భవిష్య మహా పురాణము
129. సాంబకృతాదిత్యమూర్తి స్థాపనము
మూ॥ సుమంతు రువాచ :
అధ లబ్ధవరః సాంబో వరం ప్రాప్య పురాతనమ్ మన్య మానస్తదాశ్చర్యం ప్రహృష్టేనాంతరాత్మనా
పూర్వాభ్యాసేన తైనైవ సార్థ మన్యైస్తపస్విభిః స్నాపనార్థం నాతిదూరం చంద్రభాగాం నదీం యయౌ
కృత్వాత్మ మండలాకారం శ్రద్దధానో దినే దినే సస్నౌ సంచింతయామాస కిం రూపం స్థాపయామ్యహమ్
సస్నాతః సహసైవాథ ప్రణమ్యతు ప్రభావతీమ్ ఉహ్యమానాం జలౌఘేన ప్రతిమాం సంముఖీం రవేః
తాం దృష్ట్వా తస్య వీరస్య సముత్పన్న మిదం యథా దేవేన యత్తదాజ్ఞప్తం తదిదం నాత్ర సంశయః
స తాముత్తార్య సలిలాదానీయచ మహీపతే తస్మిన్మిత్రవనోద్దేశే స్టాపయామాస తాంతదా
నిధాయ ప్రతిమాంలోకే సాంబస్తస్య మహాత్మనః మిత్రం మిత్రవనే రమ్యే స్థాపయిత్వా విధానతః
తతస్తామేవ పప్రచ్ఛ ప్రణమ్య ప్రతిమాం రవే: 'కేనేయం నిర్మితానాథ! భవతో హ్యాకృతిః శుభా'
ప్రతిమా తమువాచాథ "శృణు సాంబ! బ్రువే స్వయమ్ నిర్మితాయేన చాప్యేషా మహీయా పురుషాకృతిః
మమాతి తేజసావిష్టం రూపమాసీత్పురా తనమ్ అసహ్యం సర్వ భూతానాం తతోఽస్మ్యభ్యర్చితః సురైః సహ్యంభవతు తే రూపం సర్వ ప్రాణ భృతామితి
తా॥ సుమంతుముని యిట్లనెను. “సాంబుడు సూర్య భగవానునిచే వరము పొంది, శ్రేష్ఠమగు తన పూర్వ రూపమును బడసి సంతుష్టాంతరంగుడై, తన తపస్సు, సూర్య దేవుని యను గ్రహమును గూర్చి యాలోచించుచు నానందాశ్చర్యములలో మున్కలిడేను-1. తపః కాలమునందలి యభ్యాసవశమున లోక పూజ్యులగు తపస్వులతోగూడి స్నానార్ధమై సమీపముగల చంద్రభాగానదికిఁబోయెను-2. ప్రతి దినమునందు వలెనే అతడు తన మనస్సున మండలాకారుడగు సూర్యదేవుని భావనచేయుచు శ్రద్ధాళువైస్నానమాచరించి ఎట్టిరూపముగలస్యూర్యదేవుని ప్రతిమను ప్రతిష్ఠింపవలెనో యని యాలోచించెను-3. స్నానమును త్వరగా పూర్తిగావించి నదీమ తల్లికకు నమస్కరించుచున్నంతలో, తానూహించుచుండిన సూర్యదేవుని ప్రతిమ నీటితోబాటుగ ప్రవహించుచు సమీపమునకు వచ్చెను-4. ఆ ప్రతిమను చూచి సాంబుడు మిక్కిలి సంతసించి, “సూర్యదేవుడు తనను ప్రతిష్ఠింపుమని నన్నాజ్ఞాపించెను గదా! ఆ దేవదేవుని ప్రభావము వలననే యీ ప్రతిమ యిటనావిర్భవించిన దనుటలో సందేహములేదు"-5. అని తర్కించుకొని ప్రతిష్ఠించెను-6. సాంబుడిట్లా ప్రతిమను మీత్రవనమునందలి యొక రమ్యమైన ప్రదేశమున విధివిధానముగ ప్రతిష్ఠించి-7 నమస్కరించి, “భగవాన్! ఈ నీ దివ్యాకృతి నేవరు నిర్మించిర”ని యా ప్రతిమనడిగెను-8. అప్పుడా సూర్య ప్రతిమ సాంబునితో నిట్లనెను. “సాంబా! వినుము. అద్భుతమైన యీ నా పురుషాకృతి యెవరిచే నిర్మింపబడినదో స్వయముగ నేనే చెప్పుచున్నాను వినుము-9. “పూర్వము నా రూపము మిక్కిలి తేజోవంతమై సర్వ ప్రాణులకును దుర్నిరీక్ష్యమై ప్రకాశించుచుండెను. అప్పుడు దేవతలందఱు నన్ను పూజించి "దేవా! సర్వ ప్రాణులకును మీ తేజః స్వరూపము చూడశక్యము కాకున్నది. కావున దర్శనీయమగు నట్లనుగ్రహింపుడ'ని ప్రార్థించిరీ.
మూ. తతోమయా సమాదిష్టో విశ్వకర్మా మహాతపాః తేజసాం శాతనం కుర్వ న్రూపం నిర్వర్తయస్వమే
తతస్తు మత్సమాదేశాత్తేనైవ నిపుణం తదా శాకద్వీపే భ్రమిం కృత్వా రూపం నిర్వర్తితం మమ
ప్రీత్యా తేషాం ప్రపంచోఽయం సమయాకారితః పునః తేనేయం కల్పవృక్షాత్తు నిర్మితా విశ్వకర్మణా
కృత్వా హిమవతః పృష్ఠ పురాసిద్ధ నిషేవితే త్వదర్థం చంద్రభాగాయాం తతస్తేనావతారితా
భవతస్తారణార్థం హి తతః స్థానమిదం శుభమ్ రుచిరం సర్వదా సాంబ! సాన్నిధ్యం మేత్ర యాస్యతి
సాన్నిధ్యం మమ పూర్వాహ్ణే సుతీరే ద్రక్ష్యతేజనైః కాలప్రియేచ మధ్యాహ్నేఽపరాహ్ణే చాత్ర నిత్యశః
పూర్వాహ్ణే పూజయే ద్భ్రహ్మా మధ్యాహ్నే చక్రధృత్స్వయమ్ శంకరశ్చాపరాహ్ణేతు మాం పూజయతి సర్వదా
ఇత్యుక్తోసౌ భగవతా భాస్కరేణ సయాదవః హర్షమాప మహాబాహో! భాస్కరోం తర్దధే తతః
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్పే సాంబోపాఖ్యానే సాంబకృతాదిత్యమూర్తి స్థాపనం నోమైకోన త్రింశదుత్తర శతతమోఽధ్యాయః
తా॥అప్పుడు “నా తేజస్సు నరుగదీసి నా రూపమును సరిచేయుమ”ని మహాతపుడైన విశ్వకర్మనాదేశించితిని-11. నా యీ యాదేశమున, నాతడు శాకద్వీపమునందు తిరుగుయంత్రమునమర్చి నిపుణతతో నా రూపమును సరిచే సెను-12. ప్రాణి ప్రపంచమంతయు తదనుగుణముగ పునర్నిర్మితమయ్యెను. ఆ విశ్వ కర్మయే కల్ప వృక్షపు దారువుతో నీ ప్రతిమను నిర్మించేను-13. నిర్మించి, పూర్వము సిద్దులతో సేవింపబడు హిమవత్పర్వతమునకు వెనుకగల ప్రదేశమునందున్న చంద్రభాగానది యందు, దీనిని, నీ కొఱకే వదిలి పెట్టేను-14. నిన్ను తరింప జేయునుద్దేశముననే యాతడీ ప్రతిమను చంద్రభాగా జలములలో దించేను. సాంబా! అందుచే నీ ప్రదేశము పవిత్రమైనది. సుందరమైనది కూడా. ఇచట నెల్లప్పుడు నా సాన్నిధ్యముండును-15. పూర్వాహ్లామున నా యునికి యిచటి తీరము నుండి జనులచే చూడబడును. మధ్యాహ్న సమయమున ‘కాల ప్రియము'నందు ('కాలపి'యందు) చూడబడును. అపరాష్ట్రమున నిచట నిత్యమును నాదర్శనమగును-16. పూర్వాహ్లామున బ్రహ్మదేవుడు, మధ్యాహ్నమున విష్ణుదేవుడు, అపరాష్ట్రమున శివదేవుడును నన్ను పూజించుచుందురు”-17. అని ఇట్లు భగవానుడగు భాస్కరుడు సాంబునకుఁజెప్పెను. సాంబుడు సూర్యుని వాక్యములను విని సంతసించెను. అప్పుడు ప్రతిమాగతుడైన భగవానుడంతర్షితుడయ్యెను.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు, సాంబోపాఖ్యానమున 'సాంబకృతాదిత్య స్థాపన'మను నూట యిరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 129 of the Bhavishya Mahā Purana is as follows:
Sāmba returns to Mitravana and, following the precise instructions given to him by Sūrya, establishes the first Āditya temple of the Kali Yuga. The chapter narrates in detail the selection of the temple site (on the bank of the Candrabhāgā), the preparation of the ground, the procurement of the sacred image (which Sāmba obtained from the ocean, where Viśvakarma had deposited it), the assembly of brāhmaṇas skilled in the pratiṣṭhā ceremony, and the consecration itself. The moment when Sūrya's divine presence enters the installed image and the image becomes radiantly alive is described with devotional intensity. The Sāmba narrative, which began with a curse and a disfigured body, concludes with the establishment of a living solar temple — Bhagavān's grace transformed suffering into service.