సుమంతురువాచ :
మూII ప్రణమ్యశిరసా దేవం సురజ్యేష్ఠం చతుర్ముఖమ్ ఉవాచ స మహాతేజా దిండర్లోకేశమాదరాత్
దేవదేవేన భవతాదిప్టోఽస్మిచ మహాత్మనా క్రియాయోగామృతం సర్వమాఖ్యాస్యతి భవాన్కిల
సత్వాం పృచ్ఛామ్యహం బ్రహ్మన్క్రియాయోగం నిరంతరమ్ సంతోషయితు మీశేహం యధావద్వక్తుమర్హసి
బ్రహ్మోవాచ :
ఏ హ్యేహి మత్సకాశంచ మత్సమిపే గణాధిప! బ్రహ్మహత్యా ప్రణష్టాతే దర్శనాదేవ తస్యలు
అనుగ్రహ్యోసి భూతేశ! భాస్కరస్యామితౌజసః ఆరాధనాయ భూతేశ! యదేశే ప్రవణం మనః
యదిదేవ పతిం భానుమారాధయితు మిచ్ఛసి భగవంత మనాద్యంతం భవ దీక్షాగుణాన్వితః
నహ్యదీక్షాన్వితై ర్భానుర్జ్ఞాతుం స్తోతుంచ తత్వతః ద్రష్టుం వా శక్యతే మూడై: ప్రవేషం కుతఏవహి
జన్మభిర్బహుభిః పూతా నరా స్తద్గత చేతసః భవంతి భగవాన్సౌరాస్తదా దీక్షా గుణాన్వితాః
అనేక జన్మసంసార చితే పాప సముచ్చయే నాక్షిణే జాయతే పుంసాం మార్తాండాభి ముఖీమతిః
ప్రద్వేషం యాతి మార్తాండే ద్విజాన్వేదాంశ్చనిందతి యో నరస్తం విజానీయాత్పాప బీజ సముద్భవమ్
తా॥ సుమంతుముని యిట్లనెను. “మహా తేజస్వియగు దిండి, సురజ్యేష్ఠుడు, లోకేశుడు చతుర్ముఖుడైన బ్రహ్మదేవునకు శిరస్సువంచి నమస్కరించి యిట్లనెను-1. “మహాత్ములు, దేవదేవులగు మీ దర్శనమున ధన్యుడనైతిని. మీ చెంత క్రియాయోగమును తెలిసికొనుటకు సూర్య భగవానునిచే నాదేశింపబడితిని. అమృత తుల్యమగు నా యోగమును గూర్చి సాకల్యముగ మీరు చెప్పుదురట!-2. అందుచే దానిని వివరింపుమని వేడుచున్నాను. దేవ దేవుడగు సూర్య భగవానుని నిరంతరము సంతోషపుపగలిగిన రీతిగా దానిని నాకుపదేశింపుడు”-3. బ్రహ్మదేవుడిట్లనెను. “రమ్మురమ్ము! గణాధిపా! ఇటుల నా సమీపమునకు రమ్ము! నీ బ్రహ్మహత్యాదోషమాతని దర్శనముచేతనే పటాపంచలైపోయినది-4. అమిత తేజస్వియైన సూర్యదేవునిచే ననుగ్రహింపదగిన వాడవైతివి. ఆతని నారాధించుటకు నీ మనస్సు విధేయమై యున్నచో -5. అతనిని పూజించుట కిచ్చకలిగినచో, ఆద్యంత రహితుడు, భగవానుడునైన భానుదేవుని సేవింపదలచినచో మొదట నియమ శీలుడవు కావలయును-6. అట్లు దీక్షాన్వితుడు కాని వాడా దేవుని తత్త్వతః స్తుతించుటకు, తెలిసికొనుటకు, దర్శించుటకును శక్యముకాదు. ఇక మూడులాతని గుజించిన యూహనైనను ప్రవేశింపజాలరు-7. అతనినే మనస్సునందు నిలుపగలిగియున్న సౌర దీక్షా గుణాన్వితులనేక జన్మలయందును పవిత్రులుగనుందురు-8. అనేక జన్మల సంసారమున ప్రోగైన పాప సమూహము క్షీణింపనిదే పురుషులకు సూర్యాభిముఖమైన బుద్ధి కలుగనేరదు -9. సూర్యునియందు ద్వేషము కలుగువాడు బ్రాహ్మణులను, వేదములను నిందించువాడు పాప బీజమునుండి పుట్టినవాడని యెఱుంగవలెను.
మూ ॥ పాఖండేషు రతిః పుంసాం హేతువాదానుకూలతో జాయతే విష్ణుమాయామ్భః పతితానాం దురాత్మనామ్
యదా పాపక్షయః పుంసాం తదావేదద్విజాదిషు రవౌచ దేవదేవేశే శ్రద్ధా భవతి నిశ్చలా
యదా స్వల్పావశేషస్తు నరాణాం పాప సంచయః తదా దీక్షా గుణాన్త్సర్వే భజంతే నాత్రసంశయః
భ్రమతామత్ర సంసారే సరాణాం పాప దుర్గమే హస్తావలంబదో ప్యేకో భక్తి ప్రీతో దివాకరః
సర్వ భాగవతో భూత్వా సర్వపాప హరంరవిమ్ ఆరాధయేహ తంభక్త్యా ప్రీతి మేష్యతి భాస్కరః
దిండి రువాచ :
కింలక్షణానరా దీక్షా మర్హంతి పద్మ సంభవ! యచ్చదీక్షాన్వితైః కార్యం తన్మేకథయ పద్మజ!
బ్రహ్మోవాచ :
కర్మణామనసా వాచా ప్రాణినాం యోన హింసకః భావ భక్తశ్చ మార్తాండే తస్యదీక్షా గుణాన్వితా
బ్రాహ్మణాంశ్చైవ దేవాంశ్చ నిత్యమేవ నమస్యతి నచ ద్రోగ్ధా పరంవాదే సమార్తాండం సమర్చతి
సర్వాన్దేవాన్రవింవేత్తిసర్వలోకాంశ్చ భాస్కరమ్ తేభ్యశ్చ నాన్యమాత్మానం సనరః సౌరతాంవ్రజేత్
దేవం మనుష్య మన్యంవా పశుపక్షి పిపీలికాన్ తరుపాషాణ కాష్ఠాని భూమ్యంభోగగనం దిశః
ఆత్మానంచాపి దేవేశాద్వ్యతిరిక్తం దివాకరాత్ యోనజానాతి యతిషు సవైదీక్షా గుణాన్ఛజేత్
తా॥ సంప్రదాయ విముఖల పైన (నాస్తికుల పైన) ప్రేమ కలుగుట, హేతువాదమునందానుకూల్యభావము కలుగుట, అనునవి విష్ణు మాయలో పడిపోయిన దురాత్ములకు సంభవించును-11. మానవులకు పాపము నశించిపోయినప్పుడు వేదములు, బ్రాహ్మణులు, దేవదేవేశుడైన సూర్య దేవుడు - వీరలయందు నిశ్చలమైన శ్రద్ద ఉదయించును -12. పాప సంచయమంతయు క్షీణించి స్వల్ప మాత్రముగ శేషించి యున్నవారు కర్మదీక్షా స్వభావమును స్వీకరించుచుందురు. సంశయములేదు-13. పాపములతో దుర్గమమైన సంసారమున బడి తిరుగుచున్న మానవులకు, భక్తితో ప్రీతుడగు సూర్య దేవుడొక్కడే చేయూత నిచ్చి కాపాడగలడు-14. సర్వ పాపములను నశింపజేయగల సూర్యదేవుని భావమున నంతటను నింపుకొని భక్తితో పూజింపుము. ఆతడు ప్రీతుడగును”-15. దిండియిట్లనెను. “ఓ బ్రహ్మదేవా! ఏ లక్షణములుగల మానవులు దీక్ష కరులగుదురు? దీక్ష నందినవారు చేయదగిన దేదియో నాకుఁజేప్పుడు -16. దిండి ప్రశ్నకు బ్రహ్మయిట్లనెను. కర్మచేత, మనస్సు చేత, వాక్కు చేతను ఏ ప్రాణినైనను హింసింపకుండువాడు, సూర్య భగవానునియందు మనఃపూర్వకమగు భక్తిగలవాడు గుణాన్వితమైన దీక్షకరుడు-17. బ్రాహ్మణులకు, దేవతలకు నిత్యము నమస్కరించువాడు, ఆస్తిక భావమునందెట్టి కల్మషములేనివాడు సూర్యదేవుని పూజింపగలడు-18. దేవతలందఱిని సూర్యునిగాఁ దెలియువాడు, సర్వ లోకములును భాస్కరుడేయని భావించువాడు, తననుతాను వారిక భిన్నుడనని యెఱుంగువాడు, సూర్యత్వమును పొందగలడు-19. దేవుని, మనుష్యుని, ఇతర పశువులు, పక్షులు, చీమలు మున్నగుపోనిని, చెట్లను, రాళ్లను, కఱ్ఱలను, దిక్కులను, భూమిని, జలమును, ఆకాశమును-20. తనను కూడ దేవేశుడైన సూర్యుని కభిన్నములని భావించువాడు దీక్షా గుణములను పొందును-21.
మూII భావంనకురుతే యస్తు సర్వ భూతేషు పాపకమ్ కర్మణా మనసావాచా సతు దీక్షాం సమర్హతి
సుత ప్తేనేహ తపసా యజ్ఞైర్వాబహు దక్షిణైః: తాంగతిం న నరాణాంతి యాంగతాః సూర్యమాశ్రితాః
యేన సర్వాత్మనా భానౌ భక్త్యా భావో నివేశితః గణేశ్వర కృతార్థత్వా చ్చ్లా ఘ్యః సౌరః సమానవః
అపి నః సకులేధన్యో జాయతే కులపావనః భగవాన్ఛక్తి భావేన యేన భానురుపాసితః
యః కారయతి దేవార్చాం హృదయాలంబనం రవేః సనరో భాను సాలోక్యమాప్నోతి ధుత కల్మషః
యస్తు దేవాలయం భానోర్బక్త్యా కారయతిధ్రువమ్ ససప్త పురుషాన్ లోకం భానోర్నయతి మానవః
యావంత్యాబ్దాని దేవార్చా రవేస్తిష్ఠతి మందిరే తావద్వర్ష సహస్రాణి సూర్యలోకే మహీయతే
దేవార్చాలక్షణో పేతా తద్గృహే సంతతో విధిః నిష్కామంచ మనోయస్య సయాత్యక్షర సామ్యతామ్
తా॥ మనస్సుచేత, వాక్కుచేత, కర్మచేత ఏ ప్రాణియందును పాపకార్యముచేయని వాడు సౌర దీక్ష కరుడగును-22. సూర్య భగవానునాశ్రయించి నియమశీలుడై తపము చేయువాడు, యజ్ఞములు చేయువాడు, భూరీ దక్షిణలిచ్చువాడు పొందేడి యుత్తమగతిని యితరులెవరును పొందరు-23. సర్వాత్మనా సూర్యదేవుని యందు భక్తి కలిగి, అతని యందే భావము నిలిపి కృత కృత్యుడగువాడు శ్రేష్ఠుడైన సౌరదీక్షాపరుడు-24. భక్తి భావముతో సూర్య దేవునుపాసించువారి కులమున దక్క కులపావనుడైన ధన్యుడు పుట్టడు-25. సూర్య దేవుని యందు భక్తికలిగి యాతని పూజ చేయించువాడు పాపములనుండి ముక్తుడై సూర్యలోకమును చేరును-26. భక్తి భావముతో సూర్య దేవాలయమును నిర్మింపజేయువాడు ఏడు తరముల పురుషులను సూర్య లోకమునకు చేర్చువాడగును-27. సూర్య దేవాలయమున ఎన్ని సంవత్సరములు పూజ జరుగుచుండునో అన్నీ వేల సంవత్సరముల వఱకతడు సూర్య లోకమున వెలుగొందుచుండును-28. ఎవని యింట సలక్షణముగ సూర్యార్చన సంతత విధిగా జరుగుచుండునో, ఎవని మనస్సునిష్కామముగ నుండునో అట్టివాడు ముక్తినందును.
మూII పుష్పాణి చ సుగంధీని మనోజ్ఞానిచ యః పుమాన్ ప్రయచ్ఛతి సహస్రాంశోః సదాప్రయత మానసః
ధూపాంశ్చతాంస్తాన్వి విధా న్గంధాఢ్యం చానులేపనమ్ నరఃసోఽను దినం యజ్ఞం కరోత్యారాధనం రవే:
యజ్ఞేశో భగవాన్పూషా సదాక్రతుభిరిజ్యతే బహూపకరణా యజ్ఞా నానా సంభార విస్తరా:
నతే దిండిన్నవాప్యంతే మను షైరల్పసంచయైః భక్త్యాతు పురు షైః పూజా కృతా దూర్వాంకురైరపి భానోర్దదాతి హిఫలం సర్వయజ్ఞైః సుదుర్లభమ్
యాని పుష్పాణి హృద్యాని ధూప గంధానులేపనమ్ దయితం భూషణం యచ్చప్రీతయే చైవ వాససీ
యాని చాభ్యవహార్యాణి భక్ష్యాణి చ ఫలానివై ప్రయచ్ఛతాని మార్తాండే భవేథాశ్చైవ తన్మనాః
ఆద్యంతం భువనాధారం యథాశక్త్యా ప్రసాదయ ఆరాధ్యయాతి తందేవం తస్మిన్నేవ నరో లయమ్
పుష్పైస్తీర్థోదకైర్గం ధైర్మథునా సర్పిషా తథా క్షీరేణ స్నాపయేద్భాను గ్రహేశం గోపతిం ఖగమ్
దధిక్షీర హ్రదాన్పుణ్యం స్తతో లోకాన్మధుచ్యుతః ప్రయాస్యతి గణశ్రేష్ఠ నిర్వృతించ విలక్షణమ్
స్తోత్రైద్గీతైస్తధా పాద్యైర్భ్రాహ్మణానాంచ తర్పణైః: మనసశ్బై వయోగేన ఆరాధయ దివాకరమ్
ఆరాధ్యతం జగన్నాథం మయాసర్గః ప్రవర్తితః విష్ణుశ్చ పాలయేల్లో కాంస్తమారాధ్య దివాకరమ్
రుద్రశ్చ ప్రాప్తవాన్దేవీం భవానీం తత్ప్రసాదతః దీప్యంతే ఋషయశ్చాపి తమారాధ్య దివాకరమ్
సత్వమేభిః ప్రకారైస్తముపవా సైశ్చ భాస్కరమ్ తోషయాబ్దం హి తుస్టోఽ సౌ భానుర్ద్వంద్వ ప్రశాంతిదః
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రా హ్మేపర్వణి సప్తమీకల్పే బ్రహ్మదండి సంవాదే ఆదిత్య క్రియాయోగ వర్ణనం నామ త్రిషష్టితమోఽధ్యాయః
తాII మనోజ్ఞములు, పరిమళ భరితములునైన పుష్పములచే యతమానసుడై సూర్యదేవుని పూజించువాడు,-30. ప్రతి దినము వివిధములగు ధూపములచేత, సువాసనగల మైపూతలచేత సూర్యుని యజ్ఞము, పూజ, చేయువాడు,-31. ఉత్తమ గతినందుదురు. యజ్ఞేశ్వరుడైన సూర్యదేవుడు యజ్ఞములచేత పూజింపబడును. అనేకములగు సాధనోపకరణములు, సంబారములు యజ్ఞమునకు కావలసియుండును-32. దీండీ! విశేష ధనవంతులు కానివారు యజ్ఞ ద్రవ్యములు సమకూర్చుకొనజాలరు. అందుచే భక్తి గలవారు గజీకలతో కూడ పూజింపవచ్చును. అట్లు పూజించినవారికి కూడ భానుదేవుడు సర్వయజ్ఞములచే దుర్లభమగు ఫలమునిచ్చును-33. హృద్యములైన పుష్పములు, ధూపములు, గంధానులేపనములు, అమూల్యమైన యాభరణములు, ప్రియమైన వస్త్రములు-34. భక్ష్యములు, ఫలములు మొదలగు నాహార పదార్దములు, తద్దత మనస్కుడవై సూర్య భగవానునికి సమర్పింపుము-35. ఆద్యుడు, సకల భువనముల కాధార భూతుడునైన ఆతనిని యథాశక్తిగ ప్రసన్నుని చేసికొనుము. అతని నారాధించు మానవుడతనిలోననే లయమగును-36. పుష్పములచేత, తీర్థోకములచేత, తేనె, నేయి, పాలు మున్నగువానిచే గ్రహేశ్వరుడు, ఆకాశగతుడునైన సూర్యదేవున కభి షేకము చేయవలెను-37. అటుల చేసిన పుణ్య ప్రదములైన దధిక్షీర ప్రదములు, మధువులు నిండిన లోకములు, విశేషలక్షణముగల సుఖ జీవితమునొసంగును-38. స్తోత్రములు, గీతములు, వాద్యములు, బ్రాహ్మణ సంతర్పణలు మున్నగువానితో మనఃపూర్వకముగ దివాకరునారాధింపుము-39. ఆ జగన్నాథుడైన సూర్య భగవానునారాధించియే నేను లోకములను సృష్టించితిని. అతని నారాధించియే విష్ణువు లోకములను పరిపాలింపఁగడంగెను-40. అతని ప్రసాదము వలననే రుద్రుడు భవానిని పొందెను. ఋషులందఱ దివాకరునర్పించి ప్రకాశించుచున్నారు-41. నీవు కూడ ఆ దేవ దేవునినొక సంవత్సరము వఱకునుపవాసాదులతో పూజించి ప్రసన్నుని చేసికొనుము. ఆతడు తుష్టుడై ఇహ పరశాంతులనొసంగును.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పమున, బ్రహ్మదిండి సంవాదమున ఆదిత్యక్రియాయోగ వర్ణనమను అటువది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 63 of the Bhavishya Purāna - Brahma Parva is as follows:
The dialogue now shifts to Brahma, who instructs the sage Diṇḍi (a variant spelling used in this chapter) on the yoga of ritual action dedicated to Sūrya — the Āditya-kriyāyoga. This is the path by which a householder who cannot practise intense dhyāna or jñāna-yoga can still achieve the highest fruits through the scrupulous and loving performance of all prescribed Sūrya worship rites. Each act of pūjā — the offering of a flower, the lighting of a lamp, the recitation of a hymn — when performed with full attention and devotion, is itself an act of yoga: a moment of complete presence that, accumulated over a lifetime, constitutes a complete spiritual path. The chapter establishes the equivalence between karma-yoga as taught in the Gītā and the specific form of karma-yoga embodied in Sūrya worship.