3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

51 - సగరచరిత్రము -అసమంజసుని త్యాగము  

సగర ఉవాచ :-

సగరుఁడిట్లనియెను :

ఓ మహర్షి ! సర్వత్ర నాకు కుశలము. ఇందు సందేహము లేదు. ఓ భార్గవ సత్తమ ! మియనుధ్యానమే నాకు శాంతి. పూర్వము నీచే అస్త్రముల యందు శస్త్రములయందు సుశిక్షితుఁడనయిన నేను ఇప్పుడు సర్వశత్రు నీగ్రహము నందేట్లు అశక్తియుతుఁడనగుదును? నీవు నాకు గురుఁడవు; స్నేహితుఁడవు, బంధుఁడవు, మిత్రుఁడవే కావు నీన్ను కాక వేడొకని తండ్రినీగా నే నెఱుంగను. (3) నీవుపదేశించిన అస్త్రముచే, సకల రాజన్యులు నాచే జయింపఁబడిరి. అయ్యది మీయొక్క తపః ఫలము. దాని ననుస్మరించుచు సర్వశత్రువులు నాచే జయింపఁబడిరి. నీ తపస్సుచే, సర్వజగత్తును పవిత్రీకరించెదవు; రక్షించేదవు. ప్రపంచమునంతటిని సృష్టించుటకు సంహరించుటకు నీవు సమర్థుఁడవు. సంశయము లేదు. నీ తపస్సు గొప్పది. అనన్య సామాన్యమైనది. అందొక యేక దేశమిచ్చట కనుపించుచున్నది. అదియు విస్మయప్రదము. (6) ఓ బ్రహ్మర్షి! చిన్నతనము నుండి యీ లేడిపిల్ల సింహ. సమీపమున నిశ్శంకముగా నీతపోవనమున చూడుము నీరుత్రాగుచున్నది! అంతియేకాదు. అల్ప సత్త్వము కలిగినదయినను హరిణము. విశ్వాసముతో తన పిల్లకు పాలిచ్చుచున్నది. గురువు(ఒకవిధమైనజింక) మృగముయొక్క కొమ్ము యొక్క చీవరభాగమును రాసికొని తనదురదను తీర్చు కొనుచున్నది. వేటికవనమునందు స్వజీవిత వృత్తికి వ్యాఘ్రము నవప్రసూతమయిన హరీణమును చంపి, అవ్యాఘ్రమే నీతపోవనములో ఆలేడిపిల్లలను పోషించు చున్నది. నీతపఃప్రభావమున సింహముచేటిక వనములో ఏనుగునుతరుముచు వచ్చినది. నీవనమునందుదానిననుసరంచీప్రవేశీంచయు నీ భయమువలన ఒకచోనదీనీలంబిడిపోయినది. (10)ముంగీసలు,ఎలుకలు, పిల్లులు, మయూరములు, శుకములు, చెవులపిల్లులు)పాములు, తోడేళ్లు, ఎలుగులు, అడవిపందులు, శార్దూలములు, శరభములు, వ్యాఘములు, కోతులు, నక్కలు, గవయమృగములు, ఆవులు, హరిణములు, దున్నలు-మున్నగునవి యీ వనమునసహజవైరమును విడిచి. స్నేహమును పొందియున్నవి.(12)ఈవిధమయిన మీతపళ్ళకీ లోకవిస్మయకారిణి. ఇట్టిది మీవనమునందుతక్క వేటికచో కానరాదు. ఇట్టిదిభూమియందెక్కడనైనను దుర్లభమే.భవత్రసాదముచే నేనుఈభూమినంతటినీ జయించి, శత్రువులతో సహా స్వరాజ్యమును పొందితిని. అమాత్యులందరు నా స్వాధీనములో నుండిరి. త్రివర్గములయెడవలసిన జారూకత వహించితిని. మీరుపదేశించిన మార్గమున రాజ్యమును సక్రమముగా పాలించితిని.

ఇట్లు ప్రవర్తించుచు ఓ భృగుపుంగవ, రాజ్యమునందుండగా మిమ్ము దర్శింపవలెననుఅపేక్షతో కూడిన కోరిక కలిగినది. (16) సంతానము లేని కారణమున పితృపిండ ప్రదానముతో గూడ ఈ రాజ్య సంరక్షణము నాకొక్కనికే పర్యాప్తమైనదా? (నాతో నాగిపోవునా?). పిల్లలు లేనందున నయ్యదట్లగునా? ఇయ్యది అనివార్యమై సోమనోగతమయిన అత్యంతమైన దుఃఖము, నాకీలోకమున మీరుకాక వేడొక యుపకారవరుఁడు లేం డనీ యెఱింగి మీమ్ము చేరితిని. (18) సగరుఁడిట్లు చెప్పు, ఒక్క క్షణము భగవంతుఁడయిన ఔర్వమహర్షి అంతర్మనస్క్యుడై యుండి విదేశ పూర్వకముగా నీట్లు పలికెను. “నీ ఇరువురు భార్యలతో నియమబద్ధుఁడవై కొంతకాలమీ తపోవనమున నుండుము. నీవు నీయభీష్టమును పొందగలవు. ఇంక నీకా విషయమును విచారింపపనిలేదు. ఆ రోజు సంప్రీతుండై యందు- ఋషి శుశ్రూషా పరాయణుడై యుండెను. భక్తి యుక్తుఁడై పత్నీ ద్వయముతో అందు చిరముండెను. (21) ఆ రాజపత్నులును సర్వవేళలయందు శ్రద్ధాయుతులై అతంద్రలై సేవించిరి. వినయాచార భక్తులచే మునికి ప్రీతిని కలిగించిరి. మహాముని వారి భక్తికి శుశ్రూషకు వారీయందు సంతుష్ఠుఁడయ్యెను. రాజపత్నులను పిలిచి వారితో నీట్లనెను. (23) ఓ పూజ్యరాజపత్నులారా ! మీరు మీయిష్టమయిన వరమును మావలన కోరుడు. మీకదీ యొసంగెదను, సందేహములేదు. అదీ దుర్లభమైన నొసంగెదను”. అనేను ఆ మునీకి వారిరువురు శిరసా నమస్కరించి “మేము పుత్ర సంతతిని కోరుకొనుచున్నాము” అనీది.మరల మహర్షి వారలతో “మీ యిరువురకు, మహారాజునకు, ప్రియమాచరింపఁగోరి మీరు కోరిన వరమొసంగితిని. పూజ్యురాండ్రైన మీయిర్వురు మత్రసాదమున పుత్రవతులగుదురు. నిశ్చయ మనస్సుతో నా పలుకులాలకింపుఁడు. మీలో నొకతెకు ఒకే కుమారుఁడు కలుగును. అతఁడు అనతిధార్మికుఁడు. అయినను నతఁడు కల్పాంతము వరకు జీవించియుండును. ఇక రెండవయామె అరువదివేల పుత్త్రులంగనును. అకృతార్థులై యచిర కాలములో వారందరు నశించెదరు. ఇట్టి లక్షణోపేతములయిన వరములు మీ కొసంగితిని. మీలో ఎవ్వరేది కోరుదురో మీయంతట మీరే స్వేచ్ఛగా చెప్పుడు. (30) అనెను.

ఇట్లు మునివచింపగా, విదర్భరాజతనయ వంశవర్ధనుఁడయిన కుమారుని కోరెను. ఇక రెండవది మిగిలిన రెండవ వరమును కోరుకొనెను. సగరునకు ఈ విధముగా వరములొసంగి మహాముని, భార్యలతో మహారాజును అనుమతించి స్వనగరమునకు పంపెను. (32) మునిచే సమనుజ్జోతుఁడు, కృతకృత్యుఁడునయిన రాజు రథమును వెంటనే ఆరోహించి, తన ప్రియురాండ్రతో పురమున కరిగెను. రాజు తుష్ట పుష్ట జనాన్వీత మైన గమ్యమగు నగరమును ప్రవేశించెను. ప్రజలానందించిరి. రోజు మిక్కిలి ఆనందయుతముగా నుండెను. (34) ఓ రాజా! తత్సమయము నందు రాజుతో ఆ రాజపత్నులిర్వురును తాము గర్భిణులమయితిమని సంతోషమున నెఱింగించిరి. శుక్లపక్ష చంద్రునివలె వారీగర్భములు వృద్ధిచెందెను. ఆ గర్భ వృద్ధితో రాజు యొక్క ప్రజల యొక్క సంతోషము వృద్ధినొందెను. (36) గర్భము సంపూర్ణమయినది. పుణ్యవతియయిన కేశిని అగ్ని గర్భాభుడు అతిద్యుతి మంతుఁడు నయిన కుమారుని కనెను. యథావిధి రాజు కుమారునకు జాతకర్మాదీకముల నొనర్చెను. అసమంజసుఁడను నామమాతనికీడెను. (38) తత్సమయముననే, సుమతి గర్భాలాబును కనెను. (సొరకాయవంటి గర్భపిండమును కనెను). ఇట్లు గర్భపిండము సొరకాయవంటిది పుట్టగా రాజు దానిని చూచి త్యజింపఁగోరెను. ఆ విషయము నౌర్వ మహర్షి యెంగేను. తనంత తానే యచ్చటీకి వెంటనే వచ్చేను. రాజు చక్కగా గౌరవించెను. వెంటనే అతనితో ఋషి ‘ఈ గర్భా లాబును ఓరాజా! నీవు వీడవరాదు. ఏలయన అదీ షష్టి సాహసపుత్ర బీజమయినది. అందుచే దానిని సకలములుగా చేసి (ముక్కలుగా) ఘృతకుంభమున ప్రయత్న పూర్వకముగా నుంచుము. వానిని కప్పియుంచవలెను. వేలు వేలుగా నొక్కొక్క శకలమును రక్షింపవలయును. ఇట్లు చక్కగా చేసినచో ఓరాజా! నాయనుగ్రహమున పూర్వము చెప్పిన సంఖ్యాయుతమయిన పుత్రులు కలుగుదురు. సంశయములేదు. కాలము పరిపూర్ణము కాగా కుంభమును. ఛేదించుకొని వేరు వేరుగా షష్టి సహస్రపుత్రులు కలుగుదురు”. అని ఔర్వుడు చెప్పి అందే అంతర్థానమందెను. ఔర్వ మహర్షి చెప్పిన విధముగా రాజాచరించెను.

ఒక సంవత్సరము నిండినది. ఘృతకుంభమును ఛేదించుకొని ప్రతిదినము ఒక్కొక్క కుమారుఁడు పుట్టెను. ఈ విధముగా జన్మించిన కుమారులు షష్టి సహస్రసంఖ్య కలిగి క్రమముగా వర్గములుగా వృద్ధి పొందిరి. వారందరు మహాబలపరాక్రములు, వారందరు. ఏమిచేసినను కలిసియే చేసిరి కానీ వేరువేరుగా నెట్టి కర్మము నాచరింపలేదు. వారందరు ధురాధరులు. విశేషముగా క్రూరాత్ములు. మతిమంతులలో శ్రేష్ణుం డయిన రాజు వారియందు ప్రీతిమంతుఁడు కాదు. కేశినీ సుతునొక్కనీనే ప్రియతమునీగాను, బహుమాన పురస్సరునిగాను చూచెను. ఆతనికినిధి మంతముగా రాజు వివాహ మాచరించెను. ఆతఁడో తన సుగుణములచే తన సమస్త స్నేహితులను ఆనంద పరచెను. ఇట్లు కాలము సాగు చుండగా కేశినీ తనయుఁడయిన అసమంజసునకు ఒక కుమారుఁడు పుట్టెను, ఆతని పేరు అంశమంతుఁడు. ఆతఁడు ప్రఖ్యాతుఁడు. అంశు మంతుఁడో మతిమంతుఁడు. బాల్యము నుండియు తన యుదారములయిన గుణములచే స్నేహితుల నధికముగా సంతోష పెట్టెను. తన పితామహుని కూడ ప్రీతిమంతుని చేసెను. ఇంతలో రాజకుమారుఁడయిన అసమంజసుఁడు ఒక దుష్టవీశాచముచే ఆవేశింపఁబడి నష్ట చేష్ణుం డయ్యెను. ఆతఁడు పూర్వజన్మమున ఒక రాజుయొక్క దేశమునందు ఒక వైశ్యుఁడు. అయినను నతఁడు ధర్మమేజింగినవాఁడు. ఆతఁడో అత్యంతధనధాన్యవంతుఁడయ్యెను. ఆతఁడొకప్పుడరణ్యములో సంచరించు ఉత్తమమైన ధననిధిని చూచెను. చూచుటయే తడవుగా కోమటియొక్క లోభగుణముతో నిండీ దానిని గ్రహింపమొదలిడెను. అంత, ఆ ధన నీధి రక్షకుఁడైన యొక పిశాచమేతెంచి ఆతనితో “ఇందు నీధి పాలకునిగా చిరకాలము వసించుచు క్షుధితుఁడనయితిని. అందుచే నా ఆకలి పోవుటకు గోమాంస మొసంగుము. దానికి ప్రతిగా నీ యిష్టము వచ్చినంత ఈ నిధినీ నా యాజ్ఞ చొప్పున గ్రహించుము” అనెను. (57) గవామీషము నిచ్చెదనని యతఁడు ప్రమాణము చేసెను. పిశాచముచే నను మోదితుం డై ఆతఁడా ధన నిధినంతటిని గ్రహించెను. (58)

ఆతఁడు తన మౌఢ్యముచే ఇచ్చెదనని ప్రమాణ మాచరించి పిశాచమున కోసంగలేదు. అంతియేకాక ఇచ్చేదనని ప్రమాణము చేసిన దాని నీయకున్న పిశాచమునకు గలిగిన కోపమును గమనింప లేదు. ఆ వైశ్యుని కొఱకు చిరకాలము పిశాచము నిరీక్షించి నిరీక్షించి ఆహార కాంక్షతో ధనము గోల్పోయి, మిక్కిలి వ్యధ ననుభవించి ఆకలి బాధచే మరణించెను. ఇంక ఆ వైశ్యుఁడును కాలక్రమమున కేశినీ యొక్క తనయుఁడై అన్వయవర్గకుండయ్యెను. పిశాచము శరీరరహితుఁడయ్యు పూర్వ వైరమును అనుస్మరించి వాయుభూతుఁడయి, రాజపుత్రునియొక్క దేహము నావేశించెను (ప్రవేశించెను). ఆ భూతవాయువుచే నావిష్ణుఁడయి యాతండు క్రూరచిత్తుఁడయ్యెను. ఆతనికి మతిపోయెను, మఠీవీభ్రంశమొంది పిశాచముచే బిలాతృతుడయి, అసమంజసుఁడు ఆ రాజనగరమున సుశంసునివలె (క్రూరునివలె) బాలులను, యువకులను, ముదుసతులను, స్త్రీలను, ఆ దుర్మార్గుడు చంపి, చంపి, పాషాణ హృదయుండై ఆ బాలాదులను సరయూనదిలో పారవైచెను. అసమంజసుని కదర్యతను క్రౌర్య భావమును పౌరజనులందరు చూచిరి, పెక్కురు ఆతనిచే చంపఁబడిరి. ప్రజలు వెంటనే వెళ్లి రాజును సమీపించి తమ బాధను విన్నవించుకొనిరి.  రాజు వారీ విన్నపము నాలించెను. బహం ప్రయత్నమాచరించి మహాదుఃఖ సమన్వితుఁడై యనేకమారులు వారించెను. ఉదారుఁడు మహాత్ముండు సయిన పితరునిచే పలుమార్లు అడ్డగింపఁబడి ప్రతిషిద్ధుఁడయినను రాజు ప్రయత్నములు వేయించిన బార్లీధాన్యమును నీటిలో గుమ్మరించినట్లు నీషులములయ్యెను. పాపకర్మనుండి ఆతనిని నీవర్తింపచేయ శక్తుఁడు కాక, రాజు లోకాపవాదభీతుఁడై ఆతనిని దేశము నుండి బహిష్కరించెను.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందు మధ్యమభాగమున, తృతీయ ఉపోద్ఘాతపాదమున సగరచరిత్రమునందు, అసమంజసబహిష్కరణమను ఏబది యొకటవ అధ్యాయము.