119. సప్తమీ కల్పమున దీపదాన మహాత్మ్య వర్ణనము

మూ॥ బ్రహ్మోవాచ :

అంధే తమసి దుష్పారే నరకే పతితాన్కిల! సంక్రోశమానాన్సంక్షుభ్దానువాచ యమకింకరః

విలా పైరల మత్రేతి కింవో విలపితే ఫలమ్? యత్ప్రమాదాదిభిః పూర్వమాత్మాయం సము పేక్షితః

 పూర్వమాలోచితం నైతత్కథమంతే భవిష్యతి ఇదానీం యాతనాం భుజ్ధ్వం కిం విలాపం కరిష్యథ

 దేహో దినాని స్వల్పాని విషయాశ్చాతి దుర్బలాః ఏతత్కోన విజానాతి యేన యూయం ప్రమాదినః

 జంతుర్జన్మ సహస్రేభ్య ఏకస్మిన్మానుషోయది సతత్రాప్యతి మూఢాత్మా కింభోగానభిధావతి

పుత్రాదార గృహక్షేత్ర హితాయ సతతోద్యతాః నజానంతి తతో మూఢాః స్వల్పమప్యాత్మనో హితమ్

వంచితోఽహం మయాలబ్దమిద మస్మాదుపాగతమ్ నవేత్తి మోహితః కశ్చిత్ప్రక్రాంత నరకో నరః

 నవేత్తి సూర్యచంద్రాదీన్కాలమాత్మాన మేవచ సాక్షిభూతానశేషస్య శుభ స్యేహాశుభస్యచ

జన్మాన్యన్యానీ జాయంతే పుత్రదారాది దేహినామ్ యదర్థం యత్కృతం కర్మతస్య జన్మశతానితు

అహో మోహస్య మాహాత్మ్యం మమత్వం నరేకేష్వపి క్రందతే మాతరం తాతం పీడ్యమానోఽపి యత్స్వయమ్

ఏవమాకృష్ణ చిత్తానాం విషయః స్యాదు తర్పణైః నృణాం నజాయతే బుద్ధిః పరమారవిలోకినీ

తథాచ విషయా సంగే కరోత్యవిరతం మనః కోహిభారో రవేర్నామ్ని జిహ్యాయాః పరికీర్తనే

వర్తితైలేఽల్పమూల్యేచ యద్వర్తిర్లభ్యతే సుధా అతోవై కతరో లాభః కాతశ్చింతాభవేత్తదా

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “ఒకానొక సమయమున దుస్తరమైన యంధతామిస్రమనేడు నరకమున బడి క్షోభించుచు, ఆక్రోశించుచున్న జీవులతో యమకింకరుడిట్లనెనట. మూఢజీవులారా! ఇఁకనిట విలపించుట చాలును. విలపించినచో మీ కిపుడేమి లాభము కలుగును? పూర్వము భ్రమప్రమాదాదులకు లోనై యీ ఆత్మ పదార్దము ను పేక్షించితిరి గదా. మొదట కొంచెమేనియు నాలోచింపక, అంతయునైన పిదప నిపుడు విచారించినచో సత్ఫలమెట్లు కలుగును? ఇప్పుడు యాతనననుభవింపుడు. ఏడ్చుచున్నారేమిటి?. దేహము కొద్దికాలమే. అది అనుభవించు విషయములు మిక్కిలి దుర్బలములు. ఇది యెవనికి తెలియదు. దాని వలననే మీరును ప్రమాదమున బడిపోయితిరి. ప్రాణి, వేయిజన్మలలో నేప్పుడో మానవ జన్మమెత్తును. కాని యా మానవ జన్మలోకూడ మిక్కిలి మూఢాత్ముడై విషయభోగముల వెంట పరుగుతీయనేమి. దొరాపుత్ర గృహక్షేత్రాదుల హితము కొఱకు మాత్రమే నీరంతరము ప్రయత్నించుచు మూఢులు తమ ఆత్మ హితమును గూర్చి యిసుమంతయు తెలిసికొనరుగదా! మోహితుడైన మానవుడు నరకమునఁబడియును, “నేను వంచింపబడితిని. నేను చేసికొనిన కర్మవలననే యీ నరకము నాకు ప్రాప్తించినది. ఈ కారణమున నిధి దాపురించినది” అనీ తెలసికొనజాలకున్నాడు. అశేషములగు కర్మలకు సాక్షీభూతులగు సూర్యచంద్రాదులనుగానీ, కాలమునుగాని, తనను తానుగాని, శుభాశుభములుగాని తెలియజాలకున్నాడు. భార్యాపుత్రాది సంసారలంపటత్వముగల శరీరధారు లకు వేజ్వేలు జన్మలు కలుగుచున్నవి. దేని కొఱకే కర్మచేయబడునో ఆఒక కర్మననుసరించి పరంపరగా నూఱు జన్మలు సంప్రాప్తమగు చున్నవి అహో! మోహ మాహాత్మ్యము నేమని చెప్పగలము! నరకముల యందును మమకారము నశింపదు గదా! జన్మతో సంబంధపడియున్న జీవుడు తల్లిని తండ్రిని పీడించుచుకూడ, తాను స్వయముగను ఏడ్చుచుండును. విషయభోగముల రుచులతోడి తత్కాల తర్పణములచే నిట్లాకర్షింపబడు చిత్తములుగల మనుజులకు పరమార్థములను దర్శింపగల బుద్ధి కలుగదు. మనస్సు నిరంతరము విషయాసక్తమై యుండును. సూర్యభగవానుని నామకీర్తనము చేయుటలో నాలుకకేమి భారమగును?. ఏ దీప సమర్పణమున వర్తించుటచే నమృతలాభము కలుగునో అట్టి వత్తి, నూనె మొదలగునవి అల్పమూల్యములే గదా! ఇంతకన్న లాభమేదీ కలదు. అట్లు వర్తించియుండిన చింతయేల కలుగును?.

మూ॥ యేనాయతేషు హస్తేషు స్వాతంత్ర్యేనతి దీపికః మహాఫలో భానుగృహే నదత్తో నరకాపహః

నరోవిలపతే కించిదిదానీం దృశ్యతేఫలమ్ అస్వాతంత్ర్యేవిలపతాం స్వాతంత్ర్యేసతి మానినామ్

అవశ్యం పాతినః ప్రాణా భోక్తా జీవోఽప్యహర్నిశమ్ దత్తంచలభతే భోక్తుం కామయన్విషయానపి

 ఏతత్థ్సానం దుష్కృతైర్వా యుక్తంచాద్య మయేక్షితమ్ ఇదానీం కిం విలాసేన సహధ్వం యదుపాగతమ్

యద్యేతదనభీష్టం వో యద్దుఃఖంసముపస్థితమ్ తదద్భుతమతిః పాపే న కర్తవ్యా కదాచన

కృతేఽపి పాపకే కర్మణ్యజ్ఞానా దఘనాశనమ్ కర్తవ్యమనవచ్ఛిన్నం పూజనం సవితుః సదా”

బ్రహ్మోవాచ :

నారకాస్తద్వచః శ్రుత్వాతమూచురతి దుఃఖితాఃక్షుత్క్షా మకంఠాస్తృట్తాప విసంపుటిత తాలుకాః

“భోభోః సాధోకృతం కర్మయదస్మాభిస్త దుచ్యతామ్ నరక స్థైర్విపాకోఽయం భుజ్యతే యత్సుదారుణ:”

కింకర ఉవాచ :

యుష్మాభిర్యౌవనోన్మాదా న్ముదితై రవివేకిభిః ఘృత లోభేన మార్తాండ గృహాద్దీపః పురాహృతః

తేనాస్మిన్నరకే ఘోరే క్షుత్తృష్ణాపరిపీడితాః భవంతః పతితా స్త్రీవ్రే శీతవాత విదారితాః

బ్రహ్మోవాచ :

ఏతత్తే దీప దానస్య ప్రదీప హరణస్యచ పుణ్యం పాపంచ కథితం భాస్కరాయతనేఽ చ్యుత

సర్వత్రైవహి దీపస్య ప్రదానం కృష్ణ శస్యతే విశేషేణ జగద్ధాతుర్భాస్కరస్య నివేశనే యేంధామూకా బధిరా నిర్వివేకా హీనాస్తైస్తైర్దాన సాధనైర్వృష్ణి వీర!

 తై స్తైద్దీపాః సాధులోకప్రదత్తా దేవాగారాదన్యతః కృష్ణ నీతాః

శ్రీ భవిష్యే మహాపురాణే బ్రహ్మేపర్వణి సప్తమీ కల్పే

 దీపదాన మాహాత్మ్య వర్ణనం నామైకోన వింశోత్తర శత తమోఽధ్యాయః

 తా॥ నిడు పైన చేతులకు స్వాతంత్ర్యముండగా సూర్యదేవాలయమున దీపము వెల్గించుట మహాఫలప్రదము, అట్లు దీపదానము చేయని మనుష్యుడు నరకమున కీడ్వబడి. విలపించును. నిస్సహాయులైన జీవుల రోదనమిప్పుడు దుష్కర్మ ఫలస్వరూపముగా కాననగుచునే యున్నది. కావున నేదైన చేయుటకు స్వాతంత్ర్యముండినయప్పుడే-అనగా స్థూల శరీరము ప్రాణములు కలిసి యుండిన దశలోనే మానవంతులకు సత్కర్మాచరణ మవశ్యకర్తవ్యము. ప్రాణములు పోయినను జీవుడు కర్మఫలభోక్తగా నిలిచియుండును. విషయభోగములందాసక్తి యెంత యున్నను తానిచ్చినదే తనకు లభించును. పాపములు చేసియుండుటచే నేడు నాచే గొనిరాబడిన యీ నరకస్థానమే మీకుఁదగియున్నది. ఇప్పుడేడ్చి ప్రయోజనమేమి? దాపురించిన యాతనను సహింపుడు. మీ కిష్టమును లేకున్నను ఈ దుఃఖము ప్రాప్తించినది. కాబట్టి పాపమునందెప్పుడు మీ మనస్సును ప్రవర్తింపనీయదగదుసుమా! ఒకవేళ అజ్ఞానవశమున పాప కర్మయందు మనస్సును పోనిచ్చినను నిరంతరముగ సూర్యారాధన చేసిన యెడల, సంచితమైన పాపము నశించును. బ్రహ్మదేవుడిట్లనెను. “యమ కింకరుని మాటలు విని మిక్కిలి దుఃఖముతో, ఆకలిచే కృశించిన కంఠము గలవారై, దాహార్తిచే పగిలిన దవడలు గలవారై నరకవాసులతనితో నిట్లనిరి. అయ్యా! ఘోరమైన యీ నరకయాతన ననుభవించుటకు మేమేమి దుష్కర్మచేసియుంటిమో దయచేసి చెప్పుడు”. వారి మాటలు విని యమకింకరుడిట్లనెను. “పూర్వము మీరు యౌవనోన్మాదము వలన నవివేకులై, కేళీ విలాసములలో(దొప్పదోగి ఘృతలోభముచేత సూర్యమందిరము నుండి దీపమును దొంగిలించితిరి. ఆకారణమున మీరీ తీవ్రమగు చల్లనిగాలిచే చీల్చబడుచు, ఆకలి దప్పులచే నలమటించుచు ఘోరమగు నీ నరకమునఁబడితిరి”. బ్రహ్మదేవుడిట్లనెను. విష్ణుదేవా! భాస్కరాలయమున దీపదానముచేఁగలుగు పుణ్యమును, నీకు వివరించితిని కృష్ణా! దీప సమర్పణ మెచటఁజేసినను ప్రశస్తమే. ముఖ్యముగ జగత్కర్తయగు సూర్యభగవానుని మందిరముననైనచో శ్రేష్ఠతరము. సాధుపురుషులాయా దానసాధనములచే నిచ్చిన ఆయాదీపములు, గ్రుడ్డి, మూగ, చెవిటి మొదలగునంగవికలుర చేతను, వివేక హీనులచేతను, నింద్యులచేతను, దేవాలయమునుండి యపహరింపబడి యన్యస్థలములకుఁగొంపోబడును.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు దీపదాన మాహాత్మ్య వర్ణనమను నూటపదునైదవ అధ్యాయము సమాప్తము.