బ్రహ్మోవాచ :
శ్లో ॥ ఏవం స్త్రీషు మనుష్యాణాం వృత్తి రుక్తాసమాసతః సాంప్రతం చ మనుష్యేషు స్త్రీణాం సముపదిశ్యతే
సమ్యగారాధనాత్పుంసాం రతివృత్తిశ్చయోషితః పుత్రాః స్వర్గాద్యదృష్టంచ తస్మాదిష్టోహి తద్విధి:
కర్తవ్యం నామ యత్కించిత్సర్వం విధిమ పేక్షతే వ్యక్తి మాయాతి వైఫల్యం తదేవారబ్ధమన్యధా
విధ్య పేక్షీణి సర్వాణి కార్యాణ్యవిఫలాన్యపి హేతుభూతాస్త్రి వర్గస్య మహారంభా విశేషతః
సర్వ సాధ్యా విధిజ్ఞాన మాగమైక నిబంధనమ్ సాధ్యం దృష్టమదృష్టంచ ద్వయం వీధిని షేధయోః
శాస్త్రాధికారో నస్త్రీణాం నగ్రంథానాంచధారణే తస్మాదిహాన్యే మన్యంతే తచ్ఛాసనమనర్థకమ్
ఆగమైక క్రియా యోగే స్త్రీణా మధ్యధికారితో మృతే భర్తరి సాధ్వీ స్యాదిత్యాదౌ స్మృతి భాషితమ్
తస్మాత్కార్యమకార్యంవా విజ్ఞాయ ప్రభురాగమాత్ గుణదో షేషుతాః సమ్యక్ఛాస్తి రాజా ప్రజా ఇవ
సత్యేవ ప్రమదాః కశ్చిద్విశేషాధిగతాగమాః యత్తుశాస్త్రాధికారిత్వం వచనం స్యాన్నిరర్థకమ్
కేచిద్వేద విదో విప్రాః కృత్యైర్వేష క్రియాపరాః తథాపి జాతి మాత్రేణ త ఏ వాతాధికారిణః
తా ॥ బ్రహ్మదేవుడిట్లనెను. ఇట్లు స్త్రీల యెడ పురుషులు ప్రవర్తింపవలసిన విధానమును గూర్చి సాకల్యముగా చెప్పితిని. ఇక నిప్పుడు పురుషుల పట్ల స్త్రీల కుండవలసిన వర్తనమును ఉపదేశింతును. పురుషులను చక్కగా ఆరాధించుట, రతి వృత్తి కలిగి యుండుట అనునవి స్త్రీలకు పుత్రలాభమును స్వర్గాద్యదృష్ట ఫలమును కలిగించును. కావున వారా నియమమును పాటింపవలెను. కర్తవ్య మేకొంచెమైనను అది అంతయును విధిననుసరించియుండును. వ్యక్తికి వైఫల్యము కలిగెననగా అది అన్యథా జరిగేడు ప్రారబ్దమగును. విఫలములైనను (సఫలములైనను) కర్మలన్నియును శాస్త్రముననుసరించియేయుండును. మహారంభులు విశేషముగ త్రివర్గ హేతుభూతులగుదురు. సర్వమును సిద్ధింపజేసి కొనువారగుదురు. ఆగమ శాస్త్రపు కట్టుబాటు నెఱుగుటయే వీధీనము. విధి నిషేధములను తెలసికొనుట ద్వారా ఐహిక పారలౌకిక ఫలములను పొందుట దీని వలన సాధ్యము. స్త్రీలకు శాస్త్రాధికారముగాని గ్రంథధారణాధికారముగానీ లేదు. అందుచే కొందఱు స్త్రీ శాసనమనర్థదాయకమనితలతురు. శాస్త్ర విహిత కరులయందు సీలకు భరతో కూడియే అధికారముగలదు, భరు మరణానంతరము సీ. క్రియాయోగము లేక పొదింగ ముండవలెనని స్మృతి వాక్యముగలదు. అందువలన భర్తయగువాడు కార్యాకార్యములను శాస్త్రమునుండి తెలసికొని గుణదోష విషయములందు స్త్రీలను -రాజు ప్రజలనువలె శాసించును. విశేషముగ శాస్త్రములను చదివిన స్త్రీలు కొందఱు కలరు. కాని అది శాస్త్రాధికారిత్వ విషయమున గల స్మృతి వాక్యములకు విరుద్దము. వేదము తెలిసిన వారే యైనను కొందఱు బ్రాహ్మణులు కృత్యముల చేత వేషక్రియాపరులు (నటులు, డాంబికులు)గా నున్నారు. అట్లే నను జాతిమాత్రమైన యోగ్యత చేత అట్టి వారు కూడ శాస్రాద్యధ్యయనమునకు అర్హులు.
శ్లో ॥ క్రియన్తే వేద శాస్త్రజ్ఞైః ప్రయోగాః శాస్త్రలౌకికాః స్థితమేషామదూరేపి శాస్త్రమేవ నిబంధనమ్
వ్యాధ ధీవర గోపాల ప్రభృతీనాంచ దృశ్యతే విష్ట్యంగారక సౌర్యాది దినానాం పరివర్జనమ్
గమ్యాగమ్యాది కార్యేయం నియతాచార సంస్థితి: లోకానాం శాస్త్రవాక్యానాం ప్రాణాః స్వేష్ట నిబంధనా
తస్మాచ్చతుర్ణాo వర్ణానామాశ్రమాణాంచ సర్వశః ముఖ్యగౌణాది భేదానాం జ్ఞేయా శాస్త్రాధికారితా
పౌర్యాపర్యంతు విజ్ఞాతుమశక్యం లోకశాస్త్రయోః తచ్ఛాస్త్రమేవ మంతవ్యం యథాకర్మశరీరవత్
ఆగమేచ పురాణేచ ద్విధైవ నాస్తికగ్రహమ్ మార్గం మహద్భి రాచీర్ణం ప్రపద్యేతా వికల్పధీః
మూలం గృహస్థ ధర్మాణాం యస్మాన్నార్యః పతివ్రతాః తస్మాదాసాం ప్రవక్ష్యామి భర్తురారాధనే విధిమ్
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థసాహస్యాం సంహితాయాం బ్రాహ్మే పర్వణి ఆగమన ప్రశంసానామ నవమోఽధ్యాయః
తా॥ వేద శాస్త్రజ్ఞులు శాస్త్రలౌకిక ప్రయోగములు చేయుదురు. ఈ రెంటికి అంత భేదము లేని సందర్భమునను శాస్త్రమే కట్టుబాటని యెఱుంగువలెను. బోయవారు, జాలరులు, గొల్లలు మొదలగు జాతులలో, విష్టి (భద్ర) కరణము, మంగళ, శనివారములు విడిచి పెట్టుట కనబడుచున్నది. ఈ విచి పెట్టుటయనునది గమ్యాగమ్య కార్య సంబంధమున నియతాచారమై యున్నది. జనులకు శాస్త్ర వాక్యములలో తమ కిష్టమైన ఏర్పాట్లు మాత్రమే ప్రాణప్రదములు. అందువలన నాలుగు వర్ణముల వారికి, నాలుగు ఆశ్రమముల వారికిని ముఖ్యాముఖ్య ధర్మభేదములకు సంబంధించిన శాస్త్రాధి కారిత్వమును తెలిసికొనుట శక్యముకాదు. అందుచేత కర్మ, శరీరముననుసరించినట్లు శాస్త్రమునే మననము చేయవలెను. పరలోకము లేదని వాదించువాని పట్టు, శాస్త్రమునందు లేక పురాణమునందు-రెండు విధములే యుండును. కానీ నిశ్చలచిత్తుడై పెద్దలు నడచిన మార్గమునే అనుసరించుట శ్రేయోదాయకము. స్త్రీలకు తమ భర్తల నారాధించుట గృహస్థ ధర్మములకు మూలము దాని వలన వారు పతివ్రతలగుదురు. అందువలన ఆ ప్రకారము చెప్పెదను.
ఇది శతార్థ సాహస్రత సంహి యగు శ్రీ భవిష్య మహాపురాణమున బ్రహ్మపర్వమునందలి ఆగమ ప్రశంసయనెడు తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 9 of the Bhavishya Purāna - Brahma Parva is as follows:
The supreme authority of the śāstra is affirmed: dharma is knowable only through scripture, and the life of the household must be continuously aligned with śāstric guidance. The pativratā — the woman of complete devotion to her husband — is presented here as the living foundation upon which all household dharma rests. Stories of great pativratās whose tapas-power altered the course of cosmic events are alluded to as testimony that such devotion is not mere social convention but a spiritual force of the highest order. The chapter establishes that a husband's dharma and prosperity are in a direct and mystical sense dependent on his wife's faithfulness and her inner cultivation of devotion.