భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

100. సప్తమీ కల్పమున నందానామ సప్తమీ వర్ణనము

బ్రహ్మోవాచ :

 మూ యాతు మార్గశిరేమాసి శుక్లపక్షేతు సప్తమీ నందాసా కథితా వీర! సర్వానంద కరీ శుభా

పంచమ్యామేక భక్తంతు షష్ఠ్యాం నక్తం ప్రకీర్తితమ్ సప్తమ్యాముపవాసంతు కీర్తయంతి మనీషిణః

పారణాన్యత వై త్రీణి శంసంతీహ మనీషిణః మాలతీ కుసుమానీహ సుగంధం చందనం తథా

కర్పూరాగరు సంమిశ్రం ధూపం చిత్ర వినిర్దిశేత్ దధ్యోదనం సఖండంచ నైవేద్యం భాస్కరప్రియమ్

తమేవ దద్యాద్విప్రేభ్యోఽ శ్నీయాచ్చ తదను స్వయమ్ ధూపార్థం భాస్కర స్యైష ప్రథమే పారణే విధిః

పలాశ పుష్పాణి విభో! ధూపో యః శక్య ఏవచ కర్పూరం చందనం కుష్ఠమగరుః సిహ్లకం తథా

సగ్రంథి వృషణం భీమ! కుంకుమం గృంజనం తథా హరీతకీ తథా భీమ! ఏష పక్షక ఉచ్యతే

ధూపః ప్రబోధ ఆదిష్టో నైవేద్యం ఖండమండకాః కృష్ణాగరుః సితం కంజం బాలకం వృషణం తథా

 చందనం తగరో ముస్తా ప్రబోధ శర్కరాన్వితా భోజయేద్భ్రాహ్మణాంశ్చాపి ఖండఖాద్యై ర్గణాధిప!  నింబపత్రంతు సంప్రాశ్య తతో భుంజీత వాగ్యతః

పారణస్య ద్వితీయస్య విధిరేష ప్రకీర్తితః

 తా బ్రహ్మదేవుడిట్లనెను మార్గశిర మాస శుక్లపక్షమున వచ్చు సప్తమీ తిథి “నంద' యనబడును. అది యన్నివిధములైన ఆనందములను కలుగజేయు శుభప్రదమైన తిథి. ఈ నందాసప్తమీ వ్రతమున పంచమినాడేక భుక్తము, షష్ఠినాడు నక్తము, సప్తమీనాడు ఉపవాసము చేయవలెనని బుద్దిమంతులు చెప్పుదురు. ఇందు మూడు పారణము లుండుననియు నుడువుదురు. జాజిపూలు, సుగంధచందనము. కర్పూరము అగరు కలిపిన మిశ్రమము ధూపము, పులకండముతో గూడిన పెరుగన్నము నైవేద్యము-వీనితో సూర్యుని పూజింపవలెను. ఈ నైవేద్యము సూర్యదేవునకిష్టమైనది, దీనినే బ్రాహ్మణులకిచ్చి, వారుభుజించిన పిమ్మట తాను తినవలెను. మొదటి పారణమున ధూపము కొఱకీ విధి నిర్దేశింపబడుచున్నది. మోదుగపూలు, సాథ్యమైన ఏదేని ధూపము లేక పక్షకధూపము సూర్యపూజలో వినియోగింపవచ్చును. కర్పూరము, చందనము, చెంగల్వకోష్టు, అగరు, యావనము(సిలకము). గ్రంథపర్ణి, కస్తూరీ, కుంకుమము, వెల్లుల్లి, హారీతకి-వీని మిశ్రమము పక్షక ధూపమనబడును. రెండవ పారణమున 'ప్రబోధ' ధూపము, శర్కరతో చేయబడిన అరిసెలు, నైవేద్యము ఆదేశింపబడినది. నల్లని అగరు, తెల్లతామర, సుగంధబాల, కస్తూరి. చందనము, నంది వర్థనము, ముస్త, శర్కర- వీని మిశ్రమము ప్రబోధ ధూపమనబడును. బ్రాహ్మణులకు అరిసెలతో భోజనము పెట్టవలెను. వేపాకు ప్రాశనము చేసి తాను మౌనముగ భుజింపవలెను. ఇది రెండవ పారణ విధిగా పేర్కొనబడినది.

 మూII నీలోత్పలాని శుభ్రాణి ధూపం గౌగ్గుల మాహరేత్ నైవేద్యం పాయసం దేయం ప్రీతయే భాస్కరస్యతు

విలేపనం చందనంతు ప్రాశనే విధిరుచ్యతే తృతీయస్యాపి తే వీర! కధితో విధిరుత్తమః

శృణు నామాని దేవస్య పావనాని నృణాం సదా “విష్ణుర్భగస్తథా ధాతా ప్రీయతా” ముద్గిరేచ్చవై

 అనేన విధినా యస్తు కుర్యాత్ప్రయత మానసః సకామానిహ సంప్రాప్య నందతే శాశ్వతీః సమాః

తతః సూర్యసదో గత్వా నందతే నందవర్ధన! ఏషాతు నంద జననీ తవాఖ్యాతా మయా శివ!

యాముపోష్య తతో భుక్త్వా నందతే హంసమాప్యవై

 ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్పే

నందోమ సప్తమీ వర్ణనం నామ శతతమోఽధ్యాయః

తా ఇక మూడవ పారణమున శుభ్రములైన నల్లగలువలు, గుగ్గలు, ధూపము, సూర్యప్రీతికై పాయస నైవేద్యము, విలేపనమునకు, ప్రాశనమునకును చందనము విధిగా చెప్పబడినవి. ఇట్లు ఉత్తమమైన మూడవ పారణ విధి కూడా నీకు చెప్పబడినది కదా!, మనుష్యులకు పవిత్రతను గూర్చు సూర్యనామములను వినుము. “విష్ణువు, భగుడు, ధాత ప్రసన్నుడగుగాక” అని యిట్లుచ్చరింపవలెను. ఈ విధానముగ ప్రయత మానసుడై నందాసప్తమీనాచరించువాడు సకల మనోరథములను సిద్ధింపజేసి కొని చిరకాలమానందించును. అటు పిమ్మట సూర్యలోకమునకుఁబోయి అచటనానందముగ నుండును. ఈసప్తమీ ఆనందమును కలిగించునది. దీనియందుపవాస పారణములు చేసినవాడు సూర్యలోకప్రాప్తినంది యానందించును. దీని విధానమును నీకు వివరించితిని.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు నందయను సప్తమీ వర్ణనమనేడు నూఱవ అధ్యాయము సమాప్తము.