భవిష్య మహా పురాణము
114. సప్తమీ కల్పమున ఆదిత్యస్నోపనయోగ వర్ణనము
మూ. బ్రహ్మోవాచ :
స్థాపితాం ప్రతిమాం భానో సమ్యక్సం పూజ్య మానవః యం యం ప్రార్థయతే కామం తం తం ప్రాప్నోత్యసంశయమ్
యః స్నాపయతి దేవస్య ఘృతేన ప్రతిమాం రవేః ప్రస్థేప్రస్థే ద్విజాగ్ర్యాణాం స దదాతి గవాం శతమ్
గవాం శతస్య విప్రేభ్యో యద్దత్తస్య భవేత్ఫలమ్ ఘృత ప్రస్థేన తద్భానో ర్భవేత్స్నాతక యోగినామ్
భూరి ద్యుమ్నేన సంప్రాప్తా సప్తద్వీపావసుంధరా ఘటోదకేన మార్తాండ ప్రతిమా స్నాపీతాకిల
ప్రతిమా మసితాష్టమ్యాం ఘృతేన జగతీ పతేః స్నాపయిత్వా సమస్తేభ్యః పాపేభ్యః కృష్ణ! ముచ్యతే
సప్తమ్యా మధ షష్ఠ్యాం వా గవ్యేన హవిషారవేః స్నపనంతు భవేచ్ఛైష్టం మహాపాతక నాశనమ్
జ్ఞానతోఽజ్ఞానతో వాపి యతాపం కురుతేనరః తత్క్షాలయతి సంధ్యాయాం ఘృతేన స్నపనం రవేః
సర్వయజ్ఞ మయో భానుర్హ వ్యానాం పరమం ఘృతమ్ తయో రశేష పాపానాం క్షాలకః సంగమో భవేత్
యేషు క్షీర వహా నద్యో హ్రదాః పాయస కర్దమా? మోదతే తేషు లోకేషు క్షీరస్నాన కరో రవేః
ఆహ్లాదం నిర్వృతి స్థాన మారోగ్యం చారురూపతామ్ సప్త జన్మాన్యవాప్నోతి క్షీరస్నాన పరో రవేః
దధ్యాదీనాం వికారాణాం క్షీరతః సంభవో యథా యథాచ విమలం క్షీరం యథా నిర్వృతి కారకమ్ తథా చ నిర్మలం జ్ఞానం భవత్యపి న సంశయః
గ్రహాను కూలతాం పుష్టిం ప్రియత్వ మఖిలే జనే కరోతి భగవాన్భానుః క్షీర స్నపన తోషితః
సర్వస్య స్నిగ్ధతామేతి దృష్ట మాత్రే ప్రసీదతి ఘృత క్షీరేణ దేవేశ్ స్నాపితే తిమిరాపహే
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీకలే ఆదిత్య స్నాపన యోగ వర్ణనం నామ చతుర్దశోత్తర శతతమోఽధ్యాయః ॥
తా॥ బ్రహ్మ దేవుడిట్లనెను. సూర్యదేవుని స్థాపిత ప్రతిమను చక్కగా పూజించిన మానవుడేయే కోరికలను తీర్చుటకై యాదేవుని ప్రార్ధించునో వానినన్నింటిని నిస్సంశయముగ పొందును. సూర్య ప్రతిమను ఘృతముతో నభిషేకించువాడు ప్రతి జనపదమునందలి బ్రాహ్మణ శ్రేష్ఠులకు వంద గోదానములు చేసిన పుణ్య ఫలమును పొందును. నాలుగు మానికల నేతితో సూర్యభగవానునకు స్నానము చేయించువారికి, సూజుగోవులను బ్రాహ్మణులకు దానము చేసిన ఫలము కలుగును. ఘటోదకముచే మార్తాండుని ప్రతిమను అభిషేకించినందువలన భూరిద్యుమ్నునకు సప్తద్వీపమైన వసుంధర ప్రాప్తించినదట. కృష్ణా! జగత్పతియైన భాస్కర దేవునకు శుక్ల పక్షమునందలి యష్టమినాడు నేతితో స్నానము చేయించినచో సమస్త పాపముల నుండి ముక్తిలభించును. సప్తమీ నాడుగాని లేక షష్ఠినాడు గాని ఆవునేతితో సూర్యునకు స్నపనము చేసిన యెడల మహా పాతకములు నశించి శ్రేష్టమగు ఫలము లభించును. సంధ్యాకాలమున సూర్యునకు ఘృతస్నపనము జరిపించినచో నట్టివాని జ్ఞాతాజ్ఞాతములైన పాపములు ప్రక్షాళితములగును. సూర్యుడు సర్వయజ్ఞమయుడు. హవ్యములలో ఘృతము శ్రేష్టమైనది. అవి రెండును సంగమించినచో నశేష పాపములు క్షాళనము చేయబడును-8. సూర్యునకు క్షీరాభిషేకము చేయువాడు, క్షీరములు ప్రవహించు నదులతోను, పాయస కర్దమములుగల ప్రదములతోను శోభించేడి దివ్యలోకములలో నానందించును -9. సూర్య భగవానునకు క్షీరస్నానము చేయించువాడేడు జన్మల వఱకును ఆహ్లాదము, సుఖము, పదవి, ఆరోగ్యము, సౌందర్యము కలిగియుండును. క్షీర మెట్లు నిర్మలమైనదో, సుఖకారకమైనదో జ్ఞానము కూడ అట్టిదే. క్షీరమునుండి పెరుగు, నేయి మొదలగు రుచికరములు ఆరోగ్య ప్రదములునైన వస్తువులు పుట్టునట్లు జ్ఞానము నుండి కూడా నటులే జగద్ధిత కరములైన సద్విచారములు పుట్టును. సంశయములేదు. భగవానుడైన భాను దేవునకు చేసిన క్షీరాభిషేకము గ్రహానుకూలతను, పుష్టిని, సర్వజన ప్రీతిని కలిగించును. తిమిరధ్వంసకుడైన భానుదేవుని ఘృత క్షీరములతో నభిషేకించిన వాని దర్శన మాత్రముననే సర్వజనులు ప్రసన్నులై యతనితో స్నేహ భావమున నుందురు.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు ఆదిత్య స్నాపన యోగ వర్ణనమను నూట పదునాలుగవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 114 of the Bhavishya Mahā Purana is as follows:
The complete procedure for the ritual bathing (abhiṣeka) of the Sūrya image is given: the five sacred liquids — milk, curd, honey, ghee, and pure water — are poured over the image in sequence, with specific Vedic and Purāṇic mantras accompanying each liquid. Then follow additional bathings with fragrant waters (rose-water, sandalwood water, saffron water) and finally a purification with pure water and a drying with fine cloth. The theological significance of abhiṣeka is explained: the ritual bathing of the divine image purifies the worshipper's own consciousness, washing away the accumulated impurities of thought and feeling that cloud the inner mirror of awareness. As the outer image is bathed and shines more brightly, the worshipper's inner image of the divine becomes clearer.