107. సప్తమీ కల్పమున భాను పదద్వయ వ్రత వర్ణనము

మూII బ్రహ్మోవాచ :

తథాన్యదపి ధర్మజ్ఞ! శృణుష్వ గదతో మమ పదద్వయం జగద్ధాతుర్దేవ దేవస్య గోపతేః

 యదేక పాద పీఠం హి తత్రన్యస్తం పదద్వయమ్ స్వయ మంశుమతా కృష్ణ! లోకానాం హిత కామ్యయా

వామనస్య పదం కృష్ణ! జ్ఞేయంవై ఉత్తరాయణమ్ దేవాద్యైః సకలైర్వంద్యం దక్షిణం దక్షిణాయనమ్

 అహం త్వంచ సదా కృష్ణ! దక్షిణం పొద మర్చతః శ్రద్ధాన్వితా భాస్కరస్య హరీశౌ వామ మర్చతః

తస్మిన్యః ప్రత్యహం సమ్యగ్ధేవ దేవస్య మానవః కరోత్యారాధనం తస్య తుష్టః స్యాద్భానుమాన్త్పదా

విష్ణురువాచ :

“కథమారాధనం తస్య దేవ దేవస్య గోపతేః క్రియతే దేవ శార్దూల! తత్సమాఖ్యాతు మర్హసి.”

బ్రహ్మోవాచ :

“ఉత్తరే త్వయనే కృష్ణ! స్నాతో నియత మానసః ఘృత క్షీరాదిభిర్దేవం స్నాపయేత్తిమిరాపహమ్

 చారు వస్త్రోపహారైశ్చ పుష్ప ధూపాను లేపనైః సమభ్యర్బ్య తతః సమ్యగ్భ్రాహ్మణానాంచ తర్పణోః

పదద్వయం వ్రతం యస్య గృహ్ణీయా ద్భాను తత్పరః వందే త్స్నాతశ్చిత్ర భానుం తతశ్చ గరుడధ్వజ!

భుక్త్వాన్నం చిత్రభానుం తు చిత్రభానుం వ్రజం స్తథా స్వపన్వి బుధ్యన్ప్రణమనోమం కుర్వంస్తథార్చనమ్

 చిత్రభానో రసుదినం కరిష్యే నామ కీర్తనమ్ యావ దద్య దినాత్ర్పాప్తం క్రమశో దక్షిణాయనమ్

చలితే హుంకృతే చైవ వేదారంభోపివా సదా తావద్వక్ష్యే చిత్రభానుం యావదేవోత్తరాయణమ్

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “ధర్మజ్ఞా! మఱియొక విషయమును చేప్పెదను వినుము. జగద్ధాత దేవ దేవుడునైన సూర్య భగవానుని పాదద్వయము. ఒక పాదపీఠిక పై నుంచబడినది. స్వయముగ నా యంశుమంతుడే లోకములకు మేలు చేయగోరి తన పాదములనట్లు ఒకే పాద పీఠికపై మో పెను. దేవాది సకల ప్రాణి సంఘములకు వందనీయములగు నతని పాదములలో, నేడమ పాదముత్తరాయణమనియు, కుడి పాదమును దక్షిణాయనమనియు నెఱుంగవలెను. నీవు, నేను అతని యెడమ పాదము నర్చింతుము. హరి, శివుడు శ్రద్దాన్వితులై యతని కుడి పాదము నర్చింతురు . ప్రతి దినమా దేవ దేవుని పాదము నారాధించు మానవుని యెడ నాతడు ప్రసన్నుడగును.” విష్ణు దేవుడిట్లనెను. “ఆ సూర్య భగవాను నెట్లారాధింపవలెను? ఆ వివరములు నాకుఁజెప్పుడు”. బ్రహ్మదేవుడిట్లు సమాధానము చెప్పెను. “ఉత్తరాయణమున స్నానమాచరించి, నియత మానసుడై ఘృత క్షీరాదులతో భాను దేవునభిషేకింపవలయును. సుందరములైన వస్త్రములచేతను, కానుకలచేతను, పుష్ప ధూపాను లేపనముల చేతను చక్కగా పూజించి బ్రాహ్మణులకు భోజన తాంబూల దక్షిణాదులతో సంతర్పణ చేయవలెను. భాను దేవునందే తాత్పర్యము కలిగి యీ పదద్వయ వ్రతమును స్వీకరింపవలెను. “స్నాతుడనై చిత్రభానునకు సమస్కరింతును. భోజనాంతరము, చిత్రభానుని స్మరింతును. పోవుచు వచ్చుచు, నిదురించుచు, మేల్కొనుచు, ప్రణమిల్లుచు, హోమము చేయుచు, పూజ చేయుచు. అనుదినమును చిత్రభానుని నామ సంకీర్తనమే చేయుదును. ఈ దినమున దక్షిణాయనము వచ్చు వఱకును. ప్రతి కదలికలోను, హుంకారము చేయుచు గాని, వేదాధ్యయనము ప్రారంభించునపుడు గాని, ఉత్తరాయణము వచ్చు వకును చిత్రభాను నామమే యుచ్చరింపుచుందును .

 మూ॥ యావజ్జీవంచ యత్కించిత్ జ్ఞానతోఽ జ్ఞానతో పివా కరిష్యేహం తథాచైవ కీర్త యిష్యామి తం ప్రభుమ్

యదానృతం కించిద్వక్ష్యే తదా వక్ష్యామి తద్వచః అజ్ఞానా దధవా జ్ఞానా త్కీర్తయిష్యామి తం ప్రభుమ్

షణ్మాస మేక మనసా చిత్ర భాను మయం పరమ్ తం స్మరన్మరణే యాతి యాంగతిం సాస్తుమే గతిః

 షణ్మాసాభ్యంతరే మృత్యుర్యది తస్మిన్భవేన్మమ తన్మయా భాస్కర సేహ స్వయమాత్మానివేదిత:

పరమాత్మమయం బ్రహ్మ చిత్రభాను మయం పరమ్ యమంతే సంస్మరిష్యామి సమే భానుః పరాగతిః

యది ప్రాతస్తథా సాయం మధ్యా హ్నేవా జపామ్యహమ్ షణ్మాసాభ్యంతరే న్యాసః కృతో వ్రతమయోమయా

తథా కురు జగన్నాథ! స్వర్గలోక పరాయణః చిత్రభానో యథాశక్త్యా భవాన్భవతి మే గతిః

ఏవ ముచ్చార్య షణ్మాసం చిత్ర భాను మయం వ్రతమ్ తావన్నిష్పాదయే ద్యావ త్సంపూర్ణం దక్షిణాయనమ్

తతశ్చ ప్రీణనం కుర్యాద్యథా శక్త్యా విభావసోః భోజయేద్భ్రాహ్మణార్దివ్యాన్భౌమాంశ్చాపి స దక్షిణాన్

 పుణ్యాఖ్యాన కథాం కుర్యాన్మార్తాండస్య తథాగ్రతః పూజయే ద్వాచకం భక్త్యాయథా శక్త్యాచ లేఖకమ్

 ఏవం వ్రత మిదం కృష్ణ! యోధారయతి మానవః ఇహైవ దేవ శార్దూల! ముచ్యతే సర్వ కిల్బిషైః

షణ్మాసాభ్యంతరే చాస్య మరణం యది జాయతే ప్రాప్నోత్యనశన స్యోక్తం యత్ఫలం తద సంశయమ్

 పద ద్వయం చ దేవస్య సమ్యక్షేన సదార్చితమ్ భవత్యేతజ్జగౌ భానుః పురా చంద్రాయ పృచ్ఛతే

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మే పర్వణి సప్తమీ కల్సే

భానుపదద్వయ వ్రత వర్ణనంనామ సప్తాధిక శతతమోఽధ్యాయః

తా॥ నేను జీవించి యున్నంతకాలము, ఏపాటి జ్ఞానముతోగాని, అజ్ఞానముతోగానీ ఆ సూర్య దేవుని గూర్చి యట్లే కీర్తింపుచుందును. ఏ కొంచే మసత్యము చెప్పుట నాచేసంభవించినను వెంటనే చిత్రభానుని స్మరింతును. తెలిసియో తెలియకయో ఆ ప్రభువును ఓరించుచునే యుందుము ఆు మాసము లేకాగ్రచితముతో శేషసుగు చితూను సొమునుతోనే నా టీ అనకుమ నీ యుందును. మరణ కాలమున నాదేవుని స్మరించు వారికి కలుగు గతియే నాకును కలుగుగాక ! . ఆు మాసముల లోపుననే నాకు మరణము సంభవించెనేని అది నాకు నేనుగ భాస్కరదేవున కాత్మనివేదన చేసినట్లగును. చిత్రభానుడు పరమాత్ముడు. పరబ్రహ్మ అట్టి యతనిని మరణ కాలమున స్మరింతును. ఆ దేవునే పరమగతిగ పొందెదను. హే జగన్నాధా! ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నిన్నే జపించుచుందును. ఆు మాసములలోననే నాచే నీ వ్రతమును సంపన్నము చేయింపుము. స్వర్గలోక మాశ్రయించు వానిగ జేయుము. ఓ చిత్రభానూ! యథాశక్తిగా నిన్ను సేవించు సోకు నీవే పరమగతివీ.” అని యిట్లుచ్చరించుచు నాజు మాసములలో చిత్రభానువ్రతమును దక్షిణాయనము సమాప్తమగు వఱకు పూర్తి చేయవలెను. అటుపై సూర్యదేవుని ప్రీత్యర్థముగ దివ్యులను, బ్రాహ్మణులను భోజన దక్షిణాదులతో సంతృప్తి పరుపవలెను.  ఆ పిదప మార్తాండుని పుణ్యకథా ప్రవచనములను నిర్వహింపవలెను. అటుపిమ్మట పురాణ ప్రవచకునిని, లేఖకుని పూజింపవలెను. విష్ణుదేవా ! ఈ వ్రతము ననుష్ఠించు మానవు డిహలోకముననే సర్వపాపముల నుండి ముక్తుడగును. ఒకవేళ ఆయుమాసముల లోపుననే మరణముసంభవించెనేని యుపవాస వ్రతసమాప్తినొనరించిన వానికి చెప్పబడిన ఫలమే యితనికిని కలుగుననుటలో సంశయములేదు. ఇట్లు సూర్యపదద్వయవ్రత మాచరించి చక్కగా సూర్యారాధన చేయువానికి సత్ఫలములు కలుగునని, పూర్వము చంద్రుడడుగగా నా సూర్యభగవానుడే స్వయముగ చెప్పెను .

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు భాను పదద్వయ వ్రత వర్ణనమను నూటయేడవ అధ్యాయము సమాప్తము.