శతోనీక ఉవాచ
శ్లో ॥ సువృత్తం శ్రోతు మిచ్ఛామి దేవ! స్త్రీణాం సువిస్తరాత్ ఉత్తమాధమ మధ్యంచ సంబంధే స్త్రీకృతే యథా
సుమంతురువాచ :
శతానీక మహాబాహో! బ్రహ్మలోకే పితామహః ఉక్త్వా సలక్షణం స్త్రీణాం సద్వృత్తం చోక్త పాన్పునః
యధోక్తం బ్రహ్మణా తేషా మృషీణాం కురునందన! సప్రేయో వచనం శ్రుత్వా బ్రహ్మా వచనమబ్రవీత్
శ్రుణుధ్వం ద్విజాశార్దూలాః! స్త్రీణాం సద్వృత్తమాదితః వక్ష్యేయుష్మానశేషంవై లోకానుగ్రహ కామ్యయా
త్రివర్గ ప్రాప్తయే వక్ష్యే స్త్రీవృత్తం గృహ మేధినామ్ ప్రాగ్వి ద్యాదీనుపాదాయ శ్రేరర్థాంశ్చ యథాక్రమమ్
విందేత సదృశీం భార్యాం శాస్త్రదృష్టేన కర్మణా
గృహాశ్రమోహి నిఃస్వానాం మ హేత్యేషా వీడంబనా తస్మాత్పూర్య ముపాదేయం విత్తమేవ గృహైషిణా
వరం సోడా మనుష్యేణ తీవ్ర నరకవేదనా నత్యేవచ గృహే దృష్టం పుత్ర దారక్షుధార్దితమ్
అసంభవే శిశుం దృష్ట్యా రుదంతం ప్రార్థనా పరమ్ వజ్ర సారమయం మన్యే హృదయం యన్నదీర్యతే
సాధ్వీం భార్యాం ప్రియాం దృష్ట్యా కుచేలాంక్షుత్కృశీకృతామ్ అస్య దుఃఖస్యతన్నాస్తి సుఖం యత్సమతాం వ్రజేత్
రూక్షాన్వివర్ణాన్ క్షుధితాన్భూమీ ప్రస్తరశాయినః పుత్ర దారాన్నిజాన్ దృష్ట్యా కిమ కార్యం భవే న్నృణామ్
తా ॥ శతానీకుఁడిట్లనెను. దేవా! ఉత్తమాధమ మధ్యమ సంబంధముగా స్త్రీల సద్వృత్త లక్షణములను సవిస్తరముగా వినగోరుచున్నాను. సుమంతుఁడిట్లు సమాధానము చెప్పెను. మహా బాహూ! బ్రహ్మలోకమునందు బ్రహ్మదేవుఁడు మొదట స్త్రీ శరీర లక్షణములను చెప్పి పీదప సద్వృత్తమును కూడ చెప్పెను. కురునందనా! ఋషులు లోకానుగ్రహకాంక్షతో అడిగిన ప్రశ్నకు బ్రహ్మదేవుడు ఇట్లు ఉత్తరము చెప్పెను. బ్రాహ్మణులారా! స్త్రీల సద్వృత్తముగూర్చి మొదటి నుండియు సవిస్తరముగా లోకానుగ్రహకాంక్షతోఁ జెప్పెదను వినుడు. గృహస్థాశ్రముల ధర్మార్థకామ ప్రాప్తి కొఱకు చెప్పుచున్నాను. మొదట యథాక్రమముగా సార్థమైన వేద విద్యను సంపాదించి విధి విహితముగా తగిన భార్యను పొందవలెను. పేదలకు గృహాశ్రమము గొప్ప విడంబనము. (మోసము). కాబట్టి గార్హస్థ్యమును కోరువాడు మొదట ధనమునార్జింపవలెను. ఇంటిలో భార్యాపుత్రులు ఆకలితో బాధపడుచుండగా చూచుటకంటే మనుష్యుడు తీవ్రమైన నరకబాధను సహించుట శ్రేష్ఠము. ఆఁకలి గొన్న శిశువు ఏడ్చుచుండుట చూచి ద్రవింపని హృదయము వజ్రమువలె కఠినమైనది. సాధ్వియైన ప్రియ భార్య చిరుగుబట్టలతో, ఆఁకలి వలన కృశించిన దేహముతో నుండుటను చూచుటతో సమానమైన దుఃఖము వేజు లేదు. కావున సమృద్ధి యుండుటయే సుఖము. ఆకలితో అలమటించువారు, దీనులై వెలవెలబోవుచున్నవారు నేల పై జాళ్ల పై పరుండువారునునైన భార్యా పుత్రులను నిస్సహాయముగ చూచుచుండుట కన్న అకార్యము మానవులకు మటియొకటి లేదు.
శ్లో ॥ బాహత్తరీయం క్షుత్ క్షామం దృష్ట్యా దీన ముఖం సుతమ్ మృత్యురేవోత్సవః పుంసాం వ్యసనం జీవితం ద్విజాః
పరిసీదత్స్య పత్యేషు దృష్ట్వా దీనముఖీం ప్రియామ్ వజ్రకార్య శరీరాస్తే యేన యాంతి సహస్రధా
తస్మాదర్థ విహీనస్య పుంసోదార పరిగ్రహాత్ కుతస్త్రి వర్గ సంసిద్ధి ర్యాతనైవహితస్యసా
అబార్య స్వోదికారోసి నద్వితీయా శ్రేమేయథా తద్వదరవిహీనానాం సర్వత్ర సాధికారితా
కేచిత్త్వపత్యమే వాహుస్త్రి వర్గావాప్తి సాధనమ్ పుంసామర్థః కలత్రంచ యేఽన్యేనీతివిదో విదు:
ధర్మోపి ద్వివిధో యస్మాదిష్టా పూర్తక్రియాత్మకః సచదారాత్మకః సర్వం జ్ఞేయమర్థైక సాధనమ్
నిజేనాపి దరిద్రేణలోకో లజ్జతి బంధునా పరోపిహి మనుష్యాణామైశ్వర్యాత్స్వజనాయతే
నదరిద్రం సమీపేపి స్థిత వంతం ప్రపశ్యతి దూరస్థమపి విత్తాఢ్య మాదరాద్భజతే జనః
తస్మాత్ర్పయత్నతః పూర్వమర్థమేవ ప్రసాధయేత్ సహి మూలం త్రివర్గస్య గుణానాం గౌరవస్యచ
సర్వేపిహి గుణా విద్యాకుల శీలాదయో నృణామ్ సాంతే తస్మిన్న సంతోపి సంతిసంతోపినాసతి
తా ॥ భుజము పై ఉత్తరీయము, ఆఁకలి కవులతో అలమటించు దీనమైన ముఖముగల కొడుకును చూచుచుండుట కంటె మనుష్యులకు మృత్యువే సుఖము నిచ్చును. జీవితమే పాపమగును. అట్లు అంగ లార్చెడు సంతానమును, దైన్యమునిండిన భార్య ముఖమును చూచి తట్టుకొనువారు వజ్ర శరీరులు. వారు వేయి విధములుగను సుఖమును పొందజాలరు. అందువలన ధనహీనుడు భార్యను పరిగ్రహించిన మాత్రమున అతనికి త్రివర్గ సంసిద్దియెక్కడిది? ఆమె అతనికి యాతన మాత్రమే యగును. భార్యలేని గృహస్థాశ్రమాధికారములేనట్లే ధనములేని గృహస్థాశ్రమాధికారమును లేదు. కొందఱు సంతానమే ధర్మార్థకామ సాధనమందురు. మఱి కొందఱు నీతి విదులు పురుషులకు ధనము, భార్య ఇవి రెండే త్రివర్గ ఫల సాధనములందురు. ఇష్టము పూర్తము అని ధర్మము రెండు విధములు. అందు మొదటిది భార్యతో సహా సాధించునది. రెండవది ధనముతో మాత్రమే సాధింపఁదగినదని తెలియవలెను. బంధువు తనవాఁడేయైనను దరిద్రుఁడైనచో లోకము అతనియెడ సిగ్గుపడును. కాని ధనవంతుఁడు పరుఁడైనను వానిని దగ్గరకుఁజేర్చుకొనును. దరిద్రుఁడు సమీపస్థుఁడైనను వానిని చూడరు. దూరస్థుఁడైనను ధనవంతుఁడైనచో వానిని భజింతురు. అందువలన మొట్టమొదట ధనమే సంపొదింపవలెను. అదియే త్రివర్గ సాధనకు, గుణములకు, గౌరవమునకు మూలము. ధనాఢ్యునితో విద్య, కులము, శీలము మొదలగు ఉత్తమగుణములనేకములు వచ్చిచేరును. నిర్థనునిలో అవి యున్నను నష్టమైపోవును.
శ్లో ॥ శాస్త్రం శిల్పం కలాః కర్మయచ్చాన్యదపి చేష్టితమ్ సాధనం సర్వమర్థానామర్థా ధర్మాది సాధనాః
సాధనానాం త్రివ ర్గోస్తి తం వినా కేవలం నృణామ్ అజాగలస్తన స్యేవ నిధనాయైవ సంభవః
ప్రాక్పుణ్వైశ్విపులా సంపద్ధర్మ కామాది హేతుజా భూయో ధర్మేణ సాముత్ర తయా తావితచక్రమః
ఏక చక్రకమేతద్ధి ప్రోక్తమన్యోన్య హేతుకమ్ పూర్వ పశ్చిమ బాహుభ్యా ముత్తరాధరమధ్యమా
విజ్ఞాయ మతిమానేవం యస్త్రి వర్గం నిషేవతే సంఖ్యాశత సమాయుక్తై రవాప్నోత్యుత్తరోత్తరమ్
నాభార్య స్వాధికారోస్తి త్రివర్గే నిర్ధనస్యవా నా భార్యాయామతః పూర్వమర్థమేవ ప్రసాధయేత్
తస్మాత్ర్కమాగ తైరర్థైః స్వయం వాధిగతైర్యుతః క్రియాయోగ్యైః సమర్థశ్చ కుర్యాద్దార పరిగ్రహమ్
అనురూపే కులే జాతాం శ్రుత విత్తక్రియాదిభిః లభేతానిందితాం కన్యాం మనోజ్ఞాం ధర్మసాధనామ్
పుమానర్థపు మాంస్తావద్యావద్భార్యాం నవిందతి తస్మాద్యథాక్రమం కాలే కుర్యాద్దార పరిగ్రహమ్
ఏకచక్రరథో యద్వదేక పక్షోయథాఖగః అభార్యోపి నరస్తద్వదయోగ్యః సర్వకర్మసు
తా ॥ శాస్త్రము, శిల్పము, కళలు మొదలగు కర్మలన్నియు ధనమువలన సాధింపదగినవి. ధనములు ధర్మాదుల వలన సాధింపదగినవి. సాధనములలో ధర్మార్థకామములు ముఖ్యములు. అవి సాధింపనివారి జీవితము అజాగళస్తనములవలె వ్యర్థమైనది. జన్మము మరణము కొఱకైనది మాత్రమే యగును. పూర్వ పుణ్యములచేత ధర్మకామాది హేతుజమైన విస్తృతమగు సంపదకలుగును. మఱల ధర్మముచేత పరలోక సుఖము కలుగును. సంపద చేత మఱల ధర్మకామములు సిద్ధించును. అట్లు ధనము, ధర్మకామములు పరస్పర కారణములు. ఒకటి మఱియొకదాని కారణమగుచు ఒక్కొక్కటి ఏక చక్రముగా చెప్పబడినది. కుడి యెడమలకే పై భాగము, క్రింది భాగము, మధ్యభాగములుండును. ఎవఁడు బుద్దిమంతుడై ఈ విషయమును తెలిసికొని త్రివర్గమును చక్కగా సేవించునో, వాఁడు అనేక విధములైన వివేచనములు గలవాఁడై ఉత్తరోత్తరములను పొందగలుగును. భార్య లేనివానికి గాని ధనములేని వానికి గానీ త్రివర్గమునందధికారములేదు, అందువలన భార్య కన్న ముందు ధనమునే సంపాదింపవలెను. వంశ క్రమానుగతములుగాని లేక స్వయముగ సంపాదించినవిగాని క్రియాయోగ్యములైన అర్థములు కలవాఁడే వివాహము చేసికొనవలెను. విద్య, విత్తము, ఆచారము మున్నగువానియందు సమానముగనున్న కులమునందు జన్మించిన అనిందిత చరిత్రగలది, మనోజ్ఞమైనది, ధర్మసాధనకు యోగ్యమైన దైన కన్యను వివాహమాడవలెను. భార్యను పొందనంతవఱకు పురుషుఁడు అర్ధపురుషుడు మాత్రమే. కాబట్టి సకాలమున శాస్త్ర విహితముగా పెండ్లాడవలెను. భార్యలేని పురుషుఁడు ఒకే చక్రముగల రథమువలె, ఒకే లెక్క గల పక్షివలె, సర్వకర్మలయందును అయోగ్యుఁడగును.
శ్లో ॥ పత్నీ పరిగ్రహాద్ధర్మ స్తథార్ధో బహులాభతః స త్ప్రీతియోగాత్కామోఽపి త్రయ మస్యాం విదుర్బుధాః
త్రిథా వివాహ సంబంధో హీన తుల్యాధికైః సహ తుల్యైః సహ సమస్తేషా మి తరౌ నీచ మధ్యమౌ
అసమైర్నింద్యతే సద్భిరుత్తమైః పరిభూయతే తుల్యైః ప్రశస్యతే యస్మాత్త స్మాత్సా ధుతమోమతః
కృత్వైవాధిక సంబంధమపమానం సమశ్నుతే నచైషామానతింగచ్ఛేన్నైవనీచైః సహేష్యతే
ఉత్తమోఽపిచ సంబంధోనీచైస్తత్సమతాంవ్రజేత్ అతస్తం వర్జయేద్ధీమాన్నిందితం సదృశోత్తమైః
విజాతీయైశ్చ సంబంధం సహేచ్ఛంతి న సూరయః ఉభయోర్రశ్యతే తేన యథాకోకిలయాశుకః
తద్భాతికుల బాహ్యత్వాదవశ్యం చావమానతః ప్రతిపత్త్రశక్యత్వాచ్చొత్తమోపినశస్యతే
ఏకేపి పరీహర్తవ్యా అన్యే పరిహరంత్యుత తస్మాద్ద్వావపినైవేషా సంబంధావథ మోత్తమౌ
ఏకపాత్రాది భార్యేషాముపచారైః పరస్పరమ్ ప్రత్యహం వర్థతే స్నేహః సంబంధః సోభిధీయతే
యత్రావాహ వివాహాదోనన్యోన్యాః ప్రతిపత్తయః స్పర్ధయైవ ప్రవర్థంతే తం సంబంధం విదుర్బుధాః
తా ॥ భార్యా స్వీకారముచేత ధర్మార్థములలో మిక్కిలి లాభము కలును. పరస్పరము ప్రీతి కలుగుటచేత కామరూప తృతీయ పురుషార్థము కూడా లాభించునని విద్యాంసులు చెప్పుదురు. హీనులతో, సమానులతో అధికులతో అని వివాహ సంబంధము మూడు విధములు. వీనిలో సమానులతో సంబంధమే ఉత్తమము. హీనులతో అథమము. అధికులతో మధ్యమము. హీనులచే నిందింపఁబడుదురు. అధికులచే అవమానింపఁబడుదురు. అందువలన సమానులతోడనే వివాహ సంబంధము ప్రశస్తమైనది. తమకన్న ఉన్నతులైన వారి సంబంధముచేసి అవమానములు పొందుదురు. అందుచే వీరికి లొంగియుండుటగాని, తమ కన్న అధముల సంబంధ మిష్టపడుటగాని తగనివి. అధిక, హీన సంబంధములు రెండును సమానముగ ఇబ్బంది పెట్టునవియే కావున వానిని నిందితములుగా విడువవలయును. బుద్ధిమంతులు విజాతి సంబంధమును ఇష్టపడరు. దాని వలన కోకిలతో చిలుక సంబంధమువలే రెండును భ్రష్టుమగును. అది కుల బాహ్యత్వము వలనను, తప్పక కలుగు అవమానముల వలనను, గౌరవమున హెచ్చుతగ్గుల వలనను ఉన్నతమైన సంబంధమైనను శ్రేష్ఠము కాదు. ఉత్తమాధమ సంబంధ విషయమున ఒక పక్షము వారు అన్యపక్షమును పరిహరించినచో, అన్యులు కూడ మొదటి పక్షము వారిని పరిహరింతురు. ఆ విధముగ రెండును పరస్పరము విడువబడును. ఒకే విధమైన యోగ్యతలతో, ఉపచారములతో పరస్పర స్నేహము ఎవరి మధ్య దీనదినము వృద్ధి చెందుచుండునో అట్టివారి మధ్య ఏర్పడునదే “సంబంధము' అని చెప్పఁబడును. ఎవరి మధ్య యాత్ర, ఆవాహ, నివాసదులతో పగసుగముగా సుగతో యోగంతలు మది చెందుచుండునో దాగి మగ గుండు.
శ్లో ॥ వ్యసనేభ్యుదయే వాపియేషాం ప్రాణైర్ధనైరపి సహైక ప్రతి పత్తిత్వం సంబంధానాం స ఉత్తమః
స్నేహ వ్యక్తౌ మనుష్యాణాం ద్వావేవ నికషోపలౌ తధా కృతజ్ఞతాయాం చ వ్యసనాభ్యుదయాగమౌ
సచ స్నేహోనృణాం ప్రాయః సమే ష్వేవహిదృశ్యతే సామ్యం చాప్యుపగంతవ్యం విత్తశీలకులాదిభిః
తస్మాద్వివాహసంబంధం సఖ్యమే కాంతకారిణామ్ సదృశైరేవ కుర్వీత నోత్తమే నాప్యనుత్తమైః
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్యాం బ్రాహ్మేపర్వణి స్త్రీ లక్షణ సద్వృత్త వర్ణనం నామ షష్ఠోఽధ్యాయః
తా ॥ ఆఫత్సంపదలలో ధన ప్రాణాదులచే నెవరి మధ్య సహ యోగిత్వ యోగ్యతలుండునో వారిది ఉత్తమమైన సంబంధము. మనుష్యులలో, స్నేహమును వ్యక్తీకరించుటయందు, చేసిన మేలును మరువకుండుట యందు, కష్ట సుఖములు వచ్చుటయే గీటుళ్లు. ప్రాయికముగ అట్టి స్నేహము. సమానులయందే కన్పట్టును. విత్తశీల కులాదులచేత నేర్పడు సామ్యము అంగీకరింపఁ దగినది. కాబట్టి అత్యంత సన్నిహితముగా నేర్పడు వివాహ సంబంధము, స్నేహము అనునవి సమానులతోనే చేయవలెను. తమ కన్న పై వారితోగాని క్రిందివారితోగాని చేయకూడదు.
ఇది శతార్థసాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణమున బ్రహ్మ పర్వమునందలి స్త్రీ లక్షణ సద్వృత్త వర్ణనమను ఆఱవ అధ్యాయము.
Summary of chapter 6 of the Bhavishya Purāna - Brahma Parva is as follows:
The dharma of good conduct for a woman in her daily life is expounded in detail. Rising before dawn, performing purification, honouring the household deities, attending to the needs of elders, speaking gently, avoiding unnecessary movement outside the home, and maintaining modesty in dress and comportment — these form the visible exterior of strī dharma. Internally, the chapter calls for the cultivation of steadfast love for the husband, equanimity toward co-wives, affection for children, and deference toward the husband's family. A woman who lives this dharma accumulates merit in each moment of her household service, and Brahma declares that such a woman's tapas exceeds that of many austerity-performing ṛṣis.