భవిష్య మహా పురాణము
125. వ్యోమ మహాత్మ్యమున భువన కోశ వర్ణనము
మూ॥ శతానీక ఉవాచ :
“యదేతద్దృశ్యతేవ్యోమ సూర్యస్య పురతో ద్విజ! తదుచ్యతే కిమాత్మాచ కథం భూతశ్చకథ్యతామ్”
సుమంతు రువాచ :
హంత! వ్యోమ ప్రవక్ష్యామి సూర్య ప్రహరణం శుభమ్ యదాత్మకం హి యత్ప్రోక్తం యథా వసంతి దేవతాః
పురస్తాచ్చ చతుఃశృంగం తద్వ్యోమాయతనం రవేః వ్యోమ శబ్దం చతుఃశృంగం సర్వదేవమయంచ యత్
గైరికార్ణవ సంభూతం యదంతర్గర్భ మాశ్రితమ్ తత్రోత్పన్న మిదం వ్యోమ కలేర్వ్యోమ మహీస్మృతా
వరుణస్యయథా పాశో హుంకారో వేధసో యథా విష్ణోశ్చాపి యథా చక్రం త్రిశూలం త్ర్యంబకస్యచ
ఇంద్రస్యచ యథా వజ్రం తథావ్యోమ రవేః స్మృతమ్ తస్మిన్వ్యోమ్ని త్రయస్త్రింశత్ర్కీడంతో యాజ్ఞికాః సురాః
హరశ్చ వర్ష శుద్ధశ్చ త్ర్యంబక శ్చాప రాజితః వృషాకపిశ్చ శంభుశ్చ కపర్దీ రైవతస్తథా ఈశ్వరో భువనశ్చైతే రుద్రా ఏకాదశ స్మృతాః
ఆదిత్యానాంచ నామాని విష్ణోశ్చక్రస్య దీయతామ్ అర్యమాచతథామిత్రో భగోఽథ వరుణస్తథా
వివస్వాన్త్స వితాచైవ పూషాత్వష్టాతథైవచ అంశో భగశ్చాతితేజా ఆదిత్యా ద్వాదశ స్మృతాః
ధ్రువో ధరశ్చ సోమశ్చ ఆపశ్చవాఽనిలోఽ నల: ప్రత్యూషశ్చ ప్రభాతశ్చ వసవోఽష్టౌ ప్రకీర్తితాః
తా॥ శతానీకుడిట్లనెను. “మునీశ్వరా! సూర్యదేవుని యెదుట కన్పట్టుచున్న యీ వ్యోమ స్వభావమేమి? అది యెట్టిదో దయతో నాకుఁ దెలియఁజెప్పుడు”. శతానీకుని యాకాంక్షవిని సుమంతుముని యిట్లనెను. “శుభ ప్రదమైన సూర్యాయుధమగు వ్యోమమును గూర్చి తప్పక చెప్పెదను. దాని స్వభావమెట్టిదో, దాని యందు దేవతలేట్లు నివసింతురని చెప్పబడినదో వివరింతును. సర్వ దేవమయము, నాలుగు శృంగములు గల (నలువైపుల వ్యాపించియున్న) వ్యోమ స్థానము సూర్యదేవుని ముందు భాగమున గలదు. స్వర్ణాది ధాతుమయ సముద్రమునఁబుట్టి విశ్వము నావరించియున్న దాని నుండి వ్యోమము కలిగినది. కలికి సంబంధించిన వ్యోమము, భూమీయని చెప్పబడును. వరుణునకు పాశము, బ్రహ్మదేవునకు హుంకారము, విష్ణు భగవానునకు చక్రము, శివునకు త్రిశూలము. ఇంద్రునకు వజ్రాయుధమెట్లో సూర్యునకు వ్యోమ మట్టిది. ఆ వ్యోమమునందు ముప్పది ముగ్గురు యాజ్ఞికులైన దేవతలు క్రీడించుచుందురు. హరుడు, వరుడు, శుద్ధుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభుడు, కపర్ది, రైవతుడు, ఈశ్వరుడు, భవనుడు అను వారే ఏకాదశ రుద్రులని చెప్పబడుదురు. ఆదిత్యుల యొక్కయు, విష్ణు చక్రము యొక్కయు నామములు చెప్పవలెను గదా! అర్యముడు, మిత్రుడు, భగుడు, వరుణుడు. వివస్వంతుడు, సవిత, పూషుడు, త్వష్ట అంశుడు, అతితేజుడు, విష్ణువు, ఇంద్రుడు - వీరు ద్వాదశాదిత్యులు. ధ్రువుడు, ధరుడు, సోముడు, ఆపుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాతుడు - వీరెనమండ్రు వసువులు.
మూ॥ నా సత్యశ్చైవ దస్రశ్చ స్మృతౌ ద్వావశ్వినావుభౌ విశ్వేదేవా న్ప్రవక్ష్యామి నామతస్తాన్ని బోధత
క్రతుర్ధక్షో వసుః సత్యః కాలకామౌ ధృతిః కురుః శంకు మాత్రో వామనశ్చ విశ్వేదేవా దశ స్మృతాః
వర్తమానా ఇమేదేవా భవిష్యానంతరే శృణు యమశ్చ తుషితాశ్చైవ వసవో వశవర్తినః
సత్యాశ్చ భూత రజసః సాధ్యాశ్చ తదనంతరాః షట్సు మన్వంతరే ష్వేవం దేవా ద్వాదశ ద్వాదశ
పారావతాస్తధా చాన్యే లేహ్యా సంస్తుషితైః సహ సాధ్యా న్దేవాన్ప్ర వక్ష్యామి నామతస్త్రాన్ని బోధమే
మనోఽనుమంతా ప్రాణశ్చ నరో నారాయణస్తథా
వృత్తి లంబో మనుశ్చైవ సమోధర్మశ్చ వీర్యవాన్ విత్తస్వామి ప్రభుశ్చైవ సాధ్యాద్వాదశ కీర్తితాః
ఏతే యజ్ఞభుజో దేవాః సర్వలోకేషు పూజితాః అదిత్యామేవ తేధీర! కశ్యపస్యాత్మజాః స్మృతాః
విశ్వేచ వసవః సాధ్యా విజ్ఞేయా ధర్మసూనవః ఏవం ధర్మ సుతః సోమస్తృతీయో వసురిష్యతే
ధర్మోపి బ్రహ్మణః పుత్రః పురాణే నిశ్చయం గతః అథచేన్ద్రా న్వస్తూంశ్చైవ నామభిశ్చ నిబోధమే
తా॥ నాసత్యుడు, దస్రుడు నను నిరువురును అశ్వినులను పేర్కొనబడుదురు. ఇక విశ్వేదేవులనామములను దెలుపుచున్నాను. తెలిసికొనుము. క్రతువు, దక్షుడు, వసువు, సత్యుడు, కాలుడు, కాముడు ధృతి, కురు, శంకుమాత్రుడు, వామనుడు - ఈ పదుగురు విశ్వేదేవులు. వీరిప్పుడున్నారు. రాబోవు వారిని గూర్చి వినుము. యముడు, తుషితులు, వస్తువులు, వశవర్తులు. సత్యులు, భూతరజస్సులు, సాధ్యులు తరువాతి వారు. ఇట్లాబు మన్వంతరములందు పన్నెండుగురు దేవతల చొప్పున నుందురు. పార్వతులను నితరులు తుషితులతో నుండిరి. సాధ్యులను దేవతలను పేళ్లతో(జెప్పుచున్నాను. తెలిసికొనుము మనుడు, అనుమంతుడు, ప్రాణుడు, నరుడు, నారాయణుడు. వృత్తిలంబుడు, మనువు, సముడు, ధర్ముడు, వీర్యవంతుడు, విత్తేశుడు, ప్రభువు అని సాధ్యులు పన్నెండుగురు చెప్పబడియున్నారు. వీరు యజ్ఞ భుక్కులు. సర్వలోకములయందు పూజింపబడు దేవతలు. వీరదితి యందు కశ్యపునకు బుట్టిన సంతానము. విశ్వేదేవులు, వస్తువులు, సాధ్యులు ధర్ముని పుత్రులు. ఇట్లు ధర్మసుతుడైన సోముడు మూడవ వసువు. ధర్ముడు బ్రహ్మ పుత్రుడని పురాణ నిశ్చయము. ఇఁక ఇంద్రులను, వస్తువులను వారి వారి నామములతోఁజెప్పుచున్నాను. వినుము.
మూ॥ స్వాయంభునో మనుః పూర్వం తతః స్వారోచిషః స్మృతః ఉత్తమస్తామనశ్చైవ రైవత శ్చాక్షుషస్తథా
ఇత్యేతే షడతి క్రాంతాః సప్తమః సాంప్రతోమనుః వైవస్వతేతి విజ్ఞేయో భవిష్యాః సప్తచాపరే
ఏషా మాదోర్క సావర్ణిర్ర్బహ్మ సావర్ణిరేవచ తస్మాచ్చ భవసావర్ణిద్ధర్మ సావర్ణిరత్యుత
పంచమో దక్ష సావర్ణిః సావర్ణిః పంచకీర్తితాః రౌచ్యౌభౌవ్యశ్చ ద్వావన్యావిత్యేతే మనవఃస్మృతాః
ఇంద్రస్తు విష్ణు భుగ్జ్ఞేయో విద్యుతిస్తదనంతరమ్ విభుః ప్రభుశ్చైవ శిఖీ తథైవచ మనోజవః
ఓజస్వీ సాంప్రత స్త్విం ద్రో బలిర్భావ్యస్తతః పరమ్ అద్భుత స్త్రీదివశ్చైవ దశమస్త్వింద్ర ఉచ్యతే
సు సాత్త్వికశ్చ కీర్తిశ్చ శతథామాదివస్పతిః ఇతి భూతా భవిష్యాశ్చ ఇంద్రాజ్ఞే యాశ్చతుర్దశ
కశ్వపోఽ త్రివశిష్ఠశ్చ భరద్వాజశ్చ గౌతమః విశ్వామిత్రో జమదగ్నిః సప్తైతే ఋషయః స్మృతాః
అతః పరం ప్రవక్ష్యామి మరుతోఽగ్ని పరిగ్రహాన్ ప్రవహోథావహశ్చైవ ఉద్వహః సంవహస్తథా
వివహో నివహశ్చైవ పరివాహస్తథైవచ అంతరిక్ష చరా హ్యేతే పృథఙ్మార్గ విసారిణః
సూర్యోఽగ్నిశ్చ శుచిర్నామ్నా వైద్యుతః పావకః స్మృతః నిర్మంధః పవమానోఽ గ్నిస్త్ర యః ప్రోక్తో ఇమేగ్నయః
తా॥ మొదటి మనువు స్వాయంభువు. అటు పిమ్మట స్వారోచిషుడు. అటు పైన ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు అనువారలు క్రమముగ మనువులైయుండిరి. ఈ ఆణుగురు మనువులిప్పటి వఱకు గడిచిపోగా నేడవ వాడగు వైవస్వతుడు వర్తమానుడని తెలియవలెను. వీరుకాక భవిష్యత్కాలమున రాబోవు వారేడుగురు కలరు. వీరిలో మొదటివాడు అర్కసావర్ణి. అటు పిమ్మట కమముగ బహు సావరి, భవసావరి, ధరుసావరి. ఐదవవాడు దకసావరి, ఇటుసావరులేదుగురు. వీరి యనంతరము రౌచ్యుడు, భౌవ్యుడు (భౌత్యుడు)నను వారితో కలిసి మొత్తము పదునలుగురు మనువులు గలరు. విష్ణుభుక్కు మొదటి యింద్రుడు. విద్యుతి, విభువు, ప్రభువు, శిఖి, మనోజవుడు. ఓజస్వి (వర్తమాన కాలమున నున్న ఇంద్రుడు) బలి, భావ్యుడు, అద్బుతుడు (ఇతడు పదియవ యింద్రుడు). సుసొత్త్వికుడు (శాంతుడు), కీర్తి, శతధాముడు (ఋతుధాముడు), దీవస్పతి, యనువారు భవిష్యత్కాలమున రాబోవు యింద్రులని తెలియవలెను. కశ్యపుడు, అత్రి వసిష్ఠుడు, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని యనువారు సప్తర్షులు. తదుపరి యగ్ని పరిగ్రహులగు మరుత్తులను గూర్చి చెప్పెదను. ప్రవహుడు, ఆవహుడు, ఉద్వహుడు, సంవహుడు. వివహుడు, నీవహుడు, పరీవహుడు, అను మరుత్తులేడుగురు వేజ్వేలు మార్గములందంతరిక్షమున చరించుచుందురు. శుచి, వైద్యుతుడు, పావకుడు అను వారు సూర్యాగ్నులు. అరణి మంధనమున నుత్పన్నమగు నగ్ని పేరు పవనుడు. ఈ అగ్ని మూడు విధములని చెప్పబడినది.
మూ॥ అగ్నీనాం పుత్ర పౌత్రాస్తు చత్వారింశత్తదైవచ మరుతామపి సర్వేషాం విజ్ఞే యాః సప్తసప్తకాః
ఋతుః సంవత్సరోఽహ్యగ్నిరృతవస్తస్య జజ్ఞిరే ఋతు పుత్రాశ్చవైపంచ ఇతి సర్గః సనాతనః
సంవత్సరస్తు ప్రథమో ద్వితీయః పరివత్సరః ఇద్వత్సర స్తృతీయస్తు చతుర్ధస్త్వనువత్సరః
పంచమో వత్సర స్తేషా మిత్యేవం పంచతేస్మృతాః తేషు సంవత్సరోహ్యగ్నిః సూర్యస్తు పరివత్సరః
సోమఇద్వత్సర స్తేషాం వాయుశ్చైవానువత్సరః రుద్రస్తు వత్సరోజ్ఞేయః పంచేతాయుగదేవతాః
ఆర్తవాః పితరో జ్ఞేయా యేజాతాః క్రతు సూనవః పితామహాస్తు విజ్ఞేయాః పంచాబ్దా బ్రహ్మణః సుతాః
సౌమ్యా బర్హిషదశ్చైవ అగ్నిష్వాత్తాశ్చ యే త్రయః ఏతేవై పితర స్తేషాం యేజీవతిపితృకా నరా
ఆదిత్యశ్చైవ సోమశ్చ లోహితాంగో బుధస్తథా బృహస్పతిశ్చ శుక్రశ్చ తథా హేలి సుతశ్చయః
ఉపరాగః శిఖీచోభౌ నవైతే ను గ్రహాః స్మృతాః త్రైలోక్యస్యత్వమే నిత్యం భావాభావ నివేదకాః
ఆదిత్యశ్చైవ సోమశ్చ ద్వావేతౌ మండలగ్రహో రాహుశ్ఛాయా గ్రహస్తేషాం శేషాస్తారా గ్రహాఃస్మృతాః
తా॥ అగ్నులలో పుత్ర పౌత్రులు కలిసి మొత్తము నలుబదుగురు. మరుత్తులలో నొక్కక్కగణమున నేడుగురు చొప్పున నలుబది తొమ్మండుగురుగాఁదేలియవలెను. వ్యోమమునకు కాలము, సంవత్సరము, అగ్ని, ఋతువులు పుట్టెను. ఋతు పుత్రులైదుగురని సనాతనుల నిశ్చయము. వారిలో సంవత్సరుడు మొదటి వాడు. పరివత్సరుడు రెండవవాడు. ఇద్వత్సరుడు మూడవవాడు. అనువత్సరుడు నాలుగవవాడు. ఐదవవాడు వత్సరుడు. ఇట్లు వీరైదుగురని చెప్పబడినది. వీరిలో సంవత్సరుడగ్ని. పరివత్సరుడు సూర్యుడు. ఇద్వత్సరుడు సోముడు. అనువత్సరుడు ఛాయువు. వత్సరుడు రుద్రుడని యెఱుంగవలెను. వీరైదుగురును యుగ దేవతలు. ఋతుపుత్రులు పితరులనియు క్రతుపుత్రులు పితామహులనియు తెలియవలెను. వత్సర పంచకము బ్రహ్మపుత్రులు. సౌమ్యులు, బర్హిషదులు, అగ్నిష్వాత్తులనుమువ్వురు తండ్రులు జీవించియున్న నరులకు పితరులు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు. రాహువు, కేతువు అనువారు గ్రహములు. వీరు ముల్లోకములకును భావాభావములను (ఔగాములను) దెలుపుచుందురు. సూర్యుడు చంద్రుడు మండల గ్రహములు. రాహువు ఛాయాగ్రహము. మిగిలినవి తారాగ్రహములు.
మూ!! నక్షత్రాధిపతి:సోమో గ్రహరాజో దివాకరః పఠ్యతేచాగ్ని రాదిత్య ఉదకశ్చంద్రమాః స్మృతః
ఆదిత్యఃపఠ్యతే బ్రహ్మ విష్ణు స్తేషాంతు చంద్రమా మహేశ్వరస్తు విజ్ఞేయస్తృతీయస్తారక గ్రహః
కశ్యపస్య సుతః సూర్యః సోమోధర్మసుతః స్మృతః దేవాసుర గురూద్వౌతు నామతస్తా మహాగ్రహౌ
ప్రజాపతి సుతావేతావుభౌ శుక్ర బృహస్పతీ బుధః సోమాత్మజః శ్రీమాఞ్చనీ రవిసుతః స్మృతః
సింహికాయాః సుతో రాహు కేతుస్తు బ్రహ్మణః సుతః సర్వేషాంచ గ్రహాణాంహి అధస్తాచ్చరతే రవిః
తతో దూరం స్మృతం తావద్విధోర్నక్షత్రమండలమ్ నక్షత్రేభ్యః కుజబుధౌ శ్వేతాహ్వస్తదనంతరమ్
తస్మాన్మాహేశ్వరశ్చోర్థ్వం ధిషణస్తదనంతరమ్ కృష్ణశ్చోర్థ్యం తతస్తస్మాదధ చిత్ర శిఖండిజః
ఏషామేవ క్రమఃప్రోక్తశ్చాసక్తం త్రిదివం ధ్రువే ఆదిత్య నిలయోరాహుః కదాచిత్సోమ మార్గగః
సూర్యమండల సంస్థస్తు శిఖీ సర్పతి సర్వదా నవయోజన సాహస్రో విస్తారో భార్గవస్యతు
ద్విగుణః సూర్యవిస్తారాద్విస్తారః శనినఃస్మృతః త్రిగుణం మండలం జ్ఞేయం నాక్షత్రం విస్తరాద్విధో:
తా॥ నక్షత్రాధిపతి చంద్రుడు. గ్రహాధిపతి సూర్యుడు. సూర్యడగ్నియని, చంద్రుడు జలమనియు చెప్పబడును. అట్లే గ్రహములలో సూర్యుడు బ్రహ్మయనియు, చంద్రుడు విష్ణువనియు తక్కిన తారాగ్రహము(లు) రుద్రుడనియు తెలియవలెను. సూర్యుడు కశ్యపుని కుమారుడు, చంద్రుడు ధర్ముని కుమారుడు. గురుశుక్రులు మహాగ్రహములు. వీరిరువురు ప్రజాపతి కుమారులు. బుధుడు సోముని కొడుకు. శని సూర్యతనయుడు. రాహువు సింహికాపుత్రుడు. కేతువు బ్రహ్మకుమారుడు. గ్రహములన్నింటికి క్రిందు భాగమున సూర్యుడు చరించుచుండును. చంద్రుని నక్షత్రమండలమచటినుండి దూరముగనున్నది. నక్షత్రముల కన్న కుజబుధులు, వారికన్నను శుక్రుడు దూరముననున్నారు. అంతకంటెను తారాగ్రహమండలము పైన గలదు. దాని పైన బృహస్పతి, అంతకు పై భాగమున శని, అంతకు పైన రావుహుగలరు. వీరిక్రమమీట్లు చెప్పబడినది. స్వర్గము ధ్రవాసక్తమై యుండును. ఆదిత్యునాశ్రయించి రాహువుండును. ఎల్లప్పుడు చరించుచుండును. శుక్రుని వైశాల్యము తొమ్మిదివేల యోజనములు. సూర్యుని విస్తీర్ణము కంటే శనైశ్చరుని విస్తీర్ణము రెండింతలుండును. చంద్రుని విస్తీర్ణము కంటే నక్షత్రమండల విస్తీర్ణము మూడింతలుండునని తెలియవలెను.
మూ॥ నక్షత్రమండలాత్తత్ర పాదహీనో బృహస్పతిః బృహస్పతేః పాదహీనః శుక్రాంగారక ఏవహి
విస్తారో మండలానాంతు పాదహీనస్తయోర్విధుః బుధతుల్యాని ఋక్షాణి సర్వఋక్షాణి యానితు
యోజనాన్యర్ధమాత్రాణి తేభ్యోహ్రస్వం న విద్యతే రాహుః సూర్య ప్రమాణశ్చ కదాచిత్సోమ సన్నిభః
నక్షత్ర గ్రహమానస్తు కేతుస్త్వనియతః స్మృతః అవిజ్ఞాన గతిశ్చైవ చంచలత్వాన్నరాధిప!
తథాలక్షిత రూపస్తు బహురూపధరోహిసః భూర్లోకః పృథివీప్రోక్తా అంతరిక్షం భువః స్మృతమ్
స్వర్లో కస్త్రిదివం జ్ఞేయం శేషాదూర్థ్వం యథాక్రమమ్ భూపతిస్తు సదాత్వగ్ని స్తేనా సౌ భూపతిః స్మృతః
వాయుర్నభస్పతిస్తేన తథాసూర్యో దివస్పతిః గంథర్వాప్సరసశ్చైవ గుహ్యకాః సిద్ధ రాక్షసా:
భూర్లోక వాసినః సర్వే అంతరిక్ష చరాన్ శృణు మరుతః సప్తమస్కంధే రుద్రాస్తత్రైవచాశ్వినౌ
ఆదిత్యావసవః సర్వేతథైవ చ గవాం గణాః చతుర్థేతు మహర్లోకే వసంతే కల్పవాసినః
ప్రజానం పతిభిః సర్వైః సహితాః కురునందన! జన లోకే పంచమేచ వసంతే భూమిదాః సదా
తా॥ నక్షత్రమండలము కన్న నొక పాదభాగము తక్కువ విస్తీర్ణము గలవాడు బృహస్పతి. బృహస్పతి కంటే పాదభాగము తక్కువ విస్తీర్ణము గలవారు శుక్రుడు, అంగారకుడు. శుక్రోంగారక మండలముకన్న చతుర్ధభాగము తక్కువ వైశాల్యము గలవాడు బుధుడు. ఆకాశమున గల నక్షత్రములన్నియు బుధునితో సమానమైన విస్తీర్ణముగలవి. వానిలో యోజనార్ద ప్రమాణముకన్న కుఱుచగ ఏ నక్షత్రమైన నుండదు. రాహువు సూర్యుని ప్రమాణముననుండును. ఎప్పుడేని చంద్రుని ప్రమాణమునను ఉండును. ఇవి నక్షత్ర గ్రహ ప్రమాణములు. కేతువు మాత్రము విస్తీర్ణ ప్రమాణ విషయమున నెల్లప్పుడొకే విధమున నుండడు. అతని గమనము కూడ అవిజ్ఞాతమై, అనియతమైయుండును. అతడు చంచలుడగుటయే దీనికి కారణము. అట్లు చూడబడుచున్న రూపము గలవాడయియును అతడనేక రూములను ధరించుచుండును. పృథివియే భూలోకమనిచెప్పబడును. అంతరిక్షము భువర్లోకము. స్వర్గము స్వర్లోకము. ఊర్థ్వలోకము లొకదాని కన్ననొకటి పైభాగమున గలవు. భూలోకమున కెల్లప్పుడు అగ్నియే రాజు, అందుచే నతడు భూపతి యని పిలువబడును. వాయువు నభస్పతి. సూర్యుడు దివస్పతి, గంధర్వులు, అప్సరలు, గుహ్యకులు, సిద్ధులు, రాక్షసులు 'భూలోక వాసులు. ఇక భువర్లోక వాసులనుగూర్చి వినుము. మరుద్గణము, రుద్రగణము, అశ్వినులు. ఏడవ స్కంధమున నుందురు. ఆదిత్యులు, వస్తువులు, దేవగణములు స్వర్లోకమున నుందురు. నాల్గవదియగు మహర్లోకమున ప్రజాపతులతోబాటుగ కల్పవాసులుందురు. ఐదవదియగు జనోలోకమున భూమికి నిగ్రహాదులిచ్చు జననామక ఋషులుందురు.
మూll ఋతః సనత్కుమారాద్యాః, వైరాజశ్చ తథాశ్రయాః సత్యస్తు సప్తమేలోకే హ్యపునర్మార్గ గామినామ్
బ్రహ్మలోకః సమాఖ్యాతో హ్యప్రతీఘాత లక్షణః ఇతిహాస విదో యత్ర క్రీడంతే కురునందన!
శృణ్వంతీచ పురాణాని యేసదా భీమనందన! మహీతలాత్సహస్రాణాం శతాదూర్థ్వం దివాకరః
శతయోజన కోట్యస్తు భూమేరూర్ద్వం ధ్రువః స్థితః తతో వింశతి లక్షస్తు త్రైలోక్యోత్సేథ ఉచ్యతే
ద్విగుణైస్తు సహస్రైస్తు యోజనానాం శతేషుచ లోకాంతర మథోచైవం ధ్రువాదూర్థ్వం విధీయతే
దేవదానవ గంధర్వా యక్షరాక్షస పన్నగాః భూతా విద్యాధరాశ్చైవ అష్టాతే దేవ యోనయః
యస్మిన్వ్యోమ్నిత్వమే లోకాః సప్తవై సంప్రతిష్ఠితాః మరుతః పితరో హ్యేతే తస్మిన్నేవాగ్నయో గ్రహాః
యాస్త్వప్యేతాః సమాఖ్యాతా మయాష్టౌదేవయోనయః మూర్తాశ్చామూర్తయశ్చైవ సర్వాస్తావ్యోమ్ని సంస్థితాః
ఏవం విధమిదం వ్యోమ సర్వవ్యోమమయం స్మృతమ్ సర్వదేవ మయంచైవ సర్వగ్రహమయం తథా
తస్మాద్యోహ్యర్చయే ద్వ్యోమ తేన సర్వేఽర్చితాః సురాః తస్మాత్సర్వ ప్రయత్నేన శుభార్థీ వ్యోమ చర్చయేత్
యస్త్వర్చతే సదా వ్యోమ భక్త్యా శ్రద్ధా సమన్వితః వృషధ్వజ సదో రాజన్సగచ్ఛేన్నాత్ర సంశయః
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్పే వ్యోమ మాహాత్మ్యే భువనకోశ వర్ణనం నామ పంచవింశత్యుత్తర శతతమోఽధ్యాయః
తా॥ తపోలోకమున ఋతు సనత్కుమారాదులు, బ్రహ్మసంబంధులుందురు. పునరావృత్తి లేని వారు నివసించునది సత్యలోము. దానిని బ్రహ్మలోకమందురు. అది ఆప్రతిఘాత లక్షణము గలది (విఘ్నములు, బాధలు లేనిది) అచట పురాణేతిహాస - విదులు క్రీడింతురు. పురాణములు వినువారును నివసింతురు. భూతలమునుండి కొన్ని వందల వేల లక్ష యోజనముల పై " " దూరమున సూర్యదేవుడున్నాడు. భూమి, నుండి నూఱు కోట్ల యోజనముల పై దూరమున ధ్రువుడుండును. అచటి నుండి యిరువది లక్షల యోజనముల పర్యంతము మూడులోకముల (భూర్భువస్స్వర్లోకముల) ప్రదేశముగా పేర్కొనబడును. ధ్రువలోకమున కూర్థ్వముగా రెండు లక్షల యోజనముల క్రిందుగా లోకాంతరము గలదు. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు, భూతగణములు, విద్యాధరుడు అను ఎనిమిది జాతులవారు దేవయోనులు. వ్యోమము నందీయేడు లోకములు ప్రతిష్ఠితములై యున్నవి. ఈ వ్యోమమునందే మరుత్తులు, పితరులు అగ్నులు, గ్రహములు. నేనింతకు పూర్వము పేర్కొనిన దేవజాతులెనిమిది, కొందఱు రూపముగలవారు, మణికొందఱమూర్తులు-వీరందఱు నీ వ్యోమమునందే నివసింతురు. వ్యోమము అననిట్టిది. సర్వము దీనియందే యిమీడియున్నది. సర్వదేవతలు, సర్వగ్రహములు నిందే యున్నవి. అందువలన వ్యోమము నర్చించువాడు, సర్వదేవతల నర్చించువాడగును. కావున శుభము న పేక్షించువాడు సర్వప్రయత్నములచే వ్యోమమును పూజింపవలెను. భక్తి శ్రద్ధా సమన్వితుడై వ్యోమము నర్చించువాడు సూర్యలోకమునకుఁబోవును. రాజా! ఇందు సందేహము లేదు.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు వ్యోమ మాహాత్మ్యమున భువన కోశ వర్ణనమను నూట యిరువదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 125 of the Bhavishya Mahā Purana is as follows:
The structure of the cosmos — the brahmāṇḍa, the cosmic egg — and the seven worlds (lokas) arranged within it are described in their relation to Sūrya. Sūrya is placed at the centre of the cosmic egg, at the level of the antarikṣa (mid-region), from which his light radiates both upward toward the higher lokas and downward toward the earth. The dimensions of the seven worlds, the distances between them, and the nature of the beings who inhabit each are given. This cosmic geography is not presented as abstract speculation but as practical knowledge for the Sūrya devotee: understanding where Sūrya sits within the cosmic structure helps the devotee understand why the relationship with Sūrya is the most cosmically central of all devotional relationships available to a being at the human level of existence.