3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)
70 - డెబ్బదియవఅధ్యాయము
ఋషయ ఊచుః :-
సూత ఉవాచ :-
రాజోవాచ :-
సూర్య ఉవాచ :-
రాజోవాచ :-
ఆదిత్య ఉవాచ :-
ఋషులిట్లడిగిరి. మహాత్ముడైన ‘ఆపవు’ని వనమును కార్తవీర్యుఁడెందులకు దగ్ధమొనర్చెను? తెలిసికొనవలయుననీ యడుగుచుంటిమి. మాకు చెప్పుము. రాజర్షియైన యారాజు ప్రజారక్షకుడని వినియుంటిమి. ప్రజారక్షకుఁడయి ఎట్లు తపోవనమును నాశనమొనర్చెను. సూతుం ఓట్లు ప్రతివచనమిచ్చేను. సూర్యదేవుఁడయిన ఆదిత్యుఁడు విప్రరూపములో కార్తవీర్యునీ సమీపించెను. నేను ఆదిత్యుఁడను. నేను తృప్తినొందు వలకు అన్నము నాకీయుము. నేను నిశ్చయముగా సూర్యదేవతను. రాజిట్లు పలికెను. ఓ భగవంతుఁడో? ఎట్లు? ఏ పదార్థములతో నీకు తృప్తి . యగును? ఓ దివాకర చెప్పుము. ఎట్టి భోజనము నీకొసంగుదును? నీవలన విని నేనట్లు చేసెదను. సూర్యుఁడు. ఓ. దానపరులలో శ్రేష్ఠుఁడా! సర్వస్థావర పదార్థములను నాకాహారముగా నిమ్ము. వానితో నేను తృప్తి నొందెదను. ఓ రాజా ! ఇతర పదార్థములతో తృప్తి చెందను. రాజు: సర్వస్థావర పదార్థములు, తేజస్వంతుఁడైన మనుష్యునిచే నిర్దగ్ధమగుటకు శక్యముకాదు. ఓతపస్విజనశ్రేష్ఠ ! నీకు నమస్కరించుచున్నాను. ఆదిత్యుఁడు : నీవలన సంతుష్టుఁడనైతిని. నేను అక్షయములు సర్వతోముఖములు నయినశరములనిచ్చెదను. వానిని ప్రయోగింపగా నాతేజముతో. కూడికొనియవి ప్రజ్వలించును. నాతేజస్సుచే సర్వస్థావరపదార్థములు మండిపోవును.శుష్కించిపోవును. ఓరాజా! శుషమై భస్మమైనవానినిగా ఒక్కక్షణములోచేసెదను. తరువాత ఆదిత్యుఁడు శరములను ప్రభువునకొసంగెను. ఆశరముల రాజుపొంది, ఆశ్రమములను, గ్రామములను, ఘోషలను, నగరములను రమ్యములయిన తపోవనములను, వనములను, ఉపవనములను, సర్వస్థావరపదార్దములను, ఆరాజు విడిచిన బాణ సమూహములు దహించెను.
సూర్యతేజస్సుచే నిర్వృక్షము నిస్తృణము భూమియయ్యెను. తత్కాలములో ఆపవుఁడు అనలమాశ్రయించి సహస్రవర్షములు జలవాస మను వ్రతమును నిర్వర్తించి, వ్రతమును పరిపూర్తిచేసి జలమునుండి మహర్షి పైకీ వచ్చెను. ఆ మహర్షి, అర్జునుఁడు దగ్గమొనర్చిన స్వకీయాశ్రమమును చూచేను. క్రోధముతో రాజర్షిని, పూర్వము చెప్పిన విధముగా శపించెను. రాజర్షియైన క్రోష్టుయొక్క ఉత్తమ పూరుషమయిన వంశమును వినుము. ఆ క్రోష్టుయొక్క అన్వయమునందే వృష్టి సంభూతుఁడయ్యెను. క్రోష్ఠునకొక్కడే సుతుఁడు. ఆతనిపేరు వృజినీవాన్. మహాయశస్వి స్వాహి, (యజ్ఞమునందు) 'స్వాహా' యను మంత్రములుచ్చరింపబడునట్టి స్వాహావంతులలో శ్రేష్ఠుఁడు. ఇతఁడు వృజినవంతుని కొడుకు స్వాహి పుత్రులలో రుకేశుఁడు దాతలలో శ్రేష్ఠుఁడు పుట్టేను. పుత్రోత్పత్తిని కోరుకొనుచు ప్రయతాత్ముఁడయిన రుకేశుఁడు ఏవిధములయిన యజ్ఞములను వివిధములయిన ఆప్తదక్షిణలతో చేసెను. ఆతనికి చిత్రరధుఁడను పుత్రుఁడుపుట్టెను. ఆతఁడు మహారాజర్షులయొక్క ఉదాత్తక్రియలనాచరించెను. ఆతనికి గొప్ప శీలము పరాక్రమము కలదు. ఆతనిపుత్రుఁడు శశబిందువు. ఆతఁడు చక్రవర్తి. ఆతనికి పెక్కురు పుత్రులు. ఆతని వంశమును గూర్చి పురాతనులు కీర్తించు కము కలదు. “శశబిందువునకు పదివేలమంది పుత్రులు. (వందలమందికీ వందమంది పిల్లలు) వారు తేజస్వంతులు. అనంతధనము కలవారు. వారందరు పితరునకనురూప సంతానము, వారిలో ఆర్గురు మిక్కిలి ప్రధానులు. వీరందరు మహాబలులు. శక్తిమంతులు. వారు పెళ్లి యజ్ఞములనాచరించిరి. వారందరు పృథుశ్రవులు. పృథుయశులు. పృధుకర్ముడు, పృథుంజయుడు పృథుకీర్తి పృథురాంతుఁడు వీరందరు శశబిందుని కుమారులు.
పురాణజ్ఞులు, అక్షరుని పృథుశ్రవుని కుమారునిగా ప్రశంసింతురు. అక్షరుని కుమారుఁడు సుయజ్ఞుండు. ఆతని కుమారుఁడు ఉశనసుం డు. ఉశనుఁడు ధర్మాత్ముఁడు. ఈ భూమినంతటిని పొందెను. ఆతఁడు ఒకవంద - అశ్వమేధములను ఉత్తమదక్షిణలతో నొనర్చెను. ఆతని తనయుఁడు మరుత్తుండు. ఆతఁడు రాజర్షుల యొక్క మార్గము ననుసరించెను. వీరకంబలబర్షి మరుత్తుని కుమారుఁడు. రుక్మకవచుఁడు కంబలబర్షియొక్క కుమారుఁడు. విద్వాంసుఁడు. రుక్మకవచుఁడు పూర్వము యుద్ధమున నీశీతములయినబాణములతో కవచముల ధరించిన వారిని, ధ్వనులను చంపెను.తన్మూలమున ఉత్తమమయినవైభవమును పొందెను. అశ్వమేధమునందు ఆ యశస్వి బ్రాహ్మణులకు అధికముగా విత్తమొసంగేను. రుక్మకవచునకు పరవీరహులు,పరాక్రమవంతులును నైన యైదుగురుపుత్రులు, వారు మహాసత్త్వులు. వారు శత్రువీరులను చంపిరి. వారు రుక్మేషువు పృథురుక్ముఁడు జ్యామఘుఁడు., పరీఘుఁడు మరియు హరి. వీరితండ్రి పరిఘుని హరినీ విదేహ యందుస్థాపించేను, (తండ్రికివారుసుఁడుగా) రుక్మేషువు రాజయ్యెను. పృథుకర్మ ఆతనికి ఆశ్రీతుఁడయ్యెను. ఆతఁడు వారలచే పరాజితుఁడయ్యెను. అందుచే జ్యామఘుఁ డు రాజయినను ఆశ్రమములో నివ-సించెను. ఆతఁడు ప్రశాంతుఁడు. కాని ఘోరమైన వనమున ఒక బ్రాహ్మణునికి విరోధియయ్యెను. అంత తన ధనువును గ్రహించి, రథమునారోహించి ధ్వజము. ప్రకాశించుచుండ, వేకదేశమునను బయలుదేరెను. ఆతఁడు ఒక్కడే, నర్మదకు, తరువాత మేఖలకు, మిరికావనమునకు, ఋక్షవంతగిరికీ, తుదకతఁడు ముక్తిమంతముచేరెను. జ్యామఘుని భార్యశైబ్య. ఆమె చాల బలవతి. పుత్రులు లేకపోయినను రాజు వేడొకతెను పెండ్లియాడలేదు. ఆతఁడు యుద్ధమునందు విజయుఁడయ్యెను. ఆతఁడొక కన్యను (యుద్ధపు కానుకగా) పొందెను. తనభార్యకు భయపడి, ఆమెతో రాజు “ఈమె నీ కోడలు” అని చెప్పెను. ఇట్లు చెప్పగా ఆమె. ఆమె నాకు కోడలగానగుటకు ఏ కుమారునకు సంబంధించినది. అనీ యడిగెను. అంతరాజు ఈమె నీకుఁబుట్టబోవు కుమారునకు భార్యయగును' అనేను.
శైబ్య ఉగ్రమయిన తపస్సొచరించెను. ఆమె వార్ధక్యమున పుత్రునీ బడసెను. ఆతఁడు విదర్భుఁడు. రాజపుత్రుఁడైన విదర్భుఁడు ఆమె వలన (ఆస్నుషవలన) ఇద్దరు పుత్రులబడసెను. వారు కథకైశికులు వారు విద్వాంసులు. ఆయిరువురు రణవిశారదులు. తరువాత మూడవ కుమారుఁడు కలిగెను ఆతఁడు రోమపాదుఁడు ఆతఁడు సుధార్మికుఁడు; లోమపాదునీ కుమారుఁడు బభ్రువు. బభ్రువుకొమరుఁడు ఆకృతి. కైశికుని కుమారుడు చిది. ఆతనిపుత్రులు, వారసులు రాజులు వారలుచైద్యులు. క్రథుని కొడుకు కుంతి. (క్రథుఁడు ఇంతకుఁబూర్వము చెప్పం బడెను). విదర్భుని కుమారుడు. ధృష్ణుఁడు కుంతికొడుకు, ఆతఁడు యుద్ధములయందు. ధైర్యవంతుడు, ప్రతాపవంతుఁడు. ధృష్ణుని సుతుండు నిర్వతి. అతఁడు ధర్మాత్ముఁడు పరవీరహంత. ఆతనిపుత్రుఁడు దశార్జుఁడు, ఆతఁడుమహాబలపరాక్రముఁడు దశారునిపుత్రుఁడు వ్యోముఁడు. ఆతనితరువాతజీమూతుఁడు జీమూతునికుమారుఁడు ఏకృతి ఆతనికుమారుఁడు భీమరథుఁడు భీమరథునీ కుమారుఁడు రథావరుఁడు రథా వరుఁడు నిత్యము దానధర్మరతుఁడు విద్యాపరాయణుఁడు. శీలవంతుఁడు ఆతనిపుత్రుఁడు నవరథుఁడు ఆతనితరువాతదోయారీ దశరథుఁడు. ఆరనీకుమారుఁడు. ఏకాదశరథుఁడు. ఆతనికుమారుడు శకుని. ఆతనికీకరంభకుఁడు సుతుఁడు. ఆతఁడు చక్కటీధన్వి. ఆతనితరువాత దేవరాతుం డు రాజయ్యను. దేవక్షత్రుఁడు దేవరాతునికుమారుఁడు. ఆతఁడు రాజయ్యెను. దేవక్షత్రునికుమారుఁడు దేవనుఁడు ఆతఁడు క్షత్రియానందనుఁడు దేవనునకు మధువు పుట్టెను. ఆ మధువు కుమారుఁడు మేధార్థసంభవుఁడయిన పురురవసు. పురురవసు కుమారుఁడు పురుద్వాన్. ఆతం డు పురుషోత్తముడు. భద్రవతీ పురుద్వంతుల పుత్రుఁడు పురూద్వహుడు. ఆతని భార్య ఇక్ష్వాకీ. ఆమెవలన నతని కుమారుఁడు సత్తుండు. (సత్త్వునీకోడుకు) సాత్తుఁడు కీర్తి వర్ధనుఁడు. సత్త్వగుణోపేతుఁడు. మహాత్ముఁడయిన జ్యామఘునీ యీ వీసృష్టినీ తెలిసికొనినవాఁడు పుత్రవంతుఁ డగును ధీమంతుఁడయిన రాజైనసోమునితో సాయుజ్యమును బొందును. .
ఇది వాయుప్రోక్తము మహాపురాణము అయిన బ్రహ్మాండపురాణమున మధ్యమభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున డెబ్బదవ అధ్యాయము.
