3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)
44 - భార్గవచరితము
వసిష్ఠ ఉవాచ :-
రామ ఉవాచ :-
వసిష్ఠుడు పలికెను.
విద్వాంసుఁడు ధర్మాత్ముఁడునయిన భార్గవుఁడు అకృతవ్రణంనీతో కూడి బహుజనపదములను చూచుచు గృహోన్ముఖుఁడయి బయలుదేరెను. ప్రాణ రక్షణ తత్పరులయి ఆతనిని చూచి క్షత్రియులందరు దాగుకొనిరి. అంత భార్గవుఁడు శాంతియుతమయిన జంతువులతో కూడి వేదధ్వనితో వ్యాప్తమైయున్న స్వపిత్తాశ్రమమును చేరుకొనెను. ఆశ్రమమున సింహములు, మృగములు, ఆవులు, సర్పములు, మార్జారములు, మూషికములు అన్నీ పరస్పర విరోధ జంతువులు సంతుష్టములయి, సహజ భయమును దూరముగ పారద్రోలి సమభావమున సంచరించుచుండెను, హోమాగ్ని హోత్రముల నుండి వెలువడిన ధూమమును చూచి వెమిళ్లు మేఘములను భావమున బిగ్గరగా క్రేంకారరవములు చేయుచున్నవి. నృత్యము లాడుచున్నది. సాయంతనములందు బ్రాహ్మణులచే అర్పింపఁబడిన సూర్యునకభీముఖముగా నీయఁబడిన అర్ఘ్యజలములతో నేల ఆర్థముగ నుండెను. ఆ ప్రదేశమున బ్రహ్మచర్య వ్రతము నాచరించు శిష్యగణముచే వేదములు, శాస్త్రములు, సంహితలు సంతోషముగ అభ్యసింపం బడుచుండెను. అంత రాముఁడు ఆశ్రమ. సంపదను దర్శించుచు, ప్రసన్నాత్ముఁడై అకృతేవణునితో సంయుతుఁడై మెల్లగా సాశ్రమమును ప్రవేశించేను. బ్రాహ్మణ విద్యార్థులు 'జయ' శబ్దములొనర్చిరి. ద్విజులు నమశ్శబ్దములుచ్చరించిరి. వానిని విని రాముఁడత్యంత హర్షము నొందెను. ఆశ్రమాభ్యంతరమునందలి స్వగృహమును ప్రవేశించి తపోనిధీ తండ్రియునైన జమదగ్నిని రాముఁడు దర్శించేను. ఆతఁడు సాక్షాత్ భృగుమహర్షివలె విగ్రహానుగ్రహ సమర్ధుఁడు, రాముఁడు తండ్రి చరటోషాంతము సాష్టాంగోలింగితభూమియై నమస్కలించి, “వేము రాముఁడను. మీరదాసుఁ డను ఆనుచు సాష్టాంగ మాచరించెను. సజ్జపొగడియయిన రాముఁడు తండ్రి పాదములు పట్టుకొనెను. తరువాత తల్లి చరణ పద్మములను పట్టుకొని నమస్కరించి, అంజలీ బదుఁడయి తల్లిదండ్రులకు ఆనందకారణముగా రాముడిట్లనెను. ఓ జనకా ! పొందుటకు సాధ్యముకానీ గొప్పదియైన నీ తపః ప్రభావమున కార్తవీర్యుఁడు యుద్ధమున పుత్రబలవాహనములతోబాటు చంపఁబడెను.
ఆతఁడు దుష్టుఁడయిన తన మంత్రిచే ప్రచోదితుఁడయి నీకపకార మొనర్చెను. ఆతనికి ఓ మునిపుంగవా ! అరదండన మొసంగితిని. మీకు నమస్కరించి బ్రహ్మ యొద్ద కరీగీతిని విధివంతముగా బ్రహ్మకు నమస్కరించి నా కార్యమంతయు నివేదించితిని. మొదటి నుండియు జరిగిన వృత్తాంతము సంతయు వాలకించి భగవానుఁడయిన బ్రహ్మ” స్వకార్య సిద్ధి కొఱకు సనాతనమయిన శివలోకమునకు నీ వరుగుము” అని పలుకగా విని ఆతని యజ్ఞ ననుసరించి, పితామహునకు నమస్కరించి, ఈశ్వర దర్శనాభిలాషిన శివలోకమున కరిగితీని శివలోకము ప్రవేశించితినీ అందు ఉమాసహితుఁడయిన భగవానునకు వాంఛిత ప్రదాతకు నమస్కరీంచితిని. అతని ముందు స్వీయచత్తాంతమును సమస్తమును నివేదించితిని. భగవానండు ప్వస్థచిత్తముతో పర్వము వృత్తాంతము నాలకించెను. వీని ఆధతయు, ఆలోచించి,కృపాన్వితుడయి, సర్వసిద్ధిదమందున త్రైలోక్యవిజయనామ కవచమును నాకోసబసు. దానిని స్వీకరించి, నమస్కరించి, పుష్కరమును (తీర్థమును జేరితిని. ఆందు హృష్ణమాపసు డనై కవచమును సాధించినవి. యుద్ధమున కార్తవీర్యుని జయించితిని. మరల శివలోకమున కరిగితీని. శివలోకమున జ్వరప్రదేశమున విరుషుడను చూచితిని. వారు స్కందవినాయకులు. వారికి నమస్కరించితిని. ఓ ధర్మజ్ఞ ! లోనికి ప్రవేశింప నుద్యమించితిని. గణపతి త్వరగా ప్రవేశింపబోవు నన్ను చూచి, “ఇప్పుడు సమయము కాదు' అని వెంటనే నివారించేను. ఓ తండ్రి ! ఆతతో వాగ్యుద్దమయినది. చేతులతో పెనుగులాడుకోంటీమిం, తరువాత పరశును విసరుట యయ్యెను, గణపతీ అదిరేటింగి నన్ను చేతితో పట్టుకొని పన్ను క్రిందకు ఫైకి త్రిప్పి క్రిషి, తరువాత మరల నన్ను ముందు నేనున్న ప్రదేశమునకు తెచ్చి నిలిపెను. ఆతనిని చూచి అతిక్రుద్ధుఁడ సయితిని. కుఠారమును నాతనిపైకి విసరీతిని. తన్మూలమున గణపతీ దంతమూఁడి నేలకు రాలేను. అంతలో ప్రభువచ్చటికి వచ్చెను. పార్వతీ అచ్చట చాల కోపించెను. అంత రాధతో సహితముగ కృష్ణుఁడు వచ్చెను. పార్వతీ రాధతో సహితముగా కృష్ణునిచే అనునయంపఁబడెను. కృష్ణుఁడు నాకు వరమొసంగేను. కృష్ణుఁడు పార్వతితో స్నేహమును కలిగించి వెడలిపోయేను.
వసిష్ఠ ఉవాచ :-
జమదగ్ని రువాచ :-
వసిష్ట ఉవాచ :-
తరువాత దేవేశ్వరులయిన పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరించీ అకృతప్రణునితో కూడి నీ దగ్గరకు వచ్చితిని.
వసిష్టుఁడిట్లనెను.
ఇట్లు పలికి భార్గవ రాముఁడూరకుండెను. శత్రునిబర్హణుఁడయిన రామునితో జమదగ్ని ఇట్లు పలికెను.
జమదగ్ని యనెను :-
క్షత్రియ హననముచే నీకు పాపము సంక్రమించినది. తద్ధోషముపశాంతించుటకు, ప్రాయశ్చిత్తము యథాశాస్త్రము చేయవలసి యున్నది. ఇట్లు చెప్పఁబడి తండ్రిచే, మతిమంతులలో శ్రేష్ఠుఁడయిన రాముఁడు “తద్యోగ్యమయిన ప్రాయశ్చిత్తమును నిర్దేశించుటకు నీవే అర్హుఁడవు” అనెను.
నాయనా ! వ్రతములచే నియమములచే స్వదేహమును కృశింపజేసి, శాకమూలఫలాహారివై పండ్రెండు సంవత్సరములు తపమాచరింపు మనెను.
వసిష్ఠుఁడిట్లునుడివెను.
తండ్రిచే నిట్లుచెప్పఁబడి భృగూద్వహుఁడయిన రాముఁడు తల్లికి తండ్రికి నమస్కరించి, అకృతవణునితోకూడి అరికర్షణుఁడయిన రాముఁడు పర్వతవరమయిన మహేంద్రగిరి కరిగి, అచ్చట ఆశ్రమమును నేర్పరచుకొని, అందు సుదుశ్చరమయిన తపమాచరించెను. వ్రతములచే, తపస్సులచే, నియమములచే, దేవతారాధనలనే మహామనీషి రాముఁడందు కొన్ని సంవత్సరములు గడిపెను.
ఇది వాయుప్రోక్తము మహాపురాణమునైన బ్రహ్మాండపురాణమునందు మధ్యమభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున సగరోపాఖ్యానమున భార్గవచరితలో నలుబది నాలుగవ అధ్యాయము.
