3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)
71 - వృష్ణివంశవర్ణనము
సూత ఉవాచ :-
సూతుఁడిట్లు చెప్పెను. సాత్వతునకు కౌశల్యయందు మహాబలురయిన కుమారులుదయించిరి. వారు -భజమానుఁడు, భజి, దీవ్యుఁడు వృష్టి దేవవృథుఁడు, అంధకుఁడు మరియు మహాభోజుఁడు, వారందరు ప్రసిద్ధులు. సవ్యసంగరులు, బ్రాహ్మణపోషకులు వారివంశీయులు చతుర్వర్గీయులు, వారినీ గూర్చి సవిస్తరముగా వీనుఁడు, భజమానునీ కుమారుడు సృజంయుఁడు సృంజయునకు ఇరువురు కుమార్తెలు; వారి నాతఁడు బాహ్యకునకిచ్చి వివాహ మొనర్చెను. అక్క చెల్లెండ్రయిన ఆభార్యలిరువురికి చాలమంది కుమారులుదయించిరి. పొరు-నిమ్లోచి, కొంకణుఁడు, ధృష్టి పరపురంజయుఁడు. వారు భజమానునకు మనుమలుగను, సృంజయుని కుమార్తెకు కొమరులుగనుపుట్టిరి. బాహ్యకుని మొదటి భార్య అయుతజిత్తు సహస్రజిత్తు శతజిత్తు అనుముగ్గురు కుమారుల (గనెను. సాత్వతునికుమారులలో రాజయిన దేవావృధుఁడు తీవ్రమయిన తపస్సును సర్వగుణో పేతుఁడయిన కుమారుఁడు నాకు పుట్టుగాక యనుకోరికతో ఆచరించెను. యోగాభ్యాసమున నిమగ్నుఁడై పర్ణాశజలములను స్పృశించెను? రాజు కళ్యాణగుణవంతుఁడగుట ఆ నది ఆతని స్పర్శచే ప్రియమాచరించెను (జలాచమనముచేయుటచే)ఆనది చింతచేపరీతాంగియై తుదకిట్లు నిశ్చయమునకువచ్చెను “రాజయినదేవవృధునకు, ఎవరెయందు తద్వీధమయినకుమారుఁడు గలుగునో ఆమెకు(ఆస్తీకి) ఎదురేగను (వ్యతిరేకముగాను) అందుచే నేనే యాతని భార్యనయ్యెదను.” ఆమెహృదయములో వాంఛించిన విధముగా భావముత్పన్యమయ్యెను, ఆమెకుమారిగానై చింతాపరవశుఁడయిన రాజును ప్రేమించెను. ఆరాజును ఆమెవరించెను.. ఆరాజు ఆమెనంగీకరించెను. ఆమెవల్లనుదారుఁడైన రాజు తేజస్వియైన కుమారునికొఱకు గర్భాధానముచేసెను. (ఆమెతోకలిసెను).
ఆ నదీలలామ తొమ్మిదవమాసమున సర్వగుణోపేతుఁడయనకుమారు బభ్రుని. దేవవృధుని వలనఁగనెను. తద్వంశమును గూర్చి పురాణజ్ఞులయిన ద్విజులు గాథను గానము చేసిరి. వారు మహాత్ముఁడైన దేవవవృధునియొక్క గుణములను కీర్తించిరి. దానివల్ల దూరదేశము నుండి వచ్చిన గాథలు వినినట్లే. సమీపస్థులవలే అతనిని జూచితిమి. మానవులలో బభ్రువు శ్రేష్ఠుఁడు; దేవవృథుఁడు దేవతలతో సమానుఁడు. బభ్రునివలన దేవవృధునివలన అమృతత్వమును (మోక్షమును) పొందినవారలు డెబ్బదివేలయరువదిమంది. సాత్వతవంశ్యుఁడగు మహాభోజుం డు, యజ్ఞములనాచరించిన వాఁడు, దానపతి, ధీరుండు, బ్రహ్మణ్యుఁడు, సత్యవాక్యపరిపాలకుఁడు పండితుఁడు, కీర్తిమంతుఁడు మరియు మహారథి. ఆతని వంశము చాలగొప్పది. ఆరాజులందరు భోజులు గా భువినీప్రఖ్యాతులైరి. ధృష్టికిగాంధారి, మాద్రీయనునీర్వురు భార్యలు, గాంధారికి సుమిత్రుం డుదయించెను. ఆతఁడు మిత్రానందకరుఁడు. మాది యథాచిత్తును మీడ్వంతుని అవమిత్రుని శినిని కనెను. వీరు పురుషోత్తములు (?)అనమిత్రుని సుతుఁడు నీఘ్నుఁడు. నీఘ్నునకు ఇరువురు పుత్రులు. వారు ప్రసేనుఁడు, సత్రాజిత్తును వారు మహాభాగులు. ఆసత్రాజిత్తునకు సూర్యుఁడు ప్రాణసమ సఖుఁడయ్యెను. ఒకప్పుడు. తెల్లవారుజామున (నీశాపాయే)రథికులలోశ్రేష్ఠుఁడునయిన సత్రాజిత్తు తనరథముతో నదీతీరమున సూర్యునిగూర్చి ప్రాతరుపస్థానమొనర్ప స్నానమున కరిగెను.ఆతఁడు తనపూజ, నొనర్చుచుండ వివస్వంతుఁడయిన సూర్యుఁడు ఆతనియెదుటనీలిచెను. ఆభగవత్స్వరూపము మీక్కిలి స్పష్టముగనుండెను. జ్యోతిషాంపతియైన సూర్యునీమండలము మిక్కిలి జాజ్వల్య మానముగా కాంతివంతముగానుండెను. తన ముందు నిల్చియున్న సూర్యునితో సత్రాజిత్తిట్లనెను "ఓ జ్యోతిష్పతీ! నిన్ను ఆకాశమున నున్నవిధముగనే చూచుచున్నోను.
ఆతేజో మండలముతోడనే నాముందును నిలంబడితివి. ఓవివస్వంత! స్నేహితునిగా నన్ను చేరి నప్పుడు ఏవిశేషమున్నది “అని ఆ పలుకులు భగవంతుఁడైన సూర్యుడువిని తనకంఠ భాగమునుండి మణిరత్నమయిన స్యమంతమును తీసి సత్రాజిత్తుయొక్క కంఠమున కట్టెను ఉంచెను. అంతరాజుమూర్తిమంతునిగా (విగ్రహవంతునిగా)సూర్యుని చూచెను. ఆతనినిచూచి ప్రీతిమంతుఁడై యాతనితో సత్రాజిత్తు. ఒకముహూర్తాకోలము ప్రసంగించాను. మరల బయలుదేరిన సూర్యునితో సత్రాజిత్తు భగవాన్! ఈఉత్తమమణిరత్నమును నాకొసంగగా నీకే తగినది. ప్రజలు అగ్నిసవర్ణమయిననిన్నుఈరత్నమునందే చూచెదరు” అనెను. సూర్యుఁడాతనికి సమంతకమను మణినొసంగెను. రాజుఆమణిని ధరించి,నగరమునుప్రవేశించెను. దానితో తన పట్టణమునంతటిని అంతఃపురమును ఆశ్చర్యచకితులను చేసి అంతఃపురముప్రవేశించేను? సత్రాజిత్తు ఆదివ్యమయిన మణిరత్నమయిన స్యమంతకమును ప్రేమతో సోదరుఁడయిన ప్రసేనున కొసంగెను. సమంతకమను మణీ యేరాష్ట్రమందుండునో, పర్జన్యుఁడు వలసినప్పుడు వర్షించును. వ్యాధిగాని భయముకానీ యుండదు. ఆమణిరత్నమయన సమంతకమును ప్రసేనుని నుండి.గోవిందుఁ డు అభిలాషించెను. కాని దానినీ నతఁడు పొందలేదు. గోవిందుడు శక్తిమంతుఁడయినను బలాత్కారముగా దానిని గ్రహింపలేదు. ఒకప్పుడు ప్రసేనుఁడుఆ మణినీ ధరించీ,వేటకొకరిగెను, ఆ స్యమంతకమణి కొఱకోతఁడు సింహమువలన మరణమునొందెను. ఋక్షరాజయినజాంబవంతుఁడు ఆసింహమునుచంపి ఆమణితో తన నివాసమయిన పర్వత బిలమును ప్రవేశించెను.వృష్టి అంధక వంశీయులయిన పెద్దలు, ప్రసేనునిమరణకర్మ మణినీ ఆశించిన కృష్ణునిదే యనీ తలఁచీ ఆతనినీసంశయించిరి.
ధాత్యువాచ :-
బలవంతుఁడు, అరిసూదనుఁడు భగవంతుఁడగు కృష్ణుఁడు వారివలని మిధ్యాపవాధమును భరింపలేక ప్రసేనవృత్తాంతముగ్రహింప అరణ్యమున వెదకుచు సంచరించెను. తనకు ఆప్తులయిన కొందరు పురజనులతో ప్రసేనుడెచ్చట మృగయార్థము (వేటకొఱకు) తీరిగెనో, ఎందు ప్రసేనుని కాలిఅడుగులజాడగలదో అయరణ్యమున గోవిందుడు తిరిగి చూచెను.భల్లూకములుగలిగిన కొండను వింధ్యపర్వతమును వెదకుచు అలసిపోయి ఆమహామనీషి అశ్వముతో కూడ హతుఁడైన ప్రసేనుని చూచెను, కానీఆమణినందు పొందలేక పోయెను. ప్రసేనునీయొక్కకళేబరమున కనతి దూరములో సింహము(ఋక్షేణ భల్లూకముచే చంపఁబడుటచూచెను. ఆమహాఋక్షముయొక్క అడుగులచే సూచీత మయినవాడననుసరించి కృష్ణుఁడు అన్వేషింప ఋక్షరాజుయొక్క గుహ సమీపమున కరిగెను. ఆ పెద్దగుహాంతరమునుండి స్త్రీలే నాడబడుపలుకులను నతఁడు వీనేను. ఆధాత్రి(పనికత్తె). జాంబవంతునీయొక్కబొడ్డతో ఆమణితోకూడనాడు చుండెను. ఆమె మారోదీః! ఏడువకుము అని పల్కుచుండెను, ధాత్రి ఇట్లనెను. సింహము ప్రసేనునీ చంపెను. సింహమును జాంబవంతుఁడు చంపెను. ఓఅందాలబరిణా ! ఏడువకుము, ఆ స్యమంతకము నీదయినది”. ఆ పదములు సుస్పష్టముగ నుండెను. ఆతఁడు వెంటనే గుహలోని కరిగెను. ఆ బిలముయొక్క సమీపమున ప్రసేనుని శరీరఖండములను నతఁడు చూచెను. వెంటనే ఋక్షరాజు బీలమున కృష్ణుఁడు ప్రవేశించెను. ఉదారధీ యైన కృష్ణుఁడు, ఋక్షరాజయిన జాంబవంతుని చూచెను. ఆజాంబవంతునితో బిలమునందు బాహువులతో ఇరువదియొక్క దినములు వాసుదేవుఁడు యుద్ధముచేసెను. కృష్ణుఁడు బీలముప్రవేశింపగా, వాసుదేవునితో ఆరణ్యమునకువచ్చిన వారు ద్వారవతికి తిరిగివెడలిరి. “కృష్ణుఁడు మరణించె”నని నివేదించిరి. వాసుదేవుండు మహాబలవంతుం డైన జాంబవంతునీ జయించి.
ఆతని నెమ్మికూతురయిన జాంబవతిని పొందెను. భగవంతుఁడైన కృష్ణునితేజస్సుచే నభిభూతుఁడయి జాంబవంతుఁడు వెంటనే మణిని పుత్రికామణియైన జాంబవతిని విష్వక్సేనునకు (కృష్ణునకు)ఇచ్చెను. ఆత్మవిశుద్ధీకోఆకు మణిని సమంతకమణిని కృష్ణుఁడు గ్రహించెను. భల్లూకరాజును తృప్తిపరచి ఆబిలమునుండివెలుపలికిబయలుదేరెను. ఈ విధముగామీథ్యాపవాదమునుండి మధుసూదనుఁడు పరిశుద్ధుఁడయ్యెను. ఎవ్వడీకృష్ణుని మిధ్యాపవాదమును తెలిసికొనునోఆతఁడెన్నడును మిథ్యాపవాదములకు లోనుగాఁడు. సత్రాజిత్తునకు పదిమంది భార్యలు,పదివేలమంది కుమారులు కలరు. వారిలో ముగ్గురు కీర్తిమంతులు వారిలో పెద్దవాఁడు. భంగకారుఁడు; వాతపతిమహావీరుఁడు; తపస్వి అందరికినీబహుప్రీయుం డు. భంగకారునీ తల్లి వీరమతి ఆమెకుముగ్గురుకుమార్తెలు. వారురూపగుణాన్వితలు. సత్యభామస్త్రీలలోనుత్తమురాలు, ఆమె ప్రతీనీ వ్రతముల యందుదృఢనీష్ఠ గలిగినది. ఆమెపవిత్రురాలు తపస్వినీ ఆమేనాతనితండ్రీకృష్ణునకిచ్చి వివాహమాచరించెను. కృష్ణుఁడుసత్రాజిత్తునుండీ మణిరత్నమైన స్యమంతమును గ్రహింపలేదు. (అక్రూరుఁడు ధనమోహమున. ఆ స్యమంతకమణిని అభిలషించెను) భోజవంశీయుఁడైన శతధన్వుఁడు. అనీంగీత శీలయైన సత్యభామను మణి నొసంగుమనీకోరెను. మహాబలుఁడయిన శతధన్వుఁడు తరువాత సత్రాజిత్తుని రాత్రివేళ చంపి, రత్నమును తీసికొనిపోయి అక్రూరునకొసంగెను.
పురుష శ్రేష్ఠుఁడయిన అక్రూరుఁడు ఆ రత్నముగ్రహించి శతధన్వునితో నొకసమయమును చేసికొనెను. ఈ విషయమితరులకెవ్వరికిని తెలియరాదు. దానివలన ధనము మనమీర్వురముపయోగించుకొందము. ఒకవేళ కృష్ణునిచే నీవు చంపఁబడిన, ద్వారకయంతయు నిస్సంశయముగా నా వశము నందుండగలదు” అనీ. తండ్రి చంపఁబడగా యశస్వినియైన సత్యభామ, రథమారోహణముచేసి వారణావతమున కరిగెను. సత్యభామ తన తండ్రియొక్క వధాదికమయిన దుఃఖవార్తను భోజుఁడయిన శతధన్వునీ వృత్తాంతమును. తన భర్తకు నెఱింగించెను. దుఃఖార్తయే యాతని పార్శ్వముననుండి కన్నీరుకార్చెను. లక్షాగృహమున దగ్గులైన పాండవులకు కృష్ణుఁడు ఉదకక్రియలాచరించి, సాత్యకినీ సోదరులయొక్క కళ్యాణార్థము నీయోగించెను. అంత, మధుసూదనుఁడు వెంటనే ద్వారకకు వచ్చి తనయన్నగారయినబలరామునితో ఇట్లుచెప్పెను. ప్రసేనుని సింహము చంపెను. శతధన్వుఁడు సత్రాజిత్తును చంపెను. స్యమంతకమణిని వెదుకవలెను, ఓ సోదరా! దాని అధికారిని 'నేను. అందుచే, వెంటనే రథము నారోహంచి, మహాబలుఁడయిన భోజుని చంపిన ఓ మహాబాహో ! స్యమంతకమణీ మనకు సామాన్యమయినదగును” అనెను. అంత భోజకృష్ణుల మధ్య తుముల మయినయుద్ధమయ్యెను. అక్రూరుని కొఱకు శతధన్వుఁడు ఎల్లవైపులను చూచెను. కృష్ణభోజులకు మధ్య యెట్టి సంధినీ చేయకయే శక్తిమంతుఁడైనను అక్రూరుఁడు శాఠ్యముచే అచ్చటకు చేరలేదు(?) శతధన్వుఁడు భయాన్వితుఁడయ్యెను, అతఁడు. అందుండి పోవందలంచెను (హృదయ శతధన్వునీఅశ్వము) తన అశ్వమయిన ‘హృదయ’పై 100 యోజనములు పరువెత్తెను. శతయోజనగామిని అని పేరు పొందినదాతని “హృదయ”యను గుఱ్ఱము. అదియొక (బడబ)దివ్యాశ్వము, కృష్ణునితో నతఁడు యుద్ధము చేసెను.
ప్రయాణించి తొందరగా శతయోజనముల దూరము 'హృదయ' అశ్వము అలసిపోవుట గమనించి, శతధన్వుడు రథమును వీడి పరుగిడ మొదలిడెను.. అంత ఆగుఱ్ఱము యొక్క ప్రాణములు శ్రమచేతను, బాధచేతను ఓబ్రాహ్మణులారా ! ఆకాశమును చేరెను. అప్పుడు కృష్ణుఁడు రామునితో నిట్లనెను. “హేమహాబాహో ! ఇచ్చట ఆగుము. ఈ గుఱ్ఱము నందు ఏదియో దోషమున్నట్లగుపించుచున్నది. నడచిపోయి మణిరత్నమైన సమంతకమును హరించెదను. “పరమాస్త్రవీదుఁడు అచ్యుతుఁడు నడచిపోయి శతధన్వుని మిథిలోపవనమున చంపెను. ఆతని కడ నతఁడు స్యమంతకమును చూడలేదు.మహాబలుఁడయిన భోజుని చంపి కృష్ణుఁడు వచ్చిన తరువాత, “రత్నము నాకిమ్ము” అని బలరాముడనెను. 'లేద' ని కృష్ణుఁడనెను. అంతబలరాముఁడు రోషాన్వితుఁడై ధిక్ 'ఛీ' యని పలుసార్లని కృష్ణునితో నిట్లనెను “నీవు సోదరుడవగుట నీ దోషమును క్షమించితినీ. నీకు స్వస్తి యగుగాక నేను పోవుచున్నాను. ఇంక నాకు ద్వారకతోగాని, నీతోగాని వృష్టికులజులతో గాని ఏపనీయులేదు”. అని, అరిమర్ధనుడయిన రాముఁడు మిథిలప్రవేశించెను. సర్వకాంక్షితములతో కానుకలతో రాముఁడు. మిథిలాప్రభువుచే పూజింపఁబడెను. ఆసమయముననే మతిమంతులలో శ్రేషుఁడయిన (బభ్రువు)అక్రూరుఁడు. నానారూపములయినక్రతువులను అనేకములను నిరర్గళుండై యొనరించెను. ప్రాజ్ఞుఁడు, మహాత్ముఁడు గాందినీసుతుఁడయిన అక్రూరుఁడు, దీక్షామయకవచమును రక్షార్థము వహించెను. ఆ మహాత్ముని యజ్ఞములు అక్రూరయజ్ఞములని ఖ్యాతి వహించెను. ఆ యజ్ఞములలో బహ్వన్నము, దక్షిణలు అధికము. అందు కోరిన డెల్ల నీ యబడినది. అంత రాజయిన దుర్యోధనుఁడు మిథిలానగరమున కరిగి దివ్యమయిన గద, శిక్షను బలభద్రుని వలన పొందెను.
రాముఁడు తరువాత ప్రసన్నుడయ్యెను.మహారథులయినవృష్ఠంధక వీరులతో కృష్ణుడు బలరాముని ద్వారకకు తీసికొనివచ్చెను. పురుషర్షధం డయిన అక్రూరుఁడు అంధకులతో సహితుడై యుద్ధమున శత్రుఘ్నుని బంధుమంతునితో సార్థము చంపి ద్వారకకువచ్చేను. సుయజ్ఞ తనయ యయిన 'నర' యందు భంగకారునకు విశ్రుతులు, సుమహాబలులు నరసత్తములుఅయిన శత్రుఘ్న బంధుమంతులు పుట్టిరి.. బంధకారునీవధవలన కృష్ణుఁడు ప్రీతిమంతుఁడుకాలేదు. (అంధకవంశమునముఖ్యుడు భంగకారుఁడు). జాతిభేద భయమున భీతినొంది కృష్ణుఁడు అక్రూరునీ ఉపేక్షించెను. అక్రూరుఁడు ద్వారకనుండి (సమంతకమణితో) వెడలిపోవ, ఇంద్రుఁడు వర్షింపమానెను. అనావృష్టి వలన రాష్ట్రము బహుధా బాధపడెను. అంత కుకురాంధకులు అక్రూరునీ ప్రసన్నుని చేసిరి. దానపతియయినఅక్రూరుఁడు ద్వారకకు తిరిగిరాగా, సహస్రాక్షుఁడయిన యింద్రుఁడు తనహృదయమందున జలధీ నుండీ పుష్కలముగావర్షించేను. ఓ మునిపుంగవులారా!. అక్రూరుఁడు శ్రీకృష్ణుని ప్రీతికొలకు,శీలసమ్మత మైన తనతోబుట్టువును.వాసుదేవునకొసంగెను. అంత అక్రూరుని యందు స్యమంతక మణి యున్నదనిగ్రహించి జనార్ద నుఁడు అక్రూరునితో సభామధ్యమున“మణిశ్రేష్ఠమయిన యే రత్నము నీహస్తగతమయియున్నదో దానిని నాకిమ్ము నాయందు అనార్యమయిన దేనిని ఆచరింపకుము. అరువది సంవత్సరములు గడచినవి. నాయందప్పుడు సంరూఢమయి ఏదోషమున్నదో అది అనేకపర్యాయములు నీవొనరించిన యసత్కార్యములవలన,నున్నది చాలకాలమునిగిపోయినది”అనెను, అంతసర్వ సాత్వత సభలో కృష్ణునియొక్క పలుకుల వలన, మహామతియైన అక్రూరుఁడు బాధారహితముగ మనస్సులోనే క్లేశమొందక మణినీ కృష్ణునీ కొసంగెను. అంత అరిందముఁడైన కృష్ణుఁడు బభ్రు(అక్రూరుని) హస్తములనుండి ఆర్జవప్రాప్తమైన మణిని గ్రహించి సంహృష్టమనస్కుడై, సంతుష్టుఁడై అక్రూరునకు మరల దానిని కృష్ణుం డొసంగెను.
మణిరత్నమయిన యాస్యమంతకమును కృష్ణుని హస్తమునుండి పొంది అక్రూరుఁడు దానిని ధరించి సూర్యునివలె ప్రకాశించెను. విశుద్దము ఉత్తమమునయిన యీ మిథ్యాభిశప్తికమైన వృత్తాంతమును ఎవ్వఁడెఱుంగునో, తెలిసికొనునో) ఆతఁడు మీథ్యాపవాదము నెన్నడును పొందఁడు. వృష్టియొక్క కనిష్ఠ కుమారుఁడయిన అవమిత్రునకు 'సీని'జన్మించెను. అతని కుమారుఁడు సత్యకుఁడు ఆతఁడు సత్యవంతుఁడు, 'సత్యసంపన్నుఁడు. సత్యకునకు కలిగినవాడు యుయుధానుఁడు ఆతనికి భూతి కుమారుడు భూతికుమారుఁడు యుగంధరుఁడు ఆతఁడు భౌత్యుఁడుగా ప్రశస్తిబడసెను. వృష్టి యుధాజిత్తుకుమారుఁడు. యుథాజిత్తు మాడియొక్కసుతుఁడు, శ్వఫల్క్యుడు,చిత్రకుఁడును సృష్టియొక్క కుమారద్వయము. ధర్మాత్ముఁడయిన శ్వఫల్కుండేటనుండునోఅనావృష్టిభయముగాని, వ్యాధిభయముగాని యందు లేదు, ఓబ్రాహ్మణులారా! ఒకప్పుడు ఇంద్రుఁడు,శక్తిమంతుఁడయిన కాశిరాజుయొక్క దేశమున మూఁడుసంవత్సరములు వర్షింపలేదు. కాశీరాజు శ్వఫలుని చక్కగా పూజించి కాశీ యందు నివసింపఁజేసెను, శ్వఫలునీయునికిచే ఇంద్రుఁడందు వర్షించేను.శ్వఫల్కుడు కాశీరాజుయొక్క సుతను భార్యగా పొందెను. ఆమెపేరు - గాందిని, ఆమెప్రతిదినమొక గోవును బ్రాహ్మణునకుదానముచేసెను. ఆగాందిని ఆమెల్లిగర్భమున పెక్కువందల లేండ్లుండిపోయేనని చెప్పుదురు. ఆమబయటికి రాలేదు. ఆమెగర్భమునందుండగనే ఆమెతోతండ్రీ“ నీకు భద్రమగాక,వెంటనేపుట్టుము. ఎందులకీనందుండెదవు" అనెను, గర్భస్థయైన యాకన్య ఇట్లు పలికెను.” నీవు ప్రతిదినము నోక గోవు నోసంగినచో మూడేండ్లలో నేను దయించెదను.” అనెను. ఆమె తండ్రి ‘యట్లే' యనెను. ఆమె కోరికను పరిపూర్తిచేసెను.
శ్వఫల్కుని వలన ఆమె కుమారుఁడు అక్రూరుఁడు. ఆతఁడు దాత, యజ శూరుఁడు, వేదవిద్వాంస్తుడు అతిథిప్రియుఁడు (వీరుకాక ఆమె కీతర సంతతి కూడ కలదు). ఉపమండు, మంగుడు, మృదురుడు, అరీమేజయుండు గిరిరక్షుఁడు యక్షుడు, శత్రుఘ్నుడు, అరీమర్ధనుడు, ధర్మవృద్ధుడు సుకర్ముడు, గంధమాదుడు ఆవాహుఁడు మఱియు ప్రతివాహుఁడు, వసుదేవ అమెవరాంగన, అక్రూరెగ్రసేనిలకు ఇరువురు కుమారులు. వారు వంశదీపకులు. దేవసన్నిభులు, వారు దేవవంతుఁడు, అనుపదేవుఁడును, చిత్రకునకు 10 మంది కుమారులు - పృథువు, వీపృథువు, అశ్వగ్రీవుఁడు, అశ్వవాహుఁడు, సుపార్శ్వకుఁడు, గవేషణుఁడు, అరిష్టనేమి, అశ్వాస్యుఁడు, సువర్మ, వర్మభృత్ అభూమీ బహుభూమి. శ్రవిష్ణ శ్రావణులు అను నలుగురు కుమార్తెలు. కాశీరాజుకూతురు నలురుకుమారులకనెను. వారు కుకురుఁడు, భజమానుఁడు, శుచి, కంబలబర్లీషుడు. కుకురుని కుమారుడు వృత్తి, వృష్టియొక్కతనయుఁడు కపోతరోముఁడు విలోముఁడు కపోతరోముని కొమరుఁడు. రోమకుని కుమారుఁడు అధకుఁడు. ఇతఁడు తుంబురుసఖుఁడు; విద్వాంసుఁడును. ఇతనికీ చందనోదకదుందుభి అనీవేరొకనామము. ఇదికూడ ప్రసిద్ధము. ఆతని కుమారుఁడు అభిజిత్తు; అభిజిత్తు కుమారుఁడు పునర్వసువు ఈ మహారాజు (అభిజిత్తు) పుత్రార్థము అశ్వమేధ మాచరించెను. ఆ యాగము జరుగుచుండ అతిరాత్రమాచరించుచుండ, సభామధ్యమున పునర్వసు ఉదయించెను. ఆకారణమున పునర్వసు విద్వాంసుఁడు,ధర్మజ్ఞుం డు, దాత, యజ్వయయ్యెను. తరువాత అభిజిత్తునకు మటియిద్దరు కొమరులు కలిగిరీ.
వారిరువురు ఆహుకుఁడు, ఆహుతియు. ప్రసిద్ధులు. శ్రేష్ఠులు మతిమంతులు. ఆహుకుని గూర్చి యీ క్రింది శ్లోకము నుదహరించెదరు“ఆతని దశ సహస్ర సంఖ్యల రథములు మేఘఘోషాన్వితములు కలవు. అయ్యప్ ఉపసంగములతో (అమ్ముల పొదులతో) అనుపసంగములతో (యాక్సిలేటర్స్), ధ్వజములతో, వరూధములతో, ఉపపన్నములై యున్నవి. ఆతనీ రాజ్యములో అసత్యవాదులు లేరు. యజ్ఞము లాచరింపనీవారు లేరు; వేలాది నాణెములను దానముగా నొసంగని వారు లేరు. అశుచిమంతుఁడు, అధర్మాత్ముండు, అవిద్వాంసుఁడు, కృశీభూతుఁడు కానీ లేం డు. ఆర్ధకుని పుత్రుఁడు ధృతి, (ఆర్ధకుడు ఆధుకుఁడు కావచ్చు?) అని విందుము ఆహుకుఁడు తనపరివారముతో, ఎనుబది లక్షల కిశోర సన్నిభములయిన హయములతో, అప్రతిముఁడై తూర్పుదేశాభిముఖముగా దండయాత్ర కరిగెను. అంతీయసంఖ్యఏనుగుల బలముగల భోజుని -అతిశయించెను. ఈదండయాత్రలో ఏనుగుల బంధించుటకు అతఁడు బంగారముతో వెండితో చేయబడిన, ఇరువది యొక్క వేయి (బంగారు) తాళ్లను పొందెను. ఉత్తరిదిగ్విజయయాత్రలో భోజునివలన ఇరువదియొక వేయి ఏనుగుల ఘంటలను గొనెను. తన్మూలమున ఆతని యాత్ర కింకిణీ ధ్వనియుతమయ్యెను. ఆహుకుఁడు తన సోదరియైన ఆహుకినీ అవంతీ యువరాజునకు వివాహమున నొసంగెను. కాశీ రాజు కూతునకు ఆహుకునకు ఇరువురు పుత్రులు పుట్టిరి.వారు దేవకుఁడు, ఉగ్రసేనుఁడు. వారుభయులు దేవగర్భసమానులు. దేవతలతో నుపమింపఁదగిన వీరులైన కుమారులు దేవకునకు కలిగిరి. వారు దేవవంతుఁడు, ఉపదేవుఁడు, సుదేవుఁడు, దేవరక్షితుఁడును. వారికి ఏడుగురుచెల్లెండ్రు వారిని వసుదేవునకిచ్చి వివాహముచేసిరి. వారు - ధృతదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవ, శాంతిదేవ, సహదేవ - వారి యందరిలో చిన్నదీ దేవకి. ఆమె చారుదర్శన, ఉగ్రసేనునకు తొమ్మండ్రు కుమారులు. వారిలో పెద్ద కంసుఁడు. పైవారు కంసుని చెల్లెండ్రు - న్యగ్రోధ, సునామా, కంకా, శంకు, సుభూమి, సుతను, రాష్ట్రపాల, యుద్ధతుష్ట తుష్టిమంతుడు పుత్రులు.
వారికి చెల్లెండ్రు ఐదుగురు. కంస, కంసవతీ, సుతనూ, రాష్ట్రపాలీ, కంకా ఉగ్రసేనునకు చాలసంతతి. అందుచే కుకురోద్భవమయిన వంశము వర్ణింపఁబడినది. తేజస్వంతులయిన కుకురుల యొక్క యీ వంశమును. నెంగినవారు విపులమైన స్వీయవంశమును ప్రజలను (బిడ్డలను) కలిగియుందురు. భజమానుని పుత్రుఁడు విదూరథుఁడు. ఇతఁడు రథికులలో ముఖ్యుడు. శూరుఁడు విదూరథుని కొమరుం డు అతఁడు రాజాధిరాజయ్యను. శూరునకు బలవత్తరులయిన కుమారులు గలిగిరి. వారు చాతుఁడు, నివాతుఁడు, శోణితుఁడు, శ్వేతవాహనుఁ డు, శమి, గదవర్మ, నీదాంతుఁడు; ఇతఁడు శత్రుజిత్తు, శమీపుత్రుఁడు, ప్రతిక్షత్రుఁడు. ప్రతిక్షత్రుని కుమారుఁడు స్వయంభోజుఁడు. హృదికు డు స్వయంభోజుని కుమారుఁడు హృదీకునీ కుమారులు పదిమంది, వారు భీమపరాక్రములు.వారిలో జ్యేష్ణుఁడు కృతవర్మ. శతధన్వుడు వారీలోమధ్యముఁడు మరియితరులు-దేవబాహువు, సబాహువు, భిషక్, శ్వేతరథుఁడు; సుధాంతుడు, అధింతుఁడు, నకుఁడు, కనకోద్భవుఁడు దేవబాహువునకు కంబలబర్టీ కుమారుడు అతఁడు విద్వాంసుఁడు, అసమౌజసుఁడు ఆతనికుమారుఁడు వేడొకసుతుఁడు సుసమౌజుండు. అతఁడు మిక్కిలి ప్రఖ్యాతుఁడు. పుత్రులు కలుగని అసమజుసునకు, కృష్ణుఁడు సుచంద్రుని వసురూపుని కుమారులుగా నొసంగెను. ఆ విధముగా అంధకులు సంస్మరింపఁబడిరి. అంధకుల యొక్క యీ వంశమును నిత్యము కీర్తించిన, వారు తమకు విపులమయిన. వంశమును పొందుదురు. సంశయములేదు. అశ్మకి యందు శూరుడు దేవమీఢునీ కనెను. శూరునివలన మారిషి యందు పదిమంది పుత్రులు పుట్టిరి. పూరిషి భోజవంశమునకు చెందినది. పుట్టర్, మారిషి భజవంశమునకు చెందినది.
ముందుగా మహాబాహులైన వసుదేవుఁడు పుట్టెను. ఈతఁడు ఆనకదుందుభిగా ప్రసిద్ధుఁడు. ఏలయన ఆతఁడు పుట్టినప్పుడు ఆనకముల మహాధ్వానము ఆకసమున మ్రోగేను. మషుష్యలోకమునందంతటను ఆతనితో రూపసౌందర్యమున సమానుఁడు లేడు. ఆతని (ఆ పురుషాగ్రేసరుని). కాంతి చంద్రసమముగ నుండెను. ఆతని నుండీ తరువాత క్రమముగా దేవభాగుఁడు, దేవశ్రవసుఁడు, అనాధృష్టి, వృకుఁడు, నందకుం డు, సృంజయుఁడు, శ్యాముఁడు, శమీకుఁడు, గండూషుఁడును జనించిరి. ఐదుగురు వరాంగనలు చేల్లెండ్రు. వారు పృథా, శ్రుతదేవా, శ్రుతికీర్తి, శ్రుతశ్రవ, రాజాధిదేవీ. ఈ యైదుగురు వీరమాతలు. శూరుడు తనకుమార్తెయయినప్పథను, కుంతి భోజునకు నొసంగెను. అందుచేతనే కుంతి కుంతిభోజాత్మజగా పృథగా స్మరింపఁబడు చున్నది. కురువీరుఁడయిన పాండుముఖ్యుండు ఆమెను భార్యగా పొందెను. తరువాత పృథ అగ్నిసమ. తేజస్వులయిన మువ్వురు పుత్రులను కనెను. యముని వలన (ధర్మునివలన) యుధిష్ఠిరుని, వాయువు వలన వృకోదరనీ, ఇంద్రుని వలన ధనంజయుని పుత్రులుగా బడసెను, మాద్రవతి వలన అశ్వనీదేవతలుదయించిరని విశ్రుతీ, పోరు నకులుఁడు, సహదేవుఁడును; వారు రూపసత్త్వ గుణాన్వితులు. శ్రుతదేవయందు వృద్ధశర్మ కుమారుఁడు. అతడు కరూషాధిపతికి వీరుఁడు మహాబలుఁడైన దంతవక్రుఁడు. శ్రుతికీర్తియందు కైకయప్రభువు సంతర్దనుని కనెను, ఆతఁడు బలవంతుఁడు. అట్లే ఇంకొక జంట చేకితాన భృహక్షత్రులు మహాబలురు పుట్టిరి.
మహాబలురయిన విందానువిందులు సోదరులు. అవంతిప్రభువునకు పుట్టిరి (రాజాధిదేవికి కుమారులుగా). చేది. ప్రభువయిన శిశుపాలుం డు శ్రుతశ్రవకు రాజర్పియునైన వీఖ్యాత పౌరుషుఁడు దమఘోషునకు పుట్టెను. అతని శౌర్యము సుప్రఖ్యాతము. పూర్వమీతఁడు దశశిరస్కుడయిన రావణుఁడు. ఆ రావణుఁడు అరిమర్ధనుఁడు ఆతఁడు (రావణుఁడు) వైశ్రవణుని యొక్క అనుజుఁడు కుంభకర్ణుఁడీతనియనుజుఁడు వసుదేవునకు పదుమువ్వురు పత్నులు. వారువరాంగనలు. వారు- పౌరవి, రోహిణి, మదిర, భద్ర, వైశాఖీ (ఐదవది) సుమానిని (తరువాత) సహదేవ, శాంతిదేవ, శ్రీదేవ దేవరక్షిత ధృతదేవ ఉపదేవ, దేవకి (ఏడవది) వీరు ఆతని (వసుదేవుని భార్యలే). సుగంధ, వనరాజి పరిచారికలయిన ఇరువురు కన్యలు ఆతనికీభార్యలయిరి. రోహిణి పౌరవిలు బాప్తీకునచెల్లెండ్రు,మహాభాగయైన రోహిణీ ఆనకదుందుభియొక్క జ్యేష్ఠపత్ని. రోహిణీ రాముని, సారణుని, : శరుని, దుర్గముని, దమనుని, శుక్రుని, పిండారకుని, కుశీతకుని కనెను. అంతీయేకాక, చిత్రయనునట్టి కుమారీకను రోహిణీ కనెను.నిశరుఁడు,ఉల్ముకుఁ . డు,రామునిప్రసిద్దకుమారులు, అట్లే, పార్వి,పార్వమర్ధి, శిశు,సత్య,ధృతి. మందబాహుడుఅనువారుకూడ రాముని కుమారులు. గిరిక,గిరి, శుల్క గుల, అతిగుల,దరిద్రాంతక -అనువారు సారణునికుమారులు. సారణునకు ఐదుగురు కూతులు కూడ కలరు. వారినామముల నేఱుంగుఁ డు.వారు అర్చిష్మతి, సునంద, సురసా, సువచా, శతబలా, వీరు సారణుని కూతుండ్రు భద్రా, భద్రగుప్తుడు,భద్రవిష్ణుడు భద్రబాహువు, భద్రరథుఁ డు భద్రకల్పుఁడు,సుపార్వకుఁడు, కీర్తిమంతుఁడు రోహితాశ్వుఁడు. అనువారు శరుని కుమారులు.
దుర్మదుని కుమారుఁడు అభీభూతుఁడు. వీరందరు రోహిణి యొక్క కులజులుగా ప్రసిద్దులు. నందుఁడు, ఉపనందుఁడు, మిత్రుఁడు, కుక్షీమిత్రుడు బలుఁడు, చిత్రుఁడు, ఉపచిత్రుఁడు, కృతకుఁడు, తుష్టి, పుష్టి-వీరందరు మదిరయొక్క కుమారులు. వారు మదిరకు వసుదేవుని వలన కలిగిరి. బింబుఁడు, ఉపబింబుఁడు, సత్త్వదంతుఁడు, మహౌజసుఁడు- వీరు నల్వురు మహాబలులుగా విఖ్యాతలు. అంతియేకాక భద్రయొక్క పుత్రులుగా ప్రసిద్ధులు. వైశాలి యందు వసుదేవునకు (శౌరి) ఉత్తముఁడయిన కౌశికుని కనెను. శారికి (వసుదేవునకు) దేవకి, వలన సుషేణుఁ డు, కీర్తిమంతుఁడు ఉదర్శీ, భద్రసేనుఁడు పంచముఁడు ఋజుదాయుఁడు, భద్రదేవుఁడు - అను ఆర్గురు పుట్టిరి. వారినందరను కుంసుఁడు చంపెను. ఇట్టి యవస్థ యందు లోకనాథుఁడయిన విష్ణువు ఆయుష్మంతుడగు కృష్ణుండుగా మరల నొకమారు పుట్టెను. ఆమె తరువాత భద్రభాషిణియైన సుభద్ర కలిగెను. వృష్టివంశ నందనీయైన యీమె కృష్ణా సుభద్రయనీ ఖ్యాతిపొందెను. మహారథియైన యభిమన్యుఁ - డు సుభద్రకు పార్థునీవలనఁగలిగెను. వసుదేవునిభార్యలు మహాభాగలునైన ఏడుగురియందు, శూరులయిన వారెవ్వరు జన్మించిరో వారిని గూర్చి తెలిసికొనుము. పూర్వుఁడు - మతి యితరులు, సహదేవుని కుమారులుగా వసుదేవునకు జన్మించిరి. శాంతి దేవుఁడు, శౌరి వంశోద్వహుఁడైన. జనస్తంభుని కనెను. వృకదేవి యందు మహాత్ముడయిన ఆగావహుఁడుదయించెను. శ్రీదేవికి మందకుఁడను కుమారుఁదయించెను. ఉపసంగుఁ, డు, వాసువు అను ఇరువురు పుత్రులను దేవరక్షితుఁడు కనెను, వీరు మొత్తము పదిమంది పుత్రులు. కంసుఁడు వీరిని కూడ చంపించెను.
శిశిరావతి, విజయుఁడు, రోచనుఁడు, వర్ధమానుఁడు, దేవలుఁడు అను మహాత్ములను పుత్రులనుగా కనెను. ఏడవభార్య దేవకి మహాభాగం - డు సునాముఁడునయిన గవేషణునీ కనెను, ఆతఁడు యుద్ధములయందు విచిత్రశక్తిగల యోధుడు. ఓ బ్రాహ్మణులారా ! పూర్వమున పురోద్యానముల సంచరించుచు వసుదేవుఁడు వైశ్య యందు శ్రద్దాదేవిని, అవ్యయుఁడయిన కుశీకుఁడను పుత్రుని కనెను. సుగంధియు, వనరాణియుకూడ శారియొక్క భార్యలు. పుండ్రుఁడు కపిలుఁడు సుగంధి కుమారులు. వీరిరువురిలో పుండ్రుఁడు రాజయ్యేను. కపిలుఁడు . వనమున కరిగెను. వసుదేవునకు వేతాక స్త్రీ యందు వీరుఁడు బలవంతుఁడు నయిన కుమారుండుదయించెను. ఆతఁడు నిషాదుఁడు," ఆతనికి జరుఁడని నామకరణము చేయబడెను. ఆతఁడు ధనుర్ధరులలో నగ్రేసరుఁడు. విఖ్యాతుఁడయిన. మహాభాగుఁడు దేవభాగ్యుని యొక్క సుతుఁడు. దేవశ్రవసు వలన కలిగిన కుమారుని పండిత గౌరవనీయునిగా దలంచిరి. అనాదృష్టి అశ్మకి యందు వీరుడయిన శ్రాద్ధదేవుడను పుత్రుని కనెను. ఆతఁడు. యశస్వి. ఆతఁడు నీవృత్త శత్రుఁడు. శత్రువులఁ జంపినవాఁడు. మహాబలుఁడును. మహాభాగుండయిన ఏకలవ్యుఁడు శ్రాద్ధ దేవునకు జనించెను. ఈతఁడు నిషాదులచే (పెంపు) పరివర్ణింపఁబడెను. అందుచేనతఁడునైషాది యయ్యెను. కృష్ణుఁడు తన కుమారులయిన చారుదేష్ణుని, సాంబుని, సంతానములేని గండూషాషునకు దత్తతగా నొసంగెను. సాంబచారుదేషులు అస్త్రశస్త్ర విద్యలయందారితేరినవారు. రంతి, రంతిపాలుఁడు నందనుని పుత్రద్వయము. ప్రతాపవంతుఁడైన వసుదేవుఁడు అపుత్రుఁడయిన వృకునకు, వీరుఁడైన సౌమీనిని ప్రతాపవంతుఁడైన కౌశికుని పుత్రులుగా నొసంగును. ధనుఁడు వీరజసుఁడు సృంజయుని యొక్క కుమారులు. శ్యామునకు పిల్లలు లేరు.
శమీకుడు భోజ వంశ్యమున పుట్టిన తన్ను కలంకునిగా తలంచుకొని రోజర్షిత్వము వహించి యరణ్యమునకరిగెను, నియమపూర్వకముగ ఎవ్వరీ కృష్ణుని జన్మను గూర్చి చదివెదరో, లేదా బ్రాహ్మణునిచే చదివించెదరో, వారు మహాసుఖమును పొందుదురు. దేవదేవుఁడు, మహాతేజుఁడు, ప్రజాసృష్టికర్త యైన కృష్ణుఁడు మనుష్యులయందు విహరింపగోరి తానుదయించెను ఆతఁడేనారాయణుఁడు, పుష్కరేక్షణుఁడైన, ప్రభువు వసుదేవునకు దేవకియందు, చతుర్బాహువులతో దివ్యరూపశ్రీతోగూడి, వారి తపః ఫలమున, భగవంతుడు యోగియునైన కృష్ణుఁడు మానుషత్వమును పొంది ప్రకటీకృతుఁడయ్యెను. ఆ భగవంతుఁడయిన ప్రభువు, అవ్యక్తుఁడు వ్యక్తిలింగుడును. అవ్యయుఁడు అయిన యతఁడు వ్యయునిగా వారాయణుఁడయ్యెను. సనాతనుఁడు. అయిన హరి నారాయణుఁడయి దేవుఁడయ్యెను. పూర్వమతఁడే ప్రజాపతిగా పద్మయోనినీ సృజించెను. అదితికి పుత్రుఁడయి, యాదవ నందనుఁడు విష్ణువుగా ఖ్యాతినిగనీ ఇంద్రునకు అవరజుఁ (సోదరుఁడయ్యెను. దేవతలందరు అదితికి పుత్రుఁడుగా నుద్భవించిన విష్ణుని ప్రసన్నునిచేసికొనిరి. (ప్రార్థించిరి). యయాతి వంశీయుఁడు ధీమంతుఁడునయిన వసుదేవునకు సురశత్రువులయిన దైత్య దానవ రాక్షసులను వధించుటకు నారాయణుఁడు జన్మను చెందెను. వసుదేవుని కులము నారాయణుని జన్మతోపుణ్యవంతమయ్యెను. జనార్దనుఁడదయించెగా సముద్రములు కంపించినవి. పర్వతములు కదలాడినవి. (203) అగ్నిహోత్రములు ప్రజ్వలించినవి. నారాయణుఁడు జన్మించెను. మంగళకరములయిన వాయువులు వీచినవీ, భూరజస్సు అణఁగి ప్రశాంతమైనది. (204) ఆకాశమున జ్యోతిశ్చక్రమత్యంతముగా ప్రకాశించినది. జనార్దనుడు దయించినదీ అభిజిన్నామనక్షత్రమున. ఆనాటిరాత్రి జయం జయంతి అను పేరుగలది. ముహూర్తము విజయము. అవ్యక్తుఁడు, శాశ్వతుఁడు కృష్ణుఁడు హరి నారాయణప్రభువు.
ప్రజలను మాయచే మోహపరచుచు నారాయణుడుద్భవించేను. ఇంద్రుఁడు ఆకాశమునుండి పుష్పవరమును కురిపించెను. మంగళ యుక్తములయినవాక్కులచే మహరులు గంధర్వులతోకూడి సహస్రసంఖ్యలో మధుసూదనుని స్తోత్రము చేయుచుండిరి. ఆరాత్రి పుత్రుఁడుగా పుట్టిన శ్రీవత్సలక్షణుఁడైన అధోక్షజుని దివ్యములయిన లక్షణములతోచూచీ హృదయములో వసుదేవుఁడు “ప్రభో ! నీ రూపమునుపసంహరింపుము. ఓ తండ్రీ ! కంసుని వలన భయపడితిని అందుచే ఇట్లు చెప్పుచుంటిని. ముందుగా పుట్టిన అద్భుత దర్శనులు జ్యేష్ఠులునయిన సౌతనయులు అతనిచే చంపఁబడిరి” అనెను. వసుదేవుని వాక్కులు వినీ ప్రభువు తన రూపమునుపసంహరించుకొనెను. ఆతనిచే అనుజ్ఞాతుఁడై తండ్రియైన వసుదేవుఁడతనినీ నందగోపుని గృహమునకు తీసికొనిపోయెను. నందుఁడు ఉగ్రసేన గృహమందుండెను. అప్పుడు యశోదకు కృష్ణుని నిచ్చెను. యశోదయు. దేవకియు ఒకే సమయమున గర్భిణులయిరి. యశోద నందగోపవ్రజమున కధిపతీ యయిన నందునీభార్య. వృష్ఠికులమున నే రాత్రి ప్రభువయినకృష్ణుఁడు జన్మించెనో ఆరాత్రియందే కన్య యశోదకుజన్మించెను. మహాయశస్వి వసుదేవుఁడు పుట్టి నఆబిడ్డను రక్షించుచు,యశోదకాపుత్రునొసంగే తాను కన్యను గ్రహించెను. ఆబిడ్డను. ఇచ్చి, ఈ బిడ్డను రక్షింపుమనీ నందగోపునితో పలికెను. నీ కుమారుఁడు యాదవులకు సర్వకళ్యాణదుఁడు కాగలఁడు. ఇతఁడు దేవకీబిడ్డ. నాయొక్క దేవకియొక్క క్లేశములను తోలగించును. అంత ఆనకదుందుభియగు వసుదేవుఁడు ఉగ్రసేనకుమారుఁడయిన కంసునకు శుభలక్షణ కన్య ఉదయించినదని నివేదించెను, తన సోదరికి కుమారుఁ: డు పుట్టెనని కంసుఁడెఱుంగఁడు, దుష్టాత్ముడైన కంసుఁడు ఆబిడ్డను వసుదేవునకు సంతోషముగా నొసంగి -
ఋషయః ఊచుః :-
సూత ఉవాచ :-
“ఈ బాల నీ కూతురైనట్లే నా కూతురు కూడ. సంశయములేదు. ఓ మహాబాహో ! ఈమెను నేను. చంపను. ఆమె యథేష్టముగా ఇష్టమున్నచోటికి పోనిమ్ము” అనెను. ఆకన్య వృప్తిగృహమున పూజింపబడుచు వృద్ధి పొందెను. దేవకీ ఆ బాలను (దేవిని) పుత్రునివలె సంతోషాన్వితయై సంరక్షించెను. కృష్ణుడుగా ప్రజాపతి పుట్టెనని ప్రజలనుకొనిరి. ఆమెను యాదవులందరు కృష్ణుని రక్షించుటకు పుట్టినదని శ్రద్దతో తలంచెదరు. యాదవులందరామెను ఏకాగ్రమనస్సులతో పూజించెదరు. దేవదేవుని యొక్క దివ్యమైన శరీరము ఆమెచే రక్షింపబడినది. ఋషులిట్లడిగిరి. భోజవంశ్యుఁడైన కంసుఁడు వసుదేవుని యొక్క పిల్లలయిన పుత్రుల నేకారణముచే చంపెనో వ్యాఖ్యానింపగోరెదము. సూతుఁడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఆనక దుందుభియైన వసుదేవునీ పుత్రులను పుట్టినంతమాత్రముననే అందరినీ మూఢమతియై కంసుఁడు ఏల చంపెనో వినుఁడు. కృష్ణుఁడు పుట్టినంతటనే భయముచే నివాసాంతరమునకు గొంపోవఁబడెను. ఎట్లు గోవులలో పురుషోత్తముఁడయిన గోవిందుండు సంవృద్దుఁ డయ్యెనో. వీనుడు. దేవకీ వసుదేవుల వివాహము నందు, కంసుఁడు సారథ్యమువహించెను. అప్పుడాతఁడు యువరాజు అప్పుడాకాశమున ఎవనిదో తెలియరానీదొక వాక్కు వినిపించెను. అదియొకదిష్యవాక్కు కంసనామోచ్చారణమాత్రముచే పుష్కలమై లోకసాక్షిణియై యెల్లరు వినిరి. ఓ కంస ! ఎవలెను నీవు ప్రేమకారణమున రథమున తీసికొని పోవుచుంటివో ఆమెయొక్క అష్టమగర్భము నీకు మృత్యువగును” ఆ వాక్యమును విని వ్యథీమతియైన కంసుఁడు వెంటనే ఖడ్గమును చూసి ఆమెను చంపవలెనను కొనెను.
ఋషయ ఊచుః:-
సూత ఉవాచ :-
అంత మహాబాహుఁడు, ప్రతాపవంతుఁడు నయిన వనుదేవుఁడు స్నేహముతో ప్రణయభావముతో, ఉగ్రసేనాత్మజుఁడయిన కంసునితో “క్షత్రియుఁడెన్నడును స్త్రీని చంపరాదు. ఈ విషయములో నొక ఉపాయము ఓ యాదవనందన, నాకు తోచినది ఓ పృధివీపతీ ! ఆమె యెన్మిదవ గర్భమును నేను తెచ్చినీకిచ్చెదను అప్పుడాబిడ్డను యథాక్రమ మాచరింపుము. యజ్ఞపు దక్షిణల విశేషముగా నొసంగు దయామతీ, ఇప్పుడు నీవు. యథేష్టముగా జేయకుము. లేదా ప్రతి శిశువును ప్రత్యేకముగా నీవశ మనోర్చెదను, ఓ! నరశ్రేష్ఠ. ఈ విధముగా. నయనచో ఆ ఆకాశవాక్కు కూడ అసత్యము-కాదు”. అని చెప్పి కంసు. ననునయించెను. ఆ పొక్కు నాతడంగీకరించేను. వసుదేవుఁడు. భార్యను చేరి ముదితుఁ. డయ్యెను. దుర్మార్గుఁడు పాపకర్ముఁడునయిన కంసుఁడు వసుదేవపుత్రులను.వధించెను. ఋషులిట్లు ప్రశ్నించిరి. వసుదేవుడెవడు? యశస్వినియైన దేవకి యెవరు? సందగోపుఁడెవఁడు? యశస్వురాలయిన యశోద యెవతే?ఎవ్వరు విష్ణువుని కనీరి, తాతా! యని యెవనిని సంబోధించినారో ఎవరుగర్భమునధరించిరో వారెవ్వరు? అని. సూతుఁడిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. పురుషుఁడు కశ్యపుఁడయ్యెను. అదితి ఆకశ్యపుని ప్రియ ప్రకృతి. కశ్యపుఁడు బ్రహ్మాంశుఁడు, అదితి పృథ్వియొక్కయంశము. నందుఁడు ద్రోణుఁడుగా చెప్పఁబడినాఁడు. యశోద ధర.మహానుభావుఁడు (హరి) దేవకియొక్క కోర్కెలను సంప్రవర్థనమొనరించెను. ఆ ప్రభువు మానుషీతనువును ధరించి భూమిని సర్వభూతములను- యోగాత్ముడైన ప్రభువు యొక్కయోగమాయచే మోహమొందఁజేసి సంచరించెను. వృప్తికుల మందు ధర్మము నష్టము కాగా స్వయముగా ధర్మవ్యవస్థాపనమునుచేయుటకు, అసురులయొక్కప్రణాశనముకొఱకు ఆవిర్భవించెను.
విదర్భ రాజ దుహిత రుక్మిణి;సత్య నగ్నజిత్తుయొక్క కూతురు. సత్రాజిత్తు కూతురు సత్యభామ (వీరందరుకృష్ణునిభార్యలు )జాంబవతీ,రోహిణీ, శైబ్య-మరియు 16 వేలతికనభామలు,కూడకృష్ణునియొక్క ధన్యభామినులు. ఇంతకు పూర్వముచ తుర్దశదేవతాస్త్రీలనుగూర్చిచెప్పఁబడినది. ఇంద్రుం డు దేవతలతో నాలోచించి వసుదేవునకు భార్యలగుటకు దేవతాప్సరఃస్త్రీలలో విశిష్టులయిన వారి నీచ్చటకుపంపెను. వారందరురాజవేశ్మల రాజకుటుంబములలో జన్మించిరి. మహాభాగలైనయీస్త్రీలు విష్వక్సేనుని భార్యలుగా ప్రఖ్యాతలు. రుక్మిణికుమారులు. ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుం డు, సుదేవుఁడు, శరభుఁడు, చార్యుడు, చాగుభద్రుఁడు, భద్రాచారుఁడు మరియు చారువిద్యుఁడు. రుక్మిణి కూతురు చారుమతి. సత్యభాము కుమారులు- సానుఁడు, భానుఁడు, అక్షుఁడు, రోహితుఁడు, మంత్రవిత్తు జరుఁడు, అంధకుడు, తామచక్రి, సౌభరి, జలంధరుఁడు; గరుడధ్వజుం డయిన కృష్ణునకు నలుగురుకూతులు. - భానుసౌభరీకా తామ్రపర్ణీ జరాంధర; ఇంక జాంబవతీ సంతానమును గూర్చి వినుము- భద్రుఁడు, భద్రగుప్తుడు, భద్రచిత్రుఁడు, భద్రబాహుఁడును.. వీరు కుమారులు, భధ్రవతీ, సంబోధినీ, జాంబవతి యొక్క కుమార్తెలు. సంగ్రామజిత్, శతజిత్తు, సహస్రజిత్తు. వీరు విష్వక్సేనునకు సుదేవి వలన కలిగినవారు. నాగ్నజితి కుమారులు - వృకుఁడు, వృకాశ్వుఁడు, వృకజిత్తు, మిత్రబాహుం డు మరియు సునీథుఁడు. వరాంగనయైన వృజినీ నాగ్నజితికుమార్తె. వీరు మరి ఇతరులు - మొత్తము వేయిమంది కుమారులుగా వెలుంగుము. వాసుదేవుని కుమారులు ప్రయుత సంఖ్యలో చెప్పఁబడిరి.
వారిలో ఎనిమివేలమంది రణవిశారదులు. శూరులును. జనార్దనునీ వంశము యథాతథముగా వర్ణింపబడినది. బృహతీ పురుని యొక్క భార్య. సుమతీ, సుమధ్యయును కూడనట్లే. బృహతి (?) బృహదుక్తుని కూతురు. బృహదుక్తుఁడు మహాత్ముఁడైన శీనీ యొక్క కుమారుఁడు ఆమె కుమారులు ప్రఖ్యాతులు, సమితి శోభనులు. వారు ఆనందుడు, కనకుఁడు, శ్వేతుండును. ఆమెకు శ్వేత కూతురు కలదు. చిత్రుఁడు, శూరుం డు, చిత్రరథుఁడు ఆగావహునీ కొమరులు. ఆతని కొక కూతురు కలదు ఆమెచిత్రవతి. (ఆమెయేచిత్రసేన? తుంబునకు ఇరువురు సుతులు. తుంబుఁడు తుంబవర్చసుఁడు వజ్రరుఁడు, క్షిప్రుఁడు - ఉపాసంగుని పుత్రులు. గవేషణుని కుమారులు - భూరీంద్రసేనుఁడు, భూరియు సుధానుఁడత(?)ని కుమారుఁడు. అతఁడు యుధిష్ఠిరకన్యయందుపుట్టెను. కాశ్య(కాశీరాజదుహిత) సాంబునివలన ధైర్యశీలురయిన యైదుగురు తనయులను కనెను, వీరు సత్యతో ప్రకాశించు వీరులుగా గౌరవింపఁబడిరి. మహాత్ములైన యాదవుల పౌత్రులు మూఁడుకోట్లు. ఆ వంశమంతయు, వంశములో నుండువారు అందరు ప్రభువైన విష్ణుని రక్షణలో నున్నారు. సురలు మనుష్యులు ఆతని నిదేశమునకు బద్దులు దేవాసురుల యుద్ధము లందు ఏయసురులు వధింపఁబడిరో వారు మనుష్యులలో పుట్టి మానవులను బాధింతురు. వారివినాశనముకొఱకు యాదవకులములో మరల జన్మించిరి. అందుకొఱకై ఒక వంద మహాత్ములైన యాదవకులజులు సముత్పన్నులైరి. ఇది వృష్టివంశీయుల ప్రసూతి. సూక్ష్మముగా వివరముగా చెప్పఁబడినది, కీర్తి సిద్దిని కోరువారు వారిని కీర్తింపవలెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున డెబ్బది యొకటవ అధ్యాయము.
