108. సప్తమీ కల్పమున సర్వార్థావాప్తి సప్తమీ వర్ణనము

బ్రహ్మోవాచ :

 మూ ॥ కృష్ణ పక్షేతు మాఘస్య సర్వాప్తిం సప్తమిం శృణు యాముపోష్య సమాప్నోతి సర్వాన్కామాంఝధా పరాన్

పాఖండాదిభి రాలాపం నకుర్యాద్భాను తత్పరః పూజ యేత్ర్పణతో దేవమేకాగ్ర మనసా శుభమ్

 మాఘాద్యైః పారణం మాసైఃషడ్భిః సంక్రాంతికం స్మృతమ్ మార్తాండః ప్రథమం నామ ద్వితీయం కః ప్రకీర్తితమ్  

తృతీయం చిత్రభానుశ్చ విభావసు రతః పరమ్ భగేతి పంచమం జ్ఞేయం షష్ఠం హంసః స ఉచ్యతే

 పూర్ణేషు షట్సు మాసేఘ పంచగవ్య ముదాహృతమ్ స్నానేచ ప్రాశనే చైవ ప్రశస్తం పాప నాశనమ్

 ప్రణామం దేవదేవస్య కృత్వా పూజాం యథావిధి విప్రాయ దక్షిణాం దద్యాచ్చ్రద్ద ధానశ్చ శక్తితః

పారణాంతేచ దేవస్య ప్రీణనం భక్తి పూర్వకమ్ కుర్వీత భక్త్యా విధివద్రవి భక్త్యాతు గృహ్యతే

 నక్త భోజీ తథా విష్ణో ! తైల క్షార వివర్జితః కృష్ణ ! జాగరణం రాత్రౌ సప్తమ్యామధవా దినే

ఏతా ముషిత్వా ధర్మజ్ఞో హంస ప్రీణన తత్పరః సర్వాన్కామాన వాప్నోతి సర్వపాపైః ప్రముచ్యతే

 యతః సర్వమవాప్నోతి యద్యదిచ్ఛసి చేతసా అతో లోకేషు విఖ్యాతా సర్వార్ధా వాప్తి సప్తమీ

కృతాభిలషితా హ్యేషా ప్రారబ్ధా ధర్మ తత్పరైః పూర యత్యఖిలాన్కామాన్నం శ్రుతాచ దినే దినే

తమా రాధయస్వరవిం తథాధ గరుడధ్వజ! యధారాధిత వాన్భానుం భగణాధిపతిః పురా

 ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీ కల్పే సర్వారా వాప్తి సప్తమీ వర్ణనం నామాష్టాధిక శత తమోఽధ్యాయః

తా ॥ బ్రహ్మదేవుడిట్లు నుడివెను. “మాఘమాసకృష్ణ పక్షమునందు వచ్చు 'సర్వాప్తి సప్తమీ'ని గూర్చి వినుము. దీనియందు ఉపవాస వ్రతమును బూనినవాడు సర్వ వాంఛితములనుబడయును. కోరని సత్ఫలములను కూడపొందును. భానుదేవ తత్పరుడు పాఖండులు మొదలగు వారితో భాషింపరాదు. ఏకాగ్రచిత్తుడై ప్రణతుడై సూర్యభగవానుని పూజింపవలెను . మాఘమాసము మొదలుకొని యాజమాసములందు ప్రత్యేక ప్రతియొక) సంక్రమణము పారణమని చెప్పబడును. మొదటి పారణమున మార్తాండుడని, రెండవదానిలో “కః' అని, మూడవ దానిలో చిత్రభానుడని, నాల్గవ దానిలో విభావసుడని, ఐదవ సంక్రమణమున భగుడని, ఆఱవదానిలో హంస యనియు సూర్యభగవానుని, నామములు కీర్తింపబడునని యెఱుంగవలెను. ఆఱు మాసములు పూర్తిగను, స్నానమునకును, ప్రాశనమునకును పంచగవ్యము ప్రశస్తమైనదని చెప్పబడినది. అది పాపములను నశింపజేయు కూడా. సూర్యదేవునకు ప్రణామమాచరించి యథావిధిగ పూజించి శ్రద్ధాభక్తులతో బ్రాహ్మణునకు యథాశక్తి దక్షిణనీయవలెను. పారణాంతమున భక్తిపూర్వకముగ సూర్యదేవ ప్రీణనము చేయవలెను. సూర్యభగవానుని యందలి భక్తితో శాస్త్ర విధి ననుసరించి చేయవలెను. దినమంతయునుపవసించి రాత్రి భోజనము చేయవలెను. తైలము క్షారమునుపయోగింపరాదు. సప్తమీనాటి రాత్రి గాని పగలు గాని జాగరణ చేయవలెను. సూర్యభగవానునకు ప్రీతి కలిగించుటలో తత్పరత్వముగల ధర్మజ్ఞుడే ప్రతోపవాసము. నాచరించి వాంఛితార్థములనన్నింటిని పొందుటయేగాక సర్వపాపములనుండీ ముక్తుడగును. మనస్సునందు కోరిన కోరికలన్నియు నీడేరునుగావున సర్వార్దావాప్తి సప్తమీ యని యీతిధి లోకములందు విఖ్యాతినందినది. అభీష్టములను నెరవేర్చు నీ వ్రతము ధర్మతత్పరులచేత ప్రారంభింపబడినది. కామ్యములన్నింటిని పూర్తిచేయునదగుటచే దినదినమున వ్యాప్తి నొందుచున్నది. పూర్వము నక్షత్ర గణములకధిపతి యగుచుంద్రుడెట్లు పూజించేనో నీవును సూర్యదేవునటులే పూజింపుము.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు ‘సర్వార్థా వాప్తి సప్తమీ వర్ణనమను నూట యెనిమిదవ అధ్యాయము సమాప్తము.