శతానీక ఉవాచ :
గకారాక్షర దేవస్య గణేశస్యమహాత్మనః ఆరాధన విధిం బ్రూహి సాంగం మంత్ర సమన్వితమ్
సుమంతురువాచ :
న తిథిరచ నక్షత్రం నోపవాసో విధీయతే యథేష్టం చేష్టతః సిద్ధిః సదాభవతి కామికా
శ్వేతార్కమూలం సంగృహ్య కుర్యాద్గణపతిం బుధః అంగుష్ఠపర్వ మాత్రంతు పద్మాసన గతం తథా
చతుర్భుజం త్రినేత్రం చ సర్వాభరణ భూషితమ్ నాగయజ్ఞోపవీతాంగం శశాంక కృత శేఖరమ్
దంతం సవ్యేకరే దద్యాద్ద్వితీయే చాక్ష సూత్రకమ్ తృతీయే పరశుం దద్యాచ్చతుర్దే మోదకం న్య సేత్
కుంకుమం చందనం చాపి సమాలంభన ముచ్యతే వాసోభిర్భూషణై రక్తైర్మాల్యైశ్చారాధయేద్గణమ్
ధూ పేన చ సుగంధేన మోదకైశ్చాపి పూజయేత్ ఏవం పూజ్యాగ్రతస్తస్య భోజయేబ్రాహ్మణం బుధః
వామనం కుబ్జకంచాపి పూజయేత్పురతో ద్విజమ్ అశీర్వాదం తతస్తస్మాత్ర్పాప్య సిద్ధిమవాప్నుయాత్
భక్త్యా కురుకుల శ్రేష్ఠ శ్రుణు మంత్ర పదాని పై గం స్వాహా మూలమంత్రోయం ప్రణవేన సమన్విత :
గాం నమో హృదయం జ్ఞేయం గీంశిరః పరికీర్తితమ్ శిఖాచ గూం నమో జ్ఞేయోగైం నమః కవచం స్మృతమ్
గౌం నమో నేత్ర ముద్దిష్టం గఃఫట్ కామాస్త్రముచ్యతే ఆగచ్చోల్కాముఖాయేతి మంత్ర ఆవాహనే హ్యయమ్.
తా॥ శతానీకుడిట్లనెను. గకారాక్షరదేవుడు, మహాత్ముడునైన గణేశ్వరుని పూజావిధిని, అంగములతో మంత్రములతో సహానాకు చెప్పుడు-1. సుమంతుముని ఇట్లు చెప్పదొడగెను. వినాయకుని పూజకోకు తిథి, నక్షత్రము, ఉపవాస విధులు ప్రత్యేకముగ ఏమియునులేవు. స్వేచ్ఛగా ఎప్పుడు ఎట్లు చేసినను కోరిన కోరిక సిద్ధించును-2. తెల్ల జిల్లేడు వేరు తెచ్చి దానితో బొట్టనవ్రేలి కణుపు పరిమాణమున పద్మాసనమున నున్న గణపతిని చేయవలెను-3. పండితుడైనవాడు ఆ గణపతిని, నాలుగు భుజములు, మూడుకన్నులు గలవానిగను, వివిధములైన ఆభరణములు, సర్పయజ్ఞోపవీతము ధరించిన వానిగను, శేఖరమున చంద్రరేఖను ధరించిన వానిగను-4. ఎడమ చేతియందు దంతమును, కుడిచేత జపమాల, మూడవచేత గొడ్డలి (పరశువు), నాల్గవ చేతిలో లడువము ధరించిన వానిగను నిర్మింపవలెను-5. కుంకుమము, చందనము కలిపి “సమాలంభన'మనబడును. అట్టి సమాలంభనముతో, వస్త్రభూషణములతో, ఎఱ్ఱని పుష్పములతో గణనాయకుని పూజింపవలెను-6. సుగంధధూపము, లడ్డువములు (ఉండ్రాళ్లు) సమర్పింపవలెను. ఇట్లు పూజించుముందు బ్రాహ్మణునకు భోజనము పెట్టవలెను-7. పొట్టివాడు, మరుగుజ్జువాడునైన బ్రాహ్మణునకు పూజకంటేముందు భోజనము పెట్టవలెను. అతని ఆశీర్వాదముతో సిద్ధి కలుగును-8. కురుకుల శ్రేష్టా! మంత్రపదములు చెప్పుచున్నాను. భక్తితో వినుము. ఓం గం స్వాహా” ఇది మూలమంత్రము-9 గాం నమః' హృదయమని, 'గీం'నమః శిరస్సని, 'గూం నమః శిఖయని, గైం నమ:” కవచమని-10. గౌంనమః' నేత్రములనుద్దేశించినవియని 'గః ఫట్ కామాస్త్రమనియు చెప్పబడును. ఆగచ్ఛ ఉల్కాముఖాయ' అనుమంత్రము ఇతని ఆవాహనమునందు వినియోగింపవలెను.
మూ. గం గణేశాయ నమో గంధమంత్రః ప్రకీర్తితః పుష్పోలాయ నమః పుష్ప మంత్ర ఏషః ప్రకీర్తితః
ధూపోల్కాయనమో ధూపమంత్ర ఏష ప్రకీర్తితః దీపోల్కాయ నమో దీప మంత్ర ఏష ప్రకీర్తితః
ఓం గం మహోల్కాయనమో బలిమంత్రః ప్రకీర్తితః ఓం సంసిద్ధోల్కాయ నమో మంత్రశ్చాయం విసర్జనే
ఓం మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్ గాయత్రీ జపఃపూర్వతః
మహా గణపతయే వీర! స్వాహా దక్షిణతః సదా మహోల్కాయ పశ్చిమతః కూశ్మాండయోత్తరేణతు ఏకదంత త్రిపురాంతకాయ ఆగ్నేయ్యాం వీర! నిర్దిశేత్
ఓం శివదత్త వికటహరహాస ప్రాణాయ స్వాహా నైర్ఋత్యామ్ తులంబనాత్యచల దంతకాయ స్వాహా వాయవ్యామ్
పద్మదంష్ట్రాయ నరాయేతి ఐశాన్యాం హోమరేద్భుధః హుంఫట్ హుంఫట్ హస్త తాలధ్వనిరసన కూర్దనః
మృద నర్తన గణపతిర్దేవస్యముద్రాంతతో హోమంసమాచరేత్ న యదా వశ్యా భవతి! కృష్ణతిలాహుతి మష్టసహస్రం జహుయాత్రి రాత్రేణ రాజా వశ్యోభవతి
తిలయవహోమేన సర్వే జనపదా వశ్యాభవంతి! అతి రూపవతీ కన్యా గచ్ఛంతమను గచ్ఛతి
తా॥ గం గణేశాయనమః” ఇది గంధమంత్రమని చెప్పబడినది. పుష్పోలాయనమః' ఇది పుష్పమంత్రము-12. “ధూపోల్కాయనమ”: ఇది ధూపమంత్రము “దీపోల్కాయనమ:” ఇది దీపమంత్రము-13. ఓం గం మహోల్కాయనమః” ఇది బలిమంత్రమని చెప్పబడును. ఓం సంసిదోల్కాయనమ:” ఈ మంత్రము విసర్జనమునందు వినియోగింపబడును-14. ఓం మహాకర్ణాయ విద్మహే! వక్రతుండాయ ధీమహి! తన్నో దంతిః ప్రచోదయాత్" అని గణపతి గాయత్రీమంత్రముతో తూర్పునను-15. మహగణపతయే స్వాహా' అని దక్షిణమునను, “మహోల్కాయ' అని పడమరయందును, 'కూశ్మాండాయ' అని ఉత్తరమునను, “ఏకదంత త్రిపురాంతకాయ' అని గ్నేయదిశయందును-16. ఓం శివదత్త వికటహర హాసప్రాణాయ స్వాహా” అని నైరృతి దిశయందు, తులంబనాత్యచల దంతకాయ స్వాహా' అని వాయవ్యమునందును-17. పద్మదంష్ట్రాయ నరాయ' అని ఈశాన్యమునను, స్వాహాకారములతో హోమము చేయవలెను. “హుంఫట్ హుంఫట్ అని చప్పట్లుకొట్టుచు నవ్వుచువాడవలెను-18. 'బహుభంగుల నాట్యమాడు గణపతిదేవుని ముద్రను ప్రదర్శించి అప్పుడు హోమము చేయవలెను. అన్నియునిచ్చు దేవత వశమగును. నల్లని నువ్వులతో నెనిమిది వేల పర్యాయములాహుతులిచ్చినచో మూడు రాత్రులలో రాజు వశుడగును-19. తిలలు, యువలు హోమము చేసినచో జానపదులందఱు వశ్యులగుదురు. మిక్కిలి రూపవతియైన కన్య పోవుచున్న వాని వెంటపడును.
మూ. చణ తండుల హోమేనాజితో భవేత్!! నింబపత్ర సమైస్తైలై ర్విద్వేషణం కరోతి॥
సోమగ్రహణే ఉదక మధ్యే అవతీర్య"అష్టసహస్రరిజ పేత్॥ సంగ్రామే అపరాజితో భవతి (ఓం లంబరాజ్ఞేనమః) ఆదిత్యాభిముఖోభూత్వా అష్టసహస్రం జపేత్॥
ఆదిత్యో వరదోభవతి
శుక్ల చతుర్ధ్యాముపోష్య గంధపుష్పాదిభిరర్చ నంకృత్వా తిల తండులాన్ జుహుయాత్॥ శిరసాధారయం స్తైరపరాజితో భవతి
అపామార్గ సమిద్భి రగ్నిం ప్రజ్వాల్య ఏకవింశత్యాహుతీర్యో జుహుయాత్॥ త్రిరాత్రాచ్ఛత్రుం వ్యాపాదయతి
అధోత్తరేణ మంత్రం వ్యాఖాస్యే!! వృక్షమూలే కజ్జలం సంగృహ్య
సప్తభిర్మంత్రితం కృత్వానేత్రాణ్యంజయేద్యం పశ్యతి సవశీభవతి
పుష్పం ఫలం మూలంచాష్ట్ర సహస్రాభిమంత్రితం కృత్వాయ స్మై దదాతి స వశ్యోభవతి
యత్కించిన్మూలమంత్రేణ కరోతి తత్సిద్ధ్యతి॥ సర్వేగ్రహాః
సుప్రీతా భవంతి॥ నగరద్వారం గత్వా అష్టసహస్రం ద్వారం నిరూపయేత్
పురం ద్వారేణ గృహ్యతే ప్రాజ్మఖోయజతి స ఉచ్చాటయతి!! సంముఖోజపతి చోరాన్విద్రావయతి
తృణానిలూనయతి!! కాష్ఠానిచ్ఛేదయతి
గజరాజేన యుద్దయతి జలమధ్యే సప్త రాత్రం జపేత్॥ అకాలే వర్షయతీ॥ కూప తడాకాన్ శోషయతి॥
ప్రతిమం నృత్యయతి॥ ఆకర్షయతి!! స్తంభయతి॥ యోజనశతాత్ స్త్రీ పురుషానాకర్షయతి
తా॥ సెనగలు, బియ్యముతో హోమము చేసినచో దుర్జయుడగును. వేపాకులు, సమస్తతైలములతోచేసినచో విద్వేషణము చేయును. చంద్రగ్రహణ సమయమున నీటిలోనికి దిగి ఎనిమిది వేల జపము చేయవలెను. యుద్ధమున పరాజయము లేని వాడగును-21. ఓం లంబరాజైనమః) సూర్యునకభీముఖుడై ఎనిమిదివేల జపము చేయవలెను. సూర్యుడు వరమిచ్చును-22. శుక్లపక్ష చతుర్థినాడు ఉపవసించి, గంధపుష్పాదులతో పూజించి నువ్వులు బియ్యమును హోమము చేయవలెను. వానిని తలపై ధరించిన పరాజయము లేని వాడగును-23. ఉత్తరేని సమిధలతో అగ్నిని ప్రజ్వలింపజేసి అందు ఇరువది యొక్క ఆహుతులతో హవనము చేసినవాడు మూడు రాత్రుల వఱకు శత్రువును సంహరించును-24. ఇక అటుపిమ్మట మంత్రమును వ్యాఖ్యానింతును. వృక్షమూలమునందలి కాటుకను తీసికొని ఏడు పర్యాయములభిమంత్రించి దానిని కన్నులకు అంజనముగా పెట్టుకొనినవాడు ఎవనిని చూచునో వాడు వానికి వశుడగును-25. పుష్పమును గాని, ఫలమునుగాని, వేరును గాని, ఎనిమిది వేల మంత్ర జపముతోనభిమంత్రించి దానిని ఎవనికిత్తురో వాడు వశమగును-26. మూలమంత్రమే కొంచెము జపించినను అది సిద్దిప్రదమగును. గ్రహములన్నియు ప్రీతిజెందును. నగర ద్వారము వద్దకుపోయి ఎనిమిదివేల జపము చేసి ఎనిమిదివేల ద్వారములుగా నిరూపింపవలెను-27. ఒక్కొక్కద్వారముచే ఆపురము వశీభూతమగును. తూర్పుముఖముగా యజించువాడు 'ఉచ్చాటనము' చేయగలుగును. ఎదురుగా జపించినచో దొంగలను పరుగెత్తింపగలుగును-28. గడ్డిని కోయింపగలడు. కఱ్ఱలను విరుగునట్లోనరింపగలడు-29. ఏనుగుచేత యుద్దము చేయింపగలడు. నీటి మధ్యభాగమున ఏడురాత్రులు జపింపవలెను. అకాలమున వర్షింపజేయును. బావులు, చెఱువులను ఎండింపజేయును. బొమ్మచేత నాట్యమాడించును, ఆకర్షించును. స్తంభనము చేయును. నూజుయోజనముల దూరము నుండి స్త్రీ పురుషులను ఆకర్షించును.
మూ. గోరోచనాం చ సహస్రాభిమంత్రితాంకృత్వాహస్తే బద్ద్వా యోజన శత సహస్రం గత్వా పునరాగచ్ఛతి
అధ మారయితుకామః ఖదిర కీలకం కృత్వా స్త్రీ పురుషం విచింత్య హృదయే నిఖనయేత్॥ క్షణాదేవప్రియతే
సర్వపాతక విముక్తోభవతి॥ అగ్ని తేజాః సర్వేభ్యోఽపరాజితో భవతి
ఓం వక్రతుండాయస్వాహా॥ ఓం ఏక దంష్ట్రాయ స్వాహా॥ ఓం కృత కృష్ణాయస్వాహా॥ఓం గజకర్ణాయ స్వాహా । ఓం లంబోదరాయ స్వాహా । ఓం వికటాయ స్వాహా ॥ ఓం ధూమ్ర వర్ణాయ స్వాహా ॥ ఓం గగన కూజాయ స్వాహా ఓం వినాయకాయ స్వాహా॥ ఓం గణపతియే స్వాహా!! ఓం హస్తిముఖాయ స్వాహా
ఇతి శ్రీ భవిష్యే మహా పురాణే శతార్ధ సాహస్ర్యాం సంహితాయాం బ్రా హ్మే పర్వణి
చతుర్ధికల్పే గణపతి కల్ప వర్ణనం నామైకోన త్రింశోఽధ్యాయః
తా॥ గోరోచనమును వేయి మారులభిమంత్రించి చేతికి కట్టుకొనినచో లక్షయోజనముల దూరము పోయి తిరిగివచ్చును-31. ఇక ఎవరినైనను చంపనిచ్చగలవాడు చండ్రకఱ్ఱతో నొక గూటము సిద్దపరచి మారణము చేయదలచిన స్త్రీ లేక పురుషుని భావించి ఈ గూటమును వారి హృదయమున నాటవలెను. (మనస్సున భావింపవలెను.) క్షణములో మరణించును-32. సర్వపాపముల నుండి ముక్తుడగును. అగ్నివలె తేజస్వియై అందటికిని జయింపరాని వాడగును-33. ఓం వక్రతుండాయ స్వాహా, ఓం ఏక దంష్ట్రాయస్వాహా ఓం కృతకృష్ణాయ స్వాహా, ఓం గజకర్ణాయ స్వాహా, ఓం లంబోదరాయ స్వాహా, ఓం వికటాయస్వాహా, ఓం ధూమ్రవర్ణాయ స్వాహా, ఓం గగనకూజాయ స్వాహా, ఓం వినాయకాయ స్వాహా, ఓం గణపతయే స్వాహా, ఓం హస్తిముఖాయ స్వాహా-34.ఇవి గణపతికి హవిర్దానము చేయు మంత్రములు.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీభవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున చతుర్ధికల్పములోని గణపతి కల్నవర్ణనమను ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 29 of the Bhavishya Purāna - Brahma Parva is as follows:
The Gaṇapati Kalpa presents the esoteric or tantric dimension of Gaṇeśa worship alongside the more exoteric pūjā procedures. The mūla mantras of Gaṇeśa — the seed syllables by which his presence is invoked — are given, and their powers described: mantras for śānti, for vaśīkaraṇa (attracting others to oneself), for uccāṭana (removing an enemy's influence), for eliminating disease, and for obtaining success in examinations and competitions. The materials to be used for each purpose — specific woods, flowers, incense, and food offerings — are specified. The chapter represents the integration of the Āgamic-Tantric tradition of Gaṇeśa worship into the Purāṇic framework of the Bhaviṣya, making available to the householder the powerful ritual technology developed by the tantric schools.