భవిష్య మహా పురాణము
133. ప్రతిమా ప్రతిష్ఠా కల్పమున విశ్వరూప వర్ణనము
నారద ఉవాచ :
మూ ॥ తతోధివాసనం కుర్యాద్విధాదృష్టేన కర్మణా ఐశాన్యం దిశివై కుర్యాదధివాసన మండపమ్
చతుస్తోరణ సంపన్నం సర్వాభరణ సంయుతమ్ దిశాసు విదిశా స్వేవ పతాకాభిస్తు భూషితమ్
ఆగ్నేయ్యాం దిశి రక్తాః స్యుః కృష్ణాః స్యుర్యామ్య నైరృతే శ్వేతా దిశ్యపరస్యాంతు వాయవ్యామేవ పాండురాః
చిత్రా చోత్తర పార్శ్వేతు పీతా పూర్వోత్తరే తథా శ్రియమాయుర్జయం చైవ బలం యశో యదూత్తమ!
దదాతిసా వీర! కృతా సంపదర్థేనసంశయః హితాయ సర్వలోకానాం మృన్మయీ ప్రతిమా భవేత్
సుభిక్ష క్షేమదా నిత్యం సర్వా మణిమయీ కృతా గాంగేయా పుష్టిదా స్యాద్వై రౌప్యాకీర్తిప్రవర్తినీ
ప్రజావృద్ధిం తామ్రమయీ కుర్యాన్నిత్యమసంశయః భూమేర్లాభంతు విపులం కుర్యాదశమయీ సదా
ప్రథాన పురుషం హంతి త్రపు లోహమయీ సదా సర్వదేవ మయ స్యైవ మర్చాం కుర్యాత్ప్రయత్నతః
సాంబఉవాచ :
సర్వదేవ మయత్వం హి బ్రూహిమే భాస్కరస్యతు సర్వదేవ మయో హ్యేష కథం నారద! కథ్యతే?
తా॥ నారదుడిట్లనెను. 'ఇట్లు విగ్రహనిర్మాణము చేసిన పిమ్మట శాస్త్రవిధి ననుసరించి యధివాసనము చేయవలెను. ఈశాన్య దీశయందు ప్రత్యేకముగ నధీవాసన మండపమును నిర్మింపవలెను-1. మండపమునకు నలుదిక్కుల తోరణములతోను, వివిధాభరణములతోను శోభాయమాసముగ నలంకరింపవలెను. అన్ని పార్శ్వములందు పతాకములతో నలంకరింపవలెను-2. ఆగ్నేయమున నెఱ్ఱనివి, దక్షిణనైరృతి దిశలందు నల్లనివి, పడమర దిక్కున తెల్లనివి, వాయవ్యమున తెలుపుమించిన పచ్చనివి-3. ఉత్తర పార్శ్వమున చిత్రవర్ణము గలవి, ఈశాన్యము నుండి తూర్పున పసుపు వన్నెగలవి కూర్పవలెను. దారు ప్రతిమ ధనమును, ఆయువును, జయమును, బలమును, కీర్తిని యిచ్చును-4. ఆది సంపత్కరమనుటనో సంశయములేదు. మృణ్మయ ప్రతిమ సర్వలోకహితకరము-5. మణులచే నిర్మితమైన ప్రతిమ సుభిక్షమును, క్షేమమును కలిగించును. బంగారముతో చేయబడిన పుష్టిని, వెండితో చేయబడినది కీర్తిని కలుగజేయును-6. రాగి ప్రతిమ నిస్సంశయముగ ప్రజావృద్ధిని కలిగించును. శిలానిర్మిత మగు ప్రతిమ విపులమైన భూసంపదను లభింపఁజేయును-7. సీసము, ఇనుముతో చేయబడిన ప్రతిమలు ప్రధానవ్యక్తిని చంపునుగావున నట్టివి నిర్మింపరాదు. సాంబా! ఇట్లు సర్వదేవమయుడైన సూర్యభగవానుని మూర్తిని శ్రద్దగా నిర్మింపవలెను-8. అనవివి సాంబుడిట్లనెను. “మునివర్యా! సూర్యదేవుని సర్వదేవ మయత్వమెట్టిదో నాకుఁతెలుపుడు. ఈతడు సర్వదేవమయుడని యేల పేర్కొనబడెనో చెప్పుడు.
మూ. నారద ఉవాచ :
సాధు సాంబ! మహాబాహో! శృణుమే పరమం వచః బుధసోమౌ స్మృతానేత్రే లలాటే చేశ్వరః స్థితః
సురజ్యేష్ఠః శిరస్తస్య కపాలోఽస్య బృహస్పతి: ఏకాదవ తథారుద్రాః కంఠమస్య సమాశ్రితాః
నక్షత్రాణి గ్రహాశ్చైవ దశనేషు సమాశ్రితాః ధర్మాధర్మౌ చ దేవస్య ఓష్ఠసంపుటకే స్థితౌ
సర్వశాస్త్రమయీ దేవీ జిహ్వాయంచ సరస్వతీ దిశశ్చవిదిశశ్చైవ సర్వాః శ్రోత్రేషు సంస్థితాః
బ్రహ్మేంద్రౌతాలుదేశేతు స్థితౌ దేవైశ్చ పూజితౌ ఆదిత్యా ద్వాదశ విభోర్ర్భువోర్మధ్యే సమాశ్రితాః
ఋషయో రోమ కూ పేషు సముద్ర జఠరే స్థితాః యక్షకిన్నర గంథర్వాః పిశాచాదానవాస్తథా
రాక్షసాశ్చ గణాః సర్వే హృదయే స్యుః స్థితా రవేః నద్యోబహు గతాశ్చైవ నాగాః కక్షాంతరే స్థితాః
పృష్ఠమధ్యేస్థితో మేరు: స్తనయోరంతరే కుజః తస్యపుత్రో ధర్మరాజః స్థితోనై నాభిమండలే
కటి దేశే పృథివ్యాద్యా లింగే సృష్టిః సమాశ్రితా జానునీ చాశ్వినీ దేవా వూరూ తస్యాచలాః స్మృతాః
సప్తపాతాలలోకాస్తు నఖమధ్యే సమాశ్రితాః సర్వదేవ మయోభానుః సర్వదేవాత్మక స్తథా
వ్యంగేషు వాయవశ్చైవ లోకాలోకం చరాచరమ్ వ్యాప్తం కర్మ శరీరేణ వాయునా తస్యపై విభో
స ఏష భగవానర్కో భూతానుగ్రహణే స్థితః ఏతత్తే పరమం జ్ఞాన మేతత్తే పరమం పదమ్
తస్యస్థాన విభాగేన ప్రతిమా స్థాపనం యథా తత్తే సర్వం ప్రవక్ష్యామి యథోక్తం బ్రహ్మణా పురా
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణీ సప్తమీ కల్పే సాంబోపాఖ్యానే ప్రతిమాప్రతిష్టి కల్పే విశ్వరూప వర్ణనం నామ త్రయస్త్రింశ దుత్తర శతతమోఽధ్యాయః
తా॥నారదుడిట్లనెను. “మంచిది, సాంబా! చెప్పుచున్నాను. నామాటలను శ్రద్ధగా వినుము బుధుడు, చంద్రుడును సూర్య భగవానునకు, నేత్రములు, అతని ఫాల భాగమున నీశ్వరుడుండును-10. ఆ దేవదేవుని శిరమున బ్రహ్మదేవుడు, కపాలమున బృహస్పతి, కంఠమునందేకాదశరుద్రులుందురు-11. నక్షత్రములు, గ్రహములును అతని దంతములనాశ్రయించి యుండును. ధర్మాధర్ములు పెదవుల పై నుందురు-12. సర్వశాస్త్రమయియగు సరస్వతి యాతని నాలుక పై నుండును. దిక్కులు విదిక్కులు శ్రోత్రములయందు గలవు-13. దేవతలతో పూజింపబడు బ్రహ్మ, ఇంద్రుడు దవడల పైనను, ద్వాదశాదిత్యులు కనుబొమల నడిమీ భాగముననుందురు-14. అతని రోమ కూపములందు ఋషులు, జఠరమున సముద్రములు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, పిశాచములు, రాక్షసులు-15. దానవులు-వీరందఱును హృదయస్థానముననుందురు. బాహుప్రదేశములలో నదులు, చంకలలో నాగులు-16. వీఁపునడిమి భాగమున మేరువు, స్తనమధ్య ప్రదేశమున కుజుడు, అతని కుమారుడైన యమధర్మరాజు నాభిప్రదేశమునను ఉండును-17. పృధివ్యాదులు కటీదేశమున, సృష్టియంతయు లింగమున, అశ్వినీ దేవతలు మోకాళ్ళయందును, పర్వతములు తొడలందును-18. పాతాళలోకములేడును గోటినడుమ, సముద్రములతో గూడిన భూలోకము పాద మధ్యమునను -19. క్రొలగ్నిరుద్రుడు పలుకొసలయందును ఉండును. ఇట్లు సూర్యదేవుడు సర్వదేవమయుడు, సర్వదేవాత్మకుడు-20. అతని యమూర్తాంగములందు వాయువులుండును. ఆ ప్రభుని క్రియామయరూపమగు వాయువుచేతనే సకల చరాచర సృష్టి వ్యాప్తమై యున్నది-21. అట్టి యా సూర్యభగవానుడు సకల భూతములననుగ్రహించుటయందు తత్పరుడైయుండును. ఇది యంతయు తెలియుట పరమ జ్ఞానమగును. ఇదియే నీకు పరమ పదమగును-22. ఇక సూర్యదేవుని ప్రతిమ నెట్లు స్థాపింపవలెనో పూర్వము బ్రహ్మదేవునిచే వివరింపబడిన రీతిగ స్థల విభాగముతో నీకు నేను సాకల్యముగ విశదము చేసెదను.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పాంతర్గత సాంబోపాఖ్యానమునందలి ప్రతిమా ప్రతిష్టాకల్పమునందు విశ్వరూపవర్ణనమను నూటముప్పదిమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 133 of the Bhavishya Mahā Purana is as follows:
During the pratiṣṭhā ceremony — the consecration of a Sūrya image — there is a specific moment when the deity's universal form (viśvarūpa) is revealed to the presiding priest and to those present with the capacity to see. This chapter describes that moment and the viśvarūpa vision: Sūrya appearing simultaneously as all the twelve Ādityas, as all the stars, as all the fires, as the light within all living eyes, as the source and ground of all light throughout the three worlds. The experience of this viśvarūpa is described as simultaneously terrifying in its immensity and profoundly reassuring in its all-encompassing compassion — every being, no matter how small or apparently insignificant, is held within the universal solar light.