నారద ఉవాచ :
అతః పరం ప్రవక్ష్యామి అధివాసనముత్తమమ్ సహస్ర శీర్షాపురుషో మండపం యత్నతో విశేత్
తతోన్యేచ శుచౌదేశే అసంస్పృష్టోప లేపనే మండలం పంచవర్ణైస్తు ఆలిఖేచ్చతురస్రకమ్
పతాకా తోరణచ్ఛత్ర ధ్వజమాల్యాద్యలంకృతమ్ విచిత్ర సువితానాఢ్యం ప్రకీర్ణ కుసుమోత్కరైః
తస్య మధ్వే కుశాస్తీర్ణ మూర్తిః స్థాప్యా వివస్వతః తత్రా స్యావాహానం కృత్వా దద్యాదర్ఘ్యం వివస్వతే
సువర్ణ మధుపర్కాది కృత్వాతత్ర విధానతః దేవస్యదర్శయేద్గాంచ సవత్సాం రోహిణీం శుభమ్
నమో గోపతయే తుభ్వం సహస్రాంశో ప్రసీదమే ఏవ మర్ఘ్యేణ సంపూజ్య పరిధాయచ వాససీ
యజ్ఞోప వీత మాతిధ్యం తథాభ్యంగం తధైవచ వత్సరే వత్సరే తస్య నవమవ్యంగమాహరేత్
శ్రాపణే మాసి రాజేంద్ర పవిత్రం తస్యతద్ధివై బ్రాహ్మణాన్భోజ యిత్వాతు పర్షేవర్షే ప్రయోజయేత్
అవ్యంగం యదుశార్దూల! శ్రావణే మాసి భాస్కరమ్ సర్వ గంధైః సమాలభ్య చందనాగురు కుంకుమైః
అలంకారైరలం కృత్య కుసుమైశ్చ సుగంధిభిః మాలాభిశ్చ విచిత్రా భిరాబద్ధాభి రనేకశః
తా॥ నారదుడిట్లు చెప్పేదొడగెను. “ఇక పై సూర్యదేవునకు గంధమాల్యాదుల చేత వస్త్ర తాంబూలాదుల యొక్క సంస్కారమును (అధివాసనము) గూర్చి చెప్పెదను. “సహస్రశీర్షా పురుషః' అను పురుషసూక్త మంత్రములతో మండపమును ప్రవేశింపవలెను (1) ఉపలేపనాదులచే సంసర్గము నందని వేణోక పరిశుద్దప్రదేశమున ఐదు వర్ణములతో చతురస్ర మండలమును లిఖింపవలెను, (2) అది టెక్కెములు, తోరణములు, ఛత్రములు, టెక్కెపు కంబములు పుష్పమాలికలు మున్నగు వానితో నలంకృతమై విచిత్రమైన మేలుకట్టుతో నొప్పారుచు, వివిధములగు పూల రాశులతో వేదజల్లబడి యుండవలెను (3) దాని నడుమ దర్భలు పరచి అచట సూర్యదేవుని ప్రతిమను స్థాపింపవలెను. (4) అట సూర్యదేవునకు ఆహ్వానము చేసి యతనికి అర్ఘ్యమియవలెను (4) బంగారు పాత్రలో మధుపర్కము మొలగునవి సమర్పించి అటుపై దేవునకు సమర్పింపదగిన లేగతోగూడిన ఆరోగ్యవంతమైన ఆవును నివేదింపవలెను, (చూపింపవలెను) (5) “సహస్ర కిరణుడవైన' ఓసూర్య దేవా! గోపతి పైన నీకు నమస్కారము' అనుచు దేవుని అర్ఘ్యముతో పూజించివస్త్రములను ధరింపజేసి (6) యజ్ఞోపవీతము, నైవేద్యము సమర్పించి, తలయంటీ యిట్లు ప్రతిసంవత్సరము నిర్దుష్టమైన తత్రసాదమును స్వీకరింపవలేను. (7) అది శ్రావణ మాసమునందు ప్రశస్తమైనది. బ్రాహ్మణులకు భోజన సంతర్పణలతో ప్రతి సంవత్సరమునందున దీనిని ప్రయోగించుచుండవలెను. (8) లోపము లేకుండునట్లే సూర్యాధివాస సంస్కారమును శ్రావణమున చేయవలెను. భాస్కరుని వివిధ గంధములతోను, చందనాగురు కుంకుమలతోను (9) అలంకారముల తోను పూజించి, పరిమళ భరితములైన పుష్పములతో, మాలలతో, అనేక విధములుగ చిత్రవిచిత్రములుగ అల్లబడిన హారములతోడను అలంకరింపవలెను.
తతో ధూపం నివేద్యాశు ప్రతిమాగ్రే ప్రయత్నతః సహస్ర శీర్షా పురుషో మండపంచ ప్రవేశయేత్
నమః శంభవేతి మంత్రేణ శయ్యాయాం వినివేశయేత్ విశ్వతశ్చక్షరత్యేవ కుర్యాత్కమల నిష్కలమ్
పునరేవచ పక్ష్యామి సంకలీకరణం శుభమ్ స్నాపనేతు యథాకార్యః స్వదే హెన్యాస ఉత్తమః
ప్రతిమాయాం తథాకార్యోయధా చాలంభనం బుధః “ఓం హుం ఖషోల్కాయ నమో' మూల మంత్రః ప్రకీర్తితః
ఆదిత్యోఽయం స్వయందేవోహ్యక్షరేణోప బృంహితః ఓం కారం విన్య సేన్మూర్ద్ని హుంకారం నా సికోపరి
ఖకారం చ లలాటేతు షకారం పదనే న్యసేత్ లకారం చైన కంఠేతు కకారం హృదయేన్య సేత్
య కారం తు భుజే వామే నకారం దక్షిణే భుజే మ కారం వామ కుక్షౌచ విసర్గం దక్షిణే స్యసేత్
ఓం కారంతు సదా ధ్యాయే జ్జ్వలామాలా సమాకులమ్ హుం కారం శుద్ధ వర్ణాభం ప్రసువంతమలం శుభమ్
ఖకారం చింతయేత్ర్పాజ్ఞో భిన్నాంజన సమప్రభమ్ తరుణాదిత్య వర్ణాభం ఖ కారం చింతయేద్బుధః
షోకారంతు మహాబాహో! హే మ వర్ణం విచింతయేత్ శుక్లపద్మ నిభాకారమకారం చింతయేద్బుధః
జాతీ కుసుమ సంకాశం హ్రీం కారం సర్వవర్ణకమ్ క్షీర వర్ణం సకారంతు చింతయేత్సతతంబుధః
నకారం హిమకుందాభం మకార మమృతాక్షరమ్ హ్రీం కారం విద్యుత్సంకాశం హ్రీం కారం సర్వవర్ణకమ్
క్షీర వర్ణం సకారంతు చింతయేత్సతతం బుధః నకారం స్వర్ణ వర్ణాభం మకారం కనక ప్రభమ్
తా॥ ఆ తరువాత సూర్యప్రతిమ ముందర ధూపము వేయవలెను 'సహస్ర శీర్షా పురుషః' ఆదిగాగల సూక్తముతో మండపమున ప్రవేశింపజేయవలెను (11) నమశ్శంభవే చ', మంత్రముతో శయ్య మీద నుంచవలెను 'విశ్వతశ్చక్షుః, మంత్రముతో నీటి ధ్వనులను అరికట్టవలెను. (12) ఇక శుభప్రదమైన సంకలీకరణమును గూర్చి చెప్పుచున్నాను. స్నాపనము ముగియగనే తన దేహమునందు ‘న్యాసము' చేసి కొనుట ఉత్తమము. (13) ప్రతిమ యందు ఆయా స్థలములను స్పృశించినట్లుగనే న్యాస సందర్భమున స్వదేహభాగములనట్లు స్పృశింపవలెను. “ఓం హుం ఖషోల్కాయనమః” ఇది మూలమంత్రము (14) ఆదిత్యశబ్దములోని అక్షరములే ఈ దేవుని గూర్చి వివరింపుచున్నవి, ఓం కారమును శిరస్సుమీద, హుం కారకమును ముక్కు పైన (15) ఖ కారమును నొసటియందు, ష కారమును ముఖమునందు న్యాసము చేయవలెను. ల కారమును కంఠమున, క కారము హృదయ దేశమున న్యసింపవలెను. (16) య కారము ఎడమ భుజము పైనను, నకారము కుడి భుజము పైనను, మ కారము ఎడమ కడుపు పైనను, విసర్గను కడుపు కుడిభాగమునను న్యాసము చేయవలెను. (17) ఓం కారము నెప్పుడైనను జ్వాలల సమూహములచే చెల్లచెదురుగా నున్నట్లు భావింపవలెను. హుం కారమును శుద్ద వర్ణముతో ప్రకాశించునదిగను శుభమును కలిగించునదిగను ధ్యానించినచో చాలును (18) ఖ కారమును భిన్నాంజనమువలేను, తరుణ్ భాస్కరుని వలేను ప్రకాశించునదిగను ప్రాజ్ఞుడు భావింపవలెను. (19) 'షో' కారమును బంగారు వర్ణమున నుండు నదిగ భావింపవలెను, అ కారమును తెల్లదామర వర్ణము వంటి వర్ణముతో ప్రకాశించునదిగ చింతింపవలెను. (20) హీం కారమును జాజిపూవురంగుతోను, అన్నివర్ణముల కలయికగా, స కారమును పాలవంటి తెల్లని వర్ణము కలదానినిగా భావింపవలెను (21) న కారమును మంచుతో కూడిన మొల్ల పువ్వువంటి వర్ణమున శోభించునదిగ, హీం కారమును మెఱుపుతీగవంటి కాంతిగలదిగనులేక సర్వవర్ణ సమ్మేళనముగను భావింపవలెను. (22) సకారము పాలవలే తెల్లనిదిగ, న కారమును సర్వవర్ణ శోభితముగను. మకారమును బంగారు వర్ణముతో ప్రకాశించునదీగను భావింపవలెను.
తతో దేవం మహాత్మానం సహస్రకిరణం రవిమ్ ప్రసాదాభిముఖం దేవం శయనీయే నివేశయేత్
అగ్నికార్యం తతః కుర్యురగ్ని కుండేషు వై ద్విజాః తతోఽరణ్యాం సముత్థాప్య అగ్నిం లౌకికమేవవా
ప్రజ్వాల్యాగ్నిం విధానేన కుర్యాద్ధోమం విచక్షణః బహ్వృచః పూర్వ కాండేషు యామ్యాం మధ్యందినప్తథా
పశ్చిమేచైవచ్ఛందోగ ఉత్తరేఽ ధర్వణో మతః మధ్యేచ భోజకః కుర్యాద్ధోమం యజ్ఞే యదూత్తమ!
శమి పాలాశౌదుంబరాణి హ్యపామార్గస్తథైవచ ద్వాదశతు సహస్రాణి అష్టౌ చత్వారి ఏవచ
ద్వేత్రీణిచ సహస్రాణి అథవా ఏకమేవహి అగ్నిర్మూర్దేతి మంత్రేణ కుండస్యాలంభనంభవేత్
ఉల్లిఖ్యాభ్యుక్ష్య తేనైవ అగిందూతమితి స్మృతః సంబుధ్యస్వాగ్నే మంత్రేణ గర్ఖాధానంతు కారయేత్
తా॥ అప్పుడు ప్రసన్నమగుటకు సుముఖుడైయున్న మహాత్ముడు, సహస్రకిరణుడునైన సూర్యదేవుని సెజ్జ పై చేర్చవలయును (24) పిమ్మట బ్రాహ్మణులు కుండములయందు అగ్ని కార్యమును జేయుదురు. అరణి యందలి లౌకికమైన అగ్నినే జాగృతముచేసి (25) ప్రజ్వలింపజేసి సశాస్త్ర విధానముగ హవనము చేయవలెను. ఋగ్వేదీయుడు తూర్పు దిక్కునను, మాధ్యందిన శాఖీయుడు దక్షిణ దిక్కునను, (26) యుజుర్వేద శాఖీయుడు పడమర దిక్కున, అధర్వణ వేదీయుడు ఉత్తర దిక్కునను కుండమునందు హోమము చేయవలెను. భోజకుడు కుండము మధ్యభాగమున చేయవలెను (27) జమ్మి, మోదుగు, మేడి, ఉత్తరేను సమిధలతో పన్నెండు వేలు లేక ఎనిమిది వేలు, లేక నాలుగువేలు హవనము చేయవలయును (28) రెండువేలు, లేక మూడువేలు, అథవా ఒక వేయి యైనను చేయవలెను. “అగ్నిర్మూర్టా' మంత్రముతో కుండమునకు స్థల విభజనము చేయబడును (29) అదే మంత్రముతోను, 'అగ్నిందూతం' మంత్రముతోను త్రవ్వుట, తడుపుట చేయవలయునని చెప్పబడినది. 'సంబుధ్యస్వాగ్నే' మంత్రముతో గర్భాధానము చేయింపవలయును.
సీమంతేతి పునస్తత్ర మహామంత్రేణహోమయేత్ జాత కర్మతథా ప్రోక్తం ప్రాణాయామం విదుర్బుధాః
నమః స్వాహేతి మంత్రేణ నామకరణమేవచ అన్నప్రాశన మంత్రేణ అన్నప్రాశన మాదిశేత్
జ్యేష్ఠమగ్రేతి మంత్రేణ తేన చూడోపకర్మణి వ్రత బంధస్య మంత్రేణ ప్రతబంధం సమాదిశేత్
సమావర్తన మిత్యేవ ఆకృష్ణేతి చ హోమయేత్ పత్నీ సంయోజనం చైవ స్వయమేప ప్రకల్పయేత్
అగ్నిహోత్రాదికం కర్మ యజ్ఞ కర్మాణి యానిచ మహావ్యాహృతి మంత్రేణ హోతవ్యాని సమంతతః
మాతృణాం యజ్ఞ భూతానాం బలికర్మ ప్రదాపయేత్ సర్వకామ సమృద్ధ్యర్ధం కారయే దధివాసనమ్
త్రిరాత్రం పంచ రాత్రంచ అహోరాత్రమథాపివా తతః స్వలంకృతాం స్నాతాం మణి రత్నైర్విభాషితామ్
కృత రక్షాం ప్రయత్నేన ప్రతిమామధివాసయేత్ దేవా గారాదథైశానే దిగ్భాగే దివ్యమందిరమ్
కృత్వా కుశ పరిస్తీర్ణే వరాస్తరణ సంవృతే పూర్వ శీర్షాం తథాశయ్యాం శుక్లాం శుక్లాంబరోత్తరామ్
తస్యామావేశయేత్సత్యజ్మహాశ్వేతముపాహరేత్ నిక్షుభా దక్షిణే పార్శ్వే వామే రాజ్ఞీతి కీర్తితా
తా॥ సీమంత మహామంత్రముతోడను హవనము చేయవలెను. అట్లే జాతకర్మ, ప్రాణాయామము చెప్పబడినవి. (31) సమః స్వాహామంత్రముతో నామకరణము, అన్న ప్రాశనమంత్రముతో అన్నప్రాశనము చేయుట కాదేశింపవలేను (32) జ్యేష్ఠమగ్రే మంత్రముతో చూడా కర్మ, ప్రతబంధ మంత్రముతో వ్రత బంధమును చేయింపవలెను. సమావర్తనమున ఆకృష్ణన మంత్రముతో హోమము చేయవలయును. భార్యా సంయోజనమును స్వయముగ కల్పంపవలెను (34) అగ్నిహోత్ర కర్మలు, యజ్ఞ కర్మలు అన్నింటి యందును మహావాహృతి మంత్రముతో హవనము చేయవలయును (35) మాతృకా దేవతలకు, యజ్ఞ భూతములకు బలి కర్మ నిర్వర్తింపవలయును, ఈ అధివాసక కార్యక్రమమును సర్వకామనల సమృద్ధి కొఱకు చేయింపవలెను. (36)మూడు దీనములుగాని, ఐదు దినములుగాని లేక ఒక్కదినముగాని ఇది చేయింపవలెను. స్నానము చేయింపబడినది, చక్కగా అలకంరింపడినది, వివిధ మణులు, రత్నములు మొదలగు వానితో చేయబడిన ఆభరణములు ధరింపజేయబడినది (37) భక్త గణముచేత జాగ్రత్తగా రక్షింపబడుచుండినదియునైన సూర్యవిగ్రహమునిట్లు అధివాసనము చేయ వలెను. దేవాగారమునకు ఈ శాన్య దిగ్భాగమున దివ్యమైన మందిరమును (38) నిర్మించి అందు చక్కగా దర్భలుపరచి దాని పై శ్రేష్ఠమైన తెల్లని వస్త్రములు పరచి, తూర్పదిక్కునకు శిరస్సు నుంచి పరుండునట్లు తలగడ నలంకరించి అందమైన శయ్యను సిద్ధముచేయవలెను. (39) సూర్యమూర్తిని దాని పై పరుండబెట్టవలెను. సూర్యమూర్తికి కుడివైపున నిక్షుభను, ఎడమ భాగమున మహారాజ్ఞిని అలంకరింప జేయవలెను.
దండ పింగల కౌ చాస్య స్థితౌ పాదప్రవేశితౌ తస్యాం సంవేశితాయాంతు శర్వర్యాం ప్రతిమం రమేః
వసేత్తాం రజనీం తత్ర స్తూయమానశ్చతుర్దశమ్ బ్రాహ్మణేర్వందిభిశ్చాపి గీత జ్ఞైశ్చారణేస్తథా
కుర్యాజ్జాగరణంతత్ర సూర్య భక్తి సమన్వితైః ప్రభాతాయాంతు శర్వర్యాం బోధయేద్దృగ్విథానతః
హవిష్యం భోక్తు కామాంసు బ్రాహ్మణాన్భోజకాంస్తథా దక్షిణాభిశ్చ సంపూజ్య తైఃకృత స్వస్తివాచనః
తతో గర్భ గృహస్యాధ మధ్యే కృత్వాతు పిండికామ్ విధి వత్తత్ర సౌవర్ణం న్యసే త్సప్త హయం రధమ్
సర్వ జీజౌషదైశ్చైవ తత్ర ధృత్వా విధానవిత్ దత్వార్ఘ్యం స్థాపయేత్తత్ర యజమానః సహాయవాన్
శంఖ దుందుభి నిర్ఘోషైర్జల ధారా సహాక్షతైః కృత్వా పుణ్యాహ శబ్దంతు ఆలయస్య ప్రదక్షిణామ్
శుభ లగ్నే దినే ఋక్షే పూర్వాహ్ణే భానవే క్షణే ముహూర్తీచ శుభే భానో: ప్రతిమం స్థాపయేద్బుధః
నాథోముఖీం నోర్ధ్వముఖీం నపార్శ్వావనతాం తథా సమా మభిముఖీం చైమాం. ప్రతిమాంచ నివేశయేత్
పత్న్యౌ చాస్యతతః సమ్యకార్శ్వయోర్వినివేశయేత్ నిక్షుభాదక్షిణే పార్శ్వే మహారాజ్ఞీతు వామతః
తా॥ సూర్య మూర్తి పాద ప్రదేశ భాగమున దండ పింగలకులను స్థాపింపవలేను ఏరాత్రి సూర్యమూర్తినట ప్రవేశ పెట్టిరో ఆరాత్రి అంతయునామూర్తినటనే ఉండునట్లు, నలువైపుల నుండియు భక్తు లాదేవుని స్తుతించుచుండునట్లు, చూడవలెను (41) బ్రాహ్మణుల చేత, వందిమాగధులచేత, సంగీతజ్ఞులచేత, చారణులచేత అన్నివైపుల నుండి స్తోత్రములు కీర్తనలు జరుగుచుండునట్లు చూడవలెను. (42) సూర్య భక్తి తత్పరులందరు ఆరాత్రి యంతయు జాగరణము చేయవలెను. రాత్రి తెల్లవారుట తోడనే ఋగ్వేద విధానముగా సూర్యదేవుని మేలుకొలుపవలయును (43) హవిష్యము స్వీకరింపగోరు భక్తులను, బ్రాహ్మణులను, భోజకులను దక్షిణాదులతో పూజించి, వారిచే స్వస్తి వాచనము చేయించి (44) నాభిస్థానమును (బండికంటి నడిమి తూమును) గర్భ గృహమునకు మధ్యగా వచ్చునట్లు అమర్చి, బంగారుతో చేయబడిన ఏడు గుఱ్ఱముల రథమును విధ్యుక్తముగ నట ఉంచవలెను. (45) విధాన విదుడైన యజమాని సర్వబీజములను, ఓషధులను ధరించి అర్ఘ్య ప్రదానముచేసి ఇతరుల సహాయముతో రథమును అచట స్టాపించవలెను. (46) శంఖధ్వాసములు, దుందుభి ధ్వనుల మధ్య సాక్షత జలధార విడువ వలెను. జయజయ శుభ నినాదములతో ఆలయమునకు ప్రదక్షిణమాచరింపవలెను. (47) శుభ తిధి వారనక్షత్ర, రవి హోరా ముహూర్తమున భాస్కర ప్రతిమను రధమునందు స్టాపింపవలెను. (48) క్రిందు ముఖము కాకుండ, ఊర్ధ్వముఖము కాకుండ, ప్రక్కకు వంగి యుండునట్లు కాకుండ, ప్రతిమను సమాభిముఖముగ నుండునట్లు స్థాపింపవలెను. (49) పత్నీమూర్తులను కూడా ఇరువైపుల చక్కగా నుండునట్లు స్థాపింపవలెను. నిక్షుభను రవికి కుడివైపున, రాజిని ఎడమవైపున నిలుపవలెను.
తతస్తదుప హారార్ధం సంభారైః ప్రాక్సమాహృతైః మోదకా యూషికాపూప శష్కులీ భూతశీర్షికైః
కృశరైః పాయసోన్మిశ్రైః సర్వదిక్షుక్షి పేద్బలిమ్ ఇంద్రాయ దేవ పతినే బలినే వజ్రపాణయే
శతయజ్ఞాధి పతయే తస్మై ఇంద్రాయతే నమః త్రాతార మింద్ర మంత్రేణ ఇంద్రస్యావాహనంభవేత్
అగ్నియే రక్తనేత్రాయ జ్వాలా మాలార్చితాయవై శక్తి హస్తాయ తీవ్రాయ తథా చైవాజవాహినే ఆగ్నేయ్యామగ్ని మంత్రేణ వహ్నేరావాహనం స్మృతమ్
దండ హస్తాయ కృష్ణాయ మహిషోత్తమ వాహినే సూర్యపుత్రాయ దేవాయ ధర్మరాజాయవై నమః
యమాయత్వితి మంత్రేణ ముద్రిస్తస్యైవ కీర్తితాః నైరృతే ఖడ్గ హస్తాయ నీలలోహిత కాయచ
సర్వ బాహ్యాధిపతయే విరూపాఖ్యాయవైనమః అంయం గౌరితి మంత్రేణ నైరృత్యాంతు ప్రకల్పయేత్
వారుణ్యాం పాశ హస్తాయ వరుణాయేతి కల్పయేత్ మంత్రేణా వాహనం విద్యాత్పంచనద్యః సరస్వతీమ్
ప్రాణాత్మకాయధూపాయ అవ్యంగా యానిలాయచ ధ్వజ హస్తాయ భీమాయ నమో గంధవహాయచ
తస్యాప్యావాహనం విద్యాద్యద్దేవా దేవ హేడనమ్ గదాహస్తాయ సోమాయ శుష్మిణేనృతాయచ
తా॥ వారికి కానుకల రూపమున సమర్పించుకొనుటకు-ముందే సేకరింపబడియున్న వివిధ సంభారములను అచట నమర్చి పెట్టవలెను. లడ్డువములు, యూషికలు (పప్పుకట్టులు) భక్ష్యవిశేషములు, చక్కిలములు బజ్జికలు, (51) పులగములు పాయసాన్నములు మున్నగు పదార్థములతో ఇంద్రాద్యష్ట దిక్పాలకులకు బలి పెట్టవలెను “దేవతలకు అధిపతివి, బలవంతుడవు, వజ్రాయుధమును చేత ధరించినవాడవు (52) శతమఖుడవునైన ఓయింద్రా! నీకు నమస్కారము' (అని వారివారి విశేషములతో ఆయా దిక్పాలదేవతలను స్తుతించుచు బలి పెట్టవలెను) 'త్రాతార మింద్రం' మంత్రముతో ఇంద్రునికి ఆవాహమగును (53) రక్తనేత్రుడు, జ్వాలామాలకలచే అలంకృతుడు, శక్తియను ఆయుధమును ధరించినవాడు, తీక్షమైనవాడు, అజవాహనుడు అయిన అగ్నిదేవునకు సమస్కారము' ఆగ్నేయ దిశయందు అగ్నిమంత్రముతో అగ్నికి ఆవాహన చెప్పబడినది (54) దండాయుధమును చేత ధరించినవాడు, నల్లనివాడు, మహిషము వాహనముగా గలవాడు, సూర్యపుత్రుడు నైన యమధర్మరాజుకు నమస్కారము (55) యమాయత్వా' మంత్రముతో యముని ముద్రలు చెప్పబడినవి. ఖడ్గహస్తుడు, నీల లోహిత వర్ణమున ప్రకాశించు శరీరముగలవాడు (56) సర్వబాహ్యవిషయముల కధిపతి, విరూపుడుగా ప్రసిద్ధినందిన వాడునైన నిరృతికీ నమస్కారము. 'ఆయంగౌః' మంత్రముచే నైరృతి దిక్కున నిరృతిని భావింపవలెను. (57) పడమటి దిక్కున వరుణ మంత్రముతో పాశహస్తుడైన వరుణుని భావింపవలెను. పంచనదులను సరస్వతీనదినీ మంత్రపూర్వకముగ ఆహ్వానింపవలెనని తెలియవలెను (58) ప్రాణాత్మకుడు, తపింపజేయువాడు, పరిశుద్దుడు, ప్రాణులను బ్రతికించువాడు, ధ్వజహస్తుడు, హయంకరుడనైన వాయుదేవునకునమస్కారము (59) అతని ఆవాహన యద్దేవాదేవ హేడనమ్ మంత్రముతో ననియెఱుంగవలెను గదా హస్తుడు, సోముడు, బలిమిగలవాడు నృగతుడు.
గదా పట్టిశ హస్తాయ సోమరాజాయవైనమః ఈశావాస్యం చ గుహ్యావై సోమ మంత్రః ప్రకీర్తితః
చతుర్భుజాయ దేవాయ పద్మాసనగతాయచ కృష్ణాజిస నిషణ్ణాయ నమో లంబోదరాయచ
గణాధిపతయే దేవ నీలకంఠాయ శూనినే విరూపాక్షాయ రుద్రాయ త్రైలోక్యాధిపతేనమః అభిత్వోశూరనో మంత్ర ఈశాన్యప్రకల్పయేత్
సర్వనాగాధిరాజాయ శ్వేతవర్ణాయభోగినే సహస్రఫణినే నిత్యమనంతాయ నమోనమః
నమోఽస్తు సర్పేభ్య ఇతి మంత్రశ్చైవ ప్రకీర్తితః పంచరాత్రాదిభిర్యాసో హ్యంగన్యాసః ప్రయుజ్యతే
తథోపక్షీరపానైశ్చ స్తుతిస్తోత్రైశ్చ భాస్కరమ్ విప్రేభ్యో భోజకేభ్యశ్చ తతో దద్యాచ్చ దక్షిణామ్
సూర్యక్రతుం మహాపుణ్యం నైవ కుర్యాదదక్షిణామ్ స్థాప్యతే నేన విధినా తద్భక్తి: ప్రతిమా చ యా
సాతు వృద్ధికరా నిత్యం సాన్నిధ్యాచ్చ సదా భవేత్ సప్తజన్మసు తేషాంతు నరోగాః సంభవంతి హి
ఉపాసతే త్రిరాత్రం యే భానో ర్యాత్రాభివాసనే గంధమాల్యోపహారైస్తు తేయాంతిభువనం రవేః
ఆత్మీయం పరకీయంవా ప్రతిమాస్థాపనం రవేః యః పశ్యతి పుమాన్భక్త్యా సస్వర్లోక మవాప్నుయాత్
తా॥ గద, పట్టిశము (అడ్డకత్తి) ధరించినవాడు అయిన కుబేరునకు నమస్కారము ఈశావాస్యంచ గుహ్యా' అనునది కుబేర మంత్రము (61) నాలుగుముఖములు గలదేవుడు, పద్మాసనమున కూర్చుండువాడు. కృష్ణాజినము పై కూర్చుండువాడు, లంబోదరుడు (62) ప్రమథగణములకు అధిపతి, నీలకంఠుడు, శూలాయుధము ధరించువాడు విరూపాక్షుడు, రుద్రుడు, ముల్లోకములకు అధిపతియైన శివునకు నమస్కారము, అఖిత్వా శూరనో' మంత్రమును ఈ శానును కొఱకు భావింపవలెను (63) “సర్పము లన్నింటికి అధిపతి, తెల్లని వర్ణమున ప్రకాశించు శరీరముగలవాడు, వేయిపడగలు గలవాడు నైన అనంతునకు నిత్యమునమస్కరింతును” (64) 'నమో అస్తు సర్వేభ్యః' అను మంత్రము అనంతుని ధ్యానించుటకు చెప్పబడినది. పంచరాత్రాదులచేత అంగన్యాస కరన్యాసములు ప్రయోగింపబడును. (65) అప్పుడు ఆపై పాలవంటి ఉపపానీయములచేత స్తుతులు, స్తోత్రములచేతను భాస్కరదేవుని ప్రసన్నుని చేసికొని బ్రాహ్మణులకు భోజకులకు దక్షిణనీయవలెను. (66) మహాపుణ్యప్రదమైన ఈ సూర్యక్రతువును దక్షిణలు లేకుండగ ఎప్పుడును చేయకూడదు. ఇట్టి విధితో ఏ ప్రతిమ సూర్య భక్తులచే స్థాపింపబడునో (67) అది వారికి నిత్యము సాన్నిధ్యముననే ఉండి వారికి అభ్యదయాభివృద్ధికరమై ఒప్పారుచుండును. ఏడు జన్మలయందును వారిని ఏ వ్యాధులును పీడింపజాలవు (68) గంధ మాల్యోపహారములతో సూర్యాధి వాసోత్సవ కార్యక్రమమున పాల్గొనుటకు మూడురాత్రులు యాత్రచేసిన వారికి సూర్యలోక నివాసము ప్రాప్తించును. (69) తనదైనను లేక ఇతరుల దేవరిదైనను రవి ప్రతిమాస్థాపనము ఘటించిన వానికి స్వర్లోక ప్రాప్తియగును.
దశానామశ్వమేధానాం వాజపేయ శతస్యచ ఫలం ప్రాప్నోతి పురుషః ప్రతిష్టాప్యదివాకరమ్
యావత్కీర్తి: పుణ్యకృతా భానోఃస్థానే నివేశతే తావత్సతు యదుశ్రేష్ట సూర్యలోకే మహీయతే
స్థాపనే చాస్య వై మంత్రః ప్రోకోలోకేషుపూజితః ధ్రువాద్యైశ్చధ్రువా పృథ్వీ ధ్రువం విశ్వమిదంజగత్ శ్రేయసే యజమానస్య తథాత్వంధ్రువతాం వ్రజ
స్థాపయిత్వా రవిం భక్త్యా విధిదృష్టేన కర్మణా మాసే మాసే క్రతు ఫలం లభంతే నాత్ర సంశయః
ఏ కా హేనాపి యద్భానోః పూజయా ప్రాప్యతే ఫలమ్ నతు క్రతు శతైర్వీర! ప్రాప్యతే మానవైర్భువి
కృత్యాపి సుమహతృపం యః పశ్చాత్సేవతే రవిమ్ సయాతి సూర్యలోకేతు సరో విగత కల్మషః
నభవేదిష్ట కానాం చ ద్రవణం భూమి సంమీతి స్వర్గే మహీయతే తావత్కారకో దేవవేశ్మనః
ఖండ స్ఫుటిత సంస్కారం కృత్వాయత్ఫలమాప్యతే నతుక్రతు సహస్రైస్తు ప్రాప్యతే ఫలముత్తమమ్
సికతాయామపి గృహం యుస్తు కుర్యాద్విభావపోః గోపతేః సప్రియసదః ప్రగచ్ఛేద్గోపతేర్వరమ్
ఇత్యేవం సురవరస్యతస్య భానో ర్భూతానాం స్థితి నిలయ ప్రసూతి హేతో:
శ్రీ భాగీ భవతి నరో నిరేతకారీ కల్పానాం వసతి శతం స సూర్యలోకే
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్నే సాంబోపాఖ్యానే సూర్య ప్రతిష్టా వర్ణనం నామ షడ్రింశదుత్తర శతతమోఽధ్యాయః
తా॥ పది అశ్వమేధయాగములు, వంద వాజపేయ యాగములు చేసిన ఫలమును సూర్య ప్రతిష్ట చేసిన పురుషుడు పొందును (71) సూర్యాలయ నిర్మాణముచేయు పుణ్యాత్ముని కీర్తి ఎంత కాలముండునో అంతకాలము అతడు సూర్యలోకమున సమ్మానింపబడును. (72) సూర్యస్థాపన చేసిన వాడు అన్ని లోకములయందును పూజింపబడునను మంత్రమేచెప్పబడినది. స్వర్గలోకము, భూలోకము, ఈ విశ్వమంతయు యజమానుని శ్రేయస్సు కొఱకే నిరంతరము నిలుకడగానుండును. సాంబా! అట్లే నీవును ఇట్టేపుణ్యకార్యము చేసి శాశ్వతత్వమును పొందుము (73) శాస్త్ర దృష్టమైన కర్మలవిధానముగ భక్తితో సూర్య స్థాపన చేసిన యెడల ప్రతి మాసమునందును ఆ క్రతుఫలమును పొందుదురనుటలో ఎట్టి సంశయములేదు (74) ఒక్కదినమైనను సూర్యపూజచేయుటచేత పొందేడి మహత్పలము నూరు క్రతువులుచేయుట చేతనైనను మానవులు పొందజాలరు (75) మహాపాపము చేసినవాడైనను, తదుపరి రవి దేవుని సేవించెనేని పాపములన్నియు పటాపంచలుగా ఆతడు సూర్యలోకమునకు బోవును (76) సూర్య మందిరము యొక్క ఇటుకలు చూర్ణము కానంత వఱకు మందిర నిర్మాత స్వర్గ సౌఖ్యములను అనుభవించుచుండును (77) జీర్ణాలయమును సంస్కరించి ఉద్ధరించువాడు పొందు ఉత్తమ ఫలము వేయిక్రడువులు చేయుట చేత కూడా లభింపదు (78) ఇసుకలో సూర్యాలయమును కట్టించిన వాడైనను-అది సూర్యదేవునకు ప్రియ సభా భవనమగుటచేత సూర్యానుగ్రహమును పొందగలడు (79) ఇట్లు ప్రాణుల సృష్టి స్థితి లయములకు కారణభూతుడైన, దేవతాశ్రేష్ఠుడైన సూర్యభగవానుని ఆలయమును నిర్మించువాడు నూరు కల్పముల వఱకు సూర్యలోకమున నివసింపగలడు.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున, సప్తమీ కల్పాంతర్గత సాంబోపాఖ్యానమున సూర్య ప్రతిష్టా వర్ణన మనెడు నూట ముప్పది యాఱవ అధ్యాయము సమాప్తము.
భవిష్య మహా పురాణము 1 – 136 అధ్యాయములు సమాప్తము
* * * * *
Summary of chapter 136 of the Bhavishya Purāna - Brahma Parva is as follows:
The Brahma Parva reaches its culmination with the complete account of Sāmba's installation of the Sūrya image at Mitravana — the founding moment of organised Āditya-worship in the Kali Yuga. The entire pratiṣṭhā ceremony is narrated from beginning to end: the selection of the auspicious time (Māgha Śukla Saptamī — the Ratha-saptamī), the purification of the site, the installation of the maṇḍala, the bathing of the image, the formal invocation of Sūrya's presence into the image (prāṇa-pratiṣṭhā), and the first complete pūjā performed after consecration. At the moment of prāṇa-pratiṣṭhā, Sūrya Bhagavān himself is said to have appeared in the sky above the temple, radiating a blinding light that was witnessed by all present. The chapter, and with it the entire Brahma Parva, concludes with a statement of the fruits available to any who build, consecrate, worship in, or even visit a Sūrya temple established according to these sacred specifications. --- ## Related pages - [[Bhavishya-Purana]] - [[Pratisarga-Itihas]] - [[Surya-Vamsha]] - [[Samba]] - [[Vikramaditya]] - [[Ratha-Saptami]] - [[Naga-Panchami]] - [[Karttikeya]] - [[Ganesha]] - [[Gayatri-Mantra]]