భవిష్య మహా పురాణము
109. సప్తమీ కల్పమున మార్తాండ సప్తమీ వర్ణనము
బ్రహ్మోవాచ :
మూ II మార్తాండ సప్తమిం కృష్ణ! యథాన్యాం వచ్మితే నఘ! శృణు ష్వైక మనా వీర! గదతో మే శుభ ప్రదామ్
యస్వాః సమ్యగనుష్టానా త్ర్పాప్నో త్యభిమతం ఫలమ్ పౌషే మాసే సితే పక్షే సప్తమ్యాం సముపోషితః
సమ్యక్సంపూజ్యమార్తాండం మార్తాండ ఇతిపై జపేత్ పూజ యేత్కుతపం భక్త్యా శ్రద్ధయా పరయాన్వితః
ధూప పుష్పోప హారాద్యై రుపవాసైః సమాహితః మార్తాండేతి జపన్నామ పునస్తర్గత మానసః
వీప్రాయ దక్షిణాం దద్యాద్యథా శక్త్యా ఖగధ్వజ! స్వపన్విబోధన్నలితో మార్తాండేతి చ కీర్తయేత్
పాషండాది వికర్మస్థై రాలాపం చ వివర్జయేత్ గోమూత్రం గోపయోవాపి దధిక్షీర మధాపివా
గో దేహతః సముద్భూతం ప్రాశ్నీయాదాత్మ శుద్ధయే ద్వితీయేఽహ్ని పునః స్నాతస్తథైవా భ్యర్చనం రవేః
తేనైవ నామ్నా సంభూయ దత్వా విప్రాయ దక్షిణామ్ తతో భుంజీత గోదోహ సంభూతేన సమన్వితమ్
ఏవ మేవాఖిలా నాసా నుపోష్య ప్రయతః శుచిః దద్యాధ్గవాదికం విప్రాన్ప్రతి మాసం స్వశక్తితః
ధారితా చే త్పునర్వర్షే యథాశక్త్యా గవాదికమ్ దత్వా పరం రవేర్భూయః శృణు యత్ఫల మశ్నుతే
తత్ర్పాప్నోత్యభిలం సమ్య గ్ర్వత మేత దుషోషితః తంచ లోకమవాప్నోతి మార్తాండో యత్ర తిష్ఠతి
శాండే లేయ సమః కృష్ణ! తేజసా నాత్ర సంశయః మార్తాండ సప్తమీ మేతా ముపోష్యైతే గణా దివి
విద్యోతమానా దృశ్యంతే లోకై రద్యాపి భూధర! తస్మాత్త్వ మాది దేవేశం గ్రహేశం భాస్కరం రవిమ్ అనయార్చయ గోవింద! గోపతిం గోల సన్నిభమ్
తా ॥ బ్రహ్మదేవుడిట్లనెను, “విష్ణుదేవా! మార్తాండ సప్తమీ యను పేర గల మఱి యొక వ్రతమును గూర్చి చెప్పెదను. శుభప్రదమైనట్టి యా వ్రతమును సావధానమనస్కుడవై వినుము. ఈ సప్తమీ వ్రతమును చక్కగా ననుష్ఠించిన వాడభిమత ఫలమును పొందును. పుష్యమాస శుక్లపక్షమున వచ్చుసప్తమీనాడుపవసించి. మార్తాండదేవుని భక్తితో పూజించి మార్తాండనామమును జపింపవలెను. ద్విజన్ముని మిక్కిలి భక్తి శ్రద్ధలతో పూజింపవలెను. సమాహితచిత్తుడై ధూప పుష్పోపహారములతో, ఉపవాస దీక్షలతోను మార్తాండునర్జింపవలెను. మార్తాండ నామమునే జపించుచుండుటయనగా నతని యందే మనస్సు నిలిపియుండుట. ఖగధ్వజా! బ్రాహ్మణునకు యధాశక్తి దక్షిణనొసంగవలేను. నిదురించునపుడు, మేల్కొనినప్పుడు, తొట్రుపాటు పడునప్పుడు మార్తాండ నామమునే కీర్తింపవలెను. పాఖండులు మొదలగు కర్మహీనులతో సంభాషించుట మానివేయవలయును. గోమూత్రము గాని, గోమయముగాని, గోక్షీరముగాని లేక గోదధిగాని. గోదేహ సముద్భూతమైన పై వానిలో దేనినైనను ఆత్మశుద్ధి కొఱకు ప్రాశనము చేయవలెను. రెండవదినమున కూడ మఱల శుచియై యదే విధమున సూర్యదేవునర్చింపవలెను. అతని పేరుననే బ్రాహ్మణునకు దక్షిణనిచ్చి గోదోహ సంభూతమైన క్షీరదధి ఘృతములలో దేనితోనేని భోజనము చేయవలెను. ప్రయతుడై శుచియై యిటులే మాసములన్నింటిలో నుపవాసవ్రతము నాచరించి స్వశక్తిననుసరించి ప్రతి మాసమునను బ్రాహ్మణులకు గోదానాదులు చేయవలెను. మఱల ముందు సంవత్సరమున కూడ నీ వ్రత దీక్షను స్వీకరించి సూర్యదేవ ప్రీత్యర్ధముగ నావులు మొదలగు వానిని దానము చేయుట వలన నెట్టేఫలము లభించునో చెప్పెదను వినుము. పంచమినాడు సువర్ణ శృంగిని, షష్ఠినాడు వృషభమును బ్రాహ్మణులకిచ్చువాడు పొందేడీ ఫలమునంతయును నీయుపవాస వ్రతమాచరించువాడు పొందును. పరమున సూర్యలోకప్రాప్తి కలుగును. అగ్నిహోత్రుని తేజమువంటి తేజముతో నీ వ్రతాచరణము చేసినవాడు ప్రకాశించుననుటలో సందేహములేదు. మార్తాండ సప్తమీ నాచరించియే నక్షత్రాదీగణములన్నియు నా కాశమున. ప్రకాశించుచు నేటికీని లోకములచే చూడబడుచున్నవి. కావున నాదిదేవేశుడు, గ్రహరాజు, భాస్కరుడు, గోపతియునైన సూర్యభగవానుని, గోళసన్నిభుని నీవుకూడ ఈ విధానమున పూజింపుము.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు 'మార్తాండ సప్తమీ వర్ణన 'మను నూట తొమ్మిదవ అధ్యాయయము సమాప్తము.
Summary of chapter 109 of the Bhavishya Mahā Purana is as follows:
Sūrya in his aspect as Mārtāṇḍa — the eighth son of Aditi, born from a dead (mṛta) egg (āṇḍa), brought back to cosmic life by Aditi's love and Kaśyapa's tapas — is the subject of this chapter. The Mārtāṇḍa aspect of Sūrya is associated with resurrection, with the defeat of death, and with the power to revive what appears to have been completely destroyed. The Mārtāṇḍa-saptamī vrata is therefore particularly prescribed for those facing situations that seem hopeless — terminal illness, complete financial ruin, the breakdown of crucial relationships — because Mārtāṇḍa's very birth was an instance of the seemingly impossible becoming actual through the combined power of a mother's love and a father's spiritual practice.