భవిష్య మహా పురాణము
124. బ్రహ్మర్షి సంవాదమున ప్రవర వర్ణనము
మూ॥ బ్రహ్మోవాచ :
వక్ష్యామ్యహంతే పునరేవ దిండే! సూర్య స్వసర్వ ప్రవర ప్రధానమ్
వ్యోమ్నః పరం తిష్ఠతి యస్తు మగ్నః స ముచ్యతే రుద్ర ఇహాపిదిండీ
ఛిత్వా పురా బ్రహ్మశిరః కిలాసౌ ప్రగృహ్య తత్తస్య శిరః కపాలమ్
తతోహ్యసాశ్రమ ముత్తమం శివో బహూదకై:పుష్పఫలైః సమృద్ధమ్
నగ్నోయదా దారునవే మునీనాం దృష్ట్యాచతం బ్యేక్ష్యచరం సురేశమ్
యోషిత్సుతాః సంక్షుభితాస్తుసర్వే జగ్ముర్హరం తం మునయః సుతుష్టాః
సహన్య మానో మునిముఖ్య సంఘైర్గృహీతలోష్టై రృషిదండకాష్ఠైః
విహాయ దిండి: సతు తాన్సుర ర్షింస్తతో రవేర్లోక మథాజగామ
ఆగచ్చమానం ప్రమథాస్తమూచు ర్దేవేశ! నిత్యం భ్రమసే కిమర్థమ్?
సప్రాహతాన్పాప విమోచనార్థమటామీ తీర్థాని సురాలయాంశ్చ
తేభూయ ఊచుః ప్రమథాస్తమేవ మత్రైవ తిష్ఠస్వ రవేః పురస్తాత్
శుద్ధింతవైష ప్రకరిష్యతీతి శుద్ధస్తతో యాస్యపి రుద్రలోకమ్
ఇత్యేవముక్తః ప్రమథైస్తు రుద్ర స్తత్రైవ తస్థౌ రవి తోషణాయ
నగ్నోజటీముష్టికపాలపాణీ రూపేణ చైవా ప్రతిమస్త్రిలోకే
ఉక్తఃస తుష్టేన తతః సవిత్రా ప్రీతోస్మి దేవాగమనాత్తవాహమ్
మద్దర్శనాదేవ భవాన్విశుద్దో దిండీ తినామ్నా భవితాసిలోకే
అష్టాదశైతే ప్రమథాస్తు భానోశ్చతుర్ధశాన్యేతు రమే రథస్థాః
హే దేవతే ద్వౌచ ఋషి ప్రథానౌ గంధర్వ సర్పావపి తావదేవ
యక్షౌచ సిద్ధౌచ నిశాచరో చాదిత్యాత్మ జావప్సరసాం ప్రథానౌ
వసంతితే హ్యస్త ముషశ్చ సూర్యే తేషామ శీతిశ్చతురోత్తరాసా
ఇత్యాదిదేవ ప్రవరాస్తు సర్వే ధాత్వర్థ శబ్ధైశ్చ భవంతి సిద్ధాః
తా॥ బ్రహ్మ దేవుడిట్లనెను. "దిండీ! ఇక సూర్యుని పరివారమునందలి ముఖ్యులను గూర్చి నీకు వివిరించెదను. ఆకాశపు దవ్వున మునిగియుండు నా సూర్య దేవుడీ లోకమునకు గూడ తన ప్రకాశమును ప్రసరింపఁజేయును. పూర్వ కాలమున నొకప్పుడు శివుడు బ్రహ్మ శిరస్సును ఛేదించి శిరః కపాలమును చేత ధరించి తిరుగుచు ఫల పుష్పజల భరితమైన ఒక శ్రేష్ఠమగు ఋష్యా శ్రమమునకు దిగంబరుడై యేతెంచెను. మునులు నివసించెడి యాదారువనమునకు భిక్షాచర్యగా వచ్చిన ఆ పరమేశ్వరునిఁ జూచి స్త్రీలు, పిల్లలు కలఁతఁజేందిరి. కొందఱు మునులాతని యొద్దకు సంతోషముగఁబోయిరి. కాని మఱికొందఱు “ముని ముఖ్యు'లాతని మట్టి పెడ్తలతోను, కట్టలతోను, తమ దండములతోను కొట్టుచు బాధించిరి. ఇఁక నచట నుండ నొల్లక ఋషులను వదలి శివుడు సూర్య లోకమునకు వచ్చెను. వచ్చుచున్న శివునిఁజూచి యచటి ప్రమథులాతనితో “దేవేశ్వరా! తాము నిత్యమిటులెందుకు తిరుగుచుంటిర'ని ప్రశ్నించిరి. దాని కీశ్వరుడు “పాపములనుండి ముక్తి నొందుటకై వివిధ తీర్ధ స్థానములు, దేవతల లోకములు తిరుగుచుందు”నని ప్రత్యుత్తరమిచ్చెను. ఆ ప్రమథులు మఱల నతనితో నిట్లనిరి. “దేవా! మీ రిచటనే సూర్య దేవుని ముందుండుడు. అతడే మిమ్ము పవిత్రీకరింపగలడు. శుద్ధియైన పిదప మీ రుద్ర లోకమునకు మీరు వెడలిపోవచ్చును". ప్రమథులచే నీట్లు చెప్పబడిన శివుడు సూర్య ప్రీత్యర్థముగనటనే యుండిపోయెను. దిగంబరుడై, జటలు గలవాడై, బ్రహ్మ కపాలమును చేత ధరించి యతడు ముల్లోకములలోను నిరుపమాన రూపముగలవాడై యచట సూర్య సన్నిధిలో నుండెను. సూర్య భగవానుడు, "దేవా! మీ రాకతో మేము మిక్కిలి సంతసించితిని. మా దర్శనముతో మీరు పరిశుద్దులపై దీండియను పేర లోకమున ప్రసిద్ధి నొందగలరు”. అని హర్షముతోఁబలికేను. పదునెనమండుగురు ప్రమథులు భాను దేవుని చెంతనుందురు. వీరుగాక పదునల్వురాతని రథము పై నుందురు. ఇరువురు దేవతా ప్రథానులు, ఇరువురు ఋషి ముఖ్యులు, ఇద్దలు గంధర్వులు, ఇద్దకు పన్నగులు, ఇంకను. యక్షులు, సిద్ధులు, రాక్షసులు, సూర్యతనయులు, అప్సరలలో ప్రధానులు ఇద్దజేసి చొప్పున సూర్యునియందుదయాస్తమయములందును ఉందురు. వారి సంఖ్య మొత్తమెనుబది నాలుగు. ఇట్లు సూర్యదేవుని పరివార దేవతలందఱును ధాత్వర్థములచే నేర్పడు నన్వర్థనామములతో పేర్కొనబడుచుందురు.
మూ॥ ఋషయ ఊచుః
‘విస్తరాద్బ్రూహిమే బ్రహ్మన్ప్రవరానాతు శబ్దజాన్ యతశ్చ కౌతుకం బ్రహ్మన్నస్మాకమిహ జాయతే'
బ్రహ్మోవాచ :
భూయస్తువః ప్రవక్ష్యామి దండనాయక పింగలౌ రాజ్ఞ స్రౌషాదయాశ్చాన్యే దిద్దేవా దిండినా సహ
మయా సహ సమాగమ్య పురాదేవైర్విచారితమ్ ఏష కారుణికః సూర్యో యుధ్యతే దానవైః సహ
తేతు లబ్ధ వరాభూత్వా అమాత్యాద్యా హ్యభీష్టశః ఆదిత్యం మన్య మానాస్తే తపంతం హంతుముద్యతాః
తస్మాత్తేషాం విఘాతార్థం ప్రవరాశ్చ భవామహే అస్మాభిః ప్రతిరుద్ధాస్తే నద్రక్ష్యంతి దివాకరమ్
సంమంత్ర్యైవం తతఃస్కందో వామ పార్శ్వేరవేః స్థితః దండ నాయక సంజ్ఞస్తు సర్వలోకస్య స ప్రభుః
ఉక్తశ్చస తదార్కేణత్వం ప్రజాదండనాయకః దండనీతికరో యస్మాత్తస్మాత్త్వం దండ నాయకః
లిఖతే యః ప్రజానాంచ సుకృతం యచ్చదుష్కృతమ్ అగ్నిర్దక్షిణ పార్శ్వేతు పింగలత్వాత్స పింగలః
ఆశ్వినౌ చాపి సూర్యస్య పార్శ్వయో రుభయోః స్థితౌ అశ్వరూపాత్సముత్పన్నౌ తేన తావశ్వినౌ సురౌ
తా॥ ఋషులిట్లనిరి. “బ్రహ్మదేవా! ధాత్వర్థముల ననుసరించి నిష్పన్నములగు శబ్దములతో పేర్కొనబడు దేవతాశ్రేష్టులను గూర్చి మాకు వినఁ గుతూహలముగ నున్నందున సవిస్తరముగఁజెప్పుడు”. బ్రహ్మదేవుడిట్లు చెప్పఁదొడంగెను. “మీకు దండనాయక పింగలుల గూర్చియు, దిండితో గూడ దిగేవతలగు రాజ్ఞ సౌషాదులగు నితర ప్రవరుల గూర్చియు చెప్పెదను. పూర్వ కాలమున నాతో సహా దేవతలందఱు నొక్కచో సమావిష్ణులై యిట్లాలోచించిరి. 'ఈ దయాళుడగు సూర్య భగవానుడు దానవులతో యుద్ధము చేయుచున్నాడు. వారేమొ వారి మంత్రులతో గూడ కోరిన వరములను పొంది యుండి, యాదిత్యుని తపించుచున్న వానిగ నేజింగి, యతనిని చంపుటకుద్యమించిరి. అందువలన వారిని వధించుటకు మనము సైన్య ముఖ్యులమయ్యెదము. మనతో నెదుర్కొని వారు సూర్య భగవానుని వైపు చూడనోపరు". ఈ విధముగ నాలోచించి - తదనుసారము కార్తికేయుడు సూర్యునకేడమ భాగమునుందుండి దానవులతో యుద్ధ వ్యవహారమును జూచుకొనుచుండెను. ఇఁక దండనాయకుడను పేరుగలవాడు సర్వలోక ప్రభువు”. నీవు ప్రజలను దండింపగల నాయకుడవు. దండనీతిని నేటపువాడవు. కావుననే నీవు దండనాయకుడవు. ప్రజల పాప పుణ్యములను కూడ నీవు వ్రాయుచుందువు” అని యిట్లు సూర్య భగవానునిచే నతడు చెప్పబడెను కూడ. అగ్ని దేవుడు సూర్యునకు కుడి భాగమున నుండెను. అతడు గోరోజనము వంటి వర్ణముగల వాడగుటచే పింగళుడనబడెను. అశ్వినీ కుమారులిరువురును సూర్య భగవానునకిరుపక్కల నుండిరి. అశ్వరూపమున జన్మించిన వారగుటచే వారు అశ్వినులను పేరఁ బరగిరి.
మూ॥ ద్వారపాలౌ స్మృతౌ తస్య రాజ్ఞ స్రౌషౌ మహాబలో కార్తికేయః స్మృతో రాజ్ఞః స్రౌషశ్చాపి హరః స్మృతః
రాజృ దీప్తౌ స్మృతో ధాతుః నకారస్తస్య ప్రత్యయః సుర సేనాపతిత్వేన సయస్మాద్ధీప్యతే సదా తస్మాత్సకార్తికేయస్తు నామ్నా రాజ్య ఇతి స్మృతః
సృగతౌచస్మృతో ధాతుర్యస్య సప్రత్యయః స్మృతః గచ్ఛతీతి రహస్తస్మాత్పర్యాయా త్ర్సౌష ఉచ్యతే
ప్రథమం యద్భవేద్ద్వారం ధర్మార్దాభ్యాం సమాశ్రితమ్ తత్రైతౌ సంస్థితా దేవో లోకపూజ్యౌ ద్విజోత్తమాః!
ద్వితీయాయాంతు కక్షాయామ ప్రధృష్ణా వ్యవస్థితౌ పక్షి ప్రేతాధిపౌ నామ్నా స్మృతౌ కల్మాష పక్షిణౌ
వర్ణస్య శబలత్వాచ్చ యమః కల్మష ఉచ్యతే పక్షావ స్యేతి యః పక్షి గరుడః పరికీర్తితః
స్థితో దక్షిణతస్తస్య దండహస్త సమన్వితః ఉత్తరేణ స్థితోఽర్కస్య కుబేరశ్చ వినాయకః
కుబేరో ధనదో జ్ఞేయో హస్తిరూపో వినాయకః కుత్సయా కుప్యతా శప్తం కుశరీర మజాయత కుబేరః కుశరీరత్వాత్స నామ్నా ధనదః స్మృతః
నాయకః సర్వసత్త్వానాం తేననాయక ఉచ్యతే వివిధం నయతే యస్మాత్సతు తస్మాద్వినాయకః
రైవతశ్చైవ దిండిశ్చ తౌ రవేః పూర్వతః స్థితౌ తతో దిండిః స్మృతో రుద్రో దేవతస్తనయో రవేః
ప్లుతం గచ్ఛత్యసౌ యస్మాత్సర్వలోక నమస్కృతః రేవృప్లవగతౌ ధాతూ రేవతస్తేన స స్మృతః
డీజ్గతా వస్యవై ధాతోర్దండి శబ్ధో నిపాత్యతే డయతేఽసౌ సదా దిండీ తేన దిండీ ప్రకీర్తితః
తా॥ మహా బలశాలురగు రాజ్ఞ, సౌషులు సూర్యలోక ద్వారపాలకులు. కార్తికేయుని యవతారము 'రాజు' డనియు, శివావతారము సౌషుడనియు చెప్పబడును. రాజృదీప్తా అని ధాతువు. దానికి నకారము ప్రత్యయము. కార్తికేయుడు సుర సైన్యాధిపతిగ నెప్పుడును దీపించుచుండుటచే నాతడు రాజ్ఞుడని పేర్కొనబడెను. గత్యర్ధమగు 'సృధాతువునకు సకార ప్రత్యయము చేరగా సొషుడని పేర్కొనబడెను పర్యాయంబునరహస్యముగ తిరుగుచుండును కావున నాతడు సౌషుడని పేర్కొనబడెను. బ్రాహ్మణోత్తములారా! ధర్మార్థములచే నాశ్రయింపబడిన మొదటి ద్వారమువద్ద లోక పూజ్యులగు నీ యిరువురు దేవతలుందురు. రెండవ ద్వారమునందు మిక్కిలి దిట్టతనముగల కల్మాషుడు (ప్రేతాధిపుడు), గరుడుడు అను వీరిరువురునుందురు. చిత్ర వర్ణత్వము వలన యముడు. కల్మాషుడనబడును. టెక్కలున్నందువలన నాపక్షి రాజు గరుడుడనబడును. సూర్య దేవునకు దక్షిణ దిక్కున దండధరుడై కుబేరుడుండును. ఉత్తరదిక్కున వినాయకుడుండును. కుబేరుడన ధనదుడు. ఏనుగువలె నుండువాడు వినాయకుడు. కోపించుచున్నవానిచే జుగుప్సతో శపింపబడినందున దుష్ట శరీరము సంప్రాప్తమయ్యెను. ధనదుడు కుశరీరత్వము వలన కుబేరుడని చెప్పబడును. సర్వ భూతములకు నాయకుడగుటచే నాయకుడనబడును. వివిధములను పొందును గావున నాతడు వినాయకుడనబడును. రైవతుడు, దిండి యను వారిరువురు సూర్య దేవునకు తూర్పు దిక్కుననుందురు. దిండియనరుద్రుడు, సూర్యుని కుమారుడు రేవతుడు. సర్వ లోకనమస్కృతుడైన రేవతుడు సమమైన వేగమును నెగురుచు బోవువాడు గావును 'రేవృ' ప్లవగతో అను ధాతువుచే నీతని నామము రేవతుడని చెప్పబడును. 'డీజేగతో అనుధాతువుచే దిండి శబ్దము నిపాతముగ నేర్పడినది. ఎల్లప్పుడును నాకాశమున నెగురుచుఁబోవు చుండును గావున నీతడు 'దిండి' యని కీర్తింపబడును.
మూ॥ ఇత్యేతే ప్రవరాః ప్రోక్తాధాత్వర్థానైగమైః శుభైః ఏ షాం సంక్షేపతో భూయః సంఖ్యాంవో నిగధామివై
అశ్వినౌతౌ తతోజ్ఞేయా దండనాయక పింగలో తౌ సూర్య ద్వార పౌజ్ఞేయౌ రాజ్ఞ సౌమీ తతః స్మృ తౌ
రేవతశ్చైవ దిండీశ్చ ఇత్యేతే ప్రవరామయా అష్టాదశ సమాఖ్యాతాః సంక్షే పా త్సంఖ్యయామయా
ఇత్యేభిర్నామభి స్త్వ న్యే దానవానాం జిఘాంసయా పరివార్య స్థితాః సూర్యం నానా ప్రహరణాయుధాః
సరూపాశ్చాన్య రూపాశ్చ విరూపాః కామరూపిణిః పరివార్య స్థితాః సూర్యం గరుడశ్చ మహాబలః
ధాతుర్దివితివై ప్రోక్తో క్రీడాయాం సతు ఉచ్యతే క్రీడంతే దీవివై యస్మాత్తస్మాత్తే దేవతాః స్మృతాః
ఋచో యజూంషి సామాని యాన్యుక్తానీహవై మయా నానా రూపైః స్థితాన్యేవ రవేస్తాని సమంతతః
సుమంతురువాచ :
ఇత్యేవ ముక్తవాన్భ్రహ్మా ఋషీణాం పృచ్ఛతాం పురా తేశ్రుత్వారాధ్య దేవేశం సంసిద్ధాదివి సంస్థితాః!
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మే పర్వణి సప్తమీ కల్నే
బ్రహ్మర్షి సంవాదే ప్రవర వర్ణనం నామ చతుర్వింశత్యుత్తర శతతమోఽధ్యాయః
తా॥ మంగళకరులైన వేద వ్యాఖ్యాతలచే నిట్టి ధాత్వర్థములతోడి నామములుగల ప్రవరులు చెప్పఁబడిరి. వీరి సంఖ్యను గూర్చి మఱలనొకతూరి సంక్షేపముగఁజెప్పెదను. అశ్వినీ కుమారులిరువురు, దండనాయక పింగలులు వీరిరువురు సూర్య లోక ద్వారపాలకులనీ తెలియవలెను- రాజ్ఞ సౌషులిరువురు. రేవతుడు, దిండి యనునీయిద్దఱు ఇట్టి నామములతో వ్యవహరింప బడునట్టి యితరులు పదునెనమండుగురు సూర్య మండలమున రాక్షస సంహారార్థమై నియమింపబడిన ప్రవరులను గూర్చి సంక్షేపముగ, సంఖ్యాయుక్తముగ జెప్పితిని. వీరందఱు వివిధములైన మారణాయుధములను ధరించి సూర్యదేవుని చుట్టుముట్టి యుందురు. కొందఱు సరూపులు, కొందఱస్వరూపులు, మరి కొందఱు వీరూపులు, ఇంకను కొందఱు కామరూపులై, మహా బలుడైన గరుడునితో సహా వీరందఱును సూర్య దేవుననుసరించి యుందురు. 'దివ్' క్రీడాయాం అను ధాతువుచే నాకాశము దివమనబడును. దీవి యందు క్రీడింతురు గాన వారిని దేవతలందరు. నాచే నితః పూర్వము పేర్కొనబడిన ఋక్కులు, యజుస్సులు, సామములు వివిధ రూపములలో సూర్య భగవానుని కన్నివైపుల నావరించియుండును. ఇదియంతయు వివరించి సుమంతుముని యిట్లనెను. “పూర్వము ఋషులడుగుటచే, బ్రహ్మదేవుడీ వివరములను వారికి దెలిపియుండెను. దీనినంతయును విని వారు సూర్యదేవు నారాధించి సిద్ధులై యాకాశమున నుండిరి.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు బ్రహర్షి సంవాదమున ప్రవర వర్ణనమను నూట యిరువది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 124 of the Bhavishya Mahā Purana is as follows:
The conversation between Brahma and the assembled ṛṣis turns to the subject of gotra — the lineage-names of the Vedic brāhmaṇa clans — and pravara — the specific series of ancestral ṛṣi-names recited in the course of yajña to identify the sacrificer's lineage. These gotra and pravara systems are shown here to have a specific connection to Sūrya worship lineages: the families that have maintained Sūrya-upāsanā across generations have preserved certain pravara sequences that connect them directly to the ancient Sūrya-devotee ṛṣis. The chapter functions both as a genealogical record of Vedic lineages and as a theological statement: the deepest identity of a brāhmaṇa lineage is not its biological ancestry but its devotional lineage, the chain of Sūrya-worshippers stretching back to the primordial beginning.