భవిష్య మహా పురాణము
113. సప్తమీ కల్పమున ఆదిత్యాలయ వందన మార్జనాది వర్ణనము
విష్ణురువాచ :
మూ॥ సురజ్యేష్ఠ! పునర్భూహి యత్పృచ్ఛామ్యహమాదితః యత్ఫలం సమవాప్నోతి కారయిత్వా రవేర్గృహమ్
దేవార్చాం కారయిత్వాతు యత్పుణ్యం పురుషోఽశ్నుతే పూజయిత్వాతు విధివదనులిప్యచ యత్ఫలమ్
కాని మూల్యాని శస్తాని కాని నార్హంతి భాస్కరః కే ధూపా భాను దయితాః కే వర్ష్యాశ్చ జగత్పతేః
ఉపచార ఫలం కింస్యాత్కిం ఫలం గీత వాదితే ఘృతక్షీరాదినా యత్తు స్నాపితే భాస్కరేఫలమ్ యథోపలేపనాదౌచ ఫలమభ్యుక్షితేనతు
దివాకర గృహే తాత! తదశేషం వదస్వమే
బ్రహ్మోవాచ :
“సాధువత్స! యదేతత్వం మార్తాండ స్యేహపృచ్ఛసి శుశ్రూషణే విధిం పుణ్యం తది హైకమనాః శృణు
యస్తు దేవాలయం భానోర్ద్వారం శైల మథాపివా కార యేనన్మయం చాపి తస్య పుణ్య ఫలం శృణు
అహన్యహని యజ్ఞేన యజతో యన్మహత్ఫలమ్ ప్రాప్నోతి తత్ఫలం భానోర్యః కారయతి మందిరమ్
కులానాం శతమాగామి సమతీతం కులం శతమ్ కారయేద్భగవద్ధామ స నయేదర్క లోకతామ్
సప్తజన్మ కృతం పాపం స్వల్పం వాయదివా బహు భానోరాలయ విన్యాస ప్రారంభాదేవ నశ్యతి
తా॥ విష్ణుదేవుడిట్లనెను. “ఓ సుర జ్యేష్ణా! నేనడుగ బోవు ప్రశ్నల కన్నింటికి మొదటి నుండియు సమాధానములు చెప్పుడు. రవి మందిరమును నిర్మింపఁజేసిన వానికి కలుగు ఫలమేమి?. సూర్యదేవార్చన చేయించువానికెట్టి పుణ్యము కలుగును? విధి విధానముగ పూజించి మందిరము నలుఁకుఁబూతలతో నలంకరించిన నే ఫలము కలుగును? సూర్యోపాసనలోనే యే విలువలు ప్రశస్తములైనవి? ఏవి అప్రశస్తములు? భాసుదేవున కిష్టమైన ధూపములెవ్వి? విసర్జింపదగిన ధూపములెవ్వి?. భానుదేవున కర్పింపబడు నుపచారముల ఫలమేమి? ఆతని సమక్షమున చేయబడు "గీత వాద్యాది సేవకు ఫలమేమి? ఘృతము, క్షీరముమున్నగువాని చేత సూర్యదేవునకు స్నానము చేయించినచో కలుగు ఫలమేమి?. సూర్య మందిరమున అలుకుట మొదలగు వాని చేతను, నీరు మొదలగునవి చల్లుట చేతను ఎట్టి ఫలములు కలుగునో సాకల్యముగ నాకుఁజెప్పుడు”-5, బ్రహ్మదేవుడిట్లు చెప్పందొడంగెను. "వత్సా! సూర్యారాధన సంబంధములగు విషయములను గూర్చిలెస్సగా ప్రశ్నించితివి. (విధిని వినుటచేత - వినగోరుట చేత కూడా పుణ్యమే) సేవ యందలి పుణ్యప్రదమైన విధిని సావధానుడవై వినుము-6. సూర్యదేవాలయమును కఱ్ఱతో గాని, శిలతోగాని, మట్టితోగాని నిర్మింపజేసిన వానికి కలిగెడి ఫలమును గూర్చి వినుము. ప్రతిదినము యజ్ఞము, పూజ చేయుచుండుచే కలుగు మహత్పలము సూర్యమందిరమును నిర్మింపజేసిన వానికి కలుగును. ఆలయ నిర్మాణము, దేవతా ప్రతిష్ఠ చేయించినవాడు రాబోవు వందతరముల తన కులము వారిని, గడచిన వందతరముల వారిని కూడా తరింప జేయ గలుగుటయే గాక పరమున సూర్యలోక ప్రాప్తినందును. ఏడు జన్మలలో చేసిన పాపము-అల్పమైనను అనల్పమైనను, సూర్యదేవాలయ ప్రారంభ శిలాన్యాసముననే నశించిపోవును.
మూ॥ సప్తలోక మయోభాను స్తస్యయః కురుతే గృహమ్ ప్రతిష్ఠాం సమవాప్నోతి సనరః సప్త లౌకికీమ్
ప్రశస్త దేశ భూభాగే ప్రశస్తం భవనం రవేః కారయేదక్ష యాన్లోకాన్స నరః ప్రతిపద్యతే
ఇష్టకాచయ విన్యాసో యావద్వర్షాణి తిష్ఠతి తావద్వర్ష సహస్రాణి తత్కర్తుర్దివి సంస్థితిః
ప్రతిమాం లక్షణవతీం యః కారయతి మానవః దివాకరస్య తల్లోక మక్షయం ప్రతిపద్యతే
షష్టి వర్ష సహస్రాణాం సహస్రాణి సమోదతే లోకే సుమనసాంవీర! ప్రత్యేకం మధుసూదన!
ప్రతిష్టాప్య రవేరర్చాం సుప్రశస్తే నివేశనే పురుషః కృతకృత్యోస్తీన దోషఫలమశ్నుతే
యే భవిష్యంతి యేఽతీతా ఆకల్పం పురుషాః కులే తాంస్తారయతి సంస్థాప్య దేవస్య ప్రతిమాం రమే
అనుశిష్టాః కిల పురా యమేన యమకింకరాః పాశదండకరాః కృష్ణ! ప్రజా సంయమనోద్యతాః
యమ ఉవాచ :
విహరంతు యథాన్యాయం నియోగో మేఽను పాల్యతామ్ నాజ్ఞాభంగం కరిష్యంతి భవతాం జంతవఃక్వచిత్
కేవలం యే జగన్మూలం వివస్వంత ముపాశ్రితాః భవద్భిః పరిహర్తవ్యాస్తే షాం నైవేహ సంస్థితిః
తా॥ సప్తలోకమయుడగు సూర్యదేవున కాలయము నిర్మించు మనుష్యుడు సప్తలోక పరివ్యాప్తమగు ప్రతిష్ఠను పొందును. ప్రశస్తమైన దేశమునందలి శ్రేష్ఠమైన భూభాగమున సూర్యదేవుని మందిరమును నిర్మింపజేయవలెను. అటుల చేసిన వాడక్షయ లోకములను పొందును. ఇటుక ఇలాళ్ల సమూహపుటమరిక యెన్నిసంవత్సరముల వఱకుండునో అన్ని వేల సంవత్సరములో మందిర నిర్మాత స్వర్గమునందు నివసించును. సలక్షణమైన సూర్య విగ్రహమును చేయించు మానవుడు చిరకాలము సూర్యలోకమున నివసించును. అరువదివేల సంవత్సరములతడు ప్రత్యేకముగ దేవలోకమున సుఖజీవనము చేయును. ప్రశస్తమైన యాలయమున సూర్యదేవుని ప్రతిష్టించి, అతనికి పూజలు జరిపించువాడు కృతకృత్యుడగును. అతనినేదోషములంటవు. సూర్యభగవానుని విగ్రహమును ప్రతిష్ఠించిన వాడు ఒక బ్రహ్మకల్పము వఱకు, తనకులమునందలి రాబోవు తరముల వారిని, గడచిన తరముల వారిని తరింపజేయును. విష్ణుదేవా! పూర్వము పాశదండములను చేతులయందు ధరించి యున్నవారును, ప్రజలను నియమించుటకు (బూనుకొనినవారునునైన యమకింకరులు యమునిచేనట్లు శాసింపబడిరి. యమధర్మరాజిట్లనెను. “నా యాజ్ఞను పాలించుచు మీరు యథాన్యాయముగ ప్రపంచమున విహరింపుడు. ఏ ప్రాణియును మీ యాజ్ఞల నుల్లంఘింపదు -19. కేవలము జగత్తునకు మూలభూతుడైన వివస్వంతునాశ్రయించి యుపాసించు వారిని మాత్రము విడిచి పెట్టవలెను. ఏలయన వారికీ యమలోకమున చోటులేదు.
మూ ॥యేతు వైవస్వతా లోకే తచ్చిత్తాస్తత్పరాయణాః పూజయంతి సదాభానుం తేచత్యాజ్యాః సుదూరతః
తిష్ఠంశ్చ ప్రస్వప న్గచ్ఛన్నుత్తిష్ఠన్నలితే క్షుతే సంకీర్తయతి దేవం యః సనస్త్యా జ్యః సుదూరతః
నిత్య నైమిత్తికైర్దేవం యే యజంతి తు భాస్కరమ్ న చాలోక్యా భవద్భిస్తే తద్ధ్యానం హంతివో గతిమ్
యే పుష్ప ధూప వాసోభి ర్భూషణై శ్చాపి వల్లభైః అర్చయంతి నతే గ్రాహ్యా మత్పితుస్తే పరిగ్రహాః
ఉప లేపన కర్తారః కర్తారో మార్జనస్య యే అర్కాలయే పరిత్యాజ్యం తేషాం త్రిపురుషం కులమ్
యేన వాయతనం భానో: కారితం తత్కులోద్భవః పుమాన్స నావలోక్యోవై భవద్భిర్ధుష్ట చక్షుషా
యేమోర్చా భగవద్భక్త్యా మత్పితుః కారితా శుభా నరాణాం తత్కులం వీరాః! సదా త్యాజ్యం సుదూరతః
భవతాం భ్రమతాం యత్ర భానుసంశ్రయ ముద్రయా న చాజ్ఞా భంగ కృత్కశ్చిద్భవిష్యతి నర క్వచిత్
ఇత్యుక్త్వాః కింకరాస్తేన యమేన సుమహాత్మనా అనాశ్రిత్య వచః కృష్ణ! సత్రాజితమథో గతాః
తస్యతే తేజసా సర్వే భానోర్భక్తస్య సువ్రత! మోహితాః పతితాభూమౌ యథాచ విహగా నగాత్
ఏతాం మహాఫలాం యోర్చాం భానో: కారయతే నరః తవాఖ్యానం మహాబాహో! గృహం కారయితుశ్చయత్
యజ్ఞా నరాణాం పాపౌఘ నాశకః సర్వకామదాః తథైవేష్టా జగద్భానుః సర్వయజ్ఞమయో రవిః
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రా హ్మేపర్వణి సప్తమీ కల్పే ఆదిత్యాలయ వందన మార్జనాది వర్ణనం నామ త్రయోదశోత్తర శతతమోఽధ్యాయః
తా॥ ఎల్లవేళల సూర్యభగవానునే పూజించుచు, ఆదేవునే చిత్తమందు నిలిపి, అతని యందే తాత్పర్యము కలిగి యున్న వైవస్వతుల నుండి మీరు మిక్కిలి దూరముగ నుండవలెను. నిలుచుచు, నిదురించుచు, వచ్చుచుఁబోవుచు, లేచుచు, జారినప్పుడు, తుమ్మినప్పుడును సూర్యదేవుని నామస్మరణము చేయువానిని మీరు సమీపింపక చాలా దూరమున నుండవలెను. నిత్య నైమిత్తిక కార్యములందు భాస్కరు నర్చించువారి వైపు మీరు కన్నెత్తి చూడకూడదు. వారి ధ్యానము మీ గతిని నాశనము చేయును. పుష్పములచే,ధూపములచే, వస్త్రములచే, ప్రియమైన యాభరణములచేతను సూర్యభగవానునర్చించువారిని మీరు ముట్టుకొనకూడదు. ఏలయన వారు మా పితృదేవుని యాశ్రయముననున్నవారు. సూర్యాలయముననుపలేపన సమ్మార్జనాది సేవలు చేయువారిని, వారికులమున మూడు తరముల వారిని కూడా మీరు విడిచి యుండవలెను. సూర్యదేవాలయ నిర్మాణము చేసిన వారి కులమున జన్మించిన వానిని కూడా మీరు మీ దుర్దృష్టితో చూడరాదు. నా తండ్రియగు సూర్యభగవానుని పూజించు వారినుండి, వారి కులమునుండి మీరు చాల దూరముగనుండవలెను. అచ్చటచ్చట తిరుగుచుండెడు కెక్కడేని, యెవడేనియు సూర్యదేవునాశ్రయించినట్లున్న మానవుడు తటస్థపడిన యెడల మిలో నెవరేనియు నా యాజ్ఞ, నుల్లంఘించి యతనిని సమీపింపరాదు. మహాత్ముడైన యమధర్మరాజుచే నిట్లాజ్ఞాపింపబడిన యమకింకరు లొకతూరి యముని మాటను పెడచెవిని బెట్టి సూర్యభక్తుడగు సత్రాజిత్తును సమీపించిరి. కాని అతని తేజస్సు వలన మోహితులై, శరాఘాతమున కొండమీది పక్షినేల గూలినట్లు, మూర్ఛితులై పడిపోయిరి. విష్ణుదేవా! సూర్యాలయము నిర్మింపజేసి యాదేవదేవుని పూజాదికము చేయించువానికి కలుగు మహా ఫలము నీకు చెప్పబడినది. మానవులకు యజ్ఞములు పాపసమూహ వినాశకములు. సర్వకామ ప్రదాయకములు జగత్తును ప్రకాశింపజేయు సూర్యభగవానుడు సర్వయజ్ఞ మయుడు గావున నతని ప్రీత్యర్ధముగఁ జేయునదంతయు యజ్ఞఫలమునే యిచ్చును.
శ్రీ భవిష్య మహా పురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునం దాదిత్యాలయ వందన మార్జనాది వర్ణనమను నూట పదమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 113 of the Bhavishya Mahā Purana is as follows:
The specific acts of service performed within a Sūrya temple — and the specific merit assigned to each act — are enumerated in detail. Sweeping the temple courtyard with a fragrant broom removes a specific quantum of sin and plants the seed of good health in the next birth. Arranging flowers before the image grants beauty and artistic sensibility. Lighting lamps grants brightness of intellect and fame. Cooking the daily food offering grants prosperity and abundance of good food in future births. Singing hymns in the temple grants a melodious voice and the capacity to move hearts in the next birth. The chapter is simultaneously a motivational teaching for temple volunteers and a theological statement about the transformative power of selfless service in sacred space.