భవిష్య మహా పురాణము
110. సప్తమీ కల్పమున అనంతర సప్తమీ వ్రత వర్ణనము
బ్రహ్మోవాచ :
మూ॥ శుక్ల పక్షేతు సప్తమ్యాం మాసిభాద్ర పదేఽ చ్యుత! ప్రణమ్య శిరసాదిత్యం పూజయేత్సప్త వాహనమ్
పుష్పధూపాదిభిర్వీర! కుతపానాంచ తర్పణె: పాషండా దిభిరాలాపమకుర్వన్ని యతాత్మవాన్
విప్రాయ దక్షిణాం దత్వా నక్తం భుంజీత వాగ్యతః తిష్ఠన్వజన్ప్రస్థితశ్చక్షుత ప్రస్ఖలితాదిషు
ఆదిత్య నామస్మరణp కుర్వన్నుచ్చారణం తథా అనేనైవ విధానేన మాసాన్ద్వాదశవై క్రమాత్
ఉషోష్య పారణే పూర్ణ సమభ్యర్చ్య జగద్గురుమ్ పుణ్యేన శ్రావణే నేహ ప్రిణయన్పుష్టి మశ్నుతే.
అనంతం శ్రావణేనేహ యతఃఫల ముదాహృతమ్ తేనాదిత్యం సమభ్యర్చ్య తదేవ లభతే ఫలమ్
ఏవం యః పురుషః కుర్యాదాదిత్యారాధనం శుచిః ప్రాపేహ విపులం భోగం ధర్మమర్ధం తథావ్యయమ్
అముత్ర లోక మాయాతి దివ్యఖే గీత సంయుతే నారీ వా స్వర్గ మభ్యేత్య హ్యనంతం ఫలమశ్నుతే
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రా హ్మేపర్వణి సప్తమీ కల్నే అనంతర సప్తమీవ్రత వర్ణనం నోమ దశాధిక శతతమోఽధ్యాయః
తా ॥ బ్రహ్మదేవుడిట్లు చెప్పఁదొడంగెను. “భాద్రపదమాస శుక్ల పక్ష సప్తమీ దినమున సప్తాశ్వుడైన సూర్యభగవానునికి శిరసు వంచి నమస్కరించి యతనిని, పుష్పధూపాదులచేత బ్రాహ్మణుల సంతర్పణలచేత పూజింపవలెను. పాషండులు (వేదబాహ్యులు) మున్నగు వారితో సంభాషింపరాదు. నియమవంతుడై యుండవలెను. బ్రాహ్మణునకు దక్షిణనిచ్చి, రాత్రిభోజనము చేయవలెను. నిలుచుండినను, నడచుచున్నను, తుమ్మినను, తొట్రుపడినను, ఏదిచేసినను ఆదిత్యనామమునే ఉచ్చరించుచుండవలెను. ఈ విధానముగ పన్నెండు మాసములు క్రమమున్. ఉపవాస పారణములు పూర్తిగావించి. జగద్గురువగు సూర్యభగవానునర్చించి యతని ప్రీతి కొఱకు పుణ్యకథాశ్రవణమును జరిపించినచో వ్రతము పుష్టినందును. సూర్యభగవానునర్చించినచో గలిగెడి ఫలమే యతని కథాశ్రవణముల వలన కలుగును. ఇట్లు శుచిర్భూతుడై సూర్యదేవునారాధించు పురుషుడు ఇహలోకమున విపులమైన భోగములను, అక్షయమైన ధర్మార్థములను పొంది. పరమున గీత వాద్యాదులతో సుఖమయమైన స్వర్గమునొందును. స్త్రీయైనను ఈవ్రతోపవాసములాచరించి స్వర్గమున ననంత ఫలమును పొందును .
శ్రీ భవిష్య మహా పురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు అనంతసప్తమీ వ్రత వర్ణనమను నూటపదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 110 of the Bhavishya Mahā Purana is as follows:
The extraordinary fruits of consecutive saptamī observance — maintaining the saptamī vrata without break, month after month, year after year — are described. Each consecutive month of saptamī observance builds upon the previous month's accumulated merit in a compounding manner: the fruit is not merely additive but multiplicative. The chapter also addresses the specific challenges of maintaining unbroken consecutive observance — illness, travel, family crises — and provides guidance on how to maintain the vow's essential spirit when its external form cannot be perfectly maintained. The key teaching is that the intention to maintain the vow, held sincerely even when circumstances prevent its perfect external execution, is itself sufficient to preserve the continuity of the merit.