115. ఆదిత్య మహాత్మ్యమున సూర్యపూజా విధి వర్ణనము

మూ. బ్రహ్మోవాచ :

ప్రశంసంతి మహాత్మానః సంవాదమ్ భాస్కరాశ్రయమ్ గౌతమ్యా సహ కౌశల్యా సుమనా యాం సురాలయే

స్వర్గేఽతి శోభనాం దృష్ట్యా కౌశల్యాం పతినా సహ బ్రహ్మాణీ గౌతమి నామ పర్యపృచ్ఛత విస్మితా

గౌతమ్యువాచ :

“శతశః సంతి కౌశల్యే! దేవా స్వర్గ నివాసినః దేవ పత్న్యస్తథైవేతాః సిద్ధాః సిద్ధాంగనాస్తథా

న తేషా మిదృశో గంధో న కాంతిర్న సురూపతా న వాససీ శోభనే యే యథాతే పతినా సహ

నైవా భరణ జాతాని తేషాం భ్రాజంతి వై తథా యథా తవ యథా పత్యుర్నచ స్వర్గనివాసినామ్

సుస్నాత చైలతశ్చైవ యువయోరతీరిచ్యతే లేఖాద్యానామ పీశానాం క్షయాతి శయ వర్జితః

తపః ప్రభావో దానం వా హోమోవా కర్మసంజ్ఞతః యువ యోర్యత్సమాచక్ష్వ తత్సర్వం వరవర్ణిని!

యేన మే విక్రమే బుద్ధిర్మనుజా యేన సంగతాః”

కౌశల్యోవాచ :

“యజ్ఞో యజ్ఞేశ్వరో భాను రావాభ్యాం జాతు తోషితః స్వర్గ ప్రాప్తిరియంతస్య కర్మణః ఫలముత్తమమ్

సురూపతా తతః ప్రీతి: పశ్యతాం చారువేషతా యత్పృచ్ఛసి మహాభాగే! తదప్యేషాం వదామితే

తీర్ణోదకై స్తథా గంధైః స్నాపితో యద్దివాకరః తేన కాంతి రియం నిత్యం దేవాం స్త్రీ భువనేశ్వరాన్

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “పూర్వమొకప్పుడు స్వర్గలోకమున సూర్యమహాత్మ్య సంబంధముగ జరిగిన గౌతమి కౌసల్యల సంవాదమును మహాత్ములు ప్రశంసించుచుందురు. ఒకానొక సమయమున బ్రహ్మాణియగు గౌతమి స్వర్గలోకమునందు మిక్కిలి సౌందర్యముతో ప్రకాశించుచున్న కౌసల్యను విస్మితురాలై చూచి, భర్తతో సహాచూచి యిట్లు ప్రశ్నించెను. గౌతమి యిట్లు బలికేను “ కౌసల్యా! దేవతలు దేవపత్నులు, సిద్ధులు, సిద్ధాంగనలు వందలకొలదిగ ఈ స్వర్గమునందు నివసించువారు గలరు. కాని వారెవరికిని మీ దంపతులలోనున్నట్టి గంథముగాని కాంతిగాని, సౌందర్యముగాని, అందమైన వస్త్రములుగాని లేవు. ఈ స్వర్గ నివాసులలోనెపరి యాభరణ సమూహములుగానీ మా యిరువురి యాభరణములవలె ప్రకాశించుటలేదు. చక్కగ స్నానమాచరించి వస్త్రములు ధరించిన మాత్రముననే మా ప్రకాశమతిశయించుచున్నది. దేవతలు వారి ప్రభులట్లుచేసినను వారీశోభ యెక్కువగ నిలుచుటలేదు. దీనికి కారణమేమి? మితపఃప్రభావమా? దానప్రభావమా? మీరు చేసిన కర్మ సంజ్ఞతమగు హోమము వలననా? మి యీ ప్రభాతి శయమునకు కారణమేద్దీయో చెప్పుము. దానిచే నాకును నట్టివి యాచరించుటుకు మనస్సు కలుగును. మానవులు కూడ నట్టి సత్కర్మలను చేయబూనుదురు. కౌసల్య యిట్లు బదులు పలికేను. యజ్ఞస్వరూపుడు, యజేశ్వరుడునైన సూర్యభగవానుడు మాచే నెప్పుడును తుష్టుడగుచుండును. మాకీ యుత్తమ ఫలమగు స్వర్గప్రాప్తి కూడ సూర్యసంబంధ కర్మలవలననే కలిగినది. సౌందర్యము, ప్రీతి, చూచువారికందముగ కనబడు చారువేషిత్వము మొదలగు తామడిగినవన్నియు వానికి సంబంధించినవనియే మీకు చెప్పుచున్నాను. తీర్దోదకముల చేతను, వివిధ గంధముల చేతను సూర్య భగవానునకభిషేకము చేసినందు వలననే నిత్యము త్రిభువన ప్రభువులగు దేవతలను ప్రకాశింపజేయు నీ కాంతి మాకలవడినది.

మూ II మనః ప్రసాదః సౌమ్యత్వం శరీరే యేచనిర్వృతాః యత్ప్రియత్వం చ సర్వం స్యాత్తద్ఘృత స్నాపనాత్ఫలమ్

యాన్యభీష్టాని వాసాంసి యచ్చాష్ట విభూషణమ్ రత్నాని యాన్యభీష్టాని యత్ప్రియం చానులేపనమ్

యే ధూపా యాని మాల్యానీ దయితాన్య భవన్సదా మమ భర్తుస్తదై వాస్య తదారాజ్యం ప్రశాసతః

తాని సర్వాణి సర్వజ్ఞ సర్వ పాతరి భానుని దత్తాని తత్సము త్థోఽయం గంథ ధూపాత్మకోగుణః

ఆహారా దయితా యేచ పవిత్రాశ్చనివేదితాః త్రిలోక కర్తుః సవితుస్తృప్తిస్తద్గుణ సంభవా

స్వర్గ కామేన మే భర్త్రా మయాచ శుభ దర్శనే కృత మేతత్కృతేనా భూ దావయోర్భవ సంక్షయః

యేత్వకామా నరాః సమ్యక్తత్కుర్వంతి చ శోభనే తేషాం దదాతి విశ్వేశో భగవాన్ముక్తి మిశ్వరః

బ్రహ్మోవాచ :

ఏవమభ్యర్చ్య మార్తాండ మర్కం దేవేశ్వరం గురుమ్ ప్రాప్తో స్మ్యభి మతాన్కామాన్కృష్ణా హం శాశ్వతఃసమాః

చందనాగురు కర్పూర కుంకుమో శీర పద్మకైః అనులిప్తో సరైర్భక్త్యా దదాతి సగరోద్భవామ్

కాలేయకం తురుష్కంచ రక్తచందన మేవచ యాన్యాత్మనః సదేష్టాని తాని శస్యాన్యపా కురు

తాII మనస్సు ప్రసన్నముగ నుండుట, సౌమ్యత్వము, శరీరమునందలి సుఖానుభవ లక్షణములు ప్రియత్వము.ఇవి యన్నియునా సూర్య దేవునికి చేసిన ఘృతాభిషేక ఫలములు. ప్రియమైన వస్త్రములు, ఆభరణములు, రత్నములు, ఇష్టములైన విలేపనములు. ధూపములు, పుష్పములు, మొదలగు వానినన్నింటిని నా భర్త రాజ్యము చేయుచున్న కాలమున శుభదర్శనుడు, సర్వరక్షకుడైన సూర్య భగవానునకు సమర్పించుచుండెడివారము. మా శరీర వస్త్రాదులకు గల గంధ ధూపాత్మకమైన గుణము తత్సమర్పణము వలన కలిగినదే. గౌతమీ! స్వర్గకాముడైన నాభర్త, నేను - మేమిరువురము ప్రియములు, పవిత్రములునైన ఆహార పదార్దములు నివేదించి త్రిలోక కర్తయగు సవితృదేవునకు తృప్తి కల్గించితిమి. దానితో మాకు పాపక్షయమైపోయెను. స్వర్గకాములమైనందున మాకు స్వర్గప్రాప్తి కలిగెను. నిష్కాములై యిట్టి యుపచారములు చేసిన మానవుల కీశ్వరుడగు ప్రభాకరుడు మోక్షమునిచ్చును. బ్రహ్మదేవుడిట్లు పలికెను. “కృష్ణా! మార్తాండుడు, అర్కుడు, దేవేశ్వరుడు, గురువునైన సూర్య భగవాను నిట్లర్చించియే చిరకాలము నుండియు నేనభిమతార్ధసిద్దులను బడయుచుంటిని. చందనము, అగరు, కర్పూరము, కుంకుమము వట్టివేరు, పద్మకాష్ఠము (ఓషధీ విశేషము) వీనిని సూర్యదేవునకు భక్తితో లేపనము చేసిన వారి కా దేవుడు లక్ష్మీనిచ్చును. గంధకాష్ఠము, యావనము, ఎఱచందనము, ఇట్టి సూర్యప్రీతి కరములైన వస్తువులనా దేవున కర్పింపలేను.

మూ!! గంధేశ్చాపి శుభాయైచ ధూపాయే విజయోదయాః దివాకరస్య ధర్మజ్ఞ! నివేద్యాస్సర్వదాచ్యుత!

న దద్యాత్సల్లకీ క్షారం నో ముఖేనచ సంహృతమ్ దద్యాదరాయ ధర్మజ్ఞ! ధూపమారాధనోద్యతః

మాలతీ మల్లికా చైవ యూధికాచాతిముక్తికః పాటలాః కరవీరాశ్చ జపా సేవంతి రేవచ

కుంకుమ స్తగరశ్చైవ కర్ణికారః సకేశరః చంపకః కేతకః కుందో బాణ బర్బర మాలికా

అశోకస్తిలకో లోధ్రస్తధా చైవాట రూషకః శత పత్రాణి ధన్వాని బకాహ్వాని విశేషతః ,

అగస్తిం కింశుకం తద్వత్పూజార్దం భాస్కరస్యతు అమి పుష్పప్రకారాస్తు శస్త్రాభాస్కరపూజనే

బిల్వపత్రం శమీపత్రం పత్రంవా భృంగరస్యచ తమాల పత్రంచ హరే! సదైవ భగవత్ప్రియమ్

తులసీ కాల తులసీ తథారక్తంచ చందనమ్ కేతకీ పత్ర పుష్పంతు సద్యస్తుష్టికరం రవేః

పద్మోత్పల సముత్థాని రక్తం నీలోత్పలం తథా సితోత్పలంతు భానోస్తు దయితాని సదాచ్యుత!

కృష్ణలోన్మత్తకం కాంతం తథైవ గిరిమల్లికా న కర్ణికారిక పుష్పం భాస్కరాయ నివేదయేత్

తా॥  శుభప్రదములైన గంధములు, విజయ’ సంబంధిధూపమలు, సూర్యభగవానునకెల్లప్పుడు నివేదింపుచుండవలెను. అందుగు, ఉమ్మెత్త సూర్యపూజలో నుపయోగింపరాదు. ముఖముచే సంహృతమైనది కూడదు. సూర్యపూజచేయువాడు యోగ్యమైన ధూపమును సమర్పింపవలెను. జాజి, మల్లె, చేమంతి, అడవిమొల్ల, పువ్వుల గురువింద, ఎఱ్ఱగన్నేరు, దాసనము, తెల్లనిరోజా తఱచుగ నందుబాటులో నుండునవి. కుంకుమ పువ్వు, నంది వర్దనము, కొండగోగు, పొగడ పొన్న, సంపెంగ, మొగిలి, మొల్ల, గోరంట, పాయింట, విరజాజి. అశోకము (వంజుళము) బొట్టుగు, బొద్దుగు, అడ్డసరము, తామర, మెట్ట తామర, శివమల్లి ( బకపుష్పము). అగి సే, మోదుగు పువ్వులు సూర్యభగవానుని పూజకు ప్రశస్తములైనవి బిల్వపత్రము, శమి(జమ్మి. పత్రము, గుంటగలిజేరు, చీఁకటిమ్రానియాకు, ఇవి సూర్యునకు ప్రముఖమైన పత్రములు-27. తులసి, కృష్ణతులసి, ఎజ్ఞ చందనము, మొగిలి యాకులు, పూలు సూర్యభగవానునకు సద్యస్తుష్టికరముల. తామరలు, కలువలు, ఎఱ్ఱగలువలు, నీలోత్పలములు, సూర్యదేవునకెల్లప్పుడు ప్రీతికరములు-29. గురిజ, ఉమ్మెత్త (ఎఱ్ఱనిది) కొండమల్లె, (కొండగోంగు) మోరటి ఇవి సూర్యునకు పనికిరాని పుష్పములు.

మూ II కుటజం శాల్మలీ పుష్పం తథాన్యంగంధవర్జితమ్ నివేదితం భయం రోగం నిఃస్వతాంచ ప్రయచ్ఛత

యేషాం నప్రతి షేధోస్తి గంధ వర్ణాన్వితానిచ తాని పుష్పాణి దేయాని భావనే లోకభానవే

సుగంధైశ్చ మురామాంసీ కర్పూరాగరు చందనైః తథాన్యైశ్చ శుభైర్ధ్ర వ్యైరర్చ యేద్వనమాలినమ్

దుకూల పట్ట కౌశేయచార కార్పాసకాధిభిః వాసోభిః పూజయద్భానుం యానిచాత్మప్రియాణీతు

భక్ష్యాణి యాన్యభీష్టాని భోజ్యాన్యభిమతానిచ ఫలంచ వల్లభం యత్స్యాత్తతో దేయం దివాకరే

సువర్ణ మణి ముక్తాని రజతంచ తథాచ్యుత! దక్షిణా వివిధా చేహ యచ్చాన్యదపి వల్లభమ్

తత్తు దేవాధి దేవాయ భాస్కరాయ నివేదయేత్

ఆత్మానం భాస్కరం మత్వా యజ్ఞం తస్మైనివేదయేత్ తత్త దవ్యక్త రూపాయ భాస్కరాయ నివేయేత్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రా హ్మేపర్వణి సప్తమీ కల్పే ఆదిత్య మాహాత్మ్యే సూర్యపూజా విధివర్ణనం నామ పంచదశోత్తర శతతమోఽధ్యాయః ॥

తా॥ పరిమళములేని కొండమల్లెలు, బూరుగు పువ్వులు ఇంకను నితరములైన వాసనలేని పూలు సూర్యపూజకు వినియోగించిన యెడల భయము, రోగము, నిస్సయోగము ప్రాప్తించును. నిషేధములేని సుగంధ పుష్పములనే లోకప్రకాశకుడైన ప్రభాకరునకు సమర్పింపవలెను. సుగంధద్రవ్యములతో, గంధకుటి, జటామాంసి, కర్పూరము, అగరు, చందనము ఇంకను ఇతరములగు మంగళకర ద్రవ్యములతోను సూర్యదేవునర్చింపవలెను. ఆ దేవునకు ప్రియమైన వానితో నా భగవానుని పూజింపవలెను. ఆ దేవునకు ప్రియములైన భక్ష్యములు, భోజ్యములు, ఫలములు నివేదింపవలెను. బంగారము మణులు, ముత్యములు, వెండి, వివిధములైన దక్షిణలు, ఇంకను నాతనికిష్టమైన వస్తువులను సమర్పింపవలెను. భాస్కర దేవుని పరమాత్మగా భావించి లేక తానుగా భావించి యతనికి పూజా నివేదనము చేయవలెను. అవ్యక్తరూపుడైన ఆ భగవానున కాయా ద్రవ్యములనన్నింటిని సమర్పింపవలేను .

శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు - ఆదిత్య మాహాత్యమున సూర్యపూజా విధి వర్ణనమను నూటపదునైదవ అధ్యాయము సమాప్తము.