భవిష్య మహా పురాణము
126. వ్యోమ మహాత్మ్య వర్ణనము
మూ॥ సుమంతురువాచ :
“ఆకాశం ఖం దిశో వ్యోమ అంతరిక్షం నభోంఽబరమ్ పుష్కరం గగనం మేరుర్విపులం చబిలం తథా
అపోఛిద్రం తథా శూన్యం తమోవై రోదసీ తథా నామాన్యేతాని తే వ్యోమ్నః కీర్తితాని మహీపతే!
లవణ క్షీర దధ్యమ్ల ఘృతమా ధ్విక్షవస్తథా స్వాదూదకశ్చ సప్తైతే సముద్రాః పరికీర్తితాః
హిమ వాన్హేమ కూటశ్చ నిషధోనీల ఏవచ శ్వేతశ్చ శృంగవాంశ్చైవ షడేతే వర్ష పర్వతాః
మధ్య సంస్థస్తథైతేషాం మహారాజత పర్వతః మా హేంద్రీ చాప్యథాగ్నేయీ యామ్యాచనైరృతీ తథా
వారుణీ చాధ వాయవ్యా సౌమ్యైశానీ తథైవ చ ఏతాః పుర్యస్తు దేవానాం తథోపరి సమాశ్రితాః
పృథివ్యాంతుస్థితో వీర! లోకాలోకస్తు పర్వతః తతశ్చాండ కపాలంతు తస్మాత్తత్పరతస్తుయః
తతోఽ గ్ని ర్వాయురాకాశం తతో భూతాదిరుచ్యతే తతో మహానహంకారాః ప్రకృతిః పురుషస్తతః
పురుషాదీశ్వరో జ్ఞేయ ఈశ్వరేణావృతం జగత్ ఈశ్వరోభగవాన్భానుస్తేనేదం పూరితం జగత్
సహస్రాంశుర్మహా తేజాశ్చతుర్బాహుర్మహాబలః ఊర్థ్వ మప్యథ లోకాస్తు ప్రాజ్మయాయే ప్రకీర్తితాః భూయస్తాన్సం ప్రవక్ష్యామి అండావరణ కారకాన్
తా॥ సుమంతుముని యిట్లనెను. “ఆకాశము, ఖం, దిశ, వ్యోమము, అంతరిక్షము, నభము, అంబరము, పుష్కరము, గగనము, మేరువు, విపులము, బిలము. అపోఛిద్రము, శూన్యము, తమము, రోదసి అని వ్యోమమునకు పేళ్లు చెప్పబడినవి. లవణ, క్షీర, దధి, (ఆమ్ల) ఘృత, మధు, ఇక్షు, స్వాదూదక సముద్రములని ఏడు సముద్రములు కీర్తింపబడినవి. హిమవంతము, హేమకూటము, నిషధము, నీలము, శ్వేతము, శృంగవంతము అను నీ యాటు వర్షపర్వతములు. వీని మధ్యభాగమున మహారాజత పర్వతము గలదు. మా హేంద్రి, ఆగ్నేయి, యామ్య, నైరృతి. వారుణి, వాయవ్య, ఈశానీ అను దేవనగరములు ఆ పైన గలవు. భూమి పైన లోకాలోకమను పర్వతము గలదు. దాని పిమ్మట అండ కపాలము గలదు. దాని పిదప. అగ్ని, వాయువు, ఆకాశము మున్నగు భూతములు గలవని చెప్పబడినది. అటు పై మహదహంకారములు, ప్రకృతి, ఆపై పురుషుడు. పురుషుని పిదప ఈశ్వరుడుగలడని యెఱుంగవలెను. ఈశ్వరునితో జగత్తంతయు నావరింపబడియున్నది. ఈశ్వరుడన సూర్యభగవానుడే. అతని తోడనే ఈ జగము నిండియున్నది. అతడు సహస్రాంశుడు. మహాతేజుడు. చతుర్భుజుడు. మహాబలుడు. అనాదిగ నున్నవిగ చెప్పబడునండావరణకారకములగు నూర్ఖాథోలోకములను గూర్చి మఱలనొక తడవ వివరింతును.
మూ॥ భూర్లోకస్తు భువర్లోకస్తృతీయః పరికీర్తితః
మహరనస్తపః సత్యః సప్తలోకాః ప్రకీర్తితాః తతస్త్వండ కపాలంతు తస్మాచ్చ పరశస్తమః
తతోఽగ్నిర్వాయురాకాశం తతో భూతాదిరుచ్యతే తతో మహాన్ప్రధానశ్చ ప్రకృతిః పురుషస్తతః
పురుషాదీశ్వరో జ్ఞేయ ఈశ్వరేణావృతం జగత్ భూమేరథస్తోత్సప్తైవ లోకానభిమతాన్ శృణు
తలం సుతల పాతాలే తలాతలం తథా తలమ్ వితలంచ కురుశ్రేష్ఠ! సప్తమంచ రసాతలమ్
తతోఽ గ్నిర్వాయురాకాశం తతో భూతాదిరుచ్యతే తతో మహాన్ప్రధానశ్చ ప్రకృతిః పురుషస్తతః
పురుషాదీశ్వరో జ్ఞేయ ఈశ్వరేణావృతం జగత్ ఏవం మేరోః ప్రమాణంతు సర్వమే తత్ప్రకీర్తితమ్
చతురస్రశ్చతుః శృంగః సమేరు: కాంచనః శుభః పృథివ్యాం సంస్థితో మధ్యే సిధ్ధగంధర్వ సేవితః
చతుర్భిః కాంచనైః శృంగైః దివ్యైర్ధివమివోల్లిఖన్ యోజనానాం సహస్రాణి చతురాశీతిరుచ్చ్రితః
ప్రవిష్టః షోడశాధస్తా దష్టావింశతి విస్తృత విస్తరస్త్రిగుణశ్చాస్య పరిణాహస్తతః స్మృతః
తా॥ భూలోకము, భువర్లోకము, సువర్లోకము. మహార్లోకము, జనోలోకము తపోలోకము, సత్యలోకమునని యేడు లోకములు చెప్పబడినవి. అటు పైఅండ పాలము, దాని పై తమము (అండభిత్తి) గలదు. అటనుండి అగ్ని, వాయువు, ఆకాశము మున్నగు భూతాదులు, అటుపై మహత్తు, ప్రధానము ప్రకృతి, పురుషుడు. ఆపై ఈశ్వరుడు ఈశ్వరునిచే జగత్తెవరింపబడియున్నది. భూమికి క్రిందుభాగమున గల లోకములను గూర్చి వినుము. తలము, సుతలము, పాతాళము, తలాతలము, అతలము, వీతలము, రసాతలము అను నీయేడు అధోలోములు (అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల. పాతాళము లని వాని క్రమము). అటు పైన నగ్ని, వాయువు, ఆకాశము, భూతాదులు, మహత్తు, ప్రధానము, ప్రకృతి, పురుషుడు. పురుషునిపై ఈశ్వరుడు-ఈశ్వరునితో నీజగత్తంతయు నిండియున్నది. మేరు ప్రమాణమంతయును ఇట్లు చెప్పబడినది. నాలుగు మూలలుగా నుండి నాలుగు శృంగములుగల మేరువు స్వర్ణమయమైనది. ఇది భూమధ్యమున వ్యాప్తమైయున్నది. సిద్దులు, గంధర్వులు దీనిని సేవించుచుందురు. నాలుగు దివ్యమైన కాంచన శృంగములతో నొకాశమునకు వ్యాపించుచు నెనుబదినాలుగువేల యోజనములు యెత్తు గలిగియున్నది. ఇది భూమిలో పదునారువేల యోజనముల లోతు వకు ప్రవేశించియున్నది. అడుగుభాగమున నిరువది యెనిమిది యోజనములు విస్తీర్ణము కలిగియున్నది విస్తీర్ణమునకు మూడురెట్లు పరిధి గలిగియున్నది.
మూ॥ తస్యసౌమనసం నామ శృంగమేకంతు కాంచనమ్ ద్వితీయం పద్మరాగాభం జ్యోతిష్కం నామ నామతః
తృతీయం నామతశ్చిత్రం సర్వదేవమయం శుభమ్ చతుర్థం రాజతం శుక్లం చంద్రౌజస్కమితిస్మృతమ్
యత్తు సౌమనసం నామ శృంగం గాంగేయ ముచ్యతే తదేవ చోదయో నామ్నా యత్రోద్యన్దృశ్యతే రవిః
ఉత్తరేణ పరిక్రమ్య జంబూ ద్వీపం దివాకరః దృశ్యోభవతి భూతానాం శిఖరం చ సమస్థితః
కాంచనస్యచ శైలస్య తేజసార్కస్యచాదృతే ఉభే సంధ్య ప్రకాశేతే ఆతామ్రే పూర్వపశ్చిమే
శృంగే సౌమనసే సూర్య ఉత్తిష్ఠత్యుత్తరాయణే జ్యోతిషే దక్షిణే చాపి విషువే మధ్యతస్తయోః
ఈశేంద్రోద్రిశ్చ ఐశాన్యాం తత్రాగ్నిః పూర్వదక్షిణే నైరృతేపి తతో జ్ఞేయో వాయవ్యే మరుతస్తథా
మధ్యేతు కంజజః సాక్షాద్భ్రహ్మా జ్యోతీంషి చైవహి ఆదిత్య స్తేన రూపేణ తస్మిన్వ్యోమ్ని ప్రతిష్ఠితః
ఇదం దేవ మయం వ్యోమ తథాలోకమయం స్మృతమ్ పూర్వకోణస్థితే శృంగే స్థితః శుక్ర మహీపతే
హెలిజశ్చాపరే జ్ఞేయో ధననాథస్తథాపరే సోమశ్చాపి చతుర్థేతు స్థితః శృంగే జనాధిప!
తా॥ దానికి సౌమనసమను పేరనొక బంగారపు శృంగము, పద్మరాగ ప్రభమై జ్యోతిష్కమను పేరుగల రెండవ శృంగము. సర్వదేవమయమగు చిత్రమను పేరఁబరగు మూడవ శృంగము, చంద్రౌజస్కమని చెప్పబడు వెండిదియగు తెల్లని నాల్గవ శృంగమును వెరసి నాలుగు శృంగములు గలవు. సౌమనసమను శృంగమే గాంగేయమనియు, ఉదయమనియును పేర్కొనబడును. ఉదయించు సూర్యభగవానుడచటనే కాన్పించును. ఉత్తరము నుండి విహరించుచు వచ్చిన దివాకరుడు ఈ ఉదయ శిఖర మధిరోహించియే జంబూద్వీప వాసులకు దర్శన మిచ్చును. పూర్వపశ్చిమ దిశలందలి ప్రాతస్సాయం సంథ్యలు రెండును సూర్యతేజస్సునాదరించుచునే కాంచన శైల తేజస్సుతో నెఱగా ప్రకాశించుచుండును. ఉత్తరాయణమునందు సూర్యభగవానుడు సౌమనస శృంగమున నుదయించును. దక్షిణాయనమున రెండవ శృంగమగు జ్యోతిష్కమున నుదయించును. సంవత్సరమున నారెండింటి మధ్య భాగములలో నుదయించుచుండును. ఈ పర్వతపుటీశాన్య కోణమున నీశ్వరుడు, ప్రాగ్బాగమున నింద్రుడు, ఆగ్నేయకోణమున నగ్ని, దక్షిణమునయముడు, నైరృతికోణమున నిరృతి, పశ్చిమమున వరుణుడు, వాయువ్యకోణమున మరుత్తులు మధ్యభాగమున సాక్షాత్పద్మజన్ముడగు బ్రహ్మదేవుడు; గ్రహనక్షత్రాదులు, ఆదిత్యుడును వ్యోమమునందు గలరు. ఈ వ్యోమము దేవమయము, లోకమయముననియు చెప్పబడినది. తూర్పుకోణమున గల శృంగమున శుక్రుడు, రెండవకోణమునందలి శృంగమున శనైశ్చరుడు, మూడవ శృంగమున కుబేరుడు, నాల్గవ శృంగమున సోముడు నివసింతురు.
మూ॥ మధ్యే కేశాస్థితో రాజన్హుంకారశ్చపినాకినః శృంగే పూర్వోత్తరే రాజన్! స్థితోదేవో విధుక్షయః
తతఃస్థితో మహాదేవో గోపతిర్లోక పూజితః పూర్వాగ్నేయీ స్థితే శృంగే స్థితోవై శాండిలః సుతః
తతః స్థితో మహాతేజాః కీనాశో హేలినందనః స్థితో వై నైరృతే శృంగే విరూపాక్షో మహాబలః
తస్మాదనంతరో దేవః స్థితోవై యాదసాం పతిః తతఃస్థితో మహాతేజా వీరమిత్రో మహాబలః
వాయవ్యం శృంగ మాశ్రిత్య సర్వదేవ నమస్కృతః తతఃస్థితో దశబలో నరమారుహ్య భారత!
బ్రహ్మామధ్యే స్థితో దేవోహ్యనంతశ్చాధ ఏవహి ఉపేంద్ర శంకరౌదేవౌ బ్రహ్మణోంతే సమాస్థితౌ
ఏషమేరుస్తథావ్యోమ ఏషధర్మశ్చపఠ్యతే సర్వదేవమయశ్చాయం మేరువ్యోమ ఇతి స్మృతః
తథావేద మయశ్చాపి పఠ్యతే నాత్ర సంశయః శృంగాణి వేదశ్చాత్వారః పూర్వశృంగాదయో విదు:
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్పే
వ్యోమ మాహాత్య్మ వర్ణనం నామ షడ్వింశత్యుత్తర శతతమోఽధ్యాయః
తా॥ రాజా! మధ్యభాగమున బ్రహ్మ, విష్ణువు, శివుడు నివసింతురు. పూర్వోత్తర శృంగమున పితృగణము. మహాదేవుడు, లోకపూజితుడనైన గోపతియువసింతురు. పూర్వాగ్నేయమందలి శృంగమున శాండిల్యుడుండును. తదనంతర శృంగమున మహాతేజస్వియు, సూర్యనందునుడైన యముడుండును. నైరృతి శృంగమున మహాబలుడు విరూపాక్షుడుండును. అనంతరమున వరుణ దేవుడు నివసించును. ఆపై శృంగమున మహాబలుడగు వీరమిత్రుడు నివసించును. ఇతడు సర్వలోకనమస్కృతుడై వాయువ్యశృంగము నాశ్రయించియుండును. అటు పిదప నరవాహనుడగు కుబేరుడుండును. మధ్య భాగమున బ్రహ్మ, క్రిందగా ననంతుడు, బ్రహ్మకు తరువాతి భాగమున ను పేంద్రుడు, శంకరుడునుందురు. ఇది మేరువనియు వ్యోమమనియు, ధర్మమనియును పేర్కొనబడును. ఈ వ్యోమస్వరూప మేరువు సర్వదేవమయము. సర్వవేదమయమనియుఁజెప్పఁబడును. పూర్వదిక్కునగల శృంగము మొదలుకొని నాలుగు శృంగములే నాలుగు వేదములని తెలియుదురు.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు వ్యోమ మాహాత్యవర్ణనమను నూటయిరువదియాఱవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 126 of the Bhavishya Mahā Purana is as follows:
The teaching on the cosmic structure continues with a focus on the sky — vyoma — as Sūrya's unique domain of governance. All that occurs in the sky — cloud-formation, wind-patterns, the movements of the other grahas, the cycles of rainfall — is under Sūrya's direct administration. The dimensions of the solar disc itself, its distance from the earth, and the speed of its chariot are given in traditional units. The chapter also describes the divine beings — gandharvas, apsarās, siddhas, and cāraṇas — who inhabit the various regions of the sky through which Sūrya passes in his daily and annual journey, and whose celestial music and dance constitute the continuous celebration of Sūrya's transit through the universe.