మూ! బ్రహ్మోవాచ :
యశ్చ దేవాలయం భక్త్యా భానో: కారయతే స్థిరమ్ స సప్త పురుషాన్లోకాన్బానోర్నయతి మానవః
యావంత్యబ్ధాని దేవార్చా రవేస్తిష్ఠతి మందిరే తావద్వర్ష సహస్రాణి సూర్యలోకే స మోదతే
దేవార్చా లక్షణో పేతా యద్గృహే సంతతో విధిః నిష్కామం వా మనో యస్య స యాతి రవి సామ్యతామ్
పుష్పాణ్యతి సుగంధీని మనోజ్ఞాని చ యః పుమాన్ ప్రయచ్ఛతి హి. దేవేశం తద్భావ గత మానసః
ధూపాంశ్చ వివిధాంస్తాంస్తానంధాఢ్యం చానులేపయేత్ దీప బల్యుప హారాంశ్చ యచ్చాభీష్టమధాత్మనః
నరః సోఽనుదినం యజ్ఞాత్ర్పాప్నోత్యారాధనా ద్రవేః యజేశో భగవాన్భానుర్మఖైరపి చ తోష్యతే
బహూపకరణా యజ్ఞా నానా సంభారవిస్తరాః ప్రాప్యంతే తైరన యుతైర్మను ష్యైర్లోక సంచయైః
భక్త్యాతు పురు షైః పూజా కృతా దూర్వాంకురైరపి రవేర్దదాతి హి ఫలం సర్వయజ్ఞైః సుదుర్లభమ్
యాని పుష్పాణి భక్ష్యాణి ధూప గంధానులేపనమ్ దయితం భూషణం యచ్చ రక్తకే చైవ వాససీ
యాని చాభ్యుపహారాణి భక్ష్యాణి చ ఫలానిచ ప్రయచ్ఛ తాని దేవేశ భవేధాశ్చైవ తన్మనాః
తా. బ్రహ్మ ఇట్లనెను. “సూర్యదేవునకు భక్తితో స్థిరమైన ఆలయమును నిర్మింపజేయువాడు ఏడు తరముల పురుషులను సూర్యలోకమునకు జేర్చగలడు. ఆ దేవాలయమున నెన్ని సంవత్సరములు అర్చన జరిపించునో, అన్ని వేల సంవత్సరములాతడు సూర్య లోకమున నానందింపుచుండగలడు. ఎవని గృహమున విధ్యుక్తముగా సూర్యపూజ జరుగుచుండునో, ఎవని మనస్సు నిష్కామముగనుండునో అట్టివాడు సూర్య దేవునితో సమానుడగును. సూర్య భగవానునకు పరిమళ భరితములును, సుందరములునైన పుష్పములను తదేక చిత్తముతో. ఆయా ధూపములును, పరిమళ భరితమైన విలేపమును, దీపము, బలి, వివిధ నైవేద్యములును, ఆదేవునకు ఇష్టమగు వస్తువులును. ఆయనకు సమర్పించుచు ప్రతి దినమారాధించువానికి సూర్య యజ్ఞ ఫలము కలుగును. సూర్య భగవానుడు యజ్ఞేశ్వరుడైనందున యజ్ఞముల వలన కూడా సంతుష్టినందును . కాని యజ్ఞములు నిర్వహింపవలెననిన బహూపకరణములు, నానా సంభారములు కావలెను. అట్టివి మిక్కిలి ధనవంతులైన వారికి మాత్రమే సంపాదించుటకు వీలుపడును. భక్తి కలిగి గడ్డి పరకలతో భాస్కరార్చన చేసిన యెడల కూడ మిక్కిలి దుర్లభమగు యజ్ఞముల ఫలము లభించును. సూర్య భగవానునకు అర్పింపదగిన పుష్పములు, భోజ్య పదార్థములు ( నైవేద్యము), ధూపము, గంథము, విలేపనములు, శ్రేష్ఠుములైన భూషణములు, ఎఱ్ఱని వస్త్రములు. ఉపహారములు, భక్ష్యములు, ఫలములు - ఇవియన్నియును సూర్యదేవునకనురూపమైనవిగ నుండవలెను.
మూ॥ ఆద్యంతం యజ్ఞ పురుషం యథాశక్త్యా ప్రసాదయ ఆరాధ్య స్థాపితం దేవం తస్మిన్నేవ నరాలయే
పుణ్యైస్తీర్థోదకైర్గంధైర్మధునా సరిషా తథా క్షీరేణ స్నాపయేద్దేపం చిత్రభానుం దివాకరమ్
దధిక్షీర ప్రదాన్యాతి స్వర్గలోకాన్మధుచ్యుతాన్ ప్రయాస్యతి యదుశ్రేష్ఠ! నిర్వృతిం వాపి శాశ్వతమ్
స్తో త్రైర్గీతై స్తథావా ద్యైర్భ్రాహ్మణానాంచ తర్ప ణైః: మనసశ్చైకతా యోగాదారాధయ విభావసుమ్
ఆరాధ్యతం విదేహానాం పురుషాః సప్తసప్తతి: హైహయానాంచ పంచాశ దమృతత్వం సమాగతాః
సత్వమేభిః ప్రకారైస్తముపవాసైస్తు భాస్కరమ్ సంతోషయ హి తుష్టోఽసౌ భానుర్భవతి శాంతిదః
కృష్ణ ఉవాచ :
ఉపవా సైశ్చత్రభానుః కథంతుష్టః ప్రజాయతే పరిచర్య కథం కార్యా యా కార్యాచోపవాసినా
యద్యత్కార్యం యదాచైవ భానోరారాధనం నరైః తత్సర్వం విస్తరాద్ర్బహ్మన్యథావద్వ క్తుమర్హసి
బ్రహ్మోవాచ :
స్మృతః సంపూజితో ధూప పుష్పాద్యైః స సదా రవిః భోగినాముపకారాయ కింపునశ్చోపవాసినామ్
ఉపావృతస్తు పాపేభ్యో యస్తు వాసో గుణైః సహ ఉపవాసః స విజ్ఞేయః సర్వభోగ వివర్జితః
తా. అదే మానవ నిర్మితమైన ఆలయమునందు స్థాపింపబడిన నా యజ్ఞపురుషుడును, ఆది దేవుడునైన సూర్యభగవానునకు అతని కనుకూలమైన ఆయా వస్తువులను సమర్పింపవలెను. చిత్రభానుడైన దివాకరుని పుణ్యతీర్దములనుండి కొని రాబడిన యుదకములతోను, పరిమళ భరితములైన జలములతోను, తేనెతోను, నేయితోను, పాలతోను అభి షేకింపవలెను. అటు లభి షేకించువాడు పాలు పెరుగుల ప్రదములు పొందును. తేనెలూరు స్వర్గధామములు పొందును. లేక శాశ్వతమైన శాంతిని పొందును. స్తోత్రములతోను, గీత ములతోను, వాద్యములతోను, బ్రాహ్మణ సంతర్పణలతోను, ఏకాగ్రచిత్తుడవై విభావసునారాధింపుము . అటులారాధించియే విదేహ వంశీయులగు జనకాదులు డెబ్బది యేడుగురు పురుషాంతరములవారు, హైహయవంశీయులేబది పురుషాంతరముల వారును అమృతత్వమును పొందిరి. ఈ విధమైన ఉపవాసాది వ్రతాచరణములచే నీవు సూర్య భగవానుని సంతోషింపఁజేయుము. అతడు తుష్టుడై శాంతినిచ్చువాడగును”. కృష్ణ భగవానుడిట్లనెను. “చిత్రభానుడు ఉపవాసములచే నెట్లు తుష్టినందును? ఉపవాసి యగువాడాదేవున కెట్లు సేవచేయవలెను?. భానుదేవుని యారాధనమున నెప్పుడెప్పుడేయే కార్యములు చేయవలెనో అంతయును నాకు సాకల్యముగ దెలుపుడు”. బ్రహ్మదేవుడిట్లు సమాధానము చెప్పెను. భోగ పరాయణులైనను ఆ దేవేశుని గంధ పుష్పాదులతో నర్చించి, ఆతని స్మరించియు శుభఫలములు పొందుదురనగా నిఁక ఉపవాస దీక్షితులగు వారి విషయము చెప్పనేల?. పాపములకు దూరముగా నుండుట, సద్గుణములనవలంబించి భోగ విముఖులై యుండుటయే ఉపవాసమని తెలియవలెను.
ఏకరాత్రం ద్విరాత్రంతా త్రిరాత్రమధవా హరే! ఉపవాసీ రవిం యస్తు భక్త్యాధ్యాయతి మానవః
తన్నామ యాజీ తత్కర్మరతస్తద్గత మానసః నిష్కామః పూజయిత్వాతం పరం బ్రహ్మాధిగచ్ఛతి
యశ్చ కామ మభిధ్యాయ భాస్కరార్పిత మానసః ఉపోషతి తమాప్నోతి ప్రసన్నేతు వృషధ్వజే
శ్రీ కృష్ణ ఉవాచ :
బ్రాహ్మణైః క్షత్రియైర్వెశ్వై: శూద్రైః స్త్రీభిస్తథా విభో! సంసారగర్త పంకస్థైః సుగతిః ప్రాప్యతే కథమ్?
బ్రహ్మోవాచ :
అథారాధ్య జగన్నాథం భాస్కరం తిమిరాపహమ్ నిర్వ్యలీకేన చిత్తేన ప్రయాస్యతిచ సద్గతిమ్
విషయ గ్రాహ వైషమ్యం నచిత్తం భాస్కరార్పణమ్ స కథం పాపకర్తావై సరో యాస్యతి సద్గతిమ్?
యది సంసార దుఃఖార్తః సుగతిం గంతు మిచ్ఛసి తదా రాధయ సర్వేశం గ్రహేశం లోక పూజితమ్
పుష్పైః సుగంధై ర్హృద్యైశ్చధూ పైః సాగురు చందనైః వాసో విభూషణైర్భక్ష్యై రుపవాస పరాయణః
యది సంసార నిర్వేదాదభి వాంఛసి సద్గతిమ్ తదారాధయ కాలేశం యచేష్టం తవచేతసా
పుష్పాణి యది తే నస్యుః శస్తం పాదప పల్లవైః దూర్వాంకురైరపి కృష్ణ! తదభావేఽర్చయేద్రవిమ్
తా. ఒక రాత్రిగాని, రెండు రాత్రులుగాని, మూడు రాత్రులు గాని యుపవాసము చేసి, భక్తితో సూర్య భగవానుని ధ్యానించు మానవుడు . అతని నామమునే స్మరించుచు, అతనికి సంబంధించిన కర్మయందే యిచ్చగల మనస్సు గలవాడై, నిష్కాముడై యాదేవునే పూజించివాడు పర బ్రహ్మను పొందును. ఏ యభీష్టమునైనను సిద్దింపఁజేసికొనఁగోరువాడు, సూర్యదేవుని యందు మనస్సు నిలిపి ఉపవసించినచో నా దేవుడు ప్రసన్నుడు కాగా అతని యభీష్టము నెరవేరును” . శ్రీకృష్ణ భగవానుడిట్లనెను. "బ్రహ్మదేవా! సంసారమనేడు బురద గుంటలో నున్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులెవరైనను సద్గతిని పొందుట యెట్లు సాధ్యమగును?. బ్రహ్మదేవుడిట్లు సమాధానము చెప్పెను. “చీకట్లను తొలగించు. జగత్ర్పభువగు భాస్కర దేవుని నిష్కపట చిత్తముతో నారాధించి సుగతిని పొందనగును. విషయ వాంఛలనెడు మొసళ్లచే విషమించినదియు, సూర్య భగవానుని కర్పింపబడనిదియునైన చిత్తముగల పాపకర్ముడు సద్గతి నెట్లు పొందగలడు?. సంసారదుఃఖముతో బాధపడుచున్న నీవు సుగతిని బడయ గోరేదవేని, లోక పూజితుడు, గ్రహేశ్వరుడు సర్వేశుడునైన సూర్య దేవునారాధింపుము . ఉపవాస పరాయణుడవై సుందరములైన సుగంధ పుష్పములతోను, అగురు, చందన, ధూపములతోను, వస్త్రాభరణములచేతను, భక్ష్య భోజ్యాదులతోను ఆ దేవుని పూజింపుము. సంసార శోకమునుండి ముక్తుడవై సద్గతి నంద గోరెదవేని, కోలేశ్వరుడైన సూర్యదేవుని నీ మనస్సునకు నచ్చిన రీతిగా పూజింపుము. పుష్పములు లభించని యెడ, చెట్ల చిగుళ్లతోను, అవియును దొరకనిచో, గజిక మొలకలతోనైనను ఆ దేవుని పూజించుట ప్రశస్తమగును.
మూII పుష్ప పత్రాంబుభిర్దూ పైర్యధా విభవ మాత్మనః పూజితస్తుష్టిమతులాం భక్త్యా యత్యేక చేతసామ్
యః సదాయతనే భానో: కుర్యాత్సంమార్జనం నరః స పాంసు దేహ సంయోగా త్సర్వ పాపైః ప్రముచ్యతే
యావత్యః పాంసుకణికా మార్జ్యతే భాస్కరాలయే దినాని దివి దివ్యాని తావంతి మోదతే నరః
స బాహ్యాభ్యంతరం వేశ్మ మార్జతే భాస్కరస్యయః స బాహ్యాభ్యంతర స్తస్య కా యో నిష్కల్మషో భవేత్
యశ్చాను లేపనం కుర్యాద్భానోరాయతనే నరః స హేలి లోక మాసాద్య మోదతే గోగతే హరౌ
మృదావా మృద్వి కారైర్వా వర్ణకైర్గోమయేన వా అనులేపన కృద్భక్త్యా నరో గోపతి మాప్నుయాత్
ఉదకాభ్యుక్షణం భానోర్యః కరోతి తథాక్షయే స గచ్ఛతి నరః కృష్ణ! యత్రాస్తే గోపతిః సదా
పుష్పప్రకరమత్యర్థం సుగంధం భాస్కరాలయే అను లిప్తే నరో దద్యాత్పూషోత్తర గృహం ప్రజేత్
విమాన పర మభ్యేతి సర్వరత్నమయం దివి సంప్రాప్నోతి నరో దత్వా దీపకం భాస్కరాలయే
యస్తు సంవత్సరం పూర్ణం తిలపాత్రప్రదోనరః ధ్వజంచ భాస్కరే దద్యాత్సమమత్ర ఫలం లభేత్
తా॥ పుష్పములతో, పత్రములతో, ఉదకములతోను, తన శక్తిననుసరించి, భక్తితో, ఏకాగ్ర చిత్తముతోను పూజించినచో నా దేవేశుడు మిక్కిలి తృప్తినొందును. సూర్య భగవానుని యాలయమున నెల్లప్పుడును సమ్మర్జనము చేసి శుభ్రపఱచువాడు, మాలిన్యముతో గూడిన శరీర సంయోగమునుండి, సర్వ పాపములనుండియు ముక్తుడగును. భాస్కరాలయమునందెన్ని ధూళి రేణువులనూడ్చివేయునో అన్నీ దివ్య దినములు స్వర్గ సౌఖ్యమనుభవించుచుండును. వెలుపల, లోపల సూర్యమందిరమున నూడ్చి శుభ్రము చేయువాని శరీరము సబాహ్యాభ్యంతరముగ పవిత్రమగును-34. సూర్యాయతనమున నలికి శుభ్రము చేయువాడు సూర్య లోకమును జేరి విష్ణుదేవునితో నానందించును. మట్టితో గాని, మట్టికి సంబంధించిన వానితో గాని, వర్ణములతో గాని, ఆవు పేడతోగాని, భక్తి పురస్పరముగ నలుకు(బూతలు చేయువాడు సూర్యభగవానుని చేరును. సూర్యాలయమున నీరు చల్లి శుభ్రపఅచువాడు సూర్య స్థానమును చేరును. అలికిన మందిరమున వివిధములైన సుగంధ 'పుష్ప సమూహములతో నలంకరించువాడును సూర్య స్థానమును చేరును. సూర్య మందిరమున దీపమును వెలిగించువాడు బహురత్నమయమైన దివ్య విమానోరూధుడై స్వర్గమును చేరును. సూర్య మందిరమున కొక సంవత్సరము వఱకును తలపాత్రము, ధ్వజమును, సమకూర్చువాని కట్టి ఫలమే కలుగును.
మూ॥ వీధునోత్యతి వాతేన దాతుర జ్ఞానతః కృతమ్ పాపం దాతుర్గృహే భానుర్దివా రాత్రౌ న సంశయః
గీత వాద్యాదిభిర్దేవం య ఉపాస్తే విభావసుమ్ గంధర్వ నృత్యర్వాద్యైశ్చ విమానస్థో నిషేవ్యతే
జాతి స్మరత్వం వృద్ధించ తతస్తు పరమాంగతిమ్ ప్రాప్నోతి హేలేరాయతనే పుణ్యాఖ్యాన కథా కరః
తస్మాత్కుర్యాత్ప్ర యత్నేన పూజయేద్వాపి వాచకమ్ నాన్యత్ప్రీతికరం భానోః పుణ్యాఖ్యానాదృతే క్వచిత్
ఏకోపి హేలే: సకృతః ప్రణామో దశాశ్వమేధావభృతేన తుల్య: దశాశ్వమేథ పునరేతి జన్మ హేలిప్రణామి న పునర్భవాయ
ఏవం దేవేశ్వరో భక్త్యాయేన భానురుపాసితః సప్రాప్నోతి గతిం శ్లాఘ్యం యా మిచ్ఛతి చ చేతసా
తమారాధ్య మయా ప్రాప్తం బ్రహ్మత్వం లోక పూజితమ్ సౌరేర్యధేప్సితః ప్రాప్తం త్వయా తస్మాత్పురానఘ!
బ్రహ్మహత్యాభి భూతస్తు గోశ్రుతాభరణో హరః తమా రాధ్య రవీం భక్త్యా ము క్తోఽసౌ బ్రహ్మహత్యయా
దేవత్వం మనుజైః కైశ్చిద్గంధర్వత్వం తథాపరైః విద్యాధరత్వ మపరై రేవాప్తం హి దివాకరాత్
లేఖః క్రతు శతేనేశ మారాధ్యైనం దివాకరమ్ ఇంద్రత్వ మగమత్తస్మాన్నాన్యః పూజ్యోదివాకరాత్
దేవేభ్యోష్యతి పూజ్యస్తు స్వగురుర్ర్బహ్మచారిణా తస్మాత్స యజ్ఞపురుషో వివస్వాన్పూజ్య ఏ వ హి
స్త్రీయాశ్చ భర్తార మృతే పూజ్యోఽత్యంతం విభావసుః భర్తృర్గృహస్థస్యసతః పూజ్యో గోపతి రంశుమాన్
వైశ్యానా మపి చారాధ్యస్తపోభిస్తమ నాశనః ధ్యేయః పరివ్రాజకానాం సదా దేవో విభావసుః
ఏవం సర్వాశ్రమాణాం హి చిత్రభానుః పరాయణమ్ సర్వేషాం చైవ వర్ణానాం తమారా ధ్యాప్నుయాద్గతిమ్
ఇతి శ్రీ భవిష్యే మహా పురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్సే సూర్యపూజా మహిమా వర్ణనం నామ త్ర్యధిక శతతమోఽధ్యాయః
తా॥ తీవ్రమైన గాలి కా ధ్వజము కదలునట్లు, దాత, తెలియక చేసిన పాపము కంపించిపోవును. సూర్యదేవుడాతని యింట రాత్రింబవలు ప్రకాశించుచుండును. సందేహములేదు. దేవ రథమున నుండి, గీత వాద్యములతోను, అభివృద్దిని, అటుపిమ్మట పరమగతిని పొందగలడు. దేవుని సమక్షమున పుణ్య కథా శ్రవణములను నిర్వహించువాడును ఈ ఫలములను పొందును. పుణ్య కథా శ్రవణాదులనుమించి సూర్యదేవునకు ప్రీతికరమైన దేదియు లేదు. అందుచే నట్టి పురాణ ప్రవచనములను సర్వ ప్రయత్నములతో జరిపించుచు, పౌరాణికుని యధావిధిగా పూజింపవలేను. సూర్య భగవానునకు చేసిన ఒక్క నమస్కారమైనను మిక్కిలి పుణ్యప్రదమైనది. అది పది అశ్వమేథ యాగములు పూర్తి చేసి యవభృథ స్నానములు చేసిన ఫలముతో సమానమైనది. పది అశ్వ మేథములు చేసిన వాడైనను మఱల జన్మించును. కాని సూర్య నమస్కారము చేసిన వారికి పునర్జన్మ లేదు. ఇట్లు దేవదేవుడైన సూర్య భగవానుని భక్తితో నుపాసించినవాడు తన మనస్సున కోరిన యుత్తమ గతిని పొందును. ఆ దేవునర్చించి యుండుట వలననే నాకీ లోకపూజ్యమైన బ్రహ్మత్వము లభించినది. ఆ దేవుని వలననే నీవును నీవు కోరిన విష్ణుత్వమును పొందియుంటివి. బ్రహ్మ హత్యాదోషమున తెగబడిన శివుడా సూర్య దేవు నర్చించియే అట్టి బ్రహ్మహత్యాపాపము నుండి ముక్తుడయ్యెను. మానవులు కొందఱు దేవత్వమును, మణికొందఱు గంధర్వత్వమును, ఇంక కొందఱు విద్యాధరత్వమును సూర్యో పాసనఁజేసి యా దేవుని వలన పొందగలిగిరి. సూర్యదేవుని నూజు క్రతువులతో నారాధించి దేవజాతి పురుషుడింద్రపదవిని పొందెను. కాబట్టి యా దివాకర దేవుని కంటే పూజ్యుడన్యుడు లేడు. బ్రహ్మచారియైన వాడితర దేవతలందజ కంటెను స్వగురువైన సూర్యదేవునే పూజింపవలెను. వివస్వంతుడు యజ్ఞపురుషుడైనందున నాతడే యందకిని పూజ్యుడగును. స్త్రీలు కూడ తమతమ భర్తలతో(బాటుగా సూర్యదేవునే భక్తి శ్రద్ధలతో పూజింపవలెను. గృహస్థుడైన 'పతి'కి కూడ నెల్లప్పుడును సూర్య భగవానుడే పూజింప దగినవాడు. వైశ్యులకు తపస్సులచేతను, యతి వరులకు ధ్యానములచేతను ఆ దేవుడే ఆరాధింపఁదగినవాడు. ఈ విధముగ నన్ని యాశ్రమములవారికిని ఆ చిత్రభానుడే ఆశ్రయింపదగినవాడు. అన్ని వర్ణముల వారికిని ఆతని నారాధించుట చేతనే సద్గతి కలుగును.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు సూర్య పూజా మహిమ వర్ణనమను నూటమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 103 of the Bhavishya Purāna - Brahma Parva is as follows:
A comprehensive summary of the cumulative power of all the Sūrya worship practices taught in the Saptamī Kalpa is given. The devotee who has faithfully performed any combination of these vratas, worship procedures, and acts of temple service has accumulated a store of sūrya-tejas — solar radiance — in the subtle body that purifies and illumines the jīva from within. This accumulated tejas, the chapter teaches, manifests in the outer life as health, good fortune, successful relationships, and social recognition; in the inner life as clarity of mind, steadiness of character, and the natural arising of devotion and wisdom. The chapter prepares the reader for the transition from the vrata section to the narrative section that will complete the Saptamī Kalpa.