మూ. శతానీక ఉవాచ :
సర్పాణాం కతిరూపాణి కే వర్ణాః కించ లక్షణమ్ కా జాతిస్తు భవేత్తేషాం కేషుయోని కులేషు వా
సుమంతురువాచ :
పురామేరౌ నగవరే కశ్యపం తపసాంనిధిమ్ ప్రణమ్య శిరసాభక్త్యా గౌతమో వాక్యమబ్రవీత్
సర్పాణాం కతి రూపాణి కించిహ్నం కించలక్షణమ్ జాతిం కులం తథావర్ణాన్బృహి సర్వం ప్రజాపతే
కథం వాజాయతే సర్పః కథం ముంచేద్విషం ప్రభో! విషవేగా: కతి ప్రోక్తాః కత్యేవ విషనాడీకాః
దంష్ట్రాః కతివిధాః ప్రోక్తాః కింప్రమాణం విషాగమే గృహ్ణితే తు కదాగర్భం కథం చేహ ప్రసూయతే
కీదృశీస్త్రీ, పుమాంశ్చైవ కీదృశశ్చ నపుంసకః కిం నామ దశనం చైవ ఏ తత్కధయ సువ్రత!
తస్య తద్వచనం శ్రుత్వా కశ్యపః ప్రత్యభాషత శృణు గౌతమ! తత్త్వేన సర్పాణా మిహ లక్షణమ్
మాస్యోషాఢే తథా జ్యేష్ఠే ప్రమాద్యంతి భుజంగమాః తతో నాగోఽథ నాగీచ మైథునే సంప్రపద్యతే
చతురో వార్షికాన్మాసాన్నాగీ గర్భమధారయత్ తతః కార్తిక మా సేతు అండకాని ప్రసూయతే
అండకానాంతు విజ్ఞేయో ద్వేశతే ద్వేచవింశతీ తాన్యేవ భక్షయేత్సాతు భాగైకం ఘృణయాత్యజేత్
తా॥ శతానీకుడిట్లనెను. సర్పముల కెన్ని రూపములు గలవు? ఏయే వర్ణములలో నుండును? వాని లక్షణములేవి? వాని జాతి ఏది? కులములేవి?-1. సుమంతుముని ఇట్లు చెప్పెను. పూర్వ కాలమున మేరు పర్వత శ్రేష్ఠము పై, తపో నిధియగు కశ్యప మహర్షికి భక్తితో శిరసు వంచి నమస్కరించి గౌతముడతనితో నిట్లు ప్రశ్నించి యుండెను-2. “సర్పములకెన్ని రూపములున్నవి? ఏ చిహ్నములు ఏ లక్షణములున్నవి? వాని జాతి, కులము, వర్ణములు మొదలగు విషయములను గూర్చి నాకు చెప్పుడు-3. సర్పమెట్లు పుట్టును? విషము నేట్లు విడుదల చేయును? విష వేగములెన్ని విధములుగా చెప్పబడినవి? విషనాడులెన్ని? (4) పాముల కోఱలు ఎన్ని విధములు? విషము వచ్చుటయందు ప్రమాణమేమి? అవి ఎప్పుడు గర్భము ధరించును? ఎట్లు ప్రసవించును?-5. స్త్రీ ఎట్లుండును. పురుష సర్పమెట్లుండును? నపుంసక సర్పమెట్లుండును? కాటువేయుటయననేమి? ఈ వివరములు నాకు తెలియజెప్పుడు. గౌతముని ఈ ప్రశ్నలు విని కశ్యప ప్రజాపతి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. “గౌతమా! సర్ప లక్షణములను తత్త్వతః చెప్పుచున్నాను. వినుము. సర్పములు జ్యేష్ఠ ఆషాఢ మాసములలో మదించును. అప్పుడు ఆడపాము మగపాము 'కలయిక' కుపక్రమించును. వర్షర్తువు నాలుగు మాసములు సరిణి గర్భము ధరించును. కార్తిక మాసమునందు గ్రుడ్లు పెట్టును. రెండు వందల నలుబది గ్రుడ్లు పెట్టును. తాను పెట్టిన గుడ్లను చాల వఱకు తిని వేసి ఒక భాగము ఇష్టపడక వదిలేయును.
మూ. స్వర్ణార్క వర్ణాద్వై తస్మాత్పుమాన్సం జాయతేండకాత్ తాన్యేవ ఖాదతే సర్ప అహోరాత్రాణి వింశతిమ్
స్వర్ణకేతక వర్ణాభాద్దీర్ఘ రాజీవ సంనిభాత్ తస్మాదుత్పద్యతే స్త్రీవై అండాద్భ్రాహ్మణ సత్తమ!
శిరీషపుష్ప వర్ణా భాదండకాత్న్యాన్న పుంసకః తతో భినత్తి చాండాని షణ్మాసేనతు గౌతమ!
తతస్తే ప్రీతి సంబంధాత్న్యేహం బధ్నంతి బాలకాః తతోఽ సౌ సప్తరాత్రేణ కృష్ణోభవతి పన్నగః
ఆయుః ప్రమాణం సర్పాణాం శతం వింశోత్తరం స్మృతమ్ మృత్యుశ్చాష్ట విథోజ్ఞేయః శృణుష్వాత్ర యథాక్రమమ్
మయూరాస్మానుషాద్వాపి చకోరాద్గోఖురాత్తథా బిడాలాన్నకులాచ్చైవ వరాహాద్వృశ్చికాత్తాథా ఏతేషాం యదిముచేత జీవేదింశోత్తరం శతమ్
సప్తాహే తు తతఃపూర్ణే దంష్ట్రాణాం చాధిరోహణమ్ విషస్యాగమనం తత్ర నిక్షిపేచ్చపునఃపునః
ఏవం జ్ఞాత్వాతు తత్త్వేన విష కర్మారభేతవై ఏక వింశతి రాత్రేణ విషదంష్ట్రా సుజాయతే నాగీ పార్శ్వ సమావర్తీ బాలసర్పః స ఉచ్యతే
పంచవింశతి రాత్రస్తు సద్యః ప్రాణహరోభవేత్ షణ్మాసాజ్ఞాతమాత్రాస్తు కంచుకం వై ప్రముంచతి
పాదానాంచాపి విజ్ఞేయే ద్వేశతే ద్వేచ వింశతీ గోలోమ సదృశాః పాదాః ప్రవిశంతి క్రమంతి చ.
తా॥ బంగారు వన్నెతో ప్రకాశించు అండమునుండి మగ పాము పుట్టును. వానినే సర్పము రాత్రింబవలు ఇరువదింటి వఱకు తినుచుండును. పచ్చని బంగారు పచ్చని మొగలిపూవు) వన్నెలో నుండునవి, పొడవైన తామర వంటివియైన గ్రుడ్ల నుండీ ఆడపాములు పుట్టును-, దిరిసెన పువ్వు వర్ణమున నుండు అండము నుండి నపుంసక సర్పము జన్మించును. గ్రుడ్లు పెట్టిన ఆడపాము ఆుమాసముల వఱకు పొదిగిన పిదప ఆ గ్రుడ్లు పగిలి పిల్లలు బయటికి వచ్చును. పాము పిల్లలు తల్లితో, ప్రేమ స్నేహములతో నుండును. ఏడు రాత్రుల వఱకు సర్ప కిశోరము నల్లని వర్ణమునకు మారును. సర్పముల ఆయుః ప్రమాణము నూట యిరువది సంవత్సరములుండును. వాని మరణము ఎనిమిది విధములుగ నుండును. క్రమముగా వివరించు చున్నాను వినుము. నెమలి వలన, మనుష్యునివలన, చకోరపక్షివలన, ఆవు, గేదే మొదలగువాని గిట్టల వలన, పిల్లి వలన, ముంగిస వలన, పంది వలన, తేలు వలన సర్పములు చనిపోవుచుండును. వీని నుండి తప్పించుకొనగలిగినచో నూట యిరువది సంవత్సరములు జీవించును. పారము దినములకు కోఱలు పెరుగును. ఆ పిదప విషము వచ్చును. విషమును విడుదల చేసిన కొలదిగ మల మల చేరుచుండును. ఇది తెలిసి విష సంబంధ కర్మకు యత్నింపవలెను. ఇరువది యొక్క రాత్రుల వఱకు విషపు కోటలు బాగుగా పెరుగును. ఆడపాము ప్రక్కప్రక్కన తిరుగాడు పాము “బాల సర్ప 'మనబడును. ఇరువది. యైదు దినములలో, కాటు వేయగానే ప్రాణము తీయు సమర్థత వచ్చును. పుట్టిన ఆఱు మాసములకు కుబుసము వదిలి పెట్టును. పాము రెండువందల నలువది పాదములు కలిగియుండును. ఆ పాదములు ఆవు రోమమంత సూక్ష్మములై, అడుగువేయట, అడుగు తీసిదాటుట చేయగలవు.
మూ. సంధీనాం చాస్య విజ్ఞేయే ద్వేశతే వింశతీ తథా అంగుల్యశ్చాపి విజ్ఞేయా ద్వేశతే వింశతీ తథా
అకాల జాతా యే సర్పా నిర్విషాస్తే ప్రకీర్తితాః పంచసప్తతి వర్షాణి ఆయుస్తేషాం ప్రకీర్తితమ్
రక్తపీత శుక్లదంతా అనీలా మందవేగినః ఏతే అల్పాయుషోజ్ఞేయా అన్యేచ భీరవః స్మృతాః
ఏకం చాస్య భవేద్వక్తం ద్వేజి హ్వేచ ప్రకీర్తితే ద్వాత్రింశద్దశనాః ప్రోక్తాః పన్నగానాం నసంశయః
తేషాం మధ్యే చతస్రస్తు దంష్ట్రా యాః సువిషావహాః మకరీ కరాలీ కాలరాత్రీ యమదూతీ తథైవచ
సర్వాసాం చైవ దంష్ట్రాణాం దేవతాః పరికీర్తితాః ప్రథమా బ్రహ్మదేవత్యా ద్వితీయా విష్ణుదేవతా తృతీయా రుద్ర దేవత్యా చతుర్థయమదేవతా
హీనా ప్రమాణతః సాతు వామనేత్రం సమాశ్రితా నాస్యాం మంత్రాః ప్రయోక్తవ్యా నౌషధం నైవ భేషజమ్
వైద్యః పరాజ్ముఖోయాతి మృత్యుస్తస్యా విలేఖనాత్ చికిత్సా నబుదైః కార్యా తదంతం తస్యజీవితమ్
మకరీం మాసికాం విద్యాత్కరాలీచ ద్విమాసికా కాలరాత్రీ భవేత్రీణి చతురో యమదూతికా
మకరీం గుడౌదనం దద్యాత్కషాయాన్నం కరాలికామ్ కాలరాత్రీం కటుయుతం దూతీం వైసన్నిపాతికమ్
తా॥ సంధులు, వ్రేల్లును వీనికి రెండు వందల నలుబది యుండును. అకాలమునందు పుట్టిన సర్పములకు విషముండదని చెప్పనగును. వీనికి డెబ్బదియైదు సంవత్సరములు మాత్రమే జీవితకాలముండును. ఎఱుపు, తెలుపు, పసుపు వన్నె దంతములుగల సర్పములకు విషముండదు. ఇవి అల్పమైన వేగముగలవి. అల్పాయుర్దాయముగలవి. వీనిలో కొన్ని పిటీకివి కూడనైయుండును. పాములకు ఒక ముఖము, రెండు నాల్కలు, ముప్పది రెండు దంతములునుండును. సంశయములేదు . ఈ దంతముల మధ్య నాలుగు దంష్టలు విషపూరితములు. మకరి, కరాలి, కాలరాత్రి, యమదూతి, అని ఆ నాలుగు దంతముల పేళ్లు. ఈ నాల్గు దంతములకు దేవతలు అధిపతులుగా చెప్పబడియున్నారు. 'మకరి' యనునది బ్రహ్మదేవత్యము. రెండవదియగు ‘కరాలి' విష్ణు దేవతాకము. 'కాలరాత్రి' యనునది రుద్ర దేవత్యము. నాలుగవ దంతమగు 'యమదూతి'కి అధిపతియముడు. ఈ యమదూతి యను కోట తక్కిన కోఱల కన్న ప్రమాణమున చిన్నది. ఇది సర్పము యొక్క ఎడమ కంటిని ఆశ్రయించి యుండును. దీని కాటు పడినచో మంత్రములు గాని, మందుగాని, చికిత్సగాని నిరుపయోగములు. ఈ దంతపు కాటు గుర్తు గమనించియే వైద్యుడు పరాజ్ముఖుడగును. చికిత్స, ఔషధము దీనికి లేవని, అది వాని జీవిత సమాప్తియని తెలిసినవారు ఇకనట్టి ప్రయత్నములు చేయరు. ఒక మాసమునకు 'మకరి', రెండు మాసములకు కరాలి, మూడు మాసములకు కాలరాత్రి, నాలుగు మాసములకు 'యమదూతి'యును సర్పమునకు ఏర్పడును. 'మకరి’ కాటుకు గుడాన్నము, 'కరాలి' కాటుకు కషాయాన్నము, 'కాలరాత్రి' కాటుకు కారముతో కూడిన ఆహారము, 'యమదూతి' కాటుకు సంనిపాతమునకిచ్చు ఆహారము దడ్డున కీయవలెను.
మూ. మకరీ శస్త్రకం విద్యాత్కరాలీ కాకపాదికా కరాకృతిః కాలరాత్రిర్యామ్యా కూర్మాకృతిఃస్మృతా
మకర వాతులా జ్ఞేయా కరాలీ పైత్తికీ స్మృతా కఫాత్మికా కాలరాత్రీ యమదూతీ సన్నిపాతకీ
శుక్లాతు మకరీజ్ఞేయా కరాలీ రక్తసన్నిభా కాలరాత్రీ భవేత్పీత కృష్ణాచ యమదూతికా
వామాశుక్లాచ కృష్ణాచ రక్తాపీతాచ దక్షిణా సమాసేనతు వక్ష్యామి యథైతా వర్ణతః స్మృతాః
శుక్లాతు బ్రాహ్మణీజ్ఞేయా రక్తాతు క్షత్రియా స్మృతా వైశ్యాతు పీతికా జ్ఞేయా కృష్ణా శూద్రాతు కథ్యతే అంతఃపరం ప్రవక్ష్యామి దంష్ట్రాణాం విషలక్షణమ్
దంష్ట్రాణాం తు విషం నాస్తి నిత్యమేవ భుజంగమే దక్షిణం నేత్రమాసాద్య విషం సర్పస్య తిష్ఠతి
సంక్రుద్ధ స్యేహ సర్పస్య విషం గచ్ఛతి మస్తకే మస్తకాధమనీం యాతి తతో నాడీషు గచ్ఛతి
నాడీభ్యః పద్యతే దంష్ట్రాం విషం తత్ర ప్రవర్తతే తత్సర్వం కథయిష్యామి యథా వదనుపూర్వశః
అష్టభిః కారణైః సర్పో దశతే నాత్ర సంశయః ఆక్రాంతో దశతే పూర్వం ద్వితీయం పూర్వవైరిణమ్
తృతీయం దశతే భీతశ్చతుర్థం మద దర్పితః పంచమంతుక్షుధావిష్టః షష్ఠం చేహ విషోల్బణః సప్తమంపుత్ర రక్షార్థమష్టమం కాలచోదితః
తా॥ 'మకరి' కాటు గుర్తు శస్త్ర మువలెను, “కరాలి' యను దంతపు కాటు గుర్తు కాకి పాదమువలెను, 'కాలరాత్రి' యను దంష్ట్ర యొక్క కాటు గుర్తు చేయి మాడ్కియును, 'యమ దూతిక' గుర్తు తాబేలును పోలియుండునని చెప్పబడినది. 'మకరి' వాతస్వభావము, 'కరాలి' పిత్త స్వభావము, 'కాలరాత్రి' శ్లేష్మ లక్షణము, 'యమదూతి' సన్నిపాత లక్షణము కలిగియుండును. మకరి తెలుపు వర్ణమునను, “కరాలి' ఎఱ్ఱని వన్నెలోను, 'కాలరాత్రి' పసుపు చాయలోను, 'యమదూతిక' నల్లగను ఉండును. తెల్లనిది, నల్లనిది ఎడమ వైపునను, ఎఱ్ఱనిదీ, పచ్చనీది కుడివైపునను ఉండును. వాని వర్ణములును చెప్పుచున్నాను వినుము. తెల్లనిది బ్రాహ్మణియని, ఎఱ్ఱనిది క్షత్రియయని, పచ్చనిది వైశ్యయనియు, నల్లనిది శూద్రయనియు చెప్పబడును. ఆ మీదట సర్పదంష్ట్రలకుగల విష లక్షణమును గూర్చి చెప్పెదను. పాము కోఱలలో ఎప్పుడును విషముండదు. కుడి కన్ను సమీపమున విష స్థానముండును. కోపించిన సర్పమనకు అచటి నుండి విషము నెత్తికెక్కును. అట నుడి నరములోనికి ప్రాకును. అట నుండీ నాడులలోనికి ప్రవహించును. నాడుల నుండి కోటలలోనికి వచ్చి కాటుతోబాటు, విడుదల చేయబడును. సర్పము ఎందుకు కాటువేయునో వివరముగా చెప్పెదను. పాము ఎనిమిది కారణముల చేత కాటువేయును. సంశయములేదు. ఒకటి; తనను ఆక్రమించినపుడు రెండు పూర్వ వైరముచేత. మూడు భయపడినప్పుడు, నాలుగు మదించినపుడు, ఐదు ఆకలిగొనియున్నప్పుడు, ఆు విషమతిశయించినప్పుడు, ఏడు తన సంతానమును రక్షించుకొనుటకు, ఎనిమిది కొలచోదితమై సర్పము కాటువేయును.
మూ. యస్తు సర్పో దశిత్వాతు ఉదరం పరిర్తయేత్ బలభుగ్నాకృతిం దంష్ట్రా మాక్రాంతం తం వినిర్దిశేత్
యస్య సర్పేణ దష్టస్య గభీరం దృశ్యతే వ్రణమ్ వైర దష్టం నీజానీయాత్కశ్యపస్యవచో యథా
ఏకం దంష్ట్రా పదం యస్య అవ్యక్తం నచ కల్పితమ్ భీతదష్టం వీజానీయాద్యథోవాచ ప్రజాపతిః
యస్య సర్పేణ దష్టస్య రేఖా దంతస్య జాయతే మద దష్టం వీజానీయాత్కశ్యపస్య వచోయథా
ద్వేచ దంష్ట్రాపదే యస్య దృశ్యంతేచ మహాక్షతమ్ క్షుధావిష్టం విజానీయాద్యధోవాచ ప్రజాపతిః
ద్వేదంష్ట్రేయస్య దృశ్యతే క్వచిద్రుధిర సంకులే విషోల్బణం విజానీయాద్దంశం తం నాత్రసంశయః
అపత్య రక్షణార్థాయ జానీయాత్తం న సంశయః యత్తుకాక పదాకారం త్రిభిర్దం తైస్తులక్షితమ్
మహానాగ ఇతి ప్రోక్తం కాలదష్టం వినిర్దిశేత్ త్రివిధం దష్టజాతైస్తు లక్షణం సముదాహృతమ్
దష్టానుపీతం విజ్ఞేయం కశ్యపస్యవచోయథా విషభాగాత్తు సర్పస్య త్రిభాగస్తత్ర సంక్రమేత్
ఉదరం దర్శయేద్యస్తు ఉద్ధతం తం వినిర్దిశేత్ ఛర్దినం విషవేగేన నిర్విషః పన్నగో భవేత్
అసాధ్యశ్చాపి విజ్ఞేయశ్చతుర్దంష్ట్రాభిపీడితః గ్రీవాభంగోభవేత్కించిత్సందష్టో విషయోగతః ఇతో దంశస్తతః శుద్దోవ్యంతరం పరికీర్తితః
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రహ్మేపర్వణి
పంచమి కల్పే సర్పదంష్ట్రా వర్ణనం నామ త్రయ స్త్రింశోఽధ్యాయః
తా॥ దంతము వంకరయగుట, కాటు వేసిన పిదప ఉదర భాగమును పైకీ చేసీ వెల్లికిల బడుటయనునవి, ఆక్రమించుటచేత కాటు వేసిన సర్పలక్షణములుగా చెప్పవలెను. కాటువేయబడిన వానికి లోతైన గాయమేర్పడిన యెడల అది పగబట్టిన పాముకాటుగా గుర్తింపవలెనని కశ్యపుడు చేప్పెను. ఒకే దంతపు చిహ్నము అస్పష్టముగా నుండెనేని అది భయపడిన పాముకాటుగా తెలిసికొనవలెనని కశ్యపుని వాక్యము. కఱచిన తావున దంతపు గుర్తు ఒక రేఖవలె ఎర్పడినచో అది మదించిన పాము కాటుగా నెన్నవలెనని ప్రజాపతి చేప్పెను. రెండు దంతముల చిహ్నములతో నతిమాత్రమైన గాయమేర్పడిన యెడల అది ఆకలిగొన్న పాముకాటుగా భావింపవలెను. రెండు పలుగాట్లు నెత్తురోడుచు కన్పట్టినచో నట్టిది విషమతిశయించిన సర్పము వేసిన కాటుగా తెలియవలెను. అచట సందేహమేమియులేదు. మూడు దంతములతో నేర్పడిన కాకపొద చిహ్నము వంటి 'గాటు' పాము తన సంతాన రక్షణ కొఱకు వేసిన కాటు అని యెంచవలెను. కాక పాద చిహ్నము కాలచోదితమైన మహానాగము వేసిన కాటుగా కూడా నిర్దేశింపనగును. ఇట్టి పాము కాట్లు మూడు విధములు. కశ్యపవాక్యముననుసరించి, సర్పము యొక్క విషభాగమునుండి కాటువేసిన తావున మూడు పంతులు విడదల ఐనచో అది 'దష్టానుపీతము'. కాటువేసి కడుపు పైకి చేసి వెల్లికిలబడినచో అది “ఉద్దత'మని నిర్దేశింపవలెను. విషవేగముచేత, సర్పము విషము క్రక్కి అది నిర్విషమయ్యేనేని అది 'ఛర్దిత'మనబడును. పాము తన నాలుగు దంతములతో కాటువేసిన యెడల చికిత్సకు అసాధ్యమగును. పీడితుని మెడ విష ప్రభావము చేత నించుక వంగిపోవును. ఇటు కాటువేయనటు శుద్ధముగనున్న 'వ్యంతర' మనబడును.
శతార్ధ సాహస్ర సంహిత యగు శ్రీ భవిష్య మహా పురుణమునందలి బ్రహ్మపర్వమున, పంచమీకల్పమునందు సర్పదంష్ట్రా వర్ణనమను ముప్పది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 33 of the Bhavishya Purāna - Brahma Parva is as follows:
The medical science of snakebite, embedded within the Nāga-pañcamī section, begins here with a systematic taxonomy of serpent fangs and venom types. Different species of serpents are classified by their fang structure, and the type of venom — neurotoxic, cytotoxic, haemotoxic — is correlated with the serpent's characteristic habitat, colour, and behaviour. This chapter demonstrates the Purāṇa's integration of what we would today call medical knowledge into its ritual-dharmic framework: the knowledge of serpent venom is inseparable from the worship of the nāgas who are its lords. Understanding the snake's nature is itself an act of reverence toward the nāga-devas.