సమంతురువాచ :
పంచమి దయితా రాజన్నాగానాం నంది వర్దినీ పంచమ్యాం కిల నాగానాం భవతీత్యుత్సవో మహాన్
వాసుకిస్తక్షకశ్చైవ కాలియో మణిభద్రకః ఐరావతో ధృత రాష్ట్రః కర్కోటక ధనంజయౌ
ఏతే ప్రయచ్ఛంత్య భయం ప్రాణినాం ప్రాణజీవితామ్
పంచమ్యాం స్నపయం తీహ నాగాన్ క్షీరేణ యేనరాః తేషాంకులే ప్రయచ్ఛంతి తేఽ భయ ప్రాణ దక్షిణామ్
శప్తా నాగా యదామాత్రా దహ్యమానాదివా నిశమ్ నిర్వాపయంతి స్నపనైర్గవాంక్షీరేణి మిశ్రితైః
యేస్నాపయంతి వైనాగాన్భక్త్యాశ్రద్ధాసమన్వితాః తేషాంకులే సర్పభయం నభవేదితి నిశ్చయః
శతానీక ఉవాచ :
మాత్రాశస్తాః కథం నౌగాః కిం సముద్దిశ్యకారణమ్ కథంచానందకరణం కస్యవా సంప్రసాదజమ్
సుమంతురువాచ :
ఉచ్చైశ్రవా అశ్వరత్నమిదం శ్వేతో జాతోఽ మృతోద్భవః తం దృష్ట్యా చాబ్రవీత్కద్రూర్నాగానాం జననీ స్వసామ్
అశ్వరత్నమిదం శ్వేతం సంప్రేక్షే ఽమృత సంభవమ్ కృష్ణాంశ్చ వీక్షసే బాలాత్సర్వం శ్వేత ముతాంబరే
వినతో వాచ :
సర్వశ్వేతోహ్యయవరో నాస్య కృష్ణోన లోహితః కథం పశ్యసి కృష్ణం త్వం? వినతో వాచ తాం స్వసామ్
కద్రూరువాచ :
వీకేఽహమేక నయనా కృష్ణ బాల సమన్వితమ్ ద్వినేత్ర త్వంతు వినతే! న పశ్యసి? పణంకురు
తా॥ సుమంతుముని యిట్లనెను. పంచమితిధి నాగులకు ప్రియమైనది. ఆనందమును వృద్ధి చేయునది. ఈ తిథినాడు నాగులకు ఒక గొప్ప ఉత్సవము జరుగునట-1. వాసుకి, తక్షకుడు, కాలియుడు, మణిభద్రుడు, ఐరావతుడు, ధృత రాష్ట్రుడు, కర్కోటకుడు, ధనంజయుడు, ఈ మహా సర్పములు ప్రాణులకభయ మిచ్చును-2. పంచమినాడు నాగులకు క్షీరాభిషేకము చేయువారి కులమున నేవరికి సర్పభీతి కలుగకుండ అభయమును, భద్రతను, ధనమును ఇత్తురు-3. మాతృశాపముచేత నహర్నిశలును దహించుకొని పోవుచుండిన సర్పములకు గోక్షీర మిశ్రితమైన జలముతో స్నానము చేయించిన యెడల వానికి దాహశాంతి కలుగును-4. భక్తి శ్రద్ధలతో నాగులకు స్నానము చేయించినవారి కులమున సర్ప భయముండదని నిశ్చయము"-5. శతానీకుడిట్లనెను. నాగులు తల్లి శాపము నెట్లుపొందిరి. ఏకారణము నుద్దేశించి శపింపబడిరి? ఎవరి అనుగ్రహమున శాపమునుండి ముక్తులైరి”-6. సుమంతుముని ఇట్లనెను. దేవదానవులు సముద్ర మధనము చేయగా అందుండి అమృతముతోబాటు ఉచ్చైశ్రవముఅను పేరుగల తెల్లని అశ్వరత్నము పుట్టెను. దానిని చూచి నాగమాతయైన కద్రువ, తన సపత్నియైన వినతతో నిట్లనెను-7. సముద్రము నుండి పుట్టిన ఈ అశ్వశ్రేష్ఠము తెల్లనిదిగా కన్పట్టుచున్నది. కాని చూచితివా! దానితోక వెంట్రుకలు నల్లగా నున్నవి”-8. వినత యిట్లనెను. ఈ అశ్వరాజము మొత్తము తెలుపు వన్నెలోనే యున్నది. నలుపుగాని ఎఱుపుగాని లేదు. నీవు ఈ తెల్ల గుజ్జమున నలుపు నేట్లు చూచుచుంటివి?” అని వినత యనగానే-9. కద్రువ ఇట్లు బదులు పలికెను. నేను ఒంటి కంటితోనే ఈ గుఱ్ఱమును నల్లని తోకతోనున్నట్లు చూచుచుంటిని రెండు కండ్లతో చూచెడు నీకు తోక నలుపు కనుబడుటలేదా? అటులైన పందెము వేయుము.
వినతో వాచ :
మూll అహందాసీ భవిత్రీతే కృష్ణే కేశే ప్రదర్శితే నచేద్దర్శయసే కద్రు మమదాసీ భవిష్యసి
ఏవంతే విపణం కృత్వాగతే క్రోధసమన్వితే వినతాశయనే సుప్తా కద్రూర్జిహ్మమచింతయత్
ఆహూయ పుత్రాన్పోవ్రాచ బాలా భూత్వాహయోత్తమే తిష్ఠధ్వం విపణీ జేష్యే వినతాం జయగర్ధినీమ్
ప్రోచుస్తే జిహ్మబుద్ధిం తాం నాగా మాతాం విగృహ్యతు అధర్మ్యమేతన్మాతస్తే న కరిష్యామతే వచః
తాన్ శశాపరుషా కద్రూ: “పావకోవః ప్రధక్ష్యతి” గతే బహు తిథే కాలే పాండవో జనమేజయః
సర్పసత్రం సకర్తావై భువి హ్యన్యైః సుదుష్కరమ్ తస్మిన్సత్రేస తిగ్మంశుః పావకో వః ప్రధక్ష్యతి
ఏవం శప్త్వా రుషాకద్రూః కించిన్నోక్తవతీ తు సా మాత్రాశప్తాస్తథా నాగాః కర్తవ్యం నాన్వపత్సత
వాసుకిం దుఃఖితం జ్ఞాత్వా బ్రహ్మాప్రోవాచ సాంత్వయన్ మాశుచో వాసుకేఽత్యర్థం శృణు మద్వచనం పరమ్
యాయా వరకులే జాతో జరత్కారురితిద్విజః భవిష్యతి మహాతేజాస్తస్మినాలే తపోనిధి:
భగినీం చ జరత్కారుం తస్మైత్వం ప్రతి దాస్యసి భవితాతస్య పుత్రోఽ సావాస్తీక ఇతి విశ్రుతః
సతత్సత్రం ప్రవృద్ధం వై నాగాసాం భయదం మహత్ నిషేధేత్సుమతీర్వాగిరగ్ర్యాభిస్తం నవిష్యతి
తా॥ వినత యిట్లనెను. గుఱ్ఱపు తోకకు నల్లని వెంట్రుకలు చూపినచో నేను నీకు దాసినగుదును. లేనిచో - అనగా నల్లని వెంట్రుకలు చూపజాలనిచో కద్రువా! నీవు నాకు దాసివి కావలయును-11. ఇట్లు వారు పందెము కాచి కోపముతో తమ స్థానములకు వెడలిపోయిరి. వినత నిదురించియున్న సమయమున కద్రువ ఒక కపటోపాయమును ఆలోచించెను -12. తన పుత్రులైన నాగులను పిలిచి కద్రువ వారితో నిట్లనెను. పుత్రులారా! మీరు శ్వేతాశ్వవాలమున నల్లని వెంట్రుకల రూపముననుండుడు. అట్లు చేసితిరేని, నేను, విజయము నందిచగల వీనతను పందెమున నోడింతును”-13. తన తల్లి పన్నిన కపటోపాయమును గ్రహించి వారు తల్లితో, “ఇది అధర్మము. మేము నీ మాటను పాటింప జాల” మనిరి-14. వారి మాటలు విని కద్రువ కోపముతో “మిమ్ము అగ్ని దహించివేయునుగాక ” అని శపించెను. బహుదినములు కాలము గడచిన పిమ్మట పాండవ వంశీయుడైన జనమేజయుడు-15.ఇతరుల సాయముతో, భూలోకమున దుష్కరమగు సర్పయాగము చేయును. ఆ యాగమునందు తీర్ఘమైన తేజస్సుగల అగ్నిదేవుడు మిమ్ము మ్రింగివేయగలడు”-16. ఇట్లు శపించి, క్రుదురాలైన కద్రువ మిన్నకుండెను. అట్లు తల్లిచేత శపింపబడిన నాగులు కర్తవ్యము తోచక దుఃఖితులైరి-17. వాసుకి దుఃఖమును గమనించి బ్రహ్మదేవుడని ననునయించేను. వాసుకీ! మిక్కిలిగా దుః ఖింపకుము. నేను చెప్పెడి మంచి మాటనొకదానిని వినుము-18. యాయావర (యాచక) కులమున జన్మించిన జరత్కారువనునొక బ్రాహ్మణుడు కలడు. అతను తేజస్వి, తపోనిధీయును కాగలడు-19. మీ సోదరియగు జరత్కారువు నాతని కిచ్చి పెండ్లిచేసిన వారికి ఆస్తీకుడను పేరుగల ప్రఖ్యాతుడగు పుత్రుడు కలుగును-20. ఆతడు నాగులకు భయమును కలిగించునా సర్పయాగమును తన వాక్చతురతతో నిరోధించి ప్రశంసలందుకొనును.
మూ॥ తదిమాం భగినీం రాజంస్తస్యత్వం ప్రతిదాస్యసి జరత్కారుం జరత్కారోః ప్రదద్యా అవిచారయన్
యదాసౌ ప్రార్థతేఽరణ్యే యత్కించిద్ది వదిష్యతి తత్కర్తవ్యమ శంకేన యదేచ్చే: శ్రేయ ఆత్మనః
పితామహ వచ:శ్రుత్వా వాసుకిః ప్రణిపత్యచ తథాకరోద్యథా చోక్తం యత్నంచ పరమాస్థితః
తచ్ఛృత్వా పన్నగాః సర్వే ప్రహర్షోత్ఫుల్ల లోచనాః పునర్జాత మివాత్మానం మేనిరే భుజగోత్తమాః
తత్రసత్రం మహాబాహో! తవ పిత్రాప్రవర్తితమ్ ఋత్విగ్భిః సహితేనేహ సర్వలోకేషు దుష్కరమ్
ప్రోక్తంచ విష్ణునా పూర్వం ధర్మపుత్రస్యధీమతః అవశ్యం తస్య భవితా నాగానాం భయకారకమ్
తస్మాత్కాలాంతరాద్రిజన్ సాగ్ర వర్షశతే గతే తత్సత్రం భవితా ఘోరం నాగానాం క్షయ కారకమ్
యాస్యన్త్య ధర్మ భరితా దందశూకా విషోల్బణాః కోటి సంఖ్యా మహారాజ! నిపతిషంత్య హర్నిశమ్
అపూర్వేతు నిమగ్నానాం ఘోరే రౌద్రాగ్ని సాగరే ఆస్తీకస్తత్ర భవితా తేషాం నౌర్వహ్నిసాగరే
తా॥ అందువలన ఓ వాసుకీ! ఆ జరత్కారునకు మీ సోదరియగు జరత్కారువును ఇమ్ము, ఏమియు విచారింపక ఇచ్చెదవు గాక-22. ఆ అరణ్యమున అతడేమి కావలెనని కోరునో, ఏది చెప్పునో అది అంతయును నిస్సందేహముగ నెరవేర్పవలెను. మా శ్రేయమునందిచ్చ యున్నచో నట్లు తప్పక చేయవలెను''-23. బ్రహ్మదేవుని ఈ వాక్యములు విని వాసుకి అతనికి ప్రణమిల్లి, గట్టిపూనికతో నతడు చెప్పినయట్లు చేసెను -24. బ్రహ్మదేవుని మాటలు విన్న సర్పములన్నియు, సంతోషముతో వికసించిన నేత్రములు గలవియై తమకు పునర్జన్మ కలిగినయట్లు తలచేను-25. రాజా! నీ తండ్రియగు జనమేజయుడు సర్పయాగమును ప్రారంభించెను. లోకమున నెవరికిని చేయుటకు సాధ్యముకానీ ఆ మహాయాగమునాతడు ప్రవర్తింపజేసెను-26. సర్పములకు భయకారకమగు సర్పయాగమొకటి యవశ్యముగా జరుగునని పూర్వము శ్రీ కృష్ణుడు ధర్మ రాజుతో చెప్పియుండెను-27. అందువలన నాగులకు భయము కలిగించు దారుణమైన సర్పయాగము, నూడు సంవత్సరముల అనంతర కాలమున జరుగును-28. తల్లిమాట పెడచెవినిబెట్టి అధర్మమాచరించినట్టి విష భరిత సర్పములు కోట్ల కొలదిగ రాత్రింబగలు హోమ కుండములలో పడగలరు-29. అపూర్వము, ఘోరమునై, భగభగమండుచున్న అగ్ని సముద్రమున మునిగిపోవుచుండెడు నాగుల పాలిట నౌక వలె ఆస్తీకుడచటికి రాగలడు.
మూ. శ్రుత్వాసచాగ్నిం రాజా నమృత్విజస్తదనంతరమ్ నివర్తయిష్యతే యాగం నాగానాం మోహనం పరమ్
పంచమ్యాం తత్ర భవితా బ్రహ్మాప్రోవాచ లేలిహాన్ తస్మాదియం మహాబాహో! పంచమిదయితా సదా నాగానామానందకరీ దత్తా వైబ్రహ్మణాపురా
కృత్వాతుభోజనం పూర్వం బ్రాహ్మణానాంతు కామతః విసృజ్య నాగాః ప్రీయంతాంయేకేచిత్పృథివీ తలే
యేచ హేలి మరీచిస్థా యేం తరే దీవి సంస్థితాః యేనదీషు మహానాగాయే సరస్వతి గామినః
నాగాన్విప్రాంశ్చ సంపూజ్య విసృజ్యచయథార్థతః తతఃపశ్చాత్తు భుంజీత సహ భృత్యైర్నరాధిప!
పూర్వం మధుర మశ్నీయాత్తతో భుంజీత కామతః ఏవం నియమయుక్తస్య యత్ఫలం తన్నిబోధమే
మృతో నాగపురం యాతి పూజ్యమానోఽప్సరోగణైః విమాన వరమారూడో రమతే కాల మాప్సితమ్
ఇహచాగత్య రాజా సావయుతానాం వరోభవేత్ సర్వరత్న సమృద్ధఃస్యాద్వాహనాఢ్యశ్చజాయతే
పంచ జన్మాన్య సౌరాజా ద్వాపరే ద్వాపరే భవేత్ ఆధివ్యాధి వినిర్ముక్తః పత్నీపుత్ర సహాయవాన్ తస్మాత్పూజ్యాశ్చ పాల్యాశ్చ ఘృతపాయసగుగ్గులై:
శతానీక ఉవాచ :
దశంతి యేనరం విప్ర! నాగాఃక్రోధ సమన్వితాః భవేత్కీం తస్య దష్టస్య విస్తారాద్బ్రూహిమే ద్విజ!
తా॥ “సర్పయాగ విషయము నంతయును విని ఆస్తీకుడు తన హజ్నెపుణ్యముచేత అగ్నిని, యజమానియగు జనమేజయుని, ఆ పిదప ఋత్విక్కులను తమ ఉద్యమము నుండి విరమింపజేయగలడు” అని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో(జెప్పెను)” అట్లునాగులను నాశనముచేయు యాగమును ఆపివేయగలడు" -31. పంచమితిధియందే బ్రహ్మ దేవుడు సర్పములకు ఆస్తీకుని విషయమును చెప్పెను. అందువలన ఈ తిధి వానికిచాల ప్రియమైనది. ఇట్లు బ్రహ్మచేత, నాగులకానందము కలిగించునీ పంచమి నాగపంచమిగా నీయబడినది-32. ఆ దినమున మొదట బ్రాహ్మణులకు భోజనము పెట్టి, పుచ్చి, నాగులను ఇట్లు ప్రార్థింపవలేను. పృధివీతలమందు-33. సూర్య కిరణములందు, అంతరిక్షమునందు, నదులయందు, ప్రవాహములయందు, బావుల యందు, చేరువులయందును గల మహా సర్పములకు నమస్కారము. అవి యన్నియును నా యెడ ప్రసన్నములగుగాక”-34. నాగులను, బ్రాహ్మణులను యథావిధిగా పూజించి సంతృప్తి చేయవలెను. అప్పుడు తాను తన అనుచరవర్గముతో కూడ భుజింపవలెను-35. మొదట తీపి పదార్థమును తిని ఆపై తన యిష్టమైన పదార్థములు తినవలయును. ఇట్లు పంచమితిథినియమము నాచరించిన వానికి గలుగు ఫలమెట్టియో చెప్పెదను తెలిసికొనుము-36. మరణించిన పిదప నాతడు అప్సరసలతో పూజింపబడి నాగ లోకమునకుఁ బోవును. విమానము నధిరోహించి తన యిష్టమైనంత కాలము క్రీడించును-37. ఈ లోకమునకు వచ్చి పదివేల మంది రాజన్యులలో రాజశ్రేష్ఠుడగును. వజ్రవైడూర్యమణి మాణిక్యాది సమృద్ధి కలిగి, వాహన యోగము కలిగియుండున-38. ప్రతి ద్వాపరయుగమున ఐదేసి పర్యాయములు రాజుగా జన్మించును. శారీరక మానసిక వ్యాధులు లేకుండగ భార్యాపుత్రుల సేవలందుచు సుఖముగ జీవించును. కాబట్టి ఆ దినమున సర్పములను పూజింపవలెను. ఘృతము, పాయసము, గుగ్గులు మున్నగువానిచే పోషింపవలెను”-39. శతానీకుడిట్లనెను. బ్రాహ్మణోత్తమా! క్రోధముతో సర్పములు కాటువేసిన మనుష్యున కేమగునో వివరించి చెప్పుడు.
మూ. సుమంతుడవాచ :
నాగ దష్టో నరో రాజ న్ప్రాప్య మృత్యుం వ్రజత్యధః అధోగత్వా భవేత్సర్పో నిర్విషోనాత్రసంశయః
శతానీక ఉవాచ :
నాగ దష్టః పితాయస్య భ్రాతావాదుహితాపివా మాతా పుత్రథవా భార్యా కింకర్తవ్యం వదస్వమే
మోక్షాయతస్యవిప్రేంద్ర! దానం వ్రతముపోషణమ్ బ్రూహి తద్విజ శార్దూల! యేన తద్వైకరోమ్యహమ్
సుమంతురువాచ : -
ఉపోష్యా పంచమి రాజన్నాగానాం పుష్టివర్ధినీ త్వమేవమేకం రాజేంద్ర! విధానం శృణు భారత!
మాసి భాద్రపదే యాతు కృష్ణపక్షే మహీపతే మహాపుణ్యాతు సా ప్రోక్తా గ్రాహ్యాపీచ మహీపతే
జ్ఞేయా ద్వాదశ పంచమ్యో హాయనే భరతర్షభ! చతుర్థ్యాం త్వకభుక్తం తు తస్యాంనక్తం ప్రకీర్తితమ్
భువి చిత్రమయాన్నాగానథవా కలధౌతకాన్ కృత్వాదారుమయాన్వాపి అథవామృన్మయాన్నృప!
పంచమ్యామర్చయేద్భక్త్యా నాగానాం పంచకం నృప! కర వీరైః శతపత్రై ర్జాతీ పుష్పైశ్చ సువ్రత!
తథా గంధైశ్చ ధూ పైశ్చ పూజ్య పంచకముత్తమమ్ బ్రాహ్మణం భోజయేత్పశ్చాద్ఘృతపాయసమోదకై:
అనంతో వాసుకిః శంఖః పద్మః కంబల ఏవచ తథా కర్కోటకో నాగో నాగో హ్యశ్వతరో నృప!
ధృతరాష్ట్రః శంఖపాలః కాలియస్తక్షకస్తథా పింగలశ్చతథానాగో మామాసి ప్రకీర్తితాః
వత్సరాంతే పారణం స్యాద్భ్రాహ్మణాన్ఫోజయేద్బహూన్ ఇతిహాస విదేనాగం గౌరికేణ కృతం నృప తథార్చనా ప్రదాతవ్యా వాచకాయ మహీపతే
తా॥ సుమంతుముని యిట్లనెను. పాముచే కాటు వేయబడిన మనుష్యుడు మరణించి పాతాళ లోకమునకుఁబోవును. అచటికిబోయి విషములేనీ సర్పముగ మారును. సందేహములేదు-41. శతానీకుడిట్లనెను. సర్పదష్టుడైన వాని తండ్రిగాని, అన్నగాని, కూతురుగాని, తల్లిగాని, కొడుకుగాని, భార్యగాని ఏమి చేయవలెనో నాకు తెలుపుడు. అట్లు మరణించిన వాని మోక్షము కొఱకు చేయవలసిన దానము, వ్రతము, ఉపోషణముల గూర్చి చేప్పుడు. నేను కూడా దానినే అనుసరించెదను”-43. సుమంతుముని యిట్లనెను. నాగులకు పుష్టివర్ధిని యైన పంచమినాడు ఉపవసింపవలెను. ఆనాడు అనుష్టింపవలసిన ఒక విధానమును గుజించి వినుము-44. భాద్రపద కృష్ణ వక్షమునందలి పంచమి మిక్కిలి పుణ్యప్రదమైనదిగా చెప్పబడినది. దానినట్లు గ్రహింపవలేను-45. సంవత్సరమున పన్నెండు పంచమి తిథులును పవిత్రములైనవిగా తెలియవలెను. చతుర్టీనాడు ఒకే పూట రాత్రి భోజనము చేయవలేనని చెప్పబడినది-46. నేల పై నాగుల చిత్రములను చిత్రించిగాని, లేక వెండి (బంగారము) కట్టి, మట్టితోగాని ఐదు నాగ ప్రతిమలను చేయించి-47. పంచమినాడు భక్తి శ్రద్దలతో, గన్నేరు, తామర, మల్లెపూలతోను-48. గంధ ధూపాదులచేతను నాగ పంచకమును పూజింపవలెను. ఆ పిమ్మటనేయి, పాయసము, లడ్డువములతో బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను-49. అనంతుడు, వాసుకి, శంఖుడు, పద్ముడు,కంబలుడు,కర్కోటకుడు,అశ్వతరుడు,ధ్రుృతరాష్ట్రుడు,శంఖపాలుడు కాలియుడు, తక్షకుడు, పింగలుడు - ఈ పన్నెండుగురు నాగ శ్రేష్టులను పన్నెండు మాసములలో క్రమముగా పూజింపవలెను-51. సంవత్సరాంతమునందు పారణ (ఉపవాస దీక్షా నంతరము భోజనము) ఉండును. ఆ దినమున చాలామంది బ్రాహ్మణులకు భోజన సంతర్పణ చేయవలెను. ఇతి హాస విదుడు, వక్తయునైన బ్రాహ్మణునర్పించి అతనికి సువర్ణనాగ ప్రతిమను దానము చేయవలెను.
మూ. ఏషవైనాగ పంచమ్యా విధి:ప్రోక్తో బుధైర్నృప! తవ పిత్రా కృతశ్చైవ పితుర్మోక్షాయ భారత!
త్వమేక మేకం పై వీర! పంచమ్యా భరతర్షభ! సువర్ణ భార నిష్పన్నం నాగం దత్వాతథాచ గామ్
వ్యాసాయ కురుశార్దూల! పితురానృణ్య మాప్నుయాః తవ పిత్రా కృతా హ్యేవం పంచమ్యుపాసనా నృప!
ఉత్సృజ్య నాగతాం వీర! తవ పూర్వ పితా మహః పుష్పోత్తరం సదో గత్వా తథాపుష్పసదో నృప!
సునాసీరసదో గత్వా తదా భర్గసదో గతః స్వభూ సదస్తతో గత్వా కంజజస్య సదోగతః
అన్యేపియే కరిష్యంతి ఇదం వ్రతమనుత్తమమ్ దష్టకో మోక్ష్యతే తేషాం శుభం స్థానమవాప్స్యతి
యశ్చేదం శృణుయాన్నిత్యం నరః శ్రద్ధాసమన్వితః కులే తస్య న నాగేభ్యో భయం భవతి కుత్రచిత్
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థసాహస్యాం సంహితాయాం బ్రాహ్మే పర్వణి పంచమి కల్పే నాగ పంచమి వ్రత వర్ణనం నామ ద్వాత్రింశోఽధ్యాయః
తా॥ ఇది బుధుల చేత చెప్పబడిన నాగపంచమి వ్రత విధానము. మీ తండ్రి కూడా దీనిని తన తండ్రికి ముక్తి కలిగించుటకు జేసెను-53. నీవు కూడా ప్రతి పంచమికిని ఒక్కొక్క సువర్ణ నాగ ప్రతిమను, గోవును-54. జ్ఞాన వృద్ధుడైన బ్రాహ్మణునకిచ్చి పితౄణము నుండి ముక్తుడవుకావచ్చును. రాజా! నీ తండ్రి కూడ నిటులే పంచమ్యుపాసన చేసియుండెను-55. నీ తాతయగు పరీక్షిత్తు సర్పరూపమును విడిచి, చంద్రలోక సూర్య లోకములు, ఆ మీద స్వర్గలోకము ఆ పిదప కైలాసము, ఆపై విష్ణు లోకమునకుఁ బోయి తరువాత బ్రహ్మ పదమునందెను-57. ఇతరులెవరైనను ఈ శ్రేష్ఠమగు వ్రతమునాచరించిరేని, వారికి సంబంధించిన వారెవరైనను సర్పదష్టులై మృతి చెందినయెడల నట్టివారు సర్పత్వమునుండి ముక్తులై ఉత్తమ గతిని పొందుదురు-58. శ్రద్దాయుక్తుడై ఇది నిత్యమును వినువాని కులమున నెప్పుడును సర్పభయముండదు.
శతార్థ సాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్య పురాణము నందలి బ్రహ్మ పర్వమున, పంచమి కల్పమునందు నాగ పంచమి వ్రత వర్ణనమును ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 32 of the Bhavishya Purāna - Brahma Parva is as follows:
The Pañcamī Kalpa opens with the foundational narrative of serpent-worship: the story of Kadru, mother of the nāgas, and her curse upon her own serpent-children when they refused to help her deceive Vinatā in a wager. The curse doomed the serpents to perish in Janamejaya's great serpent sacrifice — the Sarpa Satra — but the sage Āstīka, born of a ṛṣi father and a nāga mother, was prophesied to save them. The Nāga-pañcamī vrata is established in this context: by worshipping the twelve nāga-kings — Ananta, Vāsuki, Śeṣa, Padmanābha, Kambala, Śaṅkhapāla, Dhṛtarāṣṭra, Takṣaka, Kaliya, Mahāpadma, Karkoṭaka, and Piṅgala — with offerings of milk on the fifth tithi, the devotee is freed from all fear of serpents and obtains the protection of the nāga-world.