130. సాంబోపాఖ్యానమున ప్రాసాదలక్షణ వర్ణనము

మూll శతానీక ఉవాచ :

కథం సాంబేన విప్రేంద్ర ప్రతిష్టాకారితారవేః కస్యవా వచనాతైన ప్రాసాదః కారితో రవే:

సుమంతు రువాచ :

అత్ర తే వచ్మిరాజేంద్ర! యథా సాంబేన ధీమతా ప్రతిష్ఠా కారితా భానోః ప్రాసాదశ్చ మహీపతే!

 సులబ్ధ్వా ప్రతిమాం భానోశ్చింతయామాస నారదమ్ సచాపి చింతతశ్చాగా ద్యత్రజాంబవతీ సుతః

తమాగతమభిప్రేక్ష్య నారదం మునిసత్తతమ్ సంపూజ్య విధివత్సాంబో నారదం వాక్యమబ్రవీత్

ప్రాసాదం కారయేద్యస్తు భాస్కరస్య నరో ద్విజ! కింఫలం తస్య దేవర్షే! ప్రతిష్టాం యశ్చకారయేత్

నారద ఉవాచ :

ప్రాసాదం శోభనేదేశే యస్తుకారయతే రవేః సయాతి నరశార్దూల! సూర్యలోకం నసంశయః

 సాంబ ఉవాచ :

కథం కుర్యాదాయతనం కస్మిన్దేశే ద్విజోత్తమ! 'కీదృక్ఫస్తం చాయతనం దేవదేవస్యపై ద్విజ!'

నారద ఉవాచ :

యత్ర ప్రభూతం సలిల మాగమేచ వినాశనే దేవతాయతనం కుర్యాద్యశోధర్మ వివృద్ధయే

ఇష్టాపూర్తేన లభతే లోకాం స్తాంశ్చ విభూషితాన్ దేవానామాలయం కార్యం ద్వయం యత్రచ దృశ్యతే

 సలిలాద్యంచ ఆరామః కృతేష్వాయ తనేషుచ స్థానే స్వేతేషు సాన్నిధ్యముపగచ్ఛంతి దేవతాః  

తా॥ శతానీకుడిట్లనెను. “ద్విజోత్తమా! సాంబుడు సూర్యదేవునెట్లు ప్రతిష్ఠించెను? ఎవరి వాక్యముననుసరించి యాతడు సూర్య దేవునకు ప్రాసాదమును నిర్మింపఁజేసెను?-1 సుమంతుముని యిట్లు సమాధానము చెప్పెను. రాజేంద్రా! ధీమంతుడైన సాంబుడు సూర్య ప్రతిష్ఠ యెట్లు చేసెనో, ఆయతనమెట్లు నిర్మింపజేసెనో నీ కిపుడు వివరింతును-2. చంద్రభాగలో సూర్య ప్రతిమ లభించినంతనే సాంబుడు తన మనస్సున నారదునిఁదలంచికొనెను. వెంటనే సాంబుని యెదుట నారద మహర్షి ప్రత్యక్షమయ్యెను-3. మునిసత్తముడైన నారదుని రాకను గమనించి సాంబుడా మహాత్ముని విధి విధానముగఁబూజించి యతనితో నిట్లు విన్నవించేను-4. “దేవరీ! సూర్య దేవునకు ప్రాసాదమును నిర్మింపఁజేయువానికి, ఆ దేవ దేవుని ప్రతిష్ఠించువానికిని ఎట్టి ఫలము లభించునో దయతో నాకుఁదెలుపుడు”-5. నారదుడిట్లు సమాధానము చెప్పెను. “సాంబా! సుందరమగు ప్రదేశమున సూర్య దేవాలయమును నిర్మింపఁజేయువాడు నిస్సంశయముగ సూర్య లోకమునకుఁబోవును”-6. సాంబుడు మఱల నిట్లు ప్రశ్నించెను. “మహాత్మా! సూర్యాయతనము నెట్లు నిర్మింపవలెను? ఎట్టి స్థలమున నిర్మింపవలెను? దేవాలయమెట్లున్నచో ప్రశస్తము?17. అను నీ ప్రశ్నలకు నారద మహర్షి యిట్లు సమాధానము చెప్పెను. “బావులు మున్నగువానిలో నిండుగ కనబడునప్పుడును, భూగర్భమునందు కనబడకుండగను విస్తారమైన జలసందగల ప్రదేశములందు యశోధర్మ వృద్ధి కొఱకు దేవాలయమును నిర్మింపవలెను-8. యజ్ఞ యాగాదులు నిర్వర్తించుట, తటాకారామాదుల నేర్పరచుట వలన నుత్తమ లోకములు లభించును. రెండంశములెచట కన్పట్టునో అచట దేవతలకు గుడులు నిర్మింపవలెను-9. అందుమొదటిది జలము. ఉద్యానవనములు, పుష్పవాటికలు. రెండవది- ఇట్టి స్థానమున నిర్మింపబడిన యాలయములలో, పరిసరములందును దేవతలు సన్నిధినందియుందుట.

 మూ॥ సరఃసు నలినీచ్ఛన్న నిరస్తరవి రశ్మిపు హంస సంక్షిప్త కహార వీథవిమల వారిషు

హంసకారండవ క్రౌంచ చక్రవాక విరావిషు పర్యంత విమలచ్ఛాయా విశ్రాంత జన చారిషు

క్రౌంచ కాంచీ సులాపాశ్చ కలహంస కలస్వనాః నద్యస్తోయాంశుకా యత్ర శఫరీకృత మేఖలాః

 ఫుల్ల ద్రుమోత్తమావాసాః సంగమశ్రోణి మండలాః పులినాధ్యున్నతో రస్కారస హాసాశ్చ నిమ్నగాః

వనోపాంత నదీశైల సంస్కారోపాంత భూమిషు రమతే దేవతా నిత్యం పురేషద్యానవత్సుచ

భూమయో బ్రాహ్మణాదీనాం యఃప్రోక్తా వాస్తుకర్మణి తా ఏవ తేషాం శస్యంతే దేవతాయతనేష్వపి

 చతుఃషష్టి పదం కుర్యాద్దేవతాయతనం సదా ద్వారంచ మధ్యమం తస్మిన్సమదిక్సంప్రశస్యతే

 యోవిస్తారో భవేత్తస్య ద్విగుణా తత్సమున్నతి: ఉచ్ఛాయస్తు తృతీయోధ తేనతుల్యా కటిర్భవేత్

 విస్తరార్థో భవేద్గర్భో భిన్నయైన్యాః సమంతతః గర్భపాదోన విస్తీర్ణం ద్వారం ద్విగుణము చ్చ్రి తమ్

 ఉచ్చ్రయాత్పాద విస్తీర్ణా శాఖా తద్వదుదుంబరీ విస్తరా త్పాద ప్రతిమద్భాహుల్యం శేషయోఃస్మృతమ్

తా॥ తామరలచే కప్పబడుటచే సూర్య కిరణములను నిరాకరించునవియు, హంసలచే వేయబడిన పరిమళ భరితములగు కలువపూల వరుసలు గలుగుటచే పవిత్రములైన జలములు గలవియు-11. హంసలు, కన్నెలేళ్లు (పక్షులు), క్రౌంచ పక్షులు, జక్కవ పక్షులు మున్నగువాని కూజితములతో ధ్వనించుచున్నవియు, పరిసరములలో వ్యాపించియున్న చల్లని నీడలో విశ్రమించుచున్న బాటసారులు గలవియునైన సరస్సులయందు-12. దేవతలు క్రీడించుచుందురు. మేఖలాకృతిగ, బారులు దీరిన క్రౌంచపక్షుల పలుకులనెడు సంభాషణలు గలవియు, కలహంసల యవ్యక్త మధుర ధ్వనులు గలవియు, నీటి పాయలనెడి యుత్తరీయములను ధరించినవియు, చేపల వరసలే మేఖలలుగా చేయబడినవియు-13. చిగురించిన చెట్ల గుబురుల క్రిందుగగల ప్రదేశములే తమ నివాస స్థలములుగా గలవియు, నదీ సంగమ స్థానములే నితంబ మండలములుగా గలవియు, ఇసుక తిన్నెలనెడి యెత్తైన వక్షః స్థలములు గలవియు, జలమే నవ్వుగా గలవి, పల్లపు ప్రదేశములకుఁబోవునవియు, గంభీరమైన యాంతర్యము గలవియు)నైన నదులు,-14. ఉద్యానవనములకు సమీపమునందుగల ప్రదేశములు, నదులు కొండలు కలిగియు మానవ విహారమున కనుకూలముగఁ జక్కఁజేయబడిన ప్రాంతములు, ఫల పుష్పభరితములైన తోటలు గల పురములు మున్నగునవి దేవతా విహార భూములు-15. వాస్తు శాస్త్రముననుసరించి బ్రాహ్మణాది వర్ణములవారి నివాస గృహముల నిర్మాణము కొఱకెట్టి ప్రదేశములు నిర్దేశింపబడినవో దేవాలయ నిర్మాణమునకుఁగూడ నట్టి ప్రదేశములే ప్రశస్తమైనవి-16. అణువది నాలు చదరపుటడుగుల వైశాల్యముండునట్లు దేవాయతనమును నిర్మింపవలెను. దాని యందిరువైపుల సమ భాగములుండునట్లు నట్టనడిమి స్థలమున ద్వారము నేర్పరుపవలెను-17. అట్లేర్పరచుట ప్రశస్తము-17. ఆలయ విస్తీర్ణమునకు రెండింతలు దాని యెత్తుండవలెను. ఎత్తులో మూడవ వంతునకు సమముగ కటి(నడిమి) ప్రదేశముండవలెను-18. విస్తృతి యందర్ధభాగము గర్భాగారము, చుట్టును వేజ్వేలు పాములుగగనతోను గల రోగ నిగమునకోక చతురగము సగిలుతగ చతుర్ధభాగము సూర్య ప్రతిమయు, దానికన్నను తక్కిన యిద్దజి (సంజ్ఞాచ్ఛాయల) ప్రతిమల విస్తృతి పాద భాగము తక్కువగ నుండవలెను.

 మూ॥ త్రిపంచ సప్తనవభిః శాఖాభిస్త త్ప్రశస్యతే అధ శాఖా చతుర్భాగే ప్రతిహారౌ నివేశయేత్  

శైల మంగల్య విహగః శ్రీ వృక్షః స్వస్తికైర్ఘటైః మానాష్టమేన భాగేన ప్రతిమా స్యాత్సపిండికా

ద్విభాగా ప్రతిమాతత్ర తృతీయా భాగపిండికా పూర్వే మేరు ర్మహాబాహో! కైలాసశ్చతథాపరే

భవంతి చాపరే వీర! విమాన చ్ఛదనం తథా సముద్ర పద్మ గరుడ నందివర్థన కుంజరాః

గృహరాజో వృషో హంసః సర్వతో భద్రకో ఘటః సింహో వృషశ్చతుష్కోణః షోడశా ష్టాశ్రయస్తథా

 ఇత్యేతే వింశతిః ప్రోక్తాః ప్రాసాదా యదునందన! యథోక్తాను క్రమేణైవ లక్షణాని వదామితే

 నవత్రింశదుచ్చ్రిత మేరుర్ద్వాదశ భౌమో వివిధ కుహరశ్చ ద్వారైర్యుతశ్చతుర్భిర్ద్వాత్రింశద్ధస్త విస్తీర్ణః

త్రింశద్ధస్తాయామో దశభౌమః సప్తమందరః శిఖరయుతః కైలాసోపి శిఖరవానష్టావింశోష్ట భౌమశ్చ

జాలగవాక్షైర్యుత్తో విమానసంజ్ఞ స్త్రీ సప్తకాయామః నందన ఇతివై భౌమో ద్వాత్రింశత్షోడశాంగయుతః

 వృత్త: సముద్గనామా పద్మాకృతి రయం చాష్టౌ శృంగేణైకేన భవేదేకేనచ భూమికా తస్య

తా॥ ద్వారపు వెడల్పు. మూడు, ఐదు, ఏడు తొమ్మిది విభాగ ప్రమాణములలో నుండుట శ్రేష్టము. వెడల్పునకు నాల్గవ యెత్తునుండి కడప వఱకును కవాటములుంచవలెను-21. బిల్వము, జమ్మి, రావి, సూర్యుడు, చంద్రుడు, పక్షి, స్వస్తికములతోడి కలశములు మున్నగు చిత్రణములు వాని పై నుండవలెను-22. ఎనిమిదవ భాగపు పరిమాణమున నుబ్బెత్తు ప్రతిమ యుండవలెను. ఎత్తులో రెండు వంతుల ప్రతిమ, లేక మూడు వంతుల ప్రతిమయైనచో నొక భాగము మాత్రముబ్బెత్తుగ నుండవలయును. మహాబాహూ! మేరుపు కైలాసము-23. విమాన చ్చదనము సముద్రము, పద్మము, గరుడము, నందివర్థనము, కుంజరము-24. గృహ రాజము, వృషము హంసము, సర్వతోభద్రకము, ఘటము, సింహము, వృషము, చతుష్కోణము, షోడశాశ్రయము, అష్టాశ్రయము-25. అని యిరువది విధములగు ప్రాసాదములు చెప్పబడినవి. చెప్పబడిన క్రమమున వాని లక్షణములను చెప్పుచున్నాము వినుము-26. ముప్పది రెండు హస్త ప్రమాణముల విస్తీర్ణము, ముప్పది తొమ్మిది ప్రమాణముల యెత్తు, వివిధములగు ప్రవేశ కుహరములు, నాలుగు ప్రధాన ద్వారములు గల ద్వాదశ భూమిక ప్రాసాదము మేరువనబడును-27. ముప్పది హస్తముల ప్రమాణము నిడివి, పది భౌమములు, ఏడు మందరములు, శిఖరములుగల ప్రాసాదము కైలాసము. ఇరువది యెనిమిది ప్రమాణముల నిడివి, అష్ట భౌమములుగలది శిఖరవంతము-28. అష్ట దళ పద్మాకృతిగ గుండ్రముగ నుండి, ఒక శృంగము, ఒక భూమిక గల ప్రాసాదము సముధము.

 మూII గరుడా కృతిశ్చగరుడో నందీవైషష్టి విస్తీర్ణం కాయశ్చ సప్తభౌమో విభూషితోఽoగైశ్చ సప్తవింశతిభిః.

కుంజర ఇతి గజపృష్ఠః షోడశ హస్తోచ్చ్రితో మధ్యే గృహరాజః షోడశకస్త్రి చక్రశాలా భవేద్వలఖీ

 వృషేవ భూమి శృంగో ద్వాదశ హస్తః సమున్నతో వృత్తః హంసోహంసాకారో, ఘటోఽష్ట సహస్ర కలశరూపః

 ద్వారైర్యుతశ్చతుర్భిర్బహు శిఖరో భవతి సర్వతో భద్రః బహురుచిర చంద్రశాలః షడ్వింశద్భాగ భూమిశ్చ

 సింహః సింహాకారో ద్వాదశ కోణోఽష్ట హస్తశ్చ

 సహస్ర త్రితయం చైవ కథితం విశ్వ కర్మణా ప్రాహుఃస్థాపయతశ్చాత్ర మతమేకం విపశ్చితః కపోతపాలినీ యుక్తమతో గచ్ఛతి.తుల్యతామ్

సాంబ ఉవాచ :

య ఏతే కథితా విప్ర! ప్రాసాదా వింశతిస్త్వయా తేషాం సూర్యస్య కః కార్యః ప్రాసాదో భాస్కరస్యతు

 స్థానాని యాని చోక్తాని ప్రాసాదస్య ద్విజోత్తమ! తేషాం త్వయోక్తం హి పురం వ్యయ వద్భిర్నరైర్యుతమ్

 తస్మిన్ప్రదేశే వైకార్యం భానోర్మందిరముత్తమమ్ దిశాం భాగేచ కతమే బ్రూహిశేషం ద్విజోత్తమ!

తా॥ గరుడాకృతి గలది గరుడము. ఇది అణువది హస్త ప్రమాణముల విస్తీర్ణము, సప్త భూమికా కాయము, ఇరువదియేడనుబంధ భాగములు గలిగియుండును-31. గజపృష్టాకరముగ నిర్మితమగునది కుంజరమనబడును. ఇది పృష్ఠమధ్య భాగమున పదునాలు హస్త ప్రమాణముల యెత్తు కలిగియుండును. పదునాలు హస్తముల విస్తీర్ణము గలది గృహ రాజము. మూడు చక్ర శాలలు గలదీ వలభి-32. పన్నెండు హస్తముల విస్తీర్ణముతో పొడవైన వృత్తాకారముగలిగి, ఒక శృంగముతో నిర్మింపబడునది వృష ప్రాసాదము. హంసాకారముగ నుండునది హంసప్రాసాదము. ఎనిమిది వేల కలశముల రూపమున నుండునది ఘటప్రాసాదము-33. నాలుగు వైపుల ద్వారములు, బహుశిఖరములు గలది సర్వతో భద్ర. దీనికి ఇరువది యాఱు భాగముల భూమి, మిక్కిలి సుందరమైన చంద్రశాల యుండును-34. సింహకృతిగ నుండునది సింహప్రాసాదము. ఇది ఎనిమిది హస్తముల ప్రమాణ విస్తీర్ణము, పన్నెండు కోణములు గలిగియుండును-35. విశ్వకర్మ మూడువేల ప్రాసాదములను గూర్చి చెప్పెను. ఇట ప్రాసాద స్థాపకునకు విద్వాంసులొక యభిప్రాయమును సూచింతురు-36. ఏమన కపోత పాచిక (గువ్వగూటి)తో కూడిన ప్రాసాదము గణనీయతను సంతరించుకొనును”-37. సాంబుడు మఱల నిట్లనెను. “మహర్షీ! మీరు వివరించిన యీ యిరువది విధములగు సాయతనములలో సూర్య భగవానునకు నిర్మింపవలసినది యెట్టిదై యుండవలెను?-38. సూర్యాయతన నిర్మాణము కొఱకు తాము లోగడ వివరించి యున్న స్థలములో నేది శ్రేష్ఠము? అట్టి స్థలమున సూర్య మందిరమే దిశగా నుండవలయును? మిగిలిన వివరములన్నియు దయతో నాకుఁజేప్పుడు.

 మూII నారద ఉవాచ :

పుర మధ్యం సమాశ్రిత్య కుర్యాదాయతనం రవేః దిశాంభాగేఽథ వా పూర్వే పూర్వద్వార సమీపతః

భూమిం పరీక్ష్య పూర్వంతు కుర్యాదాయతనం తతః ఇష్ట గంథ రసోపేతా నిమ్నా భూమిః ప్రశస్యతే

 శర్కరాతుష కేశాస్థి క్షారాంగార వివర్జితా మేఘ దుందుభి నిర్ఘోషా సర్వబీజ ప్రరోహిణీ

శుక్లా రక్తా తథా పీతా కృష్ణాచ కథితా క్షితి: ద్విజరాజన్య వైశ్యానాం శూద్రాణాంచ యథాక్రమమ్

పరీక్షితాయాం తస్యాంతు మధ్యే తస్యాః ప్రమాణతః ఉపలిప్య చతుర్హస్తం చతురస్రం సమంతతః

హస్తమాత్ర మధః కృత్వా మధ్యే తస్యా దశాంగులమ్ గర్తముత్కీర్య తేనైవ పాంసునా ప్రతిపూరయేత్

 సమే సమగుణాజ్ఞేయా హీనే హీన గుణా భవేత్ వర్థమానేతు వై పాం సౌభ వేద్వృద్ధికరీ క్షితిః

 నిత్యం సంముఖ మర్కస్య కదాచిత్పశ్చిమా ముఖమ్ స్థాపనీయం గృహం సమ్యక్ర్పాజ్ముఖస్థాన కల్పనాత్

 భవనాద్దక్షిణే పార్శ్వే రవేః స్నాన గృహం భవేత్ అగ్నిహోత్ర గృహం కార్యం రవ్రుత్తరతః శుభమ్  ఉదజ్మఖం భవేచ్ఛంభో ర్మాతృణాం గృహమేవచ

 బ్రహ్మా పశ్చిమతః స్థాప్యో విష్ణురుత్తరతస్తథా నిక్షుభా దక్షిణే పార్శ్వే వామే రాజ్జీప్రకీర్తితా

తా॥ నారదుడిట్లు చెప్పెను. “పట్టణ మధ్య భాగమునగాని లేక ఆ పట్టణపు తూర్పు వాకిలి సమీపమున ప్రాగ్భాగమున గాని సూర్య మందిరమును నిర్మింపవలెను-41. మొదట భూమిని పరీక్షించి యా పిమ్మట మందిర నిర్మాణము చేయవలెను. భూమి యందలి మట్టి చక్కని సుగంధము గలిగి, మంచి రుచి గలిగియుండుట ప్రశస్తము, నిర్మాణ స్థలము పల్లముగా నుండవలెను-42. పలుగు బిళ్లు, ఊఁక (ఉముక), కేశములు, ఎముకలు, ఉప్పు, బూడిద, ఉమ్మెత్త, బొగ్గు మున్నగునవి లేనిదిగ నుండవలెను. మేఘ గర్జన, దుందుభి ధ్వానము కలిగి ఏ విత్తనములైనను మొలకెత్తగలదిగ సారవంతమై యుండవలెను-43. బ్రాహ్మణులకు తెల్లనిది, క్షత్రియుల కెఱ్ఱనేల, వైశ్యులకు పచ్చనిది, శూద్రులకు నల్లనేల శ్రేష్ఠమైనదిగ చెప్పబడినది-44. ఇట్లు పరీక్షించిన ప్రదేశము మధ్య భాగమున నాలుగు మూరల వైశాల్యముతో చతురస్రముగ చుట్టును అలుకవలెను. (లేపనము చేయవలెను)-45. ఆ యలికిన ప్రదేశమున నొక మూరెడు క్రిందు చేసి మధ్య భాగమున పది యంగుళముల లోతుగ నొక గుంట తవ్వి, అట్లు తవ్వగా వచ్చిన మట్టితో నా గుంటను నింపివేయవలెను-46. సమముగా నిండినచో ఆ నేల సమగుణము కలదియని పూర్తిగా నిండక మట్టి తక్కువైనచో హీనమైనదనియు, పూర్తిగ నిండి మట్టి యెక్కువై మిగిలినచో నట్టి స్థలము సంపత్కరమనియు తెలియవలెను-47. సూర్య మందిరమెప్పుడేనియు తూర్పు ముఖముగా నుండవలెను. అనివార్యమగునపుడు పశ్చిమాభి ముఖముగ కూడ నిర్మింపవచ్చును. కాని ప్రాజ్ముఖ స్థానమును కల్పించి నిర్మించుటయే శ్రేష్ఠము-48. భవనమునకు దక్షిణ పార్శ్వమున సూర్యదేవునికి స్నాన గృహమును నిర్మింపవలెను. ప్రధాన మందిరమున కుత్తర భాగమున నగ్ని హోత్ర గృహము నేర్పరుపవలెను. శివుని యొక్కయు, మాతృకల యొక్కయు మందిరముల నుత్తరముఖములుగను-49. బ్రహ్మ దేవుని యాలయమును పశ్చిమముగను, విష్ణ్వాలయ ముత్తరమునకును, కుడివైపున వేపచెట్టును, ఎడమవైపున రాజీ మందిరమును నిర్మింపవలెను.

 మూ॥పింగలో దక్షిణే భానోర్వమతో దండనాయకః శ్రీ మహాశ్వేతయోః స్థానం పూర్వతస్త్వంశుమాలినః

తతః స్థాప్యాశ్వినోః స్థానం పూర్వ దేవగృహాద్బహిః ద్వితీయాయాంతు కక్షాయాం రాజ్ఞాస్రౌషౌ వ్యవస్థితౌ

 తృతీయాయాంతు కక్షాయాం స్థితౌ కల్మష పక్షిణౌ జండకామచరౌ స్థాప్యౌ దక్షిణాం దిశమాశ్రితౌ

ఉదీచ్యాం స్థాపనీయస్తు కుబేరో లోకపూజితః ఉత్తరేణ తతస్తస్య రేవతః సవినాయకః

యత్రవా విద్యతే స్థానం దిక్షుసర్వా గృహాదయః ద్వేమండలేఽర్ఘ్య దానార్థం కార్యే సవ్యాప సవ్యత:

దద్యాదుదయ వేలాయా మర్ఘ్యం సూర్యాయ దక్షిణే ఉత్తరేమండలే దద్యాదర్ఘ్య మస్తమనే రవే:

 చక్రాకృతాం తథాన్యస్మిన్దేవస్య ప్రతిమాం రవేః స్థాపయేద్విధివద్వీర! చతుర్భిః కలశైః శుభైః

నానా తూర్య నినాదైశ్చ శంఖ శబ్ధైశ్చ పుష్కలైః తృతీయే మండలే హ్యేవం పూజనీయో దివాకరః

 చతురస్రం చతుఃశృంగం వ్యోమదేవ గృహాగ్రతః ప్రతిమాయాస్తు సూత్రేణ కార్యం మధ్యేఽ స్య మండలమ్

 దిండీస్థాప్యః పురస్తస్మాదాదిత్యాభి ముఖఃస్థితః యదేతత్కథితం వ్యోమ సర్వదేవమయం మయా

మధ్యాహ్నేతస్య దాతవ్య మర్ఘ్య మత్ర యదూత్తమ! అధవా మండలం చాన్యత్తృతీయం చక్రసంమితమ్

 స్థాపయిత్వాతు దేవేశం దాతవ్యోఽర్ఘః సుపండితైః దేవస్య పురతః కార్యం వ్యోమస్థానం సమీపతః  పుస్తక వాచన స్థాన మథవా యత్రరోచతే

 ఏష స్థాన విధిఃప్రోక్తా దేవతానాం యథాక్రమమ్ గృహ రాజ్ఞోధ రుద్రస్తు ద్వావే భాస్కరప్రియౌ

ఇతి శ్రీ భవిష్య మహాపురాణే బ్రహ్మపర్వణి సప్తమీ కల్పే సాంబోపాఖ్యానే ప్రాసాదలక్షణ వర్ణనం నామ త్రింశదుత్తర శతతమోఽధ్యాయః

తా॥ సూర్యభగవానునకు కుడివైపున పింగళుడు, ఎడమవైపున దండనాయకుడుండవలెను. శ్రీ మహాశ్వేతల స్థానము సూర్యునకు ముందుభాగము-51. దేవ గృహమునకు బహిర్భాగమున ప్రాగ్జిశయందశ్వినీ కుమారులను ప్రతిష్టింపవలెను. మందిరమునందలి రెండవ కక్షలో రాజ్ఞ సొషులను స్థాపింపవలెను. మూడవ కక్షలో కల్మాష, పక్షులను, దక్షిణ దిశనాశ్రయించి దండ, మాఠరులను-53 ఉత్తరమున లోకపూజితుడైన కుబేరుని, అతనికి ఉత్తరమున వినాయకుని యుక్తముగ, రేవతుని ప్రతిష్టింపవలెను-54. ఎచట స్టానము గలదో అచ్చటచ్చట నిర్దేశింపబడిన దిక్కులలో నాయాదేవతల మందిరములను నిర్మింపవలెను. ఎడమ ప్రక్కన నొకటి, కుడిప్రక్కన నొక్కటియు నర్ఘ్యప్రదానము కొఱకు రెండు మండలముల నేర్పరుపవలయును-55. ఉదయకాలమున దక్షిణ మండలమునను, ఆస్తమయకాలమున నుత్తరమండలమునను సూర్యభగవానున కర్ఘ్యమొసంగవలెను-56. చక్రాకార పీఠముపై సూర్యప్రతిమను విధి విధానముగ స్థాపించి, స్నానగృహమున నాలుగు మంగళకరములైన కలశములలోని జలములతో నభిషేకింపవలెను-57. అభిషేక సమయమున వివిధములగు మంగళ వాద్యములు, శంఖములు మ్రోగించుచుండవలెను. తృతీయ మండలమున నిట్లు సూర్యదేవుని పూజింపవలెను-58. ఈ మండలమును సూర్యాలయమునకు ముందు ప్రతిమకు మధ్య భాగమున చతురస్రముగను, నాలుగు శృంగములతోడను, ప్రతిమా శాస్త్రసూత్రములననుసరించి దారముతో కొలిచి నిర్మింపవలెను-59. దానికి ముందు సూర్యాభిముఖముగ దిండిని స్థాపింపవలెను. నేను వివరించిన సర్వదేవమయమైన వ్యోమమునకు -60. మధ్యాహ్న సమయమున నిట నర్ధ్యప్రదానము చేయవలెను. లేక చక్రాకృతిగనొక తృతీయ మండలమును నిర్మించి దాని పై-61. సూర్యదేవుని స్థాపించి, విద్వాంసులైనవారీ స్థలమున నర్ఘ్యప్రదానము చేయదగును. ఈ వ్యోమస్థానము సూర్యదేవున కెదురుగ, సమీపమున కల్పింపవలేను. ఇక పురాణేతిహాసాదికముల వాచనము కొఱకేచట సౌకర్యమనిపించునో అచట సమావేశమందిరమును నిర్మింపవలెను-62. ఇట్లు దేవతల స్థాపనవిధి, క్రమముననుసరించి నీకు చెప్పబడినది. గృహరాజము, సర్వతోభద్ర యను నీ రెండు విధముల ప్రాసాదములు సూర్యదేవునకు ప్రియమైనవి.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు సాంబోపాఖ్యానమున ప్రాసాదలక్షణ వర్ణనమను నూట ముప్పదియవ అధ్యాయము సమాప్తము.