127. సాంబోపాఖ్యానమున సూర్యప్రసాద వర్ణనము

శతానీక ఉవాచ :

మూ॥ కథమారాధితః సూర్యః సాంబేనామిత తేజసా విముక్తస్తు కథం రోగై ర్భూహిమే ద్విజసత్తమ !

 సుమంతురువాచ :

సాధుపృష్టోస్మి రాజేంద్ర! శృణు సాంబకథాం పురా విస్తరాద్వచ్మి తే సర్వాం కథాం పాప విమోచినీమ్

 పురా సంశ్రుత్య మాహాత్మ్యం భాస్కరస్య స నారదాత్ వినయాదుప సంగమ్య వచః పితర మబ్రవీత్

కశ్మలేనాభి భూతోఽస్మి మలేన వ్యాధినాచ్యుత! వైద్యైరోషధిభిశ్చాపి న శాంతిర్మమ విద్యతే

 వనం గచ్ఛామి భగవన్ననుజ్ఞాం దాతు మర్హసి శివేన పుండరీకాక్ష! ధ్యాయమాం పురుషోత్తమ!

 అనుజ్ఞాతః స కృష్ణేన సింధోరుత్తర కూలతః గత్వాసంతారయామాస చంద్రభాగాం మహానదీమ్

తతో మిత్రవనం గత్వా తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్ ఉపవాస పరః సాంబః శుష్కోధమని సంతతః

ఆరాధనార్థం సూర్యస్య గుహ్యం స్తోత్రం జజాప హ వైదైశ్చతుర్భిః సమితం పురాణాశ్రయ బృంహితమ్

యదేతన్మండలం శుక్లం దివ్యం హజరమవ్యయమ్ యుక్తం మనోజవై రశ్వైర్హరితైర్ర్బహ్మవాదిభిః

ఆదిరేషహి భూతానామాదిత్య ఇతి సంజ్ఞితః త్రైలోక్యచక్షు రేవాత్ర పరమాత్మా ప్రజాపతిః

ఏషవై మండలేహ్యస్మిన్పురుషో దీప్యతే మహాన్ ఏష విష్ణురచింత్యాత్మా బ్రహ్మాచైష పితా మహః

రుద్రో మహేంద్రో వరుణ ఆకాశం పృథివీ జలమ్ వాయు: శశాంకః పర్జన్యోధనాధ్యక్ష విభావసుః

 తా॥ శతానీకుడిట్లనెను. “అమిత తేజస్కుడైన సాంబునిచే సూర్యభగవానుడెట్లారాధింపబడెను? సాంబుడు తన రోగముల నుండి యెట్లువిముక్తుడయ్యెను? మునిసత్తమా! ఈ విశేషములు నాకుఁజెప్పుడు. సమాధానముగ సుమంతుముని యిట్లు చెప్పఁదొడగెను. “రాజేంద్రా! లెస్సగానడిగితివి. పూర్వము జరిగిన పాపవిమోచకమగు సాంబుని కథను సాకల్యముగఁజెప్పెదను. వినుము. పూర్వము నారదుని వలన సూర్యభగవానుని మాహాత్మ్యము విని సాంబుడు వినయమున తన తండ్రిని సమీపించి అతనితో నిట్లనెను. "తండ్రీ! కశ్మలము, మలినమునైన వ్యాధిపాలబడితిని. ఔషధములచేత, వైద్య చికిత్సలచేత నాయీ వ్యాధి నయమగుటలేదు. నాకు శాంతిలభించుటలేదు. అందుచేతపస్సు చేయుటకై యరణ్యమువేనకుడలేదను. అనుజ్జయిండు. నాకు శుభము కలుగవలెనని యాకాంక్షింపుడు. అని యిట్లు ప్రార్థించి, తండ్రిచే ననుజ్ఞాతుడై సింధూనదికి ఉత్తర తీరమునగల ప్రాంతమునకుఁబోయి సాంబుడు చంద్రభాగ యను మహానదిని దాటేను. అటనుండి ముల్లోకములలో ప్రసిద్ధిగాంచిన 'మిత్రవన'మను సూర్యక్షేత్రమునుఁజేరెను. అచటనుపవాసతత్పరుడై, ఎండిపోయిన రక్తనాళముల గలవాడై పూనికతో తపస్సు చేయనుద్యమించెను. సూర్యదేవునారాధించు కొఱకు నాలుగువేదములతో సమానమైనదియు, పురాణములనాశ్రయించి చెప్పబడినదియునైన రహస్య సూర్యస్తోత్రమునాతడు జపించెను. “బ్రహ్మవాదులును, మనోవేగమున, పరుగెత్తగలవీయునైన హరితాశ్వములతోను గూడిన యీ సూర్యమండలము దివ్యమైనది. అజరమైనది. అవ్యయమైనది. ఆదిత్యుడను నామముగల యీ భగవానుడు సర్వభూతములకంటెను ఆదిపురుషుడు. ముల్లోకములకు సాక్షియగు పరమాత్ముడు. ప్రజాపతి. ఈ మండలమున దీపించు మహాపురుషుడే విష్ణువు, అచింత్యుడు. పరమాత్మ ఇతడే పితామహుడగు బ్రహ్మ. రుద్రుడు, మహేంద్రుడు, వరుణుడు, పృథివి, ఆకాశము, జలము, వాయువు, చంద్రుడు, పర్జన్యుడు, ధనాధ్యక్షుడగు కుబేరుడు. విభావసుడు.

మూ॥ య ఏష మండలేహ్యస్మిన్పురుషో దీప్యతే మహాన్ ఏకఃసాక్షాన్మహాదేవో వృత్రమండ నిభః సదా

కాలో హ్యేష మహాబాహుర్నిబోధోత్పత్తి లక్షణః య ఏష మండలేహ్యస్మిo స్తేజోభిః పూరయన్మహీమ్

భ్రామ్యతేహ్యవ్యవచ్ఛిన్నో వాతైర్యోమృత లక్షణః నాతః పరతరం కించిత్తేజసా విద్యతే క్వచిత్

పుష్ణాతి సర్వభూతాని ఏష ఏవ సుధామృతైః అంతస్థాన్లేచ్ఛ జాతీయాం స్తిరగ్యోని గతానపీ

కారుణ్యాత్సర్వభూతాని పాసి త్వంచ విభావసో! శ్విత్రకుష్ఠ్యంధ బధిరాన్పంగూంశ్చాపి తథా విభో!

ప్రపన్నవత్సలో దేవ! కురుతే నీరుజో భవాన్ చక్రమండల మగ్నాంశ్చ నిర్ధనాల్పాయుషస్తథా

 ప్రత్యక్ష దర్శీ త్వం దేవ! సముద్ధరసి లీలయా కా మే శక్తిః స్తవైః స్తోతుమార్తోఽహం రోగపీడితః

స్తూయసే త్వంసదా దేవైర్ర్బహ్మ విష్ణు శివాదిభిః మహేంద్ర సిద్ధ గంథర్వై రప్సురోభిః సగుహ్యకైః

స్తుతిభిః కిం పవిత్రైర్వా తవదేవ సమీరితైః యస్యతే ఋగ్యజుస్సామ్నాం త్రితయం మండలస్థితమ్

 ధ్యానినాం త్వం పరం ధ్యానం మోక్షద్వారం చ మోక్షిణామ్ అనంత తేజసాక్షోభ్యోహ్యచింత్యావ్యక్త నిష్కల:

 యదయం వ్యాహృతః కించిత్త్సోత్రేస్మిన్ జగతః పతిః ఆర్తిం భక్తించ విజ్ఞాయ తత్సర్వం జ్ఞాతుమర్హసి

తా॥ ఈ మండలమున దేదీప్యమానముగ ప్రకాశించు మహాపురుషుడు కేవలుడు. సాక్షాత్తుగ మహాదేవుడు. చీకటిని గప్పివేయుచు ప్రకాశించుచుండువాడు-13. ఇతడే కాలస్వరూపుడు. సుదీర్ఘమగు బాహుపులుగలవాడు. జ్ఞానోత్పత్తియే లక్షణముగ గలవాడు. ఈ మండలమునుండియే యీతడు తన తేజస్సులచేత భూతలమును నింపుచు -14. అమృత లక్షణుడై భూత జాలములకు ప్రాణ వాయువులను ప్రసాదించుచు నేడ తెరిపిలేక తిరుగుచుండును. ఇతని కంటే నితరమగు దేని చేతను, ఏదైనను, ఏ మాత్రమైనను, ప్రకాశింపజాలదు-15. ఇతడే తన సుధామృతములతో సకల భూతములను పోషించుచుండును. కడపటి జాతి పోరిని, లోనున్నవారిని, మేచ్చ జాతీయులను తిర్యగ్యోనులను - అందని, అన్ని ప్రాణులను పోషించుచుండును-16. హే భగవాన్! సూర్యదేవా! నీవు సర్వ భూతములను దయతో రక్షింపుచుందువు. బొల్లి మచ్చలు గలవారిని, కుష్ఠ వ్యాధిగ్రస్తులను, గ్రుడ్డివారిని, చెవిటివారినీ, కుంటివారిని వీరు పారను భేదములేక అందని కాపాడుచుందువు. ప్రభూ!-17. శరణు పొందిన వారి పై వాత్సల్యమును వర్షించు దేవదేవా! నీవే కదా ఆరోగ్యమును ప్రసాదింతువు! దుఃఖముల సుడిగుండములలో మునిగియున్న వారిని, దరిద్రులను, అల్పాయుష్కులను నీవే కదా ఉద్దరింపగలవాడవు!-18. స్వామీ! నీవు ప్రత్యక్షముగ చూడగలవు. లీలగా సముద్ధరింపగలవు. రోగ పీడితుడను. ఆర్తుడను. స్తోత్రములతో నిన్ను స్తుతించుటకు నా శక్తి యేపాటిది?-19. బ్రహ్మ విష్ణు శివాది దేవతల చేతనే నీ వెల్లప్పుడు స్తుతింపబడుచుందువు. మహేంద్రుడు, సిద్ధులు, గంధర్వులు, అప్సరలు, గుహ్యకులు మున్నగువారు నిన్నెప్పుడును పొగడుచునే యుందురు. సుందరములు, పవిత్రములునైన స్తోత్రములతో నీకేమి కొదవ? ఋగ్యజుస్సామ వేదములు మూడును నీ మండలముననే గలవుగదా!-21. ఓ జగన్నాథా! ధ్యానము చేయువారికి నీవే ధ్యేయ వస్తువవు. మోక్షార్థులకు నీవే మోక్షద్వారమవు. అనంతములగు తేజస్సులతో ప్రకాశించుచును కలఁత నొందని వాడవు. అచింత్యుడవు. అవ్యక్త స్వరూపుడవు. నిష్కలుడవు-22. ప్రభూ! నేను పలికిన యీ చిన్న స్తోత్రమునందలి యార్తిని, భక్తిని తెలిసికొని - సర్వమును నీకు తెలియును - గాన నన్ను కరుణింపుమ.

 మూ॥ తమువాచ తతః సూర్యః ప్రీత్యై జాంబవతీ సుతమ్ ‘ప్రీతోఽస్మి తపసావత్స! బ్రూహితన్మాం యదిచ్ఛసి

 సాంబ ఉవాచ :

యది ప్రసన్నో భగవానేష ఏవ వరోమమ భక్తిర్భవతుమేఽ త్యర్థం త్వయిదేవ సనాతన!

శ్రీ సూర్య ఉవాచ :

భూయస్తుప్టోఽస్మి భద్రంతే వరం వరయ సువ్రత!” సద్వితీయం వరం వవ్రే తదైవ వరదం విభుమ్  

మల: శరీర సంస్థోమే త్వత్ప్రసాదాత్ప్రణశ్యతు యనమే శుద్ధ మఖిలం వపుర్భవతు గోపతే!

సుమంతు రువాచ :

స తథాస్త్వితి తేనోక్తో భాస్కరేణ మహాత్మనా తాం ముమోచ రుజం సాంబో దేహాత్వచమివోరగః

తతోరూపేణ దివ్యేన రూపవానభవత్పునః ప్రణమ్య శిరసాదేవం పురతోఽ వస్థితోఽభవత్

 శ్రీ సూర్య ఉవాచ :

భూయశ్చ శృణుమే సాంబ! తుష్టాహం యద్భ్రవీమితే అద్యప్రభృతి త్వన్నామ్నా మమస్థానాని సువ్రత! క్షితౌయేస్థాప యిష్యంతి తేషాం లోకాః సనాతనాః

స్థాపయ స్వైవ మామస్మింశ్చంద్ర భాగా తటే శుభే తవనామ్నాచ సాంబేదం పరాంఖ్యాతిం గమిష్యతి

కీర్తి స్తవాక్షయా లోకే ఖ్యాతిం యాస్యతి సువ్రత! భూయశ్చతే ప్రదాస్వామి ప్రత్యహం స్వప్న దర్శనమ్

సుమంతురువాచ :

ఏవం దత్వావరం తస్మై వృష్ణిసింహాయ చాపరమ్ ప్రత్యక్ష దర్శనం దత్వా తత్రైవాంతరధాధరిః

య ఇదం పఠతే స్తోత్రం త్రికాలం భక్తిమాన్నరః త్రిసప్త శతమావర్త్య హోమం వా సప్త రాత్రకమ్

 రాజ్యకామో లభేద్రాజ్యం ధన కామో లభేద్ధనమ్ రోగార్తో ముచ్యతే రోగాద్యథా సాంబస్తదైవ సః

సూర్యలోకం వ్రజేచ్చాపి భక్త్యా పూజ్య దివాకరమ్ రమతేచ తథా తస్మిన్దేవైశ్చ పరివారితః

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రా హ్మేపర్వణీ సప్తమీ కల్పే సాంబోపాఖ్యానే

సూర్యప్రసాద వర్ణనం నామ సప్తవింశత్యుత్తర శతతమోఽధ్యాయః

తా॥ సూర్యదేవుడు ప్రసన్నుడై సాంబునితో 'వత్సా! నీ తపస్సుకు సంతసించితిని. నీకేమి కావలయునో కోరుకొనుమని' ప్రీతితోఁ బలికెను-24. “భగవన్! నాకు నీ యందు అమితమైన భక్తి కలుగునట్లను గ్రహింపుము. ప్రసన్నుడనైతివేని యిదియే వరముగ నాకు ప్రసాదింపు”మని సాంబుడు వినమ్రుడై ప్రార్థించేను-25. “సాంబా! నీ భక్తికి మణింత సంతుష్టుడనైతిని. నీకు శుభమగుగాక! వరమును కోరుకొమ్మ”ని సూర్యదేవుడాదరమున బలికెను. అప్పుడు సాంబుడు వరదుడైన సూర్య ప్రభువును రెండవ వరము నీట్లు కోరెను-26. “సూర్య దేవా! నీ యను గ్రహమున నా శరీరమందలి యీ వ్యాధి రూపమాలిన్యము నశించి నాకు యథా పూర్వముగ శుద్ధమగు రూపము కలుగవలయును”-27. సుమంతుముని యిట్లనెను. “సూర్య భగవానుడు సాంబుని కోరికను మన్నించి “తథాస్త"నేను. వెంటనే పాము తన కుబుసమును విడిచినట్లు సొంబుడు తన కుష్ట వ్యాధిని సంపూర్ణముగ విడిచివేసెను-28. అప్పుడు దివ్యమైన రూపముతో పూర్వ మట్లు సౌందర్యవంతుడై ప్రకాశించేను. శిరము వంచి నమస్కరించి సూర్య దేవునెదుట సవినయముగ నిలబడెను-29. సూర్యదేవుడిట్లు పలికెను. “సాంబా! ఇంకను వినుము. సంతుష్టుడనై చెప్పుచుంటిని. నేటి నుండి నా స్థానములు నీ పేర ప్రసిద్దినందగలవు. భూమి యందెవరు నా క్షేత్రముల నిర్మింతురో వారికి ఉత్తమ లోకములు ప్రాప్తించును-30. శుభ ప్రదమైన ఈ చంద్రభాగా నదీ తీరమున నా మూర్తిని ప్రతిష్ఠించి యొక క్షేత్ర స్థానముగ దీనిని తీర్చిదిద్దుము. సాంబా! ఈ పుణ్య క్షేత్రము నీ పేరనే మిక్కిలి' ఖ్యాతి నందగలదు-31. నీ కీర్తి అక్షయమై లోకమున ప్రసరింపగలదు. నీ కింక నొక వరమును గూడ ప్రసాదింతును. అదేమన నిత్యమును నీకు స్వప్నమునందు నేను దర్శనమిచ్చుచుందును”-32. సుమంతుముని యిట్లు చెప్పఁ దొడంగెను. “సూర్య భగవానుడు, వృష్ఠికుల సింహుడగు సాంబునకిట్లు మఱియొక వరమును ప్రసాదించి, ఆ క్షణమున ప్రత్యక్షదర్శనమిచ్చి యచ్చటనే యంతర్థానమొందెను-33. ఏ మానవుడు భక్తి గలవాడై యీ స్తోత్రమును త్రికాలములందు పఠించునో అట్టివానికి-34. రాజ్య కాముడైనచో రాజ్యము, ధనము కావలసిన వాడగుచో ధనము, లభించును. రోగముతో బాధపడువానికి నారోగ్య లాభము చేకూరును. సాంబుడెట్లు తన భయంకరమగు వ్యాధి నుండి ముక్తుడయ్యెనో అట్లే పారాయణ హవనములు పూర్తి చేసిన వాడును రోగ ముక్తుడగును-35. అంతీయకాక దివాకరుని భక్తితో పూజించువాడు సూర్య లోకమునకుఁబోయి, అచట దేవతలతో గూడి చిరకాలమానందించుచుండును.

శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు సాంబోపాఖ్యానమున సూర్యప్రసాద వర్ణనమను నూటయిరువది యేడవ అధ్యాయము సమాప్తము.