112. సప్తమీ కల్పమున తృతీయ పద వ్రత వర్ణనము

బ్రహ్మోవాచ :

 మూ. ఏవంకృష్ణ! సదాభానుర్నరై ర్భక్త్యాయథావిధి ఫలం దదాతిసులభం సలిలేనాపి పూజితః

న భానుర్జీవ దానేన నపుష్పైర్మఫలైస్తథా ఆరాధ్యతే సు శుద్ధేన హృదయేనైవ కేవలమ్

రాగాద పేతం హృదయం వాగ్ధుష్టానానృతాదిభిః హింసా విరహితం కర్మ భాస్కరారాధనత్రయమ్

 రాగాది దూషితే చిత్తేనా స్పందీ తిమిరాపహః బధ్నాతి తం నరం హంసః కదాచిత్కర్ధమాంభసి

 తమసో నాశనా యాలం చేందోర్లేఖా హ్యనారతమ్ హింసాది దూషితం కర్మ కేశవారాధనే కుతః?

జనశ్చిత్తాప్రసాదాద్వై న చాప తిమిరాపహమ్ తస్మాత్సత్య స్వభావేన సత్యవాక్యేన చాచ్యుత!

అహింసకేన చాదిత్యో నిసర్గాదేవ తోషితః సర్వస్వమపి దేవాయ యోదద్యాత్కుటిలాశయః

సనైవారాధ యేదేనం దేవదేవం దివాకరమ్ రాగా దపేతం హృదయం కురుత్వం భాస్కరార్పణమ్

తతః ప్రాప్యసి దుష్ప్రాప్య మయత్నే నైవ భాస్కరమ్

విష్ణురువాచ :

“దేవేశః కధితః సమ్యక్కామ్యోఽయం భాస్కరో మయి ఆరాధన విధిం సర్వం భూయః పృచ్చామి తం వద

కులే జన్మ తథారోగ్యం ధనవృద్ధిశ్చ దుర్లభా త్రితయం ప్రాప్యతే యేన తన్మేవద జగత్పతే!

 తా ॥ బ్రహ్మదేవుడిట్లు చెప్పెను. “ఇట్లు యథావిధిగ పూజించిన వానికిగాని నిండారుభక్తి గలిగి జలముతో పూజించిన వానికిగాని సూర్యభగవానుడు సుదుర్లభమైన ఫలమిచ్చును. నిజమునకు భానుదేవుని జలములతో గాని పుష్పములతోగానీ, ఫలములతోగాని పూజింపనక్కరలేదు. కేవలము పరిశుద్ధమైన హృదయముతోఁ బూజించిన చాలును . రాగద్వేషాదిరహితమైన హృదయము, అసత్యాదులచేత దుష్టము కాని వాక్కు, హింసారహితమైన కర్మ ఈ మూడును సూర్యారాధనములే. రాగాదులచే దూషితమైన చిత్తమునందు తిమిరనాశకుడైన సూర్యభగవానుని వెలుగులు ప్రసరింపనేరవు. అట్టి మనుష్యునాదేవుడు సంసార పంకమునఁ గట్టివేయును. చీఁకటిని జీల్చివేయుటకు చంద్రరేఖ యొక్కటిచాలును. (అట్లేదేవతారాధనమునకు స్వచ్ఛమైన హృదయమొక్కటిచాలును) హింసాదులచే దూషితమైన కర్మసూర్యనారాయణుని పూజకెట్లు పనికివచ్చును?. మానవుడు ప్రసన్నచిత్తములేనిదే సూర్యదేవుని పొందజాలడు. అందువలన సత్యస్వభావుని యెడ, సత్యవచనుని యెడ. అహింసకుని యెడ ఆదిత్య భగవానుడు సహజముగనే తుష్టుడై ప్రసన్నుడగును. కుటిలాశయుడు దేవునకు తన సర్వస్వ మర్పించియు. నాతనికి తుష్టి కలిగించునట్లు పూజింపలేడు, కావుపననో కృష్ణా! రాగద్వేషరహితమైన నీ హృదయమునే భాస్కరునకు సమర్పింపుము. అప్పుడే దుమ్ర్పొప్యుడైన భాస్కరదేవుని నీవు ప్రాప్తింపగలవు. విష్ణుదేవుడిట్లనెను. దేవేశుడైన భాస్కరుడే యారాధనీయుడని మిరునాకుఁ దేలిపియుంటిరి. ఆతని నారాధించు విధానమెట్టిదో వివరముగఁజెప్పుడని యడుగుచున్నాను. ఓ జగత్పతీ! ఉత్తమ కులమున జన్మించుట, ఆరోగ్యముగనుండుట, దుర్లభమైన ధనవృద్ధి - ఈ మూడును ప్రాప్తించు విధానమును నాకుఁజెప్పుడు.

బ్రహ్మోవాచ

మూ॥ మా సేతు మాఘే సీత సప్తమేఽహ్ని హస్తరయోగే జగతః ప్రసూతిమ్ సంపూజ్య భానుం విధినోపవాసీ సుగంధ ధూపాన్నపరోపహారైః

గృహీ తు పుష్పైః ప్రతిపాద్య పూజాందానాదియుక్తం వ్రతమబ్దమేకమ్ దద్యాచ్చదానం మునిపుంగ వేభ్యస్తతథ్యమానం వినీబోధ ధీర!

వజ్రం తిలాన్ర్వీహి యవాన్హిరణ్యం యవాన్నమంభః కరకాముషానహమ్ ఛత్రోపపన్నం గుడ ఫేణి తాడ్యం దద్యాత్కమాద్వస్తు అనుక్రమేణ

యద్యేష వర్షే విధినోదితేన యస్యాం తిదౌ లోకగురుం ప్రపూజ్య అశ్మంత నాన్యాత్మ విశుద్ధి హేతోః సంప్రాశనానీహ నిబోధతాని

గోమూత్రమంభశ్చ రసే ను శాకం దూర్వాదధివ్రీహి తిలాన్యవాంశ్చ సూర్యాంశు తప్తం జల మంబుజాక్ష! క్షీరంచమా సైః క్రమశః ప్రయుజ్యః

కులే ప్రధానే ధన ధాన్యపూర్ణే పద్మావృతే హ్యస్త సమస్త దుఃఖే ప్రాప్నోతి జన్మా వికలేంద్రియశ్చ భవత్యరోగో మతిమన్సుఖీచ

తస్మాత్త్వ మ ప్యేత దమోఘ వీర్య! దివాకరారాధన మప్రమత్తః కురు ప్రభావం భగవంతమిశ మారాధ్వ కామానఖిలాను పేహి

ఇతి శ్రీ భవి ష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్నే తృతీయపద వ్రత వర్ణనం నామ ద్వాదశోత్తర శతతమోఽధ్యాయః

తా ॥ బ్రహ్మదేవుడిట్లు చెప్పఁదొడంగెను. “మాఘమాస శుక్ల పక్ష సప్తమీ దినమున హస్తా నక్షత్రము యోగించెనేని జగత్సృష్టి కర్తయగు భానుదేవుని, సుగంధ ధూపములు, శ్రేష్ఠములైన ఆహారపదార్థములు, ఉపాయనములు మున్నగు వానితో ప్రతియైనవాడు పూజింపవలెను. గృహస్థుడు పుష్పాదులచే పూజ నిర్వర్తించుచు, దానాదులొసంగుచు నొక సంవత్సరము వఱకును నీ వ్రత మాచరించి మునిశ్రేష్ఠులకు ప్రత్యేకముగ దానముచేయవలెను. ఆ వివరములను చేప్పబోవుచున్నాను. తెలిసికొనుము. వజ్రము, నువ్వులు, వడ్లు, యవలు, బంగారము, యవాన్నము, నీరు, వడగల్లు, దానిమ్మపండ్లు, పాదరక్షలు, ఛత్రము, గుడము, ఫేకలతోడి పాయసము అనునీ వస్తువులను క్రమముగ పన్నెండు మాసములలో దానమీయవలెను. విధ్యుక్త ప్రకారముగ నొక సంవత్సరమంతయును సప్తమీ తిథులందు లోకగురువగు సూర్యభగవాను నర్చించు వ్రత దీక్ష స్వీకరించువాడు ప్రాశనము చేయదగిన పాపదాహకములు, ఆత్మవిశుద్ధి హేతువులునైన సాయా వస్తువులను గూర్చి తెలిసికొనుము. గోమూత్రము, జలము, రసములు శాకము, దూర్వ, దధి, ప్లీహి, తిలలు, యవలు, సూర్యకిరణతప్తమైన జలము, క్షీరము అను వానిని క్రమముగ పన్నెండు మాసములందు ప్రాశనమునకు వినియోగింపవలెను. ఈ విధానమున నీ సప్తమీ వ్రతమాచరించువాడు ధనధాన్యపూర్ణము, లక్ష్మీయుక్తము, దుఃఖరహితమునైన ప్రధానకులమున అవికలేంద్రియుడై జన్మించును. ఆరోగ్యవంతుడు, బుద్ధిమంతుడు, సుఖియునగును. కాబట్టి విష్ణుదేవా! నీవుకూడ నప్రమత్తుడవై ప్రభావశాలి, భగవానుడు, జగత్ర్పభువునైన దివాకరునారాధించి సకలాభీష్ట సిద్ధినొందుము .

శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు తృతీయపదవత వర్ణనమను నూటపన్నెండవ అధ్యాయము సమాప్తము.