117. సప్తమీ కల్పమున ఉపలేపన స్నాపన మహాత్మ్య వర్ణనము

మూ, అరుణ ఉవాచ :

'కిమర్థం భోజకస్తుభ్యం ప్రియోదేవేశ! కథ్యతామ్ నాన్యే విప్రాదయో వర్ణా దేవతాయతనేషువై

కశ్చాయం భోజకో దేవ! కస్య పుత్రః కిమాత్మకః వర్ణతశ్చాస్యమే బ్రూహి కర్మచాస్య సమంతతః

ఆదిత్య ఉవాచ :

'సాధు పృష్టోస్మి భద్రంతే వైనతేయ! మహామతే! శృణు ష్యైక మనాః సర్వం గదతో మమ ఖేచర!

విప్రాదయస్తు యేత్వన్యే వర్ణాః కశ్యపనందన! తే పూజయంతి మాం నిత్యం భక్తి శ్రద్ధా సమన్వితాః

దేవాలయేషు యే విప్రాః ప్రీత్యామాం పూజయంతిహి అన్యాశ్చ దేవతా వృత్త్యాతే స్యుర్దేవలకాః ఖగ!  ఏతస్మా త్కారణాన్మహ్యం భోజకోదయితః సదా

 వర్ణతో బ్రాహ్మణశ్చాయం స్వానుష్ఠాన పరోయది అనుష్టాన విహీనో హి నరకం యాత్యసంశయమ్

నత్యాజ్యం భోజకై స్తస్మాత్వుకం కర్మ కదాచన మయాసౌ నిర్మితః పూర్వం తేజసా స్వేన వైఖగ!

పూజార్థమాత్మనో నూనం కర్మచాస్య ప్రకీర్తితమ్ ప్రియవ్రత సుతో రాజా శాకద్వీపే మహామతిః

తేనమే కారితం దివ్యం విమాన ప్రతిమం గృహమ్ తస్మిన్ద్వీపే తదాత్మీయే దివ్యం శిలామయం మహత్

 స మదర్చాం కారయిత్వా కాంచనీం లక్షణాన్వితామ్ తస్యాః ప్రతిష్టాపనాయ చింతయామాస సువ్రతః  

తా॥ అరుణుడిట్లనెను. “దేవేశా! దేవాలయములందు మిమ్ము పూజించుటకు బ్రాహ్మణాది వర్ణములుండగా వారు కాక మీకు భోజకుడే ప్రీతి పాత్రుడగుటకు కారణమేద్దీయో వచింపుడు. ఇంతకును ఈ భోజకుడననెవరు? ఎవని కుమారుడు? వాని ప్రత్యేకత యేమి? వాని వర్ణమేమి? వాని కర్మయెట్టిది? అంతయును నాకు వివరించి చెప్పుడు” . అని యరుణుడడుగ సూర్యభగవానుడిట్లు చెప్పఁదొడంగెను. “వైనతేయా! లెస్సగా ప్రశ్నించితివి. నీకు శుభమగుగాక! ఏకాగ్ర మనస్కుడవై వినుము చెప్పుచున్నాను. కశ్యపనందనా ! బ్రాహ్మణాది ఇతరవర్ణములవారును భక్తిశ్రద్ధలతో నన్ను పూజింపుచుందురనుట నిశ్చయమే . ఇక దేవాలయములలోను బ్రాహ్మణులే కాక వృత్తి జీవనులైన యితరులును నన్ను పూజింపుచున్నారు. ఈకారణమువలన నాకు భోజకుడే యెల్లప్పుడును ప్రియమైనవాడు-5. ఇతడు వర్ణముచే బ్రాహ్మణుడు. స్వీయానుష్టానపరుడైన యెడల బ్రాహ్మణుడు, అనుష్టాన పరుడు కానిచో నిస్సంశయముగ నరకమును పొందును. కాబట్టి భోజకులెప్పుడును తమ కర్మను వదలిపెట్టరాదు. నాతేజస్సుచే నీ భోజకుని నేనే సృష్టించితిని. ఇతని కర్మ నా పూజయే. శాకద్వీపమున ప్రియవ్రతుని సుతుడును బుద్ధిమంతుడును నగు నొకరాజుండేను. అతడు నాకొఱకొక విమానమును బోలిన మందిరమును నిర్మింపజేసెను, తన ద్వీపమగు శాక ద్వీపమున నతనిచే నిర్మింపజేయబడిన ఆ మందిరము శిలామయమైనది. దివ్యమైనది. అతడు నా బంగారపు ప్రతిమనొకదానిని చేయించి, దానిని నా మందిరమున ప్రతిష్టించుటకు నిశ్చయించెను.

 మూ॥ కృతమాయతనం శ్రేష్ఠం తేనేయం ప్రతిమాకృతా కోవై ప్రతిష్టాపయితా దేవ మర్కం శుభాలయే

ఏవం సంచింతయిత్వాతు జగామ శరణం మను భక్తిం తస్య చ సంచింత్య ఖగాహంపార్ధి వస్యతు

గతోఽహందర్శనం తస్య ఉక్తశ్చాపి మయాఖగ!"కిం చింతయసి రాజేంద్ర ! కుతశ్చింతా సమాగతా

 బ్రూహి యత్తేహృది ప్రౌఢం చింతాకారణ మాగతమ్ సంపాదయి ష్యే తత్సర్వం విమనా భవమానృప!

అత్యర్ధం ధుష్కరమపి కరిష్యేనాత్ర సంశయః” ఇత్యుక్తః స మహారాజా ఇదం వచన మబ్రవీత్

 “ద్వీపేఽ స్మిద్దేవ దేవస్య కృత మాయతనం తవ మయా భక్త్యా జగన్నాధ! తధేయం ప్రతిమాకృతా

 ప్రతిష్టాం కారయేద్యస్తు తవదేవాలయే ఖగ! యత్రసంతి త్రయోవర్ణా ద్వీపేస్మిన్ క్షత్రియాదయః

తే మయోక్తా న కుర్వంతి ప్రతిష్ఠాం తవకృత్స్నశః న చాప్యర్చాం జగన్నాథ! బ్రాహ్మణశ్చాత్రవిద్యతే

తేనేయమాగతా చింతా హృదిశల్యం తయార్పితమ్” తతో మయోక్తో రాజాసౌ వైనతేయ! వచః శుభమ్

“ఏవ మేతన్నసందేహో యథాత్థత్వం నరాధిప! క్షత్రియాది త్రయోవర్ణ ద్వీపేఽస్మినాత్ర సంశయః

తా॥ శ్రేష్ఠమైన ఆలయము నిర్మాణమయ్యెను. అందమైన సూర్యప్రతిమ కూడా సిద్దమయ్యెను, కాని ఆదేవాలయమున సువర్ణ ప్రతిమారూపమున నున్న సూర్యభగవానుని ప్రతిష్ఠింపగలవారెవరు?. ఇట్లు చింతించి యా భూపాలుడు పాలోవకునికి నన్నేశరణాందెను. ఆ పార్ధివునికి నా పైగల భక్తిని గమనించి. యతనీముందు సాక్షాత్కరించితిని, “రాజేంద్రా! ఏల చింతించుచుంటివి? ఈ చింత ఎటునుండి వచ్చినది?” అని సానునయముగ ప్రశ్నించితిని. “ఈగాఢమగు చింతకు కారణమేద్దియో నాకు చెప్పుము. అది యేదైనను నేను సమకూర్చి యిచ్చెదను, విచారింపవలదు. మిక్కిలి దుష్కరమైన దైనను సాధింతును. సందియము వలదు”. అని నేనతనికి ధైర్య వాక్యములు చెప్పగనే అతడిట్లనెను”. " దేవదేవా! ఈ ద్వీపమునందు మీకొక ఆలయమును నిర్మించితిని. జగన్నాధా! మా యందలి భక్తితో నీ ప్రతిమను కూడా సిద్దపఱచితిని. ఈ ద్వీపమునందు క్షత్రియాది వర్ణత్రయము వారు మాత్రమే యున్నారు. ఇక మి విగ్రహమును దేవాలయమున ప్రతిష్ఠింపగలవారెవరనునదే నాసమస్య. మి విగ్రహమును ప్రతిష్ఠింపగల బ్రాహ్మణుడిచటలేడు. తక్కిన వర్ణములవారేవరును విధివిధానముగ ప్రతిష్ఠింపజాలరుగదా!. ఆకారణముననే నేను చింతించుచున్నాను. ఆచింత హృదయశల్యమై నన్ను బాధించుచున్నది.” ఇట్లు వాపోవుచున్న రాజుతో నేనిట్లు శుభ వాక్యములు బలికితిని. “రాజా! నీవు చెప్పినట్టిది సందేహమేకాదు, ఈ ద్వీపమునందు క్షత్రియాది వర్ణత్రయము వారుండుటలోగూడ సంశయములేదు.

 మూII తేచనార్హంతి మేపూజాం న ప్రతిష్టాం కదాచనతస్మాత్తే శ్రేయసే రాజ న్ప్రతిష్టా మాత్మనస్తథా

 సృజామి ప్రధమం వర్ణం భగసంజ్ఞ మనౌపమమ్ ఇత్యుక్త్యా తమహం వీర! రాజానం ఖగసత్తమ!

జగామ పరమాం చింతాం తస్య కార్యస్య సిద్ధయే అథమే చింతయానస్య స్వశరీరాద్వినిఃసృతాః

శశి కుందేందు సంకాశాః సంఖ్య యాష్టౌ మహాబలాః పఠంతి చతురో వేదానాంగోపనిషదః ఖగ

 కాషాయ వాససః సర్వే కరండాంబుజ ధారిణః లలాట ఫలకాద్వైతు ద్వౌచాన్యౌ వక్షసస్తధా

చరణాభ్యాం తథా ద్వౌతు పాదాభ్యాం ద్వౌతధాఖగ! అథతేచ మహాత్మానః సర్వేప్రణత కంథరాః

పితరం మన్యమానా మామిదం వచన మబ్రువన్ " తాత! తాత! మహాదేవ! లోకనాధ ! జగత్పతే ।

 కిమర్ధం భవతా సృష్టావయం దేవస్యదేహత: బ్రూహి సర్వం కరిష్యామ ఆదేశం భవతోఽఖిలమ్

పితాస్మాకం భవాన్దేవో వయం పుత్రా నసంశయః ఇత్యుక్త వంతస్తే సర్వే మయోక్తా దేవసంభవాః

ప్రియ వ్రత సుతో యోయమస్య వాక్యం కరిష్యధ" సచాప్యుక్తోమయారాజా శాకద్వీపాధిపః ఖగ!

 య ఏతే మత్సుతా రాజన్నరా బ్రాహ్మణ సత్తమాః కారయంతు ప్రతిష్ఠాం మే సర్వైరేభిర్మహీపతే!

 కారయిత్వా ప్రతిష్టాంతు మమార్చాయాం నరాధిప! పశ్చాదాయతనం సర్వమేషామర్పయ పూజనే  

తా॥ వారు ( బ్రాహ్మణేతర వర్ణములవారు) నాపూజకు గాని విగ్రహ ప్రతిష్ఠకుగాని ఎప్పుడును అర్హులుకారు. కాబట్టి రాజా! నీ శ్రేయస్సుకొఱకు, నా ప్రతిమను దేవాలయమున ప్రతిష్ఠింపజేయుటకై. నేను భగ సంజ్ఞకమైన సాటిలేని బ్రాహ్మణ వర్ణమును సృష్టించెదను,” అని నేనా రాజునకు చెప్పి. అతని కార్య సిద్ధికి సంబంధించిన చింతను పోఁద్రోలితిని, నే నాలోచించుచుండగనే నా శరీరము నుండి తెల్లని మొల్ల పువ్వులవంటి, చంద్రుని వంటి మేనిఛాయతో ప్రకాశించుచున్న యెనమండ్రు మహాబలశాలురు, చతుర్వేదములు, వేదాంగముల, ఉపపనిషత్తులు పఠించుచున్నవారవతరించిరి. అందఱును కాషాయవస్త్రములను ధరించి యుండిరి, చేతులలో సంపుటములు (బరిణలు) తామరపువ్వులు ధరించియుండిరి, ఫాల పట్టికనుండి యిరువురు, వక్షఃస్థలమునుండి - యిరువురు, కాళ్ల నుండి యిరువురు, పాదములనుండి యిరువురును ఉద్భవించిరి, ఈ మహాత్ములందును తలలువంచి. నన్ను తండ్రినిగా గౌరవించుచు నిట్లనిరి, “ తండ్రీ! మహాదేవా! లోకనాధా! జగత్పతీ! మమ్ము తమ దేహమునుండి యెందులకై సృజించితిరి? మీ ఉద్దేశమేమియో సెలవిండు మీ యాజ్ఞను పాటించుటకు సిద్దముగ నున్నారము. మీరు మాతండ్రి. మేము మీ పుత్రులము సంశయములేదు,” అని యిట్లు వినయముగ బలికిన వారితో నేనిట్లంటీని. “ఇతడు ప్రియవ్రతుని కుమారుడు, ఈ శాకద్వీపమునకు రాజు, అతని వాక్యమును మన్నింపుడు, అతడు కోరినది చేయుడు,” రాజుతో కూడా నేనిట్లు చెప్పితిని. “రాజా! వారు నా కుమారులు, నీకు పూజ్యులు, బ్రాహ్మణ సత్తములు, వీరందఱిచే నా విగ్రహ ప్రతిష్ఠ చేయబడును గాక. ప్రతిష్ఠ చేయించిన పిదప పూజకొఱకై దేవాలయమునుకూడా వీరికే యప్పగింపుము.

 మూ॥ ఏతే మత్పూజనే యోగ్యాః ప్రతిష్టాసు చ సర్వశః సమాప్య న ప్రహర్తవ్యం భోజకేభ్యః కదాచన  

 సర్వమాయతనార్థం తు గృహక్షేత్రాదికం చ యత్ ధన ధాన్యాదికం రాజన్యన్మమాయతనే భవేత్

 తత్సర్వం భోజకేభ్యస్తు దాతవ్యం నాత్ర సంశయః ధనధాన్య సువర్ణాది గృహక్షేత్రాదికం చ యత్ యన్మదీయం భవేత్కించిద్రామేవా నగరే క్వచిత్

 తస్య సర్వస్య రాజేంద్ర! మదీయస్య సమంతతః అధిపా భోజకాః సర్వేనాన్యే విప్రాదయో నృప!

 యథాధి కారీ పుత్రస్తు పితృద్రవ్యస్య వైభవేత్ తథామదీయ విత్తస్య భోజకాః స్యురసంశయః

ఇత్యుక్తీనమయా రాజ్ఞా తధాసర్వం ప్రవర్తితమ్ కారయిత్వా ప్రతిష్ఠంతు దత్వాసర్వస్వమేవహి భోజకేభ్యః ఖగశ్రేష్ఠ! తతహర్ష మవాప్నుయాత్

ఏవమేతే మయా సృష్టా భోజూ గరుడాగ్రజ! అహమాత్మా తతో హ్యేషాం సర్వే సుమనసస్తథా

మత్పుత్రేణ సమా జ్ఞేయాస్తథా మమహితాః సదా తస్మాత్తేభ్యః ప్రదాతవ్యం నహర్తవ్యం కదాచన

తా॥ వీరు నా పూజయందును, ప్రతిష్టల యుందును అన్ని విధముల యోగ్యులు, ఏది యైనను భోజకుల కిచ్చి తిరిగి తీసికొనకూడదు. నా మందిరము నిర్వహణ కొఱకేర్పరుపబడిన ఇండ్లు, పొలములు, ధనధాన్యాదులు, మందిరమున గల సామగ్రి. యంతయును సంశయింపక భోజకులకే యిచ్చివేయవలెను, ధనము, ధాన్యము, సువర్ణాద్యాభరణములు, ఇండ్లు, స్థలములు మొదలగునవి, ఇంకను నాకుసంబంధించిన యాస్తిపాస్తులు పల్లెలలోనివి గాని, పట్టణముల లోనివి గాని. అంతటను గల మత్సంబంధమగు వస్తువులకెల్లను . భోజకులే యధికారులు, ఇతరులెవరునుకారు. పితృ ద్రవ్యమునకు పుత్రుడే అధికారియైనట్లు నా యాస్తికంతటికిని భోజకులే అధికారులు, సందేహములేదు. రాజుకు నేనిట్లు చెప్పగా నాతడంతయునేను చెప్పినట్లే నడచుకొనెను, ప్రతిష్ఠ చేయించి నాసంబంధమగున దేల్లను భోజకులకు సమర్పించి మిక్కిలి సంతోషించెను. కాబట్టి గరుడాగ్రజా! ఈ భోజకులిట్లు నాచే సృష్టింపబడిరి. నేను వారి యాత్మను, దేవతలందఱు వారిని. నాపుత్రులతో సమానులుగా తెలియవలెను, అంతేకాక వారు నాకు హితులు, కావున ఏదైనను వారికిచ్చుటయే దప్ప వారినుండి యేదియును తీసికొనకూడదు.

 మూ॥ భోజకస్వ హరేద్యస్తు లోబాద్ద్వే షాత్తథాపివా సయాతి నరకం ఘోరం తామిస్రం శాశ్వతీ: సమాః

తస్మాద్ధామాదికం ద్రవ్యం యత్కించిన్మమ విద్యతే తత్సర్వం భోజక స్వంహి పితృపర్యాగతం మమ

 భోజకశ్చ భవేద్యాదృక్తతే వచ్మి ఖగేశ్వర ! మమాజ్ఞాం పాల యేద్యస్తు స్వానుష్ఠాన పరః సదా

వేదాధిగమనం పూర్వం దారసంగ్రహణం తధా అభ్యంగ ధారణం నిత్యం తథా త్రిషవణం స్మృతమ్

పంచకృత్వః సదాపూజ్యోహ్యహం రాత్రౌ దినేతధా దేవ బ్రాహ్మణ వేదానాం నిందా కార్యా న వై క్వచిత్

నాన్యదేవ ప్రతిష్టాతు కార్యావై భోజకేనతు మమాచన కర్తవ్యా తేన ఏకాకినా క్వచిత్

సర్వమేవ నివేద్యాన్నం నాశ్నీయా ధోజకః సదా న భుంజీత గృహం గత్వా శూద్రస్య గరుడాగ్రజ!

 శూద్రోచ్ఛిష్టం ప్రయత్నేన సదాత్యాజ్యం హి భోజకైః యేశంతి భోజకా నిత్యం శూద్రాన్నం శూద్ర వేశ్మని

 తేవైపూజాఫలం చాత్రకధం ప్రాప్స్యంతి ఖేచర! గత్వాగృహంతుశూద్రస్యనభోక్తవ్యంకదాచన

శూద్రాన్నం తచ్చత్యాజ్యం తధైవచ గృహాగీతంచ ఆధ్మాతవ్యోంబుజో నిత్యం భోజకేనాగ్రతో మమ

తా॥ లోభము వలనగాని, ద్వేషము వలనగాని భోజకుని వస్తువును హరించువాడు తామిస్రమను ఘోర నరకమున బడి యచట పెక్కు సంవత్సరములు దుఃఖము ననుభవించును. కాబట్టి నాకు సంబంధించిన గృహ క్షేత్ర ద్రవ్యాదులన్నియును భోజకునకు తండ్రినుండి సంక్రమించిన సొంతమైన ఆస్తులు. భోజకుడన నెట్టివాడో చెప్పెదను వినుము. నా యాజ్ఞను పాలించుచు స్వానుష్ఠాన పరుడై. మొదట వేదాధ్యయనము చేసి, అటు పిమ్మట వివాహమాడి, నిత్యమును అభ్యంగముతో మూడు సవనములు ( ఉదయము మధ్యాహ్నము, సాయంకాలము లందు స్నానమాచరించుట) చేయవలేను. అన్నికాలము లందు, రాత్రింబవలు ఐదు పర్యాయములు నన్ను పూజింపవలెను, దేవతలను బ్రాహ్మణులను, వేదముల నెప్పుడును నిందింపరాదు. భోజకుడైనవాడితరదేవతల ప్రతిష్టలు చేయకూడదు, నా ప్రతిష్టనైనను ఏకాకి యైన భోజకుడు చేయకూడదు. దేవతకు నివేదింపదగిన, యహారపదార్ధమును భుజింపరాదు. శూద్రునియింట భుజింపరాదు. భోజకులు శూద్రోచ్చిష్టమును తప్పక త్యజింపవలెను. శూద్రగృహమున శూద్రాన్నమును భుజంచువారు. పూజా ఫలమునేట్లు పొందగలరు? అందుచే శూద్రగృహము నకుఁబోయిఅచటనెప్పుడును భోజనము చేయకూడదు. అట్లే ఇంటికి కొనిరాబడిన శూద్రాన్నమును కూడా భుజింపకూడదు, నాయెదుట నిత్యము శంఖమును పూరింపవలెను. 

మూ॥ సకృత్ప్రవాదితే శంఖేమమప్రీతిర్హిజాయతే షణ్మాసానాత్ర సందేహః పురాణ శ్రవణం తధా  

తస్మాచ్ఛంఖః సదా వాద్యో భోజకేన ప్రయత్నతః తస్యేయం పరమా వృత్తిర్నైవేద్యం యన్నదీయకమ్

నాభోజ్యం చ భుంజతే యస్మాత్రే నైతే భోజకామతాః మగం ధ్యాయంతి తే యస్మాత్తైనతే మగథాః స్మృతా:

 భోజయంతి మాం నిత్యం తేనతే భోజకాః స్మృతాః అభ్యంగంచ ప్రయత్నేన ధార్యం శుద్ధి కరంపరమ్

అభ్యంగ హీనో హ్యశుచి రోజక స్యాన్నసంశయః యస్తు మాం పూజయద్వీర! అభ్యంగేన వినాఖగ!

 న తస్యసంతతిః స్యాద్వై న చాహం ప్రీతి మాన్భవే ముండనం శిరసాకార్యం శిఖాధార్యాప్రయత్నతః

నక్తం చాదిత్యదివసే తథాషష్ఠ్యాం ప్రవర్తయేత్ సప్తమ్యా ముపవాసస్తు మమ సంక్రమణే తథా

కర్తవ్యో భోజకేనైవ మత్ప్రీత్యై గరుడాగ్రజ ! త్రికాలం చాపి గాయత్రీం జపేద్వాచా పురోమమ

ముఖమావృత్వ యత్నేన పూజనీయోఽహమాదరాత్ మౌనంచాస్య ప్రయత్నేన త్యక్త్వాక్రోధంచ దూరతః

శూద్రేభ్యోయస్తు వైశ్యేభ్యో భాత్కామాత్ప్రయచ్ఛతి నిర్మాల్యం మమ వైవత్స! సయాతినరకం ధ్రువమ్

 తా॥ ఒక్క మాఱు శంఖము పూరించిన యెడల నా కాలుమాసములు పురాణ శ్రవణము వలన కలిగినంత ప్రీతి కలుగును. సందేహములేదు. కాబట్టి భోజకుడగువాడు తప్పక శంఖమును పొయించవలేను, నాకు ఈ శంఖనాద నివేదనము చేయుట యతనికి శ్రేష్టమగు వృత్తి. అభక్ష్యభక్షణము చేయరు కావున వారు భోజకులని చెప్పబడుదురు. బ్రహ్మప్రాప్తినిగూర్చి యాలోచింతురు. గావున మాగధులని. నిత్యమును నన్ను భుజింపజేయుదురు గావున భోజకులనియు పిలువబడుదురు. వారు మిక్కిలి పవిత్రతను. కలిగించు నభ్యంగమును ధరింపవలెను. అభ్యంగహీనుడైన భోజకుడపవిత్రుడగుటలో సంశయములేదు. అభ్యంగహీనుడై నన్ను పూజించువానికీ . సంతానము కలుగదు, నాకు ప్రీతియు కలుగదు, శిరోముండనము చేయించుకొని శిఖ తప్పక యుంచుకొనవలెను. ఆదిత్యవారమునాడు, షష్ఠినాడును, నక్తవ్రత మాచరించి, సప్తమీ దినమునం దుపవసింపవలెను, సంక్రమణ దినమునందును ఉపవాస వ్రతమాచరింపవలెను. భోజకుడు నా ప్రీతి కొఱకు నా ముందు త్రికాలముల యందును గాయత్రీమంత్రమును వాచికముగ జపింపవలెను. క్రోధమును పూర్తిగవిడిచి, మౌనమునవలంబించి, భక్తిశ్రద్ధలతో నన్ను పూజింపవలెను. లోభము వలనగాని, కామము వలనగానీ నా నిర్మాల్యమును శూద్రులకు గాని వైశ్యులకు గానీ యిచ్చినవాడు తప్పక నరకమునకు బోవును.

మూ. లోభాద్వై భోజకోయస్తు మత్పుష్పాణి ఖగాధిప! యచ్ఛతన్యస్య దుష్టాత్మా మయ్యనారోప్య ఖేచర!

సజ్ఞేయో మే పరః శత్రుః సమామర్హోన చార్చితుమ్ నిర్మాల్యం మమ దేయం స్యాద్భ్రాహ్మణాదిషువై నృషు

వైవేద్యం యన్మదీయంతు తదశ్నీయాత్స దైవహి తేనాసౌ శుద్ధ్యతే నిత్యం హవిష్యాన్నసమం తథా!

 తక్షణాదుక్షి పేద్యస్తు మమాంగాత్పుష్పమేవహి నాన్యస్యదేయం నైవేద్యం మదీయముదకేక్షి పేత్

పంచగవ్య సమం తస్య మన్మతం నాత్ర సంశయః మమాంగలగ్నం యత్కించిద్గంధం పుష్పమథాపివా

దాతవ్యం నచ వైశ్యాయ న శూద్రాయ కదాచన ఆత్మనా తద్గృహీతవ్యం న విక్రయం కథంచన

 యస్తునారోష్య పుష్పాణి అవ్యంగాని మమోపరి యః కశ్చిదాహరేల్లోకే సయాతి నరకం ధ్రువమ్

స్నపనం మమనిర్మాల్యం పావకం యస్తు లంఘయేత్ స నరో నరకం యాతి సరౌద్రం రౌరవం ఖగ!

 భోజకేన సదాకార్యం స్నపనం మే ప్రయత్నతః యథా న లంఘయేత్కశ్చిద్యథా శ్వా నాపి భక్షయేత్

యద్యయత్నపరః కుర్యాద్భోజకః స్నపనం మమ యథావై లంఘిత మతిర్భక్ష్యతాంచ ఖగాధిప!

 స యాతి నరకం రౌద్రం తామిశ్రంస్రం నామ నామతః ఏక భక్తం సదాకార్యం స్నానం తైకాలమేవ హి

 తా॥ దుష్మాత్ముడైన భోజకుడెవడైనను నా కొఱకుద్దేశింపబడిన పుష్పములను లోభ వశుడై నాకు వినియోగింపకముందే యెవరికైన నిచ్చినచో. అట్టివాడు నాకు పరమ శత్రువని తెలయవలెను. అట్టివాడు నాపూజచేయుట కరుడు కాడు, నానిర్మాల్యమును బ్రాహ్మణాదులకు మాత్రమే యీయవలెను. భోజకుడు హవిష్యాన్న తుల్యమైన నా నైవేద్యము నారగింపవలెను, దానితో సౌతడు శుద్దుడగును. నా శరీరము నుండి తీసిన పుష్పమేనియు నితరుల కీయ కూడదు, నాకు నివేదింపబడిన వేనివైనను మరుక్షణమున నీటిలో వేయవలెను. నా శరీర స్పర్శ కలిగిన గంధ పుష్పాదులేవేనియు పంచగవ్యముతో సమానమైనవని యభిప్రాయము. అందుచే వాని నెప్పుడును వైశ్యునకుగాని, శూద్రునకుగాని యిచ్చుట కూడదు. తాను స్వీకరంపవలెనే కానీ ధనమునకై విక్రయింపరాదు. పుష్పములు గానీ, అవ్యంగములుగాని నాపైనలంకరింపక నపహరించువాడు తప్పక నరకప్రాప్తినందు ను. నా స్నాన జలమును, నిర్మాల్యమును, అగ్నిని దాటువాడు భయంకరమగు రౌరవమను నరకమును పొందును. భోజకుడు నిత్యము నన్ను అభిషేకముతోఁ దనుపు చుండవలెను, నాకు నివేదింపబడిన వస్తువుల పైనుండి దాటుట నిషేధమగు నట్లుగనే, వానిని శునకము భక్షించుటయు నిషేధమే. పూనికతో నన్నభిషేకింపకున్నను, నియమాతిక్రమణ బుద్దీగలవాడై భక్షించినను. భోజకుడు భీకరమైన తామిస్రమను నరకమున (బడును. ఒక పూట భోజనము, మూడు పర్యాయములు స్నానము భోజకునకు ప్రతిదిన కర్తవ్యములు.

 మూ॥ త్రిచైలం పరివర్తేత భవితవ్యం దినేదినే పూజాకాలేర్ఘ కాలేచ క్రోధస్త్యాజ్యః ప్రయత్నత :

అమాంగల్యం నవక్తవ్యం వక్తవ్యంచ శుభం తదా ఈ దృగ్భూతో భోజకోమే ప్రేయాన్ పూజాకరః సదా

 సన్మాన్యః పూజనీయశ్చ విప్రాదీనాం యథాస్మ్యహమ్ యః కరోత్యవమానం తు వృత్తిరూపంతు భోజకే

 తస్యాహం రోషమేత్యాశు కులం హన్మి సమంతతః ప్రియోమే భోజకో నిత్యం యథాత్వం వినతాసుత! ఉపలేపన కర్తాచ సంమార్జన పరశ్చ యః

 పరావసురువాచ :

ఇత్యుక్త్వా భగవాన్భాను ర్బభ్రామ రథమస్థితః

 అరుణోఽ పి తథా శ్రుత్వా ముదయాపరయా నృప ! పూజ్యస్తస్మాన్మహారాజ! భోజకస్తు మహీపతే ।

తస్మాద్దేయం వాచకాయ ద్వితీయమశనం నరైః

బ్రహ్మోవాచ :

ఇత్థం శ్రుత్వా స రాజాతు కర్మణః ఫలమాత్మనః పురాతనం మహా బాహుర్మదమాప మహాపతి :

యద్యదాయతనం భానోః పృధివ్యాంపశ్యతే నృపః తస్మిం స్తస్మిన్కారయతి ఉపలేపనమాదరాత్

 భార్యా తస్యాపి సుశ్రోణిః పుణ్యశ్రవణ మాదరాత్ వాచకే వేతనం దత్వా భానోర్దేవస్య మందిరే

ఇత్థం రాజా సపత్నీకః పూజ్య భక్త్యా దివాకరమ్ ప్రాప్తావుభౌ పరాంప్రీతిం గతిం చానుత్తమాం తథా

 ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీకల్పే ఉపలేపన స్నాపన

 మాహాత్మ్యవర్ణనం వామ సప్త దశోత్తర శతతమోఽధ్యాయః సత్రాజితోపాఖ్యానం సమాప్తమ్.

తా॥ ప్రతి దినము మూడు మారులు శుభ్రమగు వస్త్రములను మార్చుకొనవలెను, ప్రయత్నపూర్వకముగ పూజాది సమయము లందు క్రోధమును విడిచి పెట్టియుండవలెను. అశుభమును బలుక రాదు, మంగళ ప్రదములైన వాక్యములనే మాట్లాలడవలెను. ఈ విధమగు భోజకుడు నాకు ప్రియమైన పూజకుడు. అట్టివాడు బ్రాహ్మణాదులకు గౌరవపాత్రుడు, నావలెనే పూజనీయుడు, భోజక వృత్తిలో నున్నవాని నెవరేని యవమానించినచో. నట్టివాని యెడ నేను తక్షణమే క్రోధమునొంది వాని కులమునంతటిని నశింపజేయుదును, వినతా పుత్రా! నీ వెట్లు నాకిష్టుడవో భోజకుడును నాకటులెల్లవేళలయందు ప్రియమైనవాడు. అతడు నామందిరము నెల్లప్పుడు సంమార్జనము, ఉపలేపనము మున్నగు కార్యములు చేయుచుండుటచేనతడు నాకిష్టుగ-” పరావసువిట్లనెను."రాజా! ఈ విషయములన్నియు నరుణునకుఁజెప్పి సూర్యభగవానుడు రధారూఢుడై తన భ్రమణమును సాగించేను. అరుణుడా విషయములనన్నింటిని విని మిక్కిలి ప్రసన్న చిత్తుడయ్యెను, మహారాజా! ఆ విధముగ భోజకుడు పూజ్యత్వమును సంతరించుకొనెను. మానవుడు ప్రతిరెండవ భోజనమును వాచకునకు సమర్పించవలెను. బ్రహ్మదేవుడిట్లు పలికేను, “మహాముని యగు పరావసువు ముఖతః ఈ తన కర్మఫల వివరములన్నియు విని సత్రాజిత్తు మహారాజు మిక్కిలి. ప్రసన్నుడయ్యెను సూర్యదేవాలయములీ పుడమియందెచ్చట కన్పట్టినను వానిలో భక్తితో నాతడుపలేపనము లాదిగ చేయించుచుండెను సుందర శ్రేణియగు నతని భార్య కూడా భాను దేవుని మందిరమున, వాచకునకు వేతన మిచ్చి భక్తిశ్రద్ధలతో పుణ్యకథాశ్రవణములుచేయించుచుండెను.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీకల్పమునందుపలేపన స్నాపన మాహాత్మ్యవర్ణనమను నూట పదునేడవ అధ్యాయము సమాప్తము-సత్రాజితోపాఖ్యానము సమాప్తము.