మూ. బ్రహ్మోవాచ :
కించాన్యదపరం యూయం వేద మంత్రవిదోజనాః ప్రష్టవ్యా కస్య సంస్కారే విశేషముప గచ్ఛత
కిందేహస్యోత యేనాసౌ నిసర్గమలినః స్థితః శుక్రశోణిత సంభూతః శమలోద్భవ కీటవత్
నిషేకాదిశ్మశానాంతైర్వి విధైర్విధి విస్తరైః దేహినోఽతిశయం కేచి దుప గచ్ఛంతి మానవాః
తేషాంగూడమనః కాయ వాగ్విదుష్టైః సుచేష్టితైః అసంయత మనుష్యాణాం పక్షోఽయం దూష్యతేమయా
వైదికాఖిల సంస్కార సారభూతా ద్విజాతయః సర్వకార్య కరాన్సర్వాన్వృషలా నతిశేరతే
చండకామా వికర్మస్థో బ్రహ్మహా గురు తల్పగః స్తేనోగోఘ్నః సురాపానః పరస్త్రీ రమణప్రియః
మిథ్యావాదీ మదోన్మత్తో నాస్తికో వేదనిందకః గ్రామయాజక నిర్గ్రంధౌ బహుదోషోదురాసదః
నిషిద్దాచార సంసేవీ చోరశ్చాటో మదోద్దతః ధూర్తేనటః శఠఃపాపీ సర్వాశీ సర్వవిక్రయీ
వాజ్మనః కాయజైర్దుష్టైర్హతాయే బ్రాహ్మణాధమాః తే న శుద్ధిం వ్రజంతీహ అపి యజ్ఞశతైరపి
శూద్రాణాం యాన్యనిష్టాని సంపద్యంతే స్వభావతః విప్రాణామపి తాన్యేవ నిర్విఘ్నని భవంతిన ?
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “ఇక తరువాతి విషయమేమి కలదు? వేదమంత్ర పరిజ్ఞాతలైన మీరు దేని సంస్కారమున విశేషముగలదని యంగీకరింతురు? అని మిమ్మడుగవలసియున్నది. మలమున కీటకములవలే, శుక్లణీతముల నుండి పుట్టిన, సహజ మాలిన్యముతో కూడిన దేహమునకా సంస్కార విశేషమునంగీకరింతురు?. ని షేకము మొదలుకొని శ్మశానము వఱకుగల నియమ విస్తరములైన సంస్కారముల చేత మాత్రమే మనుష్యున కాధిక్యమేర్పడునని కొందఱంగీకరింతురు. అట్టి నియమ రహితులగువారి అభిప్రాయ పక్షమును గూఢమనో వాక్కాయములతో పరిశుద్ధములైన సుచేష్టతములచే దూషించుచున్నాను. వేదమునందు చెప్పబడిన సంస్కారములన్నింటితోను సంపన్నులైన బ్రాహ్మణజాతివారు, వివిధ వృత్తులలో నున్న శూద్రులను మించిపోవుదురు. తీవ్ర కర్మలు చేయువాడు, కర్మలే చేయనివాడు-బ్రహ్మహత్య చేయువాడు, గురుతల్పగామి, చోరుడు. గోహత్య చేయువాడు, మద్యమును సేవించువాడు, పరస్త్రీలతో సాంగత్యము చేయువాడు,. అసత్యవాది, మదోన్మత్తుడు నాస్తికుడు, వేదమును నిందించువాడు, గ్రామ పురోహితుడు, హంతకుడు, బహుదోషములు చేయువాడు, కూడనిది పొందువాడు,. నిషిద్ధమైన పనులు చేయువాడు, దొంగ, ద్రిమ్మది (భిక్షార్థమై తిరుగువాడు) గర్వితుడు, జూదరి (మోసగాడు), నటుడు, కుత్సితుడు, పాపములు చేయువాడు, అన్నింటిని (అభక్ష్యములను) తినువాడు, అన్నింటి అమ్మువాడు,. వాజ్మనః కాయములతో చేయు పాపముల వలన హతులగు బ్రాహ్మణాధములు నూఱు యజ్ఞములను చేసినను శుద్ధిని పొందజాలరు -9. శూద్రులకు ఏ యనిష్టములు స్వాభావికముగ కలుగునో అవియే బ్రాహ్మణులకు కూడా నిరాటంకములగు చున్నవి కదా!.
మూ. తస్మాత్మంత్రోగ్నిహోత్రంవా వేద్యాంపశువధోపివా హేతవో నహీ విప్రత్వే శూద్రైః శక్యాక్రియా యధా
యేచాపి కర్మబంధేన బద్ధాః సీదంతి జంతవః సంసారానల సంతాప విక్లబీకృత మానసాః
తే జన్మమరణాటవ్యాం సుఖామృత పిపాసవః కృపణస్యాశ్రయేఽటంతో లభంతేనైవ నిర్వృతిమ్
చతుర్వర్ణానరాయేతు తత్తద్వీర్యేనరాధమా: తేషాం సర్వాత్మనా సర్వైర్ధర్మైః సాంకర్యమీక్ష్యతే
శూద్ర విప్రాదయో యోనౌః నభిద్యంతే పరస్పరమ్ సర్వధర్మ సమానత్వాత్సంస్కారాది నిరర్థకమ్
తదనుష్టాన వైధర్మ్య వియోగ మరణాదిభిః అసేవ్య సేవనై రన్యైః శూద్రవిప్రాదయః సమా:
బుద్ధ్యా శక్త్యా స్వభావేన ధర్మైర్జాత్యాదిభిః శ్రియా కర్తవ్యైః పుణ్య పాపాభ్యాం శనైః సర్వశరీరగైః
బంధనై రోధనైర్నానా యాతనోపాయ పీడనైః దండైరదండ కరణైర్విషాద పరివేదనైః
సాత్త్వికైః ప్రీతిధర్మాద్యై రాజ సైశ్చిత్ర వేష్టితైః తామసై స్తాప మోహాద్యైర్దూయమానాః పునః పునః
శ్లేష్మమారుత పిత్తాద్యైర్మహాభీభత్స దర్శనైః క్వచిద్వృత్తి నివృత్తి భ్యామృతానృత హితాహితైః
తా॥ అందువలన మంత్రము, అగ్నిహోత్రము, యజ్ఞవేదికయందు పశువును వధించుట బ్రాహ్మణత్వమున కారణములుకావు. శూద్రులచే గూడనిటి క్రియలు సాధ్యములే. కర్మపాశబద్ధులై నశించువారు, సంసారమనెడునగ్నిలో దహింపబడుచు, విలవిలలాడు మనస్సుగలవారు. సుఖామృతమును గ్రోలుకొఱకు తపించుచు, దీనులై జనన మరణములనెడు పరారణ్యమున సంచరించుచుందురు. వారెప్పుడును మోక్షమును పొందజాలరు. ఆహారేతస్సులందు పుట్టిన నాలుగు వర్ణముల మానవాధములలో అన్నివిధముల స్వధర్మముననుష్ఠించుటయందును; అనుష్టింపకపోవుట యందును బుట్టిన నాలుగు వర్ణముల మానవాధములలో నన్ని విధముల అన్నధర్మముల చేత సంకరత్వమే-కన్పట్టుచున్నది. శూద్రులు, బ్రాహ్మణులు, ఇతరులును పుట్టుక విషయమున నొకరితో నొకరు భేదింపరు. ధర్మములన్నియు సమానముగ నుండుటవలన, సంస్కారాదులు నిరర్థకమగును.స్వధర్మము ననుష్ఠించుట యందును, అనుష్టింపకపోవుటయందును, వియోగమునందును మరణమునందును సేవింపకూడనివి సేవించుటయందును శూద్రులు విప్రులు మున్నగువారందఱును సమానమైన వార. బుద్ది, శక్తి, స్వభావము, ధర్మములు, పుట్టుట, ధనము కర్తవ్యములు, పుణ్యపాపములు, మెల్లమెల్లగా నన్ని శరీరములను పొందుట. బంధనములు, ఆటంకములు, వివిధములైన యాతనలు, ఉపాయములు, పీడనములు శిక్షలు, శిక్షలేని పనులు, విషాదములు, విలాపములు. ప్రీతికరములైన సాత్విక ధర్మములు, వింతవింతల రాజధర్మములు, తాపము, మోహమును కలిగించు తామసగుణములు, వీనితో మల మఱల భాదపడుట. కఫము, వాతము, పిత్తము మున్నగువాని భయంకర పరిణామములు, ఒకప్పుడు వృత్తి, ఒకప్పుడు వృత్తిరాహిత్యము, సత్యము, అసత్యము, హితము, అహితము-ఇవి యన్నింటిచేత సమానులే.
మూ. అలంకారోపయోగేన మన్మధాద్యైర్విచేష్టితైః ధన లాభ శయనైక జంతుసంఘాత పాతనైః
అధి సిద్ధి గతింయాతి నానా విధ మనోరథైః ఆత్మస్నేహ పరద్వేష స్వీకృత ద్రవ్యరక్షణైః
అతి క్షీబత్వ సంక్షోభ క్షుత క్షామ క్షమామయైః యాతనోపాయ పైశున్య శూన్యత్వోపశమైస్తధా
అప్రశ స్తైరనుష్ఠానై సమీపస్థాపదః సమాః హింసకాః ప్రాణినః పాపవితథాలాప భాషిణః
సాధూనాం భాషకా స్తేనా నిర్దయాః పారదారికాః నీచ కర్మసమాచారాః సర్వభక్షాః పిశాచవత్
దుష్కలీనా దురాచారా నృపాణముపజీవినః విప్రకార్యా వికర్మస్థా ధనినో దుష్ట చేతసః
లుబ్దకా హరిణాన త్వా వాసంకృత్వాయథావనే తథా ఖాదంతి పిశునా బహవశ్చ క్రియా వశాత్
వేద వాద మధీయానాః ప్రాణిఘాతాభిశంసినః పుష్ణఃతి కపటైరర్థాన్వేద విక్రయిణోZ ధమాః
మాయినో మత్సర గ్రస్తాలుబ్ధముగ్ధ మదోద్ధతాః చాటాః కార్పటికాః క్రూరాః కదర్యాః కలహప్రియాః
వాచాటా దుష్టకులటా అటంతో భాటకైః సహ భండమాన్యా భటాటో పైః సంక్రుద్ధాః సువిలుంఠకాః
పర్యాటా భాటకా జీవాః కంటకశ్లోక భాషిణః విక్రీణతే హ్యవిక్రేయ మభక్ష్యద్రవ్య భక్షిణః
శూద్రకర్మాను తిష్ఠంతో నిస్తపస్తే నరాధమాః సేవా ధ్యాపన వాణిజ్య కృష్యాద్యారంభ లంభితాః
గృష్ణంతః సంపదో బాహ్యాద్ద్రవ్య ధాన్య ధనాదికాః
క్రోధాదాభ్యంతరాందొనోషాంస్తథా దుష్టమనోరథాన్ అత్యజంతో విశిష్టానాం శ్రేష్ఠాస్తే కచ మర్దినః
తా॥ అలంకారములనుపయోగించి చేసెడు మన్మధ చేష్టలచేత, ధనము లాభించునాశయముతో ననేక జీవ సమూహములను హింసించుటల చేతను. ఈడేరుయత్నములు గల వివిధములైన కోరికలచేతను, తన్ను, తనవారిని ప్రేమించుట, ఇతరులను ద్వేషించుట, సంపాదించిన ద్రవ్యమును రక్షించుట మున్నగవాని చేతను. మిక్కిలి క్రొవ్వుపట్టుట, క్షోభనందుట, తుమ్ముట, లేమి కలుగుట, ఓర్పుకలిగియుండుట, వ్యాధిసోకుట, మొదలగువాని చేతను, తీవ్రమగు వేదనననుభవించుట, వెరవుకనొనుట, కొండెకాని తనము, రిక్తత, శాంతి మొదలగువాని చేతను. దుష్ట కార్యాచరణములచేతను, పొంచియున్న ప్రమాదములచేతను అందఱు సమానులే. ప్రాణిహింసకులు, పాపాత్ములు, అసత్యములు మాట్లాడువారు. సాధువుల నిందచేయువారు, దొంగలు, నిర్దయులు, పరస్త్రీ సాంగత్యము చేయువారు, నీచమైన పనులు చేయువారు, పిశాచమువలెనన్నింటిని భక్షించువారు. దుష్టకులమున జన్మించినవారు, దురాచారులు, రాజులనాశ్రయించి జీవించువారు, ఇతరుల ను పీడించువారు, కర్మహీనులు, దుష్టబుద్దిగల ధనవంతులు. అన్ని వర్ణములలోను కలరు. అడవిలో నివసించుచు జింకలను వేటాడి చం పెడు బోయలవలె కొండెకాండ్రు, దుష్టులనేకులు ఇతరులను హింసించుచు పొట్టపోసికొందురు. కొందఱు వేద ధర్మము నధ్యయనము చేసియు, ప్రాణిహింస, పరదూషణ, కపటవర్తనములతో తమ ధనములను పెంపుచేసికొందురు. వీరు వేదములను అమ్ముకొని జీవించు నధములు. కపటులు, ఈర్ష్యాళువులు, పిసినారులు, మూర్ఖులు, గర్వితులు, వంచకులు, పరాన్నభుక్కులు, క్రూరులు,నీచులు, కలహప్రియులు. వదరుబోతులు, అంకుటాండ్రతో నుండువారు, “బాడుగల వారితో తిరుగువారు, ఆకతాయులు, పనివాండ్రయాద్దత్యముచేత క్రుద్ధులగువారు. ద్రిమ్మరులు, బాడుగపనులు చేయువారు, పై పైపొగడ్తలు చేయువారు, అమ్మగూడనీ వానిని అమ్మువారు, తినగూడని వానిని తినువారు. శూద్ర కర్మలలోనుండువారు, తపస్సులేనివారు-వీరందఱు ఏ వర్ణమువారైనను మానవాధములే. అధ్యాపము, వర్తకము, కృషి, సేవ మొదలగు స్వయోగ్యములగు వృత్తుల వలన దూషితులై, అన్యమార్గముల మూలమున ధనధాన్యాది సంపదలను సమకూర్యుకొనువారు. క్రోధము మొదలగు నాంతర దోషములను, దుష్టములైన కోరికలను విడిచి పెట్టనివారు, సదాచార సంపన్నుల తలలు పట్టి (సేవలు చేసి) శ్రేష్ఠులగుచున్నారు.
మూ. నోపాదేయాని వస్త్రాణి నిత్యమాదదతే ద్విజాః హాపయంతి న హేయాని కథంతే గురవః క్షితౌ
దండికా దిండికా భండాశ్చండాశ్చండాల చేష్టితాః వైతండకాస్తే నిఘ్నంతి యధా సింహోమృగాంపశూన్
నిర్గ్రంర్థం మునిమాలోక్య మాన్యమానాః సమున్నతమ్ పరిభూయావ తిష్ఠంతే ధిక్తాన్రిక్తాన్స్వవైరిణః
తస్మాత్సంసారికాః సత్త్వాశ్చిత్త క్లేశ కలంకితాః దౌఃశీల్య దౌర్మనస్యాద్యైస్తుల్య జాతీయ బంధనాత్
శూద్రాంప్రరోచతే విప్రో రాగిణీం మైధునం ప్రతి సాకామ దుఃఖ విగమే గర్భంధత్తే సమాగమే
కామం కామాతురాభ్యస్తు రోచంతే శూద్రమానవాః మైథునం ప్రతి బ్రాహ్మణ్యే తేపి తాసాం సుఖావహాః
యేతు జాత్యాదిభిర్భిన్నా గవాశ్వోష్ట్రమతంగజాః తే విజాతిషు నో గర్భం కుర్వతేపీ సుఖార్థినః
తా॥ బ్రాహ్మణులు స్వీకరింపదగని వస్త్రములను తీసికొందురు. హేయమైన వానిని విడిచి పెట్టరు. అట్టివారీ భూమిపై గురువులెట్లగుదురు? కఱ్ఱలుపట్టుకొనువారు, దిండరములు వాయించువారు, సంకరులు (విదూషకులు), కోపగొండులు, అధమమైన పనులు చేయువారు, దుర్వాదములు చేయువారు, మృగములను, పశువులను సింహముహింసించినట్లు హింసించుచుందురు. తపస్సు తప్ప ఏమియులేని మునిని చూచి గొప్పవానిగ గౌరవించియు ఆమీద అవమానించిపోవుదురు. ఆత్మశత్రువులైన అట్టి హీనులను తిరస్కరింపవలేను. కావున సంసారమునందుండెడు జీవులు చిత్తమునందలి రాగద్వేషాది క్లేశములతో కళంకితులై యుందురు, చెడునడవడి, చెడ్డమనస్సు మొదలగువానిచేతను, సమానమైన స్వభావబద్ధత వలనను. బ్రాహ్మణుడు, కామాతురయైన శూద్రస్త్రీని మైథునమును గూర్చి ప్రేరేపించును. ఆమె అతనితో క్రీడించి, మన్మధ బాధను పశమింపజేసికొని గర్భము ధరించును. కామాతురలైన స్త్రీల కొఱకే కామము. రతి విషయమున శూద్ర స్త్రీలు బ్రాహ్మణ్యమునందు ప్రీతిగలిగియుందురు. ఈ బ్రాహ్మణులును ఆ స్త్రీలయందు సుఖమును పొందుదురు. కాని వృషభములు, గుఱ్ఱములు, ఒంటేలు, ఏనుగులు, సుఖమును కోరియుండియు, తమకంటే వేరైన జాతి జంతువులతో రమింపవు-గర్భమును చేయవు.
మూ. అనడ్వానేవ గోరేవ కామం పుష్ణాతి సంగమే ఘోటకాశ్చ రతిం సమ్యక్కుర్వతే వడవాసుచ
పతిం కరభమేవాప్య కరభీ రమతే ముదా గజమేవ పతిం లబ్థ్వా సుఖం తిష్ఠతి హస్తినీ
తిర్యగ్జాతిః స్త్రీయాసాకం కుర్వాణాపిహి మైథునమ్ నతస్యాః కురుతే గర్భం నరో నాపి సుఖాసికామ్
తిరశ్చాసహ కుర్వాణా మైథునం మనుజాంగనా నాధత్తే తత్కృతం గర్భం నయుక్తం మైధునం తయోః
నైవం కశ్చిద్విభాగోస్తి మైధునే స్త్రీ మనుష్యయోః యేన సంక్షీయతే భేదః ప్రస్ఫుటం ద్విజశూద్రయోః
వేద పాఠచ్చలేయం న క్రియాభిః ప్రపద్యతే బహుభిర్జడ సంఘాతై రవిశిష్టే పదేZ హని
దేహే దేహిని చాముష్మిన్నశుచావనవస్థితే రాగ ద్వేషాదిభిర్దోషైరధికం పరిపీడితే
కులాల చక్రవద్ర్భాంతమాన సే విషయార్ణనే ఘోరదుఃఖ భయాక్రాంతే సమాజేZ నీ శ్వరాత్మని
జన్మమృత్యుజరాశోకానిష్ట యోగాగ్ని పీడితే హీనసత్త్వ శరీరాదౌ న విశేషో విభావ్యతే
తస్మాన్మనుష్య భేదోZయం సంకేత బల నిర్మితః బ్రాహ్మణ్యం బ్రాహ్మణా సంగాద్బ్రాహ్మణీచోప సేవతే
పతిం త్యక్త్వా ముఖాస్వాద లాల సైర్మదలాల సైః అసేవ్యతే విటం గత్వా బంధకీ చేటకైరపి
బ్రాహ్మణ్యాత్ప్రచ్యవంతేన్యే మహాపాతగ సేవితాః వ్యలీక కల్పనైవైషా తస్మాఙ్ఞాత్యాదికల్పనా
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రా హ్మేపర్వణి
షష్ఠి కల్పే వర్ణ వ్యవస్థావర్ణనం సౌమ త్రి చత్వారింశోZధ్యాయః
తా॥ గోవృషభముల సంగమమునందే కామము పుష్టినొందును. గుఱ్ఱములు ఆడగుఱ్ఱములయందే చక్కగా రతి సలుపును. ఆడఒంటే మగ ఒంటేతోడనే హాయిగా రమించును. ఆడయేనుగు మగ ఏనుగును 'పతిగా' పొందియే సుఖము పొందును. పశువు, స్త్రీతో మైథునము చేసినను ఆమెకు గర్భము చేయజాలదు. సుఖము కొణకు ఖడ్గము వలె వెనుకకు వంగియన్న స్త్రీకి మనుష్యుడు కూడ గర్భము కలిగింపలేడు. మనుష్య స్త్రీ పశువు చేత సంపర్కము చేసినను గర్భము ధరింపదు. ఇట్టి విజాతి మైధునములు అసమంజసములు. బ్రాహ్మణ శూద్రులమధ్య భేదమును సమయింపగల స్పష్టమైన విభాగము స్త్రీ పురుషుల మైధున విషయముగ నేదియులేదు. ఈ భేదమనునది వేదాధ్యయనమను నేపము చేత, లేక ఆయక్రియలచేతను ఏర్పడదు. అనేకములగు భౌతిక వస్తువుల కలయిక చేత నేర్పడునది గావున ఏ ప్రత్యేకతయులేనిది, స్థల కాలములకు కట్టుబడి యుండునది. దహించు కొనిపోయేడు స్వభావము గలది, ఆంతరమున జీవుడుగలది వీనియందు అపరిశుభ్రములై, ఒకే విధముగ నుండని రాగము, ద్వేషము మొదలగు దోషముల చేత పీడింబడును. విషయభోగములనెడీ మహాసముద్రమున కుమ్మరి వాని చక్రము వలె నిరంతరము తిరుగు చుండుమనస్సు గలది, భయంకరములగు దు:ఖములతో నాక్రమింపబడినది, అనాత్మ వస్తువులతో చేరియుండునదియు. జననము, మరణము, ముసలితనము, దుఃఖము, అవాంఛిత సన్నివేశములనెడి అగ్నితో దహింపబడునదియు, దుర్బలమగునదియునైన శరీరమునందు, దానినాశ్రయించియుండు నవస్థలయందును ఎట్టి విశేషము భావింపబడదు కదా! అందువలన మనుష్యులలోని యీ భేదము ఒక ఒడఁబాటు బలమున కల్పింపబడినది. బ్రాహ్మణ్యమనునది బ్రాహ్మణాశ్రయమువలన కలుగుచున్నది. అటుల 'పావిత్ర్యము' (బ్రాహ్మణస్త్రీ) పూజింపబడుచున్నది. భర్తను వదిలి పెట్టి జారిణియైన స్త్రీ సంగమేచ్చచేత, చుంబనాదికా ప్రేక్షచేతను విటుని వద్దకు బోవును. పనివాండ్రు-లేక శృంగార నాయకుని అనుచరులతో గూడ మన్మధ క్రియలు సాగించును. కొందఱు బ్రాహ్మణ్యమునుండి పతనమై మహాపాపములను చేయుదురు. కాబట్టి జాతి విభాగమనునది అసత్యకల్పనమే.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున షష్టీకల్పమునందు వర్ణవ్యవస్థావర్ణనమను నలుబది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 43 of the Bhavishya Purāna - Brahma Parva is as follows:
After the philosophical debate has run its full course, Brahma himself provides the authoritative resolution. The specific dharmas assigned to each varṇa — the particular ways of life, the specific duties, the characteristic virtues — are themselves the defining criteria of varṇa. A person who fulfils the dharma of a brāhmaṇa — who studies and teaches the Veda, who performs sacrifices, who accepts gifts from the virtuous and refuses gifts from the wicked, who lives in simplicity and gives freely — is a brāhmaṇa. Brahma's teaching does not abolish the varṇa system but grounds it in function and dharma rather than in biology alone. The chapter thus resolves the tension of the preceding chapters by subordinating birth to conduct without dismissing the role of birth as the initial context within which dharma is practised.