111. సప్తమీ కల్పమున అభ్యంగ సప్తమీ వర్ణనము

బ్రహ్మోవాచ :

 మూ ॥ శ్రావణే మాసి దేవాగ్ర్యం సప్తమ్యాం సప్తవాహనమ్ శుక్ల పక్షే సమభ్యర్చ్య పుష్పధూపాదిభిః శుచిః

పాఖండాదిభిరాలాపమకుర్వన్ని యతాత్మవాన్ విప్రాయ దక్షిణాం దత్వా నక్తం భుంజీత వాద్యతః

అభ్యంగం దేవదేవస్య వర్షేవర్షే నియోజయేత్ సప్తమ్యా మన్నమేవాగ్ర్యం శుభం శుక్లం నవం తథా

 విభవేషు తథాన్యేషు వారిత్రాణ్యేవ వై విదుః తథా దేవస్య మాసేఽస్మిన్నభ్యంగః పరిగీయతే

యస్తు చారాధయేద్భక్త్యా భాస్కరస్యనరోఽచ్వుత! అభ్యంగం విధివచ్ఛక్త్యా కృత్వాబ్రాహ్మణ భోజనమ్

 శంఖ తూర్య నినాదైశ్చ బ్రహ్మఘోషైశ్చపుష్కలైః స దివ్యం యాన మారుడో లోకమాయాతి హేలినః

 అనేనైవ విధానేన మాసాన్ద్వాదశ వై క్రమాత్ ఉపోష్య పారణే పూర్ణే దద్యాద్విప్రాయ దక్షిణామ్

 వ్రతం యః పురుషః కుర్యాదాదిత్యారాధనం శుచిః స గచ్ఛేత్పరమం లోకం దివ్యం వై వనమాలినః

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రా హ్మేపర్వణి సప్తమీ కల్సేభ్యంగ

సప్తమీ వర్ణనం నా మైకాదశోత్తర శతతమోఽధ్యాయః

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “శ్రావణ మాస శుక్లపక్ష సప్తమీతిథి నాడు శుచియై సప్తవాహనుడు, ఆది దేవుడునైన సూర్యదేవుని పుష్పధూపాదులతో నర్చించి. నియతాత్ముడై పాఖండాదులతో సంభాషణను విసర్జించి బ్రాహ్మణునకు దక్షిణ యిచ్చి వాజ్నియతి గలవాడై రాత్రిభోజనము చేయవలెను.ప్రతి సంవత్సరమును సూర్యదేవున కభ్యంగముతో పూజ సమర్పింపవలెను. సప్తమీ దినమున శుభ్రమైనది, తెల్లనిది, సద్యఃపక్వమునైన అన్నము నివేదనకు ముఖ్యము. దేవదేవునకు సమర్పించునియా విభవము లందు వివిధములైన వాద్యములు మ్రోగింపజేయవలెను. ఈ మాసమున దేవున కభ్యంగము ముఖ్యముగ చెప్పబడినది. శక్తికొలదిగ విధిననుసరించి యభ్యంగముతో భాస్కరదేవుని భక్తి యుక్తుడై పూజించు వాడు సూర్యలోకమునకు బోవును. యథాశక్తిగ బ్రాహ్మణ సంతర్పణము చేసి. శంఖ తూర్య నినాదములతో, పుష్కలములైన వేదఘోషలతో నాదేవునకభ్యంగార్చన చేయు మానవుడు దివ్యవిమానా రూఢుడై సూర్యలోకమును జేరును. ఈ విధానమున క్రమముగ పన్నెండు మాసములు ఉపవాస పారణములు పూర్తియైన పిమ్మట బ్రాహ్మణునకు దక్షిణనొసంగవలెను. శుచియై ఆదిత్యారాధన రూపమగు నీ వ్రతము నాచరించిన మనుష్యుడు దివ్యమైన సూర్యనారాయణుని లోకమునకుఁబోవును.

శ్రీ భవిష్య మహ పురాణమునందలి బ్రహ్మపర్వమున, సప్తమీ కల్పమునందు అభ్యంగ సప్తమీ వర్ణనమను నూట పదకొండవ అధ్యాయము సమాప్తము.