భవిష్య మహా పురాణము
132. సాంబోపాఖ్యానమున సూర్యప్రతిమా లక్షణ వర్ణనము
నారద ఉవాచ :
మూ॥ హంత! తే నరశార్దూల! ఆదిత్యస్య విశేషతః
ఏక హస్తా ద్విహస్తావా త్రిహస్తావా ప్రమాణతః తథా సార్థ త్రీహస్తాచ సవితుః ప్రతిమాశుభా
ప్రాసాదాద్ద్వారతో వాపి ప్రమాణం చ ప్రకల్పితమ్ తద్వత్ప్రమాణం కర్తవ్యం సతతం శుభమిచ్ఛతా
ఏక హస్తాభవేత్సౌమ్యా ద్వీహస్తా ధన ధాన్యదా త్రిహస్తా ప్రతిమా భానోః సర్వకామప్రదాస్మృతా
సార్థత్రిహస్తా ప్రతిమా సుభిక్ష క్షేమకారిణీ ఆగ్రే మధ్యేచ మూలేచ ప్రతిమా సర్వతః. సమా గాంధర్వ సాతు విజ్ఞేయా ధనధాన్యావహా స్మృతా
దేవాగారస్య యద్ద్వారం తస్మాదష్టాంశముద్యతా త్రిభాగైః పిండికా కార్యాద్వౌభాగౌ ప్రతిమాభవేత్
అంగులైశ్చ తథా మూర్తిశ్చతుర శీతి సంమితైః విస్తారాయామతః కార్యా వదనం ద్వాదశాంగులమ్
ముఖాత్త్రిభాగైశ్చిబుకం లలాటం నాసికా తథా కర్ణౌ నాసికయా తుల్యౌ పాదౌచానీయతౌ తయోః
నయనే ద్వ్యంగులే స్యాతాం త్రిభాగా తారకా భవేత్ తృతీయ తారకా భాగా త్కుర్యాద్ధృష్టిం విచక్షణః
లలాట మస్తకోత్సేధం కుర్యాత్తత్సమమేవచ పరిణాహస్తు శిరసో భవేద్ద్వావింశదంగుల:
తా॥ నారదుడిట్లనెను. “సాంబా! నీకిపుడు సర్వదేవతల శ్రేష్టప్రతిమల లక్షణములను ముఖ్యముగా సూర్యభగవానుని ప్రతిమలక్షణమును గూర్చి చెప్పెదను-1. సూర్యభగవానుని ప్రతిమ, ఒకటిగాని, రెండుగాని, మూడుగాని, మూడున్నరగాని హస్తములప్రమాణముగ నుండుట శుభప్రదము-2. లేక ప్రాసాదముననుసరించి, ద్వారము ననుసరించిగాని ప్రమాణమును కల్పించి శ్రేయసొముడు ప్రతిమను నిర్మింపజేయవలెను-స, ఏక హాసప్రమాణములు గల ప్రతిమ 'సోమ'యని హసదయపమాణముగలది. 'ధనధాన్యప్రద' యనియు, త్రిహస్తప్రమాణముగలది' సర్వకామప్రద' యనియును చెప్పబడును-4. మూడున్నర హస్తముల ప్రమాణము గలది సుభిక్షమును, క్షేమమును కలిగించును. పైభాగమున, మధ్యభాగమున, అడుగుభాగముననంతట నొకే విధముగ సమముగను కుదురుగను, నున్న ప్రతిమ 'గాంధర్వి'యని తెలియవలెను. అట్టిది ధనధాన్యములను వృద్ధి నొందించును-5. దేవాలయ ద్వారమున నెనిమిదవ వంతునకు సమానముగ ప్రతిమ యగునట్లు నిర్మింపవలెను-6. ప్రతిమ యొక్క పొడవు వెడల్పుల గుణితము ఎనుబదినాలుగంగుళములకు సమానముగ నుండవలెను. అందు పన్నెండంగుళలముల పరిమితిగ ముఖముండవలెను-7. ముఖమునకంటే మూడేసి వంతుల చొప్పున చుబుకము (గద్దువ),ముక్కు నొసలు (నుదురు) ఉండవలయును. చెవులు నాసికతో సమానముగ నుండవలయును. రెండు చెవుల పొడవునకు తగ్గకుండ (హెచ్చునట్లు) పాదములుండవలెను-8. కన్నులు రెండంగుళములు, అందు మూడవ భాగము కంటినల్లగ్రుడుండవలెను-9 నుదురు, తల సమానమైన పొడవు కలిగియుండవలెను. శిరస్సు వైశాల్యము ఇరువది రెండంగుళములుండవలెను.
మూII తుల్యానాసికయా గ్రీవా ముఖేన హృదయాంతరమ్ ముఖమాత్రాభవేన్నాభిస్తతో మేడ్రమనంతరమ్
ముఖవిస్తారణ మురస్తఽతోర్థ్వంతు కటి: స్మృతా
బాహూ ప్రవాహ తుల్యౌతు ఊరూజంఘేచ తత్సమే గల్ఫాధస్తాత్తు పాదః స్యాదుచ్చ్రితశ్చతురంగుల
షడంగుల సువిస్తార స్తస్యాంగుష్ఠాంగుల త్రయమ్ ప్రదేశినీ చ తత్తుల్య హీనా శేషా నఖైర్యుతాః
చతుర్దశాంగులః పాద ఆయామాత్పరికీర్తితః ఏవం లక్షణ సంయుక్తా ప్రతిమార్చ్యా భవేత్సదా
అంసౌ హరేస్తథైవోరూ లలాటంచ సనాసికమ్ నియతే నయనే గండౌ మూర్తేః కుర్యాత్సమున్నతే
విశాల ధవలా వామ పక్ష్మలాయత లోచనే సస్మితానన పద్మస్య చారుబింబాధరస్తథా
రత్నప్రోద్భాసి ముకుట కటకాంగద హారవాన్ అవ్యంగ పద మధ్యాది సమాయోగోఽపి శోభితః
సప్రభో మండలశ్చారుర్విచిత్ర మణికుండలః కరాభ్యాం కాంచనీం మాలాం ప్రోద్వహన్ససరోరుహామ్
ఏవం లక్షణ సంయుక్తాం కారయేదీహిత ప్రదామ్ ప్రజాభ్యశ్చ సదాభానుః శివారోగ్యాభయప్రదః
అల్పాంగాయాం సృషభయం హీనాంగాయామకల్పతా ఖాతో దర్యాంచ క్షుత్పిడా కృశాయాంతు దరిద్రతా
సక్షతాయం భయం శస్త్రాత్ప్సుబితా మృత్యుకారిణీ దక్షిణావనతాయాంతు వియోగో భవతి ధ్రువమ్
నాలో క్యానాప్యనాలోక్యా రక్ష్యామూర్తిః ప్రశస్యతే
తా॥ ముక్కుతో సమానముగ మెడ, ముఖముతో సమానముగ హృదయ ప్రదేశము, (ముఖమునకు హృదయమునకు నడిమిచోటు) అటుపిమ్మట, ముఖమాత్రస్థలమును వదలి నాభి, అంతమాత్రమే స్థలమును వదలి మగగుటీ, ముఖవైశాల్యము ననుసరించి వక్షఃస్థలము, అందుసగము నడుముండవలెనని చెప్పబడినది-11. బాహువులు ప్రవాహ సదృశములై యుండవలెను. తొడలు, పిక్కలు బాహువులతో సమానములైయుండవలెను. కడుపునకు సరిగా క్రిందుభాగమున నాలుగంగుళములయెత్తుగ పాదములుండవలెను -12. పాదవిస్తృతి మొత్తముగానాఅంగుళములుండవలెను దానికి సరిపోవునట్లు బొట్టనవ్రేలు, జుట్టనవ్రేలు, తక్కిన మూడువ్రేళ్లును గోళ్లతోగూడ నుండవలెను-(13) పాదపు నిడివి పదునాల్డంగుళములుగ నుండవలెను. ఈ లక్షణములుగల ప్రతిమయే పూజకు యోగ్యమైయుండును-14. మూఁపులు, తొడలు, నుదురు, ముక్కు, సరిగానున్న కన్నులు, చెక్కిళ్ళు ఇవి యుబ్బెత్తుగ నుండునట్లు తీర్చవలెను-15. కన్నులు విశాలములై, తెలుపువన్నెగలిగి, సుందరములై అందమైన జెప్పలతో నిడుపులై యుండవలెను. చిఱునవ్వుతో దీపించు మోము దామరకు దొండ పండ్ల వంటి పెదవుల మరియుండవలెను-16. రత్నఖచితములై కాంతులీనేడు కిరీటము, కటకములు, (కడియములు) కేయూరములు, (బాహుపురులు) హారములు మున్నగు నాభరణములతో సూర్యమూర్తి శోభాయమానుడై ప్రకాశించుచుండవలెను. నిపుణముగ చెక్కబడిన పాదములు, నడుము మున్నగు నవయవములును మనోజ్ఞములగు నాభరణములచేఁగూర్పబడి యండవలెను-17. చెవులకు నైగనిగ్యముతో మెఱయుచున్న, మండలాకృతిగ సుందరములైన విచిత్ర మణికుండలముల నమర్పవలెను. ఒక చేత సువర్ణమాల మఱియొక చేత తామర పువ్వు ధరింపజేయవలెను-18. ఇట్లు మనోవాంఛాసిద్ధిప్రదమైన, సలక్షణమైన ప్రతిమను నిర్మింపజేయవలెను. భానుదేవుడు ప్రజలకెల్లవేళల శుభమును, ఆరోగ్యమును, అభయమును ఇచ్చుచు కాపాడుచుండును-19. ప్రతిమ అల్పాంగములు గలదైనచో రాజులకు భయము. అంగములలోటుపాట్లు గలదైనచో దారిద్ర్యము. కడుపులోఁతుగనున్నచో ఆఁకలి బాధ. కృశించియున్న యెడల లేమియు సంభవించును-20. ప్రతిమ యొంటిపై గాయములు, గాట్లుపడియున్నచో శస్త్రముల వలన భయము, పగుళ్ళువారి యున్నచో మృత్యుప్రదము. దక్షిణ దిశగా వంగియున్నచో నాయుఃక్షీణము-21. ఉత్తరమునకు వంగియున్నచో వియోగము కలుగుట నిశ్చయము. ప్రత్యక్ష పరోక్ష స్థితులందెల్ల వేళల ప్రతిమను కాపాడు చుండుట ప్రశస్తము.
మూ॥ తస్మాద్భాస్కరభక్తేన లోకద్వయ హితైషిణా తన్మూర్తెశ్చాదరః కార్యస్తదధీనాస్తు సంపదః
శిరోరుగండవదనైః సర్వాంగావయవైస్తథా ఏవం లక్షణ సంపూర్ణా ప్రతిమా భవతే శుభా
నాసాలలాట జంఘోరు దండవక్షోభిరన్వితా కుర్యాదాదిత్యవేషంతు గూడపాదోదరం తథా
కమలోదర కాంతినిభః కంచుక గుప్తః ప్రసన్నముఖః రక్తోత్పల ప్రభామండలశ్చ కర్తు:శుభం కరోత్యర్కః
కుండల భూషితవదనః ప్రలంబహారోఽపి గృహవృత్తః, నృపతి భయం వ్యంగాయాం హీనాంగాయామ కల్పనా కర్తు:
ఖాతో దర్యాం క్షుద్భయ మర్థ వినాశః కృశాంగాయామ్ మరణంతు సక్షతాయాం శస్త్రనిపాతేన నిర్దిశేత్కర్తుః
వామోన్నతాతు పత్నీం దక్షిణావనతా హినస్త్వాయుః అంధత్వ మూర్థ్వ దృష్టిః కరోతి చింతామధోముఖీ దృష్టిః
సర్వప్రతిమా స్వేవం శుభాశుభం భాస్కరేణోక్తం బ్రహ్మకమండలుకర శ్చతుర్ముఖః పంకజస్థశ్చ
స్కందః కుమారరూపః శక్తిధరో బర్హి కేతుశ్చ శుక్ల శ్చతుర్విషాణో ద్వీపో మహేంద్రస్య వజ్రపాణిత్వమ్ తిర్యగూర్ధ్వ లలాట సంస్థం తృతీయ మపిలోచనం చిహ్నమ్
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్పే సాంబోపాఖ్యానే శ్రీ సూర్యప్రతిమలక్షణ వర్ణనం నామ ద్వాత్రింశదుత్తర శతతమోఽధ్యాయః
తా॥ కాబట్టి యిహపరములలో శ్రేయస్సున పేక్షించు సూర్యభక్తుడు సూర్యుని ప్రతిమను మిక్కిలి యాదరముతో చూచుకొను చుండవలెను. ఏలయన సంపదలన్నియు తదధీనములే.-23. తల, తొడలు, చెక్కిళ్లు, ముఖము, ఇతరములగు నవయములన్నియు సలక్షముగ నున్న ప్రతిమయే శుభప్రదమగును-24. ముక్కు, నుదురు, పిక్కలు, తొడలు, లింగము, జొమ్ము, గుహ్యము పాదములు, కడుపు-ఇవియన్నియు సూర్యమూర్తికి కుదురుగ నుండవలెను-25. తామర పువ్వులోపలి వన్నెవంటి వన్నేతో ప్రకాశించువాడును, సన్నని వస్త్రముతోఁగప్పబడిన (కట్టబడిన) అధోభాగము గలవాడును, ప్రసన్నమైన ముఖము గలవాడును, ఎఱ్ఱగలువల కాంతిని బోలు పరివేషములచే నలకంకరింపబడిన ముఖముగలవాడును, వ్రేలాడుచున్నహారములు గలవాడును, భార్యలచే గూడియున్నవాడునునైన ఆ దేవదేవుడు మేలు కలిగించును. ప్రతిమ వికలాంగమయ్యెనేని కర్తకు రాజువలన భయము కలుగును. హీనాంగమయ్యని కర్తజీవితమసమగ్రమగును-27. కడుపు గుల్లగా నుండెనేని యాకలిభయము, అంగములు కృశించినట్లుండెనేని ధననాశము, ప్రతిమ పైన గాట్లుండెనేని కర్తకు శస్త్రపాతము వలన మరణము సంభవించుననియు నిర్దేశింపనగును-28. ఎడమవైపునెత్తుగను కుడివైపునకు వంగినట్లుండిన, భార్యకును, తనకును ఆయువు క్షీణింపజేయును. చూపు, పైయెసగనున్న, గ్రుడ్డితనము, క్రిందుచూపున్నచో, చింతను కలిగించును-29. ప్రతిమలన్నీంటి విషయమునను శుభాశుభఫలములిట్లు స్వయముగ సూర్యభగవానుని చేతనే చెప్పబడినవి. బ్రహ్మదేవుని మూర్తీ, చేత కమండలము కలిగి, నాలుగు ముఖములతో నొప్పారుచు, తామరపువ్వు పై కూర్చుండియుండినట్లు నిర్మింపవలేను-30. కుమారస్వామి విగ్రహము కౌమారదశను స్ఫురింపఁజేయు రూపముతో నుండి, చేతిలో శక్త్యాయుధము ధరించి మయూర ధ్వజముతోఁగూడి యుండవలెను. ఇంద్రుడు వజ్రాయుధపాణియై, నాలుగు దంతములుగల తెల్లని మైరావతమను ఏనుగు నధిరోహించియుండవలెను. అడ్డముగను, నిలువుగను ఉన్న నుదుటిపై మూడవ కన్ను గుర్తుగాగలిగి దిండియుండవలెను.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు సాంబోపాఖ్యానమునందలి సూర్యప్రతిమలక్షణ వర్ణనమను నూట ముప్పదిరెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 132 of the Bhavishya Mahā Purana is as follows:
The complete iconographic specifications for a Sūrya image are given: Sūrya stands upright in a relaxed posture (samabhanga), dressed in northern (Scythian-style) garments including a long coat and boots — the standard iconographic convention for Sūrya images throughout the Gupta period and beyond. He holds a lotus in each of his two hands, wears a crown, elaborate earrings, armlets, and a sun-disc (maṇḍala) behind his head. His complexion is described as the colour of the rising sun — copper-red in some descriptions, golden in others. The two female attendants flanking him — Daṇḍa (the punisher of the unjust) and Piṅgala (carrying the book of karmic records) — are described, along with the seven horses and the charioteer Aruṇa at the base of the image.