు యుద్ధ దుర్మదులు. (యుద్ధ నైపుణ్యమున. దుర్మదులు). నాభాగుని వారసులు వేయి వర్గముల క్షత్రియగణములు. వారందరు విక్రమవంతులు. దీప్తుని పుత్రుడు భలందనుఁడు మంచి విద్వాంసుఁడు. భలందనుని కుమారుఁడు ప్రాంశువు ఆతఁడు మహాబలుడు. ప్రాంశువున కొక్కడే పుత్రుఁడు. ఆతడు ప్రజాపతితో తుల్యుఁడయ్యెను. ఆతఁడు సంవర్తనునితో, సహా సుహృత్ బంధు సహితముగా స్వర్గమునకు తీసికొనిపోవఁబడెను తద్విషయమును పురస్కరించుకొని, సంవర్తునకు బృహస్పతికి పెద్ద వివాదము జరిగెను. (5) ఆతని యజ్ఞము యొక్క ఋద్ధిని గొప్ప తనమును జూచి ఆతనితో బృహస్పతి కోపించెను, సంవర్తుండాచరించిన యజ్ఞములో లోకనాశనమునకు - ఆతఁడు మిక్కిలి కోపించెను. కానీ దేవతలచే నతఁడు శాంతిపడ చేసెను. చక్రవర్తి యైన మరుత్తుఁడు, తనకు. వారసునిగా నరిష్యంతుని గ్రహించెను. (7) నరీష్యంతుని దాయాది దముఁడు. ఆతఁడు దండధరుఁడు. ధర్మదండమును ధరించినవాఁడు. ఆతని కుమారుఁడు రాష్ట్ర వర్ధనుఁడు. ఆతఁడు చాల ప్రఖ్యాతి గన్నరోజు. ఆతని కుమారుఁడు సుధృతి. మరల ఆతని కుమారుఁడు నరుఁడు. ఆతని కుమారుఁడు కేవలుం డు. కేవలుని కొమరుఁడు బంధుమంతుఁడు. బంధుమంతుని కుమారుఁడు వేగవంతుఁడు అతఁడు ధర్మాత్ముడు, వేగవతుని పుత్రుఁడు బుధుండు. ఆ బుధునీ పుత్రుఁడు. తృణబిందువు. త్రేతాయుగము యొక్క ఆరంభమున ఆతఁడు రాజయ్యెను. ఆతని కూతురు ఇడవిడ. ఈమె విశ్రవసునికి తల్లియయ్యెను. ఆతని పుత్రుఁడు విశాలుఁడు ఆతడు పరమధార్మికుఁడు, రాజయ్యెను. ఏశాలుని యొక్క సుతుఁడు రాజు హేమచంద్రుఁడు. ఆతఁడో మహాబలుఁడు. హేమచంద్రుని యనంతరమతఁడు సుచంద్రుఁడని విఖ్యాతిగాంచెను.

సుచంద్రుని తనయుఁడు రాజు ధూమ్రాశ్వుఁడు. ఆతఁడు విశ్రుతుఁడు, ధూమ్రాశ్వుని కుమారుఁడు సంజయుఁడు. అతఁడు విద్వాంసుఁడు సృంజయుని కుమారుఁడు సహదేవుఁడు. మిక్కిలి ప్రతాపవంతుఁడు. కృశాశ్వుఁడు సహదేవుని పుత్రుఁడు. ఆతఁడు పరమ ధార్మికుఁడు. కృశాశ్వునీ కుమారుఁడు సోమదత్తుఁడు. అతఁడు మహాతేజస్వంతుఁడు, ప్రతాపవంతుఁడును. రాజర్షియైన సోమదత్తుని కుమారుఁడు జనమేజయుఁడు, జనమేజయుని ఆత్మజుఁడు ప్రమతి. చాల విశ్రుతుఁడు. తృణబిందుని ప్రభావము చేతను వైశాలిక ప్రభువులందరు దీర్ఘాయుష్మంతులు, మహాత్ములు, వీర్యవంతులు, సుధార్మికులును, శర్యాతి కవలలను కనెను. ఆతని కుమారుఁడు ఆనర్తుఁడు చాలా ప్రఖ్యాతీం గాంచేను, శర్యాతి కుమార్తె సుకన్య. ఆమె చ్యవనుని యొక్క భార్య. ఆనర్హుని యొక్క దాయాది దేవ నామకుండు. ఆతఁడు సువీర్యవంతుఁడు, ఆనర్తునీ విషయము (దేశము) ఆనర్తదేశము. ఆతని ముఖ్యపత్తనము కుశస్థలి. (తరువాత అది ద్వారకమైనది.) దేవునకు రైవతకుఁడు పుత్రుఁడు. ఆ రైవతునకు ‘కకుద్మి’ అనునది నామాంతరము. కకుద్మి ధార్మికుఁడు. ఈతఁడు తన సూర్గురు సోదరులలో జ్యేష్ఠుఁడు. ఆతడు కుశస్థలీ రాజ్యమును పొంది, తన కుమార్తెచే ననుగమింపఁబడి బ్రహ్మకడకేగెను. బ్రహ్మయంతికమున గాంధర్వ విద్యను (గానమును) ఆతడొక ముహూర్తకాలము వినెను. (బ్రహ్మసమక్షమున) నొకముహూర్త (48 నీముషములు) మేకాని, మానవగణనమున నాకాలము చాల యుగములు సాగెను. అయినను యువకునిగానే స్వనగరమునకేతెంచెను. కానీ ఆ పట్టణము యాదవులచేనప్పుడు ఆవృతమైయుండెను. ఆ పట్టణమునకు ‘ద్వారవతి’ యను నామకరణము చేయఁబడెను. అయ్యది భోజవృష్టి అంధక రాజులచే సంగుప్తము. ఆ భోజవృష్యంధకులకు వసుదేవుఁడు నాయకుఁడు రేవతుఁడు ఆ కథనంతయు వినెను. ఆతఁడు ఆరీందముఁడే. సువ్రతురాలు తన కన్యయునైన రేవతీనీ బలదేవునీ కొసంగి, మేరు శిఖరమునకు తపస్విగా నైయేగెను. ఆ రేవతితో ధర్మాత్ముఁడయిన బలరాముఁడు భోగించెను. ఈ కథను ఋషులు వినీ తరువాత ప్రశ్నించిరి.

ఋషయః ఊచుః :-

సూత ఉవాచ :-

ఋషులు ఇట్లనిరీ, ఓ మహామతీ ! చాల యుగములు గతించినను ఆశ్చర్యము ! రేవతికి (కకుద్మినికీ) పోర్ధక్యము రాకుండ నుండెను, దీనిని వినవలయుననీ కుతూహలముగా నున్నాము. గాన విద్యాశాస్త్రమును గూర్చి (గాంధర్వ విద్యను గూర్చి) చెప్పుము. సూతుఁడిట్లు చెప్పెను. బ్రహ్మలోకమున కరీగిన వానికి, వార్థక్యముగాని, ఆకలికానీ రోగముకాని, మృత్యువు వలన భయము కాని కలుగదు. (27) ఓ మునిసత్తమా ! సుప్రతులార ! మీరు నన్ను గాంధర్వ విద్య గూర్చి అడితిరి గాన, యథాతథముగా, ఉన్నదున్నట్లు వివరములతో చెప్పెదను. సప్తస్వరమండలము సప్తస్వరములతోను, మూఁడు గ్రామములతోను, ఇరువది యొకటీ మూర్ఛనలతోను, నలుబది యైదు తానములతోను కూడియున్నది. (వివరములు ప్రత్యేకముగా వ్రాసి అంటింతును) స్వరముల నామములు - షడ్జము (స) ఋషభము (రి) గాంధారము (గ) మధ్యమము (మ) పంచమము (ప) ధైవతము (ధ) నిషాదము (ని). వీనీన జాగ్రత్తగా గ్రహించవలయును (31,32,33,న వివరణము సరిగా లేదు. వాయు పురాణమున వేరుగా నీయఁబడినవి). ‘మ’ గణమున మూర్చనలు సౌవీరము, మధ్యమగ్రామము హరిణాస్యము, కాలోపబలోపేతము, కాలోపనత, శుద్దమధ్యమ సారంగీ, పావనియు (హృత్యక, దృష్టకమ్) అని క్రమముగా చెప్పబడినవి. (31,32) మధ్యమధ్రామికములుగా ప్రసిద్ధములయిన షడ్జగ్రామముల నెఱుంగుము. షడ్డగ్రామము స-మూర్ఛనలు (1) ఉత్తరం, మంద్రా (2) రజనీ, (3) ఉత్తరాయత (4) మధ్య షజ్ఞ, (5) అభిరుద్ధత, గాంధారము, గ్రామీకో, శ్రోమారులను, వర్తించెద నెఱుంగుము. అగ్నిష్టోమీక, (7) వాజపేయి 3 పౌండరీకము, 4, అశ్వమేధము, (5) రాజసూయకము, 6.సువర్ణకము, 7. గౌసౌవ(న)ము, 8. మహావృష్టికము, 9. బ్రహ్మాదానము, 10. ప్రాజాపత్యము, 11. నాగ యక్షాశ్రయము, 12. గోత్తమము.

13. పదక్రాంతం, 14. మృగాక్రాంతం, 15. మనోహరమైన విష్ణుక్రాంతము, 16. (వరేణ్యము) సూర్యకాంత, 17. విశ్రుతమయిన కోకిల (మత్త) (శాంతకోకిల), (తేనవానిత్య పవశ పిశాచాతీవ నహ్యపి)? (38) తానముల నామములు. (18) సావిత్రము, 19.అర్ధసావిత్రము, 20. సర్వతోభద్రము, అధాత్ర్యము, 22. గంధర్వానుపము, 21. మనోహరమయిన, 23. అలంబుషేసేష్ట, 24. విష్ణు, 25. వైణవర, (39) సర్వభూతమనోహరమైన 26.సాగర విజయము, 27,హతోత్పష్టము, 28. స్వంధము, ఇదియుద్రీయమే, 29. నారదప్రియ. భీమసేనుఁడు చెప్పిన 30. నాగరప్రియ, 31. వికలోపనవినతాశ్రీ, 32. భార్గవప్రియ. ఇవి పదునాలుగు : (కాని) నారదుఁడు 15 అనును. (మూర్ఛనల నధిష్టించిన దేవతలు?) మూర్చ బ్రాహ్మిచే నాగాంధారి, సౌవీరముతో కలిసి పాడబడును. అట్లే ఉత్తరాది స్వరము, దీని కధిష్టాన దేవత బ్రహ్మ హరిణస్యము హరీదేశమున పుట్టినది. (44) హరిణాస్య యను మూర్ఛనకు చంద్రుండధి దేవత, స్వర మండలమున కరోపనీతా వివృతములు. మరుత్తులచే పొడబడును. శుద్ద (మాత్మమాననే మనుదేశమునఁగలిగెను. శుద్ద మధ్యమా మూర్చన. దాని అధిష్టాన దైవతము గాంధర్వము. అయ్యది సిద్ధుల కొఱకు వేళ్లతో సంచరించును. దాని అధిదేవత మృగేంద్రము (సింహము). (47) (అర్థం కాలేదు)? అయ్యది ఆశ్రమములతో, పలుమానవధ్వనులతో కలిసియున్నది? మూర్ఛన రాగాములతో గూడియుండుటచే దానినీ రజనీ యందురు. ఉత్తర మంద్ర యొక్క దైవతము షడ్జము.

అందుచే ఉత్తర తాలను ముందుగా నెటింగిరి. అందుచే అది ఉత్తరమంద్రము. దాని దైవము ధ్రువము. (50) (అస్పష్టము) అయ్యదే తరువాత విస్తరింపఁబడుటచే, (ఉత్తరాయత - ధ - దైవతముగా గలది) ‘ధ’తో ఆరంభించును. దాని దైవము పితృవర్గము (శ్రాద్ధ దేవతలు) మహర్షులు అగ్నిని షడ్జస్వరముతో పూజింతురు. అందుచే దానిని శుద్ద షడ్జముగా నేఱుంగవలెను. ఈ మూర్చన పంచమ స్వరము నుండి ఆరంభమగును. (51) అస్పష్టము. (52) ఈ విధముగా తత్తదనుకూలమయిన భావన కలిగిన మూర్ఛనల నుపయోగింపవలెను. పక్షుల మూర్చనలు విని పక్షోకమూర్చనలు కలిగినవి. ప (య) మూర్చనలు యక్షిణులకు సంబంధించినవి అందుచే యక్షికామూర్చనల నంబడినవి. (మూలమున ‘య’కు ‘ప’ యున్నదేమో? (53ఎ) అస్పష్టము. విషదృష్టిగల పాములను మూర్ఛనలు కీర్తనలు సమీపించవు (చేరవు) మూర్ఛనలు చాలగలవు. అవి సాధారణము?

సూచన :- ఈ శాస్త్ర నిర్వచనములు తలపగులగొట్టుకొన్నను సంగీతపండితుల నడిగినను స్పష్టముగా అర్థము కాలేదు. పెద్దల నడిగి తెలిసినట్లు వ్రాసితిని. సంస్కరించుకొనుడు.